Thursday, August 4, 2011

64 ఓ బుల్లి కథ 52 ---- జీవితంలో ముందుకి దూసుకి పోదాం అనుకుంటున్నారా

ముందుమాట: మనమందరం జీవితంలో ముందుకి దూసుకు పోదాం అనుకుంటాము. దానికి చదువులు చదువుతాం ప్రయత్నాలు చేస్తాం. కానీ మనలో కొందరికే ఆ వరం సిద్ధిస్తుంది. మనము అనుకోవచ్చు మన కర్మ ఇదే, మన ప్రాప్తి ఇదే, దేముడు ఇల్లా రాసిపెట్టాడు అని. అంతేనంటారా ? కానీ సైకాలజిస్టులు అదికాదు కారణం, మనమీద మనకి పేరుకుపోయిన అపనమ్మకం(Doubt) అంటారు.

మనమీద మనకి ఎందుకు అపనమ్మకం వచ్చింది ?: మీలో ఉన్న బలాలకన్నా (Strengths) బలహీనతల్ని (Weaknesses) ని ఎక్కువగ చూసుకుంటున్నారు. దీనితో వచ్చే చికాకు ఏమిటంటే మీ బలహీనతలు మిమ్మల్ని కంట్రోల్ లోకి తీసుకుని మీరు చేసే పనుల్లో అడ్డు వస్తూ ఉంటాయి.

ఉదా: మీరు ఒక కాన్ఫరెన్సు లో ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. మీరు పనిచేస్తున్న సబ్జెక్టు మీదే. కానీ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీలో మీకే గందరగోళంగా ఉంది ఏదో చెడిపోతుందని(mess up), మాట్లాడలేక  పోతామేమో అని.

మీరు మాట్లాడే విషయంలో మీకు నైపుణ్య ముంది. ప్రసంగించటం ఇదే మొదలు కాదు. మీరు అనుకునేది నిజంగా చింతించాల్సిన (Realistic Concern) కాదు. మీ ఉపన్యాసానికి ఒక గంటముందు మీరు వ్రాసుకున్న నోట్సు కనపడకపోతే, అది చింతించాల్సిన విషయం అంతేకానీ మెస్సప్ చేస్తామేమో అని విచారించటం కాదు. అది మీ అపనమ్మకం(doubt).

ముఖ్యమయిన సంగతేమిటంటే, మీకు ఆత్మ విశ్వాసం పెంపొందటానికి మీ అనుమానాలు,  అపనమ్మకమో లేక నిజంగా చింతించాల్సిన విషయమో తేల్చుకోవాలి.మీలో మీకు ఆత్మ విశ్వాసం పెరగాలంటే, "నాకు ఈ పని చెయ్యటానికి తగిన నైపుణ్యం ఉందా?", అని మీలో మీరే ప్రశ్నించుకోండి. ఉంటే మీలో మీకు అపనమ్మకం కలగాల్సిన అవుసరం లేదు. లేక పోతే ఆ నైపుణ్యం తెచ్చుకోటానికి ప్రయత్నించాలి.

దేనిమూలాన మనలో మనకి అపనమ్మకం కలుగుతుంది: 
మొదటిది మనం అనుకుంటాము మన  గొప్పదనాన్ని అందరూ మెచ్చుకోవాలని, తిరుగులేదని. ఎవరన్నా మన పనితనాన్ని ప్రశ్నిస్తే మనకి మనసులో బాధగా ఉంటుంది. వారు అమాయకంగా ఈ ప్రాజెక్ట్ ఎల్లా చేస్తావు అన్నాకూడా. మన నైపుణ్యాన్ని శంకించి నట్లు చూస్తాము. ఇది మొదటి ట్రిగ్గర్ పాయింట్. దీన్నే Competency doubt అంటారు.

రెండవది మనమంటే అందరికీ ఇష్టంగా ఉండాలని అనుకుంటాము. మనము వాళ్ళు మంచి స్నేహితులు అనుకుంటే, వాళ్ళింట్లో పార్టీ పెట్టుకుని మిమ్మల్ని పిలవలేదు. వెంటనే మీకు అనుమానం వస్తుంది. నేనంత desirable కాదేమోనని. ఇది రెండోవ ట్రిగ్గర్ పాయింట్. దీన్నేdesirability doubt  అంటారు. ఇంకొక ఉదాహరణ మీ (భర్త) భార్య కో ఆఫీసు కి ఫోన్ చేస్తారు. ఒకమాట మాట్లాడి మిమ్మల్ని పెట్టేయ మన్నారనుకోండి. మీకు బాధగా ఉంటుంది. నేను తనకి తగనా, నాతో మాట్లాడటం టైం వేస్టా అనే అనుమానం వస్తుంది. ఇదే ఓ రెండు సార్లు జరిగితే ఇంకా బాధేస్తుంది. 

