Monday, June 4, 2012

85 ఓ బుల్లి కథ 73 --- రోజుకి మనకెంత ప్రోటీన్ కావాలి ?

మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేవి, శరీరంలో మనకు హాని కలిగించే వాటిని తొలగించేవి , మనకి సరిఅయిన ఆకారం ఇచ్చేవి, నిజం చెప్పాలంటే మన జీవత్వానికి మన మనుగడకు ఈ ప్రోటీన్స్ చాలా ముఖ్యం. ఈ ప్రోటీన్స్ అన్నీ, శరీరంలో తయారు అయి మన శరీరంలో జీవ కణాలలో ఉంటాయి. మనం చెయ్యవలసిన పనల్లా మనం తినే ఆహారము ద్వారా వాటి తయారుకి కావలసిన ముడి పదార్దములు అందించటమే. ఈ పోస్ట్ దానిని విశదీకరించటానికి. 

మన శరీరం అంతా కణాల (cells ) మయం. (ఉదా: ఎర్ర కణాలు, తెల్ల కణాలు, న్యురాన్స్ మొదలయినవి). మనము చేద్దామనుకున్న పనులకు శక్తినిచ్చేవి, శక్తిని పంచేవి ఇవ్వే. మన శరీరంలో జరిగే దాదాపు అన్నిపనులూ ఒక క్రమ పద్దతిగా చేయించేవి కూడా ఇవ్వే. దీనికి కారణము వాటిలో ఉండే జన్యు పదార్ధము. దానినే డి యన్ ఏ (DNA ) అంటారు.

ఈ DNA లో ఉండే మూల పదార్ధాలు నాలుగు,Adenine (A ), Cytosine (C ), Guanine (G ), Thymine (T ). వీటిని nucleotide bases అంటారు. ఈ నాలుగూ వివిధ రకాలుగా కలసిపోతూ, చాంతాడులా పెరిగిపోతూ, పల్టీలు కొట్టుకుంటూ మెలికలు తిరుగుతూ DNA కి double helix ఆకారంఇస్తాయి. మన ఆకారములూ ,రంగులూ ,అలవాట్లూ ,రోగాలూ రోచ్చులూ ఈ DNA ప్రత్యక్షం గానో పరోక్షం గానో చేయించేవే.

శాస్త్రజ్ఞులు DNA మీద వరసగా ఉన్నమూడు nucleotides ఒక ముఖ్యమైన చిన్న సమాచారం అందిస్తాయని గ్రహించారు. దీనినే triplet code అంటారు (ఉదా: (Guanine, Cytosine, Adenine) GCA అనే code, Alanine(Ala)  అనే amino acid ని సూచిస్తుంది ). అది ఒక సమాచారానికి (code ) సంకేతం కాబట్టి codon అని కూడా అంటారు. DNA మీద ఈ codons కొన్ని గ్రూపులు గ మారి ఒక పెద్ద సమాచారం ఇస్తాయని గ్రహించారు. వీటికి జీన్స్ అని పేరుపెట్టారు. అంటే ప్రతీ జీన్ లో బోలెడన్ని codons ఉండి సమాచార కేంద్రాలుగా ఉంటాయన్నమాట. ఈ జీన్స్ మనలో దాదాపు 25,000 ఉంటాయి.

మన శరీరంలో జరిగే అన్ని రసాయనిక కార్య క్రమాలలో పాల్గొని (ఉదా: మనం తిన్న ఆహారాన్ని జీర్ణించటం ఒక పెద్ద రసాయనిక కార్యక్రమం) వాటి పరిపక్వతని పెంపొందించే ఎంజైములూ, హార్మోనులూ వగైరా తయారుకి కావలసిన సూత్రాలు, ఈ జీన్సు ద్వారా DNA నుండే వస్తాయి. ఈ తయ్యారు కాబడ్డ వాటిని ప్రోటీన్స్ అంటారు. ఈ ప్రోటీన్స్ అన్నీ ఇరవై ఎమినో యాసిడ్స్(amino acids) తో తయ్యారు చెయ్యబడ్డవని పరిశోధనలలో కనుగొన్నారు. ఇంకో విధంగా ప్రోటీన్స్ అంటే ఈ ఇరవై amino acids తో వివిధ రకాలుగా దీర్ఘంగా అల్లిన గొలుసు కట్టు (long chain ) రసాయనిక పదార్ధాలు. జీన్సులో ఉన్న ఒక్కొక్క codon ఒక్కొక్క amino acid ను తెలుపుతుంది.

