Tuesday, December 18, 2012

88 ఓ బుల్లి కథ 76 --- మళ్ళా సంవత్సరం ముగుస్తోంది

ఈ సంవత్సరంలో ఎన్నో జరిగాయి. భూకంపాలు, సునామీలు, వరదలూ, యుద్ధాలూ, చంపుకోటాలు, కొట్టుకోటాలూ, కరువులూ, కాటకాలూ. వీటన్నిటిలోనూ అనుకోకుండా బాధల్లో పడి రోదించే వా రెందరో. తుఫానులో ఇళ్ళు కొట్టుకుపోయి, ఉన్న ఆస్తి అంతా నీళ్ళ పాలై బజార్లో పడ్డ వాళ్ళు మన ఎదురుకుండా ఉన్నారు. వారు ఏదో విధంగా వాటిని తట్టుకుని బతికి బయటపడాలి. మనమందరం పుట్టిన తరువాత ఏదోవిధంగా జీవించాలి కదా.

వారి తాత్కాలిక జీవిత కష్టకాలంలో మనమేమన్నా సహాయం చెయ్యగలమా?  ప్రపంచం లో అందరికీ మనం సహాయం చేద్దామన్నా చెయ్యలేము. చేసే స్థోమతా మనకి ఉండదు. కానీ మనందరం కలిసి చేస్తే, నార పోగులు కలిస్తే బలమైన చాంతాడుగ మారినట్లు మన శక్తి బలోపేతం అవుతుంది. అలా మన శక్తులని కలిపి ప్రజల నాదుకునే సంస్థలు, ప్రపంచములో ఎక్కడ ఆపద వచ్చినా ఆదుకోటానికి ముందుకి వచ్చే సంస్థలు చాలా ఉన్నాయి, సాల్వేషన్ ఆర్మీ, రెడ్ క్రాస్, డాక్టర్స్ వితౌ ట్ బోర్దేర్స్ మొదలయినవి.

అమెరికాలో ప్రతీ సంవత్సరం నవంబర్ డిశెంబరు లు చాలా హడావుడిగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు నెలలూ పండగరోజులు. ఇళ్ళ బయట అలంకరిస్తారు, షాపులన్నీ అలంకరిస్తారు. క్రిస్మస్ పాటలు మార్మోగుతూ ఉంటాయి. అందరూ హడావిడిగా తిరుగుతూ ఉంటారు. సంవత్సరంలో చాలా వ్యాపారం ఈ రెండు నెలలలోనే జరుగుతుంది. సంవత్సరానికి కావలసిన వస్తువులూ, దగ్గర వాళ్లకి ఇచ్చే బహుమతులూ, ఈ సమయంలోనే కొనుక్కుంటారు. ముఖ్యంగా అన్నదానాలూ ఆదుకోటాలు ఇప్పుడే జరిగేవి. సహాయ సంస్థలు వచ్చే సంవత్సరంలో జరగబోయే అవాంతరాలని ఆదుకోటానికి  కావలసిన ధన సామర్ధ్యం ఈ కాలంలోనే సంపాదించుకుంటాయి. మీ కిష్ట మైన సంస్థలకి మీకు చేతనయినంత సహాయము చెయ్యండి.

నాకు ఇష్టమయిన సంస్థ Kiva. వాళ్ళ వెబ్సైట్  kiva.org. వీళ్ళు ప్రపంచములో  ఏ దేశం వారికయినా "మీరు కొంచెం పెట్టుబడి పెట్టండి, పాలో పెరుగో, కూరగాయలో కొనుక్కుని అమ్ముకుని మీ పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తాము" అనే వాళ్ళకి,  మనందరి నుండీ చిన్న చిన్న డొనేషన్లు తీసుకుని వాటిని కలిపి వారికి సహాయం చేస్తారు. "నేను కష్టపడి పనిచేస్తాను. నన్ను కొంచెము ముందుకు వెళ్ళేలా సహాయం చెయ్యండి. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను"  అంటూంటే మనము ఇవ్వకుండా ఎలా ఉంటాము?

ఇంతకీ చెప్పోచే దేమంటే మీకు ఇష్టమయిన వాటికి మీకు తోచిన సహాయం చెయ్యండి. మీరు అమెరికాలో ఉంటే ఈ పాటికి చాలా రిక్వెస్ట్ లు వచ్చి ఉంటాయి. ఉడతా భక్తిగా ఎవరో ఒకరికి ఎంతో కొంత సహాయం చేసి తోటి మానవుడుగా వాటిని ఆదుకోండి.


Monday, December 10, 2012

87 ఓ బుల్లి కథ 75 --- అవకాడో ముక్కల పచ్చడి


అవకాడో గురించి ఎందుకు ఇంత శ్రమపడి వ్రాస్తున్నానని అనుకుంటున్నారా ! అవకాడో  కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది అంటారు. ఇంకా దానికి కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. అందరికీ తెలుస్తుందని వ్రాస్తున్నాను.

మా ఇంట్లో అవకాడోతో(Avocado) ముక్కల  పచ్చడి అప్పుడప్పుడు చేసుకుంటాము. ఇంటావిడ చేస్తుంది కాబట్టి దానికి కొలతలూ గట్రా ఏమీ ఉండవు. ఆ రోజు తినే వాళ్ళ అదృష్టాన్ని బట్టి రుచులూ అవీ ఉంటాయి. నేను దానికి అలవాటు పడిపోయాను. ఈ మధ్య మా అమ్మాయి ఇంట్లో పచ్చడి రుచి చూసి, అది ఎల్లా చేస్తారో వ్రాయమని (కొలతలతో) నాకు రహస్యంగా ఇమెయిల్ పంపించింది. నేను చిన్న పరిశోధన లాంటిది చేసి సాధించాను. దీనిలో ఏమన్నా గొప్పదనం ఉంటే ఇంటావిడదే కానీ నాది కాదు అని ముందరగా చెప్పుకుంటున్నాను. ఇంకా వంటింట్లో నాకు పూర్తి కంట్రోల్ రాలేదు.

అవకాడోలు దాదాపు 80 రకాలలో వస్తాయి. వీటి జన్మస్థానం మెక్సికో దేశం. ఈ కాయలు ప్రపంచమంతా వ్యాపించినవి. అన్ని మార్కెట్లలో దొరుకుతాయో లేదో తెలియదు అమెరికాలో మాత్రం దాదాపు అంతటా దొరుకుతాయి. ఊరగాయ పెట్టుకునే మామిడి కాయ సైజు లో ఉంటాయి. 'Hass ' వెరైటీ అవకాడోలు సంవత్సరము పొడుగునా వస్తాయి. నేను వాటిని ఉపయోగించాను. కొంచెం ఆకు పచ్చగా ఉండి గట్టిగా ఉండేవి చూసి తీసుకుంటే ముక్కలు బాగా వస్తాయి. ముక్కలు రాక పోయినా గుజ్జు తో పచ్చడి బాగానే ఉంటుంది.

అవకాడోని నిలువుగా చుట్టూతా కత్తితో కొస్తే రెండు భాగాలుగా విడిపోతుంది. దానిలో టెంకని తీసివెయ్యాలి. ఒక స్పూన్ తో అంచులు చుట్టూతా కదిపితే గుజ్జు కొబ్బరి చిప్పలలా విడిపోయి వస్తాయి. వాటిని కత్తితో ముక్కలుగా కోయటమే. మెక్సికన్ లు వీటితో Guacamole  అనే పచ్చడి లాంటిది చేస్తారు. అది చేసే విథానం చూస్తే కాయ లోనుంచి గుజ్జు ఎల్లా తీయాలో తెలుస్తుంది.ఇక్కడ చూడండి.


Avocados are a good source of fiber, potassium, and vitamins C,K, folate, and B6. Half an avocado has 160 calories, 15 grams of heart-healthy unsaturated fat, and only 2 grams saturated fat. One globe contains more than one-third daily value of vitamin C, and more than half the day’s requirements of vitamin K.

Avocados have diverse fats. For a typical avocado:

About 75% of an avocado's calories come from fat, most of which is monounsaturated fat.
On a 100 g basis, avocados have 35% more potassium (485 mg) than bananas (358 mg). They are rich in B vitamins, as well as vitamin E and vitamin K.[30]
Avocados have a high fiber content of 75% insoluble and 25% soluble fiber.[31]

High avocado intake was shown in one preliminary study to lower blood cholesterol levels. Specifically, after a seven-day diet rich in avocados, mild hypercholesterolemia patients showed a 17% decrease in total serum cholesterol levels. These subjects also showed a 22% decrease in both LDL (harmful cholesterol) and triglyceride levels and 11% increase in HDL (helpful cholesterol) levels.[32]Additionally a Japanese team synthesised the four chiral components, and identified (2R, 4R)-16-heptadecene-1, 2, 4-triol as a natural antibacterial component.[33]

Due to a combination of specific aliphatic acetogenins, avocado is under preliminary research for potential anti-cancer activity.[34]

Extracts of P. americana have been used in laboratory research to study potential use for treating hypertension or diabetes mellitus.[35]


ముక్కల పచ్చడికి కావలసిన పదార్ధాలు:

1. అవకాడో  - 1 (medium size)
2. నిమ్మకాయ ( lime ) - 1/2
3. పసుపు - చిటికెడు
4. కారం - 1/2 టీ స్పూన్
5. ఉప్పు - 1/2 టీ స్పూన్
6. మెంతి పొడి - 1/8 టీ స్పూన్ (మెంతులు వేయించి పిండి బడితే బాగుంటుంది)
7. నూనె (తిరగమోత కి)- 3/4 టేబుల్ స్పూన్
8. ఇంగువ - 4 షేకులు . మామూలుగా సీసాని షేక్ చేస్తాము.
9. తిరగమోత గింజలు: 1/4 స్పూన్ మినప్పప్పు, దానికి కొంచెం తక్కువగా జీలకర్ర, ఆవాలు, ఒక ఎండు మిరప కాయ

తయారుచేయు విధానము:

అవకాడో కోసి దానిలో గుజ్జు (రెండు కొబ్బరి చిప్పల మాదిరిగా వస్తుంది) ముక్కలు చేసి ఒక గిన్నె(bowl) లో వెయ్యండి. దానిమీద నిమ్మకాయ పిండండి. దాని మీద పసుపు, కారం, ఉప్పు, మెంతి పొడి వేసి కలపండి.

మీకు చిన్న బగుణ (లేక తిరగమోత గిన్నె) ఉంటే దానిలో నూనె వెయ్యండి. స్టవ్ మీద మీడియమ్ లో ఉంచి మినప్పప్పు, మూడు మెంతి గింజలూ, జీలకర్ర, ఆవాలూ వరసగా వెయ్యండి. మినప్పప్పు వేగినట్లు కనపడగానే ఒక చిన్న ఎండు మెరప కాయ తుంచి ముక్కలు వెయ్యండి. ఇంగువ నాలుగు షేకులు వెయ్యండి. ఇంక తిరగమోతని స్టవ్ మీద నుంచి తీసి దంచటమో, బ్లెండ్ చెయ్యటమో చేసి అవకాడో ముక్కలున్న గిన్నె లో వేసి కలపండి. ఒక గంట అల్లా ఉంచిన తరువాత అవకాడో పచ్చడి తినటానికి రెడీ. అన్నంలో, దోశల్లో, బ్రెడ్ మీద బాగుంటుంది.
నేను అయితే ఒక అర స్పూన్ extra virgin olive oil కూడా పచ్చడిలో వేసి కలుపుతాను.

తిరగమోతని ఎప్పుడూ మాడ్చ కూడదు !!!..


మాతృకలు:

1. http://www.webmd.com/diet/features/8-healthy-facts-about-avocados

2. http://en.wikipedia.org/wiki/Avocado

Monday, October 1, 2012

86 ఓ బుల్లి కథ 74 --- ప్రోటీన్స్ విషయంలో శాకాహారులు మోసపోయారా ?

నిజమే నంటారా ? కాకపోతే మరి మీరేమంటారు? కొందరు శాకాహారము మాంసాహారము రెండూ తినవచ్చు, కొందరు శాకాహారమే తినాలి అని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? ఒక సమాజం మోత్తం దీనిని పాటించేటట్లు జేసిన ఆ గట్టి మనుషులు ఎవరు? అయినా చెప్పినంత మాత్రాన విన వలసిన అవసర మేమిటి? ఎన్నాళ్ళ నుండీ ఈ పద్ధతులు అమలులో ఉన్నాయి? ఎందుకిల్లా జరిగింది?

ఇవన్నీ నాకయితే నాకు సమాధానం లేని ప్రశ్నలు. మూడు నెలల బట్టీ నాకు కనిపించిన వాళ్ళ నందరినీ వీటిగురించి అడుగుతున్నాను. సంతృప్తి కరమైన సమాధానం రాకపోయినా, క్లుప్తంగా వచ్చిన సమాధానాలు ఈ క్రింద పొందు పరుస్తున్నాను.

1. పూర్వం ఋషులూ వారి శిష్యులూ ఆశ్రమాల్లో అరణ్యాలలో వుండేవాళ్ళు. మాంసాహారము యజ్ఞ యాగాది క్రతువుల్లో వాడినప్పటికీ సామాన్యంగా తేలికగా దొరికే కాయగూరలూ పళ్ళూ ఫలాలతో దైనందిన జీవితం గడిపేవారు. వీరిలో కొందరు రాజాశ్రయంతో పట్టణ వాసులైనప్పటికీ వారి దైనందిన జీవితం శాకాహరంతోనే గడవటం మూలంగా శాకాహారు లైనారు. దానికి తోడు ఆశ్రమంలో శిష్యరిక పోషణా న్వేషణలో గ్రహించిన సేద్య నైపుణ్యమును, మెళుకువలను పట్టణ వాసములో కూడా కొన సాగించి సేద్యకారులై వారు వారి కుటుంబములు శాకాహారులుగా జీవితం కొనసాగించారు.

2. చాలా పూర్వ కాలంలో శాకాహారము మాంసాహారము అని లేకుండా ఏది దొరికితే అది తిని జీవించే వారు. కొంత కాలం తర్వాత బౌద్ధ మతం వ్యాప్తి చెంది అందరూ శాకాహారు లయ్యారు. శాకాహారం అవలంబించడానికి బౌద్ధమతం కన్న,జైనమతప్రభావం ప్రధానకారణం అని కొందరంటారు. తరువాత శంకరాచార్యులు ప్రోద్భలంతో మరల హిందూ మతమునకు ప్రాముఖ్యత వచ్చింది. ఈ తరుణము లో కొందరు శాకాహారులు మాంసాహారులుగా మారుట వలన సమాజంలో రెండు వర్గాలు ఏర్పడి ఉండవచ్చు.

