Wednesday, December 29, 2010

40 ఓ బుల్లి కథ 28 -- కంప్యూటర్ కు గ్రహణం పట్టిన రోజు --

ముందుమాట: కంప్యూటర్ కి వైరస్ పడితే తీసివేసే నా ప్రయత్నమే ఈ పోస్ట్.

ముందుగా నా కంప్యూటర్ Dell Dimension Desk Top(2003) with windows XP. నేను చెప్పబోయే  మెలుకువలు అన్నీ దాదాపు అన్ని చోట్లా పనికొస్తాయి.

నీ కంప్యూటర్ లో 300 వందల వైరస్  లు వున్నాయి మేము బాగు చేస్తాము అని స్క్రీన్ మీద వస్తే ఆహా నా అదృష్టము అని క్లిక్ చేశాను. క్రెడిట్ కార్డు తో యాభై డాలర్లు కడితే బాగు చేస్తామని స్క్రీన్. డబ్బులు కడితే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే!. నేను ఆ స్క్రీన్ క్లోజ్ చేశాను. మళ్ళా కంప్యూటర్ లో వైరస్సులు ఉన్నాయనే స్క్రీన్ వచ్చింది. డబ్బుల కోసం, ఒక కొత్త వైరస్ కంప్యూటర్ లోకి వచ్చిందని గ్రహించాను..

వెంటనే నా దగ్గర ఉన్న anti virus తో స్కాన్ చేశాను. Trojan horses , worms ఉన్నాయని చెబితే రిపైర్  చెయ్యమంటే కొన్ని repair చేసింది. నా దగ్గర ఉన్న anti virus అంత గొప్పది కాదల్లె వుంది, మళ్ళా వైరస్ లు ఉన్నాయనే స్క్రీన్, డబ్బులు ఇమ్మనే స్క్రీన్స్ ప్రత్యక్షం. స్టార్ట్ బటన్ క్లిక్ చేసి కంప్యూటర్ ని turn off  చేద్దామన్నా కుదరలేదు. పవర్ తీసేసి మళ్ళా ఆన్ చేశాను. మళ్ళా అవే స్క్రీనులు. Worms పాకుతూ విండోస్ (OS ) ని కంట్రోల్ లోకి తీసుకున్నాయల్లె ఉంది, కంప్యూటర్ నా కంట్రోల్ లో నుండి పోయింది.

ఏమిటలా మాటా పలుకూ లేకుండా కూర్చున్నారు అని అంటే భయపడుతూ చెప్పాను కంప్యూటర్ పాడయిందని. ఆవిడ వర్క్ కి వెళ్ళే హడావిడిలో ఉంది, మాట్లాడకుండా కంప్యూటర్ తో వచ్చిన backup డిస్క్ లు నా ముందర  పడేసి, సాయంత్రానికి నేనోచ్చేసరికి సరి చెయ్యండి అని వెళ్ళిపోయింది.

దాదాపు ఈ వైరస్సులు అన్నీ బైట నుండి వచ్చేవే. ఉదా: మనకు వచ్చే ఈ-మెయిల్స్ నుండో ,  మనం browse చేస్తున్నఇంటర్నెట్ సైటులు నుండో, ఫయిల్సు డౌన్లోడ్ చేసు కుంటూ ఉంటేనో  లేక ఎవరి వో ఫ్లాష్ డ్రైవ్ లు, సీడ్ లు తెచ్చి కాపీ చేసు కుంటూ ఉంటేనో, మన కంప్యూటర్ లోకి ఎక్కుతాయి. అవి చేసే యుద్ద కాండ వైరస్ లను బట్టి ఉంటుంది. కొన్ని నిశ్శబ్దంగా ఉండి, మన సంగతులన్నీ బయటకు సమాచారం పంపిస్తూ ఉంటాయి. కొన్ని మన ఫైల్స్ అన్నిటిలోనూ ఆక్రమించి, కంప్యూటర్ ని తమ స్వాధీనము లోకి తెచ్చుకుంటాయి. కొన్ని ఆ పనులన్నీ చేసేసిన తరువాత, నీ కంప్యూటర్ ఆక్రమించటం జరిగింది, డబ్బులు ఇస్తే బాగు చేస్తాను అని చెప్పటం జరుగుతుంది.

