Monday, August 22, 2011

67 ఓ బుల్లి కథ 55 ---- డయాబెటిస్ - మా ఇంటి వంటలు

ముందు మాట: డయాబెటిస్ ఉన్నప్పుడు, ఆరోగ్యానికి ఏవి మంచివో తెలిసినప్పుడు అవి ఏ విధంగా రోజూ వారీ వాడచ్చో తెలపటానికే ఈ పోస్ట్. ముందు జాగ్రత్తగా ఆ వ్యాధి రాకుండా ఆహార నియమాలు మార్చుకోవటం మంచిది. ఈ పోస్ట్ లో నేను చెప్పే వంటకాలు అన్నీసూచనలు మాత్రమే. 

కిందటి రెండు పోస్టులలో డయాబెటిస్ వ్యాధి కంట్రోల్ లో ఉండటానికి ఏవి అనుకూలిస్తయ్యో తెలుసుకున్నాము. కూరలు అన్నీఇండియన్ మార్కెట్ లో దొరుకుతయ్యో లేదో తెలియదు. నాకు తెలిసిన అక్కడ దొరికే కూరల పేర్లతోటి ఉదాహరణలు ఇస్తున్నాను. మనము రోజూ తీసుకునే ఆహారములో తగిన మార్పులు చేసి వాటిని దైనందిన జీవితంలో వాడితే వ్యాధి తగ్గుదలకు దోహదం చెయ్యవచ్చు. ఇవన్నీ సూచనలు మాత్రమే. 

Break Fast: మీకు తోచిన షుగర్ లేని స్నాక్స్ (ఇడ్లీ, దోస, వడ మొదలయినవి).
కాఫీ తాగే వాళ్ళు పాలూ చక్కెరా కలపకుండా కాఫీ లో కొద్దిగా cinnamon (క్వార్టర్ స్పూన్ కన్నా తక్కువ) కలిపి పుచ్చు కొంటే బాగుంటుంది.

భోజనానికి కూరలు: కాబేజీ, కాలిఫ్లవర్, కీరా దోసకాయ, కాకర కాయ, అరిటికాయ, బెల్ పెప్పర్, మొదలగు వాటితో కూరలు.

భోజనానికి పచ్చళ్ళు: కాబేజీ, మెరపకాయ, టొమాటో, కొతిమెర, కీరా దోసకాయ, ఉల్లిపాయ, జుకినీ బీరకాయ లతో పచ్చళ్ళు.

భోజనానికి పప్పు: టమాటో, కీరా దోసకాయ, కొతిమెర, వాటర్ క్రేస్స్, జుకినీ బీరకాయ, బచ్చల కూర లతో పప్పు. కాబేజీ కూటు.

భోజనానికి పులుసు/సాంబార్: టొమాటో, కాకర కాయ, అరిటికాయ, ఉల్లిపాయ, బెల్ పెప్పర్, జుకినీ బీరకాయ లతో పులుసు.

వంకాయ, బీట్స్, కారేట్స్, కంద, పెండలం, బటాణీలు, బీన్సు ల తోటి చేసిన పదార్ధాలు అప్పుడప్పుడూ తినవచ్చు.

బంగాళా దుంప, గుమ్మడి కాయ, చిలకడ దుంప, మొక్కజొన్న తినటం చాలావరకు తగ్గించటం మంచిది.

పాలు, పాలనుండి వచ్చిన పదార్ధాలు, మజ్జిగ వగైరా షుగర్ ను ఎక్కువ చెయ్యవచ్చును. కారణం పాలల్లో Lactose ఉంటుంది. అదికూడా షుగరే. షుగర్ substitute వాడకం కూడా అంత మంచిదికాదు. అందుకని వీటిని తగ్గించటం మంచిది. అల్లాగే కార్బో హైడ్రేట్సు ఎక్కువగా ఉన్న పదార్దములు కూడా మంచివి కావు. అవి కూడా షుగర్ను పెంచుతాయి. కనుక తగ్గించటం మంచిది

చివరిమాట: నాకు తెలిసిన తెలుగు కూరల పేర్లతో వివిధ పదార్ధాలతో చేసే వంటకాల ఉదాహరణలు ఇచ్చాను. మీమీ అలవాట్లను బట్టి వాడి, మీ ఆరోగ్యం గమనించుతూ ఉండండి.

డయాబెటిస్ మీద నా పోస్టులు:

11 comments:

 1. అంతా బాగా రాసారు కాని గుమ్మడి కాయ సహజ ఇన్సులిన్ అది చాలా మంచిది

  ReplyDelete
 2. @krishna mohan గారూ ఎందుకో "Pumpkin" తిన కూడని లిస్టు లో "Potatoes" పక్కన ఉంది. Pumpkin అంటే గుమ్మడి కాయ కదా. అల్లాగే కాకరకాయ కూడా చాలా మంచిదని చదివాను.

