Wednesday, December 29, 2010

40 ఓ బుల్లి కథ 28 -- కంప్యూటర్ కు గ్రహణం పట్టిన రోజు --

ముందుమాట: కంప్యూటర్ కి వైరస్ పడితే తీసివేసే నా ప్రయత్నమే ఈ పోస్ట్.

ముందుగా నా కంప్యూటర్ Dell Dimension Desk Top(2003) with windows XP. నేను చెప్పబోయే  మెలుకువలు అన్నీ దాదాపు అన్ని చోట్లా పనికొస్తాయి.

నీ కంప్యూటర్ లో 300 వందల వైరస్  లు వున్నాయి మేము బాగు చేస్తాము అని స్క్రీన్ మీద వస్తే ఆహా నా అదృష్టము అని క్లిక్ చేశాను. క్రెడిట్ కార్డు తో యాభై డాలర్లు కడితే బాగు చేస్తామని స్క్రీన్. డబ్బులు కడితే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే!. నేను ఆ స్క్రీన్ క్లోజ్ చేశాను. మళ్ళా కంప్యూటర్ లో వైరస్సులు ఉన్నాయనే స్క్రీన్ వచ్చింది. డబ్బుల కోసం, ఒక కొత్త వైరస్ కంప్యూటర్ లోకి వచ్చిందని గ్రహించాను..

వెంటనే నా దగ్గర ఉన్న anti virus తో స్కాన్ చేశాను. Trojan horses , worms ఉన్నాయని చెబితే రిపైర్  చెయ్యమంటే కొన్ని repair చేసింది. నా దగ్గర ఉన్న anti virus అంత గొప్పది కాదల్లె వుంది, మళ్ళా వైరస్ లు ఉన్నాయనే స్క్రీన్, డబ్బులు ఇమ్మనే స్క్రీన్స్ ప్రత్యక్షం. స్టార్ట్ బటన్ క్లిక్ చేసి కంప్యూటర్ ని turn off  చేద్దామన్నా కుదరలేదు. పవర్ తీసేసి మళ్ళా ఆన్ చేశాను. మళ్ళా అవే స్క్రీనులు. Worms పాకుతూ విండోస్ (OS ) ని కంట్రోల్ లోకి తీసుకున్నాయల్లె ఉంది, కంప్యూటర్ నా కంట్రోల్ లో నుండి పోయింది.

ఏమిటలా మాటా పలుకూ లేకుండా కూర్చున్నారు అని అంటే భయపడుతూ చెప్పాను కంప్యూటర్ పాడయిందని. ఆవిడ వర్క్ కి వెళ్ళే హడావిడిలో ఉంది, మాట్లాడకుండా కంప్యూటర్ తో వచ్చిన backup డిస్క్ లు నా ముందర  పడేసి, సాయంత్రానికి నేనోచ్చేసరికి సరి చెయ్యండి అని వెళ్ళిపోయింది.

దాదాపు ఈ వైరస్సులు అన్నీ బైట నుండి వచ్చేవే. ఉదా: మనకు వచ్చే ఈ-మెయిల్స్ నుండో ,  మనం browse చేస్తున్నఇంటర్నెట్ సైటులు నుండో, ఫయిల్సు డౌన్లోడ్ చేసు కుంటూ ఉంటేనో  లేక ఎవరి వో ఫ్లాష్ డ్రైవ్ లు, సీడ్ లు తెచ్చి కాపీ చేసు కుంటూ ఉంటేనో, మన కంప్యూటర్ లోకి ఎక్కుతాయి. అవి చేసే యుద్ద కాండ వైరస్ లను బట్టి ఉంటుంది. కొన్ని నిశ్శబ్దంగా ఉండి, మన సంగతులన్నీ బయటకు సమాచారం పంపిస్తూ ఉంటాయి. కొన్ని మన ఫైల్స్ అన్నిటిలోనూ ఆక్రమించి, కంప్యూటర్ ని తమ స్వాధీనము లోకి తెచ్చుకుంటాయి. కొన్ని ఆ పనులన్నీ చేసేసిన తరువాత, నీ కంప్యూటర్ ఆక్రమించటం జరిగింది, డబ్బులు ఇస్తే బాగు చేస్తాను అని చెప్పటం జరుగుతుంది.

ఏమిచెయ్యాలో అర్ధం కాలేదు. నా దగ్గర ఇంకొక  anti -virus CD లేదు. మంచి anti -virus డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి లేదు. వైరస్ ఎన్ని ఫైల్స్ ని నాశనం చేసిందో తెలియదు. గుడ్డిలో మెల్ల నా దగ్గర కొన్ని ముఖ్యమయిన ఫైల్స్ backup చేసుకున్నఫ్లాష్ డ్రైవ్ ఉంది. అందుకని వెంటనే హార్డ్ డిస్క్ ని ఫార్మాటు చేసి ఆపరటింగ్ సిస్టం(OS ) ని పెడదామని నిశ్చయించాను. తరువాత ఫ్లాష్ డ్రైవ్ నుండి నా పర్సనల్ ఫైల్స్ లోడ్  చేసుకోవచ్చు.

Backup  డిస్క్ ల లోనుండి ఆపరేటింగ్ సిస్టం CD ని, CD డ్రైవ్ లో పెట్టి కంప్యూటర్ ఆన్ చేశాను. CD drive లో Operating System(OS) ఉంటే కంప్యూటర్ అక్కడనుండి తీసుకుంటుంది. ఇదివరకటి OS తీసేసి దానిమీద కొత్తది పెట్టమంటావా? (ఇల్లా అయితే మన పర్సనల్ ఫైల్స్ ఉంటాయి) లేక డిస్క్ ఫార్మటు చేసి కొత్త OS పెట్టమంటావా అని అడిగింది.(ఇల్లా అయితే పాత ఫైల్స్ అన్నీ పోతాయి). నేను ఇదివరకు అనుకున్నట్లు ఫార్మటు చేసి పెట్టమన్నాను. ఫార్మటు చేసి CD లోని XP OS లోడ్ చేసింది. దీనికి రెండు గంటలు పట్టింది.కంప్యూటర్ రీస్టార్టు  అయిన తరువాత చూస్తే display స్క్రీన్ సరీగ్గా కనపడటల్లేదు. కంప్యూటర్ కి మోనిటర్ ఎటువంటిదో తెలియక default  మోనిటర్ ని పెట్టింది.

కంప్యూటర్ కి మనము తగిలించే  విడి భాగాలని peripherals అంటారు. ఉదా: మోనిటర్, ప్రింటర్. ప్రతీ పెరిఫెరల్ పనిచెయ్యాలంటే పెరిఫేరల్స్ కి రెండుభాగాలు ఉంటాయి. వాటి రెండు భాగాలూ, హార్డ్ మరియు సాఫ్ట్ వేర్స్ కలిసి పని చేయాలి. హార్డువేర్ మనకు కనపడుతుంది సాఫ్ట్వేర్ ఎవరోవ్రాసిన ప్రోగ్రాం, దానినే డ్రైవర్ అంటారు. మోనిటర్ కి సరియిన డ్రైవర్ లేక పోతే అది సరీగ్గా కనపడదు. నాకున్న backup disk నుండి సరియిన డ్రైవర్ ని లోడ్ చేశాను.మోనిటర్ సరియినది.  అల్లాగే Nic card డ్రైవర్ కూడా లోడ్ చేశాను.దీనితోటి ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది. ప్రింటర్ డ్రైవర్ పెట్టాను ప్రింటర్ సరి అయినది. ఫ్లాష్ డ్రైవ్ నుండి నా పర్సనల్ ఫైల్స్ లోడ్ చేశాను. Now we are in business.

ఈ డ్రైవర్స్ లోడ్ చెయ్యటం లో కొన్ని మెలుకువలు ఉన్నాయి. కొన్నిCD పెట్టగానే కంప్యూటర్ లోడ్ చేసుకుంటుంది. కొన్నిటిని Zip ఫైల్ నుండి extract చెయ్యాలి. Extract చేసినప్పుడు సేవ్ చేసే ఫైల్ పేరును ఒకచోట వ్రాసుకోవటం మంచిది. తరువాత  డ్రైవర్ లోడ్ చేసి install చెయ్యటానికి ఆ పేరు కంప్యూటర్ కి చెప్పాల్సోస్తుంది.

కంప్యూటర్ లో ఏ డ్రైవర్లు ఉన్నాయో ఏవి లేవో చెప్పటానికి device manager అని ఒకటుంది. ఏ device కి అయినా డ్రైవర్ లేక పోతే దానిలో అది పసుపు పచ్చ రంగులో కనపడుతుంది. మీరు ఆ device driver ని లోడ్ చేస్తే రంగు మారుతుంది. Device Manager ని చూడాలంటె, మార్గం క్రింద చూపుతున్నాను:

click Start -- right click my computer -- click properties -- click hardware -- click device manager.
లేక
right click My computer icon -- click manage -- click Device Manager.

కంట్రోల్ పానెల్ లో add hardware ద్వారా కూడా  డ్రైవర్స్ ని install చేసుకోవచ్చు. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ పని చేస్తుంటే,   మామూలుగా కంప్యూటర్ డ్రైవర్ లను అన్నిటినీ ఇంటర్నెట్ లో వెతుక్కుని install  చేస్తుంది. పొరపాటున ఈ హడావిడిలో నేను మోడెం సాఫ్ట్వేర్ ని డిలీట్ చేస్తే తన అంతట తానే వెతుక్కుని install చేసుకుంది.

మీకు వీలయితే కంప్యూటర్ మీద నేను ఇదివరకు వ్రాసిన ఈ పోస్ట్ లు చూడండి.


కంప్యూటర్ లో ఏముంటాయి

21. ఓ బుల్లి కథ 9 -- కంప్యూటర్ లో ఏముంటాయి 


22. ఓ బుల్లి కథ 10 -- కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తే 


23. ఓ బుల్లి కథ 11 -- కంప్యూటర్ మొరాయిస్తే --


చివరి మాట: దాదాపు మూడు గంటల్లో ఈ పని పూర్తి  చెయ్య వచ్చు గానీ నేను కష్టపడుతున్నానని ఇంట్లో నిరూపించు కోటానికి, ఆడుతూ పాడుతూ మూడు రోజులు తీసుకున్నాను. ఇంటి పని చెయ్యాల్సిన తప్పించుకోటానికి. మీ కంప్యూటర్ కి వైరస్లు  తగిల్తే గాభరా పడకుండా వాటిని తరిమి కొట్టండి.

Monday, December 20, 2010

39 ఓ బుల్లి కథ 27-- స్టాంపులు అయిపోయాయి --

ముందు మాట: మెర్రీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.

ఇక్కడ అమెరికా లో మామూలుగా ప్రతీ సంవత్సరం ఈ సమయములో జరిగేది; వచ్చిన డొనేషన్ రిక్వెస్ట్ లను ముందర వేసుకుని కూర్చుని చెక్స్ వ్రాయటం. నేను చాలా లేటు, కానీ ఆపని ఈవేళ పూర్తి చేశాను. ఎంతో తృప్తిగా ఉంది.

మనం సంఘ జీవులం. కొట్టుకున్నా తిట్టుకున్నా మనము మన సంఘాన్ని వదలలేము. దీనికి కారణం వంటరి బ్రతుకు దుర్భరం అని మనందరికీ తెలుసు. అందుకనే మనం మన చుట్టూతా మన కిష్టమయిన వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో సుఖంగా ఉందామని చూస్తాం. ఈ ఇష్టా ఇష్టాలు కాల క్రమేణా మారుతూ ఉంటాయి కాబట్టి మన చుట్టూతా ఉన్న వాళ్ళని కూడా మారుస్తూ ఉంటాము. ఇది రోజూ మనము అనుకోకుండా చేసే ప్రక్రియే. కానీ మనకు ఇష్టమయినా లేకున్నా మన అసలు ప్రకృతి మారదు. మనం ఒంటరిగా ఉండలేము వాళ్ళ తో తప్ప.

నిజంచెప్పాలంటే వాళ్ళు మనకెందుకు ఇష్టమంటే,   ఆ "మనం" లో వాళ్ళే మనల్ని పోషించారు, జ్ఞానం పెంచారు, పెద్దచేశారు. మన తలిదండ్రులు పాలు ఇస్తే  తాగాము, పాక మంటే పాకాము, అమ్మ నాన్న తాత అనమంటే అన్నాము. మన పంతుళ్ళు పుస్తకాలు తీసి చదవ మంటే చదివాము. మన స్నేహితులు ఆడ మంటే ఆడాము. ఉద్యోగం ఇస్తే చేస్తున్నాము. అందుకనే ఆ "మనం" మనకిష్టం. వాళ్ళ బాధలు మనబాధలు. వాళ్ళ ఇష్టాలు మన ఇష్టాలు. ఇంతకీ నేను చెప్పొచ్చే దేమిటంటే మనలో "నేను" అనేది ఏమీలేదు అంతా "మనం" గ చేసినవే. వంటరిగా  "నేను"  "నాది" అనేది ఒక చిన్న భ్రాంతి.

సంవత్సరానికి ఒక రోజు మనం కూర్చుకున్న ఆ "మనం" లో దురదృష్ట వశాత్తూ బాధపడుతున్న వాళ్ళని జేర్చుకుందాం. మన ఆనందాన్ని పంచుకుందాం. హైతీ లో భూకంపాలయినా, ఇండోనీషియాలో సునామీ అయినా అవి వాళ్ళు కోరుకుని తెచ్చుకున్న బాధలు కావు. అటువంటి దురదృష్టాలు ప్రపంచం లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం సంఘజీవులం. మనం మనం సహాయం చేసుకోవాలి. అందుకనే కనీసం సంవత్సరానికి ఒకరోజు మనం కూర్చుకున్న ఆ "మనం" లో వీళ్ళని చేర్చుకుందాం. మీకు డొనేషన్ రిక్వెస్ట్ లు వస్తే తోచినంత వెంటనే పంపండి.

స్టాంపులు అతికిచ్చి డొనేషన్ కవర్లు అన్నీ పోస్ట్ చేశాను. ఈ సంవత్సరానికి స్టాంప్ లన్నీ అయిపోయాయి. కొత్త బుక్ కొనుక్కోవాలి.

