Monday, February 28, 2011

46 ఓ బుల్లి కథ 34 ---- Hawaii -- మధురస్మృతులు

ఉదయాన్నే లేచి సంచీ పట్టుకుని క్రిందకెళ్ళిపలహారాలన్నీ సంచీలో నింపుకోటం .
ఆ తరువాత స్విమ్మింగ్ పూల్ పక్కన కాఫీ తాగుతూ హులా డాన్సు చూడటం. మేము ఉన్న Ashton Waikiki Beach Hotel లో ఉదయం పలహారాలు ఫ్రీ.






పక్క అమ్మాయి హైస్కూల్ లో చివరి సంవత్సరం చదువుతోంది. పొద్దున్నే డాన్సు చేసి స్కూలుకి వెళ్తుంది. తనకి ఇది పార్ట్ టైం ఉద్యోగం.







భార్యని రివోల్వింగ్ రెస్టారెంట్ కి (ఆవిడ ఎప్పుడూ వెళ్ళలేదు) తీసుకువెళ్లటం. అక్కడ తినటానికి ఏమీలేక "పాస్తా" చేయించుకు తినటం. అది నిజంగా తిరుగుతోందని ఒక గంట కూర్చుని నిరూపించటం.




"International Market Place" లో షాపింగ్ కి తీసుకు వెళ్ళటం.
తీసుకు వెళ్ళిన రైసు కుక్కర్ తో రోజూ గోంగూర ముద్దా, పెరుగు ముద్దా తినటం. తరువాత తెలిసింది, నా కడుపుకింత పడేయ్యటం రోజంతా నసగకుండా ఉండటానికిట.




"Snorkel" చేద్దామనకున్న వాళ్ళని జిహ్వకో రుచి అని వాళ్ళ పాటిన వాళ్ళని వదిలెయ్యటం.








Subway "veggie Max" తింటూ సూర్యుడికి వీడ్కోలు ఇవ్వటం.
చివరి రోజు Waikiki Hilton లో fried rice చేయించుకుని తినటం. 






ఈ క్రింది Travel Video చూడండి






మేము ఉపయోగించిన కెమెరాలు నాలుగు:
Canon Power shot SD 1200 IS
Sony Cybershot DSC-W310
Two Canon EOS REBEL T2i   
పిక్చర్స్ తీసినవాళ్ళు పది మంది.

Monday, February 21, 2011

45 ఓ బుల్లి కథ 33 ---- Hawaii -- హవాయీ లో ఓ ఆత్మకధ

నాకు University లు  చూడాలంటే  చాలా ఇష్టం. మన జీవన విధానాల్లో మార్పులకు అంకురార్పణ చేసిన ప్రదేశాలు చాలా వరకూ విశ్వ విద్యాలయలే.  దానికి తోడు మాలో ఒకరికి మరువలేని మలుపులు University లు. కాలుగాలిన పిల్లిలా ఫోటోలలో తిరుగుతున్న వారు వీరే. వాటి గురించి, ఉద్వేగంతో చెప్పిన కధ వారి మాటల్లోనే వ్రాస్తున్నాను. 


University of Illinois లో ఒక మాస్టారు చిన్న గది చూపెడుతూ "ఇదిగో ఇక్కడే mosaic చేశారు" అంటే, ఇంటర్నెట్  లో బ్రౌజు  చెయ్యటం సృష్తీకరించింది ఈ చిన్న గది లోనా అని ఆశ్చర్య పోయాను. University of Chicago Research  Institute corridor లో నడుస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఒకప్పుడు ఫెర్మి ఇక్కడ నడిచే వారు అని. Nuclear chain reaction ఇక్కడ సాధించక పోతే మనకు కాంతి నిచ్చే power reactors ఉండేవి కాదు. Collagen structure ట్రిపుల్ హేలిక్సు లో కేంద్రీకరించిందన్న G.N. Ramachandran, Black holes ఉంటాయని శాస్త్రీకరించి "నోబెల్" తెచ్చుకున్న Chandrasekhar కూడా ఇక్కడే ఈ హాల్సులో  నడుచుకుంటూ వెళ్ళేవారు. అటువంటి చోట్లకి వెళ్ళంగానే ఆ వాతావరణానికి  మనలో ఒక సృజనాత్మక మైన భావుకత ప్రవేశిస్తుంది.
క్రిందటి సంవత్సరం University of New Mexico చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చిన్న సరస్సు ఒడ్డున కూర్చుని గంటల తరబడి నురోన్స్ గురించి మాట్లాడు కున్నాము. ఆ  విద్యాలయం లో మనస్సు మీద పెద్ద పరిశోధనలు చేస్తారు.