ఏది ఏమైనా నేను ఈ ప్రశ్న అడగటానికి ఒక కారణం ఉంది. మనదేహం పనిచేయటం ఎన్నో రసాయనిక ప్రక్రియల సమ్మేళనం. ఆ రసాయనిక ప్రక్రియలు సరీగ్గా జరగాలంటే వాటికి కావాల్సిన ఇంధనాలూ, ప్రక్రియ ప్రోద్భలానికి సహకరించే ఎంజైములూ కావాలి. అవే ప్రోటీనులు. ఆ ప్రోటీనులు ఎమినో యాసిడ్లతో తయారు చెయ్యబడ్డవని శాస్త్రజ్ఞులు గ్రహించారు. ప్రోటీన్లు తయారు చెయ్యటానికి కావలసిన ఎమినో యాసిడ్స్ లో మన శరీరం 9 ఎమినో యాసిడ్స్ మాత్రం తనంతట తాను తయారు చేసుకోలేదని శాస్త్రజ్ఞులు గ్రహించారు. ఈ తొమ్మిదీ మనం తినే ఆహారం నుండి రావాలి.

మాంసాహారులకి ఆ తొమ్మిదీ మాంసం(complete protein) తింటే  వస్తాయి కానీ శాకాహారులకి ఏ ఒక్క శాకాహారం(incomplete protein) నుండీ రావు (Some foods from the plant kingdom, such as soy and quinoa, have complete protein). అందుకని మాంసాహారము తినక పోయినా మిశ్రమ శాకాహారం తప్పక తినాలి. తినకపోతే కావలసిన అవసరమయిన ప్రోటీనులు శరీరానికి అందక పోవచ్చు. కాకపోతే అన్నీ ఒక భోజనం (one sitting) లో తిన వలసిన అవసరం లేదు.

మిశ్రమ (సమీకృత) ఆహారం తినటం మంచిదని ఎందుకు చెప్పానంటే మాంసా హారం లాగా అన్ని శాఖా హారాలలో, ఒక దాన్లోనే అన్ని essential amino acids ఉండక పోవచ్చు కానీ వివిధ శాఖా హారాలలో వివిధ essential amino acids ఉన్నాయి. ఉదాహరణకి మొక్క జొన్నలో lysine or threonine తక్కువ కానీ beans లో అవి ఉన్నాయి. (Some foods from the plant kingdom, such as soy and quinoa, have complete protein).

అమాంతంగా ప్రోటీన్ల కోసం మాంసాహారులుగా మారవలసిన అవసరము ఎంతమాత్రమూ లేదు. మారుదామన్నా శాకాహారానికి అలవాటుపడిన శరీరం సహకరించక పోవచ్చు. ప్రస్తుతానికి శరీరం తయారు చేసుకోలేని ఆ 9 ఎమినో యాసిడ్స్ ఏమిటో, శాకాహారమే తింటూ, ఆ ఎమినో యాసిడ్స్ ను శరీరానికి సమకూర్చి ఏవిధంగా ఆ లోటుని భర్తీ చెయ్యగలమో చెప్పటమే ఈ పోస్ట్ ఉద్దేశం.

శరీరం తయారు చేసుకోలేని ఆ 9 ఎమినో యాసిడ్స్ : Essential amino acids:
Histidine, Isoleucine, Leucine, Lysine, Methionine, Phynylalanine, Threonine, Tryptophan, Valine
ఇవి లేకపోతే శరీరములో అవి చేసే పనులకు ఆటంకము కలుగవచ్చు.

పై ఎమినో యాసిడ్స్ మన శరీరంలో ముఖ్యముగా చేసే పనులు( 1,3 మాతృకల నుండి సేకరించినవి.):.

1. Isoleucine (Ile) - for muscle production, maintenance and recovery after workout. Involved in hemoglobin formation, blood sugar levels, blood clot formation and energy.
Available in Soy protein, Watercress, Kidney beans, Sunflower seed flour, Chard, Spinach.

2. Leucine (Leu) - growth hormone production, tissue production and repair, prevents muscle wasting, used in treating conditions such as Parkinson’s disease.
Available in Soy protein, Watercress, Kidney beans, Sunflower seed flour, Raw Alpha alpha seeds, Sesame seed flour, Tofu.

3. Lysine (Lys) - calcium absorption, bone development, nitrogen maintenance, tissue repair, hormone production, antibody production.
Available in Soy protein, Watercress, Tofu.

4. Methionine (Met) - fat emulsification, digestion, antioxidant (cancer prevention), arterial plaque prevention (heart health), and heavy metal removal.
Available in Soy protein, Sesame flour, Seaweed spirulina.

5. Phenylalanine (Phe) - tyrosine synthesis and the neurochemicals dopamine and norepinephrine. Supports learning and memory, brain processes and mood elevation.
Available in Soy protein, Kidney beans, Sesame seed flour, Cotton seed flour, Spinach.

6. Threonine (Thr) monitors bodily proteins for maintaining or recycling processes.
Available in Soy protein, Watercress, Kidney beans, Sunflower seed flour, Sesame seed flour.

7. Tryptophan (Trp) - niacin production, serotonin production, pain management, sleep and mood regulation.
Available in Soy protein, Watercress, Kidney beans, Sunflower seed flour, Spinach, Sesame seed flour, Turnip greens, Broccoli rabe, Asparagus, Oat bran.

8. Valine (Val) helps muscle production, recovery, energy, endurance; balances nitrogen levels; used in treatment of alcohol related brain damage.
Available in Soy protein, Watercress, Kidney beans, Sunflower seed flour, Sesame seed flour, Mushrooms white, Snow/snap peas.

9. Histidine (His) - the 'growth amino' essential for young children. Lack of histidine is associated with impaired speech and growth. Abundant in spirulina, seaweed, sesame, soy, rice and legumes.

క్లుప్తంగా:

1. మన దేహానికి ప్రోటీన్స్ చాలా అవసరము.

2. మన బరువు లో ఒక పౌండ్ కి 0.36 - 0.40 గ్రాముల ప్రోటీన్ కావాలని నిర్ధారించారు. (USDA)
రోజుకి మనకెంత ప్రోటీన్ కావాలి ? http://mytelugurachana.blogspot.com/2012/06/85-73.html

3. ప్రోటీన్స్ ఎమినో యాసిడ్స్ తో తయారు అవుతాయి.

4. ఈ ఎమినో యాసిడ్స్ లో 9 ఎమినో యాసిడ్స్ మన శరీరం తయారు చేసుకోలేదు. అందుకని మనం తినే ఆహారంతో ఇవ్వాలి.

5. మనము ఇవ్వక పోతే మన శరీరం తన సంరక్షణార్ధం మిగతా చోట్ల నుండి తీసుకుంటుంది (కాల్షియం తీసుకున్నట్లు http://mytelugurachana.blogspot.com/2012/05/84-72-osteoporosis.html).

6. మాంసాహారులయితే, దానిని తినుట మూలంగా కావలసిన అన్ని ఎమినో యాసిడ్స్ ఆహారంతో వస్తాయి.

7. గుడ్లు (egg whites) తినే వాళ్లకి కూడా వాటితో వస్తాయి.

8. మీరు పాలు,పాల పదార్ధాలు తిన కలిగితే: పాలు పెరుగులలో అన్ని ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. ఇంకా చీజ్ తిన కలిగితే వీటిల్లో అన్నీ ఉన్నాయి. Ricotta Cheese low fat, Romano, Cheddar, Mozzarella, Parmesan, Gouda, Swiss, Feta, Cottage Cheese low fat (2%).

9. శుద్ద (Plant Based Only) శాకాహారులకు మాత్రం ఏ ఒక్క పదార్ధం తో అన్నీ రావు( quinoa తప్ప). అందుకని Essential amino acids రావటానికి రకరకాల కూరగాయాలను తినాలి. అన్నీ ఒకసారే (one sitting లో) తినాలని లేదు.

10. మీరు తినవలసినవి ఇవి: Soy protein, Watercress, Kidney beans, Sunflower seed flour, Raw Alpha alpha seeds, Sesame seed flour, Tofu.Sunflower seed flour, Spinach, Turnip greens, Broccoli rabe, Asparagus, Oat bran.
Pumpkin/squash seeds, Pistachios, Cashews, Hemp seeds, Black eye peas, Potato with skin.

11. పై చెప్పిన కూరగాయలు కొన్నిటిని ప్రతి వారం తినటం మంచిది. మన కూరగాయలతో చేసిన పరిశోధనా ఫలితాలు నాకు తెలియవు కనుక వాటి పేర్లు వ్రాయలేదు. 

మాతృకలు:
1. http://www.nomeatathlete.com/vegetarian-protein/

2. http://www.raw-food-health.net/VegetableProtein.html#axzz1sFuau3mN

3. http://www.savvyvegetarian.com/articles/get-enough-protein-veg-diet.php

Monday, June 4, 2012

85 ఓ బుల్లి కథ 73 --- రోజుకి మనకెంత ప్రోటీన్ కావాలి ?

మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేవి, శరీరంలో మనకు హాని కలిగించే వాటిని తొలగించేవి , మనకి సరిఅయిన ఆకారం ఇచ్చేవి, నిజం చెప్పాలంటే మన జీవత్వానికి మన మనుగడకు ఈ ప్రోటీన్స్ చాలా ముఖ్యం. ఈ ప్రోటీన్స్ అన్నీ, శరీరంలో తయారు అయి మన శరీరంలో జీవ కణాలలో ఉంటాయి. మనం చెయ్యవలసిన పనల్లా మనం తినే ఆహారము ద్వారా వాటి తయారుకి కావలసిన ముడి పదార్దములు అందించటమే. ఈ పోస్ట్ దానిని విశదీకరించటానికి. 

మన శరీరం అంతా కణాల (cells ) మయం. (ఉదా: ఎర్ర కణాలు, తెల్ల కణాలు, న్యురాన్స్ మొదలయినవి). మనము చేద్దామనుకున్న పనులకు శక్తినిచ్చేవి, శక్తిని పంచేవి ఇవ్వే. మన శరీరంలో జరిగే దాదాపు అన్నిపనులూ ఒక క్రమ పద్దతిగా చేయించేవి కూడా ఇవ్వే. దీనికి కారణము వాటిలో ఉండే జన్యు పదార్ధము. దానినే డి యన్ ఏ (DNA ) అంటారు.

ఈ DNA లో ఉండే మూల పదార్ధాలు నాలుగు,Adenine (A ), Cytosine (C ), Guanine (G ), Thymine (T ). వీటిని nucleotide bases అంటారు. ఈ నాలుగూ వివిధ రకాలుగా కలసిపోతూ, చాంతాడులా పెరిగిపోతూ, పల్టీలు కొట్టుకుంటూ మెలికలు తిరుగుతూ DNA కి double helix ఆకారంఇస్తాయి. మన ఆకారములూ ,రంగులూ ,అలవాట్లూ ,రోగాలూ రోచ్చులూ ఈ DNA ప్రత్యక్షం గానో పరోక్షం గానో చేయించేవే.

శాస్త్రజ్ఞులు DNA మీద వరసగా ఉన్నమూడు nucleotides ఒక ముఖ్యమైన చిన్న సమాచారం అందిస్తాయని గ్రహించారు. దీనినే triplet code అంటారు (ఉదా: (Guanine, Cytosine, Adenine) GCA అనే code, Alanine(Ala)  అనే amino acid ని సూచిస్తుంది ). అది ఒక సమాచారానికి (code ) సంకేతం కాబట్టి codon అని కూడా అంటారు. DNA మీద ఈ codons కొన్ని గ్రూపులు గ మారి ఒక పెద్ద సమాచారం ఇస్తాయని గ్రహించారు. వీటికి జీన్స్ అని పేరుపెట్టారు. అంటే ప్రతీ జీన్ లో బోలెడన్ని codons ఉండి సమాచార కేంద్రాలుగా ఉంటాయన్నమాట. ఈ జీన్స్ మనలో దాదాపు 25,000 ఉంటాయి.

మన శరీరంలో జరిగే అన్ని రసాయనిక కార్య క్రమాలలో పాల్గొని (ఉదా: మనం తిన్న ఆహారాన్ని జీర్ణించటం ఒక పెద్ద రసాయనిక కార్యక్రమం) వాటి పరిపక్వతని పెంపొందించే ఎంజైములూ, హార్మోనులూ వగైరా తయారుకి కావలసిన సూత్రాలు, ఈ జీన్సు ద్వారా DNA నుండే వస్తాయి. ఈ తయ్యారు కాబడ్డ వాటిని ప్రోటీన్స్ అంటారు. ఈ ప్రోటీన్స్ అన్నీ ఇరవై ఎమినో యాసిడ్స్(amino acids) తో తయ్యారు చెయ్యబడ్డవని పరిశోధనలలో కనుగొన్నారు. ఇంకో విధంగా ప్రోటీన్స్ అంటే ఈ ఇరవై amino acids తో వివిధ రకాలుగా దీర్ఘంగా అల్లిన గొలుసు కట్టు (long chain ) రసాయనిక పదార్ధాలు. జీన్సులో ఉన్న ఒక్కొక్క codon ఒక్కొక్క amino acid ను తెలుపుతుంది.

మన DNA ఒక వంటల పుస్తకం అనుకుంటే, జీన్సు అనేవి ఆ పుస్తకంలో (పేజీలు) వంటలు చేసే విధానాలు చెప్పేవి. శరీరమంతా కణాల్లో DNA ఉంటుంది కాబట్టి, ఆయా ప్రదేశాల వంటలకు కావాల్సిన సూత్రాలు ఆయా జీన్సునుండి తీసుకోబడుతాయి. ఉదాహరణగా మనము తిన్న ఆహారం జీర్ణాశయంలో ఉంది. జీర్ణం అవటానికి జఠరరసం కావాలి. జీర్ణాశయం, DNA లో జఠరరసం తయ్యారు చెయ్యటానికి రెసిపీ ఉన్న జీన్ కి సంకేతం పంపిస్తుంది (దీన్ని జీన్ యాక్టివేషన్ అంటారు). ఆ జీన్ లో ఉండే codons ఆ ఎంజైము తయారు చెయ్యటానికి కావలసిన ఎమినో యాసిడ్ క్రమం చెబుతుంది (బయటకి పంపిస్తుంది). ఆ రెసిపీ తీసుకుని బయట జఠరరసం తయారు చెయ్యబడుతుంది. ఇక్కడ గమనించవలసినది, రెసిపీ ప్రతి వస్తుంది గానీ మూలం DNA లోనే ఉంటుంది.