మన DNA ఒక వంటల పుస్తకం అనుకుంటే, జీన్సు అనేవి ఆ పుస్తకంలో (పేజీలు) వంటలు చేసే విధానాలు చెప్పేవి. శరీరమంతా కణాల్లో DNA ఉంటుంది కాబట్టి, ఆయా ప్రదేశాల వంటలకు కావాల్సిన సూత్రాలు ఆయా జీన్సునుండి తీసుకోబడుతాయి. ఉదాహరణగా మనము తిన్న ఆహారం జీర్ణాశయంలో ఉంది. జీర్ణం అవటానికి జఠరరసం కావాలి. జీర్ణాశయం, DNA లో జఠరరసం తయ్యారు చెయ్యటానికి రెసిపీ ఉన్న జీన్ కి సంకేతం పంపిస్తుంది (దీన్ని జీన్ యాక్టివేషన్ అంటారు). ఆ జీన్ లో ఉండే codons ఆ ఎంజైము తయారు చెయ్యటానికి కావలసిన ఎమినో యాసిడ్ క్రమం చెబుతుంది (బయటకి పంపిస్తుంది). ఆ రెసిపీ తీసుకుని బయట జఠరరసం తయారు చెయ్యబడుతుంది. ఇక్కడ గమనించవలసినది, రెసిపీ ప్రతి వస్తుంది గానీ మూలం DNA లోనే ఉంటుంది.

శరీరంలో ప్రోటీన్స్ తయారవటం కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. ఇది దాదాపు చాప మీద కూర్చొని అమ్మ చెప్పినట్లు ఒక్కొక్క మల్లెపువ్వూ తీసుకుని గుచ్చుతూ మల్లె మాల కట్టినట్లు ఉంటుంది.

జీన్ activate అవ్వంగానే, ఆ జీన్ copy ఒకటి DNA నుండి విడుదలవుతుంది. దానిని messenger RNA (mRNA) అంటారు. దానిలోని ప్రతీ codon ఒక్కొక్క transfer RNA (tRNA) ని బయటకు పంపుతుంది. ఈ transfer RNA చెయ్యాల్సిన పని అల్లా codon చెప్పిన amino acid ని వెతికి పట్టుకుని ప్రోటీన్ తయారు అయ్యే చోటుకి తీసుకు రావటం. ఈ ప్రోటీన్ తయ్యారు అయ్యే చోటు ని  Ribosome అంటారు. అక్కడ జీన్ చెప్పిన విధంగా వచ్చిన amino acids అన్నీవరసగా కూర్చబడుతాయి. ఈ amino acid కూర్పును polypeptide chain అంటారు. ఈ chain వివిధ రకాలుగా నిర్మాణాత్మక మార్పులు చెంది ప్రోటీన్స్ గ మారుతాయి.

మన cells లో ఉండే ఈ ప్రోటీన్స్ మన మనుగడకు చాలా ముఖ్యమయిన పనులు చేస్తాయి. సామాన్యంగా అవి చేసే పనులు వాటి నిర్మాణాన్ని బట్టి ఉంటాయి. collagen , keratin లాంటివి పీచుతో ఉండి ఆకారాన్ని సృష్టిస్తాయి. hemoglobin లాంటివి ముడుచుకుపోయి దట్టముగా ఉండి ప్రాణ వాయువును దాచి పెట్టుకుని అన్నిటికీ అందిస్తాయి  ఎంజైములూ, హార్మోనులూ అన్నీ ప్రోటీన్లే. ఇన్సులిన్ మనము తిన్న ఆహారాన్ని శక్తీ ప్రదాయినిగా మార్చటంలో దోహదం చేస్తుంది , మనము తిన్న ఆహారంలో ఉన్న ప్రోటీన్స్ ని విచ్చిన్నం చేసి జీర్ణం చేసే పెప్సిన్ కూడా ప్రోటీనే. ఇంతెందుకు మన జీవత్వానికి ఈ ప్రోటీన్స్ చాలా ముఖ్యం.

ఇంత ముఖ్యమైన ప్రోటీన్స్ ఇరవై ఎమినో యాసిడ్స్ తో తయారవు తాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకో ఆశ్చర్య సంగతేమిటంటే మన శరీరం తన రసాయనిక శాలలో పదకొండు ఎమినో యాసిడ్స్ తయారు చేసుకోకలదు కానీ తొమ్మిదింటిని మాత్రం అది తనంతట తాను చేసుకోలేదు. ఆ తొమ్మిది  ఎమినో యాసిడ్స్ ని essential amino acids అంటారు. ఇవి తయారు చెయ్యటానికి మూల పదార్ధాలు మనము తీసుకునే ఆహారం నుండి రావాలి.

మనము తీసుకునే ఆహారంలో ప్రోటీనులు రోజుకి షుమారు 65 గ్రాములు పురుషులకు , 55 గ్రాములు స్త్రీ లకు ఉండుట మంచిదని ఆహార పరిశోధకులు నిర్ణయించారు (దీనిలో ఏకాభిప్రాయము లేదు). శాఖాహారు లైతే essential amino acids ఉన్న పదార్ధాలు లేక అన్ని amino acids ఉన్న పదార్ధాలు తినటం మంచిది. మీరు కేలరీస్ లో లెక్క వెయ్యాలంటే ఒక గ్రాము ప్రోటీన్ నాలుగు కేలరీస్ తో సమానము.

మాంసాహారులకు ఇరవై ఎమినో యాసిడ్స్ (ఈ తొమ్మిది essential amino acids తో సహా ) ఆహారం నుండి వస్తాయి కానీ శాఖాహారుల మాటేమిటి ? మనపూర్వులు శాఖాహారులై జీవించ లేదా? లేక కొన్ని ప్రోటీన్స్ లేకుండా జీవితం బాధలతో గడపాలా ? ఇప్పుడు కూడా శాఖాహారులై చాలా మంది జీవిస్తున్నారే ? ఏమిటి కధ ?

