ఫిబ్రవరి లో మూడవ శనివారం పొద్దున్నేచికాగో మిడ్వే ఏర్పోర్ట్ లో సౌత్వెస్ట్ ఫ్లైట్ ఎక్కి న్యూ జెర్సీ నెవార్క్ ఏర్పోర్ట్ కి వచ్చాము. అక్కటి నుండి Zipcar లో సొరంగం ద్వారా న్యూయార్క్ చేరుకున్నాము. న్యూయార్క్ ద్వీపం లాంటిది, చుట్టూతా నీళ్ళు. రోడ్డు మీద పక్క ఊళ్ళనుండి అక్కడకి రావాలంటే రెండే మార్గాలు, నీళ్ళ క్రింద నుండి సొరంగం ద్వారా, లేక నీళ్ళ పైన బ్రిడ్జి ద్వారా. అమెరికాలో ఇది మిడ్ వింటర్. చలి, స్నో ఇష్టమయితే తప్ప నా లాంటి వాళ్ళు ఈ సమయంలో బయటికి కదలరు. ఈ సంవత్సరం అదృష్టవశాత్తూ చలి ఎక్కువగా లేదు కానీ వేసవిలో కనుల పండువగా ఉండే ప్రకృతి బోసిపోయి ఉంది.
న్యూయార్క్ నగరం గురించి చెప్పేటప్పుడు "ఎప్పుడూ నిద్రపోని పట్టణం" అంటారు. ఈ నగరం న్యూయార్క్ రాష్ట్రం లో పెద్ద పట్టణం. అంతే కాదు అమెరికాలో పెద్ద పట్టణం. బహుశా ప్రపంచంలోకెల్లా పెద్ద పట్టణం అవ్వచ్చు. "The city never sleeps" అనబడే ఈ పట్టణం ఇంతవరకూ చూడటం తటస్థించలేదు. అబ్బాయి కోడలూ కొత్త కాపరం న్యూయార్క్ లో పెట్టటం తోటి వెళ్ళే అవకాశం కలిగింది.
న్యూయార్క్ నేపధ్యంగా చాలా మువీలు తీశారు. మార్లన్ బ్రాండో "God Father", మెగ్ రాయన్ మూవీ "When Harry Met Sally" మొదలయినవి.మా యింటికి వెనక వైపు రెండు బ్లాకుల్లో ఇంకో మెగ్ రాయన్ మూవీ "You Got Mail" తీసిన రెస్టరెంట్ ఉంది. నేను వెళ్ళలేదు మా వాళ్ళందరూ వెళ్లి చూసి వచ్చారు.
న్యూయార్క్ నగరం లో మేము ఉన్న ప్రదేశాన్ని మాన్హా టాన్ అంటారు. కొలంబస్ డ్రైవ్ లో ఒక పెద్ద Brown Stone బిల్డింగ్ లో (ఇటుకలతో కట్టిన మేడలో) one bedroom apartment. ఇక్కడ ఉన్న బిల్డింగులన్నీ దాదాపు వంద ఏళ్ళ క్రింద కట్టినవి. సామాన్యంగా లిఫ్టులు ఉండవు. మేమున్న ఐదు అంతస్తుల మేడ లో మా అపార్ట్మెంట్ ఉన్నరెండవ అంతస్తు కి వెళ్ళటం కూడా కొంచెం కష్టమే, మెట్లు చాలా ఎత్తుగా ఏటవాలుగా ఉన్నాయి.