మన జీవితం లో, మన సౌలభ్యం కోసం  రోజూ  ఉపయోగించేవి ఎన్నో ఈ విశ్వవిద్యాలలోనే ఎవరో ఒకళ్ళు, రాత్రులూ పగళ్ళూ కృషిచేసి కష్టపడి పనిచేసి కనుగొన్నవే. కొందరు గెలుస్తారు కొందరు ఓడిపోతారు. కానీ వాళ్ళ కృషి మనము ఎప్పుడూ మర్చిపోలేము. వాళ్ళను తలచుకోవటం నాకు చాలా ఇష్టం. అందుకే University of Hawaii కి వెళ్ళటం. వెళ్ళిన రోజు శలవ అవటం మూలాన నిర్మానుష్యంగ ఉంది.  మొదటే "ఈస్ట్ వెస్ట్ సెంటర్" కనపడింది. నలభై ఏళ్ళ క్రిందట అక్కడ డైనింగ్  హాల్ లో రోజూ భోజనం చేసేవాడిని. ఒక ప్లేటు రైస్ లో mixed vegetables మజ్జిగ తో కలుపుకుని , జపనీస్ గార్డెన్ చూస్తూ తినే వాణ్ని. "ఈస్ట్" నుండి "వెస్ట్" నుండి వచ్చిన విద్యార్ధులతో చూడ ముచ్చట గా ఉండేది. అది ఇప్పుడు మూసేసి కాన్ఫరెన్స్ హాలు చేశారుట. ఆ బిల్డింగ్ చుట్టూతా ఒక సారి ప్రదక్షిణ చేసి జపనీస్ గార్డెన్ ఫోటో తీసు కున్నాను.
తరువాత తెలిసింది కాఫిటేరియా  ఏడు ఏళ్ళ క్రిందే మూసి వేసేశారుట..


తరువాత నేను పనిచేసిన research బిల్డింగ్ కి బయల్దేరాను. చూచాయగా గుర్తుంది ఎక్కడుంటుందో. అది ప్రత్యేకం  George Von Bekesy కోసం కట్టించింది. Fish , ఏ విధంగా శబ్దాన్ని గ్రహిస్తాయో పరిశోధనలు చెయ్యటానికి ఆయన్ని హార్వార్డ్ నుండి ఇక్కడకు తీసుకు వచ్చారు. Bekesy గారికి మన చెవి ఎల్లా పనిచేస్తుందో తెలుసుకున్నందుకు "నోబెల్" వచ్చింది. మా ప్రొఫెసర్ పేరు L.H.Piette , ఆయన కాన్సెర్ మీద పరిశోధనలు చేస్తారు. Bekesy ఎప్పుడోపోయారు,  Piette అయిదేళ్ళ క్రిందట కాన్సెర్ తో పోయారుట. కనీసం ఆ బిల్డింగ్ చూద్దామనుకున్నా వెతికి పట్టుకోలేక పోయాను.ఇవ్వాళ అన్నీ నిరాశలే.



చివరిగ  YMCA కి వెళ్ళాము. మొదట అమెరికా వచ్చినప్పుడు కాంపస్ లోని YMCA లో రెండు రోజులు ఉన్నాను. ఇదంతా నలభై ఏళ్ళ క్రిందటి సంగతి. మొదటి రోజు ఆకలి తో క్రింద కాఫిటేరియా కి వచ్చాను. ఏమి తినాలో తెలియదు. చెప్పేవాళ్ళు లేరు. కానీ అక్కడ రైస్, బట్టర్ చూశాను. నాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. పైన రూముకి  వెళ్ళి అమ్మ ఇచ్చిన చింతకాయ పచ్చడి తెచ్చుకుని, ఒక మారు మూల బూత్ లో కూర్చుని  పచ్చడి ముద్ద వెన్నతో కలుపుకుని తిన్నాను. అది నిజంగా స్వర్గమే. ఇప్పుడు కాఫెటేరియా లేదు. అది ఉండే చోట  "Yogurt Land" ఉంది. అది చూడంగానే మాతో వచ్చిన పిల్లలకి మహదానందం వేసింది . అక్కడ sample cups తీసుకొని  అన్నిరకాల  "Yogurt " లు రుచి చూసి మీకు నచ్చిన వాటిని కొనుక్కోవచ్చు. ఎదురుకుండా చింతచెట్టు దాని క్రింద చింత  కాయలు. అక్కడ బైఠాయించాము "Yogurt" కప్పుల తోటి.  చింత చిగురు కోసుకుని పప్పు చేసుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి. కొందరు పెద్దలు చింతకాయలు వలుచుకుని తిన్నారు కూడా. ఇదీ హవయీ లో ఒకరు చెప్పిన ఆత్మ కధ.
