శాఖాహారులకి ఎమినో యాసిడ్స్ అన్నీ ఆహారంలో ఉండాలంటే సమీకృత ఆహారంతోనే వస్తాయి. Potatoes, Asparagus, Pears, Navy Beans, Milk, Cashews లో అన్ని ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. శాఖాహారులకు  మనకు కావాల్సిన ఏ ఏ ఎమినో యాసిడ్స్ ఏ ఏ ఆహారాలలో ఉంటాయో నాల్గవ మాతృకలో ఉన్న పట్టిక నుండి గ్రహించ వచ్చు.

సమీకృత ఆహారం ఎందుకు చెప్పానంటే మాంసా హారం లాగా అన్ని శాఖా హారాలలో, ఒక దాన్లోనే అన్ని essential amino acids ఉండక పోవచ్చు కానీ వివిధ శాఖా హారాలలో వివిధ essential amino acids ఉన్నాయి. ఉదాహరణకి మొక్క జొన్నలో lysine or threonine తక్కువ కానీ beans లో అవి ఉన్నాయి. (Some foods from the plant kingdom, such as soy and quinoa, have complete protein).

పూర్వకాలంలో దంపుడు బియ్యం తినే వారు. పప్పు (beans ) రోజూ ఉండేది. పాలు మజ్జిగలకు కొదవలేదు. చిరుతిళ్ళు వేరుశనగ కాయలు, శనగ గుగ్గిళ్ళు, మొక్కజొన్న కండెలు,నువ్వుల జీళ్ళు, చిమ్మిరి ఉండలు.  ఇంక ప్రోటీన్స్ కి మనకేమి కొదవ ?  మన ఆహారంలో అందరి బాగూ కోరి ఇవన్నీ ఉండేటట్లు మన భోజన ఆచారాలను తయారు చేసిన మన పూర్వీకులను మనము ఎంతో మెచ్చుకోవాలి. 

ఈ క్రింది సమాచారం అయిదవ నంబరు మాతృక నుండి సేకరించినది.

The human body uses protein to repair damaged cells and to build new ones. Marion Nestle, professor of nutrition at NYU and author of What to Eat, estimates that the average adult man needs about 65 grams of protein a day and the average adult female needs about 55 grams. Some sources, such as the Centers for Disease Control and the World Health Organization say you can maintain a healthy diet with even less.

What does this actually mean in terms of food choices? The National Institutes of Health explains that most people can meet their daily protein requirement by eating two to three small servings of a protein-rich food a day.

Examples of a single serving of protein include:
1 egg
2 tablespoons of peanut butter
2-3 ounces of red meat, poultry, or fish (about the size of a deck of cards)
½ cup of cooked dried beans such as black beans or chickpeas

Whole grains, seeds, and some vegetables also contain protein, so consuming enough is not difficult even if you don't eat meat. Vegetarians and vegans can easily get what they need by balancing complimentary proteins such as corn and beans or rice and tofu. Nutritionists used to recommend combining foods at the same meal, but research now shows that is unnecessary.
Are there drawbacks to eating more protein?

Eating large amounts of red and processed meats is associated with higher rates of heart disease and cancer, and most nutritionists such as Marion Nestle recommend cutting back on meat, especially on fatty cuts.

ప్రోటీన్స్ మీద నా ఇంకొక పోస్ట్:
86 ఓ బుల్లి కథ 74 --- ప్రోటీన్స్ విషయంలో శాకాహారులు మోసపోయారా ?


మాతృకలు:

1. Protein Function : http://biology.about.com/od/molecularbiology/a/aa101904a.htm

2. http://biology.about.com/b/2010/07/10/what-is-transcription.htm?nl=1

3. http://biology.about.com/b/2010/11/17/protein-synthesis-translation.htm?nl=1

4. http://www.nomeatathlete.com/vegetarian-protein/

32 comments:

 1. ఎన్నో చక్కటి విషయాలను తెలియజేసిన మీకు కృతజ్ఞతలు.

  గుండె కొట్టుకోవటం, ఆహారం జీర్ణం అవటం వంటి ప్రక్రియలన్నీ అద్భుతం..... ఇవన్నీ ఏర్పరిచిన భగవంతునికి కృతజ్ఞతలు.

  ReplyDelete
 2. నమస్కారములు
  ఛాలా చక్కని సమాచారాన్ని అందించారు. మన పూర్వీకులు చెప్పినట్టు అవన్నీ ఇప్పుడు కూడ మనకి కొంత వరకు అందు బాటులోనే ఉన్నాయి. కానీ ప్రతీదీ , కొవ్వు అనీ బరువు పెరుగు తామనీ ఒకటే ఆంక్షలు. మరి పీజాలు , బర్గర్లు , చీజులు , వీటి సంగతి ? ఒకోసారి ఆకులు అలములు , తినడం. అసలు ఏదీ సరైన అవగాహన లేక ఉన్న ఆరోగ్యం పాడు చేసు కోవడం .మీ సలహాలు కొన్నైనా పాటిస్తే మంచి ఆరోగ్యంగా ఉండ వచ్చును. మంచి సలహాలు ఇచ్చి నందుకు ధన్య వాదములు.