సామాన్యంగా ఇక్కడ రెండు వీధుల మధ్య ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది. దీన్ని ఒక బ్లాక్ అంటారు. ఒక బిల్డింగ్ ఒక బ్లాక్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ లో షాపులు ఉంటాయి. మా బిల్డింగ్ కి క్రింద ఒక పిజ్జా షాపు , ఒక మెక్సికన్ రెస్టారెంట్, ఒక చెప్పులు బాగు చేసే షాపు, ఒక బట్టలు ఉతికే షాపు, ఒక పెద్ద గ్రోసరీ స్టోరు ఉన్నాయి. ఇంటి ఎదురుకుండా ఒక డూనట్ (తీపి గారెలు) షాపు, ఒక ఖరీదు అయిన ఆభరణాలు అమ్మే షాపు, ఒక క్రేప్స్ ( తీపి దోశెలు) రెస్టారెంట్, ఒక చైనీస్ రెస్టారెంట్ ఉన్నాయి. పక్క బ్లాకులో పేవ్ మెంట్ మీద పళ్ళు, కూరగాయల దుకాణం ఉంది. అది 24 గంటలూ తెరిచి ఉంటుందిట. మా ఇంట్లో కూరలు అక్కడ నుండి తెచ్చినవే. ఈ తడవ వెళ్ళినప్పుడు 24 గంటలూ ఎల్లా తెరిచి ఉంచు తారో కనుక్కోవాలి. అల్లాగే 24 గంటల డైనర్లూ, 24 గంటల బ్యూటీ షాపులు (జుట్టు కత్తిరించేవి) ఉన్నాయిట. మా ఇంటి ఎదురు కుండా 24 గంటలూ జనం తిరుగుతూనే ఉన్నారు.
మా బ్లాకులో ఉన్న షాపుల్లో వ్యాపారం బాగా సాగుతోంది. చెప్పులు బాగు చేయించు కోటానికి జనం క్యు లో నుంచుంటే ఆశ్చర్య మేసింది. ఐదు వందల డాలర్లు పెట్టి కొన్న బూట్లని అవతల పారేస్తారా ? ఏదో అతుకు వేసి సరిచేస్తారు. బట్టలు ఉతకటానికి షాపులో పొద్దున్న పది గంటల లోపు ఇస్తే సాయంత్రం ఉతికి మడతపెట్టి ఇంటికి తీసుకు వచ్చి ఇస్తారు. పౌను బట్టలు ఉతకటానికి ఒక డాలరు.
సామాన్యంగా ఇక్కడ ఉండే వాళ్లకి కార్లు ఉండవు. కార్లు కొనగల స్థోమత ఉన్నా పెట్టుకోటానికి చోటు ఉండదు. తిరగటం అంతా టాక్సీలు, బస్సులు, రైళ్ళు (సబ్వే అంటారు క్రింద సొరంగంలో నించి వెళ్తాయి). Zipcar అనే కంపెనీ వాళ్ళు కొన్ని చోట్ల కార్లు పెట్టారు. డబ్బులు వేసి తీసుకుని వాడుకుని అక్కడే పెట్టేయాలి. మేము గంటకి పదిహేను డాలర్ల చొప్పున రెండుగంటలు తీసుకున్నాము. టాక్సీలు సామాన్యంగా ఒకటి రెండు బ్లాకులకు (చిన్న దూరాలకి) రావు. ఒక సారి మా డాడీ నడవలేరు అనిచెప్పి డ్రైవర్ ని ఒప్పించాడు మావాడు. ఇండియన్ డ్రైవర్ కొంచెం కనికరం చూపించాడు. సాయంత్రం నాలుగున్నర అయుదున్నర మధ్యలో టాక్సీలు దొరకటం కష్టం. తిరుగుతుంటాయి కానీ ఆఫ్ డ్యూటీ అని బోర్డు వెలుగుతూ ఉంటుంది. మనదేశం ఆయనే ఒకాయన టాక్సీ ఆపి మమ్మల్ని ఇంటికి జేర్చాడు. మీకు టాక్సీలు కావాలంటే రోడ్డుపక్కన నుంచుని (బస్ స్టాప్ దగ్గర కాకుండా) చెయ్యి చాపటమే.
