Monday, October 1, 2012

86 ఓ బుల్లి కథ 74 --- ప్రోటీన్స్ విషయంలో శాకాహారులు మోసపోయారా ?

నిజమే నంటారా ? కాకపోతే మరి మీరేమంటారు? కొందరు శాకాహారము మాంసాహారము రెండూ తినవచ్చు, కొందరు శాకాహారమే తినాలి అని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? ఒక సమాజం మోత్తం దీనిని పాటించేటట్లు జేసిన ఆ గట్టి మనుషులు ఎవరు? అయినా చెప్పినంత మాత్రాన విన వలసిన అవసర మేమిటి? ఎన్నాళ్ళ నుండీ ఈ పద్ధతులు అమలులో ఉన్నాయి? ఎందుకిల్లా జరిగింది?

ఇవన్నీ నాకయితే నాకు సమాధానం లేని ప్రశ్నలు. మూడు నెలల బట్టీ నాకు కనిపించిన వాళ్ళ నందరినీ వీటిగురించి అడుగుతున్నాను. సంతృప్తి కరమైన సమాధానం రాకపోయినా, క్లుప్తంగా వచ్చిన సమాధానాలు ఈ క్రింద పొందు పరుస్తున్నాను.

1. పూర్వం ఋషులూ వారి శిష్యులూ ఆశ్రమాల్లో అరణ్యాలలో వుండేవాళ్ళు. మాంసాహారము యజ్ఞ యాగాది క్రతువుల్లో వాడినప్పటికీ సామాన్యంగా తేలికగా దొరికే కాయగూరలూ పళ్ళూ ఫలాలతో దైనందిన జీవితం గడిపేవారు. వీరిలో కొందరు రాజాశ్రయంతో పట్టణ వాసులైనప్పటికీ వారి దైనందిన జీవితం శాకాహరంతోనే గడవటం మూలంగా శాకాహారు లైనారు. దానికి తోడు ఆశ్రమంలో శిష్యరిక పోషణా న్వేషణలో గ్రహించిన సేద్య నైపుణ్యమును, మెళుకువలను పట్టణ వాసములో కూడా కొన సాగించి సేద్యకారులై వారు వారి కుటుంబములు శాకాహారులుగా జీవితం కొనసాగించారు.

2. చాలా పూర్వ కాలంలో శాకాహారము మాంసాహారము అని లేకుండా ఏది దొరికితే అది తిని జీవించే వారు. కొంత కాలం తర్వాత బౌద్ధ మతం వ్యాప్తి చెంది అందరూ శాకాహారు లయ్యారు. శాకాహారం అవలంబించడానికి బౌద్ధమతం కన్న,జైనమతప్రభావం ప్రధానకారణం అని కొందరంటారు. తరువాత శంకరాచార్యులు ప్రోద్భలంతో మరల హిందూ మతమునకు ప్రాముఖ్యత వచ్చింది. ఈ తరుణము లో కొందరు శాకాహారులు మాంసాహారులుగా మారుట వలన సమాజంలో రెండు వర్గాలు ఏర్పడి ఉండవచ్చు.

ఏది ఏమైనా నేను ఈ ప్రశ్న అడగటానికి ఒక కారణం ఉంది. మనదేహం పనిచేయటం ఎన్నో రసాయనిక ప్రక్రియల సమ్మేళనం. ఆ రసాయనిక ప్రక్రియలు సరీగ్గా జరగాలంటే వాటికి కావాల్సిన ఇంధనాలూ, ప్రక్రియ ప్రోద్భలానికి సహకరించే ఎంజైములూ కావాలి. అవే ప్రోటీనులు. ఆ ప్రోటీనులు ఎమినో యాసిడ్లతో తయారు చెయ్యబడ్డవని శాస్త్రజ్ఞులు గ్రహించారు. ప్రోటీన్లు తయారు చెయ్యటానికి కావలసిన ఎమినో యాసిడ్స్ లో మన శరీరం 9 ఎమినో యాసిడ్స్ మాత్రం తనంతట తాను తయారు చేసుకోలేదని శాస్త్రజ్ఞులు గ్రహించారు. ఈ తొమ్మిదీ మనం తినే ఆహారం నుండి రావాలి.