ఏమిచెయ్యాలో అర్ధం కాలేదు. నా దగ్గర ఇంకొక  anti -virus CD లేదు. మంచి anti -virus డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి లేదు. వైరస్ ఎన్ని ఫైల్స్ ని నాశనం చేసిందో తెలియదు. గుడ్డిలో మెల్ల నా దగ్గర కొన్ని ముఖ్యమయిన ఫైల్స్ backup చేసుకున్నఫ్లాష్ డ్రైవ్ ఉంది. అందుకని వెంటనే హార్డ్ డిస్క్ ని ఫార్మాటు చేసి ఆపరటింగ్ సిస్టం(OS ) ని పెడదామని నిశ్చయించాను. తరువాత ఫ్లాష్ డ్రైవ్ నుండి నా పర్సనల్ ఫైల్స్ లోడ్  చేసుకోవచ్చు.

Backup  డిస్క్ ల లోనుండి ఆపరేటింగ్ సిస్టం CD ని, CD డ్రైవ్ లో పెట్టి కంప్యూటర్ ఆన్ చేశాను. CD drive లో Operating System(OS) ఉంటే కంప్యూటర్ అక్కడనుండి తీసుకుంటుంది. ఇదివరకటి OS తీసేసి దానిమీద కొత్తది పెట్టమంటావా? (ఇల్లా అయితే మన పర్సనల్ ఫైల్స్ ఉంటాయి) లేక డిస్క్ ఫార్మటు చేసి కొత్త OS పెట్టమంటావా అని అడిగింది.(ఇల్లా అయితే పాత ఫైల్స్ అన్నీ పోతాయి). నేను ఇదివరకు అనుకున్నట్లు ఫార్మటు చేసి పెట్టమన్నాను. ఫార్మటు చేసి CD లోని XP OS లోడ్ చేసింది. దీనికి రెండు గంటలు పట్టింది.కంప్యూటర్ రీస్టార్టు  అయిన తరువాత చూస్తే display స్క్రీన్ సరీగ్గా కనపడటల్లేదు. కంప్యూటర్ కి మోనిటర్ ఎటువంటిదో తెలియక default  మోనిటర్ ని పెట్టింది.

కంప్యూటర్ కి మనము తగిలించే  విడి భాగాలని peripherals అంటారు. ఉదా: మోనిటర్, ప్రింటర్. ప్రతీ పెరిఫెరల్ పనిచెయ్యాలంటే పెరిఫేరల్స్ కి రెండుభాగాలు ఉంటాయి. వాటి రెండు భాగాలూ, హార్డ్ మరియు సాఫ్ట్ వేర్స్ కలిసి పని చేయాలి. హార్డువేర్ మనకు కనపడుతుంది సాఫ్ట్వేర్ ఎవరోవ్రాసిన ప్రోగ్రాం, దానినే డ్రైవర్ అంటారు. మోనిటర్ కి సరియిన డ్రైవర్ లేక పోతే అది సరీగ్గా కనపడదు. నాకున్న backup disk నుండి సరియిన డ్రైవర్ ని లోడ్ చేశాను.మోనిటర్ సరియినది.  అల్లాగే Nic card డ్రైవర్ కూడా లోడ్ చేశాను.దీనితోటి ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది. ప్రింటర్ డ్రైవర్ పెట్టాను ప్రింటర్ సరి అయినది. ఫ్లాష్ డ్రైవ్ నుండి నా పర్సనల్ ఫైల్స్ లోడ్ చేశాను. Now we are in business.

ఈ డ్రైవర్స్ లోడ్ చెయ్యటం లో కొన్ని మెలుకువలు ఉన్నాయి. కొన్నిCD పెట్టగానే కంప్యూటర్ లోడ్ చేసుకుంటుంది. కొన్నిటిని Zip ఫైల్ నుండి extract చెయ్యాలి. Extract చేసినప్పుడు సేవ్ చేసే ఫైల్ పేరును ఒకచోట వ్రాసుకోవటం మంచిది. తరువాత  డ్రైవర్ లోడ్ చేసి install చెయ్యటానికి ఆ పేరు కంప్యూటర్ కి చెప్పాల్సోస్తుంది.