మేమున్న ప్రదేశానికి ఎడమ వేపు మూడు బ్లాకుల్లో సెంట్రల్ పార్క్ ఉన్నది. పార్క్ చాలా పెద్దది. చాలా మంది జనం, నడిచే వాళ్ళూ, పరిగెత్తే వాళ్ళూ, ఆటలాడే వాళ్ళూ, నాలాగా బెంచీ మీద కూర్చొని సోద్యం చూస్తున్న వాళ్ళూ, పిల్లలూ, పిల్లలతో వచ్చిన పెద్దలూ బోలెడంత మంది. పార్క్ చూడటానికి వచ్చిన టూరిస్టులకోసం సైకిల్ రిక్షాలూ గుర్రపు బాగ్గీలూ ఉన్నాయి (ఆ వీధిలో కార్లు నడవవు). ఇది ఫిబ్రవరి, అమెరికాలో మిడ్ వింటర్ అందుకని జనం ఎక్కువ లేరు. ఈ సంవత్సరం అదృష్టవశాత్తూ పెద్ద స్నో పడలేదు. చెట్లు మామూలుగా ఆకులు రాలి పోయి బోడిగా ఉన్నాయి. కానీ వేసవిలో చుట్టూతా పచ్చదనంతో చూడముచ్చటగా మాజిక్ షోలతోటి, పార్కులో తిరిగే వాళ్ళ తోటి, అమ్మేవాళ్ళ తోటి, తినే వాళ్ళ తోటి హడావిడిగా ఉంటుందిట.
ముందుకి ఐదారు బ్లాకులు వెళ్తే "టైం స్క్వేర్". ప్రతీ సంవత్సరం అమెరికాలో మొదటి న్యూ ఇయర్ ఇక్కడే జరుపుకుంటారు. జనం తోటి చాలా హడావిడిగా ఉంటుంది. TV లో కూడా చూపెడతారు.బ్రాడ్వే థియేటర్స్ అన్నీ ఇక్కడికి దగ్గరలో ఉన్నాయి. వీటిల్లో నాటకాలు వేస్తారు. కొన్ని అలా మొదలుపెట్టిన నాటకాలు సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి. మేము చూసిన నాటకం రెండేళ్ళ బట్టీ నడుస్తోంది. ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. దగ్గరలో ఆరోజు నాటకాలకి మిగిలిపోయిన టిక్కెట్లు సగం ధరకి అమ్ముతారు. కానీ చాలాపెద్ద క్యూ ఉంటుంది. మేము కొత్తగా వచ్చిన "Death of a Salesman" నాటకానికి వెల్దామనుకున్నాము కానీ టిక్కెట్లు దొరకలేదు.
మేము చలిలో నుంచో లేక "మామీ మియా" అనే సంగీత నాటకానికి మామూలు టిక్కెట్లు కొనుక్కొని వెళ్ళాము. కధ కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ, నాటకం చాలా బాగుంది. కధ క్లుప్తంగా, ఒకావిడ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తూ ఆవిడ స్నేహుతురాళ్ళని, పిల్ల స్నేహితురాళ్ళనీ పిలుస్తుంది. స్థలం గ్రీస్ దగ్గర ఉన్నద్వీపాల్లో ఒక ద్వీపం. కానీ పిల్లకి చాలా దిగులు, తన తండ్రి ఎవరో ఇంతవరకూ తల్లి చెప్పలేదు. సామాన్యంగా పెళ్ళిలో తండ్రి, కూతుర్ని పెళ్లి కుమారుడికి అప్పగిస్తాడు. ఆ పిల్ల కోరిక కూడా అదే తన అప్పగింత తండ్రి ద్వారా జరగాలని. దిగులుతో ఉంటుంది. ఇంతలో పిల్లకి తల్లి డైరీ కనపడుతుంది. దానిలో తన తల్లి యవ్వనంలో ముగ్గురితో తిరిగినట్లు వ్రాసి ఉంటుంది. ఆ ముగ్గిరిలో తన తండ్రి ఎవరో తేల్చుకోలేక ఆ ముగ్గురినీ రహశ్యంగా తన పెళ్ళికి ఆహ్వానిస్తుంది. పెళ్ళికి అందరితోపాటు తన పాత శృంగార మిత్రులు ముగ్గురూ వచ్చేసరికి తల్లి ఆశ్చర్యపోయి దిగ్భ్రాంతి చెందుతుంది. నాటకమంతా ఈ వృత్తాంతం మీద నడుస్తుంది. ఆ అమ్మాయికి తండ్రి ఎవరు? ముగ్గురూ కొట్టుకుంటారా ? మీరు చూసి తెలుసుకోవాల్సిందే! దీనిని మూవీ(Mamma Mia) గ కూడా తీశారు.
