ముందుమాట: కూరగాయలు ప్రకృతికి దగ్గరలో ఉంటాయి కాబట్టి అన్నీఆరోగ్య ప్రదాయినులే కాకపోతే కొన్ని మన శరీర పరిస్థుతులను బట్టి మనకు సరిపడవు. వాటి గురించే ఈ పోస్ట్.
స్థూలకాయం చాలా అనారోగ్య పరిస్థుతులకు కారణం. ఉదా: డయాబెటిస్, కీళ్ళ నొప్పులు, హృద్రోగం మొదలయినవి. మన శరీరంలో తిన్న ఆహారము నుండి షుగర్ తయారవుతుంది. మనకి జీవించ టానికి కావలసిన శక్తి కొన్ని రసాయనిక మార్పులతో ఈ షుగర్ నుండి వస్తుంది. ఈ శక్తి ప్రదాయిని, షుగర్, మన శరీరం వాడుకునే దానికన్నా ఎక్కువయితే, క్రోవ్వుగా (fat) మార్పు చెంది శరీరంలో దాచబడుతుంది. ఆహారము లభ్యము కానప్పుడు ఈ క్రొవ్వు శక్తిగ మార్చ బడి మనకి ఉపయోగ పడుతుంది. రోజూ మూడుపూట్లా సుష్టుగా భోజనం చేస్తూ ఉండి (కావాల్సిన దానికంటే ఎక్కువగా) ఉంటే రాను రానూ ఈ క్రొవ్వు శరీరంలో పేరుకు పోతుంది. ఇంకా శరీరానికి fat దాచి పెట్టే చోటు కనపడదు. ఈ రసాయనిక equilibrium చెదిరిపోతే అనారోగ్యాలు రావటం మొదలవుతాయి. ఉదా: రక్తంలో ఉపయోగించ బడని షుగర్ ఎక్కువగా ఉండటం డయాబెటిస్ కి కారణం.
మన ఆచారాల్లో ఉపవాసాలు చెయ్యమనటానికి కారణం ఇదే అనుకుంటాను. మన శరీరంలో పేరుకున్న క్రోవ్వుని తగ్గించి మనం ఆరోగ్యంగా జీవించటానికి.
మనము స్థూలకాయులమో కాదో తెలుసుకోవటం చాలా మంచిది. దీనికి BMI అనే కొలమానం ఉంది. మీ BMI , 25 కన్నా తక్కువ 18 కన్నాఎక్కువా ఉండాలి. అలా లేకపోతే మీ ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ BMI తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
రక్తంలో షుగర్ చేరటానికి రెండు కారణాలు. మొదటిది షుగర్, షుగర్ తో చేసిన పదార్ధాలు తినటం. రెండవది మనము తినిన ఆహారంలో ఉన్న కార్బో హైడ్రేట్స్(Carbohydrates) శరీరంలో రసాయనిక మార్పిడితో ఏర్పడిన షుగర్.
అందుకని తీపిగా ఉన్నపదార్ధాలు, కార్బో హైడ్రేట్స్ ఉన్న పదార్ధాలు తినటం తగ్గించటం (లేక మానెయ్యటం) చేస్తే షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది. మనము రోజూ తినే కూరగాయలు కూడా కొన్నినియమాలతో వాడితే షుగర్ కంట్రోల్ చెయ్యవచ్చు.ఈ క్రింద మనము తినే కూరగాయలు తినటంలో గమనించ వలసిన జాగ్రత్తలు ఉదహరిస్తున్నాను.
1. ఈ క్రింది వాటిని తినటం మానేస్తే మంచిది :
Potatoes, Parsnips, Pumpkin, Rutabaga, Sweet Potatoes, Corn (actually a grain)బంగాళా దుంప, గుమ్మడి కాయ, చిలకడ దుంప, మొక్కజొన్న
Beets, carrots, Green Beans, Eggplant (వంకాయ ), Jicama, Peas (actually a legume బటాణీ), Squashes,
New Potatoes, Taro, Yams (కంద, పెండలం) .
3. ఈ క్రింది వాటిని తినటం మంచిది :
Artichoke Beet greens Bitter Melon (కాకర కాయ) | Collard greens | Parsley Tomatillos |
చివరిమాట: ఆరోగ్యానికి మితంగా తినటం చాలా మంచిది. అప్పుడప్పుడూ ఉపవాసాలు ఉండటం కూడా ఇంకా మంచిది
మాతృక:
Rachelle S. Bradley, N.D.
http://www.heartlandnaturopathic.com/irdiet.htm
Tonia Reinhard, RD Wayne State University, Detroit
the Healthiest Foods on the Planet That You May Not Have Tried
Tonia Reinhard, RD Wayne State University, Detroit
the Healthiest Foods on the Planet That You May Not Have Tried