మీరు చెయ్యాల్సిందల్లా ఎందుకని ఆ పరిస్థితి వచ్చిందో నిజం తెలుసుకోవటం. అంతేగానీ మీమీద మీరే అపనమ్మకం సృష్టించు కోవటం కాదు.

మీ అపనమ్మకాన్ని ఎదుర్కోండి: మన  చిన్నప్పుడు మనపెద్ద వాళ్ళో లేదా మనతో తిరిగే క్లాస్ పిల్లలో "you are dumb" అని ఉండవచ్చు. మనలో కొందరం ఎప్పుడో ఒకప్పుడు డంబ్ అనిపిచ్చుకోవలసి రావచ్చు. అలాగే మనం బాధల్లో ఉన్నప్పుడు కూడా(విడాకులు, ఉద్యోగం పోవటం ఇత్యాది ) ఇల్లానే అనుకుంటూ ఉంటాము. self-doubt మూలాన ప్రయోజనం లేదు. అవన్నీ తాత్కాలికం. జీవితంలో మీ విజయాల్ని గుర్తు తెచ్చు కొండి. బాధలు తాత్కాలికమే నని గ్రహించి మీ మీద మీకే అపనమ్మకము రాకుండా చూసుకోండి.

ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించండి: మీ success stories, మీకొచ్చిన పొగడ్తలు ఒక పుస్తకంలో వ్రాసుకోండి. మీమీద మీకు అపనమ్మకము కలిగినప్పుడల్లా అవి నెమరువేసు కోండి. అపనమ్మకపు ట్రిగ్గర్ పాయింట్స్ తెలుసుకొని పరిష్కరించటానికి ప్రయత్నించండి. రోజు రోజుకీ మీలో మార్పు వస్తుంది మీ శక్తీ, నైపుణ్యము మీద మీకు నమ్మకము కలుగుతుంది..

తుదిమాట: చూశారా మన బ్రెయిన్ ఎంత మంచిదో. చెప్పే విధంగా చెప్తే వింటుంది.

దీనికి మాతృక:

Secrets to Being More Self-Confident
Leslie Sokol, PhD
Marci G. Fox, PhD

Secrets to Being More Self Confident

5 comments:

 1. by e-mail

  this mail really good. maku prastuta paristutulalo chala relief ga vundi chadivite

  thanks
  sekhar

  ReplyDelete
 2. నాకు ఈ పని చెయ్యటానికి తగిన నైపుణ్యం ఉందా?", అని మీలో మీరే ప్రశ్నించుకోండి. ఉంటే మీలో మీకు అపనమ్మకం కలగాల్సిన అవుసరం లేదు. లేక పోతే ఆ నైపుణ్యం తెచ్చుకోటానికి ప్రయత్నించాలి.
  --------------------
  Well said raju gaaru !


  Sravya V

  ReplyDelete
 3. @sekhar గారూ మీకు ఈ వ్యాసం ఉపయోగించినందుకు సంతోషం. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

  ReplyDelete
 4. @శ్రావ్య గారూ అల్లా ప్రశ్నించుకోకే చాలా సార్లు ఇరుకులో పడవలసి వస్తుంది. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

  ReplyDelete
 5. నిజమే . మంచి సలహాలు ఇచ్చారు మన మనస్సు మనచేతి లోనే ఉంది అది చెప్పినట్టు అన్నివేళలా వినడం మంచిది కాదు అది ఒకో సారి " రాంగ్ రూట్ " పట్టిస్తుంది. నిరుత్సాహ పరుస్తుంది. మనిషిని క్రుంగ దీస్తుంది నరకాన్ని సృష్టిస్తుంది.. అందుకే దాన్ని దారి మళ్ళించి సరి ఐన ఆలోచనలతో సాంత పరచాలి .అవుసరాన్ని బట్టి భావోద్రేకాలను అణచి వేసి , సన్మార్గాన్ని ఆలోచించాలి . అప్పుడు మన మనస్సు మనకే హాయిని కలిగిస్తుంది. కొంచం క్లిష్టమే మరి అలవరుచు కోక తప్పదు.
  మంచి ఆర్టికల్ ని అందింఛి నందకు హేట్సాఫ్ !

  ReplyDelete