"టైం స్క్వేర్" వెళ్ళే ముందర రెండు బ్లాకుల్లో కొలంబస్ సర్కిల్ వస్తుంది. Jack Lemmon, Judy Holliday movie "It Should Happen to You" కొలంబస్ సర్కిల్ ఇతివృత్తంగ తీశారు. జూడీకి అప్పుడే ఉద్యోగం పోతుంది. సెంట్రల్ పార్క్ కి వచ్చి దిగాలుగా ఒక బెంచ్ మీద కూర్చుంటుంది. జాక్ లెమన్ ఒక పత్రికకి పని చేస్తూ ఉంటాడు. అతని పని డాక్యుమెంటరీలు తీయటం. ఆ రోజు ఇతివృత్తం "పాదాలు". జూడీ పాదాలు ఫోటోలు తీసిన తరవాత అవి చాలా బాగున్నాయని మెచ్చుకుని మాటలు కలుపుతాడు. కొంతసేపు అయిన తరువాత ఎవరి దోవన వాళ్ళు వెళ్లి పోతారు. వారి మాటల తరువాత జూడీ కి తన జీవితంలో అందరూ తన పేరు చెప్పుకునేలా ఒక గొప్ప పని చెయ్యాలని అనిపిస్తుంది. కానీ తను పెద్ద చదువుకోలేదు, కొత్త నిరుద్యోగి, డబ్బులు అసలేలేవు. లేచి వెళ్తుంటే పక్కనున్న కొలంబస్ సర్కిల్ లో ఖాళీగా ఉన్న ఒక బిల్ బోర్డు కనపడుతుంది. సరే వెంటనే జూడీకి ఆలోచన వచ్చి బిల్ బోర్డు యజమానిని పిలుస్తుంది. ఆమె ఆలోచన తన దగ్గర మిగిలిన అయిదు వందల డాలర్ల తోటీ తన పేరు ఆ బిల్ బోర్డు మీద వేయించు కోవాలని. ఈవిధంగా నయినా తనపేరు నలుగురూ చెప్పుకుంటారని. చివరికి సాధిస్తుంది, తన పేరు బిల్ బోర్డు మీద మూడు నెలలపాటు ఉండేటట్టు కాంట్రాక్ట్ తీసుకుంటుంది. అక్కటి నుండీ సినీమా రంజుగా తయారవుతుంది. వీలుంటే పాత సినీమాలు లైబ్రరీలో ఉంటాయి చూడండి.
మా ఇంటికి కుడి వైపు నాలుగు బ్లాక్ లు వెళ్తే న్యూయార్క్ లో కళలకు కాణాచి Lincoln Center వస్తుంది. దీనిలో Juilliard School for music and arts, ఒపేరా హౌస్, న్యూయార్క్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా ఉన్నాయి. అక్కడ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్ళాము. రష్యన్ మ్యూజిక్ కంపోజర్ వ్రాసిన మ్యూజిక్ ని న్యూయార్క్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా వాళ్ళు వాయించారు. అందరితోపాటు మేమూ చప్పట్లు కొట్టాము. చాలా జాగర్తగా పాట అయినతరువాతే చప్పట్లు కొట్టాలి. పాట ఎప్పుడయిపోతుందో తెలియదుకాబట్టి అందరితో కలిసి చప్పట్లు కొట్టాము. జాగర్తగా లేకపోతే ఎవరీ అనాగారీకుడు అని అందరూ వింతగా చూస్తారు. Juilliard School లో విద్యార్ధులు ఫ్రీగా సంగీత కచేరీలు ఇస్తూ ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు పియానో కాన్సర్ట్ ఒక దానికి వెళ్ళారు. సామాన్యంగా రోజూ ఏవో ఉంటూ ఉంటాయి.