  ReplyDelete
 3. శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.

  చక్కటి వివరణాత్మక వ్యాసం ఇది. ఇంత complicated మరియు complex system తో మన శరీరం సృష్టించబడింది అంటే దీనిని ఎవరో ఒకరు ఊహాత్మకంగా సృజించారనే తప్పక చెప్పాలి. ఆ సృష్టికర్తనే పెద్దలు భగవంతుడు అని చెప్పటంలో అతిశయోక్తి ఏమీలేదు.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  ReplyDelete
 4. @anrd గారూ మన దేహంలో పనులు వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. సృష్టికర్త మహిమలు తెలిసికొన్న కొద్దీ చిత్రంగా ఉంటాయి. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete
 5. @రాజేశ్వరి గారూ
  ఏవిధంగా మన సంప్రదాయాలలో (ఆచారాలలో)మనం తినే ఆహారం పెన వేసుకు పోయిందో ఇప్పటికీ అర్ధంకాదు. కొత్త కొత్తవి చదువుతున్న కొద్దీ అరె చిన్నప్పుడు మనము ఇలా ఉండే వాళ్ళమే, మనవాళ్ళు ఏమి పరిశోధనలు చేసి (వేటిని గమనించి) ఆ అలవాట్లు మనకి ఇచ్చారు ? ఎందుకిలా మారిపోయాం అనిపిస్తుంది.
  నిన్ననే ఒక చోట చదివాను "జీవితంలో నమ్మతగ్గవి సంస్కృతి పరంగా మనకు సంప్రదించిన ఆచారాలు". ఎందుకంటే అవి తరతరాలుగా, కాలాతీతంగా సంక్రమించినవి.
  మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete
 6. రావు గారు, మంచి పాఠం. నావి రెండు ప్రశ్నలు.
  1) ఈ ప్రోటీన్ల సమస్య శాఖాహారులైన మనుషులకే ఎందుకుంటుంది? రైనో, ఏనుగు, గుర్రం, ఎద్దు లాంటి బలమైన జంతువులకు ప్రోటీన్లు ఎక్కడినుంచి అందుతున్నాయి? మాంసాహారులు తినే జంతువులన్నీ (ఆవు, మేక, గొర్రె, కుందేలు, పంది)చాలావరకు శాఖాహారులే కదా!

  2)తినే ఆహారాన్ని బట్టి జీన్స్‌లో మార్పులు సాధ్యమా?

  ReplyDelete
 7. @ లక్కరాజు గారూ,
  అందరికీ అర్థమయ్యే రీతిలో బాగా చెప్పారు. కాకపోతే ఇందులో చిన్న సవరణ. "ఈ DNA లో ఉండే మూల పదార్ధాలు నాలుగు,Adenine (A ), Cytosine (C ), Guanine (G ), Thymine (T ). వీటిని nucleotides అంటారు" అన్నారు. ఇవి nucleotides కాదు. వీటిని nucleic acids అంటారు. ఆ nucleic acid ఒక sugar తో కలిసినపుడు వాటిని nucleoside అనీ, ఈ nucleoside ఒక phosphate తో కలిసినప్పుడే nucleotide అనీ అంటారు. అంటే ATP, GTP, CTP, TTP లను మాత్రమే మనం nucleotide అనాలి.

  @ SNKR గారూ
  హహహ! భలే వారే! మీకు భలే సందేహాలోస్తాయే! ఆ జంతువులు తినే కొన్ని పదార్థాల్ని మనం తిన్నా కూడా జీర్ణం చేసుకోలేము కదా! ఉదాహరణకి గడ్డి. అందులో cellulose ఉంటుంది. దానిని జీర్ణం చేసే ఎంజైమ్ మనలో ఉండదు. ఏదయినా తిన్న పదార్ధం జీర్ణం అయితేనే కదా మనకి పోషకాలు అందేవి. అలా మనకి కొన్ని పోషకాలు అందవనమాట. అదే జంతువులు అనుకోండి వాటిని తిని, జీర్ణం చేసుకుని దాచి పెట్టుకున్న నిల్వలని మనుషులు తినడం ద్వారా ఆ పోషకాలు మాంసాహారులకి ఎక్కువగా చేరుతాయి. సంపాదించలేనప్పుడు డబ్బు కావాలి అంటే సంపాదించి దాచిపెట్టుకున్న వాళ్ళ దగ్గర దొంగతనం ఎలా చేస్తారో ఇది కూడా అలాంటిదే :):) మాంసాహారులు అలా దొంగిలించేస్తారనమాట. ఆ పని చేయని శాకాహారులకి ప్రోటీన్ల సమస్యను ఎదురుకోక తప్పదు. ప్రత్యామ్నాయాలు వెత్తుక్కుంటూ తినాలి అందుకనే ;)

  ReplyDelete
 8. @రసజ్ఞ గారూ
  వైకపీడియా లో ఇలా ఉంది. నేను వ్రాసింది సరి కాకపోతే సరిచేస్తాను. తెలిపేది. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  Nucleotide
  From Wikipedia, the free encyclopedia
  Nucleotides are molecules that, when joined, make up the individual structural units of the nucleic acids RNA and DNA.

