Monday, December 10, 2012

87 ఓ బుల్లి కథ 75 --- అవకాడో ముక్కల పచ్చడి


అవకాడో గురించి ఎందుకు ఇంత శ్రమపడి వ్రాస్తున్నానని అనుకుంటున్నారా ! అవకాడో  కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది అంటారు. ఇంకా దానికి కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. అందరికీ తెలుస్తుందని వ్రాస్తున్నాను.

మా ఇంట్లో అవకాడోతో(Avocado) ముక్కల  పచ్చడి అప్పుడప్పుడు చేసుకుంటాము. ఇంటావిడ చేస్తుంది కాబట్టి దానికి కొలతలూ గట్రా ఏమీ ఉండవు. ఆ రోజు తినే వాళ్ళ అదృష్టాన్ని బట్టి రుచులూ అవీ ఉంటాయి. నేను దానికి అలవాటు పడిపోయాను. ఈ మధ్య మా అమ్మాయి ఇంట్లో పచ్చడి రుచి చూసి, అది ఎల్లా చేస్తారో వ్రాయమని (కొలతలతో) నాకు రహస్యంగా ఇమెయిల్ పంపించింది. నేను చిన్న పరిశోధన లాంటిది చేసి సాధించాను. దీనిలో ఏమన్నా గొప్పదనం ఉంటే ఇంటావిడదే కానీ నాది కాదు అని ముందరగా చెప్పుకుంటున్నాను. ఇంకా వంటింట్లో నాకు పూర్తి కంట్రోల్ రాలేదు.

అవకాడోలు దాదాపు 80 రకాలలో వస్తాయి. వీటి జన్మస్థానం మెక్సికో దేశం. ఈ కాయలు ప్రపంచమంతా వ్యాపించినవి. అన్ని మార్కెట్లలో దొరుకుతాయో లేదో తెలియదు అమెరికాలో మాత్రం దాదాపు అంతటా దొరుకుతాయి. ఊరగాయ పెట్టుకునే మామిడి కాయ సైజు లో ఉంటాయి. 'Hass ' వెరైటీ అవకాడోలు సంవత్సరము పొడుగునా వస్తాయి. నేను వాటిని ఉపయోగించాను. కొంచెం ఆకు పచ్చగా ఉండి గట్టిగా ఉండేవి చూసి తీసుకుంటే ముక్కలు బాగా వస్తాయి. ముక్కలు రాక పోయినా గుజ్జు తో పచ్చడి బాగానే ఉంటుంది.

అవకాడోని నిలువుగా చుట్టూతా కత్తితో కొస్తే రెండు భాగాలుగా విడిపోతుంది. దానిలో టెంకని తీసివెయ్యాలి. ఒక స్పూన్ తో అంచులు చుట్టూతా కదిపితే గుజ్జు కొబ్బరి చిప్పలలా విడిపోయి వస్తాయి. వాటిని కత్తితో ముక్కలుగా కోయటమే. మెక్సికన్ లు వీటితో Guacamole  అనే పచ్చడి లాంటిది చేస్తారు. అది చేసే విథానం చూస్తే కాయ లోనుంచి గుజ్జు ఎల్లా తీయాలో తెలుస్తుంది.ఇక్కడ చూడండి.


Avocados are a good source of fiber, potassium, and vitamins C,K, folate, and B6. Half an avocado has 160 calories, 15 grams of heart-healthy unsaturated fat, and only 2 grams saturated fat. One globe contains more than one-third daily value of vitamin C, and more than half the day’s requirements of vitamin K.

Avocados have diverse fats. For a typical avocado:

About 75% of an avocado's calories come from fat, most of which is monounsaturated fat.
On a 100 g basis, avocados have 35% more potassium (485 mg) than bananas (358 mg). They are rich in B vitamins, as well as vitamin E and vitamin K.[30]
Avocados have a high fiber content of 75% insoluble and 25% soluble fiber.[31]

High avocado intake was shown in one preliminary study to lower blood cholesterol levels. Specifically, after a seven-day diet rich in avocados, mild hypercholesterolemia patients showed a 17% decrease in total serum cholesterol levels. These subjects also showed a 22% decrease in both LDL (harmful cholesterol) and triglyceride levels and 11% increase in HDL (helpful cholesterol) levels.[32]Additionally a Japanese team synthesised the four chiral components, and identified (2R, 4R)-16-heptadecene-1, 2, 4-triol as a natural antibacterial component.[33]

Due to a combination of specific aliphatic acetogenins, avocado is under preliminary research for potential anti-cancer activity.[34]

Extracts of P. americana have been used in laboratory research to study potential use for treating hypertension or diabetes mellitus.[35]


ముక్కల పచ్చడికి కావలసిన పదార్ధాలు:

1. అవకాడో  - 1 (medium size)
2. నిమ్మకాయ ( lime ) - 1/2
3. పసుపు - చిటికెడు
4. కారం - 1/2 టీ స్పూన్
5. ఉప్పు - 1/2 టీ స్పూన్
6. మెంతి పొడి - 1/8 టీ స్పూన్ (మెంతులు వేయించి పిండి బడితే బాగుంటుంది)
7. నూనె (తిరగమోత కి)- 3/4 టేబుల్ స్పూన్
8. ఇంగువ - 4 షేకులు . మామూలుగా సీసాని షేక్ చేస్తాము.
9. తిరగమోత గింజలు: 1/4 స్పూన్ మినప్పప్పు, దానికి కొంచెం తక్కువగా జీలకర్ర, ఆవాలు, ఒక ఎండు మిరప కాయ

తయారుచేయు విధానము:

అవకాడో కోసి దానిలో గుజ్జు (రెండు కొబ్బరి చిప్పల మాదిరిగా వస్తుంది) ముక్కలు చేసి ఒక గిన్నె(bowl) లో వెయ్యండి. దానిమీద నిమ్మకాయ పిండండి. దాని మీద పసుపు, కారం, ఉప్పు, మెంతి పొడి వేసి కలపండి.

మీకు చిన్న బగుణ (లేక తిరగమోత గిన్నె) ఉంటే దానిలో నూనె వెయ్యండి. స్టవ్ మీద మీడియమ్ లో ఉంచి మినప్పప్పు, మూడు మెంతి గింజలూ, జీలకర్ర, ఆవాలూ వరసగా వెయ్యండి. మినప్పప్పు వేగినట్లు కనపడగానే ఒక చిన్న ఎండు మెరప కాయ తుంచి ముక్కలు వెయ్యండి. ఇంగువ నాలుగు షేకులు వెయ్యండి. ఇంక తిరగమోతని స్టవ్ మీద నుంచి తీసి దంచటమో, బ్లెండ్ చెయ్యటమో చేసి అవకాడో ముక్కలున్న గిన్నె లో వేసి కలపండి. ఒక గంట అల్లా ఉంచిన తరువాత అవకాడో పచ్చడి తినటానికి రెడీ. అన్నంలో, దోశల్లో, బ్రెడ్ మీద బాగుంటుంది.
నేను అయితే ఒక అర స్పూన్ extra virgin olive oil కూడా పచ్చడిలో వేసి కలుపుతాను.

తిరగమోతని ఎప్పుడూ మాడ్చ కూడదు !!!..


మాతృకలు:

1. http://www.webmd.com/diet/features/8-healthy-facts-about-avocados

2. http://en.wikipedia.org/wiki/Avocado

17 comments:

  1. *చక్కగా వ్రాసారండి.
    *ఆవపిండి కూడా వేస్తే అవకాడో ఆవకాయ పచ్చడి.. అనవచ్చేమోనండి.
    *అవకాడో కాయలను నేను చెన్నై మార్కెట్ లో చూసాను.
    *ఈ కాయలలో చాలా చక్కటి పోషకాలున్నవని " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధంలో కూడా చెప్పబడింది.


    ReplyDelete
  2. కొచెం మెత్తగా పండిన తరువాత కొంచెం ఉప్పు చల్లుకోని గుజ్జు గరిటెతో దేవుకొని తింటారు మాఅమ్మాయిలు. కారం చల్లుకోని తింటే ఎలాఉంటుందా అని ఇప్పుడు ఆలోచన! కొంచెం నిమ్మరసంకూడా పిండి!!

    ReplyDelete
  3. @anrd గారూ ఆవ పెట్టటం అంత తేలికా ! వావ్. అయితే ఇండియాలో అవకాడోలు దొరుకుతాయన్న మాట. ఆరోగ్యకరమైన ఆహారం. ఇంక ఒక యోగి ఆత్మ కథ తప్పకుండా చదవాలి అనుకుంటున్నాను. చాలా విషయాలు ఉన్నట్లు ఉన్నాయి ఆ గ్రంధంలో. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  4. @Anonymous గారూ మీ పిల్లలకి కారం కొద్దిగా "కారంగా" ఉంటుందేమో. ఉప్పు పెప్పర్ ట్రై చెయ్యమనండి. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  5. నమస్కారములు
    మీ అవకెడొ పచ్చడి బాగానె ఉంది కానీ మావాళ్ళు వేరేగా చేసారు నాకు అంతగా నచ్చ లేదు. మీ పద్ధతిలో చేస్తె ఎలా ఉంటుందో చూడాలి.ఏది ఏమైనా , మీ నిమ్మకాయ పచ్చడి వేడి అన్నం , నెయ్యి తో ఆ రుచి మాత్రం రాదు

    ReplyDelete
  6. @రాజేశ్వరి గారూ నిమ్మకాయ పచ్చడి, వేడి అన్నం, నెయ్యి కి ఏదీ సాటి లేదు. నేను దాదాపు రెండు వందల సీసాల నిమ్మకాయ పెట్టి అందరికీ ఇచ్చాను. ఇండియా వాళ్ళ తో సహా.
    మా ఇంట్లో అవకాడో పచ్చడి రోజూ చేసుకుని తింటున్నాము. నా రెసిపీ పనిచేస్తుంది. కొంచెం తోలు పచ్చిగా ఉంది గట్టిగా ఉన్న అవకాడోలు కొనుక్కుని ఉపయోగించండి.
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete
  7. రావు గారు,
    వావ్! అవకాడోతో ముక్కల పచ్చడి చేసుకోవచ్చన్న మాట! రెండు చిత్రాలుంచాల్సింది. అవకాడో ఆవకాయ పేటేంట్ చేయదగ్గది.
    యోగులు ఆత్మకథల్లో రాసుకుంటున్నారంటే... ఇదేదో స్వర్గానికి షార్ట్ కట్ అనిపిస్తోంది. ;) :))