ఆదివారం సాయంత్రం మా స్నేహితుడు రామారావు వచ్చి వాళ్ళ ఊరు కారులో తీసుకు వెళ్ళాడు. ఆ ఊరి పేరు డిల్హై (Delhi), న్యూయార్క్ కి రెండువందల యాభై మైళ్ళ దూరంలో ఉంది. అక్బర్ కాలంలో ఇండియా వచ్చినాయన ముగ్దుడై ఆ ఊరుకి ఆ పేరు పెట్టారుట. అంతే కాదు అక్కడ దగ్గరలో సరస్సులు ఉన్నాయి. వాటి పేర్లు శోకన్, అశోకన్. ఇక్కడ ఇండియా అంటే ఇష్టమయిన వాళ్ళు చాలా మంది ఉన్నారల్లె ఉంది.
ఈ ఊళ్ళో ఉన్నరెండో తెలుగు వారు, మాకు తెలిసిన డాక్టర్ నాయుడు గారు మమ్మల్ని డిన్నరుకు తీసుకు వెళ్ళారు. అక్కడ నిప్పులపై కాల్చిన బేక్డ్ పొటాటో చాలా బాగుంది. డాక్టర్ గారు మొన్ననే మారిషస్ తెలుగు మహా సభలకి వెళ్లి ఆయన రచనలకి శాలువాతో సత్కరింపబడి వచ్చారు. ఆయన చెప్పిన విశేషం, తెలుగు క్షీణించే భాషలలో ఒకటిగా UNESCO వాళ్ళు నిర్దారించారుట. ఒక పుస్తకం కూడా చూపించారు. చాలా బాధేసింది. ఈ తడవ ఒక నెలరోజులు ఉండి ఆయన వ్రాసిన తెలుగు కవితలు రచనలు కంప్యూటర్ లోకి ఎక్కిస్తానని చెప్పి వచ్చాను.
మర్నాడు వాళ్ళ వూరికి దగ్గరలో (250 మైళ్ళ దూరంలో) నయాగరా ఫాల్స్ ఉంటే అక్కడికి కారులో పొద్దున్న వెళ్ళి రాత్రికి వచ్చేశాము. నాతో నయాగరా చూడాలని మా ఆవిడ కి ఎప్పటినుండో (40 ఏళ్ళు నుండీ) కోరిక, అనుకోకుండా కోరిక ఇప్పుడు తీర్చ కలిగాను. దేనికయినా కాలం, సమయం కలిసిరావాలి. చలికాలంలో సామాన్యంగా ఎవ్వరూ నయాగారాకి వెళ్ళరు. నీళ్ళు గడ్డకట్టుకు పోతాయి కదా. ఈ సంవత్సరం వాతావరణం కొద్దిగా వెచ్చగా ఉంది కాబట్టి నయాగరా కొండమీది నుండి మృదువుగా నెమ్మదిగా జారుతోంది. ఇక్కడి నుండి మర్నాడు న్యూయార్క్ బస్ లో వచ్చాము. బస్ కొండల్లో కోనల్లో చిన్న చిన్నపల్లెటూళ్ళలో ఆగుకుంటూ ప్రయాణిస్తుంది.
మర్నాడు ఇంకొక స్నేహితుడు మా రెడ్డి వచ్చి వాళ్ళింటికి తీసుకు వెళ్ళారు. వాళ్ళ ఊరు న్యూయార్క్ కి యాభై మైళ్ళ దూరంలో లాంగ్ ఐలాండ్లో ఉంది. లాంగ్ ఐలాండ్ చిన్నా చితకా ద్వీపం కాదు, నూట యాభై మైళ్ళ పొడుగూ యాభై మైళ్ళ వెడల్పూ ఉంటుంది. దారిలో క్వీన్స్ లో గణేష్ టెంపుల్ చూశాము. నాకు తెలిసినంత వరకూ, న్యూయార్క్ దగ్గర గణేష్ టెంపుల్, పిట్ట్సు బర్గ్ దగ్గర వెంకటేశ్వర టెంపుల్ అమెరికాలో మొట్ట మొదట కట్టారు. దారిలో జోన్స్ బీచ్ కూడా చూశాము. చలికాలం కాబట్టి బీచ్ లో ఎక్కువ మంది లేరు . మర్నాడు లాంగ్ ఐలాండ్ రైల్లో న్యూయార్క్ కి తిరిగి వచ్చాము.
