ముందు మాట: మెర్రీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.
ఇక్కడ అమెరికా లో మామూలుగా ప్రతీ సంవత్సరం ఈ సమయములో జరిగేది; వచ్చిన డొనేషన్ రిక్వెస్ట్ లను ముందర వేసుకుని కూర్చుని చెక్స్ వ్రాయటం. నేను చాలా లేటు, కానీ ఆపని ఈవేళ పూర్తి చేశాను. ఎంతో తృప్తిగా ఉంది.
మనం సంఘ జీవులం. కొట్టుకున్నా తిట్టుకున్నా మనము మన సంఘాన్ని వదలలేము. దీనికి కారణం వంటరి బ్రతుకు దుర్భరం అని మనందరికీ తెలుసు. అందుకనే మనం మన చుట్టూతా మన కిష్టమయిన వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో సుఖంగా ఉందామని చూస్తాం. ఈ ఇష్టా ఇష్టాలు కాల క్రమేణా మారుతూ ఉంటాయి కాబట్టి మన చుట్టూతా ఉన్న వాళ్ళని కూడా మారుస్తూ ఉంటాము. ఇది రోజూ మనము అనుకోకుండా చేసే ప్రక్రియే. కానీ మనకు ఇష్టమయినా లేకున్నా మన అసలు ప్రకృతి మారదు. మనం ఒంటరిగా ఉండలేము వాళ్ళ తో తప్ప.
నిజంచెప్పాలంటే వాళ్ళు మనకెందుకు ఇష్టమంటే, ఆ "మనం" లో వాళ్ళే మనల్ని పోషించారు, జ్ఞానం పెంచారు, పెద్దచేశారు. మన తలిదండ్రులు పాలు ఇస్తే తాగాము, పాక మంటే పాకాము, అమ్మ నాన్న తాత అనమంటే అన్నాము. మన పంతుళ్ళు పుస్తకాలు తీసి చదవ మంటే చదివాము. మన స్నేహితులు ఆడ మంటే ఆడాము. ఉద్యోగం ఇస్తే చేస్తున్నాము. అందుకనే ఆ "మనం" మనకిష్టం. వాళ్ళ బాధలు మనబాధలు. వాళ్ళ ఇష్టాలు మన ఇష్టాలు. ఇంతకీ నేను చెప్పొచ్చే దేమిటంటే మనలో "నేను" అనేది ఏమీలేదు అంతా "మనం" గ చేసినవే. వంటరిగా "నేను" "నాది" అనేది ఒక చిన్న భ్రాంతి.
సంవత్సరానికి ఒక రోజు మనం కూర్చుకున్న ఆ "మనం" లో దురదృష్ట వశాత్తూ బాధపడుతున్న వాళ్ళని జేర్చుకుందాం. మన ఆనందాన్ని పంచుకుందాం. హైతీ లో భూకంపాలయినా, ఇండోనీషియాలో సునామీ అయినా అవి వాళ్ళు కోరుకుని తెచ్చుకున్న బాధలు కావు. అటువంటి దురదృష్టాలు ప్రపంచం లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం సంఘజీవులం. మనం మనం సహాయం చేసుకోవాలి. అందుకనే కనీసం సంవత్సరానికి ఒకరోజు మనం కూర్చుకున్న ఆ "మనం" లో వీళ్ళని చేర్చుకుందాం. మీకు డొనేషన్ రిక్వెస్ట్ లు వస్తే తోచినంత వెంటనే పంపండి.
స్టాంపులు అతికిచ్చి డొనేషన్ కవర్లు అన్నీ పోస్ట్ చేశాను. ఈ సంవత్సరానికి స్టాంప్ లన్నీ అయిపోయాయి. కొత్త బుక్ కొనుక్కోవాలి.
చివరిమాట: క్రిస్మస్ కి ఇంకా నాలుగు రోజులుంది. మనమిచ్చే ఈ చిన్న సహాయాలతో వచ్చే సంవత్సరాంతం వరకూ వాళ్ళు ఎవర్నో ఎప్పుడో ఎక్కడో ఈ ప్రపంచంలో ఆదుకుంటారు. మన చుట్టూతా లేని మన వాళ్ళందరికీ మనం సహాయం చేయకలుగుతాము. అది ఎనలేని త్రుప్తి.
Showing posts with label Lakkaraaju Christmas Donations stamps. Show all posts
Showing posts with label Lakkaraaju Christmas Donations stamps. Show all posts
Monday, December 20, 2010
Subscribe to:
Posts (Atom)