  ReplyDelete
 9. @మాధవరావు గారూ మీరు అన్న
  "సృష్టికర్తనే పెద్దలు భగవంతుడు అని చెప్పటంలో అతిశయోక్తి ఏమీలేదు"
  ---------------------------------
  మనం సృష్టించ లేనంత కాలం ఆ "మహా శక్తి" ఉనికిని ఒప్పుకోక తప్పదు.
  మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

  ReplyDelete
 10. ఒప్పుకుంటాను అది కరెక్టే. కానీ అక్కడే కొంచెం క్రిందకి వెళ్ళి చూడండి. nitrogen base (A/T/G/C) + sugar + phosphate = nucleotide అని ఇచ్చాడు.
  http://en.wikipedia.org/wiki/Nucleotide

  ReplyDelete
 11. @రసజ్ఞ గారూ
  మీరన్నట్లు "వీటిని nucleic acids అంటారు." అంటే DNA RNA లని ఏమనాలి?
  అందుకని సింపుల్ గ అలాగే ఉంచు దామనుకుంటున్నాను (వైకపీడియా లో మొదట చెప్పినట్లు). కొంచెం లోతుగా వ్రాయవలసి వచ్చినప్పుడు మీరు చెప్పినట్లు వ్రాస్తాను. థాంక్స్.

  ReplyDelete
 12. మన్నించాలి. నేను అక్కడ nucleobase అని వ్రాయబోయి nucleic acid అని వ్రాశాను. DNA, RNA లనే nucleic acids అంటారు. నేను మార్చమని చెప్పలేదు. కానీ A,T,G,C లు మాత్రం nucleotides కాదు అని చెప్పదలచాను. మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి.

  ReplyDelete
 13. @రసజ్ఞ గారు వాటిని nucleotide bases అందాము. సరిపోతుంది అంటారా? అవి నిజంగా base లే కదా. నొప్పించటం అంటూ ఏమీ లేదు. సరిఅయిన పదం వాడాలి కదా.

  ReplyDelete
 14. This comment has been removed by the author.

  ReplyDelete
 15. @snkr గారు
  ప్రకృతి తను సృష్టించే జీవులకి, జీవత్వం కొనసాగించటానికి తగిన జాగర్తలు తీసుకుంటుంది అని నేను నమ్ముతాను. దొరికే ఆహారాన్ని తీసుకుని జీర్ణించుకుని ఆ వచ్చిన శక్తితో తమ తమ కర్తవ్యాలని నెరవేర్చు కుంటాయి. ఆహారము ను శక్తిగా మార్చుకునే పద్ధతులు వివిధ ప్రాణులలో వ్యత్యాసములు ఉండచ్చు. వాటి శరీరంలో సృష్టి ఏర్పాటు చేసిన రసాయన శాల బట్టి, కొన్ని శాఖా హారము తినవచ్చు కొన్ని మాంసాహారము తినవచ్చు, సృష్టి లో ఆ యా జంతువులు వాటి పని అవి చేసుకుంటున్నాయి కాబట్టి వాటికి కావలసిన శక్తి అవి తినే ఆహారమునుండి, ప్రోటీన్సు తో సహా అవసరమయినవి లభ్యమవు తున్నాయని చెప్పొచ్చు.తినకూడనివి తింటే ఆ జాతి సమసిపోవచ్చు. ఉదా: ప్లాస్టిక్ బాగ్లు తిని మనదేశంలో ఆవులు, గేదెలు జీర్ణించుకోలేక బాధలకు గురి అయినాయి కదా.

  మనలో కూడా మనము తినే ఆహారము జీర్ణింప బడి శక్తి నిచ్చే రసాయనక శాలలు ఉన్నాయి. మనలో శాఖాహారులూ ఉన్నారు మాంసా హారులూ ఉన్నారు. అందరూ వారి వారి పనులు చేసుకుంటూ బ్రతికి బట్టకట్టారు. మనము తరతరాలుగా జీవిస్తున్నాము. శాఖాహారులూ బతికే ఉన్నారు మాంసా హారులూ బతికే ఉన్నారు. అంటే ప్రకృతి మనలో సరీగ్గానే పని చేస్తోందన్న మాట.

  మీ రెండో ప్రశ్న ఆహారాన్ని బట్టి "జీన్సు" లో మార్పులు సాధ్యమా. నా ఉద్దేశంలో సాధ్యమే.మార్పుచెందిన కొన్ని జీన్స్ బతుకు తాయి కొన్ని బతకలేక చస్తాయి. దీనిమీద ఇంకో పోస్ట్ విపులంగా వ్రాస్తాను.

  మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete
 16. ఓ వెజ్ రెస్టారెంట్లో Humans are by design vegetarian అన్న పోస్టర్ చూశాను. దానికి సపోర్టింగ్‌గా పళ్ళ నిర్మాణం, మరికొన్ని వుదహరించారు. కొన్ని కోతి జాతులు శాఖాహారులే మరి అవి ప్రోటీన్లు తయారుచేసుకోలేక ఎందుకు అంతరించి పోలేదు? మనుషుల్లో కూడా శుద్ధ శాఖాహార కుటుంబాలు ఎందుకు అంతరించడం లేదు? అనిపిస్తే... దానికి మీరు చెప్పింది సమంజసంగా అనిపిస్తుంది.
  ధన్యవాదాలు

  ReplyDelete
 17. శంకర్ గారు ఆనందభవన్ లోనా ?:)))

  ReplyDelete
  Replies
  1. ఎక్కడొ గుర్తు లేదండి, కోమలాస్ ఏమో.

   Delete
 18. సర్ ! ఈ విషయాలన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి. నాకు ఒక సందేహం వచ్చిందండి. శాకాహార జంతువులను తినటం ద్వారా మాంసాహార జీవులు ప్రొటీన్స్ పొందుతున్నాయి. అన్నారు కదా ! అంటే శాకాహారాన్ని తినే జంతువుల్లో ప్రొటిన్స్ సమస్య ఉండదని అర్ధం కదా ! . అలా చూస్తే శాకాహారాన్ని తినే మనుషుల్లో కూడా ప్రొటీన్ల సమస్య ఉండదు కదా ! . ప్రొటీన్ల కోసం మాంసాహార జీవులు శాకాహార జీవుల మీద ఆధారపడుతున్నాయంటే , శాకాహారజీవుల్లో ప్రొటీన్ల సమస్య ఉండదని అర్ధమవుతోంది.

  ** ఇంకా, నాకు ఏమనిపించిందంటేనండి, మాంసాహార జంతువులు శాకాహార జంతువులను తినటం ప్రొటీన్ల కోసం కాకపోవచ్చు. సృష్టిలో జీవ వైవిద్యం ఒక బ్యాలన్స్ తప్పకుండా ఉండటానికి ఇలా ఏర్పాటు జరిగి ఉండవచ్చు .

  అంటే మొక్కలు బాగా దగ్గరదగ్గరగా పెరిగిపోతే పోషకాలు సరిపోక మొక్కలు బలహీనమయిపోతాయి. శాకాహార జంతువులు విపరీతంగా పెరిగిపోతే వాటికి ఆహారం సరిపోక ఆ జాతులు బలహీనమయిపోతాయి. మాంసాహార జంతువులు విపరీతంగా పెరిగిపోయినా కష్టమే .

  చెట్లు విపరీతంగా పెరిగిపోకుండా మొక్కలను తినే శాకాహార జీవులు ఏర్పడ్డాయి, శాకాహార జీవులు విపరీతంగా పెరిగిపోకుండా వాటిని తినే మంసాహార జీవులు సృష్టించబడ్డాయి. మాంసాహార జీవులు విపరీతంగా పెరిగిపోకుండా వాటిని అవే తినేస్తాయి. ఉదా... పిల్లలు పుట్టిన వెంటనే విపరీతమైన ఆకలి వల్ల పులి తన పిల్లల్ని తానే తినేస్తుందట. మిగిలిన పిల్లలే జీవిస్తాయి. ఇలా అన్ని జీవులు చక్కగా జీవించటానికి సృష్టిలో ఒక క్రమ పధ్ధతి ఉంది అనిపిస్తుంది.

  ReplyDelete
 19. బహుశా ఇలా కూడా కావచ్చు.

  శాకాహారం తినే జంతువులు, మనుషులు చేసే పనికి, శ్రమకి ప్రొటీన్లు ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు.
  అదే మాంసాహారం తినే జంతువులు, మనుషులు చేసే శ్రమకి ఎక్కువ ప్రొటీన్లు అవసరం ఉండచ్చు.

  ఉడహరణకి సింహం లాంటి జంతువులు వేటాడతాయి కాని జింకలు. మేకలు వేటాడవు.
  అలాగే మాంసాహారం తినే మనుషులే ఎక్కువ కాయకష్టం చేసే వృత్తుల్లో ఉంటారు.
  ఇది తప్పు కూడా కావచ్చు.

  ReplyDelete
 20. ఇలా కూడా ఆలోచిస్తే ..
  మాంసాహార జంతువులకూ ప్రొటీన్లు అవసరమే. శాకాహార జంతువులకూ ప్రొటీన్లు అవసరమే. ఉదా.... వేటాడటానికి సింహానికి ఎంత బలం అవసరమో ..... అంతకంటే ఎక్కువ బలం సింహం నుంచి తప్పించుకుని పారిపోవటానికి జింకకూ అవసరం. ఇంకా శాకాహార జంతువులు ఎప్పుడు ఏ జంతువు తమ మీద దాడిచేస్తుందో అన్న టెన్షన్ వల్ల అనునిత్యం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకు వాటికి ప్రొటీన్లతో కూడిన ఆహారం ఎంతో అవసరం.