మాంసాహారులకి ఆ తొమ్మిదీ మాంసం(complete protein) తింటే  వస్తాయి కానీ శాకాహారులకి ఏ ఒక్క శాకాహారం(incomplete protein) నుండీ రావు (Some foods from the plant kingdom, such as soy and quinoa, have complete protein). అందుకని మాంసాహారము తినక పోయినా మిశ్రమ శాకాహారం తప్పక తినాలి. తినకపోతే కావలసిన అవసరమయిన ప్రోటీనులు శరీరానికి అందక పోవచ్చు. కాకపోతే అన్నీ ఒక భోజనం (one sitting) లో తిన వలసిన అవసరం లేదు.

మిశ్రమ (సమీకృత) ఆహారం తినటం మంచిదని ఎందుకు చెప్పానంటే మాంసా హారం లాగా అన్ని శాఖా హారాలలో, ఒక దాన్లోనే అన్ని essential amino acids ఉండక పోవచ్చు కానీ వివిధ శాఖా హారాలలో వివిధ essential amino acids ఉన్నాయి. ఉదాహరణకి మొక్క జొన్నలో lysine or threonine తక్కువ కానీ beans లో అవి ఉన్నాయి. (Some foods from the plant kingdom, such as soy and quinoa, have complete protein).

అమాంతంగా ప్రోటీన్ల కోసం మాంసాహారులుగా మారవలసిన అవసరము ఎంతమాత్రమూ లేదు. మారుదామన్నా శాకాహారానికి అలవాటుపడిన శరీరం సహకరించక పోవచ్చు. ప్రస్తుతానికి శరీరం తయారు చేసుకోలేని ఆ 9 ఎమినో యాసిడ్స్ ఏమిటో, శాకాహారమే తింటూ, ఆ ఎమినో యాసిడ్స్ ను శరీరానికి సమకూర్చి ఏవిధంగా ఆ లోటుని భర్తీ చెయ్యగలమో చెప్పటమే ఈ పోస్ట్ ఉద్దేశం.

శరీరం తయారు చేసుకోలేని ఆ 9 ఎమినో యాసిడ్స్ : Essential amino acids:
Histidine, Isoleucine, Leucine, Lysine, Methionine, Phynylalanine, Threonine, Tryptophan, Valine
ఇవి లేకపోతే శరీరములో అవి చేసే పనులకు ఆటంకము కలుగవచ్చు.

పై ఎమినో యాసిడ్స్ మన శరీరంలో ముఖ్యముగా చేసే పనులు( 1,3 మాతృకల నుండి సేకరించినవి.):.

1. Isoleucine (Ile) - for muscle production, maintenance and recovery after workout. Involved in hemoglobin formation, blood sugar levels, blood clot formation and energy.
Available in Soy protein, Watercress, Kidney beans, Sunflower seed flour, Chard, Spinach.

2. Leucine (Leu) - growth hormone production, tissue production and repair, prevents muscle wasting, used in treating conditions such as Parkinson’s disease.
Available in Soy protein, Watercress, Kidney beans, Sunflower seed flour, Raw Alpha alpha seeds, Sesame seed flour, Tofu.

3. Lysine (Lys) - calcium absorption, bone development, nitrogen maintenance, tissue repair, hormone production, antibody production.
Available in Soy protein, Watercress, Tofu.

4. Methionine (Met) - fat emulsification, digestion, antioxidant (cancer prevention), arterial plaque prevention (heart health), and heavy metal removal.
Available in Soy protein, Sesame flour, Seaweed spirulina.

5. Phenylalanine (Phe) - tyrosine synthesis and the neurochemicals dopamine and norepinephrine. Supports learning and memory, brain processes and mood elevation.
Available in Soy protein, Kidney beans, Sesame seed flour, Cotton seed flour, Spinach.

6. Threonine (Thr) monitors bodily proteins for maintaining or recycling processes.
Available in Soy protein, Watercress, Kidney beans, Sunflower seed flour, Sesame seed flour.

7. Tryptophan (Trp) - niacin production, serotonin production, pain management, sleep and mood regulation.
Available in Soy protein, Watercress, Kidney beans, Sunflower seed flour, Spinach, Sesame seed flour, Turnip greens, Broccoli rabe, Asparagus, Oat bran.