శరీరంలో ప్రోటీన్స్ తయారవటం కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. ఇది దాదాపు చాప మీద కూర్చొని అమ్మ చెప్పినట్లు ఒక్కొక్క మల్లెపువ్వూ తీసుకుని గుచ్చుతూ మల్లె మాల కట్టినట్లు ఉంటుంది.

జీన్ activate అవ్వంగానే, ఆ జీన్ copy ఒకటి DNA నుండి విడుదలవుతుంది. దానిని messenger RNA (mRNA) అంటారు. దానిలోని ప్రతీ codon ఒక్కొక్క transfer RNA (tRNA) ని బయటకు పంపుతుంది. ఈ transfer RNA చెయ్యాల్సిన పని అల్లా codon చెప్పిన amino acid ని వెతికి పట్టుకుని ప్రోటీన్ తయారు అయ్యే చోటుకి తీసుకు రావటం. ఈ ప్రోటీన్ తయ్యారు అయ్యే చోటు ని  Ribosome అంటారు. అక్కడ జీన్ చెప్పిన విధంగా వచ్చిన amino acids అన్నీవరసగా కూర్చబడుతాయి. ఈ amino acid కూర్పును polypeptide chain అంటారు. ఈ chain వివిధ రకాలుగా నిర్మాణాత్మక మార్పులు చెంది ప్రోటీన్స్ గ మారుతాయి.

మన cells లో ఉండే ఈ ప్రోటీన్స్ మన మనుగడకు చాలా ముఖ్యమయిన పనులు చేస్తాయి. సామాన్యంగా అవి చేసే పనులు వాటి నిర్మాణాన్ని బట్టి ఉంటాయి. collagen , keratin లాంటివి పీచుతో ఉండి ఆకారాన్ని సృష్టిస్తాయి. hemoglobin లాంటివి ముడుచుకుపోయి దట్టముగా ఉండి ప్రాణ వాయువును దాచి పెట్టుకుని అన్నిటికీ అందిస్తాయి  ఎంజైములూ, హార్మోనులూ అన్నీ ప్రోటీన్లే. ఇన్సులిన్ మనము తిన్న ఆహారాన్ని శక్తీ ప్రదాయినిగా మార్చటంలో దోహదం చేస్తుంది , మనము తిన్న ఆహారంలో ఉన్న ప్రోటీన్స్ ని విచ్చిన్నం చేసి జీర్ణం చేసే పెప్సిన్ కూడా ప్రోటీనే. ఇంతెందుకు మన జీవత్వానికి ఈ ప్రోటీన్స్ చాలా ముఖ్యం.

ఇంత ముఖ్యమైన ప్రోటీన్స్ ఇరవై ఎమినో యాసిడ్స్ తో తయారవు తాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకో ఆశ్చర్య సంగతేమిటంటే మన శరీరం తన రసాయనిక శాలలో పదకొండు ఎమినో యాసిడ్స్ తయారు చేసుకోకలదు కానీ తొమ్మిదింటిని మాత్రం అది తనంతట తాను చేసుకోలేదు. ఆ తొమ్మిది  ఎమినో యాసిడ్స్ ని essential amino acids అంటారు. ఇవి తయారు చెయ్యటానికి మూల పదార్ధాలు మనము తీసుకునే ఆహారం నుండి రావాలి.

మనము తీసుకునే ఆహారంలో ప్రోటీనులు రోజుకి షుమారు 65 గ్రాములు పురుషులకు , 55 గ్రాములు స్త్రీ లకు ఉండుట మంచిదని ఆహార పరిశోధకులు నిర్ణయించారు (దీనిలో ఏకాభిప్రాయము లేదు). శాఖాహారు లైతే essential amino acids ఉన్న పదార్ధాలు లేక అన్ని amino acids ఉన్న పదార్ధాలు తినటం మంచిది. మీరు కేలరీస్ లో లెక్క వెయ్యాలంటే ఒక గ్రాము ప్రోటీన్ నాలుగు కేలరీస్ తో సమానము.

మాంసాహారులకు ఇరవై ఎమినో యాసిడ్స్ (ఈ తొమ్మిది essential amino acids తో సహా ) ఆహారం నుండి వస్తాయి కానీ శాఖాహారుల మాటేమిటి ? మనపూర్వులు శాఖాహారులై జీవించ లేదా? లేక కొన్ని ప్రోటీన్స్ లేకుండా జీవితం బాధలతో గడపాలా ? ఇప్పుడు కూడా శాఖాహారులై చాలా మంది జీవిస్తున్నారే ? ఏమిటి కధ ?

శాఖాహారులకి ఎమినో యాసిడ్స్ అన్నీ ఆహారంలో ఉండాలంటే సమీకృత ఆహారంతోనే వస్తాయి. Potatoes, Asparagus, Pears, Navy Beans, Milk, Cashews లో అన్ని ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. శాఖాహారులకు  మనకు కావాల్సిన ఏ ఏ ఎమినో యాసిడ్స్ ఏ ఏ ఆహారాలలో ఉంటాయో నాల్గవ మాతృకలో ఉన్న పట్టిక నుండి గ్రహించ వచ్చు.

సమీకృత ఆహారం ఎందుకు చెప్పానంటే మాంసా హారం లాగా అన్ని శాఖా హారాలలో, ఒక దాన్లోనే అన్ని essential amino acids ఉండక పోవచ్చు కానీ వివిధ శాఖా హారాలలో వివిధ essential amino acids ఉన్నాయి. ఉదాహరణకి మొక్క జొన్నలో lysine or threonine తక్కువ కానీ beans లో అవి ఉన్నాయి. (Some foods from the plant kingdom, such as soy and quinoa, have complete protein).

పూర్వకాలంలో దంపుడు బియ్యం తినే వారు. పప్పు (beans ) రోజూ ఉండేది. పాలు మజ్జిగలకు కొదవలేదు. చిరుతిళ్ళు వేరుశనగ కాయలు, శనగ గుగ్గిళ్ళు, మొక్కజొన్న కండెలు,నువ్వుల జీళ్ళు, చిమ్మిరి ఉండలు.  ఇంక ప్రోటీన్స్ కి మనకేమి కొదవ ?  మన ఆహారంలో అందరి బాగూ కోరి ఇవన్నీ ఉండేటట్లు మన భోజన ఆచారాలను తయారు చేసిన మన పూర్వీకులను మనము ఎంతో మెచ్చుకోవాలి. 

ఈ క్రింది సమాచారం అయిదవ నంబరు మాతృక నుండి సేకరించినది.

The human body uses protein to repair damaged cells and to build new ones. Marion Nestle, professor of nutrition at NYU and author of What to Eat, estimates that the average adult man needs about 65 grams of protein a day and the average adult female needs about 55 grams. Some sources, such as the Centers for Disease Control and the World Health Organization say you can maintain a healthy diet with even less.

What does this actually mean in terms of food choices? The National Institutes of Health explains that most people can meet their daily protein requirement by eating two to three small servings of a protein-rich food a day.

Examples of a single serving of protein include:
1 egg
2 tablespoons of peanut butter
2-3 ounces of red meat, poultry, or fish (about the size of a deck of cards)
½ cup of cooked dried beans such as black beans or chickpeas

Whole grains, seeds, and some vegetables also contain protein, so consuming enough is not difficult even if you don't eat meat. Vegetarians and vegans can easily get what they need by balancing complimentary proteins such as corn and beans or rice and tofu. Nutritionists used to recommend combining foods at the same meal, but research now shows that is unnecessary.
Are there drawbacks to eating more protein?

Eating large amounts of red and processed meats is associated with higher rates of heart disease and cancer, and most nutritionists such as Marion Nestle recommend cutting back on meat, especially on fatty cuts.

ప్రోటీన్స్ మీద నా ఇంకొక పోస్ట్:
86 ఓ బుల్లి కథ 74 --- ప్రోటీన్స్ విషయంలో శాకాహారులు మోసపోయారా ?


మాతృకలు:

1. Protein Function : http://biology.about.com/od/molecularbiology/a/aa101904a.htm

2. http://biology.about.com/b/2010/07/10/what-is-transcription.htm?nl=1

3. http://biology.about.com/b/2010/11/17/protein-synthesis-translation.htm?nl=1

4. http://www.nomeatathlete.com/vegetarian-protein/

Monday, May 7, 2012

84 ఓ బుల్లి కథ 72 --- ఎముకల బలహీనత -- Osteoporosis

జీవత్వం ఉన్న ప్రతి జీవి లోనూ జీవ కణాలు చస్తూ, పుడుతూ ఉంటాయి. ఈ పునరుత్పత్తి మనకు తెలియకుండానే జరుగుతుంది. కానీ ఆ పునరుత్పత్తి కి కావలసిన ముడిపదార్ధములు లేకపోతే అది ఆగిపోతుంది. మనకి కలిగే శరీర బాధలకి అనారోగ్యాలకీ కొంత కారణం ఈ పునరుత్పత్తి తగినంత లేకపోవటమే.

మన శరీరంలో ఎముకల బలహీనత వలన వచ్చే వ్యాధిని Osteoporosis అంటారు. శరీరంలో కాల్షియం తగ్గితే ఈ వ్యాధి రావటానికి అవకాశం ఉంది. గట్టిగా ఉండాల్సిన ఎముకలు మెత్తగా అయి వంగి పోతాయి. దురదృష్ట వశాత్తూ ఈ వ్యాధి ముదిరిపోయిన తరువాత కానీ దాని చెడ్డ లక్షణాలు బయటికి కనపడవు. ఉదా: ఎత్తు తగ్గటం, వంగి నడవటం, కాళ్ళ నెప్పులు, ఎముకలు విరగటం, విరిగినవి సరి అవటానికి చాలా కాలం పట్టటం మొదలయినవి. 

మన శరీర భాగాలు అన్నీ మనమనుకున్నట్లు కలిసికట్టుగా పని చెయ్యాలంటే మన శరీరంలో కాల్షియం (Calcium) తగిన మోతాదు లో ఉండాలి. బ్రెయిన్ సరీగ్గా పని చెయ్యాలన్నా, దాని నుండి వివిధ శరీర అవయవాలకు పంపే సంకేతాలు సరీగ్గా చేరాలన్నా, కాల్షియం చాలా ముఖ్యం. అల్లాగే మన శరీరానికి ఒక ఆకృతి నిచ్చే బొమికలకు (Bones) కూడా కాల్షియం చాలా ముఖ్యం. అందుకని మన శరీరం, అవసరాలకు అందుబాటులో ఉంటుందని ముందు జాగర్తగా కాల్షియంని ఎముకలలో దాచి పెట్టుకుంటుంది. తనకు అవసరమయినప్పుడు ఎముకల నుండి తీసుకుని మనము తినే ఆహారము నుండి కాల్షియంని తయారు చేసి ఎముకలకి సద్దుబాటు చేస్తుంది. ఈ ఇచ్చి పుచ్చుకునే సద్దుబాట్లు మనకి తెలియకుండా జరుగుతూ ఉంటాయి. జీవితంలో అన్నిట్లో లాగా తీసుకునేది ఎక్కువగా ఉండి  తిరిగి ఇచ్చేది తక్కువగా ఉంటే ఇచ్చిన వాళ్ళ ఇల్లు గుల్లవుతుంది, ఎముకలు గుల్లలుగా (బోలగా) తయారు అవుతాయి. ఇదే ఈ వ్యాధికి కారణం. మన శరీరంలో కాల్షియం పరిణితిని కొలిచే సాధనాల ద్వారా దీనిని నిర్ణయించ వచ్చు.

మన శరీరం మనం తినే ఆహారముల నుండి కాల్షియం, ఫాస్ఫేటులను తీసుకుని ఎముకలని నిర్మిస్తుంది. మన అందరిలో దాదాపు 25 ఏళ్ళప్పుడు మన శరీరంలో కాల్షియం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. మన జీవిత కాలంలో అంతకన్నా పెరగదు. ఆ తరువాత అంతా ఇచ్చి పుచ్చుకోటాలే. అందుకనే ఆ వయసులోపల కాల్షియం ఉన్న పౌష్టికాహారం తీసుకొనుట చాలా ముఖ్యం.

అమెరికాలో ఏభై ఏళ్ళ తరువాత, స్త్రీలలో అయిదుగుర్లో ఒకరికి , మగవాళ్ళల్లో ఎనిమిదిలో ఒకరికి ఈ వ్యాధి వస్తోంది. ఇది రావటానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్య కారణం శరీరంలో తగినంత కాల్షియం తయారు అవక పోవటం, తయారయిన కాల్షియం మూత్రము ద్వారా బయటికి వెళ్ళిపోవటం. వయస్సు పెరిగిన కొద్దీ సెక్సు హార్మోనులు తగ్గటం కూడా ఒక కారణం. పొగ త్రాగుట, మద్యము సేవించుట, పని చేయకుండా సోమరిగా ఒక చోట కూర్చుండుట కూడా కారణాలే. ఉప్పు ఎక్కువ తినుట కూడా ఒక కారణం. ఎంత ఎక్కువ ఉప్పు తింటే అంత కాల్షియం మూత్రము ద్వారా పోతుంది.

మనము రెండు విధములుగా కాల్షియం ను శరీరమునకు అందించ వచ్చును. మొదటిది మాత్రల ద్వారా. మాత్రల ద్వారా శరీరమునకు కాల్షియం అందిన, అది జీర్ణించి పనిచేయుటకు విటమిన్ D3 కావలయును. రోజుకి 1,200 mg కాల్షియం, 800 mg D3 వేసుకొనుట మంచిది (సూర్యరశ్మిలో పది నిమిషములు కూర్చున్ననూ ఈ విటమిన్ ను పొందవచ్చును). ముందుగా మీ వైద్యుని సంప్రదించుట మంచిది.