చివరిమాట: క్రిస్మస్ కి ఇంకా నాలుగు రోజులుంది. మనమిచ్చే  ఈ చిన్న సహాయాలతో  వచ్చే సంవత్సరాంతం వరకూ వాళ్ళు ఎవర్నో ఎప్పుడో ఎక్కడో ఈ ప్రపంచంలో ఆదుకుంటారు. మన చుట్టూతా లేని మన వాళ్ళందరికీ మనం సహాయం చేయకలుగుతాము. అది ఎనలేని త్రుప్తి.

Sunday, December 12, 2010

38 ఓ బుల్లి కథ 26-- ఒక బెలూను ఆత్మకథ --

ముందు మాట: ఒక చిన్నకొత్త ప్రయోగం చేస్తున్నాను. ఫోటోలు తీసినది కిరణ్,  శ్రీలత.


నేనెంత చక్కగా ఉన్నానో చూస్తున్నారుగా. నా ఎత్తు ముప్పై అడుగులు. ఎవరు నన్ను ఇలా సృష్టించారో తెలుసా.




   మొదట నా శరీరం మొత్తం నేల మీద పరుస్తారు. క్రింద నాకో బాస్కెట్ ఉంటుంది. దానిలో ప్రొపేన్ గాస్  ఉంటుంది.




ఆ తరువాత పక్క ఫ్యాన్ తో గట్టిగా గాలి విసురుతారు. అది చాల  పవర్ఫుల్ హోండా ఫ్యాన్. నేను    నేల మీద పెద్ద బుడగలా మారుతాను.



నా బాస్కెట్ లో ఉన్న ప్రొపేన్ గ్యాస్ ని కొద్ది సేపు వెలిగిస్తారు. నేను లేచి కూర్చుంటాను. పదిమంది నన్ను పారి పోకుండా పట్టుకుంటారు. వాళ్ళల్లో నలుగురు నా బాస్కెట్ లో ఎక్కుతారు అందులో ఒకరు పైలెట్. ఆ పైలెట్ చేసే పని అల్లా నేను పైకి ఎగరాలంటే ప్రొపేన్ మంట తో నాలోని గాలిని వేడి చేస్తాడు. అందుకనే నన్ను హాట్ ఎయిర్ బెలూన్ అంటారు.

అందరూ ఎక్కారు. నన్ను పట్టులోంచి వదిలారు. ఆహా నాకు ఎగిరే స్వేఛ వచ్చింది.








ఇంక నా స్నేహితులతో కలసిపోతాను.







అలా అలా నింగిలో హాయిగా విహరిస్తాను నాలో వేడి తగ్గే వరకూ. అంతదాకా అనంతంలో ఉంటాను. బైబై.



చివరిమాట: చూద్దాం ఎల్లా వస్తుందో.?




Monday, December 6, 2010

37 ఓ బుల్లి కథ 25-- డయబెటీస్ తో ఆహార జాగ్రత్తలు --

ముందు మాట: "The Best Foods to Fight Diabetes" by Joy Bauer, PARADE Dec,2010 Column కి తెలుగు అనువాదం.

నాకు తెలిసినంతవరకూ క్లుప్తంగా: మన శరీరం లో కణములు(cells ) లో షుగర్, ఆక్సిజన్ ల కలయిక వలన శక్తి ఉత్పన్న మౌతుంది. షుగర్, ఆక్సిజన్ రెండూ మనలోని రక్తప్రవాహము ద్వారా మన దేహము లోని అన్ని cells కి చేరుతాయి. మనము తినే ఆహారము నుండి జీర్ణక్రియ ద్వారా షుగర్, పీల్చే గాలి నుండి  ఆక్సిజన్ మన రక్తములో చేరును.  రక్తములో షుగర్ ఒక పరిమితి లోనే ఉండవలయును. రక్తములో షుగర్ ఎక్కువగా ఉన్న మన అవయవములు కొన్ని సరీగ్గా పనిచేయవు. ఈ రక్తములో షుగర్ ఎక్కువగా ఉన్న పరిస్థితినే diabetes అందురు. సామాన్యముగా శరీరములో తయారు కాబడే ఇన్సులిన్ వలన రక్తము లోని షుగర్ కంట్రోల్ అగును, కానప్పుడు మందుల ద్వారా లేక షుగర్ ఉత్పాదన చేసే ఆహార పదార్ధములను తినుట తగ్గించటము ద్వారా diabetes ను కంట్రోల్  చేయవచ్చును. ఇక చదవండి.

దాదాపు 20 మిలియన్ల అమెరికన్స్ కు డయాబెటీస్ ఉంది.  ఇంకా ప్రతీ సంవత్సరమూ 1.6 మిల్లియన్ కొత్త కేసులు వస్తున్నాయి.

ఈ జబ్బు రాకుండా మీరు కాపాడుకోవాలంటే, మీ బరువు కనక ఎక్కువగా ఉంటే, తగ్గించటానికి ప్రయత్నించండి. పశోధనల్లో బరువుతగ్గితే ఫలితము ఉంటుందని తేలింది. కొన్ని రకాల ఆహార పదార్ధాలు కూడా blood sugar కొలతలను మారుస్తాయి.

(నా మాట: మీ బరువు సమానముగా ఉన్నదో లేదో మీ BMI(Body Mass Index) నుండి గ్రహించండి. ఈ లింక్ ద్వారా మీ BMI గురించి తెల్సుకోండి. http://mytelugurachana.blogspot.com/2010/11/36-24.html )

మంచి  కార్బో హైడ్రేట్సు ఉన్న పదార్ధాలను తినండి: ఈ పదార్దములు చాలా నెమ్మదిగా బ్లడ్ లోకి షుగర్ని పంపిస్తాయి. అందుకని తక్కువ ఇన్సులిన్ తో blood sugar కొలతలను సరి చెయ్యవచ్చు.
వీటిని ఎక్కువగా తినండి: Vegetables, beans(kidney, garbanzo, pinto, black, etc), lentils, barley, oatmeal, wild rice, and 100%whole grain bread, cereals and pasta.
వీటిని తగ్గించండి: Sugar(white and brown), high-fructose corn syrup, soft drinks, fruit juice, jams and jellies, candy, cakes, cookies, white bread, white rice, and regular pasta.

మీ ఆహారంలో ప్రోటీన్ మరియు ఫాట్స్ ని కూడా చేర్చండి: ఈ రెండూ కార్బో హైడ్రేట్సు తిన్న తరువాత ఎక్కువయ్యే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తయ్యి.
వీటిని ఎక్కువగా తినండి: skinless chicken and turkey, fish and seafood, egg whites, nonfat yogurt, low-fat cottage cheese, beans and lentils, and tofu. Healthy fats: Olive oil, Canola oil, fatty fish(salmon, sardines), nuts, and nut butters  (peanut or almond)

చివరి మాట: మీరు రోజూ తీసుకునే ఆహారంలో మంచి పదార్ధాలను ఎక్కువ చేసి మిగతావి తగ్గించండి. వీటిలో కొన్ని పదార్దములు మీ శరీర తత్వానికి సరిపోక పోవచ్చు. వాటిని తినవలసిన అవుసరము లేదు.

Monday, November 22, 2010

36 ఓ బుల్లి కథ 24-- డయబెటీస్ రిస్క్ తగ్గించుకోవాలంటే --

ముందుమాట: Dr. Judith Fradkin of National Institute of Health, US చెప్పిన సలహాలు. ఇవి Parade 22 Nov, 2010 Stay Healthy by Emily Listfield column, 4 Easy Steps to Lower Your Diabetes Risk వ్యాసానికి తెలుగు అనువాదము.

Dr. Judith Fradkin of National Institute of Health, US ఏమి చెబుతున్నారంటే 'మీ టైపు 2 డయాబెటీస్ రిస్క్ ని, రోజూవారి క్రమం లో కొన్ని మార్పులు చేస్తే,  సగానికి సగం తగ్గించ వచ్చు. మీ బరువుని 15 పౌన్లు తగ్గించి, రోజుకి 30 నిమిషములు నడవటం మొదలెడితే మీలో వచ్చే మార్పులని గమనించ గలరు'.
(నామాట: మీ BMI, 18.5  కి 24.9 కి మధ్య నుంటే మీ బరువు సరీగ్గా ఉన్నట్టు లెక్క. క్రింద క్లిక్ చేసి మీ BMI తెలుసుకోండి. http://www.nhlbisupport.com/bmi/bmicalc.htm
Body mass index (BMI) is a measure of body fat based on height and weight that applies to adult men and women.)


ఇంకా వారు చెప్పినవి:
1. Revamp Your Breakfast: మీరు తినే మోతాదుని సరిచూసుకోండి. తక్కువ మోతాదుతో కడుపు నిండిందని అనిపించే ఆహార పదార్ధములను తినండి. Whole-grain bread, whole-grain cereal with skim milk, or low fat yogurt with fruit.

2. Take a 10 minute Break: మీరు చాలా సమయము కంప్యూటర్ దగ్గర కూర్చునేటట్లు అయితే, కనీసం రోజుకి మూడుసార్లు పది నిమిషాలు లేచి తిరగండి. ఎక్సరసయిజు, కండరముల లోనికి రక్త ప్రవాహము ను పంపి వాటి ఇన్సులిన్ receptive ని పెంచుతుంది. 

3. Indulge in half a desert: మీకు డయాబెటీస్ ఉండి తీపి పదార్దములు తింటే మీ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చెయ్యటం కష్టము. డయాబెటీస్ లేని వారికి , షుగర్ is a lot of empty కాలోరీస్. మీకు Brownie (చిన్నతీపి చాకొలేట్ కేకు) తినాలని అనిపిస్తే, సగం కేకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి తింటూ, సంతృప్తి పడుతూ, ఆనందించండి.

4. Sleep on it:  నిద్ర సరిగ్గా పోనివారికి డయాబెటీస్ రావటానికి వీలు ఉంటుంది అని పరిశోధనల వల్ల తేలింది.
(నామాట: మీకు మరుసటి రోజు నిద్రలేక బద్ధకంగా ఉన్నట్టుంటే, మీరు సరీగ్గా నిద్రపోలేదని భావన. అందుకని చక్కగా రోజూ నిద్ర పోవుటకు ప్రయత్నించండి.)

చివరిమాట: రోజూ ఆరోగ్యకర మయిన ఆహారం మితంగా తింటూ, మన అవయవాలనన్నీ ఉపయోగించు కుంటూ, నిద్రలేమి లేకుండా జీవితం గడుపుతూ వుంటే డయబెటీస్ ని దూరముగా ఉంచవచ్చు అని తేలుతోంది.

Monday, November 15, 2010

35 ఓ బుల్లి కథ 23 -- బెలూన్ ఫెస్టివల్ లో ఒకరోజు --

ముందు మాట: అక్టోబర్ మొదటి వారంలో అమెరికా లో అల్బుకర్క్(Albuquerque)  అనే ఊళ్ళో ప్రతీ సంవత్సరం వారం రోజులు బెలూన్ ఫెస్టివల్ జరుగుతుంది. దానికి మేము వెళ్లటం జరిగింది. దానిని గురించే ఈ పోస్ట్.

ఇంట్లో పుట్టినరోజు పండగలకీ వాటికి బూరలూది కట్టడం తప్పితే బెలూనులంటే పెద్ద వ్యామోహం లేదు. ఆంధ్రా యూనివర్సిటీ లో రోజూ సాయంత్రం వాతావరణ బెలూనులు ఎగరేసేవారు అంతకు తప్పితే వాటి ఉపయోగాలు కూడా ఎక్కువ తెలియవు. అప్పుడప్పుడూ హాట్ ఎయిర్ బెలూన్స్ లో ఎగిరే వారిని చూస్తూ, ఎందుకు వీళ్ళకి ఈ పిచ్చ అనుకునే వాణ్ని. కానీ నా అంతట నేను తెల్లవారుఝామున నాలుగున్నరకు చీకట్లో వణుకుతూ, కారు చీకటిలో బెలూనులు ఎగరేయ్యటం చూట్టానికి వెళ్తానని నేను ఎప్పుడూ కలలోనయినా అనుకోలేదు. ఏడుగంటలకి మొదలయ్యే పండగకి ముందరగా వెళ్ళకపోతే చాలాసేపు క్యు లో నుంచో వలసి వస్తుందిట. అప్పుడు ఎంత చలి అంటే గడ్డి మీద పరుచుకున్దామని తీసికెళ్ళిన దుప్పటిని, బట్టతల ఫ్రీజ్ అవుతుంటే ఆగలేక తలకి చుట్టుకున్నాను. పగలుపూట అచ్చు ఇండియా లో లాగా ఉంటుంది అంటే చికాగో నుండి చలికాగే బట్టలు తెచ్చుకోలేదు. కానీ రాత్రిపూట అలాస్కా లాగా ఉంటుందని ఎవరూ చెప్పలేదు.

అల్బుకర్క్ అమెరికా లో నివసించటానికి  ఒక మంచి ఊరని ఒక చోట Newsweek లో అనుకుంటా చదివాను. అది అమెరికాలో New Mexico అనే రాష్ట్రం లో ఉంది. Mexico కి దగ్గర అవటం మూలంగా  Mexico జీవన విధానము ఎక్కువగా కనపడుతుంది. ఎడారి ప్రదేశము అయినప్పటికీ చుట్టూతా ఎటుచూసినా కొండలు. కొండలపయిన దూది పింజల వంటి తెల్లటి  మేఘాలు. ఆ మేఘాలు కలుపుతూ అనంతమయిన నీలి ఆకాశం. వీటన్నిటి క్రిందా బుజ్జి బుజ్జి ఇళ్ళు, ఊళ్ళు. బంగారు కాంతులతో వీటన్నిటి మీదా తాపడం పెట్టి కనుల పండగ చేసే అస్తమించే సూర్యుడు చూడటానికి చాలా బాగుంటాడు. అసలు ఎయిర్ పోర్ట్ తోనే ప్రారంభము అవుతుంది మెచ్చుకోలు. కొండరాళ్ళ బ్రిక్స్ తో చేసిన ఫ్లోరింగ్ రంగు రంగులతో కళకళ లాడుతూ ఉంటుంది. ప్రపంచం లో ఇటువంటి ఎయిర్ పోర్ట్ నేను ఎక్కడా చూడలేదు . ఇక్కడ నేటివ్ అమెరికన్ ఇండియన్స్ ఉండటము మూలాన వాళ్ళ పద్ధతులు ఎక్కువగా కనపడుతూంటాయి. ఓల్డ్ సిటీ చావిళ్ళల్లో పూసల దండలనుండీ చేత్తో చేసిన అనేక ఆభరణాలు అమ్ముతారు. ప్రతీ షాప్ ముందరా ఎండు మెరపకాయల దండలు వెళ్ళాడేస్తారు. దుష్ట శక్తులు రాకుండా ఉండటానికి.