8. Valine (Val) helps muscle production, recovery, energy, endurance; balances nitrogen levels; used in treatment of alcohol related brain damage.
Available in Soy protein, Watercress, Kidney beans, Sunflower seed flour, Sesame seed flour, Mushrooms white, Snow/snap peas.

9. Histidine (His) - the 'growth amino' essential for young children. Lack of histidine is associated with impaired speech and growth. Abundant in spirulina, seaweed, sesame, soy, rice and legumes.

క్లుప్తంగా:

1. మన దేహానికి ప్రోటీన్స్ చాలా అవసరము.

2. మన బరువు లో ఒక పౌండ్ కి 0.36 - 0.40 గ్రాముల ప్రోటీన్ కావాలని నిర్ధారించారు. (USDA)
రోజుకి మనకెంత ప్రోటీన్ కావాలి ? http://mytelugurachana.blogspot.com/2012/06/85-73.html

3. ప్రోటీన్స్ ఎమినో యాసిడ్స్ తో తయారు అవుతాయి.

4. ఈ ఎమినో యాసిడ్స్ లో 9 ఎమినో యాసిడ్స్ మన శరీరం తయారు చేసుకోలేదు. అందుకని మనం తినే ఆహారంతో ఇవ్వాలి.

5. మనము ఇవ్వక పోతే మన శరీరం తన సంరక్షణార్ధం మిగతా చోట్ల నుండి తీసుకుంటుంది (కాల్షియం తీసుకున్నట్లు http://mytelugurachana.blogspot.com/2012/05/84-72-osteoporosis.html).

6. మాంసాహారులయితే, దానిని తినుట మూలంగా కావలసిన అన్ని ఎమినో యాసిడ్స్ ఆహారంతో వస్తాయి.

7. గుడ్లు (egg whites) తినే వాళ్లకి కూడా వాటితో వస్తాయి.

8. మీరు పాలు,పాల పదార్ధాలు తిన కలిగితే: పాలు పెరుగులలో అన్ని ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. ఇంకా చీజ్ తిన కలిగితే వీటిల్లో అన్నీ ఉన్నాయి. Ricotta Cheese low fat, Romano, Cheddar, Mozzarella, Parmesan, Gouda, Swiss, Feta, Cottage Cheese low fat (2%).

9. శుద్ద (Plant Based Only) శాకాహారులకు మాత్రం ఏ ఒక్క పదార్ధం తో అన్నీ రావు( quinoa తప్ప). అందుకని Essential amino acids రావటానికి రకరకాల కూరగాయాలను తినాలి. అన్నీ ఒకసారే (one sitting లో) తినాలని లేదు.

10. మీరు తినవలసినవి ఇవి: Soy protein, Watercress, Kidney beans, Sunflower seed flour, Raw Alpha alpha seeds, Sesame seed flour, Tofu.Sunflower seed flour, Spinach, Turnip greens, Broccoli rabe, Asparagus, Oat bran.
Pumpkin/squash seeds, Pistachios, Cashews, Hemp seeds, Black eye peas, Potato with skin.

11. పై చెప్పిన కూరగాయలు కొన్నిటిని ప్రతి వారం తినటం మంచిది. మన కూరగాయలతో చేసిన పరిశోధనా ఫలితాలు నాకు తెలియవు కనుక వాటి పేర్లు వ్రాయలేదు. 

మాతృకలు:
1. http://www.nomeatathlete.com/vegetarian-protein/

2. http://www.raw-food-health.net/VegetableProtein.html#axzz1sFuau3mN

3. http://www.savvyvegetarian.com/articles/get-enough-protein-veg-diet.php

11 comments:


 1. మీరు రాసింది కరెక్టే.మతము,సెంటిమెంటు పరమైన అభ్యంతరం ఉంటే శాకాహారం తీసుకోవచ్చును.కాని ఎక్కువ రకాల కూరగాయలు ,పండ్లు తీసుకోవాలి.శక్తి కోసం పిండిపదార్థాలు ,కొంత కొవ్వుపదార్థం కూడా అవసరమే.దీనినే balanced diet అంటారు.ఇప్పటి వైద్య సలహాల బట్టి మధ్య వయస్సునుండి మాంసాహారం తగ్గించాలి.రక్తపోటు,హృద్రోగ నివారణకు .
  2 సవరణలు;1. హిందువులు(బ్రాహ్మణులు,వైశ్యులు మొ;;వారు ) శాకాహారం అవలంబించడానికి బౌద్ధమతం కన్న,జైనమతప్రభావం ప్రధానకారణం.2.శాఖాహారం అనకూడదు శాకాహారం అనాలి.