ఆహార పదార్దముల ద్వారా కూడా శరీరమునకు కాల్షియం ఇవ్వ వచ్చును. పచ్చటి ఆకులున్న కూరలన్నిటి లోనూ కాల్షియం ఉంటుంది. Low-fat dairy products (పాలు పెరుగు మజ్జిగ) , Dark green leafy vegetables పచ్చటి ఆకు కూరలు, Broccoli, Canned salmon or sardines with bones, Soy products such as tofu, సోయా బీన్స్ , Calcium-fortified cereals and orange juice.ఈ విధముగా అందిన కాల్షియం శరీరములో జీర్ణించుటకు విటమిన్ K అవసరము. దీనికి మనము తిన వలసిన ఆహారములు: Chard, Brussels sprouts, kale, cauliflower and spinach (బచ్చలి), the herb parsley.

చివరి మాట:  నా ఉద్దేశంలో మన భోజన సాంప్రదాయం " కూర, పచ్చడి, పప్పు, పులుసు, మజ్జిగ" సమీకృత పౌష్టిక ఆహారానికి గీటు రాయి. మనం ఆరోగ్యముగా ఉండటానికి మన శరీరానికి కావలసిన మూల పదార్ధాలను పంచి ఇస్తుంది. వీలయినంత వరకూ ఆహారములో మన సాంప్రదాయాలు పాటించండి. మీ ఆరోగ్య విషయములలో చర్యలు తీసుకునేముందు తప్పకుండా మీ సొంత వైద్యుని సంప్రదించండి.

మాతృక:

http://www.emedicinehealth.com/osteoporosis/article_em.htm

http://saveourbones.com/natural-bone-building-handbook/

Monday, March 26, 2012

83 ఓ బుల్లి కథ 71 --- బ్లడ్ ప్రెజరు -- బీట్రూట్ జ్యూస్

ముందుమాట: మనకి ప్రకృతి పరంగా సహజంగా దొరికే ఆహారపదార్ధములతో మనకు కలిగే వ్యాధులను నివారించ వచ్చా, అనే అంశం మీద చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగా  " బీట్రూట్ జ్యూస్ , బ్లడ్ ప్రెజరు మీద ఎటువంటి ప్రభావము చూపుతుంది" అనే అంశం మీద పరిశోధనా ఫలితాలు చెప్పటానికే ఈ పోస్ట్.

మన జీవితం వ్యాధులు రాకుండా సక్రమంగా గడవాలంటే శరీరంలోని అవయవాలు అన్నీ సక్రమంగా పని చేయాలి. అవి సక్రమంగా పనిచెయ్యాలంటే వాటికి కావలసిన ప్రాణ వాయువు, పోషక పదార్ధాలు సరియిన టైముకి సరీగ్గా అందాలి. అంటే శరీరంలో అన్ని అవయవాలకి కావలసిన పోషక పదార్ధాలు తీసుకు వెళ్ళే రక్తము సక్రమంగా  సరియిన సమయములో వాటికి చేరాలి.

మన శరీరములో రక్త నాళముల ద్వారా అన్ని అవయవములకు రక్తము చేరుతుంది. ఈ రక్తప్రసరణ మన గుండె ద్వారా  24 గంటలూ జరుగుతుంది. గుండె సరీగ్గా రక్తమును పంప లేక పోయినా, రక్తనాళములలో అవరోధములు కలిగి రక్త ప్రసరణ సరీగ్గా జరగక పోయినా, ప్రాణ వాయువు, పోషక పదార్దములు అవయవములకి అందవు. అందువలన అవి సరీగ్గా పనిచెయ్యక పోవచ్చు. ఈ రక్త ప్రసరణ లోప వ్యాధులను Cardiovascular diseases అంటారు.

ఇటువంటి పరిస్థుతులలో మన శరీరం మామూలుగా nitric oxide అనే పదార్ధాన్నితయారు చెయ్య గలిగి ఉంటుంది. ఇది రక్త నాళాలని అవసరమయినప్పుడు పెద్దవి చేసి రక్తము అన్ని చోట్లకు అందే విధముగా సరిచేస్తుంది. కానీ వయసు పెరుగుతున్న కొలదీ, దీని ఉత్పత్తి తగ్గుట మూలముగా రక్త నాళములు సరిచేయు ప్రక్రియ సక్రమముగా జరుగక, రక్తము సరీగ్గా అందక వ్యాధులు వచ్చును. అటువంటి పరిస్థుతులలో సమస్యను పరిష్కరించుటకు తగిన   మందులు వాడ వలసి వచ్చును. ఉదాహరణకి angina, or chest pain, కి వాడే మందు nitroglycerine రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ని పెంచి దాని ద్వారా రక్త నాళాలను వ్యాకోచింప చేసి, రక్తమును సక్రమముగా ప్రవహింప చేసి, కలిగిన బాధను పోగొట్టును. మన శరీరము nitroglycerin tablets లో ఉన్న Nitrates ను తీసుకుని Nitric Oxide తయారు చేయుట వలన సమస్య పరిష్కార మయినది.

మనము  Nitrates ఉన్న ఆహారము తినిన యడల, వాటిని ఉపయోగించి మన శరీరము  Nitric Oxide ను తయారుచేసి వ్యాధిని నివారించ గలదా?  అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.

అందులో ఒక పరిశోధన "Barts and The London School of Medicine" లో  జరిగింది. ఇక్కడ  volunteers కి రోజుకి రెండు కప్పుల బీట్ రూట్ జ్యూస్ ఇచ్చి వారి బ్లడ్ ప్రజరు ని రికార్డ్ చేయగా ఒక గంటలో బ్లడ్ ప్రజరు తగ్గుట గమనించారు. దీని ప్రభావం 24 గంటల వరకూ ఉంటుందని కూడా గమనించారు. ఈ పరిశోధనా ఫలితాలు American Heart Association's medical journal, Hypertension, లో ప్రచురించారు.

బీట్రూట్ జ్యూస్ లో ఉన్న Nitrtes , Nitroxide గ రూపాంతరము చెందటము మూలంగా  బ్లడ్ ప్రజరు తగ్గిందని నిర్ధారించారు. కానీ రోజుకు రెండు కప్పుల బీట్రూట్ జ్యూస్ తాగటము మూలంగా బరువు పెరిగే అవకాశము ఉన్నది అని కూడా గ్రహించారు. దీనికి కారణము రెండు కప్పుల బీట్రూట్ జ్యూస్ లో, 50 గ్రాముల కార్బో హైడ్రేటులు ఉండి 200 కేలరీల శక్తి కలిగి ఉండుటయే. అందుకని బీట్రూట్ జ్యూస్ వాడిన తరువాత, మన బరువు పెరగకుండా ఉండుటకు, మనము తినే ఆహారములో కొన్ని సర్దుబాట్లు చేయవలసి వచ్చును.మనము వాడే కూరలు  spinach, cabbage, radishes లో కూడా Nitrates ఉన్నవి.

చివరి మాట: మీ మీ ఆరోగ్య విషయములలో ఎప్పుడూ మీ డాక్టరు గారిని సంప్రదించి మాత్రమే తగిన చర్యలు తీసుకొనుట మంచిది.

ఈ క్రింది వాక్యాలు మాతృకలో నుండి కాపీ చేశాను:
In the human body, nitrate is converted to nitric oxide, a substance that is known for its ability to dilate blood vessels and subsequently reduce blood pressure.

Nitrate occurs naturally in many vegetables, including spinach, cabbage, radishes and, of course, beets.

Among the study participants (drinking two cups of beetroot juice daily significantly reduced blood pressure in healthy volunteers), blood pressure fell within just one hour of drinking the beetroot juice, with the greatest drop occurring three to four hours following consumption. The blood pressure-lowering effects continued for up to 24 hours afterward.

Many experts blame the steady decline in nitric oxide production for many age-related diseases and disorders of the cardiovascular system, including high blood pressure, hardening of the arteries, heart disease, sexual dysfunction and peripheral vascular disease.

దీని మాతృక:
Your Health by Dr. Rallie McAllister
Daily Dose of Beetroot Juice Lowers Blood Pressure, Boosts Cardiovascular Health
http://www.creators.com/health/rallie-mcallister-your-health/daily-dose-of-beetroot-juice-lowers-blood-pressure-boosts-cardiovascular-health.html

Rallie McAllister is a board-certified family physician, speaker and the author of several books, including "Healthy Lunchbox: The Working Mom's Guide to Keeping You and Your Kids Trim." Her website is www.rallieonhealth.com. To find out more about Rallie McAllister, M.D., and read features by other Creators Syndicate writers and cartoonists, visit the Creators Syndicate Web page at www.creators.com

బ్లడ్ ప్రెజరు మీద నా పాత పోస్ట్:
49 ఓ బుల్లి కథ 37 ---- బ్లడ్ ప్రెజరు తగ్గించే పళ్ళు కూరలు
http://mytelugurachana.blogspot.com/2011/03/49-37.html

Monday, March 19, 2012

82 ఓ బుల్లి కథ 70 --- న్యూయార్క్ లో ఓ వారం

ఫిబ్రవరి లో మూడవ శనివారం పొద్దున్నేచికాగో మిడ్వే ఏర్పోర్ట్ లో సౌత్వెస్ట్ ఫ్లైట్ ఎక్కి న్యూ జెర్సీ నెవార్క్ ఏర్పోర్ట్ కి  వచ్చాము. అక్కటి నుండి Zipcar లో సొరంగం ద్వారా న్యూయార్క్ చేరుకున్నాము. న్యూయార్క్ ద్వీపం లాంటిది, చుట్టూతా నీళ్ళు. రోడ్డు మీద పక్క ఊళ్ళనుండి అక్కడకి రావాలంటే రెండే మార్గాలు, నీళ్ళ క్రింద నుండి సొరంగం ద్వారా, లేక నీళ్ళ పైన బ్రిడ్జి ద్వారా. అమెరికాలో ఇది మిడ్ వింటర్. చలి, స్నో ఇష్టమయితే తప్ప నా లాంటి వాళ్ళు ఈ సమయంలో బయటికి కదలరు. ఈ సంవత్సరం అదృష్టవశాత్తూ చలి ఎక్కువగా లేదు కానీ వేసవిలో కనుల పండువగా ఉండే ప్రకృతి బోసిపోయి ఉంది.

న్యూయార్క్ నగరం గురించి చెప్పేటప్పుడు "ఎప్పుడూ నిద్రపోని పట్టణం" అంటారు. ఈ నగరం న్యూయార్క్ రాష్ట్రం లో పెద్ద పట్టణం. అంతే కాదు అమెరికాలో పెద్ద పట్టణం. బహుశా ప్రపంచంలోకెల్లా పెద్ద పట్టణం అవ్వచ్చు.  "The city never sleeps" అనబడే ఈ పట్టణం ఇంతవరకూ చూడటం తటస్థించలేదు. అబ్బాయి కోడలూ కొత్త కాపరం న్యూయార్క్ లో పెట్టటం తోటి వెళ్ళే అవకాశం కలిగింది.

న్యూయార్క్  నేపధ్యంగా చాలా మువీలు తీశారు. మార్లన్ బ్రాండో  "God Father",  మెగ్ రాయన్ మూవీ   "When Harry Met Sally" మొదలయినవి.మా యింటికి వెనక వైపు రెండు బ్లాకుల్లో ఇంకో మెగ్ రాయన్ మూవీ  "You Got Mail" తీసిన రెస్టరెంట్ ఉంది. నేను వెళ్ళలేదు మా వాళ్ళందరూ వెళ్లి చూసి వచ్చారు.

న్యూయార్క్ నగరం లో మేము ఉన్న ప్రదేశాన్ని మాన్హా టాన్  అంటారు. కొలంబస్ డ్రైవ్ లో ఒక పెద్ద Brown Stone బిల్డింగ్ లో (ఇటుకలతో కట్టిన మేడలో)  one bedroom apartment. ఇక్కడ ఉన్న బిల్డింగులన్నీ దాదాపు వంద ఏళ్ళ క్రింద కట్టినవి. సామాన్యంగా లిఫ్టులు ఉండవు. మేమున్న ఐదు అంతస్తుల మేడ లో మా అపార్ట్మెంట్ ఉన్నరెండవ అంతస్తు కి వెళ్ళటం కూడా కొంచెం కష్టమే, మెట్లు చాలా ఎత్తుగా ఏటవాలుగా ఉన్నాయి.

సామాన్యంగా ఇక్కడ రెండు వీధుల మధ్య ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది. దీన్ని ఒక బ్లాక్ అంటారు. ఒక బిల్డింగ్ ఒక బ్లాక్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ లో షాపులు ఉంటాయి. మా  బిల్డింగ్ కి  క్రింద ఒక పిజ్జా షాపు , ఒక మెక్సికన్ రెస్టారెంట్, ఒక చెప్పులు బాగు చేసే షాపు, ఒక బట్టలు ఉతికే షాపు, ఒక పెద్ద గ్రోసరీ స్టోరు ఉన్నాయి. ఇంటి ఎదురుకుండా ఒక డూనట్ (తీపి గారెలు)  షాపు, ఒక ఖరీదు అయిన ఆభరణాలు అమ్మే షాపు, ఒక క్రేప్స్ ( తీపి దోశెలు) రెస్టారెంట్, ఒక చైనీస్ రెస్టారెంట్ ఉన్నాయి. పక్క బ్లాకులో పేవ్ మెంట్ మీద పళ్ళు, కూరగాయల దుకాణం ఉంది. అది 24 గంటలూ తెరిచి ఉంటుందిట. మా ఇంట్లో కూరలు అక్కడ నుండి తెచ్చినవే. ఈ తడవ వెళ్ళినప్పుడు 24 గంటలూ ఎల్లా తెరిచి ఉంచు తారో కనుక్కోవాలి. అల్లాగే 24 గంటల డైనర్లూ, 24 గంటల బ్యూటీ షాపులు (జుట్టు కత్తిరించేవి) ఉన్నాయిట. మా ఇంటి ఎదురు కుండా 24 గంటలూ జనం తిరుగుతూనే ఉన్నారు.