ఇంక బెలూన్స్ సంగతికి వస్తే, అసలు మాకు ఈ బెలూన్ల పిచ్చ రావటానికి కారణం, మొన్న మార్చి లో ఇక్కడకి వచ్చినప్పుడు, ఉబుసుపోక బెలూన్ మ్యుజియం కి వెళ్ళటం జరిగింది. అది ఒక చూడవలసిన ప్రదేశము ఇక్కడ. హాట్ ఎయిర్ బెలూన్స్ ఎల్లా తాయారు చేస్తారో, ఎంతమంది దానిలో ఎక్కి ప్రపంచం చుట్టి వద్దామని ప్రయత్నించారో, యుద్ధం లో వాటిని ఎల్లా ఉపయోగించేవాళ్ళో , ఇంగ్లాండ్ నుండి అమెరికాకి బెల్లూన్ షిప్ లో ఎలా వచ్చేవాళ్ళో అంతా తెలుసు కున్నాము. సిమ్యులేటర్ లో బెలూన్ నడపటానికి ప్రయత్నించాము కూడా. కాకపోతే అది గాలికి కొట్టుకు పోయి దిగవలసిన చోట దిగలేదు. అంతా ముగించుకుని వెళ్లబోతుంటే, అక్కడ పనిచేసే ఆయన, మేము బెలూన్ల గురించి చాలా అడగటం గమనించి, అక్టోబర్ లో బెలూన్ల పండగ ఉంది రమ్మన్నాడు. అక్కడ వచ్చింది గొడవ. ఏమయినా సరే అక్టోబర్ లో ఇక్కడికి రావాల్సిందే అని నిర్ధారణ అయిపొయింది. వయసు పెరిగినకొద్దీ మన పెద్దరికం నిలబెట్టుకోవాలంటే, అన్నిటికీ తలతిప్పుతూ ఉండాల్సిందే. అయినా మనదేమి పోయింది సుబ్బరంగా తీసుకువెళ్ళి తిప్పుతానంటే.

ఇక్కడ జరిగేది International Balloon Festival అంటారు. International వాళ్ళని చూడలేదు గానీ అమెరికాలో మిగతా చాలా  రాష్ట్రాలనుండి ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగరవేయ్యటానికి వచ్చిన వారిని చూశాను. ఒక్కొక్కళ్ళు తమ బెలూన్ సరంజామాతో పెద్ద పెద్ద వానుల్లో వచ్చారు. అక్కడ దాదాపు వంద షాపులు గుడారాల్లో ఉన్నాయి. చాలావరకు రకరకాల తినే వస్తువులు. మొదట తినటం ముఖ్యం కదా. నాకు ఫన్నేల్ కేక్ అంటే ఇష్టం. పిల్లలు క్యు లో నుంచుని తెచ్చి పెట్టారు. మీరు చూసే మొదటి ఫోటో మేము బెలూన్స్ ఎగరేసే ప్రదేశానికి వెళ్ళినప్పుడు చిమ్మ చీకట్లో తీసిన ఫోటో. మొట్టమొదట బెలూన్ ని క్రింద పరుస్తారు. అది దాదాపు ముప్పై అడుగులు ఉంటుంది. దాని ముఖద్వారములో చాలా శక్తివంతమయిన ఫ్యాన్ పెట్టి గాలి గట్టిగా విసురుతారు. అది హోండా కంపెని తయారు చేసిన ఫ్యాన్. చూసి ఆశ్చర్య పోయాను. కొన్ని నిమిషాలకి బెలూన్ కొంచము పైకి లేస్తుంది. అప్పుడు propane గ్యాస్ కొద్దిగా వెలిగిస్తారు. బెలూన్ లో ఉన్న గాలి వేడెక్కి బెల్లూన్ లేచి నుంచుంటుంది. దానికింద ఒక పెద్ద బుట్ట ఉంటుంది. దానిలో propane గ్యాస్ వెలిగించటానికి కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. దానిలో నలుగురు ఎక్కవచ్చు. అందులో ఒకళ్ళు పైలట్,  propane గ్యాస్ తో బెలూన్ లో గాలిని వేడిచేస్తూ బెలూన్ ని కంట్రోల్ చేస్తాడు. ఇప్పటి దాకా బెలూన్ ఎగరకుండా పదిమంది పట్టుకుంటారు. బుట్టలోకి ప్రయాణీకులు ఎక్కంగానే, వాళ్ళు దాన్ని వదిలేస్తారు. బెలూన్ పైకి ఎగురుతుంది. అప్పటినుండి పైలట్ కంట్రోల్ లో ఉంటుంది. అల్లా ఒక్కొక్క వరుసలో పది బెలూన్స్, దాదాపు పది వరసల నుండి ఎగరటం మొదలెడు తాయి. నిమిషాల్లో ఆకాశం అంతా బెలూన్ల మయం. కొన్ని బెలూన్స్ మనకు తెలిసిన ఆకారాలుగ కూడా చేశారు. తొమ్మిది గంటలకి అంతా అయిపోయి ఇంటిముఖం పట్టాము. మళ్ళా సాయంత్రం చీకట్లో బెలూన్స్ లో propane మెరుపులు చూడటానికి, బాణసంచా చూడటానికి, వచ్చాము. కానీ కారు చీకట్లు కమ్మి, మేఘావ్రుతమయి ఇసుక తుఫాను రావటం తో చూడటము పడక త్వరగా ఇంటికి చేరుకున్నాము. నేను చెప్పినవన్నీ క్రింద ఫోటోలలో చూడచ్చు.

చివరిమాట: రెండవ ప్రపంచ యుద్ధానికి చరమ గీతం పాడిన యాటమిక్ బాంబ్ తయారు చేసిన ప్రదేశం, లాస్ ఎలామోస్, అల్బుకర్క్ కి దగ్గరే. లేకపోతే జపాన్, జర్మనీ ప్రపంచాన్ని పంచుకునేవాళ్ళు. అల్బుకర్క్ లో న్యుక్లియర్ మ్యుజియం కూడా
ఉన్నది. దగ్గరలో ఉంటే తప్పక వెళ్ళండి.





































































Sunday, October 31, 2010

34 ఓ బుల్లి కథ 22-- కీళ్ళ నొప్పులను తగ్గించే ఆహారం సప్ప్లిమెంట్లు --

ముందుమాట: Bottom Line వారు Dr. Harris McIIwain, MD, Certified specialist in rheumatology and geriatric medicine who practices with the Tampa Medical Group in Florida గారితో చేసిన సంభాషణను తెలుగు లో నాలుగు  పోస్టులలో మీకు అందిస్తున్నాను.
దీనికి కారణం మన ఇళ్ళల్లో జాయింట్ పైన్స్ తో బాధ పడేవారు ఎక్కువగా ఉండటం. వారు వయసులో పెద్దవారు అవటం. పెద్దవయసులో ఇవి మామూలే అని నిరాశగా బాధ పడుతూ ఉండటం చూడలేక.

(నా మాట క్లుప్తంగా : ఇది నాల్గవ పోస్ట్, Supplements that can Ease Arthritis. దీనిలో చాలాచోట్ల inflammation అని వస్తుంది కనుక మీకు తెలియటానికి, నాకు తెలిసినంతవరకూ inflammation అంటే క్లుప్తంగా చెబుతాను. inflammation మూలంగా వాపు రావచ్చు. వాయటం మూలంగా నరాలకి వత్తుడు(Compression) తగిలి నొప్పి పుడుతుంది. ఆ వాపును తగ్గిస్తే వత్తుడు తగ్గి నొప్పి పోతుంది. సూక్ష్మంగా ఇదీ కధ. మీకు ఇంకా తెలుసుకోవాలంటే గూగులమ్మని అడగటానికి వీలుగా, వ్రాసేటప్పుడు ఇంగ్లిష్ పదాలు వాడుతున్నాను.)

ఈ క్రింద చెప్పిన supplements తీసుకుంటే arthritis మూలముగా వచ్చే inflammation ని తగ్గించటానికి వీలవుతుంది. మీరు ఈ ఆహారపు supplements తీసుకునే ముందు డాక్టర్ తో సంప్రదించండి -- అవి natural గా దొరికేవయినా సరే. ఉదా: ginger (అల్లం).

Glucosamine (1,500 mg/daily). దీనిమీద జరిగిన పరిశోధనల వలన తేలినది ఖచ్చితముగా చెప్పక పోయినా ఇది చాలా మంచిది. ఇది arthritis వ్యాప్తిని తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలలో తేలినది. మామూలుగా దీనిని chondroitin (1,200 mg) తో తీసుకుంటారు ఎందువల్లనంటే కొందరిలో ఇది వాడుట మూలాన arthritis నొప్పులు తగ్గినట్లు కనపడెను.(నా మాట క్లుప్తంగా : fish , sword fish allergy ఉంటే ఇది తీసుకోవోకండి.శాకాహారులకు vegetarian Glucosamine దొరుకుతుంది.)

Vitamin C (500 mg to 1,000 mg daily). ఇది collagen ని అభివృద్ది చేసి జాగర్తగా చూడటం లో ముఖ్య పాత్రధారి. collagen , cartilage లో ఒక భాగము. దానికి తోడు దీనిలో antioxidants ఉండటము మూలాన inflammation ను తగ్గించి damaged joint tissue ని regenerate చేస్తుంది. (నా మాట క్లుప్తంగా : కీళ్ళ లో రెండు ఎముకలకి మధ్య నుండే cushion లాంటి పదార్ధము cartilage . ఇది గనక క్షీణ దశలో ఉంటే రెండు బోమికలూ రాచుకుని నెప్పి పుడుతుంది.)

Bromelain: ఈ anti-inflammatory enzyme, pineapple లో ఉంటుంది. Pill , Capsule గ కూడా దొరుకుతుంది. రోజుకు రెండు slices మీ ఆహారము తో తీసుకోండి. మీరు capsules తీసుకుంటే label మీద directions తో వాడండి.

Fish Oil Capsules: మీరు ఫిష్ తీసుకోకపోతే ఇవి వాడండి. Your dose should provide 600 mg of combined DHA and EPA in a 2:1 ratio - the ratio that occurs in wild salmon. Read your product label for its DHA/EPA content.

Ginger: పరిశోధనల్లో తేలిందేమిటంటే ఈ ginger, arthritis మూలాన వచ్చే inflammation ని తగ్గిస్తుందని. దీనిని మీరు tincture గానూ, capsules గానూ, ఆహారముతో కలిపి గానూ లేక ginger రూట్ నీళ్ళలో మరగపెడితే వచ్చే tea తో గానీ తీసుకొన వచ్చును. Since ginger inhibits blood clotting, don't consume more than four grams a day.

చివరి మాట: మీరు తప్పకుండా ఇవి తీసుకునే ముందు మీ డాక్టర్ ని సంప్రదించండి. వీటిని వాడు సూచనల కోసం సీసా మీద ఉన్న lebel లో వ్రాసినవి తప్పక చదవండి.  

Wednesday, October 27, 2010

33 ఓ బుల్లి కథ 21-- కీళ్ళ నొప్పులతో ఆహారం జాగ్రత్తలు --

ముందుమాట: Bottom Line వారు Dr. Harris McIIwain, MD, Certified specialist in rheumatology and geriatric medicine who practices with the Tampa Medical Group in Florida గారితో చేసిన సంభాషణను తెలుగు లో నాలుగు  పోస్టులలో మీకు అందిస్తున్నాను.
దీనికి కారణం మన ఇళ్ళల్లో జాయింట్ పైన్స్ తో బాధ పడేవారు ఎక్కువగా ఉండటం. వారు వయసులో పెద్దవారు అవటం. పెద్దవయసులో ఇవి మామూలే అని నిరాశగా బాధ పడుతూ ఉండటం చూడలేక.

(నా మాట క్లుప్తంగా : ఇది మూడవ పోస్ట్, Foods To Avoid. దీనిలో చాలాచోట్ల inflammation అని వస్తుంది కనుక మీకు తెలియటానికి, నాకు తెలిసినంతవరకూ inflammation అంటే క్లుప్తంగా చెబుతాను. inflammation మూలంగా వాపు రావచ్చు. వాయటం మూలంగా నరాలకి వత్తుడు(Compression) తగిలి నొప్పి పుడుతుంది. ఆ వాపును తగ్గిస్తే వత్తుడు తగ్గి నొప్పి పోతుంది. సూక్ష్మంగా ఇదీ కధ. మీకు ఇంకా తెలుసుకోవాలంటే గూగులమ్మని అడగటానికి వీలుగా, వ్రాసేటప్పుడు ఇంగ్లిష్ పదాలు వాడుతున్నాను.)

నేను ఈ క్రింద చెప్పబోయే ఆహార పదార్ధాలు కీళ్ళ నొప్పులను ఎక్కువ చెయ్యోచ్చు. కానీ మీకు మీరుగా వాటిని గుర్తించండి. దానికి పద్ధతి, ఒక్కొక్క పదార్దాన్నీ రెండు వారాలు తినకుండా ఉండి మీ బాధ పరిణితిని గమనించండి. ఈ విధంగా మీకు మీరు ఏ పదార్ధాలు మీకు inflammation బాధను కలిగిస్తున్నయ్యో తెలిసికొన వచ్చును.

Inflammation ఎక్కువ చేసే పదార్ధాలను వాడకండి: మనము తినే పదార్ధాలలో కొన్ని మన దేహము లో cytokines అనే వాటి ఉత్పత్తికి కారణం అవుతవి. cytokines అనే ఈ proteins inflammation ని పెంచుతాయి. దీని మూలముగ కీళ్ళ నెప్పులు పెరుగుతాయే కాకుండా joints లోని cartilage క్షీణతకు కూడా దోహదము చేస్తయ్యి.(నా మాట క్లుప్తంగా : కీళ్ళ లో రెండు ఎముకలకి మధ్య నుండే cushion లాంటి పదార్ధము cartilage . ఇది గనక క్షీణ దశలో ఉంటే రెండు బోమికలూ రాచుకుని నెప్పి పుడుతుంది.)