"యమ్మీ"      "అక్క నాకు పెట్టకుండా  తింటోందే"      "దా నాన్నా నేను పెడతాను"  


Wednesday, February 2, 2011

44 ఓ బుల్లి కథ 32 ---- Hawaii -- Polynesian Cultural Center


పసిఫిక్ మహాసముద్రంలోని దాదాపు 1000 పైగా ఉన్న ద్వీపాల్నన్నిటినీ కలిపి Polynesian Islands అంటారు. ఈ ద్వీప వాసులందరి  వేషభాషలు, నాగరికత, జీవన విధానాలు చాలా దగ్గరగా ఉంటాయి. Hawaii ద్వీపాలు వీటిల్లో  కొన్ని. ఇక్కడ మాట్లాడే భాష Hawaiian. ఈ Polynesian Islands నాగరికతని చూపించ టానికి నిర్మించినదే Polynesian Cultural Center. Honolulu కి కొంచెం దూరంలో ఉంది. కారులో వెళ్ళాలి. చూడటానికి, వారి నాగరికతని తెలుసుకోవటానికి చాలా ఆకర్షణలు ఉన్నాఇక్కడ. మీకు వీలయితే పగలు పూట వెళ్ళండి అన్నిటినీ చూడవచ్చు.

మాకు సమయము దొరకక రాత్రిపూట ఇక్కడ జరిగే ఒక షో కి వెళ్ళాము.ఈ షో వీరి నాగరికత గురించి. కథ నాకు అర్ధమయినంత వరకూ ఇది; ఒక పల్లెటూళ్ళో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వెంటపడుతూ ఉంటాడు. అమ్మాయికీ అబ్బాయంటే ఇష్టమే. ఆ ఊరి పెద్ద అనుమతి ఉంటేగానీ ఈ పెళ్లి జరగదు. ఆ అబ్బాయి ఎందుకోమరి భయపడి అమ్మాయికి చెప్పకుండా  పారిపోతాడు. ఊరి పెద్ద అనుమతితో  ఆ అబ్బాయిని వెంట బడి పట్టుకుని చివరికి పెళ్లి చేస్తారు. తరువాత వాళ్ళకి పిల్లాడు కూడా పుడతాడు. ఇదంతా ఒక డాన్సు డ్రామా గా వేశారు.

నాకు ఆశ్చర్యము కలిగించిన విశేషాలు సూక్ష్మంగా :  పెళ్ళికి  అబ్బాయినీ అమ్మాయినీ భుజాల మీద కూర్చోపెట్టుకుని తీసుకు వస్తారు. ఒకరింట్లో పెళ్లి అనేది ఆ ఊరంతటికీ ఒక celebration. అమ్మాయిలు చెవి పైన పువ్వు కుడివేపు పెట్టుకుంటే పెళ్లి అయినట్లు, ఎడమవైపు పెట్టుకుంటే కానట్లు. వీళ్ళు కోడి పందేలు కూడా జరుపుకుంటారు. వెలుగుకి కాగడాలు వాడుతారు. వాటితో డాన్సులు కూడా చేస్తారు.

Honolulu ఉన్నOvahu  ద్వీపం చుట్టుతూ ఒక హైవే ఉంది. దాని మీద డ్రైవింగ్ చాలా బాగుంటుంది. చుట్టూతా ఉన్నఅన్ని Beaches లోనూ ఆగి చూడవచ్చు.మర్నాడు డ్రైవ్ చేస్తూ వరుసగా Beaches చూస్తూ సెంటర్ వైపు వచ్చాము. కానీ సెంటర్ లోపలికి వెళ్ళటానికి కుదరలేదు. సెంటర్ కి దగ్గరలో మెక్డోనాల్డ్  ఉంది. అక్కడ లంచ్ కి ఆగాము. ఒక ఇంటిలో ఉన్న మెక్డోనాల్డ్ ని నేనెక్కడా చూడలేదు. అందుకని ఫోటో తీశాను. మీకోసం ఇక్కడ పెడుతున్నాను.

ఈ పోస్ట్ లో రెండు వీడియోలు పెడుతున్నాను. మొదట వీడియో Polynesian డాన్సు ఎల్లా ఉంటుందో చూపించటానికి. రెండోది వీళ్ళ డాన్స్ లలో ఒకటయిన Hula డాన్స్ ఎల్లా చెయ్యాలో నేర్పేది. చూసి ఆనందించండి.