మా బ్లాకులో ఉన్న షాపుల్లో వ్యాపారం బాగా సాగుతోంది. చెప్పులు బాగు చేయించు కోటానికి  జనం క్యు లో నుంచుంటే ఆశ్చర్య మేసింది. ఐదు వందల డాలర్లు పెట్టి కొన్న బూట్లని అవతల పారేస్తారా ? ఏదో అతుకు వేసి సరిచేస్తారు. బట్టలు ఉతకటానికి షాపులో పొద్దున్న పది గంటల లోపు ఇస్తే సాయంత్రం ఉతికి మడతపెట్టి ఇంటికి తీసుకు వచ్చి ఇస్తారు. పౌను బట్టలు ఉతకటానికి ఒక డాలరు.

సామాన్యంగా ఇక్కడ ఉండే వాళ్లకి కార్లు ఉండవు. కార్లు కొనగల స్థోమత ఉన్నా పెట్టుకోటానికి చోటు ఉండదు. తిరగటం అంతా టాక్సీలు, బస్సులు, రైళ్ళు (సబ్వే అంటారు క్రింద  సొరంగంలో నించి వెళ్తాయి). Zipcar అనే కంపెనీ వాళ్ళు కొన్ని చోట్ల కార్లు పెట్టారు. డబ్బులు వేసి తీసుకుని వాడుకుని అక్కడే  పెట్టేయాలి. మేము గంటకి పదిహేను డాలర్ల చొప్పున రెండుగంటలు తీసుకున్నాము. టాక్సీలు సామాన్యంగా ఒకటి రెండు బ్లాకులకు (చిన్న దూరాలకి) రావు. ఒక సారి మా డాడీ నడవలేరు అనిచెప్పి డ్రైవర్ ని ఒప్పించాడు మావాడు. ఇండియన్ డ్రైవర్ కొంచెం కనికరం చూపించాడు. సాయంత్రం నాలుగున్నర అయుదున్నర మధ్యలో టాక్సీలు దొరకటం కష్టం.  తిరుగుతుంటాయి కానీ ఆఫ్ డ్యూటీ అని బోర్డు వెలుగుతూ ఉంటుంది. మనదేశం ఆయనే ఒకాయన టాక్సీ ఆపి మమ్మల్ని ఇంటికి జేర్చాడు. మీకు  టాక్సీలు కావాలంటే రోడ్డుపక్కన నుంచుని (బస్ స్టాప్ దగ్గర కాకుండా) చెయ్యి చాపటమే.

మేమున్న ప్రదేశానికి ఎడమ వేపు మూడు బ్లాకుల్లో సెంట్రల్ పార్క్ ఉన్నది. పార్క్ చాలా పెద్దది. చాలా మంది జనం, నడిచే వాళ్ళూ, పరిగెత్తే వాళ్ళూ, ఆటలాడే వాళ్ళూ, నాలాగా బెంచీ మీద కూర్చొని సోద్యం చూస్తున్న వాళ్ళూ, పిల్లలూ, పిల్లలతో వచ్చిన పెద్దలూ బోలెడంత మంది. పార్క్ చూడటానికి  వచ్చిన టూరిస్టులకోసం సైకిల్ రిక్షాలూ గుర్రపు బాగ్గీలూ ఉన్నాయి (ఆ వీధిలో కార్లు నడవవు).  ఇది ఫిబ్రవరి, అమెరికాలో మిడ్ వింటర్ అందుకని జనం ఎక్కువ లేరు. ఈ సంవత్సరం అదృష్టవశాత్తూ పెద్ద స్నో పడలేదు. చెట్లు మామూలుగా ఆకులు రాలి పోయి బోడిగా ఉన్నాయి. కానీ వేసవిలో చుట్టూతా పచ్చదనంతో చూడముచ్చటగా మాజిక్ షోలతోటి, పార్కులో తిరిగే వాళ్ళ తోటి,  అమ్మేవాళ్ళ తోటి, తినే వాళ్ళ తోటి హడావిడిగా ఉంటుందిట.

ముందుకి ఐదారు బ్లాకులు వెళ్తే "టైం స్క్వేర్". ప్రతీ సంవత్సరం అమెరికాలో మొదటి న్యూ  ఇయర్ ఇక్కడే జరుపుకుంటారు. జనం తోటి చాలా హడావిడిగా ఉంటుంది. TV లో కూడా చూపెడతారు.బ్రాడ్వే థియేటర్స్ అన్నీ ఇక్కడికి దగ్గరలో ఉన్నాయి. వీటిల్లో నాటకాలు వేస్తారు. కొన్ని అలా మొదలుపెట్టిన నాటకాలు సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి. మేము చూసిన నాటకం రెండేళ్ళ బట్టీ నడుస్తోంది. ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. దగ్గరలో ఆరోజు నాటకాలకి మిగిలిపోయిన టిక్కెట్లు సగం ధరకి అమ్ముతారు. కానీ చాలాపెద్ద క్యూ  ఉంటుంది. మేము కొత్తగా వచ్చిన  "Death of a Salesman" నాటకానికి వెల్దామనుకున్నాము కానీ టిక్కెట్లు దొరకలేదు.

మేము చలిలో నుంచో లేక "మామీ మియా" అనే సంగీత నాటకానికి మామూలు టిక్కెట్లు కొనుక్కొని వెళ్ళాము. కధ కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ, నాటకం చాలా బాగుంది. కధ క్లుప్తంగా, ఒకావిడ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తూ ఆవిడ స్నేహుతురాళ్ళని, పిల్ల స్నేహితురాళ్ళనీ పిలుస్తుంది. స్థలం గ్రీస్ దగ్గర ఉన్నద్వీపాల్లో ఒక ద్వీపం. కానీ పిల్లకి చాలా దిగులు, తన తండ్రి ఎవరో ఇంతవరకూ తల్లి చెప్పలేదు. సామాన్యంగా పెళ్ళిలో తండ్రి, కూతుర్ని పెళ్లి కుమారుడికి అప్పగిస్తాడు. ఆ పిల్ల కోరిక కూడా అదే తన అప్పగింత తండ్రి ద్వారా జరగాలని. దిగులుతో ఉంటుంది. ఇంతలో పిల్లకి తల్లి డైరీ కనపడుతుంది. దానిలో తన తల్లి యవ్వనంలో ముగ్గురితో తిరిగినట్లు వ్రాసి ఉంటుంది. ఆ ముగ్గిరిలో తన తండ్రి ఎవరో  తేల్చుకోలేక ఆ ముగ్గురినీ రహశ్యంగా తన పెళ్ళికి ఆహ్వానిస్తుంది. పెళ్ళికి అందరితోపాటు తన పాత శృంగార మిత్రులు ముగ్గురూ వచ్చేసరికి తల్లి ఆశ్చర్యపోయి దిగ్భ్రాంతి చెందుతుంది. నాటకమంతా ఈ వృత్తాంతం మీద నడుస్తుంది. ఆ అమ్మాయికి తండ్రి ఎవరు? ముగ్గురూ కొట్టుకుంటారా ? మీరు చూసి తెలుసుకోవాల్సిందే!  దీనిని మూవీ(Mamma Mia) గ కూడా తీశారు.

"టైం స్క్వేర్" వెళ్ళే ముందర రెండు బ్లాకుల్లో కొలంబస్ సర్కిల్ వస్తుంది. Jack Lemmon, Judy Holliday movie "It Should Happen to You" కొలంబస్ సర్కిల్ ఇతివృత్తంగ తీశారు. జూడీకి అప్పుడే ఉద్యోగం పోతుంది. సెంట్రల్ పార్క్ కి వచ్చి దిగాలుగా ఒక బెంచ్ మీద కూర్చుంటుంది. జాక్ లెమన్ ఒక పత్రికకి పని చేస్తూ ఉంటాడు. అతని పని డాక్యుమెంటరీలు తీయటం. ఆ రోజు ఇతివృత్తం "పాదాలు". జూడీ పాదాలు ఫోటోలు తీసిన తరవాత అవి చాలా బాగున్నాయని మెచ్చుకుని మాటలు కలుపుతాడు. కొంతసేపు అయిన తరువాత ఎవరి దోవన వాళ్ళు వెళ్లి పోతారు. వారి మాటల తరువాత జూడీ కి తన జీవితంలో అందరూ తన పేరు చెప్పుకునేలా ఒక గొప్ప పని చెయ్యాలని అనిపిస్తుంది. కానీ తను పెద్ద చదువుకోలేదు, కొత్త నిరుద్యోగి, డబ్బులు అసలేలేవు. లేచి వెళ్తుంటే పక్కనున్న కొలంబస్ సర్కిల్ లో ఖాళీగా ఉన్న ఒక బిల్ బోర్డు కనపడుతుంది. సరే వెంటనే జూడీకి ఆలోచన వచ్చి బిల్ బోర్డు యజమానిని పిలుస్తుంది. ఆమె ఆలోచన తన దగ్గర మిగిలిన అయిదు వందల డాలర్ల తోటీ తన పేరు ఆ బిల్ బోర్డు మీద వేయించు కోవాలని. ఈవిధంగా నయినా తనపేరు నలుగురూ చెప్పుకుంటారని. చివరికి సాధిస్తుంది, తన పేరు బిల్ బోర్డు మీద మూడు నెలలపాటు ఉండేటట్టు కాంట్రాక్ట్ తీసుకుంటుంది. అక్కటి నుండీ సినీమా రంజుగా తయారవుతుంది. వీలుంటే పాత సినీమాలు లైబ్రరీలో ఉంటాయి చూడండి.

మా ఇంటికి కుడి వైపు నాలుగు బ్లాక్ లు వెళ్తే న్యూయార్క్ లో కళలకు కాణాచి  Lincoln Center వస్తుంది. దీనిలో Juilliard School for music and arts, ఒపేరా హౌస్,  న్యూయార్క్  ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా ఉన్నాయి. అక్కడ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్ళాము. రష్యన్ మ్యూజిక్ కంపోజర్ వ్రాసిన మ్యూజిక్ ని న్యూయార్క్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా వాళ్ళు వాయించారు. అందరితోపాటు మేమూ చప్పట్లు కొట్టాము. చాలా జాగర్తగా పాట అయినతరువాతే చప్పట్లు కొట్టాలి. పాట ఎప్పుడయిపోతుందో తెలియదుకాబట్టి  అందరితో కలిసి చప్పట్లు కొట్టాము. జాగర్తగా లేకపోతే ఎవరీ అనాగారీకుడు అని అందరూ వింతగా చూస్తారు.  Juilliard School  లో విద్యార్ధులు ఫ్రీగా సంగీత కచేరీలు ఇస్తూ ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు పియానో కాన్సర్ట్ ఒక దానికి వెళ్ళారు. సామాన్యంగా రోజూ ఏవో ఉంటూ ఉంటాయి.

ఆదివారం సాయంత్రం మా స్నేహితుడు రామారావు వచ్చి వాళ్ళ ఊరు కారులో తీసుకు వెళ్ళాడు. ఆ ఊరి పేరు డిల్హై (Delhi), న్యూయార్క్ కి రెండువందల యాభై మైళ్ళ దూరంలో ఉంది. అక్బర్ కాలంలో ఇండియా వచ్చినాయన  ముగ్దుడై ఆ ఊరుకి ఆ పేరు పెట్టారుట. అంతే కాదు అక్కడ దగ్గరలో సరస్సులు ఉన్నాయి. వాటి పేర్లు శోకన్, అశోకన్. ఇక్కడ ఇండియా అంటే ఇష్టమయిన వాళ్ళు చాలా మంది ఉన్నారల్లె ఉంది.

ఈ ఊళ్ళో ఉన్నరెండో తెలుగు వారు, మాకు తెలిసిన డాక్టర్ నాయుడు గారు మమ్మల్ని డిన్నరుకు తీసుకు వెళ్ళారు. అక్కడ నిప్పులపై కాల్చిన బేక్డ్ పొటాటో చాలా బాగుంది. డాక్టర్ గారు మొన్ననే మారిషస్ తెలుగు మహా సభలకి వెళ్లి ఆయన రచనలకి శాలువాతో సత్కరింపబడి వచ్చారు. ఆయన చెప్పిన విశేషం, తెలుగు క్షీణించే భాషలలో ఒకటిగా UNESCO వాళ్ళు నిర్దారించారుట. ఒక పుస్తకం కూడా చూపించారు. చాలా బాధేసింది. ఈ తడవ ఒక నెలరోజులు ఉండి ఆయన వ్రాసిన తెలుగు కవితలు రచనలు కంప్యూటర్ లోకి ఎక్కిస్తానని చెప్పి వచ్చాను.

మర్నాడు వాళ్ళ వూరికి దగ్గరలో (250 మైళ్ళ దూరంలో) నయాగరా ఫాల్స్ ఉంటే అక్కడికి కారులో పొద్దున్న వెళ్ళి  రాత్రికి వచ్చేశాము. నాతో నయాగరా చూడాలని మా ఆవిడ కి ఎప్పటినుండో (40 ఏళ్ళు నుండీ) కోరిక, అనుకోకుండా కోరిక ఇప్పుడు తీర్చ కలిగాను. దేనికయినా కాలం, సమయం కలిసిరావాలి. చలికాలంలో సామాన్యంగా ఎవ్వరూ నయాగారాకి వెళ్ళరు. నీళ్ళు గడ్డకట్టుకు పోతాయి కదా. ఈ సంవత్సరం వాతావరణం కొద్దిగా వెచ్చగా ఉంది కాబట్టి నయాగరా కొండమీది నుండి మృదువుగా నెమ్మదిగా జారుతోంది. ఇక్కడి నుండి మర్నాడు న్యూయార్క్ బస్ లో వచ్చాము. బస్ కొండల్లో కోనల్లో చిన్న చిన్నపల్లెటూళ్ళలో ఆగుకుంటూ ప్రయాణిస్తుంది.

మర్నాడు ఇంకొక స్నేహితుడు మా రెడ్డి వచ్చి వాళ్ళింటికి తీసుకు వెళ్ళారు. వాళ్ళ ఊరు న్యూయార్క్ కి యాభై మైళ్ళ దూరంలో లాంగ్ ఐలాండ్లో ఉంది. లాంగ్ ఐలాండ్ చిన్నా చితకా ద్వీపం కాదు, నూట యాభై మైళ్ళ పొడుగూ యాభై మైళ్ళ వెడల్పూ ఉంటుంది. దారిలో క్వీన్స్ లో గణేష్ టెంపుల్ చూశాము. నాకు తెలిసినంత వరకూ, న్యూయార్క్ దగ్గర గణేష్ టెంపుల్, పిట్ట్సు బర్గ్ దగ్గర వెంకటేశ్వర టెంపుల్ అమెరికాలో మొట్ట మొదట కట్టారు. దారిలో జోన్స్ బీచ్ కూడా చూశాము. చలికాలం కాబట్టి బీచ్ లో ఎక్కువ మంది లేరు . మర్నాడు లాంగ్ ఐలాండ్ రైల్లో న్యూయార్క్ కి తిరిగి వచ్చాము.