ఈ పదార్దములు: Beef మరియు other red meat , ఎక్కువ వేడి మీద తయారు చేసిన పదార్ధాలు (ఉదా: వేపుడు పదార్ధాలు),
కృత్రిమంగా తయారు చేసిన trans fats (partially hydrogenated fats or oils on food labels)( ఉదా: Junk foods మరియు వ్యాపార రీత్యా తయారు చేసిన baked goods ). వీటిని వీలయినంత తక్కువగా తినండి.

Animal Products నుండి వచ్చిన ఆహార పదార్ధాలను తక్కువగా తినండి: నా patients కి వీలయినంత మితముగా Turkey chicken మాత్రమే తినమని చెప్తాను. అసలు సత్య మేమి టంటే అన్ని animal products --  including poultry, some farm raised fish, egg yolks and other dairy products -- contain arachidonic acid, a fatty acid that is converted into prostaglandins and leukotrienes, two other types of inflammation causing chemicals.(నా మాట క్లుప్తంగా : dairy products అంటే పాలు, పెరుగు, వెన్న, మీగడ, నెయ్యి, మజ్జిగ).

నా  patients చాలామంది "modified vegetarian diet "  తీసుకొనుట వలన వాళ్ళ కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనము కనిపించినదన్నారు. Key: జంతువుల నుండి వచ్చే protein  ను తగ్గించి,  fish , plants నుండి వచ్చే protein  ని ఎక్కువ చెయ్యండి (beans, nuts, soy, portobello mushrooms(a common meat substitute) and whole grains.

Start by substituting one-fourth of the animal protein you normally eat with plant-based foods, cold-water fish and low fat dairy. After two or three months, increase the substitution to half -- adding more vegetables , fruits, lentils, beans , fish, whole grains and low fat dairy.

కొంత కాలము అయిన తరువాత నా patients అందరూ pain and inflammation తగ్గటం మూలముగా.animal proteins మాని వేయటం జరిగింది. సూచన: చాలా కొద్దిమందిలో కొన్ని కాయ గూరలు arthritis ని ఎక్కువ చేస్తయ్యని గమనించారు. అవి: tomatoes, white potatoes, peppers and eggplant. (నా మాట: eggplant అంటే వంకాయ. peppers అంటే bell peppers). ఈ nightshade family plants లో solanine అనే పదార్ధము ఉంటుంది. అది కనక మన intestines లో సరీగ్గా జీర్ణము కాకపోతే అవి toxic గ మారుతాయి. వీటినన్నిటినీ తినుట ఆపి ఒక్కొక్కటే తీసుకొనుట ప్రారంభించి, వీటి మూలముగా arthritis బాధలు కలుగకుండా ఉంటే తినుట ప్రారంభించండి.

High glycemic index ఉన్న పదార్దముల ను వాడ వద్దు. ఎందుకంటే ఇవి మీ blood sugar ని చాలా త్వరగా ఎక్కువ చేస్తయ్యి. డయాబెటిస్ వాళ్ళు, అది రాబోతందని తెలుసుకున్న వాళ్ళు వీటిని ఎల్లాగూ తిన కూడదు. ఇవి arthritis ఉన్న వాళ్లకి కూడా బాధలు పుట్టిస్తాయి. దీనికి కారణం: ఇవి ఇన్సులిన్ తయారును ఎక్కువ చేస్తయ్యి. దీనిమూలముగా శరీరములో కొవ్వు పెరుగుతుంది, దానికి తోడు మనకి భోజనము చేసిన కొన్ని గంటల లోనే మళ్ళా తినాలని పిస్తుంది. చివరికి జరిగేది బరువు పెరగటం, arthritis కి మంచిదికాదు. High glycemic foods include table sugar, baked white potatoes, French fries, Pretzels, White bread and rolls, white and brown rice, potato and corn chips, waffles, doughnuts and corn flakes.

చివరి మాట: తరువాతి పోస్ట్ Supplements that can ease Arthritis .

Monday, October 25, 2010

32 ఓ బుల్లి కథ 20 -- కీళ్ళు నొప్పులకు మందు మంచి ఆహారం --

ముందుమాట: Bottom Line వారు Dr. Harris McIIwain, MD, Certified specialist in rheumatology and geriatric medicine who practices with the Tampa Medical Group in Florida గారితో చేసిన సంభాషణను తెలుగు లో నాలుగు  పోస్టులలో మీకు అందిస్తున్నాను.
దీనికి కారణం మన ఇళ్ళల్లో జాయింట్ పైన్స్ తో బాధ పడేవారు ఎక్కువగా ఉండటం. వారు వయసులో పెద్దవారు అవటం. పెద్దవయసులో ఇవి మామూలే అని నిరాశగా బాధ పడుతూ ఉండటం చూడలేక.

(నా మాట క్లుప్తంగా : ఇది రెండవ పోస్ట్, Foods that Heal . దీనిలో చాలాచోట్ల inflammation అని వస్తుంది   కనుక మీకు తెలియటానికి,  నాకు తెలిసినంతవరకూ inflammation అంటే క్లుప్తంగా  చెబుతాను. inflammation మూలంగా వాపు రావచ్చు. వాయటం మూలంగా నరాలకి వత్తుడు(Compression)  తగిలి నొప్పి పుడుతుంది. ఆ వాపును తగ్గిస్తే వత్తుడు తగ్గి నొప్పి పోతుంది. సూక్ష్మంగా ఇదీ కధ.  మీకు ఇంకా తెలుసుకోవాలంటే గూగులమ్మని అడగటానికి వీలుగా, వ్రాసేటప్పుడు ఇంగ్లిష్ పదాలు వాడుతున్నాను.) 

నొప్పిని తగ్గిచ్చే ఆహార పదార్ధాలు: మనము తినే ఆహారములలో antioxidants  ఉండి, inflammation  ను హతమార్చే పోషక పదార్ధాలు ఉన్నవాటిని, తినుట వలన మన కీళ్ళ బాధలను తగ్గించవచ్చును. ఈ క్రింద చెప్పబడిన ఆహార పదార్దములు మనకు  ఉపశాంతిని ఇవ్వగలవు.

(నా మాట క్లుప్తంగా : మన దేహములోని cells లో Glucose , Oxygen రసాయనిక కలయికవలన మనకి కావాల్సిన energy ఉత్పన్న అవుతుంది. ఈ రసాయనిక కలయికలో మనకు పనికి వచ్చే శక్తే కాకుండా పనికిరానివి కూడా తయారు అవుతాయి. అవే oxidants(free radicals) .  ఇవి ఇంకొక పదార్ధానికి త్వరగా అంటుకోవాలని ప్రయత్నిస్తాయి. అవి అంటుకుంటే ఆ పదార్ధపు పనితీరు మారవచ్చు. మన శరీర శక్తే వాటిని నిర్వీర్యము చేస్తుంది కానీ ఒక్కొక్కప్పుడు చెయ్యలేక పోతే మనము బాధలకు గురి కావలసి వస్తుంది. అందుకని మనము antioxidants ఉన్న పదార్ధాలను తీసుకుంటే మన శరీరములో ఉత్పన్నమయిన చెడ్డ వస్తువులను నిర్వీర్యము చేయుట జరుగుతుంది.)

High-antioxidant ఫలములు, కాయగూరలు: Antioxidants, inflammation ను తగ్గిస్తాయి. కొన్ని సంవత్సరాల క్రిందట, US Department of Agriculture కొన్ని పదార్దముల antioxidant activity వరుసగా ఎక్కువ నుండి తక్కువ క్రమం లో పొందుపరిచింది. వాటిలో మొదటి పది:  blueberries, kale, strawberries, spinach, Brussels sprouts, plums, broccoli, beets, oranges, and red grapes. వీటిల్లో మీకిష్టమయినవి తినుట ప్రారంభించండి (వండిన వయినా  సరే). వీటి తరువాత ఇవి గూడా మంచివే: Asparagus, cabbage, cauliflower, tomatoes, sweet potatoes, avocados, grapefruit, peaches and watermelon.

Oil-rich fish: పరిశోధనల వల్ల తేలిందేమిటంటే omega-3 fatty acids ఉన్న పదార్ధాలు inflammation ను తగ్గిస్తాయని. అవి: anchovies, mackerel, salmon, sardines, shad, tuna, whitefish, and herring. ఇవి ముఖ్యంగా చాలా రకాల arthritis లకి కారణంగ  కనపడే leukotriene B4 ను తగ్గిస్తాయి. పరిశోధనల వలన తేలిందేమిటంటే, ఆడవాళ్ళల్లో వారానికి మూడు సార్లు baked or boiled fish తిన్న వాళ్లకి rheumatoid arthritis రావటం ఒకసారి తినే ఆడవాళ్ళ కన్న సగం తక్కువ.

Soy : పరిశోధనల్లో తేలిందేమిటంటే తీసుకునే ఆహారంలో ఎక్కువ soy ఉంటే inflammation మూలాన వచ్చే నొప్పి, వాపు తగ్గుతాయని. మీరు వీటిని ఉపయోగించటానికి ప్రయత్నించండి: tofu, soy milk, soy yogurt, soy beans or miso, a traditional Japanese food consisting of fermented soy beans and made into a thick paste.

Green and black Tea: Green Tea లో polyphenol అనబడే ECCG ఉంటుంది. సామాన్యంగా చెట్లలో ఉండే ఈ polyphenol , antioxidant గ పనిచేస్తుంది. ఈ ECCG అను పదార్ధం, arthritis inflammation response లో కనపడే ఒక కీలకమయిన gene ని  inhibit చేస్తుంది. పరిశోధనల్లో తేలిందేమిటంటే మీరు Green టీ ని ఎంత తాగితే అంత ఫలితం కలుగు తుందని. Black Tea, మన శరీరంలో Green Tea లాగా పనిచేయక పోయినా తగిన ఫలితములు ఇస్తుంది. దీనిలో theaflavins అనే anti -inflammatory రసాయన పదార్దములు ఉన్నాయి. The Iowa Women's Health Study లో కనుగొన్నది ఏమిటంటే, రోజుకి మూడు కప్పుల టీ(herbal టీ కాదు) తాగే ఆడవాళ్ళకి, తాగని వాళ్ళకన్నా,  rheumatoid arthritis రావటం 60% తక్కువ.

Pineapple: రుచికరమయిన ఈ ఫలములో bromelain ఉండును. ఈ enzyme arthritis తో వచ్చే inflammation ని తగ్గిస్తుంది. Fresh pineapple అయితే చాలా ఉత్తమం  కానీ canned pineapple కూడా పనిచేస్తుంది.

Onions and Apples: ఈ రెండింటిలోనూ flavonoids అనే పదార్దములు ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా inflammation ని తగ్గిస్తాయి. వీటిని మామూలుగానూ, వండించి గానూ తినవచ్చు.

చివరి మాట: మీరు పైన చెప్పిన ఆహారపదార్ధాలు అన్నీ తినవలసిన అవుసరం లేదు. మీరు పైన చెప్పిన వాటిని, ఎప్పుడూ తినక పోతే, ముందు కొద్ది కొద్దిగా తినటం ప్రారంభించండి. మీకు సరిపోక పోతే వాటిని మార్చి ఇంకొకటి తినండి. తరువాతి  పోస్ట్  foods to avoid.

Tuesday, October 19, 2010

31 ఓ బుల్లి కథ 19 -- కీళ్ళు,మోకాళ్లను జాగర్తగా ఉంచుకోండి 1 --

ముందుమాట: Bottom Line వారు Dr. Harris McIIwain, MD, Certified specialist in rheumatology and geriatric medicine who practices with the Tampa Medical Group in Florida గారితో చేసిన సంభాషణను తెలుగు లో నాలుగు  పోస్టులలో మీకు అందిస్తున్నాను.
దీనికి కారణం మన ఇళ్ళల్లో జాయింట్ పైన్స్ తో బాధ పడేవారు ఎక్కువగా ఉండటం. వారు వయసులో పెద్దవారు అవటం. పెద్దవయసులో ఇవి మామూలే అని నిరాశగా బాధ పడుతూ ఉండటం చూడలేక.

From: Keep Joints Feeling Young! by Dr. Harris McIIwain, MD coauthor of Pain-Free Arthritis - A 7-step program for feeling Better Again (Owl)

నా rheumatology practice లో నొప్పులతో బాధపడుతూ డాక్టర్ల చుట్టూతా తిరిగినా ఉపశమనము కలుగక నా దగ్గరకి వచ్చిన వారికి నేను ఎక్కువగా చెప్పేది వారి ఆహారము తిను పద్ధతిని మార్చమని. నా నొప్పులు తగ్గే ఆహారపు క్రమమును పాటిస్తే కొన్ని వారాలలోనే ఫలితం కనిపిస్తుంది. దీని మూలంగా నొప్పికి వేసుకునే మందులను తగ్గించవచ్చు.  కీళ్ళ నొప్పులు అన్నిటిలోనూ (rheumatoid arthritis మరియు Osteoarthritis తో సహా) inflammation తగ్గి నొప్పి మరియు stiffness తగ్గుట గమనించ గలరు. 

పని చేసే విధానము: ఈ నొప్పుల బాధ నుండి బయట పడేట్టు చేసే ఆహార పద్ధతి లో మీరు నొప్పులను తగ్గించి మన immune system ను పెంచే ఆహారముల గురించి తెలుసుకుంటారు. అలాగే మీకు inflammation పెంచి నొప్పులను తెప్పించే ఆహారముల గురించి కూడా తెలుసుకుంటారు. ఈ diet program మూలముగ  మీ బరువు ఆరోగ్య కరముగా ఉండి కీళ్ళ మీద భారము తగ్గి జీర్ణ శక్తి పెరిగి మీ నెప్పుల బాధలు తగ్గు ముఖము పట్టును. మీకు కొన్ని మంచి nutritional suppliments గురించి కూడా చెబుతాను.

మీరు ఆరోగ్య కరమయిన సరియిన బరువు కలిగి ఉండాలంటే మీరు తరచుగా చిన్న చిన్న meals తీసుకొనుట మంచిది. రోజుకు మూడు పెద్ద meals కన్న రోజుకి ఆరు చిన్న meals తీసుకోండి.  మూడు 300 కాలోరీస్ ముఖ్య meals తో పాటు, మూడు 150 లేక  200 కాలోరీస్ తో చిన్న చిన్న స్నాక్స్ మధ్యలో తీసుకోండి.

చివరిమాట:  తరువాత పోస్ట్ foods that heal.