కంప్యూటర్ లో ఏ డ్రైవర్లు ఉన్నాయో ఏవి లేవో చెప్పటానికి device manager అని ఒకటుంది. ఏ device కి అయినా డ్రైవర్ లేక పోతే దానిలో అది పసుపు పచ్చ రంగులో కనపడుతుంది. మీరు ఆ device driver ని లోడ్ చేస్తే రంగు మారుతుంది. Device Manager ని చూడాలంటె, మార్గం క్రింద చూపుతున్నాను:

click Start -- right click my computer -- click properties -- click hardware -- click device manager.
లేక
right click My computer icon -- click manage -- click Device Manager.

కంట్రోల్ పానెల్ లో add hardware ద్వారా కూడా  డ్రైవర్స్ ని install చేసుకోవచ్చు. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ పని చేస్తుంటే,   మామూలుగా కంప్యూటర్ డ్రైవర్ లను అన్నిటినీ ఇంటర్నెట్ లో వెతుక్కుని install  చేస్తుంది. పొరపాటున ఈ హడావిడిలో నేను మోడెం సాఫ్ట్వేర్ ని డిలీట్ చేస్తే తన అంతట తానే వెతుక్కుని install చేసుకుంది.

మీకు వీలయితే కంప్యూటర్ మీద నేను ఇదివరకు వ్రాసిన ఈ పోస్ట్ లు చూడండి.


కంప్యూటర్ లో ఏముంటాయి

21. ఓ బుల్లి కథ 9 -- కంప్యూటర్ లో ఏముంటాయి 


22. ఓ బుల్లి కథ 10 -- కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తే 


23. ఓ బుల్లి కథ 11 -- కంప్యూటర్ మొరాయిస్తే --


చివరి మాట: దాదాపు మూడు గంటల్లో ఈ పని పూర్తి  చెయ్య వచ్చు గానీ నేను కష్టపడుతున్నానని ఇంట్లో నిరూపించు కోటానికి, ఆడుతూ పాడుతూ మూడు రోజులు తీసుకున్నాను. ఇంటి పని చెయ్యాల్సిన తప్పించుకోటానికి. మీ కంప్యూటర్ కి వైరస్లు  తగిల్తే గాభరా పడకుండా వాటిని తరిమి కొట్టండి.

Monday, December 20, 2010

39 ఓ బుల్లి కథ 27-- స్టాంపులు అయిపోయాయి --

ముందు మాట: మెర్రీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.

ఇక్కడ అమెరికా లో మామూలుగా ప్రతీ సంవత్సరం ఈ సమయములో జరిగేది; వచ్చిన డొనేషన్ రిక్వెస్ట్ లను ముందర వేసుకుని కూర్చుని చెక్స్ వ్రాయటం. నేను చాలా లేటు, కానీ ఆపని ఈవేళ పూర్తి చేశాను. ఎంతో తృప్తిగా ఉంది.

మనం సంఘ జీవులం. కొట్టుకున్నా తిట్టుకున్నా మనము మన సంఘాన్ని వదలలేము. దీనికి కారణం వంటరి బ్రతుకు దుర్భరం అని మనందరికీ తెలుసు. అందుకనే మనం మన చుట్టూతా మన కిష్టమయిన వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో సుఖంగా ఉందామని చూస్తాం. ఈ ఇష్టా ఇష్టాలు కాల క్రమేణా మారుతూ ఉంటాయి కాబట్టి మన చుట్టూతా ఉన్న వాళ్ళని కూడా మారుస్తూ ఉంటాము. ఇది రోజూ మనము అనుకోకుండా చేసే ప్రక్రియే. కానీ మనకు ఇష్టమయినా లేకున్నా మన అసలు ప్రకృతి మారదు. మనం ఒంటరిగా ఉండలేము వాళ్ళ తో తప్ప.

నిజంచెప్పాలంటే వాళ్ళు మనకెందుకు ఇష్టమంటే,   ఆ "మనం" లో వాళ్ళే మనల్ని పోషించారు, జ్ఞానం పెంచారు, పెద్దచేశారు. మన తలిదండ్రులు పాలు ఇస్తే  తాగాము, పాక మంటే పాకాము, అమ్మ నాన్న తాత అనమంటే అన్నాము. మన పంతుళ్ళు పుస్తకాలు తీసి చదవ మంటే చదివాము. మన స్నేహితులు ఆడ మంటే ఆడాము. ఉద్యోగం ఇస్తే చేస్తున్నాము. అందుకనే ఆ "మనం" మనకిష్టం. వాళ్ళ బాధలు మనబాధలు. వాళ్ళ ఇష్టాలు మన ఇష్టాలు. ఇంతకీ నేను చెప్పొచ్చే దేమిటంటే మనలో "నేను" అనేది ఏమీలేదు అంతా "మనం" గ చేసినవే. వంటరిగా  "నేను"  "నాది" అనేది ఒక చిన్న భ్రాంతి.