ఇంకా న్యూయార్క్ లో ఉండి చూసినవి Statue of Liberty, Ellis Island. ఈ రెండిటికీ బోటు మీద వెళ్ళాలి. Statue of Liberty ఫ్రెంచ్ వాళ్ళు అమెరికాకి ఇచ్చిన కానుక. అది రాగి తో చేశారు కానీ పచ్చగా ఉంటుంది. అదంతా చిలుము.  ఆ రాగి విగ్రహం పూర్తిగా చిలుము పట్టి పచ్చగా మారటానికి ముప్పై ఏళ్ళు పట్టిందిట !. Ellis Island లో వలస వచ్చిన వారి మీద ఎగ్జిబిషన్ ఉంది, అమెరికాకి జనం తట్టా బుట్ట తో ఎలా వచ్చారో చూడచ్చు. ఒక గోడ మీద ఇమ్మిగ్రంట్ ల పేర్లు కూడా ఉన్నాయి. మీరు అక్కడకి వెళ్తే మా పేర్లు ఉన్నాయి చూడండి.

ఎక్కడికి వెళ్ళినా ఆ ఊరిలో ఎత్తు అయిన బిల్డింగ్ మీదికి ఎక్కి ఊరు చూడాలి అని మా ఆవిడ కోరిక, లేకపోతే అక్కడికి వెళ్ళినట్లు ఉండదుట. అది న్యూయార్క్ లో Empire State Building ."Sleepless in Seattle" అనే మూవీ చివరి సీను ఇక్కడే తీశారు. విడోయర్ అయిన తండ్రికి ఏదో విధంగా పెళ్లి చెయ్యాలని బుడతడు ( అయిదారేళ్ళ కొడుకు) నిర్ణయిస్తాడు. దానికి ఒక రేడియో కార్యక్రమం ద్వారా పెళ్ళికూతుర్ల నుంచి వివరాలు తెప్పించుకుంటాడు. ఒక పెళ్ళికూతురికి Empire State Building మీద valentine day రోజున కలవమని వ్రాస్తాడు. తను అక్కడికి వెళ్తాడు కానీ ఆ అమ్మాయి రాదు. తరువాత కధ ఎల్లా  సుఖాంత మౌతుందో  సినీమా చూసి తెలుసుకోండి.

తరివాతి ట్రిప్ Grand Central Station . చాలా పెద్ద ట్రైన్ స్టేషన్. ప్లేనులు, కార్లు ఎక్కువుగా ఉపయోగించని రోజుల్లో అమెరికాలో ట్రైన్ ద్వారానే ఎక్కువగా దూర ప్రయాణం చేసే వాళ్ళు.  ట్రైన్ లో మొదలయిన  సినిమాలు కూడా చాలా వచ్చాయి. పాల్ న్యూమాన్ మూవీ "STING" లో న్యూయార్క్ నుంచి చికాగో దాకా పోకర్ గేం ఆడతారు. మూవీ అంతా దీని ఫలితాల మీద ఆధార పడింది. మూవీ చూడండి. డబ్బులు చూపెట్టి ధనవంతులని కూడా ఎల్లా బుట్టలో వెయ్యోచ్చో పాల్ న్యూమాన్ చూపెడతాడు.

మేము  Grand Central Station కి వెళ్ళినది ఆస్కార్ వీకెండ్. ఆదివారం నాడు హాలివుడ్లో వాటిని ప్రెజెంట్ చేస్తారు. అక్కడ నిజమైన ఆస్కార్ చేతిలోపెట్టి ఫోటో తీస్తున్నారు. మా ఆవిడకు కూడా ఆస్కార్ ఇప్పించాను.

ఈ నసుగుడు రాయుణ్ణి ఇంట్లో వదిలి పెట్టి, స్ప్రింగ్ చికెన్స్అనుకునే వాళ్ళు, న్యూయార్క్ లో చూసినవి, NBC Studio Tour (TV), China Town, Saravana Bhavan. ఉసురు తగలకుండా తిరిగి వచ్చేటప్పుడు నాకు తెచ్చినవి --- సిటీ మాగ్నేట్స్, చైనా టౌన్ లో అమ్మే వాడిని ముప్పు తిప్పలు పెట్టి  బేరమాడి తెచ్చిన స్కార్ఫ్స్, పర్ఫ్యూమ్స్, శరవణ భవన్ నుంచి ఉల్లి రవ్వ దోశ.

అప్పుడే ఆదివారం తిరిగి వచ్చేసింది. వింటర్ వండర్ లాండ్ చికాగోకి తిరిగి వచ్చాము. మా నెక్స్ట్ ట్రిప్ లో (కొడుకూ కోడలూ ఆహ్వానిస్తే) న్యూయార్క్ లో ఏమి చెయ్యాలో నిర్ధారించు కున్నాము. వేసంగిలోవెళ్లి రోజూ సెంట్రల్ పార్క్ కి వెళ్ళటం లేకపోతే లింకన్ సెంటర్ కి వెళ్లి రోజూ కాఫీ త్రాగటం (ఫ్రీ కన్సర్ట్స్ ఉన్నాయేమో తెలుస్తుంది). మ్యూజియమ్స్  అన్నీ చూడటం. రాత్రి పూట బ్రాడ్వే నాటకాలకి  లేకపోతే ఫ్రీ కాన్సర్టులకి వెళ్ళటం. డబ్బులవుతాయి కానీ రిటైర్ అయ్యినతరువాత ఏమిచేస్తాము ?.

ఫల శ్రుతి: ఈ పోస్ట్ చదివిన వారికి న్యూయార్క్ వెళ్ళే భాగ్యము కలుగు గాక. నాకు మాత్రం డెఫినిట్ గ ఫలం కలుగుతోంది. మొగుడితో నయాగరా ఫాల్స్ చూడాలనే మా ఆవిడ కోర్కె తీర్చా కాబట్టి, రోజూ మంచి భోజనం దక్కుతోంది. ఎంతకాలం సాగుతుందో చెప్పలేను కానీ, ఆ రవ్వల నెక్లెస్ కోరిక మనస్సులో కెలకనంత వరకూ ఫరవాలేదు అనుకుంటున్నాను.

Monday, February 13, 2012

81 ఓ బుల్లి కథ 69 --- మానస లీల

                          మానస లీల

రచన: లక్కరాజు శివ రామకృష్ణారావు 

మురహరి రావు గారి అమ్మాయి లీల అంటే నా కెందుకో చాలా ఇష్టం. కోల ముఖం. చక్కని కనుతీరు. ఎర్రగా బుర్రగా ఉంటుంది. నేను ఎప్పుడూ లీలతో మాట్లాడినట్లు గుర్తు లేదు కానీ ఆ అమ్మాయంటే అదొక ఇది. సావిత్రీ గౌరీ దేవి నోములకి మా అమ్మతో నేను వెళ్తే తనూ వాళ్ళమ్మతో వచ్చేది. రోజుకో వంట చేసేవారు - అప్పాలనీ, కలగాయ పులుసనీ. పూర్వకాలంలో వ్రతాలు చేయించి వంటలు నేర్పించే  వాళ్ళనుకుంటాను. నేను అందుకనే వ్రతాలు చేసుకున్న వాళ్ళనే పెళ్ళి చేసుకోవాలని తీర్మానించుకున్నాను. ఎంచక్కా అప్పాలు, బూరెలు, గారెలు, పరమాణ్ణం తింటూ ఉండచ్చు. ఏమో లీల నాకెందుకో చాలా నచ్చింది. పట్టు పరికిణీ కట్టుకుని పసుపు కాళ్ళతో పేరంటానికి వచ్చేది. ఆ కాలంలో పిల్లలందరం పేరంటానికి అమ్మలతో వెళ్ళేవాళ్ళం. ఒక వారం రోజులు "ఏమన్నా" తినటానికి చలిమిడి, శనగ గుగ్గిళ్ళు, కొబ్బరి ఉండేవి. ఇన్ని పప్పులు తిన్నా మేమెవ్వరం లావు ఎక్కలేదు! బహుశ ఎక్కువ తిరిగే వాళ్ళమేమో అప్పుడు.ఏదో రూపేణా సినిమాలకనో, వేచ్చాలకనో రోజూ తెనాలి నడిచి వెళ్ళి వస్తూ ఉండే వాళ్ళం.

ఏమిటో ఆరోజులు తలుచుకుంటే గమ్మత్తుగా ఉంటుంది. ఆ రోజు లీలా వాళ్ళతో వన భోజనానికి వెళ్దామని పదిగంటలకే గ్లాసు పుచ్చుకుని బయట నుంచున్నాను. "అప్పుడే బయల్దేరా వేరా! ఇప్పుడే గాడి పొయ్యి తీస్తున్నారు" అని బాబాయి అంటే సిగ్గుపడి లోపలికి వెళ్ళాను. నిమిషానికి ఒకసారి ఇంటిలోంచి తొంగి చూస్తూ లీలా వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో వెళ్ళి లీల ఎదురుకుండా కూర్చున్నాను. ఆ జాకెట్టుతో ఆపరికిణీతో ఎంతో హుందాగా ఉంది! సుతి మెత్తని వేళ్ళతో ముద్దలు కలుపుకుని అలా నోట్లో పెట్టుకుంటూ ఉంటే, అబ్బా నాక్కూడా ఆ చేతులతో ముద్దలు  పెట్టించుకోవాలని అనిపించింది. గాడి పొయ్యి మీద చేసిన గుమ్మడికాయ పులుసూ, వంకాయ కూరా ఎంత బాగున్నాయో! సాయంత్రం పూట స్నానం చేసి చాకలాడు తెచ్చిన బట్టలు వేసుకుని జామ చెట్టెక్కి కూర్చునే వాడిని. కింద లీల ఆడ పిల్లకాయలతో తొక్కుడుబిళ్ళ ఆడుతూ ఉండేది. నన్ను జామకాయ కోసి ఇమ్మని అడుగుతుందని అనుకునేవాణ్ణి.  ఎప్పుడూ అడగలేదు. 

మనుషులమీద మమకారం పుట్టటానికి వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం ఉండక్కరలేదేమో! ఒకసారి మా ఇంట్లో వాళ్ళందరం "స్వర్గసీమ" సినిమా చూడటానికి తెనాలి వెళ్ళాము. ఎల్లాగూ అందరం ఇక్కడికి వచ్చాము కదా అని చెప్పి దగ్గరలో ఫోటో స్టూడియో ఉంటే దానిలోకి వెళ్ళాము. ఫోటో తీసే వాడు నల్ల ముసుగులోంచి మమ్మల్ని చూస్తూ మమ్మల్ని సరీగ్గా కూర్చోపెట్టాడు. నాకు బాగా గుర్తు. నేను సైడు ఫోజులో బాగుంటానని చెప్పి, నన్ను చివర నుంచోపెట్టి సైడు ఫోజు ఇప్పించాడు. ఎంతో బాగున్నాను ఆ ఫోటోలో. అందుకని లీల చూస్తుందని లీల వాళ్ళింటి ముందర ఏదో పని కలిపించుకుని సైడు ఫోజులో నడిచే వాణ్ణి. ఇంత చేసినా లీల నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. 

దసరా అప్పుడు పంతుళ్ళతో పప్పు బెల్లాలకి లీలా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు "పంతులికి ఇవ్వాలి ఐదు వరహాలు పిల్లలకి పెట్టాలి పప్పు బెల్లాలు" అని గట్టిగా రాగ యుక్తంగా కూడా పాడాను. చివరికి వేసంకాలం శలవలకి మా తాతయ్యగారి వూరు వెళ్ళబోయే ముందర లీలా వాళ్ళింటికి పేరంటానికి వెళ్ళాము. లీలని కూర్చోపెట్టి పేరంటం చేసి చిమ్మిరి ఉండలు పెట్టారు. భలే బాగున్నాయి చిమ్మిరి ఉండలు.

ప్రతీ వేసంగి శలవలకీ మా తాతయ్యగారి ఊరు నెప్పల్లి వెళ్తాము. చెరుకు బళ్ళని ఉయ్యూరు పంచదార ఫాక్టరీకి తీసుకుపోతూ, కరణంగారూ చెరుకు, ఫాక్టరీకి తీసుకు వెళ్తున్నామని నాలుగు గడలు ఇంటిముందు పడేసేవాళ్ళు. వేసవిలో తాటి ముంజలు ఎన్ని తినే వాళ్ళమో. మా తాతయ్యతో వెళ్లి ఎంతమందికో అక్షరాభ్యాసం చేశాము. వెళ్ళినప్పుడల్లా పలకా బలపము వచ్చేది. మా తాతయ్యతో మొదట అక్షరాలు దిద్దిన వాళ్ళు ఇప్పుడు ఏమి చేస్తున్నారో !

శలవలయిన తరువాత కఠారం వచ్చాము. మళ్ళా మామూలు పనులు మొదలు. మా పెద్దనాన్నగారు స్కూల్ హెడ్మాస్టారు. మేము పొద్దున్నేలేచి చద్దన్నం తిని స్కూల్ తెరిచి ఫస్టు బెల్ కొట్టేవాళ్ళం. సాయంత్రం చివరి పిరియడ్లో స్కూల్ వెనుక అందరిచేతా ఎక్కాలు వంత పాడించే వాళ్ళం. అందుకనే ఎక్కాలు ఇంకా గుర్తున్నాయి. శలవల్లో బాగమ్మ నాకోసం తేగలు దాచిపెట్టింది - శీనయ్య కొడుకుని కదా నేను. మా నాన్న బాగమ్మ కొడుకూ మంచి స్నేహితులట. పాపం బాగమ్మ కొడుకు మునసబు చచ్చిపోయాడు ! నేనంటే బాగామ్మకు చాలా ఇష్టం. పాతిపెట్టిన తాటి టెంకలు తీసి పగలకొట్టి పెట్టేది. ముంతలో అన్నం తీసి వెల్లుల్లి కారం నెయ్యి కలిపి తినమని ఇచ్చేది. ఎంతబాగుందేదో వెన్నపూస వేసుకు తింటూంటే. మీగడపెరుగు. అబ్బా! ఎందుకో ఎవ్వరికీ చెప్పవద్దనేది. ఈ హడావుడిలో లీల కనపడటల్లేదు అనే సంగతి పట్టించుకోలేదు. ఏదో శలవలకి ఎక్కడికన్నా వెళ్ళినదేమో అని ఊరుకున్నాను. తరువాత చాలా రోజులకి కనపడకపోతే మా అమ్మ నడిగాను. వాళ్ళు తెనాలి వెళ్ళిపోయారుట.