Sunday, October 10, 2010

30 ఓ బుల్లి కథ 18-- అబ్బా, నా మోకాళ్ళ నెప్పులు! --

ముందు మాట: ప్రతీ ఇంట్లోనూ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారు. వారి కోసం మరియు  అవి త్వరగా రాకుండా ఉండటానికి జాగర్తల కోసం ఈ పోస్ట్. దీని మాతృక Sept, 12, 2010 PARADE StayHealthy Column లో Oh, My Aching Knees! by Elizabeth Goodman. దీనికి నా తెలుగు లో స్వేచ్చ అనువాదం.

ప్రతీ సంవత్సరం అమెరికాలో దాదాపు 19 మిలియన్ మంది కాళ్ళ నొప్పుల బాధ తో orthopedic surgeons దగ్గరకు వెళ్తారు. మన బరువుని మోసే ఆ మోకాళ్ళు మనలని పెద్ద వయసుతో చాలా బాధలకు గురి చేస్తుంది. దీనిలో ముఖ్యమయినది  osteoarthritis - మనకి చాలా బాధ కలిగించే ఈ సమస్య మొకాలిలో రెండు ఎముకల మధ్య ఉండే cartilage పోవటం మూలాన ఎముకలు ఒకదాని కొకటి రాచు కొని వచ్చే బాధ.  ఈ బాధ పడేవారు అమెరికాలో 10 మిలియన్ మంది కన్న ఎక్కువ ఉన్నారు. జీవితం లో తప్పకుండా ఇద్దరు మనుషుల్లో ఒక మనిషికి ఈ వ్యాధి వస్తుంది అని చేప్పచ్చు. శుభవార్త : ప్రపంచములో చాలామంది శాస్త్ర వేత్తలు ఈ వ్యాధి మీద పని చేయటము మూలముగా కొత్త సంగతులు రోజు రోజు కీ తెలుస్తున్నాయి, ఏ విధం గా మన బాధని తగ్గించు కొవచ్చో, రాకుండా చూసుకోవచ్చో, రాకుండా కొన్ని రోజులు ఆపవచ్చో, వస్తే చిన్నగా వచ్చేటట్లు చూడటం ఎల్లాగో ఇవన్నీ పరిశీలన లో ఉన్నాయి. మీరు తప్పకుండా ఈ క్రింది జాగర్తలు తీసు కోండి.

1) మీరు ఆరోగ్య కరమయిన బరువు ఉండేటట్లు చూసుకోండి.
జాతీయ సర్వే ప్రకారం సరియిన బరువులో ఉన్న అమ్మల కన్న, స్థ్తూలకాయులయిన అమ్మల మోకాళ్ళకి osteoarthritis రావటం నాలుగు రెట్లు ఎక్కువ. స్థ్తూలకాయులయిన అయ్యలకయితే  ఇది అయిదు రెట్లు ఎక్కువ. మీరు మీ మోకాళ్ళకి ఉపశమనం కలిపించాలంటే పది పౌన్లు తగ్గినా ఉపశమనం కనిపిస్తుంది, లేక ఈ వ్యాధి వచ్చే చాన్సు తగ్గుతుంది.
(నా మాట: మన బరువంతా మోకాళ్ళు భరిస్తున్నాయి కదా అందుకని బరువు తగ్గితే ఉపశమనం కనిపిస్తుంది)

2) మీ కండరాల్ని బలంగా ఉంచుకోండి.
ఈమధ్య university of Iowa Hospitals and Clinics చెసిన స్టడీ లో అమ్మలకి quadriceps( ముందరి తొడ కండరాలు) గట్టిగా ఆరోగ్యముగా ఉంటే ఈ వ్యాధి రావటం తక్కువ. మీరు ఈ quads ని build up చేసుకోవాలంటే low-impact exercises చెయ్యటం మొదలు పెట్టండి. అవి leg raises, wall sits, squats.

3) నడుస్తూ ఉండండి.
మోకాళ్ళ కదలిక(mobility) లేక కూడా ఈ బాధ రావచ్చు. మీరు నడిచే టప్పుడూ పరిగేత్తేటప్పుడూ వంగితే బాధగా ఉంటే, మీ మోకాలు kneecap మీద చిన్న స్థలం లో ఎక్కువ భారం వేస్తున్నారన్నమాట. మీరు రెగ్యులర్ గ యోగా చెయ్యటం లేక tai chi చెయ్యటం మొదలెడితే మీరు ఎక్కువ దూరం నడవ కలుగుతారు. ఇంకో మార్గానికి  డాక్టర్ David Teucher, orthopedic surgeon in Beamont, Tex ఏమన్నారంటే రోజుకి పది నిమిషాలు streaching మీ రోజూ వారీ exercises తో  చెయ్య మన్నారు.

4) మోకాళ్ళకి అనువయిన పాద రక్షలను వాడండి.  
Clogs మరియు  stiff -soled walking shoes సుఖముగా ఉన్నప్పటికీ అవి మీ మోకాళ్ళ మీద 15%  ఎక్కువ భారం మోపుతాయి flip -flops, sneakers with flexible soles కంటే. ఇది Rush Medical center, చికాగో వాళ్ళు కనిపెట్టిన విశేషం. అల్లాగే హై హీల్స్ కూడా మోకాళ్ళ మీద ఎక్కువ భారం మోపుతాయి.

చివరి మాట: మన దేహము లోని ఏ అవయవాలయినా మనము సరీగ్గా ఉపయోగించక పోతే అవి మన చేతుల్లోనుండి జారి పోతయ్యి. వాటికి "if you do not use it you loose it" వర్తిస్తుంది.

కీళ్ళ నొప్పుల మీద నా పోస్టులు:

1. 30 ఓ బుల్లి కథ 18-- అబ్బా, నా మోకాళ్ళ నెప్పులు!

2. 31 ఓ బుల్లి కథ 19 -- కీళ్ళు,మోకాళ్లను జాగర్తగా ఉంచుకోండి

3. 32 ఓ బుల్లి కథ 20 -- కీళ్ళు నొప్పులకు మందు మంచి ఆహారం

4. 33 ఓ బుల్లి కథ 21-- కీళ్ళ నొప్పులతో ఆహారం జాగ్రత్తలు

5. 34 ఓ బుల్లి కథ 22-- కీళ్ళ నొప్పులను తగ్గించే ఆహారం సప్ప్లిమెంట్లు

6. 89 ఓ బుల్లి కథ 77 --- ఆరోగ్యానికి మార్గం మెరపకాయ కారం

Monday, September 20, 2010

29 ఓ బుల్లి కథ 17-- మీరు గొప్పవాళ్ళు అవుతారా ? --

ముందు మాట: నేను చెప్పే రెండు ఉదాంతాలు ( కేసులు) పరిశీలించి మీలో/నాలో గొప్ప వాళ్ళ లక్షణాలు ఉన్నయ్యో లేదో తేల్చండి.


నా మొదటి తార్కాణం:
గుడ్ ఇయర్ "inventor  " అని పేరు పెట్టుకుని ఇంట్లో ఉంటాడు. ఇంట్లోపనులు అవీ చేస్తూ కొత్త వాటిని కని పెట్టటం కోసం పగళ్ళు రాత్రులు కష్టపడుతూ ఉంటాడు.  ఆయన చేద్దామనుకున్నది, రబ్బరు ని గట్టి పరచటం. దానికి ఒక బున్సెన్ బుర్నేర్ మీద రబ్బరు తో కనపడిన పదార్ధాలు అన్నీ కలిపి ఏమి జరుగు తుందో చూస్తూ ఉండేవాడు. కనపడిన వాటన్నిటి తోటీ ఎన్ని సార్లు  ప్రయత్నించినా ఫలితం కనిపించటల్లేదు. పాపం కొత్త సంగతులు కనుక్కోటం రోజూ జరిగే పని కాదుగదా, అందుకని కొత్త ideas కోసం అలా నిసీధం లోకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన గారి భార్య ఉద్యోగం చేసి సంసారం నడుపుతూ ఉంటుంది. భర్త గారు మాటా పలుకూ లేకుండా అలా చూస్తూ కూర్చోటం ఆవిడకి నచ్చ లేదు. కనీసం తనతోడి మాట్లాడటం కూడా లేదాయె. ఆవిడకి వళ్ళు మండింది. సంసారం గడిచేది తన మూలాన. ఆయన పరికరాలు అన్నీ ఒక డ్రాయర్ లో పడవేసి, ఇంక నుండీ నీ పరిశోధనలు లాభం లేదు ఎంతకీ తెగే టట్లు కనపడ లేదు, నేను ఈ సంసారం ఈదలేను, ఉద్యోగం చూసుకోమంది.

ఉద్యోగం రావాలంటే వెంటనే ఎక్కడ వస్తుంది, అందులో ఉద్యోగం చెయ్యటం ఇష్టములేని వాళ్లకి. ఆవిడ ఉద్యోగానికి వెళ్ళిన తరువాత  డ్రాయర్ తీసి తన పరిశోధనలు ప్రారంభించే వాడు. ఒక రోజున బయటకు వెళ్ళిన ఆవిడ హటాత్తుగా తిరిగి వచ్చింది. వచ్చిందని గ్రహించి తన పరిశోధన సామగ్రిని డ్రాయర్ లో తోసి మూసేసాడు. మర్నాడు ఆవిడ పనికి వెళ్ళిన తరువాత తీసి చూస్తే రబ్బరు గడ్డకట్టి ఉంది. ఇంక నేను చెప్పక్కరలేదు. ప్రయోగం ఫలించింది. చాలా గొప్ప వాడయ్యాడు. మీరు చూస్తున్నారు కదా గుడ్ ఇయర్ టైర్లు.

నా రెండోవ తార్కాణం:
చాలా గొప్ప వేదాంతి అనబడే సోక్రటీస్ ఒక రోజు తన శిష్యులతో కూడి ఇంట్లో భోజనం చేస్తున్నాడు. చెప్పకుండా జనాన్ని భోజనానికి తీసుకు వచ్చాడని ఆయన భార్య గారికి చాలా మంటగా ఉంది. కోపము దిగమింగుకుని వడ్డిస్తోంది. చారు వేడి సరీగ్గా లేదు అని అన్నాడు సోక్రటీస్ గారు. అంతే ఆవిడ లోపలున్న కోపాన్ని పట్టలేక, ఆ గిన్నెడు చారుని ఆయన నెత్తిన  పోసింది.

ఇంక నా కేసు:
రిటైరయ్యి ఇంట్లో ఉంటూ నేనూ Good Year గారి లాగా బ్లాగ్స్ వ్రాస్తూ ఉంటాను, మా ఆవిడ పనికి వెళ్తుంది. నిన్న వేడి వేడి కాఫీ నా మీద వలకటం జరిగింది సోక్రటీస్ గారికి జరిగినట్లు.

చివరి మాట: నే నెప్పుడు గొప్పవాణ్ణి అవుతానో  !

Thursday, September 16, 2010

28. ఓ బుల్లి కథ 16 -- వరండా లో బల్ల ఎత్తుకు పోయారు --

మామయ్య గారింట్లో వరండాలో బల్ల ఎత్తుకు పోయారు అని వినం గానే నాకు చాలా బాధ వేసింది. ఆ బల్ల మీద కూర్చొని ఎంతమందికో చదువులు చెప్పారు మా మామయ్య గారు, వాళ్ళ పిల్లలు, అప్పుడప్పుడూ నేను. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంతమందో ఆ వరండాలో కూర్చొని హోం వర్క్ లు చేశారు, తెలియనివి చెప్పించు కున్నారు. బాగా చదువుకునే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. పనికి  పంపిస్తే ఇంట్లోకి చేదోడు వాదోడుగా ఉంటాడు అనే మాటని అడ్డుకుని, భోజనం పెట్టి, పనిమనిషి కొడుక్కి చదువు చెప్పారు. ఇప్పుడు అతను సబ్ ఇనస్పెక్టరు అయ్యాడుట.


నాకు మా మామయ్య గారంటే ఎందుకు ఆత్మీయత పెరిగిందో అర్ధం కాదు. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. మా నాన్న గారు, సీనయ్య, అంటే ఆయనకి చాలా ఇష్టం అని నాకు బాగా తెలుసు. బహుశా వారిద్దరూ దాదాపు ఒకటే వయస్సు అయి ఉండవచ్చు. అందుకని నేనంటే ఆయనకీ ఇష్టమేమో. 


మొదట్లో తెనాలిలో వాళ్ళింటికి పిల్లలం వెళ్ళేవాళ్ళం కాదు. వెళ్ళినా బయట బల్ల మీద కూర్చునో, పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆడో, మా వూరు కట్టేవరం సాయంత్రానికి జేరుకునే వాళ్ళం. ఒకసారి అత్తయ్య "కృష్ణా నీ అత్తయ్య నే  కదా ఎందుకు ఇక్కడ ఉండవు?" అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది . మేము అక్కడ ఉండక పోటానికి అసలు కారణం,  వాళ్ళింట్లో బయట బట్టలు కలపరు. బయటనుంచి వచ్చిన వాళ్ళు ఎవరయినాసరే వాళ్ళిచ్చిన ఉతికిన బట్టలు కట్టుకుని ఇంట్లోకి రావాలిసిందే. అప్పటినుండీ శలవలకి రేపల్లె నుండి వచ్చినప్పుడల్లా అత్తయ్య గారింట్లో  రెండు రోజులుండే వాణ్ని. అత్తయ్య దోసకాయ పప్పు అంటే నాకు చాలా ఇష్టం.


మామయ్య గారు అప్పుడప్పుడూ గమ్మత్తు గా మాట్లాడు తారు. నా చిన్నప్పుడు తెనాలి నుండి రేపల్లె వెళ్ళే ట్రైన్ ఎక్కించటానికి స్టేషన్ కి వచ్చారు. ట్రైను కదల బోతోంది. "కృష్ణా నీ రెండు రూపాయలు నీకు ఇచ్చేశాను. అవునా " అన్నారు. నేను వెంటనే ఇచ్చేశారండీ అన్నాను. ఆయనదగ్గర చిల్లర లేక పోతే నేను రెండు రూపాయలు ఇచ్చాను. తరువాత తిరిగి ఇచ్చేశారు. నాకు ఎందుకు అలా అన్నారో అర్ధం గాక మా నాన్నగారిని అడిగాను.