  శారీరిక శ్రమ చేసే వ్యక్తికి బలమైన ఆహారం అవసరమే. మానసికశ్రమ చేసే వ్యక్తికి కూడా బలమైన ఆహారం అవసరమే. ఉదా.... పిల్లలకు బలమైన ఆహారం ఉంటేనే చక్కగా చదవగలరు.. మానసికంగా శ్రమ చేసే శాస్త్రవేత్తల వంటి వారికి కూడా ప్రొటీన్స్ ఎంతో అవసరం.


  రైనో, ఏనుగు వంటి శాకాహార జంతువులు ఎంతో బలమైనవి. శాకాహార జంతువు అయిన గుర్రం వేగంగా పరిగెట్టగలదు. ఏనుగు ఎంతో బరువును మోయగలదు.

  * బాదాం, అక్రూట్, వేరుశనగపప్పు, ..... ఇలాంటివి మాంసాహారంలా ప్రొటీన్స్ కలిగి ఉన్న ఆహారమట.

  ReplyDelete
 21. సెల్యులోస్ మానవులకు జీర్ణం కాదు అంటున్నారు. . ఆ విషయం ఎలా ఉన్నా , తరతరాలుగా శాకాహారం తినే ఎందరో మానవులు ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి, శాకాహారం మానవులకు బలమైన ఆహారం అని మనం నమ్మవచ్చు.

  జంతువులు పచ్చి ఆకులు , కాయలు తింటాయి. . మానవులు ఉడికించిన కాయకూరలు తింటారు. ఉడికించిన శాకాహారం వల్ల సెల్యులోస్ జీర్ణం అవుతుందేమో ? తెలియదు. . ...

  .ఆహారపదార్ధాలను ఎక్కువగా ఉడికిస్తే " c " విటమిన్ తగ్గిపోతుందంటారు. కొన్ని రకాల ఆహారం పచ్చివి తింటే మంచిది. కానీ కారెట్ వంటి వాటిని ఉడికించి తింటే విటమిన్స్ పెరుగుతాయట..

  ReplyDelete
 22. @anrd గారు
  ఈ విషయాలన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి.
  ---------------
  క్లుప్తంగా చెబుతాను:

  1. మన దైనందన జీవితానికి ప్రోటీన్స్ చాలా అవుసరం. శరీరంలో మనకు శక్తి నిచ్చే రసాయనిక ప్రక్రియలన్నిటిలోనూ దాదాపు ప్రోటీన్స్ పాల్గొంటాయి.

  2. మానవ శరీరంలో ప్రోటీన్స్ అన్నీ 20 రకాల పదార్ధాలతో(ఏమినో అసిడ్స్) చెయ్యబడ్డవని గుర్తించారు.

  3. ఆ 20 ఏమినో అసిడ్స్ లో 11 మన శరీరం తనంతట తను తయారు చేసుకోగలదని శాస్త్రజ్ఞులు గుర్తించారు. మిగతా తొమ్మిది మనం తినే ఆహారంలో నుండి రావాలి.

  4.మాంసములో 20 ఏమినో అసిడ్స్ ఉంటాయి కాబట్టి, మాంసాహారులకు వారి ఆహారంలో ప్రోటీన్స్ తయారుకి తగిన మూల పదార్ధాలు ఒక చోటనే దొరుకుతాయి. అందుకని మాంసము తప్పకుండా తినాలని మాంసాహారుల వాదన.

  5.వకే శాఖా హారంలో అన్ని ఏమినో అసిడ్స్ లేకపోయినా వివిధ ఆకు కూరలు తినుట వలన ప్రోటీన్స్ తయారు కి కావలసిన అన్ని ఏమినో అసిడ్స్ దొరుకుతాయని శాఖాహారుల వాదన. దీనికి రుజువు శాఖాహారులు మాత్రమే చనిపోవటల్లేదు.తరతరాలుగా వారి జీవితం వారు సాగిస్తూనే ఉన్నారు. వారికి కావాల్సిన అవసరమయిన ప్రోటీన్స్ వారి శరీరం తయారు చేసుకుంటూనే ఉన్నది.
  నాల్గవ మాతృకలో శాఖాహార పట్టిక ఉన్నది. శాఖాహారులు తప్పకుండా సమీకృత ఆహారం తీసుకోవాలి.

  6. చివరికి తేలేదేమంటే పుట్టిన ప్రతిజీవికీ సృష్టికర్త, సృష్టిలో అవి చెయ్యాల్సిన పనులకి తగిన ఏర్పాటులు చేసి వుంటాడు.

  7. ఎందుకు కొందరు శాఖాహారులయ్యారు కొందరు మాంసాహారు లయ్యారు అనే దాని మీద పోస్ట్ సాగ తీయొచ్చు గానీ కులాలు మతాల చర్చ లోకి దిగటం నా కిష్టము లేదు.
  ---------------------------------------------------
  మీరు ఇంకోటి చెప్పారు
  "చెట్లు విపరీతంగా పెరిగిపోకుండా మొక్కలను తినే శాకాహార జీవులు ఏర్పడ్డాయి, శాకాహార జీవులు విపరీతంగా పెరిగిపోకుండా వాటిని తినే మంసాహార జీవులు సృష్టించబడ్డాయి. మాంసాహార జీవులు విపరీతంగా పెరిగిపోకుండా వాటిని అవే తినేస్తాయి."
  ------------
  అదేకదా పరిణామ క్రమం (Evolution) అంటే.