మళ్ళా లీలని చూడలేదు. మాకు ఉద్యోగరీత్యా ఊళ్లుమారటం, దేశాలు తిరగటం తోటి రోజులూ సంవత్సరాలూ గడిచిపోయాయి. రిటైరు అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి. కొన్ని రోజులు అమ్మతో ఉందామని ఇంటికి వెళ్లాను. పొద్దున్నే లేచి పాల పేకెట్లు తీసుకురావటం ఆ తరవాత మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకురావటం. పేపరు చదివి స్నానం చేసి భోజనం చేయటం. మళ్ళా పేపరు రెండోసారి చదవటం, నిద్రపోయి నాలుగు గంటలకు లేవటం. కాఫీ తాగి షికారు కెళ్ళి సాయంత్రం ఇంటికి చేరటం. పిచ్చా పాటీ తరువాత నిద్ర. ఇదీ వరస రోజూ. 

ఆ రోజు బజారునుండి వచ్చి వరండాలో ఈజీ చైర్ లో కూర్చున్నాను. హాలు లోనుండి మాటలు వినపడుతున్నాయి. నేను వచ్చిన శబ్దం విని అమ్మ "మురహరిరావు గారి అమ్మాయి లీల నన్ను చూడటానికి వచ్చిందిరా" అన్నది. లేచి కిటికీలోనుంచి చూశాను. పెద్ద ఎక్కువగా మారలేదు. అదే కోల ముఖం. అదే వర్చస్సు. 30 ఏళ్ళ సంసారిక బడలికలు మోహంలో కొద్దిగా కనపడుతున్నాయి. తలమీద తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలతో దోబూచులాడు తున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళయి ఎవళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారల్లె ఉంది, ఎక్కడలేని తెరిపి మొహంలో కనపడుతోంది. ఒక్కసారి మా కళ్ళు ఏవో మాట్లాడుకున్నాయి. తృప్తిగా లేచి కుర్చీలో కూర్చున్నాను. 

నాకు లీలతో ఏదో మాట్లాడాలని ఉంది. కానీ ఏమి మాట్లాడాలి ? ఎంతో కావాలనుకున్నది హఠాత్తుగా ఎదురు పడితే మాట్లాడటానికి మాటలు రావు. కాఫీ టిఫ్ఫెన్లు అయిన తరువాత ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. కఠారం నుండి వెళ్ళిన తరువాత ఏమి జరిగిందో అంతా విన్నాను. తన పిల్లలు ఏం చేస్తున్నారో విన్నాను. రోజూ తనేం చేస్తోంది చెప్పింది. నా గురించి కూడా అడిగింది. ఇంక మాటలు అయిపోయినట్లున్నాయల్లె ఉంది " వెళ్ళొస్తా నండీ మామ్మ గారూ" అనే మాటలు వినపడ్డాయి.. 

నాకు చెమటలు పోస్తున్నాయి. ఇంకొక్క క్షణంలో లీల నాముందు నుంచి వెళ్తుంది. క్రికెట్ కోర్టులా ఓవల్ షేప్ లో ఉన్న నా బట్టతల, దాద్దామన్నా వీలు లేకుండా బయటకు వస్తున్న బొజ్జ. నెరసిన మీసాలతో దాగని వయసు. నేను ఎదుట పడలేను. లీల గుమ్మం దాటి బయటకు వస్తోంది. హఠాత్తుగా నాకు చిన్నప్పుడు ఫోటోగ్రాఫర్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.  వెంటనే సైడ్ ఫోజు పెట్టేశాను, లీల కనుమరుగయ్యేదాకా. మళ్ళా ఎప్పుడు చూస్తానో లీలని.

                                          ---------

ఈ నా చిన్న కథ మార్చ్ 1992 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు (చేతి వ్రాతతో). నా కెందుకో ఈ వేలెంటైన్ డే కి తెలుగులో టైపు చేసి దీన్ని పోస్ట్ చెయ్యాలనిపించింది. 

Monday, February 6, 2012

80 ఓ బుల్లి కథ 68 --- నా కంప్యూటర్ బాగయ్యిందోచ్

రచన: లక్కరాజు శివ రామకృష్ణా రావు.

జీవితంలో సుఖానికి అలవాటుపడ్డ ప్రాణానికి అమాంతంగా కష్టాలు వస్తే జీవితం తారుమారు అవుతుంది. రెండువారాల క్రిందట నా డస్క్ టాప్ కంప్యుటర్ పని చెయ్యటం మానేసింది. కొంచెముసేపు పనిచేసి దానంతట అదే ఆగిపోతుంది, ఎందువల్ల పోతున్నానో చెప్పకుండా పోతోంది. రిపైర్ వాడి దగ్గరకు తీసుకు వెళ్ళుదామంటే,  ఇక్కడ అమెరికాలో రిపైర్ వాడు తీసుకునే డబ్బులతో రెండు కొత్త కంప్యూటర్లు కొనుక్కోవచ్చు.

రిటైరు అయ్యి ఒక పద్ధతికి అలవాటయిన జీవికి పద్ధతులు మార్చుకోవటం చాలా కష్టం. ఏమి చెయ్యాలో తోచక కాలుగాలిన పిల్లిలా పైకీ క్రిందకీ తిరుగుతున్నాను. రోజూ కంప్యూటరే లోకంగా చేసుకుని భోజనానికీ కాఫీకీ పిలుపు వస్తే కానీ క్రిందకు వెళ్ళే వాడిని కాను. ఇప్పుడు ఏమి చెయ్యాలో తోచటల్లేదు.

నేను ఊర్కేనే కూర్చున్నానని ఇంట్లో తెలిస్తే నా పని బేజారు అవుతుంది. ఊర్కేనే ఉన్నారుగా నేను పూజ చేసుకుంటున్నాను కొచెం రైసు కుక్కర్ లో అన్నం పడెయ్య కూడదూ. ఫోనులు వస్తే తీసుకోండి. కూర మాడుతోంది కొంచెం స్టవ్ తగ్గించండి. పోనీ హెల్ప్ చేద్దామని చేస్తే, ఎక్కడలేని కోరికలూ పుట్టుకు వస్తాయి. మళ్ళా ఆ కోరికలు కూడా తీర్చాల్సి వస్తుంది. సాయంత్రం ఉల్లిపాయతో వంకాయ కూర చేస్తే బాగుంటుంది (మీరు). రేపు పోద్దునకి సేమ్యా ఉప్మా బాగుంటుంది. మీరు ఆ ఉప్మా చాలా బాగా చేస్తారు. ఇలా హేల్పెర్ గ మొదలుపెట్టినది చివరికి నా పని కేరాఫ్ వంటిల్లు లాగా తయారవుతుంది.

మొన్న ఎదో పాపం కష్ట పడుతోంది కదా అని ఒక వారం కూరలు తరగటానికి వప్పుకున్నాను. ఉల్లిపాయలు చిట్ట  చివ్వరకి తరగండి లేకపోతే ఇల్లంతా వాసన వస్తుంది. కాలీఫ్లవరు సన్నగా తరగవోకండి, చేత్తో మొగ్గలుగా విరవండి. కాబేజీ ఇదుగో ఈ విధంగా సన్నగా తరగాలి.  బ్రోకలి మరీ పెద్ద ముక్కలు చేశారు, పెసరపప్పు వేసి చేస్తాను సరీగ్గా కలవదు. బ్రస్సెల్ స్ప్రౌట్స్ కాబేజీ లాగా తరగండి. కంది పప్పు కలిపి కూర చేస్తాను. కుకుంబర్ చెక్కు తీయండి లేకపోతే పులుసులోకి బాగుండదు (ఆవిడకి). దొండకాయలు నిలువుగా తరగండి చక్రాలుగా కాదు. ఆ బానిస బ్రతుకు తలుచుకుంటే వళ్ళు గగుర్పాటు చెందుతుంది. "చెవిలో ఫోను పెట్టుకుని వంట చెయ్య వోకు. ఉప్పూ కారాలు సరీగ్గా పడవు." అని అరవాలనిపిస్తుంది. కానీ నోరు పెగలదు. ఇంక నేను దీనిని గురించి తలుచుకోలేను. గది తలుపులు వేసుకు కూర్చున్నాను. కానీ ఎంతసేపని కూర్చుంటాను? ఎప్పుడో అప్పుడు తెలిసిపోతుంది. 

నాకు కావలసింది వంటగదా, కొత్త కంప్యుటరా అనే సమస్య మీద చాలా ఆలోచించాను. వంటగదికి వెళ్ళటం ఇష్టం లేదు. కొత్త కంప్యుటర్ అయితే గవర్నమెంటు వాళ్ళు నెల నెలా ఇచ్చే భత్యంలో కొంత భాగం ఎగిరిపోతుంది. అన్ని యప్రువల్స్ తీసుకుని బడ్జటులో పెట్టి కంప్యుటర్ కొనుక్కునే సరికి మళ్ళా క్రిస్మస్ వస్తుంది. అసలుకే మోసం రావచ్చు, అసలు అంత అవసరమా అని  రిక్వస్టు డినై  చెయ్యవచ్చు కూడా. ( అదేమీ తిండి పెట్టదు, రోజంతా దాని ఎదురుకుండా కూర్చుంటారు, అనారోగ్యం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కరెంటు వేస్టు, డబ్బుల వేస్టు.) ఏదో మార్గం ఆలోచించాలి.

నేను దీన్ని బాగు చెయ్యలేనా ? అని నా అంతరాత్మ ని ఒక ప్రశ్న వేశాను. సమాధానం వచ్చింది. వరల్డ్ వార్-2 లో మిగిలిపోయిన మాగ్నెట్ తో స్పెక్త్రోమేటర్  తయారు చేసి డాక్టరేట్లు తయ్యారు చేసిన పరిశోధన శాల నుండి వచ్చావు నువ్వు. ఈ ముసలి కంప్యుటర్ ని వదలలేక సంవత్సరాల బట్టీ దానితో ఏదో విధంగా సాగిస్తూనే ఉన్నావు. ఇప్పటికే రెండు మూడు సార్లు హార్డ్ డిస్క్ ని ఫార్మాట్ చేశావు. దాని మెమరీ(RAM) ని కూడా పెంచావు. ధైర్యే సాహసే లక్ష్మి. ఆలోచించు. వెలుగు చూస్తావు. అని అంతర్వాణి  చెప్పింది. 

నాకు ఇంకా ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఆరోజు జరిగిన సంగతులన్నీ పరిశీలించటం మొదలు పెట్టాను. పొద్దున్నే కాఫీ తాగి పైకొచ్చి ఖుషీగా కంప్యుటర్లో ఈనాడు వార్తలు చూస్తున్నాను. మధ్యలో దానంతట అదే ఆగి పోయింది. ఏమిటా ఇది అని మళ్ళా స్టార్ట్ చేశాను. ఒక నిమిషం తర్వాత మళ్ళా అల్లాగే అయ్యింది. రెండు మూడు సార్లు అల్లాగే చేశాను. రాను రాను విండోస్ వస్తుంటేనే ఆగి పోవటం మొదలయ్యింది. ఆలోచిస్తున్నాను. నేను శాపాలు తాపాలూ నమ్ముతాను. "For every action there is an equal and opposite reaction" అన్న దాన్ని నేను గట్టిగా నమ్ముతాను. (పెళ్ళి చేసుకున్న తరువాత చాలా సూత్రాలు తెలుస్తాయి, నమ్మకాలు పెరుగుతాయి.)

దిష్టి తగలటం, శాపనార్ధాలు పెట్టటం రియాక్షనుల క్రిందకు వస్తాయి కాబట్టి ఇవ్వాళ ఎప్పుడో ఎక్కడో ఎవరికో నేను వాళ్ళ దృష్టిలో తప్పుగా గ్రహించబడిన యాక్షను చేసి  ఉండాలి. ఏమి చేశానబ్బా ఇవ్వాళ. ఎవర్ని నొప్పించాను? అనే దృష్టి తో ఆలోచించటం మొదలెట్టాను.

ఏమితప్పు చేశాను? ఎవరు నన్ను పొద్దున్నే శపించారు? ఇంట్లో ఉన్నది ఇద్దరమే కాబట్టి దాన్ని కనిపెట్టటం చాలా తేలిక. ఆలోచిస్తే పొద్దున మా ఆవిడ కూరలు తరిగి పెట్టమని అరుస్తూ ఉన్నా, వినపడనట్లు నటిస్తూ కాఫీ తాగి పైకి వచ్చేశాను. అదే అయ్యుంటుంది.  ఆడవాళ్ళ శాపాలు చాలా గట్టివి. వెంటనే నవ్వు ముఖంతో కిందకి వెళ్లి కూరలు తరగనా అన్నాను. మౌనంగా పోపులో వేగుతున్న వంకాయకూర వేపు చూపటం జరిగింది. ఆ చూపులోనే తేలిపోయింది సమాధానం. శాప విముక్తికి ఏమి చెయ్యాలో అర్ధం కావటల్లేదు. కొంతన్నా ఫలితం వస్తుందని  కూర కలపటానికి ప్రయత్నించాను. భీకరమైన మొహం చూసి భయపడ్డాను. ఐ యాం డూమ్డ్. 