  ReplyDelete
 2. @వంశీ కృష్ణ గారూ మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  @కమనీయం గారూ మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీరు సూచించిన సవరణలు పోస్ట్ లో చేశాను. థాంక్స్.

  ReplyDelete
 3. ఎన్నో విషయాలను తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలండి.

  మా ఇంట్లో ఉన్న " ఆరోగ్య సుధాకరము " అనే పుస్తకంలో మానవులు తమ శరీర నిర్మాణం ప్రకారం శాకాహారాన్నే భుజించాలని , శాకాహారంలోనే ఎక్కువ ప్రొటీన్స్ ఉంటాయని వ్రాసారు. ఎక్కువకాలం జీవించే కొబ్బరి, వెలగ మొదలైన చెట్ల నుంచి ఆహారాన్ని స్వీకరించే ఏనుగు 70 ఏళ్ళు జీవిస్తే, మాంసాహారాన్ని తినే సింహం 30 ఏళ్ళు మాత్రమే జీవిస్తుందట.


  మాంసాహారము, ఉప్పు, కారములు........ ఎక్కువగా తినేవారిలో సాత్విక భావములు తగ్గుతాయని పెద్దవాళ్ళు చెప్పారు. అందుకే కాబోలు దైవపూజలు, వేదాధ్యయనం చేసే వారికి శాకాహారాన్ని తీసుకోమని పెద్దలు చెప్పటం జరిగిందనిపిస్తుంది. రాజ్యాన్ని రక్షించే రాజులు, సైనికులు మొదలైన వారికి మాంసాహారాన్ని తీసుకున్నా ఫరవాలేదు..... అని చెప్పటం జరిగిందనిపిస్తుంది.


  మాంసాహారంలో పీచు పదార్ధం లేకపోవటం, ఎక్కువ కొవ్వు ఉండటం వల్ల మానవులకు కాన్సర్ వంటి అనేక వ్యాధులు వస్తాయట.

  వరి, గోధుమ మాత్రమే కాకుండా , నవధాన్యాల గురించి , నిమ్మ, ఉసిరి, కొబ్బరి ..... వంటి ఎంతో బలవర్ధకమైన సమతులాహారాన్ని పూర్వీకులు మనకు అలవాటు చేసారు. వారికి కృతజ్ఞతలు.
  ................

  ఆశ్చర్యకరమైన ఇంకో విషయం ఏమిటంటేనండి, మాంసాహార జంతువులు శాకాహార జంతువులను మాత్రమే కాకుండా తోటి మాంసాహార జీవులను కూడా తింటాయి. ఉదా... మాంసాహారాన్ని తినే ఎలుకను పిల్లి తింటుంది. పురుగులను కోళ్ళు తింటే ఆ కోళ్ళను నక్కలు తింటాయి.

  ReplyDelete
 4. /ఏనుగు 70 ఏళ్ళు జీవిస్తే, మాంసాహారాన్ని తినే సింహం 30 ఏళ్ళు మాత్రమే జీవిస్తుందట/ :))

  ఎంతకాలం జీవించామని కాదు, ఎలా జీవించామన్నది చూడు అన్నారట వివేకానంద( లేదా మరెవరో).
  రాజ కంఠీరవ అంటారు కాను ఏనుగురాజా అని ఏకవైనా పొగిడి సొమ్ములు చేసుకున్నారా?! :)) :P
  సింహానికి గడ్డి, పత్రి, పళ్ళు, కొబ్బరి, వెలగ తినిపించామంటే 5ఏళ్ళు కూడా బ్రతకడం కూడా డౌటేనండి. :))