    ReplyDelete
  8. @SNKR గారూ మీ మార్కెట్ లో అవకాడోలు దొరికితే తప్పకుండా పచ్చడి ట్రై చెయ్యండి. చాలా పోషక పదార్ధాలు ఉన్నాయి వాటిల్లో. మీడియం సైజు కాయతో నా రెసిపీ తో ఒక రోజు పచ్చడి వస్తుంది. రోజూ చేసుకు తింటున్నాము కానీ ఫోటోలు తీయటానికి మిగలటల్లేదు. ఊళ్లు తిరగటానికి పోతున్నాము కాబట్టి ఫోటోలు వచ్చే నెలలోనే.

    యోగుల ఆత్మ కధని తప్పకుండా చదవాలని నిర్ణయించు కున్నాను. న్యు ఇయర్ రిజల్యూషన్. ఇంకా కొత్త సంగతులు తెలిసి కోవాలని ఉంది.

    ముందరగా హాపీ న్యు ఇయర్. మీ వ్యాఖ్యకు ధన్య వాదములు.

    ReplyDelete
  9. 21స్ట్ డిసెంబర్ ఏదో మాయన్‌గండం వుందట, ఆ లోగా ప్రయత్నిస్తాను, రావు గారు. :) ఆలివ్ నూనెతో చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో చూడాలి.
    ఓ యోగి ఆత్మకథ ఓ సారెప్పుడో తిరగేశాను.
    మీకూ నా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  10. @SNKR గారూ చికాగోలో మాకు ఇంతవరకూ స్నో పడలేదు. మాయన్ ప్రభావమేమో తెలియదు. ఆలివ్ నూనె మంచి కామ్బినేషన్. మా ఇంట్లో ఆలివ్ నూనె తిరగామోతకి వాడతాము. దాని స్మోకింగ్ పాయింట్ తక్కువ అందుకని స్టవ్ మీడియం లో ఉంచే వాడాలి. థాంక్స్ ఎగైన్.

    ReplyDelete
  11. Wow ! Thanks Rao gaaru for the recipe !!!

    ReplyDelete
  12. @Sravya Vattikuti గారూ నా రెసిపీ మీడియం సైజు అవకాడోకి సరిపోతుంది.
    ఎంజాయ్ హెల్తీ లైఫ్. ముందుగా హాపీ న్యు ఇయర్. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు.

    ReplyDelete
  13. థాంక్ యు అండి , మీకు కూడా శుభాకాంక్షలు కొంచెం ముందు గా !

    ReplyDelete
  14. వకాడో తో నేను కూడా ఇంతవరకు గ్వాకమోల్ చేసి చూశాను కానీ పచ్చడి రెసిపీ కనిపెడదాం అనుకుంటూనే నిర్లక్ష్యం చేశాను :-))
    మీరు చెప్పేశారు కాబట్టి ఇక చేయడమే తరువాయి.

    నేను కూడా డీప్ ఫ్రై లకు తప్పైంచి కూరలన్నింటికీ ఆలివ్ ఆయిలే వాడతాను. వాసన వస్తుందేమో అని సందేహించాను కానీ..అదేమీ లేదు. భేషుగ్గా ఉంది.

    ఇండియాలో అవకాడోలు హైపర్ సిటీ వంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో మాత్రమే దొరుకుతాయి. ఇంపోర్టెడ్ కాబట్టి పేలి పోయే రేట్లు ఉంటాయి.

    బైదవే రావు గారూ, చికాగోలో మీరెక్కడ? నేను షాంబర్గ్ లో !

    ReplyDelete
  15. @సుజాత గారూ మేము అరోరా లో ఉంటాము. ఇప్పుడు ఎందుకో చాలా చవకగా దొరుకుతున్నాయి. ఒక కాయ పచ్చడి ఒక రోజుకి వస్తుంది. రోజూ చేస్తున్నాము. మేము నెల రోజులకి వెకేషన్ కి వెళ్తున్నాము. మీరు బాలాజీ గుడికి వచ్చి నప్పుడు మా యింటికి రండి.
    మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  16. @శ్రావ్య గారూ థాంక్స్.

    ReplyDelete
  17. @snkr గారు మీరు అడిగినట్లు ఫోటో పెట్టాను. అవొకాడో గట్టిగా ఉంటే ముక్కలు కోయ్యటానికి బాగుంటుంది. నేనయితే సగానికి కోసి తోలు కట్ చేస్తాను. రేసిపీలో చెప్పిన పాళ్ళు మీడియం అవకాడోకి. పెద్దదయితే పాళ్ళు కొంచెం సరిచేసుకోవాలి. ఎంజాయ్.

    ReplyDelete