"సూర్యుని కోసం ఒక ఆకు తపన"
లక్కరాజు శివరామకృష్ణ రావు
రోజంతా వేచివున్నా
నువ్వొస్తావని
కళ్ళల్లో వత్తులేసి
వడగళ్ళ కి వంగిపోతూ
గాలి వానకి ఊగిపోతూ
పక్క గులాబీని తిట్టుకుంటూ
రోజంతా వేచివున్నా
నువ్వొస్తావని
నీ కిరణాలని రంగరించి
నా పచ్చదనం కలిపేస్తే
అదేకదా ఆహారం
నా జీవిన ఆధారం
రోజంతా వేచివున్నా
నువ్వొస్తావని
**** నీలహంస సత్య గారికి కృతజ్ఞతలతో (వారి "ఆకు" గేయ పోటీతో నా భావాలని నిదురలేపి నందుకు).
వారి బ్లాగు ఇక్కడ: నీలహంస