  ReplyDelete
 5. By e-mail
  మీరు రాసినది చాలా బాగుంది! ఒకటే సవరణ. ఈ ప్రొటీన్స్ గురించి నానా గడ్డి తినవలసిన అవసరం లేదు! చాలా చక్కని రుచిగా చేసినశాఖాహార ప్రొటీన్ బార్స్ వాల్మార్ట్ మొదలైన స్టోర్స్ లో దొరుకుతాయి. బార్స్ తినడం ఇష్టం లేకపోతే సోయా చిక్కుడు తో చేసిన డ్రింక్స్ (లాక్టోజ్ ఫ్రీ) వున్నాయి.
  ఇట్లు మీ ప్రియ మిత్రుడు
  ద్రోణంరాజు శ్రీరామకృష్ణుడు

  ReplyDelete
 6. @anrd గారూ
  " ఆరోగ్య సుధాకరము " పుస్తకము ఎక్కడ దొరుకుతున్దండీ.

  సృష్టి లో జీవులు ఏవి తిని జీవించాలి అనేది చాలా వరకు వాటి శరీర నిర్మాణము బట్టి ఉంటుందని నా నమ్మిక, అన్నీ తిని అరిగించుకోలేవు(మీ ఏనుగు సింహం పోలికలో ఇది వర్తిస్తుంది) . అల్లాగే ఎంతకాలం జీవించేది అనేది కూడా, ఎక్కడో ఒక జీవి జీవించే పట్టిక చూసినట్లు గుర్తు.

  "ఎంతో బలవర్ధకమైన సమతులాహారాన్ని పూర్వీకులు మనకు అలవాటు చేసారు." --- నిజమే. కొన్ని కొన్ని సంగతులు తెలుసుకొన్న కొద్దీ చిత్రంగా ఉంటుంది, అది ఏవిధంగా జరిగింది అని. వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటే అంతా బాగుంటుంది కానీ ప్రపంచమూ, జీవితాలు, తినే పదార్ధాలూ మారిపోయాయి కదా!.

  "మాంసాహారాన్ని తినే ఎలుకను పిల్లి తింటుంది. పురుగులను కోళ్ళు తింటే ఆ కోళ్ళను నక్కలు తింటాయి." --- వాటిల్తో మానవుల్ని కూడా జేర్చుకోవచ్చు అనుకుంటాను. దీన్ని Predation అంటారు. భూమిమీద బరువు అల్లా పెరిగిపోకుండా ప్రకృతి సృష్టించిన మర్మం.

  మీరు పోస్ట్ చదివి వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 7. @snkr గారు మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు తప్పకుండా 10 లో చెప్పినవి తరచుగా వాడుతూ ఉండండి.

  @ద్రోణంరాజు గారూ ప్రోటీన్ ముఖ్యత గురించి మీకు కాలిఫోర్నియా హైకింగ్ లో అనుభవమైంది కదా. మీరు చెప్పిన సలహాలు తప్పక పాటిస్తాము. థాంక్ యు.

  ReplyDelete

 8. సర్ ! క్షమించండి. కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్యను చూసానండి.

  కొన్ని సంవత్సరముల క్రితం ,మాకు తెలిసిన వారి ఇంటికి " డాక్టర్ వి.వి. రామరాజు గారు ." అనే ప్రకృతి వైద్యులు వచ్చారు. వారికి అప్పటికే 80 సంవత్సరములు పైనే వయస్సట. చూస్తే చిన్న వయస్సు వారిగా కనిపించారు. ఎంతో ఉత్సాహంగా యోగా చేసేవారు. వారు యోగా గురించి గ్రంధాలు కూడా వ్రాసారట. వారు వ్రాసిన పుస్తకమే " ఆరోగ్య సుధాకరము. " ఈ పుస్తకంలో ఎన్నో విషయములున్నాయి.
  ఈ పుస్తకంలో భగవంతుని గురించి కూడా వ్రాసారండి. .