టూకీగా మా నాన్నగారు చెప్పినది ఇది, ఒకప్పుడు మా మామయ్య గారి ఇంట్లో ఏ గూట్లో చెయ్యి పెట్టినా రూపాయ నాణాలు ఉండేవిట. కొద్దిగా మీరు  డెబ్బై ఏళ్ళ క్రిందట పరిస్థుతులు గమనించాలి. ---- పల్లెటూళ్ళు, పెంకుటిళ్ళు, మట్టి గోడలు, ఇనప పెట్టెలు, గూళ్ళు.---- అప్పటి ఉన్నవాళ్ళ ఇళ్ళు అలా ఉండేవి. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తరువాత, విడిపోయిన అన్నలు,  నాన్నగారికి అప్పిచ్చామని చాలా ఆస్తి తీసుకున్నారు. తరువాత  ఆయనకి వచ్చిన డబ్బుల్లో బంధువులకి వ్యవసాయానికి అప్పిచ్చారు. ఆ సంవత్సరం పంటలు పండక కరువుతో ఉంటే ప్రభుత్వము రైతుల అప్పును మాఫీ చేసింది. అంతే బంధువులయినా ఈయన డబ్బులు వారు తిరిగి ఇవ్వాలేదు. ప్రభుత్వం అప్పులని మాఫీ చేస్తే మునిగి పోయేవాళ్ళు అప్పిచ్చిన వాళ్ళు. ప్రభుత్వం ఎంతమందిని ఇలా దివాలా తీయించిన్దో. 


అప్పటి నుండీ ఆయనకి అప్పులు ఇవ్వటం తీసుకోవటం అంటే భయం. చివరికి ఉన్న చదువుతో  ట్రైనింగ్ తీసుకుని బ్రతక లేక బడి పంతులు అయ్యారు. పల్లెటూరు నుండి తెనాలి వచ్చారు. నాకు ఇంకో సంగతి కూడా చెప్పారు ఆయన్ని గురించి. చిన్నప్పుడు ఆయన స్లీప్ వాకింగ్  చేసేవారుట. ఇంట్లో వాళ్ళ ఉపాయం, ఆయన పిలకని నులకమంచానికి కట్టేవారుట. కొంత కాలానికి స్లీప్ వాకింగ్ పోయిందిట.


ఇప్పటికీ తలుచుకున్నప్పుడల్లా బాధ పడుతూ ఉంటాను. ఇంటి చుట్టూతా తడికల గోడ కన్నా, ప్రహరీ గోడ ఉంటే బల్లని ఎవరూ తీసుకు పోయే వారు కాదేమో అని. పిల్లలందరూ ఎవరికి వారు రెక్కలొచ్చి వెళ్లి పోయారు. బల్ల పోయింది. ఆ తరువాత మా అత్తయ్య పోయింది. చివరికి ఆయనా పోయారు. 


నా కెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, మన ప్రభుత్వం పంతుల గార్లని ప్రోత్సహించి,  ఒక్కొక్క పంతులు గారు కనీసం ఒక్కొక్క పనిమనిషి పిల్లలకి చదువు చెప్పి పైకి తీసుకు వచ్చేటట్లు చేస్తే, మనదేశం ఎల్లా ఉండేదో!. 

Sunday, September 12, 2010

27. ఓ బుల్లి కథ 15 -- అశోక, కౌటిల్య-- వీళ్ళు మనవాళ్ళే -- అనుబంధం --

ముందుమాట: నా క్రిందటి పోస్ట్ లో Bruce Rich గారి "To uphold the World" అనే పుస్తకము గురించి వ్రాశాను. పుస్తకము అశోక,  కౌటిల్యుల  రాజనీతి, ఆర్ధికశాస్త్ర సూత్రాలు, ఈ ఇరువది ఒక శతాబ్దము లో ఎంతచక్కగా పనికోస్తయ్యి అనే అంశము మీద.  పుస్తకము లోని విశేషాల గురించి వ్రాయలేదు. దానికి కారణము ఉన్నది.
నాకు రాజరికము అనే దాని మీద పెద్ద పరిచయము లేదు. నా పేరు లో రాజు ఉన్నాడని, భార్యా పిల్లల మీద రాజరికము చూపెడుదామంటే  ఎప్పుడూ ఫలించ లేదు.
అర్ధశాస్త్రములో నా పరిజ్ఞానము  అంతంత మాత్రమే. వచ్చే డబ్బులతో, అప్పులు చేయకుండా, సరిపెట్టుకుంటూ జీవించటము మాత్రమే తెలుసు. అది కూడా మా నాన్నగారి బోధన.

పెబ్బరాజు వారి కోరిక ప్రక్కరం ఈ క్రింద పుస్తక పరిచయం లింక్ ఇస్తున్నాను. ఏ కారణము వలన అయినా మీకు ఆ లింక్ రాకపోతే  దాని కింద లింక్ ను కాపీ చేసి ప్రయత్నించండి. రచయిత వివరాలు, పుస్తక వివరాలు గూగులమ్మ నడిగినా చెబుతుంది. amazon లో పుస్తకము దొరుకుతుంది. పుస్తక పరిచయం

http://www.indiatribune.com/index.php?option=com_content&view=article&id=3766:us-attorney-reiterates-relevance-of-ashoka-kautilya-to-21st-century&catid=25:community&Itemid=457

చివరిమాట: మూడు రోజుల పండగలు, వినాయక చవితి, రంజాన్, విశ్రాంతి తో చక్కగా గడిపారని తలుస్తూ విఘ్నాలు దాటి మీ జీవితం ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను.

Friday, September 10, 2010

27. ఓ బుల్లి కథ 15 -- అశోక, కౌటిల్య-- వీళ్ళు మనవాళ్ళే --

ముందు మాట: నా కెందుకో ఇవ్వాళ  చాలా గర్వంగా ఉంది. వందల సంవత్సరాల క్రిందట రాజరికం లో మనము వాడిన పద్ధతులు, ఆచారాలు, అర్ధశాస్త్రపు నీతులు,  ఈ కాలం లో గూడా పనికొస్తా యంటే, నా పూర్వీకుల తెలివితేటలకు నాకు చాలా గర్వంగా ఉంది.

US attorney reiterates relevance of Ashoka, Kautilya to 21st Century    by Ajay Ghosh(New York)
(పుస్తక పరిచయం --  సెప్టెంబర్ 11, 2010 India Tribune లో వ్యాసం)

నేను ఆ వ్యాసాన్ని తెలుగులో అనువదించే ప్రయత్నము చేయటల్లేదు కానీ ఆ పుస్తకము గురించి క్రింద ఇస్తున్నాను.



To Uphold The World  ( A call for a New Global Ethic from Ancient India)    
by  Bruce Rich   

Forward by:             Noble Laureate Economist Amartya Sen
Afterword by:          His Holiness the Dalai Lama
Published by:           Beacon Press, April, 2010

చివరి మాట: ఎవరేమనుకున్నా మన భారతావనికి ప్రపంచాన్ని తీర్చి దిద్దే సంస్కృతులు ఉన్నాయి. మనము ఏళ్ళ క్రిందే వాటిని కనుగొన్నాము.  కాకపోతే ఇంకొకళ్ళు వచ్చి వాటి గురించి మనకు గుర్తు చేస్తే తప్ప మనకు తెలియవు.

Sunday, August 29, 2010

26. ఓ బుల్లి కథ 14 -- మీరేమంటారు --

ముందు మాట: ఆగస్టు 25, 2010 న చికాగో ట్రిబ్యూన్ లో  Ask Amy  అనే కాలమ్ లో అడిగిన ప్రశ్న దానికి సమాధానం తెలుగు లో వ్రాస్తున్నాను. ఇది నన్ను ఆకర్షించడానికి కారణం, అమెరికా లో సాధారణ ప్రజల  మనస్తత్వం ఎటువంటిదో చెబుతుంది. 


డియర్ ఎమీ: ఈ మధ్య నేను temporary job లో పనిచెయ్యటం మొదలెట్టాను. నా కంటే బాగా పెద్ద ఆయన గూడా అక్కడ పనిచేస్తున్నారు. కాకపోతే ఆయనది పర్మేనేంట్  పొజిషను. ఆయన చాలా స్నేహముగా ఉంటారు కాని కొంచం తలతిక్క. ఆయన ఈమధ్య నన్ను ఒక షాప్ కు వెళ్ళి కొన్ని తినే పదార్దములు కొనుక్కు రమ్మన్నారు. దానికి ఆయన డబ్బులిస్తానని చెప్పినారు. అల్లాగే నా మధ్యాహ్నపు భోజనం పంచు కుందామని కూడా అన్నారు. నేను వీటన్నిటికీ వప్పుకుని చేశాను.
క్రిందటి వారము నాలాంటి temporary ఇంకొకళ్ళు ఈయనకి భోజనము తీసుకు వస్తుంటే చూశాను. నా ఉద్దేశం లో ఆయనకి శక్తి లేక షాపు దాకా నడచి వెళ్ళటము కష్టముగా ఉన్నటుల కనిపిస్తోంది. ఆయనకి ఆదుకునే దిక్కు కూడా లేనట్లు ఉన్నది.
ఈ పరిస్థితి నాకు కొంచెము బాధాకరముగా ఉన్నది, ప్రతీ వారం ఆయనకోసం బయటకు వెళ్ళి తీసుకు రావాలంటే నాకు కొంచెము కష్టమవుతుంది. దానికి తోడు ఈ విధముగా ఆయన నామీద ఆధార పడి ఉండటం ఆయన కష్టాలకు శాశ్వత పరిష్కారము కాదు.  


ఆయన రొజూ పనిచెబితే నేను ఏమి చేసేది.  మీరు నాకు ఏమి సలహా ఇస్తారు ?.
మన ఈ సంఘము లో వృద్ధులను సంరక్షించుటలో  మన కర్తవ్యములేమిటి?


ఇట్లు, చిన్నపనుల రన్నర్




డియర్ రన్నర్: మీ బాధ నాకు అర్ధమవు తున్నది, ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి కానీ ఎంత కాలం. మీరు కొంతకాలం ఈ విధముగా కొనసాగించండి. వారానికి రెండు రోజులు మీరు తెస్తానని చెప్పండి. మీ లాగే మిగతా వాళ్ళు కూడా పని పంచు కునే ప్రయత్నం చేయండి. కానీ సహాయము చేయటం మాన కండి.
మీ పెద్దవాళ్ళను  (grandparents )  గుర్తుకు తెచ్చుకోండి, వారికి కూడా ఈ విధముగానే చిన్నపనులు పెద్దపనులు,  స్నేహితులో, పక్కిన్టివాళ్ళో , దారే పోయేవాళ్ళో ఎవరో అవసరము అయినప్పుడు సహాయము చేస్తూనే ఉంటారు.
చాలా మంది వృద్ధులు భోజనానికి ఇబ్బంది పడుతూ వుంటారు -- మీ ఆఫీసులో స్నేహితుని లాగా, బయటకు వెళ్ళటానికి వీలు లేక,
 సత్తువ లేక. 
మీ ఊళ్ళో ఉన్న "office on aging " ని కనుక్కుంటే వాళ్ళు మీ స్నేహితుని జీవితం కొంచెము సులువయ్యేట్లు చూడ గలుగుతారు. 
సమస్యని పరిష్కరించటానికి ప్రయత్నించి నందుకు ధన్యవాదములు. 


చివరిమాట: మీరేమంటారు ?


మీరు US లో ఉంటే సీనియర్స్ కి సహాయము చెయ్యటానికి State, County, Township and city లెవెల్ లో చాలా సంస్థలు ఉన్నాయి. మీకు నిస్సహాయతతో ఎవరన్నా కనపడితే దయచేసి ఆ సంస్థల తోటి కలపండి. సీనియర్ సర్వీసెస్ అని గూగుల్ చేస్తే నంబర్లు దొరుకుతాయి. ఉదా: Naperville Township కి 'Dial A Ride' ప్రోగ్రాం ఉంది. అల్లాగే 'Meals on Wheels' ప్రోగ్రాం. 'Food Pantry' ప్రోగ్రాం.

Tuesday, August 10, 2010

25. ఓ బుల్లి కథ 13 -- జీవిత చక్రం --

ముందు మాట: ఈ కథకి మూలము హిందూ టెంపుల్ లో వాలంటీర్ గ చేయునప్పుడు తీరిక సమయములో చదివిన ఒక కథ. గుడి లో చదువుటచే  ఏదో వేదాంత  పుస్తకములోనిది అయి ఉండవచ్చును.  ఇందులో (నాకు గుర్తు లేక) పాత్రల పేర్లు, కొంత కథా కల్పితాలు. కానీ భావము మాత్రము మార్చలేదు. 

ధనుంజయుడికి జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా వెళ్ళిపోవుచుండెను. చేతులారా డబ్బులు సంపాయించు చుండెను.   ఎవ్వరూ తనకి ఉచితముగా ఇచ్చినవి కావు. ఈ మేడలు ఈ మిద్దెలు ఇవన్నీ తన తెలివితేటలతో, తన స్వశక్తి తో, తన ఊహా సంపత్తు తో, కష్టపడి పనిచేయుట వలన వచ్చినవి కనుక తను ఇంకొకళ్ళకి ఉచితముగా దాన ధర్మాలు చెయ్యవలసిన అవుసరము లేదు అని నిర్ణయించు కొనెను. తన తెలివితేటలు ఊహాసంపత్తీ ఎటుల తనకు వచ్చెనో గుర్తించలేక పోయెను. బాలప్రాయమునుండీ సాకిన తలి దండ్రులు, బంధువులు,తనతో ఆటలాడిన మిత్రులు, చదువులు నేర్పిన అధ్యాపకులు, తనకు సౌకర్యములు ఇచ్చుచున్న భార్యా పిల్లలు, వీరెవరు తనకు కానరాలేదు.  

వయసు పెరిగిన కొలదీ తను సంపాయించు  ధనమూ దానితో సంఘము లో గౌరవము పెరుగుతూ వచ్చెను. తనమీద తన తెలివితేటలమీద తనకి పెద్ద నమ్మకము గర్వమూ పెరిగెను. ఇంటిలోనూ బయట ఒకటే పద్ధతి లో ఆలోచన. నా అంత తెలివితేటల వాళ్ళు మీరు కాదు. నేను చెప్పినదే వేదము కనక  మీరు నేను చెప్పినపని చేయవలయును. భార్యా పిల్లలకు, సేవకులకు అందరికీ యజమాని అనిన భయము. 