  మీ వ్యాఖ్యలకు ధన్యవాదములు.

  ReplyDelete
 23. @bonagiri గారు

  సృష్టికర్త ఎవరు చెయ్యవలసిన పనులకు కావాల్సిన సదుపాయాలు చేస్తాడను కుంటాను. కాకపోతే మానవుల్లోనే మనకిచ్చిన తెలివితేటలతో కృత్రిమ ఆహారాల్ని సృష్టించి తిని బాధల పాలవుతున్నాము.

  మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

  ReplyDelete
 24. ఈ పోస్ట్ + చర్చ.. ఒక సీరియస్ బయోకెమిస్ట్రీ క్లాస్ స్థాయిలో ఉన్నాయి. science విషయాలు ఇంత ఎకడెమిక్ గా తెలుగు బ్లాగులో చర్చించబడటం చాలా సంతోషదాయకం. మీకు నా అభినందనలు.

  ReplyDelete
 25. @yaramana గారు మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete
 26. @anrd గారు
  కొన్ని రకాల ఆహారం పచ్చివి తింటే మంచిది. కానీ కారెట్ వంటి వాటిని ఉడికించి తింటే విటమిన్స్ పెరుగుతాయట..
  ---------------------------
  ఒక పోస్ట్ వ్రాద్దామనుకున్నా కానీ క్లుప్తంగా చెప్పేస్తా:

  1. పచ్చివిగా తింటే మంచివి: ఉల్లిపాయలు.
  ఇవి కోసినప్పుడు organosulfides అనే రసాయనిక పదార్ధాలు బయటికి వస్తాయి. ఇవి కేన్సర్ కణాలను అడ్డుకోటానికి, వాపులు తగ్గటానికీ, కీళ్ళ నొప్పులు తగ్గటానికీ మంచిది.
  they help halt cancer cell growth and may have anti-inflammatory effects that protect against osteoarthritis.

  2. వండితే మంచివి: టొమాటో, బెల్ పెప్పెర్, కార్న్,కారట్, మష్రూమ్స్.
  టొమాటో లో అయితే వండటము మూలాన వాటి కణముల లో నుండి lycopene అనే కేన్సర్ తో పోరుచేసి antioxidant బయటికి వస్తుంది.
  మిగతా వాటిల్లో పోషకపదార్ధాలన్నీ బయటికి వస్తాయి.
  వాటిల్లో ఉండే చెడ్డ పదార్ధాలు పోటానికి మష్రూమ్స్ తప్పకుండా ఉడకపెట్టి తినాలి. బ్రేస్ట్ కేన్సర్ నిరోధి.
  one recent study found that eating mushrooms daily was associated with a 64% reduction in breast cancer risk.

  3.పచ్చిగా నూ, ఉడికించీ తినవచ్చు: బ్రోకలీ, కాబేజీమొదలయినవి.
  రెండు విధాలుగా కలిపి తినటం మంచిది. నమలటము మూలాన, కొరికి తినటం మూలాన, వండటం మూలాన వాటిలోనో పోషక పదార్ధాలు బయటికి వస్తాయి.
  Green cruciferous vegetables such as broccoli, cabbage, collards and kale contain more vitamins and minerals per calorie than any other foods,

  4. వేయించి, మాడ్చి తినటం మంచిదికాదు.
  Dr. Fuhrman advised against roasting, grilling or deep frying because high-heat cooking methods that brown, darken or dry out foods lead to the formation of carcinogenic acrylamides.

  5. కాయగూరలను ఆవిరితో వండటం మంచిది. వచ్చిన జ్యూస్ పులుసులో వేస్తే పోషక పదార్ధాలు పోకుండా ఉంటాయి.
  Generally, a quick steaming is best because it makes beneficial nutrients more absorbable while causing minimal damage to heat-sensitive ones.

  http://www.bottomlinepublications.com/content/article/diet-a-exercise/raw-cooked-why-it-matters-how-you-eat-your-veggies?utm_campaign=_BP0c3XB8jXBV7o

  ReplyDelete
 27. కారెట్ ను వండి తింటే విటమిన్స్ పెరుగుతాయని చదివిన తరువాత ...

  బహుశా వండటం వల్ల కారట్ లోని సెల్యులోస్ మానవులకు జీర్ణమవుతుందేమో ? అని నాకు అనిపించి, వ్యాఖ్యలో రాసానండి.

  నిన్న ఒక విషయం గురించి మీ బ్లాగు చూస్తే మీరు రాసిన వ్యాఖ్య కనిపించింది.

  మీరు చాలా విషయాలను చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదములండి.

  ReplyDelete
 28. As of protein, you can get a fat-free and cholesterol-free yoghurt named "Fage" that has like 90 gms of protein for 4 servings. It has no sweeteners.

  ReplyDelete
 29. Malakpet Rowdy గారూ మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. Where can I get "Fage" ?

  ReplyDelete
 30. OOPS ... Sorry I missed this earlier. You can get FAGE in any of the Grocery stores. Walmart & Sam's have it for sure. You may also try CHOBANI.

  ReplyDelete