ఏం చెయ్యాలి?  కంప్యూటర్ బాగు చెయ్యటం మీద నేను ఇదివరకు వ్రాసిన పోస్ట్ లు గుర్తుకి వచ్చాయి. అన్ని చిట్కాలు   ట్రై చేసాను. ఒక్కటి కూడా ఉపయోగపడలేదు. విండోస్ వస్తుంటే safe mode లోకి వెళ్ళ లేక పోయాను. ఆపరేటింగ్ సిస్టం లేకపోతే  Restore Point కి వెళ్ళటం కుదరదు. విండోస్ కరప్ట్ అయ్యినదనుకుని బేకప్ డిస్క్ తో ప్రయత్నించాను. అసలు ఆపరేటింగ్ సిస్టమే ( విండోస్ xp ) లోడ్ అవటల్లేదు. నా దగ్గర DOS ఫ్లాపీ ఉంటె దానితో ప్రయత్నించాను Format C: చేద్దామని. లోడ్ అవలేదు. అసలు మాటా పలుకు లేకుండా జారుకుంటోంది.

పెళ్ళాల శాపాలు ఇంత గట్టిగా ఉంటాయని తెలిస్తే పొద్దున్నేకూర తరిగి ఇచ్చేసే వాడిని. తప్పొప్పుకుంటే శాపాలు పోతయ్యని ఎక్కడో చదివినట్టు గుర్తు. ఏదో విధంగా ఈ సమస్య నుండి బయటపడితే ఇకనుండీ పొద్దున్నే పెళ్ళాం చెప్పిన పనులు తప్పకుండా చేస్తానని తలుపు గడియపెట్టి లెంపలేసుకున్నాను. నాకు గిల్టీ కాన్క్షన్సు పోయింది. నా మనస్సు కుదుట పడింది. గమ్మత్తుగా కారు మేఘాలన్నీ తొలగి పోయాయి. జయం మనదే అనే ఫీలింగ్ వచ్చింది. ఇంక ధైర్యంతో ఆలోచించటం మొదలు పెట్టాను.

అసలు విండోస్ రాకుండానే  కంప్యూటర్ ఆఫ్ అవుతోంది. అదికూడా ఒక  వేరు వేరు సమయములలో పోతోంది.  ఒకసారి వెంటనే పోతుంది. ఒకసారి కొంచెం సేపు తరువాత. ఆన్  చెయ్యగానే కంప్యుటర్ చేసే మొట్ట మొదటి పని ఏమిటి? జాగర్తగా ఆలోచిస్తున్నాను.

కంప్యుటర్ కి ఆపరేటింగ్ సిస్టం ( విండోస్ ) చాలా ముఖ్యం. కంప్యుటర్ లో ఉన్న అన్ని భాగాల్తోటీ కలిసికట్టుగా పని చేయించేది ఇదే. అది మొట్టమొదట హార్డ్ డిస్క్ లోనుండి కంప్యుటర్ RAM లోకి లోడ్ అవుతుంది. RAM లో ఉంటే పనులు వేగంగా జరుగుతాయి కనుక. ఇప్పుడు ఆపని జరగటల్లేదు. అందుకని ప్రాబ్లం ఈ మూడింటిలోనే ఉండి ఉండాలి. హార్డ్ డిస్క్, విండోస్, RAM .

బాకప్ డిస్క్ లో నుండి కొత్త ఆపరేటింగ్ సిస్టం పెడదామంటే తీసుకోవటల్లేదు. బహుశా  RAM రిజెక్ట్ చేస్తోందేమో. కంప్యుటర్ లోకి వెళ్ళేవి అన్నీ RAM ద్వారా నే వెళ్తాయి. RAM సరి లేక పోతే కంప్యుటర్లో ఏ పనీ జరగదు. అందుకని RAM పాడయి ఉంటుందని  తేల్చుకున్నాను. ఇది కాకపోతే సెకండ్ గెస్, లాంగ్ షాట్, హార్డ్ డిస్క్ పాడవ్వచ్చు. నాలుగేళ్ల క్రిందట RAM expand చేసిన సంగతి గుర్తుకు వచ్చింది. అది పాడయ్యిందేమో!! 

ఎటాక్ ప్లాన్ తయ్యారయ్యింది. కంప్యుటర్ ఓపెన్ చెయ్యటం. కొత్తగా పెట్టిన RAM ని బయటికి తీసి, కంప్యుటర్ తో వచ్చిన RAM తో కంప్యుటర్ ని స్టార్ట్ చెయ్యటం. కంప్యుటర్ పనిచేస్తే RAM ప్రాబ్లం లేక పోతే హార్డ్ డిస్క్ ప్రాబ్లం.

స్క్రూ డ్రయివర్లు తెచ్చుకుని కూర్చున్నాను. స్క్రూలు ఎక్కడా కనపడలేదు. నేను కంప్యుటర్ ఓపెన్ చేసిన కాలంలో స్క్రూ డ్రయివర్ తో ఓపెన్ చేసేవాణ్ణి. ఎన్ని తెలివితేటలు ఉన్నా మెకానికల్ బుర్ర లేకపోతే వృధా. సింకులో  నీళ్ళు పోకపోవటం దగ్గరనుండీ అరమరాల కిట్లు కొని బిగించటం వరకూ మా ఆవిడే చూసుకుంటుంది. ప్రస్తుతం మాటలు లేవు. అడగటానికి కొంచెం సిగ్గూ భయమూ రెండూ అడ్డుకున్నాయి. దానికితోడు ఆవిడకి  కంప్యూటర్ బాగుకి నాకు దోహదం చెయ్యాల్సిన అవుసరం లేదు. ఆవిడ లాప్ టాప్ ఆవిడకుంది. దాన్ని నేను ముట్టుకోనని ఆవిడకి బాగా తెలుసు. వేలుతో కంప్యుటర్ ఆడించటం నాకు చేతకాదు. 

ఆపద్భాన్ధవా  ఏమి చెయ్యాలి? మనము మంచిపనులు చేస్తూ ఉంటె దేముడు ఏదో రూపేణా తప్పకుండా ప్రత్యక్ష మవుతాడు. హటాత్తుగా ఫోన్ మోగింది. మా అబ్బాయి న్యూయార్క్ నుండి వీకెండ్ కి వస్తున్నాడు. RAM expand చేసింది కూడా వాడే. వాడు సర్ప్రైజ్ కాకుండా వచ్చిన తర్వాత ఏమి చేసి పెట్టాలో వెంటనే చెప్పేశాను. నాలుగు రోజులు కంప్యూటర్ లేక పోతే ఫరవా లేదు ఏదోవిధంగా బిజీగా ఉన్నట్లు నటించగలను. వంగిపోతూ ఎగస్పార్టీకి సాక్షాత్ నమస్కారం చెయ్యవలసిన అవసరం లేదు.

మర్నాడు వీకెండ్ కి,  రెడ్ ఐ ఫ్లయిట్ లో న్యుయోర్క్ నుండి మా వాడు దిగాడు. మొదట పరిష్కరించాల్సిన సమస్య నాదే.  అయిదు నిమిషాల్లో మా అబ్బాయి కంప్యూటర్ ఓపెన్ చేసి RAM బయటికి తీసాడు. డాక్టరేట్ చేసిన వాళ్ళు పనులు చేస్తుంటే చూడటానికి ముచ్చటగా ఉంటుంది. డస్క్ టాప్ కంప్యుటర్ చాస్సిస్ మీద ఒక లీవర్ ఉంటుంది. అది నొక్కితే పై ప్లేటు వచ్చేస్తుంది. విషయం తెలిస్తే ఎంత సులువు. మీరు కంప్యుటర్ ఓపెన్ చేస్తే వాక్యుం క్లీనర్ పక్కన పెట్టుకోండి. బోలెడంత బూజు, దుమ్మూ ధూళి ఉంటుంది తీసెయ్యండి.  

యురేకా! కంప్యుటర్, కంప్యుటర్ తో వచ్చిన ఒరిజినల్  RAM తో పని చేస్తోంది. బయట గట్టిగా స్నో పడుతోంది. ఆరోజు బయటకు వెళ్ళటానికి కుదరదు. ఇది చికాగో వింటర్. మర్నాడు CompUSA కంప్యుటర్ స్టోర్ కి వెళ్లి ఒక గిగ్ RAM కొనుక్కొచ్చి పెట్టాడు (ఈ కంప్యుటర్ అంతకన్నా తీసుకోదు.). ఖర్చు ముప్పైరెండు  డాలర్లు. రెండువారాలనుండీ టెస్ట్ చేస్తున్నాను. కంప్యుటర్ బాగానే పని చేస్తోంది.

కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం తయారు అయ్యింది. వ్యాక్యుం చేస్తుంటే కంప్యుటర్ లో నుండి రెండు క్లిప్పులు  ఊడి పడ్దాయి. అవి లేకుండానే కంప్యుటర్ నడుస్తోంది కాబట్టి అవి ముఖ్యమయినవి కాక పోవచ్చు అనుకున్నాము. ఇంటర్నెట్ లో వెతికితే అవి హీట్ సింక్ ని అణచి పెట్టి ఉంచే క్లిప్పులని తేలింది. కంప్యుటర్ నిలబెడితే హీట్ సింక్ క్రిందపడుతున్దేమోనని కంప్యుటర్ ని పడుకో బెట్టి పని గడుపు కుంటున్నాను.  

నుంచుని చేస్తే నాకేటి. పడుకుని చేస్తే నాకేటి. పనిచేస్తుంటే నా కిష్టం. 

                                              ---------

కంప్యుటర్ మీద నా ఇతర పోస్టులు:

21. ఓ బుల్లి కథ 9 -- కంప్యూటర్ లో ఏముంటాయి
http://mytelugurachana.blogspot.com/2010/05/21-9.html

కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తే
22. ఓ బుల్లి కథ 10 -- కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తే
http://mytelugurachana.blogspot.com/2010/05/22-10.html

కంప్యూటర్ మొరాయిస్తే
23. ఓ బుల్లి కథ 11 -- కంప్యూటర్ మొరాయిస్తే --

40 ఓ బుల్లి కథ 28 -- కంప్యూటర్ కు గ్రహణం పట్టిన రోజు --
http://mytelugurachana.blogspot.com/2010/12/40-28.html

Monday, January 9, 2012

79 ఓ బుల్లి కథ 67 --- మీ చర్మ మృదుత్వానికి జాగ్రత్తలు

ముందుమాట: కొందరి చర్మం చూస్తుంటే ముచ్చటగా మృదువుగా వెన్నపూస లాగా ఉంటుంది. కొందరిది ఎంత ప్రయత్నించిన ఆ కోవకి రాదు. ఎందుకని ? దాన్ని గురించి మనమేమన్నా చెయ్యగలమా ? దాన్నిగురించి   తెలుసుకునేదే ఈ పోస్ట్.

జీవితంలో ఎండల్లో గాలుల్లో మనము తిరిగిన తిరుగుళ్ళకి, మన వయసు పెరిగినకొద్దీ, మన చర్మము దాసోహం అయి చర్మ వ్యాధులు వచ్చుటకు అవకాశం ఉంది. వాటిని ఏవిధంగా అడ్డుకోవచ్చో తెలపటమే ఈ పోస్ట్ ఉద్దేశం.ఈ చర్మ వ్యాధులు రాకుండా ఉండాలంటే మనము పాటించ వలసిన సూత్రాలు మూడే మూడు. ఎక్కువగా ఎండలో తిరుగ కుండా ఉండటం, పొగ త్రాగ కుండా ఉండటం, మంచి ఆ హారము తినటం.

చర్మ వ్యాధులకు కారణము: చర్మ వ్యాధులు రావటానికి కారణం, సూర్యకిరణాలు మన వాతావరణము లోని ప్రాణ వాయువు తో కలయిక మూలంగా మన చర్మము మీద నిలకడ లేని (unstable) రసాయనిక పదార్దములు ఏర్పడుటయే కారణము. వీటిని free radicals అంటారు. కాలుష్యమయిన వాతావరణం లో ఉంటె ఇంకా ఈ సమస్య ఎక్కువ అవటానికి వీలుంది.

చర్మ వ్యాధులు రాకుండా చెయ్యగలమా ?: కొన్ని విటమిన్స్, Antioxidants వాడటం మూలంగా మన చర్మమును కాపాడు కొనవచ్చు. వీటిలో క్రీముల ద్వారా చర్మము పైన రాసేవి కొన్ని, ఆహారము ద్వారా పుచ్చుకొనుట వలన రక్తముతో కలిసి చర్మము క్రింద భాగము నుండి పని చేసేవి కొన్ని ఉన్నాయి.

ముఖ్యంగా మనకి ఉపయోగపడేవి: Vitamin B, Vitamin C, Vitamin E, Selenium and Omega3 fatty acids. ఇవి చెడును సరిదిద్ది మామూలుగా మనకున్న రోగ నిరోధక శక్తిని పెంపోందిస్తాయి అని అన్నారు ( Karen E. Burke, MD, PhD, of the Mount Sinai School of Medicine's department of dermatology.) ఈ పదార్దములు మనము తరచుగా చర్మము పైన వాడే క్రీము లన్నిటిలోనూ ఉంటాయి కానీ వాటి గాఢత (concentration) తక్కువగా ఉంటుంది.

వీటిని కూడా వాడుతారు : CoQ10, Alpha-lipoic Acid, Retinoic Acid, Flavonoids (Green Tea, Chocolate).

వీటిని మనము తినే ఆహారము ద్వారా తీసుకొన వచ్చును: 
Selenium -- Brazil nuts, turkey, cod
Vitamin B-2 -- Milk, enriched grain products, eggs
Vitamin B-6 -- Chicken, fish, nuts
Vitamin B-12 -- Clams, liver, trout, fortified cereals
Vitamin C -- Citrus fruits, red peppers, broccoli
Vitamin E -- Sunflower oil, whole grains, nuts
Omega-3s – Salmon and other cold-water fish, ground flaxseeds, walnuts


చివరిమాట: సమీకృత ఆహారము తినుట ఆరోగ్యమునకు చాలా మంచిది. మంచి సమైక్య ఆహారమునకు క్రింది పోస్టు చూడండి:

ఈ పోస్ట్ నా ఈ క్రింది పోస్టుకి అనుబంధము: 
78 ఓ బుల్లి కథ 66 --- మనకు కావాల్సిన ముఖ్యమయిన విటమిన్స్, సప్లిమెన్ట్స్
http://mytelugurachana.blogspot.com/2011/12/78-66.html


ఈ పోస్ట్ కి మాతృక:
How much can vitamins and supplements help your skin?
WebMD Feature
By Stephanie Watson
Reviewed By David Kiefer, MD
http://www.webmd.com/vitamins-and-supplements/lifestyle-guide-11/beauty-skin-care-vitamins-antioxidants?page=1