కాలక్రమేణా పిల్లలు వారి త్రోవన వాళ్ళు వెళ్ళి పోయిరి. భార్య పరమపదించెను. ఒంటరి వాడయ్యెను.  పెద్ద ఇంటిలో  ఉండుట ఖర్చు పని అని ఒక చిన్న ఇంటిలోనికి మారి తన మాటలను శిరసావహించు ఒక సేవకుని మాత్రమే ఉంచుకొనెను. ఆ సేవకుడికి అయ్యగారు చెప్పు పనులన్నియు చేయుట కష్టముగా ఉండెను. పది పనులు చెప్పి అన్నియు అప్పుడే కావలయుననిన జరగని పని. ఆ సేవకుడు కూడా అన్నిటిలోనూ నిష్ణాతుడు కాకపోవటముచే తప్పులు చేయు చుండెను. దానితో యజమానికి కోపము వచ్చుచుండెను. తన ఒక్కడి కొరకు పదిమంది సేవకులను పెట్టుకొనుట ఇష్టము లేదు.ఈ సేవకుని మాన్పించి ఇంకొక సేవకుని పెట్టుకొనుటకు మనసొప్పుట లేదు. కొత్త వానికి మరల తనకు కావలసినవిధముగ పనులు నేర్పుట కష్టము కదా. 

ఒకరోజున మితిమీరిన కోపము వచ్చుటచే సేవకుని పిలిచి చెక్కమీద "I am an Idiot"  అను బోర్డు చేక్కించుకు రమ్మని పంపెను. బోర్డు తెచ్చిన వెంటనే దానికి రెండు వేపుల తాడు కట్టి హారముగా మెడలో వేసుకొనమని చెప్పెను. రోజూ పనికి వచ్చినప్పటి నుండీ వెళ్ళు దాకా ఆ హారమును వేసుకొని పనిచేయు మని చెప్పెను. దీనివలన తన పని సవ్యముగ జరగని యడల తన మనస్థాపము తగ్గునని భావించెను.  

ఈ విధముగా యజమాని సేవకుడు రోజులు గడుపు చుంటిరి. హఠాటాత్తుగా ఒక రోజున యజమాని అస్వస్థకు లోనుకాగా తన కాళ్ళు స్వాధీనము తప్పెను. ఎంత మందికి  చూపిననూ పరిస్థితి మెరుగు పడలేదు. కాల కృత్యములకు కూడా సేవకుని సహాయము కావలసి వచ్చెను. సేవకుడు కూడా నమ్రతగా రోజూ తన హారము వేసుకుని పని చేయు చుండెను. 

యజమానికి ఒక రోజు పట్టరాని కోపము వచ్చి సేవకుని, హారము లోని పదములు చదవ మనెను. సేవకునికి చదువు రాక పోవుటచే తను చదివి దాని అర్ధము చెప్పెను. వెంటనే సేవకుడు తన హారమును తీసి యజమాని మెడలో వేసెను. సేవకుడు తను ఇంక పనిచేయనని వెళ్ళి పోవుచుండగా జీతము రెట్టింపు చేసి తన దగ్గరే ఉండమని బతిమాలెను. రోజూ సేవకుడు వచ్చి హారమును యజమాని మెడలో వేసి తను వెళ్లి పోవు చున్నపుడు తీసివేయుచు యజమాని చనిపోవు వరకూ పనిచేసేను.

 చివరిమాట: జీవిత కాల చక్రములో బండ్లు ఓడలూ ఓడలు బండ్లు గా మారవచ్చును. అందువలన జీవన విధానము లో మానవత్వము చూపక జీవించిన, అనువుగాని సమయమున భంగపాటు తో జీవించ వలసి వచ్చును.   

Tuesday, August 3, 2010

24. ఓ బుల్లి కథ 12 -- లాండ్రోమేట్లో కుస్తీ --

ముందు మాట: లాండ్రోమేట్ అంటే తెలుగులో చెప్పాలంటే  సామూహిక బట్టలుతికే చోటు అని చెప్పొచ్చు లేకపోతే చాకిరేవు అని కూడా అనవచ్చు. 
ఈ క్రింది సంభాషణలు అమెరికాలో ప్రతీ ఇంటిలో ఎప్పుడో  ఒకప్పుడు రాక మానవు (చాకలి మెషీన్లు  ఉన్నా లేకపోయినా ).


" విడిచిన బట్టలు చాలా ఉన్నాయి."
"మన వాషింగ్ మెషీన్ పనిచెయ్యక  పోతే  నైకోర్ వాణ్ని పిలు." బాగు చెయ్యటానికి కాంట్రాక్ట్ తీసుకున్నాను. పిలిస్తే వచ్చి బాగు చేస్తాడు.
"కుదరక వాషింగ్ చెయ్యలేదు. ఒక రోజంతా పట్టేటట్లా ఉంది,  వాషింగ్ కి  drying కి. లాండ్రోమేట్ కి వెళ్తే ఒక గంటలో అవుతుంది"


ఒకప్పుడు అంటే ఇరవై ఏళ్ళ క్రిందట వరకూ రెండు వారాల కొకసారి వెళ్లి బట్టలు ఉతుక్కుని  వచ్చేవాళ్ళం. ఆ రోజు స్పెషల్,  వాషింగ్ అయిన తరువాత అటునుంచి అటే  రెస్టారెంట్ కి  వెళ్లి బ్రేక్ ఫాస్ట్  చేసేవాళ్ళము. ఫామిలీతోటి ఎక్కువసేపు గడపచ్చని,   కావాలని ఇంట్లో చాకలి మేషీనులు కొనలేదు.  తరువాత ఇంటావిడా పిల్లలు నా మీద తిరగపడటం తోటి ఉతుక్కోవటం ఇంట్లోనే పెట్టుకున్నాము. పాత రోజులు గుర్తుకు వస్తే కొంచం బాధగా ఉంటుంది.


"సరే రేపు పొద్దున్న ఎనిమిది గంటలకు  వెళ్దాము "
"మనింటి దగ్గర లాండ్రోమేట్ మూసేశారు. క్రిందటి సంవత్సరం మీరు వెళ్ళిన చోటుకి వెళ్దాము." క్రిందటిసంవత్సరం మా డ్రయర్ పాడయితే తడి గుడ్డ లన్నీ మోసుకెళ్ళి ఆరబెట్టుకు వచ్చాను.


మర్నాడు చాకలి మూటలు కట్టుకుని కారు లో బయల్దేరాము చాకలి రేవు(లాండ్రోమేట్) కి. బట్టల మూటలు,  ఆవిడని చాకిరేవు ఎదురుకుండా దించి కారు పార్క్ చెయ్య టానికి వెళ్ళాను.వచ్చి చూసేసరికి మెషిన్ లో బట్టలు వేస్తోంది. రుద్రం మోహము లో కనపడుతోంది. మీరు గమనించారో లేదో ప్రళయం ముందు చాలా ప్రశాంతము గా ఉంటుంది. ఒక గంటసేపు నాకు కోపము తెప్పించవోకు నాయనా,  నన్ను నలుగురిలో నవ్వులపాలు చెయ్యకు తండ్రీ అని ప్రార్ధిస్తూ నాకొచ్చిన  మంత్రాలన్నీ చదివేశాను.  


"పార్కింగ్ కి ఇంతసేపు ఎందుకు అయ్యింది?"
"కారు సూర్యుడి ఎదురు లేకుండా  పార్కు చేశాను అందుకు ఆలశ్యమయ్యింది"
"ఇక్కడ డబ్బులు తీసుకోరట నాకెందుకు చెప్పలేదు" ఎదురు కుండా ఎటియం కార్డు లాంటిది కనపడు తోంది.
"అయ్యో నేను చెప్పటం మర్చేపోయాను "
"కార్డు లో డబ్బులు లోడ్ చేశాను, ఈ సోపు వేసి రెండు ఫ్రంట్ లోడర్సు స్టార్ట్ చెయ్యండి".  ఇక్కడ చాకలి మెషీన్లు ఫ్రంట్ లోడర్సు అని టాప్ లోడర్సు అనీ రెండు రకాలు. టాప్ లోడర్సు లో సామాన్యం గ ఒక మూటే పడుతుంది. ఫ్రంట్ లోడర్సు లో ఎక్కువ లోడ్సు వెయ్య వచ్చు. కార్డ్ slot  లో పెట్టి రెండు మూడు సార్లు ప్రయత్నించాను. స్టార్ట్ అవలేదు. నాకు ఈ కార్డులతో చాలా భయం. పెట్రోల్ బంకుల  దగ్గరనుంచీ వాటిని వాడాలి. ఎప్పుడూ వాటితో ప్రోబ్లెంసే. మొన్నే ఎవరో అమెరికాలో పెట్రోల్ బంకుల దగ్గర డెబిట్ కార్డులు వాడద్దని సలహా ఇచ్చారు. ఏమిటో ఎన్ని రకాల కార్డులో. 


"చేతకాకపోతే అటెండరు ని పిలవాలి" అటెండరు ని తీసుకు వచ్చాను. ఠకా  మని రెండు మెషీన్లు స్టార్ట్ అయినాయి. కార్డు పెట్టి గబుక్కున తీసేయ్యాలాట. రెండు అయిదు డాలర్లు లాగేసుకుంది.  ఇంత డబ్బులు ఎప్పుడూ పెట్టలేదు. పాత కాలం లో క్వార్టర్సు తోటి సరిపోయేది. మెషీన్లు గుడ్డల మీద సోపు నీళ్ళు పోసుకుంటూ  తిరుగుతుంటే చూస్తున్నాను.


"ఏమిటి ఇంత డబ్బయింది?"
"ధరలు పెరిగి ఉంటాయి" అంటూ ఉండగానే  దాని మీద ఫయివు లోడరు  అని బోర్డు గమనించాను. అప్పుడే ఆవిడా గమనించింది.
"అయిదు లోడ్ల దానిలో రెండు లోడ్లు వేసాము. మీకు తెలియదా ఇక్కడ మెషీన్లు గురించి?"
"తెలియదు"
"మరి ఎందుకు తీసుకు వచ్చారు ఇక్కడికి?"
"అంటే నేను ముందరగా వెళ్లి అన్నీ చూసి రావాలా?"
"క్రిందటి సంవత్సరము వచ్చారుగా ఇక్కడికి!" నాకు మాట పెగలటల్లేదు.  క్రిందటి సంవత్సరము వచ్చినది వాస్తవమే . కానీ ఆనాటి  పరిస్థితి వేరు. మా ఆవిడ పక్కనలేదు. ఇది అమెరికా,   చేత కాని తనము చెబితే పక్కవాళ్ళు చేసి పెట్టారు.  పరిస్థుతులు కొంచం  వేడెక్కే టట్లు ఉన్నాయని గ్రహించి, సరే ఇక్కడ ఎమున్నయ్యో చూస్తానని పక్క వరుస లోకి వెళ్ళాను. అక్కడ నాలుగు లోడర్లవి ఉన్నాయి. వాడటానికి ధర ఇంకా తక్కువ. పక్కవరుసలో  ఆరు లోడర్లవి ఉన్నాయి. ఇంకొకవరసలో ఒక మూటకి సరిపోయేవి టాప్ లోడర్సు  వున్నాయి. పక్కన కష్టమర్సు కి ఫ్రీ సోప్  అని కూడా వ్రాసి వుంది. కూర్చోటానికి కుర్చీలు, చదువుకోటానికి పత్రికలూ, ఎక్కడ చూసినా ఆడవాళ్ళ మయం. చూస్తుంటే ప్రపంచములో ఆడవాళ్లే ఎక్కువగా ఉతుకుతారల్లె ఉంది. కొందరయితే వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా తీసి  ఉతుకు తున్నారల్లె  ఉంది. కొందరికి కన్నుల పండువ గాను కొందరికి "రామ రామ" గానూ ఉండవచ్చు. 


"వాషింగ్ అయినది బట్టలు డ్రయర్  లో వెయ్యాలి" తడి బట్టలన్నీ తీసి రెండు డ్రయర్ ల  లో వేసాము. మళ్ళా కార్డుల   తోటి తంతు. ఈ తడవ మెషీను స్టార్ట్ అయ్యింది కానీ దాని  మీద పది అంకె వచ్చేసరికి పది డాలర్లు లాగే సుకుందేమోనని భయపడ్డాము. మళ్ళా అటెండరు . చివరకి తెలిసింది ఆ పది డ్రయర్ తిరిగే నిమిషాలుట. మెషీన్లు  తిరుగుతుంటే ఈ తడవ ఆవిడ స్వయానా లాండ్రోమేట్ చూడటానికి బయల్దేరింది.
"సీనియర్స్ కి ట్వంటీ పర్సంట్ డిస్కౌంట్ ట. అక్కడ నోటీసు ఉంది చూసిరండి" అంతే చూడటమే కాదు ఎన్రోల్ అయి వచ్చాను. అప్పుడప్పుడు ఫ్రీ వాషింగ్ కూడాట. ఇంక నేను రెండు వారాల కొకసారి లాండ్రోమేట్ కి రావాలని నిర్ణయించు కున్నాను. 
"డ్రయర్ అయ్యింది బట్టలు తీయండి" బట్టలు తీయటము, మూటలు కట్టటము, కార్లో పెట్టటము, ఇంటికి చేరటము తర్వాతా ఇంట్లోకి చేర్చటము అన్నీ అయినాయి. గంటలో పని అయిపోయిందని సంతోషం గ ఉన్నాను.
"నేను ఇంకా లాండ్రోమేట్ కి రాను" నా గుండెల్లో రాయి పడింది.
"ఎందుకని"
"బట్టలు మూట కట్టటము, చేరవేయ్యటము, మళ్ళా తీసుకువచ్చి ఇంట్లో చేరవేయ్యటము ఇంక నా వల్ల కాదు"
"పోనీ నా బట్టలు తీసుకువెళ్ళి ఉతుక్కుంటాలే, నీకు కొద్దిగానన్నా శ్రమ తప్పుతుంది"
"పోనీ ఆపని చెయ్యండి"


చివరి మాట: నాకు ఎక్కడలేని ఆనందముగా ఉంది పైకి మాత్రం గంభీరం గ ఉన్నాను లేకపోతే అసలుకే మోసం వస్తుంది. హాయిగా ఒంటరిగా లాండ్రోమేట్ కి వెళ్ళవచ్చు, సీనియర్ డిస్కౌంట్లు, ఫ్రీ సోప్. పక్కనున్న డునట్ షాప్  లో సీనియర్ రోజు ఎప్పుడో కనుక్కుంటే,  డునట్ తోటి ఫ్రీ కాఫీ, ఎయిర్ కండిషన్  లాండ్రోమేట్,  పక్కన భార్య లేకుండా ఒక గంట. హా ఇట్ ఈస్  హెవన్ . 



