ముందు మాట: మెర్రీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.
ఇక్కడ అమెరికా లో మామూలుగా ప్రతీ సంవత్సరం ఈ సమయములో జరిగేది; వచ్చిన డొనేషన్ రిక్వెస్ట్ లను ముందర వేసుకుని కూర్చుని చెక్స్ వ్రాయటం. నేను చాలా లేటు, కానీ ఆపని ఈవేళ పూర్తి చేశాను. ఎంతో తృప్తిగా ఉంది.
మనం సంఘ జీవులం. కొట్టుకున్నా తిట్టుకున్నా మనము మన సంఘాన్ని వదలలేము. దీనికి కారణం వంటరి బ్రతుకు దుర్భరం అని మనందరికీ తెలుసు. అందుకనే మనం మన చుట్టూతా మన కిష్టమయిన వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో సుఖంగా ఉందామని చూస్తాం. ఈ ఇష్టా ఇష్టాలు కాల క్రమేణా మారుతూ ఉంటాయి కాబట్టి మన చుట్టూతా ఉన్న వాళ్ళని కూడా మారుస్తూ ఉంటాము. ఇది రోజూ మనము అనుకోకుండా చేసే ప్రక్రియే. కానీ మనకు ఇష్టమయినా లేకున్నా మన అసలు ప్రకృతి మారదు. మనం ఒంటరిగా ఉండలేము వాళ్ళ తో తప్ప.
నిజంచెప్పాలంటే వాళ్ళు మనకెందుకు ఇష్టమంటే, ఆ "మనం" లో వాళ్ళే మనల్ని పోషించారు, జ్ఞానం పెంచారు, పెద్దచేశారు. మన తలిదండ్రులు పాలు ఇస్తే తాగాము, పాక మంటే పాకాము, అమ్మ నాన్న తాత అనమంటే అన్నాము. మన పంతుళ్ళు పుస్తకాలు తీసి చదవ మంటే చదివాము. మన స్నేహితులు ఆడ మంటే ఆడాము. ఉద్యోగం ఇస్తే చేస్తున్నాము. అందుకనే ఆ "మనం" మనకిష్టం. వాళ్ళ బాధలు మనబాధలు. వాళ్ళ ఇష్టాలు మన ఇష్టాలు. ఇంతకీ నేను చెప్పొచ్చే దేమిటంటే మనలో "నేను" అనేది ఏమీలేదు అంతా "మనం" గ చేసినవే. వంటరిగా "నేను" "నాది" అనేది ఒక చిన్న భ్రాంతి.
సంవత్సరానికి ఒక రోజు మనం కూర్చుకున్న ఆ "మనం" లో దురదృష్ట వశాత్తూ బాధపడుతున్న వాళ్ళని జేర్చుకుందాం. మన ఆనందాన్ని పంచుకుందాం. హైతీ లో భూకంపాలయినా, ఇండోనీషియాలో సునామీ అయినా అవి వాళ్ళు కోరుకుని తెచ్చుకున్న బాధలు కావు. అటువంటి దురదృష్టాలు ప్రపంచం లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం సంఘజీవులం. మనం మనం సహాయం చేసుకోవాలి. అందుకనే కనీసం సంవత్సరానికి ఒకరోజు మనం కూర్చుకున్న ఆ "మనం" లో వీళ్ళని చేర్చుకుందాం. మీకు డొనేషన్ రిక్వెస్ట్ లు వస్తే తోచినంత వెంటనే పంపండి.
స్టాంపులు అతికిచ్చి డొనేషన్ కవర్లు అన్నీ పోస్ట్ చేశాను. ఈ సంవత్సరానికి స్టాంప్ లన్నీ అయిపోయాయి. కొత్త బుక్ కొనుక్కోవాలి.
చివరిమాట: క్రిస్మస్ కి ఇంకా నాలుగు రోజులుంది. మనమిచ్చే ఈ చిన్న సహాయాలతో వచ్చే సంవత్సరాంతం వరకూ వాళ్ళు ఎవర్నో ఎప్పుడో ఎక్కడో ఈ ప్రపంచంలో ఆదుకుంటారు. మన చుట్టూతా లేని మన వాళ్ళందరికీ మనం సహాయం చేయకలుగుతాము. అది ఎనలేని త్రుప్తి.
Subscribe to:
Post Comments (Atom)
e-మెయిల ద్వారా
ReplyDeleteb prasad to me
show details 4:31 PM (18 hours ago)
Dear L.S.R.,
Your latest story (#39) was very interesting. A gesture of good will towards all, including the less fortunate than ourselves,is in the true spirit of Christmas. Thanks for sending the blog.
Best wishes,
Prasad
శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.
ReplyDeleteఈ చక్కని వ్యాసం `ఉడుతా భక్తి'ని గుర్తుచేస్తున్నది. ఉడుత చిన్నదైనా, దాని భక్తి, లేదా, సహాయం చాలా గొప్పది. మీ రచనలోని విషయం అందరిలోనూ ఆర్తిని రేకెత్తించేదిగా ఉన్నది. ధన్యులు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
@ప్రసాద్ థాంక్స్. విష్ యు ఎ హ్యాపీ న్యూ ఇయర్.
ReplyDelete@మాధవరావు గారూ
మనకున్న కొద్దిలో పంచుకోవటమేగా ఈ పండగ చెప్పేది. మీ వ్యాఖ్యకు థాంక్స్. మైండ్ మీద తెలుగులో వ్యాసాలు ఇంకా మొదలెట్టలేదు. అది నా న్యూ ఇయర్ కోరికల్లో ఒకటి. విష్ యు ఎ హ్యాపీ న్యూ ఇయర్.
నమస్కారములు.
ReplyDeleteనిజమె మీరన్నట్టు " మనం " అనే పదం మమతను పెంచి మనుషిని దగ్గర చేస్తుంది." ఆడైనా ,మగైనా ప్రేమించడం కంటే ప్రేమింప బడటమె గొప్ప అనిపిస్తుంది.అందుకె అన్నారు. ప్రేమించు ప్రేమకై." అని.ఈ ప్రేమ అనే పదం ఎదుటి వ్యక్తి నుంచి లభించడం అదృష్టం." నేను ,నా ," అనే పదాలు స్వార్ధ పూరిత మైనవి." మనం " అనె పదానికి చక్కని వ్యాఖ నిచ్చారు.అందుకె మీరు చెప్పినట్టు " సంవత్సరాని కొసారైనా మనం కూర్చు కొన్న ఆ మనంలొ దురదృష్ట వంతు లైన వారికి సేద తీర్చ గలిగితె ఆ ఆనందం తృప్తి వర్ణనాతీతం.చక్కని భావంతొ అద్భుత మైన విషయాలను తెలియ జెప్పారు.మీ ఆదర్శ్యాన్ని కొంతైనా ఆచ రించ గలిగితె ధన్యులం.