సంవత్సరానికి ఒక రోజు మనం కూర్చుకున్న ఆ "మనం" లో దురదృష్ట వశాత్తూ బాధపడుతున్న వాళ్ళని జేర్చుకుందాం. మన ఆనందాన్ని పంచుకుందాం. హైతీ లో భూకంపాలయినా, ఇండోనీషియాలో సునామీ అయినా అవి వాళ్ళు కోరుకుని తెచ్చుకున్న బాధలు కావు. అటువంటి దురదృష్టాలు ప్రపంచం లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం సంఘజీవులం. మనం మనం సహాయం చేసుకోవాలి. అందుకనే కనీసం సంవత్సరానికి ఒకరోజు మనం కూర్చుకున్న ఆ "మనం" లో వీళ్ళని చేర్చుకుందాం. మీకు డొనేషన్ రిక్వెస్ట్ లు వస్తే తోచినంత వెంటనే పంపండి.

స్టాంపులు అతికిచ్చి డొనేషన్ కవర్లు అన్నీ పోస్ట్ చేశాను. ఈ సంవత్సరానికి స్టాంప్ లన్నీ అయిపోయాయి. కొత్త బుక్ కొనుక్కోవాలి.

చివరిమాట: క్రిస్మస్ కి ఇంకా నాలుగు రోజులుంది. మనమిచ్చే  ఈ చిన్న సహాయాలతో  వచ్చే సంవత్సరాంతం వరకూ వాళ్ళు ఎవర్నో ఎప్పుడో ఎక్కడో ఈ ప్రపంచంలో ఆదుకుంటారు. మన చుట్టూతా లేని మన వాళ్ళందరికీ మనం సహాయం చేయకలుగుతాము. అది ఎనలేని త్రుప్తి.

Sunday, December 12, 2010

38 ఓ బుల్లి కథ 26-- ఒక బెలూను ఆత్మకథ --

ముందు మాట: ఒక చిన్నకొత్త ప్రయోగం చేస్తున్నాను. ఫోటోలు తీసినది కిరణ్,  శ్రీలత.


నేనెంత చక్కగా ఉన్నానో చూస్తున్నారుగా. నా ఎత్తు ముప్పై అడుగులు. ఎవరు నన్ను ఇలా సృష్టించారో తెలుసా.
   మొదట నా శరీరం మొత్తం నేల మీద పరుస్తారు. క్రింద నాకో బాస్కెట్ ఉంటుంది. దానిలో ప్రొపేన్ గాస్  ఉంటుంది.
ఆ తరువాత పక్క ఫ్యాన్ తో గట్టిగా గాలి విసురుతారు. అది చాల  పవర్ఫుల్ హోండా ఫ్యాన్. నేను    నేల మీద పెద్ద బుడగలా మారుతాను.నా బాస్కెట్ లో ఉన్న ప్రొపేన్ గ్యాస్ ని కొద్ది సేపు వెలిగిస్తారు. నేను లేచి కూర్చుంటాను. పదిమంది నన్ను పారి పోకుండా పట్టుకుంటారు. వాళ్ళల్లో నలుగురు నా బాస్కెట్ లో ఎక్కుతారు అందులో ఒకరు పైలెట్. ఆ పైలెట్ చేసే పని అల్లా నేను పైకి ఎగరాలంటే ప్రొపేన్ మంట తో నాలోని గాలిని వేడి చేస్తాడు. అందుకనే నన్ను హాట్ ఎయిర్ బెలూన్ అంటారు.

అందరూ ఎక్కారు. నన్ను పట్టులోంచి వదిలారు. ఆహా నాకు ఎగిరే స్వేఛ వచ్చింది.
ఇంక నా స్నేహితులతో కలసిపోతాను.అలా అలా నింగిలో హాయిగా విహరిస్తాను నాలో వేడి తగ్గే వరకూ. అంతదాకా అనంతంలో ఉంటాను. బైబై.చివరిమాట: చూద్దాం ఎల్లా వస్తుందో.?
Monday, December 6, 2010

37 ఓ బుల్లి కథ 25-- డయబెటీస్ తో ఆహార జాగ్రత్తలు --

ముందు మాట: "The Best Foods to Fight Diabetes" by Joy Bauer, PARADE Dec,2010 Column కి తెలుగు అనువాదం.