ఇంకా న్యూయార్క్ లో ఉండి చూసినవి Statue of Liberty, Ellis Island. ఈ రెండిటికీ బోటు మీద వెళ్ళాలి. Statue of Liberty ఫ్రెంచ్ వాళ్ళు అమెరికాకి ఇచ్చిన కానుక. అది రాగి తో చేశారు కానీ పచ్చగా ఉంటుంది. అదంతా చిలుము. ఆ రాగి విగ్రహం పూర్తిగా చిలుము పట్టి పచ్చగా మారటానికి ముప్పై ఏళ్ళు పట్టిందిట !. Ellis Island లో వలస వచ్చిన వారి మీద ఎగ్జిబిషన్ ఉంది, అమెరికాకి జనం తట్టా బుట్ట తో ఎలా వచ్చారో చూడచ్చు. ఒక గోడ మీద ఇమ్మిగ్రంట్ ల పేర్లు కూడా ఉన్నాయి. మీరు అక్కడకి వెళ్తే మా పేర్లు ఉన్నాయి చూడండి.
ఎక్కడికి వెళ్ళినా ఆ ఊరిలో ఎత్తు అయిన బిల్డింగ్ మీదికి ఎక్కి ఊరు చూడాలి అని మా ఆవిడ కోరిక, లేకపోతే అక్కడికి వెళ్ళినట్లు ఉండదుట. అది న్యూయార్క్ లో Empire State Building ."Sleepless in Seattle" అనే మూవీ చివరి సీను ఇక్కడే తీశారు. విడోయర్ అయిన తండ్రికి ఏదో విధంగా పెళ్లి చెయ్యాలని బుడతడు ( అయిదారేళ్ళ కొడుకు) నిర్ణయిస్తాడు. దానికి ఒక రేడియో కార్యక్రమం ద్వారా పెళ్ళికూతుర్ల నుంచి వివరాలు తెప్పించుకుంటాడు. ఒక పెళ్ళికూతురికి Empire State Building మీద valentine day రోజున కలవమని వ్రాస్తాడు. తను అక్కడికి వెళ్తాడు కానీ ఆ అమ్మాయి రాదు. తరువాత కధ ఎల్లా సుఖాంత మౌతుందో సినీమా చూసి తెలుసుకోండి.
తరివాతి ట్రిప్ Grand Central Station . చాలా పెద్ద ట్రైన్ స్టేషన్. ప్లేనులు, కార్లు ఎక్కువుగా ఉపయోగించని రోజుల్లో అమెరికాలో ట్రైన్ ద్వారానే ఎక్కువగా దూర ప్రయాణం చేసే వాళ్ళు. ట్రైన్ లో మొదలయిన సినిమాలు కూడా చాలా వచ్చాయి. పాల్ న్యూమాన్ మూవీ "STING" లో న్యూయార్క్ నుంచి చికాగో దాకా పోకర్ గేం ఆడతారు. మూవీ అంతా దీని ఫలితాల మీద ఆధార పడింది. మూవీ చూడండి. డబ్బులు చూపెట్టి ధనవంతులని కూడా ఎల్లా బుట్టలో వెయ్యోచ్చో పాల్ న్యూమాన్ చూపెడతాడు.
మేము Grand Central Station కి వెళ్ళినది ఆస్కార్ వీకెండ్. ఆదివారం నాడు హాలివుడ్లో వాటిని ప్రెజెంట్ చేస్తారు. అక్కడ నిజమైన ఆస్కార్ చేతిలోపెట్టి ఫోటో తీస్తున్నారు. మా ఆవిడకు కూడా ఆస్కార్ ఇప్పించాను.
ఈ నసుగుడు రాయుణ్ణి ఇంట్లో వదిలి పెట్టి, స్ప్రింగ్ చికెన్స్అనుకునే వాళ్ళు, న్యూయార్క్ లో చూసినవి, NBC Studio Tour (TV), China Town, Saravana Bhavan. ఉసురు తగలకుండా తిరిగి వచ్చేటప్పుడు నాకు తెచ్చినవి --- సిటీ మాగ్నేట్స్, చైనా టౌన్ లో అమ్మే వాడిని ముప్పు తిప్పలు పెట్టి బేరమాడి తెచ్చిన స్కార్ఫ్స్, పర్ఫ్యూమ్స్, శరవణ భవన్ నుంచి ఉల్లి రవ్వ దోశ.