  ఇంకా, మాంసము...మానవాహారము కాదు. అని వ్రాసారు. కొన్ని విషయములు.
  భగవంతుడు... జంతువులకు , మాంసాహారులకు అనువైన అంగసౌష్టవములను, అంతరావయవములను, జీర్ణాదిరసములను అమర్చియున్నాడు. అవి ఇతర జంతువులను వేటాడితినవలయును.. మాంసమును చీల్చి తినుటకు నోటిలో అనువైన కోరపళ్ళును, మాంసమును ముక్కలుగా ఖండించి తినుటకు అనువైన కత్తెర పళ్ళునూ.... ఇలా జంతువుల శరీరనిర్మాణం ఉంటుందని వ్రాసారు.
  ఇంకా,
  మాంసము త్వరగా కుళ్ళిపోవును. గనుక అది ప్రేగులలో నిలువ యుండుట వల్ల అనేక రోగ క్రిములు ప్రవేశించు ప్రమాదమున్నది. గనుక త్వరగా జీర్ణమై మలములు వెలువరింపబడుటకు గాను , కురుచైన జీర్ణకోశము, మలకోశములు ఏర్పాటుచేసి యున్నాడు.

  జంతువుల ప్రేగుల నిడివి జంతువులను బట్టి ఉండును. పెద్దపులి , సింహము వంటి వానికి ఏడు మూరలు, అంటే పది యడుగుల పొడవు మాత్రముండును. అందువల్ల మృగము మాంసము భుజించిన ఐదారు గంటలకే మల విసర్జన చేయును.

  మన అంగ సౌష్టవము, జీర్ణమండలము, జీర్ణాది రసములను పరిశీలించినప్పుడు అవి మాంసాహారమునకు విరుద్ధములు. మన జీర్ణమండలము దాదాపు ముప్పది యడుగుల పొడవుండును. అందుచే ఇరువదినాల్గు గంటలకు గాని మలవిసర్జన జరుగదు. మాంసము 24 గంటలు మన ప్రేగులలో నుండుటవలన కుళ్ళిపోవును. అందుండి దుర్వాయువులు బుట్టును. ఆ గాస్ వల్ల Gastic Trouble, Gastic Alsur, వంటివి సంభవించును. అంతే కాదు అమీబియాసిస్, టేప్ వర్మ్, హుక్ వర్మ్, రౌండ్ వర్మ్, నులి పురుగులు వంటివి అనేక క్రిములు బుట్టును...అని
  ఇంకా,
  రక్తము పులిసిపోవుట వలన చెడిపోయి యూరిక్ యాసిడ్ గా తయారగుచున్నది. అంతేకాక చిక్కబడిపోవుచున్నది. అందువల్ల కీళ్ళ నొప్పులు, గుండెజబ్బులు సంభవించుచున్నవి. మరియు మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడుచున్నవి...ఇలా ఎన్నో విషయములను గురించి వ్రాసారు.

  నేటి మానవులు నాగరికత పేరుతో శారీరిక శ్రమ చేయకపోవటం, ప్రకృతికి దూరంగా కృత్రిమ వాతావరణంలో జీవించటం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని తమ అభిప్రాయములను వెలిబుచ్చారు.

  వీరి అడ్రస్..... " డాక్టర్ వి.వి. రామరాజు గారు ."
  శ్రీ చోడే అప్పారావు ప్రకృతి చికిత్సాలయము.
  బోట్ క్లబ్ వద్ద, కాకినాడ.


  ReplyDelete
 9. @anrd గారూ మీరు చెప్పిన వాటితో ఏకీభవిస్తాను. ప్రపంచ జనాభాలో క్రీస్టియన్లు 34% ముస్లిములు 21% హిందువులు 14%. ఇందులో శాకాహారమే తినాలి అని మతపరంగా నిర్దేశింప బడినవారు 7% మాత్రమే అని చెప్పవచ్చు. నా ప్రశ్న ఎందుకు ఇల్లా నిర్దేశించా రని. కారణాలు కాలంలో కలిసిపోయుంటాయి. సమాధానం దొరకలేదు.

  కాకపోతే మాంసాహారులలో శాకాహారం లేకుండా మాంసాహారము తినే వాళ్ళు చాలా తక్కువ అనుకుంటాను. అందుకనే దైనందిన జీవనంలో పెద్ద మార్పులు కనపడక పోవచ్చు.

  ReplyDelete
 10. You may want to add Plain Greek Yogurt - It's very rich in protein

  ReplyDelete