నాకు తెలిసినంతవరకూ క్లుప్తంగా: మన శరీరం లో కణములు(cells ) లో షుగర్, ఆక్సిజన్ ల కలయిక వలన శక్తి ఉత్పన్న మౌతుంది. షుగర్, ఆక్సిజన్ రెండూ మనలోని రక్తప్రవాహము ద్వారా మన దేహము లోని అన్ని cells కి చేరుతాయి. మనము తినే ఆహారము నుండి జీర్ణక్రియ ద్వారా షుగర్, పీల్చే గాలి నుండి  ఆక్సిజన్ మన రక్తములో చేరును.  రక్తములో షుగర్ ఒక పరిమితి లోనే ఉండవలయును. రక్తములో షుగర్ ఎక్కువగా ఉన్న మన అవయవములు కొన్ని సరీగ్గా పనిచేయవు. ఈ రక్తములో షుగర్ ఎక్కువగా ఉన్న పరిస్థితినే diabetes అందురు. సామాన్యముగా శరీరములో తయారు కాబడే ఇన్సులిన్ వలన రక్తము లోని షుగర్ కంట్రోల్ అగును, కానప్పుడు మందుల ద్వారా లేక షుగర్ ఉత్పాదన చేసే ఆహార పదార్ధములను తినుట తగ్గించటము ద్వారా diabetes ను కంట్రోల్  చేయవచ్చును. ఇక చదవండి.

దాదాపు 20 మిలియన్ల అమెరికన్స్ కు డయాబెటీస్ ఉంది.  ఇంకా ప్రతీ సంవత్సరమూ 1.6 మిల్లియన్ కొత్త కేసులు వస్తున్నాయి.

ఈ జబ్బు రాకుండా మీరు కాపాడుకోవాలంటే, మీ బరువు కనక ఎక్కువగా ఉంటే, తగ్గించటానికి ప్రయత్నించండి. పశోధనల్లో బరువుతగ్గితే ఫలితము ఉంటుందని తేలింది. కొన్ని రకాల ఆహార పదార్ధాలు కూడా blood sugar కొలతలను మారుస్తాయి.

(నా మాట: మీ బరువు సమానముగా ఉన్నదో లేదో మీ BMI(Body Mass Index) నుండి గ్రహించండి. ఈ లింక్ ద్వారా మీ BMI గురించి తెల్సుకోండి. http://mytelugurachana.blogspot.com/2010/11/36-24.html )

మంచి  కార్బో హైడ్రేట్సు ఉన్న పదార్ధాలను తినండి: ఈ పదార్దములు చాలా నెమ్మదిగా బ్లడ్ లోకి షుగర్ని పంపిస్తాయి. అందుకని తక్కువ ఇన్సులిన్ తో blood sugar కొలతలను సరి చెయ్యవచ్చు.
వీటిని ఎక్కువగా తినండి: Vegetables, beans(kidney, garbanzo, pinto, black, etc), lentils, barley, oatmeal, wild rice, and 100%whole grain bread, cereals and pasta.
వీటిని తగ్గించండి: Sugar(white and brown), high-fructose corn syrup, soft drinks, fruit juice, jams and jellies, candy, cakes, cookies, white bread, white rice, and regular pasta.

మీ ఆహారంలో ప్రోటీన్ మరియు ఫాట్స్ ని కూడా చేర్చండి: ఈ రెండూ కార్బో హైడ్రేట్సు తిన్న తరువాత ఎక్కువయ్యే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తయ్యి.
వీటిని ఎక్కువగా తినండి: skinless chicken and turkey, fish and seafood, egg whites, nonfat yogurt, low-fat cottage cheese, beans and lentils, and tofu. Healthy fats: Olive oil, Canola oil, fatty fish(salmon, sardines), nuts, and nut butters  (peanut or almond)

చివరి మాట: మీరు రోజూ తీసుకునే ఆహారంలో మంచి పదార్ధాలను ఎక్కువ చేసి మిగతావి తగ్గించండి. వీటిలో కొన్ని పదార్దములు మీ శరీర తత్వానికి సరిపోక పోవచ్చు. వాటిని తినవలసిన అవుసరము లేదు.