అప్పుడే ఆదివారం తిరిగి వచ్చేసింది. వింటర్ వండర్ లాండ్ చికాగోకి తిరిగి వచ్చాము. మా నెక్స్ట్ ట్రిప్ లో (కొడుకూ కోడలూ ఆహ్వానిస్తే) న్యూయార్క్ లో ఏమి చెయ్యాలో నిర్ధారించు కున్నాము. వేసంగిలోవెళ్లి రోజూ సెంట్రల్ పార్క్ కి వెళ్ళటం లేకపోతే లింకన్ సెంటర్ కి వెళ్లి రోజూ కాఫీ త్రాగటం (ఫ్రీ కన్సర్ట్స్ ఉన్నాయేమో తెలుస్తుంది). మ్యూజియమ్స్ అన్నీ చూడటం. రాత్రి పూట బ్రాడ్వే నాటకాలకి లేకపోతే ఫ్రీ కాన్సర్టులకి వెళ్ళటం. డబ్బులవుతాయి కానీ రిటైర్ అయ్యినతరువాత ఏమిచేస్తాము ?.
ఫల శ్రుతి: ఈ పోస్ట్ చదివిన వారికి న్యూయార్క్ వెళ్ళే భాగ్యము కలుగు గాక. నాకు మాత్రం డెఫినిట్ గ ఫలం కలుగుతోంది. మొగుడితో నయాగరా ఫాల్స్ చూడాలనే మా ఆవిడ కోర్కె తీర్చా కాబట్టి, రోజూ మంచి భోజనం దక్కుతోంది. ఎంతకాలం సాగుతుందో చెప్పలేను కానీ, ఆ రవ్వల నెక్లెస్ కోరిక మనస్సులో కెలకనంత వరకూ ఫరవాలేదు అనుకుంటున్నాను.

Very Good post and Informative.
ReplyDeleteYour narration is superb.
keep writing
Sam.k
ఈ సంవత్సరం చాలా నయం. మీ కోసమే వేడిగా ఉన్నట్లుంది, నయాగారా చూడగలిగారు. మేడం గారి కోరిక తీర్చగాలిగారు.
ReplyDeleteనమస్కారములు
ReplyDeleteమీ న్యూయార్క్ ట్రిప్ చాలా బాగుంది . మరి ఇక్కడి దాకా వచ్చిన వారు మా ఇంటికి " న్యుజెర్సి " రావచ్చును కదా ? ఈ సారి తప్పక రావాలి. అప్పుడు మీ శ్రీమతి గారికి " డైమండ్ " నెక్లెస్ కొనచ్చును. పిమ్మట మరేమిటో ?
ఆరుద్ర గారన్నట్టు " ఆలి కొన్నది కోక .......అంతరిక్షపు నౌక .....అంతకంటెను చౌక " అని . మరి ఆడవాళ్ళంటే ఏమను కున్నారు ? ? ?
@Sam.k గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు.
ReplyDelete@జ్యోతిర్మయి గారూ ఏమిటోనండీ ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యము విపరీతంగా ఉంది. మా ఇంటి ముందర గులాబీ తీగె చిగుళ్ళు వేసింది మార్చిలో !
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదములు. మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు.
@రాజేశ్వరి గారూ ఈ తడవ వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను. డిల్హై నుండి వచ్చేటప్పుడు మా బస్సు న్యూజెర్సీ గుండా వచ్చింది. మిమ్మల్ని తలుచుకున్నాను కూడా. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు.
ReplyDeletea small correction: Paul Newman movie is not 'String' its 'STING'
ReplyDeleteanother correction: Its Mamma Mia, not Mommy Mia
ReplyDelete@Anonymous గారు థాంక్స్. అవి కరెక్టు చేశాను. తప్పకుండా ఆ మూవీలు చూడండి. బాగుంటాయి. మీ వ్యాఖ్యలకు ధన్యవాదములు.
ReplyDelete