  "Pumpkin" మీద రిసెర్చ్రీ లో నాకు తెలిసింది
  The rats used in this study represent type I diabetes, but the researchers believe the pumpkin extract may also play a role in type II diabetes.
  బహుశ ఇది కారణము అవ్వచ్చు.
  Pumpkin: A Fairytale End To Insulin Injections?
  http://www.sciencedaily.com/releases/2007/07/070708193019.htm

  ఇంకొకటి One of the characteristics of type 2 diabetes is insulin resistance, which refers to the inability of cells in the body to respond appropriately to the hormone insulin.

  చివరికి ఎందుకో "Pumpkin" తిన కూడని లిస్టు లో "Potatoes" పక్కన ఉంది. కారణం నాకు తెలియదు.

  మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. కొత్త సంగతులు తెలుసుకున్నాను.

  ReplyDelete
 3. నమస్కారములు. రావూ గారు !
  చాలా చక్కని విషయాలను తెలియ జేశారు. నిజమే " జున్ను, గుమ్మడికాయ, అరిశలు " లాంటి కొన్ని పదార్ధాలు తిన కూడదని పెద్దలు చేప్పిన గుర్తు. నాకు అంతగా తెలియదు వినికిడి మాత్రమే. మీ సలహాలు పాటించ గలిగితే మరి ఏ డాక్టరు అవుసరం లేదు. మీ కృషికి ధన్య వాదములు.

  ReplyDelete
 4. బావుందండి ! మీ రాసిన వాటిలో ఒక్క జుకినీ తప్ప మిగిలినవన్నీ మన కూరగాయలే కదా !

  ReplyDelete
 5. (నల్ల) గుమ్మడిలో పిండి పదార్థం ఎక్కువ వుంటుంది, అందుకే అంత మంచిది కాదేమో. అది బూడిద గుమ్మడి (winter melon?) అయివుండొచ్చు.
  అరటి కాయలో పిండి పదార్థం ఎక్కువ కాదా? అది కూడా ఆ నిషేధిత పదార్థాలలో వున్నట్టు ఎక్కడో చూశాను.

  ReplyDelete
 6. @రాజేశ్వరి గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మనం తిని, తాగే వాటిల్లో మంచి వాటిని ఎక్కువగా వాడితే తక్కువ బాధలతో జీవించ వచ్చు. ఉదా: Soft drinks లో high fructose syrup ఉంటుంది. ఎంత తక్కువ వాడితే అంత మంచిది.

  ReplyDelete
 7. @శ్రావ్య గారూ జుకినీకి తెలుగు దొరకలేదు. బీరకాయ లాగా ఉంటుంది కానీ నున్నని outer skin. అల్లాగే radish కి కూడా తెలుగు దొరకలేదు. అవీ మంచివే. మేము పులుసు చేసుకుంటాము. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete
 8. @snkr గారూ అరటి కాయ (Plantain) మంచి లిస్టు లో ఉన్నది. అరటికాయ లో గుడ్ కర్బ్స్ ఉండటం మూలాన Diabetes ఉన్నవాళ్ళూ లేనివాళ్ళూ తినటానికి మంచిదని లిస్టు లో చేర్చారల్లె ఉంది. పచ్చివి చెక్కు తీసిన ముక్కలు ఉడకపెట్టి నీళ్ళు పారబోసి తిరగమాతలో వేస్తే బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ తగిలించారంటే బ్రహ్మాండం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  Glycemic Index for: Plantain
  Food: Plantain (boiled)
  Glycemic Index: 38
  Glycemic Index Rating: Low

  Glycemic Index Explained
  The glycemic index is a measurement of the type or quality of carbs in a particular food, and how fast 50 grams of this carbohydrate raises blood glucose levels, (and consequentinsulin secretion and effects produced by the pancreas) as it is digested.

  Glycemic Response to Plantain
  Carbs in Plantain have a slow effect on blood sugar levels

  http://www.carbs-information.com/glycemic-index-fruit/plantain-gi.htm

  ReplyDelete
 9. రాడిష్ తెలుగు పేరు ముల్లంగి కదండీ , జుకిని తెలుసు కానండి మన దగ్గర దొరకదు కదా తెలుగు పేరు తెలియదు :)))

  ReplyDelete
 10. @Sravya Vattikuti గారూ థాంక్స్.

  ReplyDelete
 11. @sunita గారూ లేదండీ అక్కడకి వెళ్ళలేదు.

  ReplyDelete