Tuesday, October 19, 2010

31 ఓ బుల్లి కథ 19 -- కీళ్ళు,మోకాళ్లను జాగర్తగా ఉంచుకోండి 1 --

ముందుమాట: Bottom Line వారు Dr. Harris McIIwain, MD, Certified specialist in rheumatology and geriatric medicine who practices with the Tampa Medical Group in Florida గారితో చేసిన సంభాషణను తెలుగు లో నాలుగు  పోస్టులలో మీకు అందిస్తున్నాను.
దీనికి కారణం మన ఇళ్ళల్లో జాయింట్ పైన్స్ తో బాధ పడేవారు ఎక్కువగా ఉండటం. వారు వయసులో పెద్దవారు అవటం. పెద్దవయసులో ఇవి మామూలే అని నిరాశగా బాధ పడుతూ ఉండటం చూడలేక.

From: Keep Joints Feeling Young! by Dr. Harris McIIwain, MD coauthor of Pain-Free Arthritis - A 7-step program for feeling Better Again (Owl)

నా rheumatology practice లో నొప్పులతో బాధపడుతూ డాక్టర్ల చుట్టూతా తిరిగినా ఉపశమనము కలుగక నా దగ్గరకి వచ్చిన వారికి నేను ఎక్కువగా చెప్పేది వారి ఆహారము తిను పద్ధతిని మార్చమని. నా నొప్పులు తగ్గే ఆహారపు క్రమమును పాటిస్తే కొన్ని వారాలలోనే ఫలితం కనిపిస్తుంది. దీని మూలంగా నొప్పికి వేసుకునే మందులను తగ్గించవచ్చు.  కీళ్ళ నొప్పులు అన్నిటిలోనూ (rheumatoid arthritis మరియు Osteoarthritis తో సహా) inflammation తగ్గి నొప్పి మరియు stiffness తగ్గుట గమనించ గలరు. 

పని చేసే విధానము: ఈ నొప్పుల బాధ నుండి బయట పడేట్టు చేసే ఆహార పద్ధతి లో మీరు నొప్పులను తగ్గించి మన immune system ను పెంచే ఆహారముల గురించి తెలుసుకుంటారు. అలాగే మీకు inflammation పెంచి నొప్పులను తెప్పించే ఆహారముల గురించి కూడా తెలుసుకుంటారు. ఈ diet program మూలముగ  మీ బరువు ఆరోగ్య కరముగా ఉండి కీళ్ళ మీద భారము తగ్గి జీర్ణ శక్తి పెరిగి మీ నెప్పుల బాధలు తగ్గు ముఖము పట్టును. మీకు కొన్ని మంచి nutritional suppliments గురించి కూడా చెబుతాను.

మీరు ఆరోగ్య కరమయిన సరియిన బరువు కలిగి ఉండాలంటే మీరు తరచుగా చిన్న చిన్న meals తీసుకొనుట మంచిది. రోజుకు మూడు పెద్ద meals కన్న రోజుకి ఆరు చిన్న meals తీసుకోండి.  మూడు 300 కాలోరీస్ ముఖ్య meals తో పాటు, మూడు 150 లేక  200 కాలోరీస్ తో చిన్న చిన్న స్నాక్స్ మధ్యలో తీసుకోండి.

చివరిమాట:  తరువాత పోస్ట్ foods that heal.

2 comments:

  1. చక్కగా చెప్పారు రావు గారు. మీరు చెప్పినట్టుగా ఆహార నియమాలను పాటిస్తె కీళ్ళ నొప్పుల నివారిణిని పొంద వచ్చును..ఇది చాలా మందిని వేధిస్తున్న సమస్య. మోకాళ్ళ మీద బరువు ఎక్కువగా ఆనించడం వలన బహుశ ఈ ఇబ్బంది కలుగ వచ్చును.పైగా విపరీతంగా పెరిగే పొట్ట బరువు. ఇలా కారణాలు ఎన్నో ? ఆహార నియమాలను గురించి తప్పక రాయండి.[ meTlu ekkaDam digaDam veeriki chaalaa ibbamdi.]

    ReplyDelete
  2. @రాజేశ్వరి గారూ ధన్యవాదములు. చేతనయినంత వరకు ఈ పోస్ట్ లు ఉపయోగపడేటట్లు వ్రాయాలని కోరిక. తరువాతి పోస్ట్ లో నెప్పులు తగ్గటానికి మనం తిన వలసిన ఆహారము గురించి చెబుతాను.

    ReplyDelete