Wednesday, July 21, 2010

23. ఓ బుల్లి కథ 11 -- కంప్యూటర్ మొరాయిస్తే ---

ముందు మాట:
కంప్యూటర్ మన నిత్య జీవితములో వినీలమయిన కారణంగా అది సరీగ్గా పనిచేయక మొరాయిస్తే చాలా బాధగా ఉంటుంది. జీవితం లో ఏదో కోల్పోయినట్లుగా బాధపడతాము. ఈ పోస్ట్ ద్వారా మనము ఎంతవరకు దానిని సరిచేసుకోగాలమో చూద్దాము. నేను ఈ పోస్ట్ లో చెప్పే కిటుకులు అన్నీ నేను ఉపయోగించినవే.



మీరు కంప్యూటర్ కొన్నప్పుడు, దానితో పాటు వచ్చిన డిస్కులు అన్నీ దాచి పెట్టండి. కంప్యూటర్ బాగు చెయ్యటానికి వాటితో అవసరముంటుంది. మీకు కంప్యూటర్ లో ముఖ్యమయిన ఫైల్స్ అన్నీ ఫ్లాష్ డ్రైవ్ లో దాచి పెట్టు కుంటూ ఉండండి. అవసరమయినప్పుడు ఉపయోగ పడుతాయి.
మొదటగా నేను ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టము Windows XP. నేను ఉపయోగించే బ్రౌజరు Chrome. మీ కంప్యూటర్ లో ఇంకో Windows ఆపరేటింగ్ సిస్టము ఉంటే మీరు క్లిక్ చెయ్యాల్సినవి ఇంకో విధంగా ఉండచ్చు కానీ చెప్పే కిటుకులన్నీ వాటిల్లోనూ ఏదో రూపంలో  ఇవే ఉంటాయి.


నేను వాడే కిటుకులు:
1. చాలా ముఖ్యమయినది మీ కంప్యూటర్ లో ఉండవలసినది  Restore Point. మీ కంప్యూటర్ ఇవాళ బాగా పనిచేస్తున్నదనుకోండి, మీరు ఆ కంప్యూటర్ పరిస్థుతు లని దాచి పెట్టుకుని. ఎప్పుడయినా ఆ రోజు కి వెళ్ళవచ్చు.  అంటే ఇవాళ్ళ మీ కంప్యూటర్ సరీగ్గా పనిచేయ్యటల్లెదను కోండి, మీరు దాచి పెట్టుకున్న బాగా పనిచేసిన రోజుకి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది. Restore Point పెట్టటం ఇలా.
Start -- Accessories -- System tools -- System Restore.
Start నుండీ వరసాగ్గా క్లిక్ చేసుకు రండి. అప్పుడు 
Create a restore point, Restore my computer to an earlier time. మీరు వాటిల్లో ఒక దాన్ని తీసుకోండి.


1.1 బయటి ప్రపంచం మీ కంప్యూటర్ తో connect అవకుండా Firewall  ని ఆన్ చేయండి.
Start -- Control Panel -- Firewall 


2. మీరు కంప్యూటర్ ఆన్ చెశారు కాని అంతా గుట్టు చప్పుడు గ ఉంది. ఎక్కడా లైట్లు కూడా వెలగ లేదు. కంప్యూటర్ పవర్ సప్ప్లై కనెక్షన్ సరీగ్గా లేకపోవచ్చు లేక కంప్యూటర్ లో పవర్  సప్ప్లై పాడాయి ఉండచ్చు. పాడయితే  కొత్తది వేయించవలసి ఉంటుంది. 


3.  మీకు కంప్యూటర్ లో ఇంటర్నెట్ రావటల్లేదు. ఇంటర్నెట్ వైర్లు చెక్ చేయండి. connecting  వైర్లు తీసి మళ్ళా వాటి స్థానాల్లో పెట్టండి. ఒక్కొక్కప్పుడు స్టాటిక్ కరెంటు మూలంగా పనిచెయ్యక పోవచ్చు. మీ హైస్పీడ్ ఇంటర్నెట్ బాక్స్ లో లైట్స్ అన్నీ వెలుగుతున్నాయో లేదో చూడండి. లేక పోతే కస్టమర్ సప్పోర్ట్ ని పిలవండి.


4. మీ కంప్యూటర్ ఇంటర్నెట్ తో నెమ్మదిగా పనిచేస్తోంది. దీనికి చాలా కారణాలు ఉండచ్చు. ఒక్కొక్కటే పరిశీలిద్దాము.


4.1 మీ అవసరం కోసం మీ కంప్యూటర్ కొన్ని ఫైళ్ళని temporary గ దాచి పెడుతుంది. ఆ   ఫైళ్ళు ఎక్కు వయిన కొద్దీ కంప్యూటర్ నత్త నడక సాగిస్తుంది. వాటిని తీసేయ్యాలి.  
Start -- Control Panel -- Internet Options -- Browsing History -- Delete -- Temporary Internet files -- Delete


4.2 మీరు ఒక పెద్ద సైజు ఫైలు ను హార్డ్ డిస్క్ లో దాచి పెడదాము అని అనుకున్నారను కొండి. దానికి అంత పెద్ద సైజు స్థలం దొరకక పోతే. దానిని ముక్కలు చేసి చాలా చోట్ల దాచి పెడు తుంది( దీనిని fragmentation అంటారు). మీరు ఆ ఫైలు ను కావాలని అడిగితే ఆ ముక్కలని అన్నీ కలిపి మీకు చూపెడుతుంది(దీనిని defragmentation అంటారు). ఈ కలపటానికి సమయము తీసుకుంటుంది గనక, నెమ్మదిగా వెళ్ళు తున్నట్లు కనపడు తుంది. ఇలా fragmented ఫైళ్ళు ఎక్కువ ఉంటె, ప్రతీసారీ మీరు అడిగినప్పుడు మీకు ఫైళ్ళు ఇవ్వటానికి సమయం పడుతుంది. అందుకని మీ డిస్క్ లో ఉన్న ఫైళ్ళకి ఎంత స్థలం కావాలో చూసి వాటిని కలిపి దగ్గర చేర్చటాన్ని డిస్క్ defragmentation చెయ్యాలి.
Start -- All Programs -- Accessories -- System Tools -- Disk Defragmenter.


4.3 మీరు ప్రోగ్రాం ని ఒక దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అప్పటినుండి సిస్టం చాలా స్లో గ పోతోందని పిస్తోంది. డిస్క్ defragmentation చెయ్యండి. అప్పటికి సరి అవక పోతే ఆ ప్రోగ్రాం ను సిస్టం లో నుండి తీసి వెయ్యండి.
Start-- Control Panel -- Add Remove Programs (ఇక్కడ మీ ప్రోగ్రాం ని సెలెక్ట్ చేసుకుని remove  చెయ్యండి). 


5. కంప్యూటర్ వైరస్ లు  ఉంటే గూడా కంప్యూటర్ నెమ్మదిగా వెళ్తుంది. కంప్యూటర్ వైరస్ లు అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఎవరో వ్రాసి మీ కంప్యూటర్ లోకి దొంగతనంగా మీకు తెలియకుండా పంపించారు. అవి సామాన్యముగా ఆ యా వైరస్ ప్రోగ్రామ్స్ వ్రాసిన వారి పనులు మీ కంప్యూటర్ మీద చేస్తూ ఉంటాయి. అవి అలా మీతోపాటు కంప్యూటర్ ని వాడుకొనుట మూలంగా, కంప్యూటర్ నెమ్మదిగా పోతుంది. కొన్ని కొన్ని మీ కంప్యూటర్ పని చెయ్య కుండా ఆపేస్తాయి. కాగాపోగా మీరు క్రెడిట్ కార్డు తో డబ్బులు పంపిస్తే బాగు చేస్తా మని చెబుతాయి. మీ కంప్యూటర్ అలా స్తంభించి పోతుంది. ఇంకా కొన్ని వైరస్  లు మీ దగ్గర ఉన్న ఈ మెయిల్ అడ్రస్ లు తీసుకుని వారికి మీరు ఎక్కడో బాధల్లో ఉన్నారు వాళ్లకి డబ్బు పంపిస్తే అందచేస్తాము అని చెబుతాయి. కొన్ని మీరు దాచి పెట్టుకున్న విషయాలు దొంగిలిస్తాయి. ఈ క్రింది విధంగా వాటిని రాకుండా చెయ్యచ్చు, కాదుపో వస్తే సాగనంపచ్చు. antivirus ప్రోగ్రాం ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫ్రీ గ వచ్చేవి ఉన్నాయి.   


5.1. వైరస్ లు దొంగతనంగా వస్తాయని చెప్పాను కదా, ఎక్కువగా ఈ మెయిల్స్ తో  వస్తూ వుంటాయి. మీకు తెలియని వారు ఈ మెయిల్స్ పంపించినా లేక సబ్జెక్టు లో ఆ ఈ మెయిల్ ఎందుకో వ్రాయక పోయినా జాగర్తగా ఉండాలి. ఓపెన్ చేసారంటే వైరస్ లోపలి కి  చేరుతుంది. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు. వెంటనే డిలీట్ చెయ్యండి. మీకు తెలియని వాళ్ళు ఐ లవ్ యు అని ఈ మెయిల్ పంపిస్తే కూడా వెంటనే డిలీట్ చెయ్యండి. ప్రపంచములో ఒకరు మనల్ని లవ్ చెయ్యక పోతే పర్లేదు.


5.2. మీరు ప్రోగ్రామ్స్ డౌన్లోడ్ చేసుకుంటుంటే కూడా రావచ్చు. కంప్యూటర్ చాలా నెమ్మదిగా నడుస్తుంటే anti వైరస్  ప్రోగ్రాం రన్ చేసి వాటిని తీసి వెయ్యండి. 


5.3. మీరు వెబ్ సైట్స్ చూస్తున్నప్పుడు రావచ్చు. మీ కంట్రోల్ లేకుండా మీ కంప్యూటర్ స్క్రీన్ మీద బొమ్మలు వస్తూ ఉంటాయి. వెంటనే కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చెయ్యండి. మళ్ళా ఆన్ చేస్తే మీ కంప్యూటర్ పని చెయ్యక పోతే వైరస్ ఉన్నట్లే లెక్క. Anti వైరస్ ప్రోగ్రాం రన్ చెయ్యటానికి చూడండి.  ఒకవేళ కుదరక పోతే safemode  లోకి వెళ్లి antivirus రన్ చెయ్యండి. అదీ కుదరక పోతే restorepoint ద్వారా మీ కంప్యూటర్ ని బాగా పనిచేసిన రోజు కి తీసుకు వెళ్ళండి.
కంప్యూటర్ స్విచ్ ఆన్ చేసినతరువాత, కంప్యూటర్ వస్తున్నప్పుడు కీ బోర్డు పై వరసలో ఉన్న F8 నొక్కితే safemode లోకి వెళ్ళచ్చు.


5.4. computer safemode అంటే మీ కంప్యూటర్ రన్ కావటానికి కావలసిన తక్కువ ప్రోగ్రామ్స్ తో  (ex : barebones  Windows XP) పని చేస్తూ ఉంటుంది. మిగతా ప్రోగ్రామ్స్ మీరు రన్ చేస్తే గాని రన్ అవ్వవు. ఏ ప్రోగ్రాం ప్రాబ్లం ఇస్తోందో  తెలిస్తే దాన్ని remove చెయ్యవచ్చు. Antivirus ప్రోగ్రాం ని కూడా రన్ చెయ్యవచ్చు. restorepoint ద్వారా  మంచి రోజుకి వెళ్ళవచ్చు. 


6. ఫై చెప్పిన వేవి పని చెయ్యక పోతే, మీ కంప్యూటర్ తో వచ్చిన డిస్క్ లతో operating system లోడ్ చెయ్యాలి. మొదట మీ కంప్యూటర్ ఆఫ్ చెయ్యండి. మీ కంప్యూటర్ తో పాటు వచ్చిన ఆపరేటింగ్ సిస్టము డిస్క్ ని CD/DVD drive లో పెట్టండి. కంప్యూటర్ ఆన్ చెయ్యండి. ఆన్ చెయ్యం గానే కంప్యూటర్ చేసే పని ఆపరేటింగ్ సిస్టము కోసం వెతకటం. మొట్టమొదట CD  డ్రైవ్ లో వెదుకుతుంది. దానిలో CD పెట్టాము కాబట్టి ఆపరేటింగ్ సిస్టము ని దానిలో నుండి తీసుకుంటుంది(హార్డ్ డిస్క్ లోనుండి కాకుండా). ఇక్కడి నుండీ అది అడిగే ప్రశ్నలకు సమాధానము చెప్పుకుంటూ పోతే ఆపరేటింగ్ సిస్టము ను లోడ్ చెయ్యవచ్చు.


7. అప్పటికీ పనిచేయక పోతే మీ హార్డ్ డిస్క్ ని format చేసి operating system లోడ్ చెయ్యాలి. దాని తరవాత మళ్ళా మీ ప్రోగ్రామ్స్ ఫైళ్లు లోడ్ చెయ్యాలి.


8. నేను ఉపయోగించే ఫ్రీ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ గూగుల్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడే డౌన్లోడ్ సైట్ CNET.
A. Browser: Chrome
B. Anti Virus : Panda Cloud
C. Windows Maintenance: Advanced System Care (దీన్ని వారానికి ఒకసారి వాడుతాను) 


చివరి మాట:
మీ కంప్యూటర్ సరీగ్గా పని చెయ్యక పోతే బాగు చెయ్యవచ్చు.  గాభరా పడవలసిన అవుసరము లేదు. మీకు సందేహాలు వస్తే గూగుల్ చెయ్యండి. విపులంగా అన్నీ వ్రాసి ఉన్నాయి.


గమనిక: ఈ వ్యాసం వ్రాసింది మా ఇంట్లో వాళ్ళ ప్రేరేపణ తో. అందరికీ అర్ధమయ్యేలా వ్రాసాను. మీరు ఇది చదువుతున్నారంటే దీనికి సరియన అప్ప్రొవల్ రేటింగ్ వచ్చినదన్న మాట. ఇంక ఆనందంగా నా బుల్లి కథలు వ్రాసు కుంటాను.