Showing posts with label Alan Gaby Is Vitamin D Dangerous Lakkaraju. Show all posts
Showing posts with label Alan Gaby Is Vitamin D Dangerous Lakkaraju. Show all posts

Thursday, March 31, 2011

51 ఓ బుల్లి కథ 41 ---- సూర్య కాంతి కిరణం --- Vitamin D

ముందుమాట: 'శ్రీ సూర్య నారాయణా మేలుకో హరి సూర్య నారాయణ' అంటూ నేను పాడుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. మా అమ్మమ్మ సూర్యుని పొడ చూడంది భోజనం చేసేది కాదు. మా అమ్మ రోజూ మధ్యాహ్నం తులసికోట దగ్గర పూజ చేసేది. బొంబాయి లో మా అన్నయ్య ఉదయ సూర్యుని కిరణాలలో సంధ్యావందనం చేసి కానీ ఆఫీసు కి వెళ్ళేవాడు కాదు. పక్కనున్న శాస్త్రిగారు రోజూ భావి దగ్గర స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసేవారు. ఎందుకు వీళ్ళందరూ అలా చేస్తారు?. ఇవన్నీ మన పెద్దవాళ్ళు మనకి ఆచారాలుగ చెప్పారు. మన ఆచారాలు అన్నీ పండితులకీ పామరులకీ  అర్ధమయ్యేలా ఉంటాయి.

ఎందుకు వచ్చిందో ఈ ఆచారం తెలుసా? మన శరీరం సరీగ్గా పనిచెయ్యటానికి విటమిన్ డి  కావాలి. రోజుకి పది నిమిషాలు చాలు ఎండలో ఉండండి. మీకు కావాల్సిన విటమిన్ డి వస్తుంది. గుళికలు మింగినా వస్తుంది కానీ మన శరీరం చేసుకునే దానికి దీటు లేదు. ఎందుకంటే తనకి కావలసినంతే చేసుకుంటుంది, ఒకవేళ ఎక్కువయితే బయటికి పంపించేస్తుంది.

అసలు విటమిన్ డి కి ఎందుకింత  ప్రాముఖ్య మొచ్చింది ?. దీనిని "pre-hormone" అంటారు. మన శరీరం దీనిని ఇంకొక హార్మోనుగ మార్చి దానితో దాదాపు ఒక వెయ్యి జీనులను క్రమ బద్ధం చేస్తుంది. ఇది ఎన్ని వ్యాధులు రాకుండా కాపాడుతుందో చూడండి. precancerous cells ని తీసి పారేస్తుంది. stroke and diabetes రాకుండా చేస్తుంది. జలుబులు దగ్గులు ఫ్లూ రాకుండా maintain the immune system . arthritis రాకుండా కీళ్ళను కాపాడుతుంది. ఎముకలు పళ్ళు గట్టిగా ఉండటానికి promote absorption of calcium and phosphate .

ఈ విటమిన్ శరీరంలో తక్కువయితే జరిగే దుష్ఫలితాలు కొన్ని: కండరముల బలహీనత, నిలబడలేక క్రింద పడటం. low back pain and osteoporosis also can make fibromyalgia worse . 

మనకు రోజుకి ఎంత కావాలి? Dr. Gaby said that most people would do well to take 800 IU to 1,200 IU of D-3 each day, especially during the winter months and most especially for people who are seldom in midday sun and older adults, whose skin loses some of its ability to manufacture D from sunlight. 

చివరిమాట: రోజుకి పది నిమిషాలు ఎండలో ఉంటె చాలు మీకు కావలసిన విటమిన్ డి వచ్చేస్తుంది. మన కన్నీ అర్ధమవ వలసిన అవుసరం లేదు. మన ఆచారం అనుకుని ఎండలో పది నిమిషాలు ఏదో పనిచెయ్యండి. ఆరోగ్యంగా ఉండండి.

దీని మాతృక: 

New Research Warns Against Overzealous Use of Vitamin D
Alan Gaby, MD
Special from Bottom Line's Daily Health News
January 20, 2011