Monday, July 4, 2011

60 ఓ బుల్లి కథ 48 ---- మన బ్రెయిన్ లో ఏముంటాయి ?


ముందు మాట:  మన బ్రెయిన్(Brain) ఎల్లా పనిచేస్తుందో అవగాహన కల్పించటానికి కొన్ని వ్యాసాలూ వ్రాయాలని నా ఈ చిన్న ప్రయత్నం లో ఈ పోస్ట్ ఒక భాగం. ఆ వ్యాసాలలో ఉదాహరించబోయే కొన్ని పదములను ఈ పోస్ట్ లో అందరికీ అర్ధమయ్యేలా చెప్పటానికి ప్రయత్నిస్తాను. ఇంగ్లీషు పదాలని తెలుగులో అనువదించే ప్రయత్నం చెయ్యకుండా తెలుగులో వ్రాస్తాను. ఇంకా ఎక్కువ తెలుసు కుందా మనుకునే వారికి ఆ పదములతో గూగులమ్మని అడగటానికి వీలుగా ఉంటుంది.

1. Neuron: మన శరీరం లో ఉండే ఎర్ర కణములు, తెల్ల కణములు లాగా బ్రెయిన్ లో ఉండే  కణములను న్యురోన్లు అంటారు. వీటి ప్రత్యేకత సమాచారాన్ని తీసుకుని ఇంకొక చోట అందించటం. అందుకని సమాచారం తీసుకోటానికి వీటిమీద వేళ్ళు లాగా ఉంటాయి. వీటిని dendrites అంటారు. అలాగే సమాచారం బయటికి పంపటానికి తోక లాగ ఒకటుంటుంది. దానిని Axon అంటారు. ఈ Axon bundles నే మనము Nerves అంటాము.

న్యురోన్ దాదాపు మన చెయ్యి లాగా ఉంటుందనుకోవచ్చు. చేతి వేళ్ళు dendrites, చెయ్యి Axon. ఈ న్యురోన్లు మనము పుట్టినప్పుడే 100 బిలియన్లు ఉంటాయి. జీవిత కాలంలో ఈ సంఖ్య తగ్గటమే కానీ హెచ్చట మంటూ ఉండదు. Brain లో ఇవన్నీ గుంపులు గుంపులుగా (clusters) ఉండి నిర్ణీత పనులు చేస్తాయి. ఉదా: ఒక గుంపు కళ్ళు దగ్గరనుండి వచ్చే సంకేతాలు process చేస్తుంది.

2. Synapse: ఒక న్యురోన్ ఇంకొక న్యురోన్ తో మాట్లాడాలంటే దాని దగ్గరకు వెళ్లి ఆగుతుంది అంతే కానీ physical గ contact ఉండదు. ఈ రెండు న్యురోన్స్ మధ్య ఉన్న సందుని Synapse అంటారు. సంకేతాలు ఒక చోటు నుండి ఇంకొక చోటు కెళ్ళాలంటే న్యురోనులు dendrites ద్వారా సంకేతాలు తీసుకుని Axon ద్వారా బయటికి పంపిస్తాయి. Axon లో నుండి వచ్చిన సంకేతాలు Synapse గ్యాప్ దగ్గర chemical messengers గ మారి ఈదుకుంటూ అవతల న్యురోన్  dendrites దగ్గరకి వెళ్తాయి. అక్కడ మళ్ళా electrical pulses గ మారి గమ్యం చేరేవరకు ప్రయాణం కొనసాగిస్తాయి.సంకేతాలు ఈ విధంగా electrical pulses గానూ chemical pulses గానూ మారుతూ గమ్యం చేరుకుంటాయి. ఈ chemical messengers ని neurotransmitters అంటారు. ఒక న్యురోన్ కి దాదాపు 1,000 నుండి 10,000 వేల దాకా synapses ఉండవచ్చు. అంటే అన్ని వేపులకి సంకేతాలు పంపవచ్చు అన్నమాట.

3. Neurotransmitters: Synaptic gap లో పని చేసే ఈ chemical messengers పనల్లా సంకేతాల్ని ఒక న్యురోన్ నుండి ఇంకొక న్యురోన్ కి చేర వెయ్యటం. ఇవి ఇప్పుడు 27 దాకా ఉన్నాయి. ఇంకా కొత్త neurotransmitters ని కనుక్కుంటూనే ఉన్నారు. మనకొచ్చే కొన్ని జబ్బులు ఇవి సరీగ్గా పని చెయ్యక పోవటం మూలాన అని కనుగొన్నారు. మచ్చుకి కొన్నిneurotransmitters :  Glutamate, Acetylcholine, Dopamine, Norepinephrine, Serotonin మొదలయినవి. ఇవి ఎంత ముఖ్యమో ఒక ఉదాహరణ: మనము కాళ్ళ వేళ్ళు కదిలించాలను కున్నాము. ఆ సంకేతం బ్రెయిన్ నుండి కాళ్ళ వేళ్ళ కండరాలకి neurotransmitters ద్వారా రావాలి. ఎక్కడయినా అవి సరీగ్గా లేకపోతే మనము వేళ్ళని కదిలించలేము.

4. Glial cells: "Glial" అంటే glue అని అర్ధం. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. బ్రెయిన్ లో 90% వరకూ ఈ కణములు ఉంటాయి. ఈ కణాలు న్యురోన్స్ కి సపోర్ట్ గ పని చేస్తయ్యి. వీటిల్లో వివిధ రకాల పనులు చేసేవి ఉన్నాయి.
ఉదా: 1. myelin అనే insulator లాంటి పదార్ధాన్ని తయారుచేసి  సంకేతాలు వెళ్ళే దోవని(Axon) insulate చెయ్యటం. మన electrical wires మీద insulation లాగా.
 2. చనిపోయిన న్యురోన్స్ అవ్వీ ఉంటే వాటిని బయటికి తీసివెయ్యటం. మొదలయినవి.

5. Stem Cells: ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో "Embrionic Stem Cells" అనే కణాలు ఉద్భవిస్తాయి. ఇవి వాటి పరిసరాలను బట్టి వివిధ రకాల కణజాలములు గా రూపాంతరము చెందుతాయి. మొదట బ్రెయిన్ లో పనిచెయ్యటానికి తయారయ్యే న్యురోన్స్ ఈ "Embrionic Stem Cells" నుండి వచ్చినవే.

6. Brain Plasticity: ఒక పని చేసే న్యురోన్స్ దెబ్బతిని ఆ పని చెయ్యలేకపోతే, మిగతా న్యురోన్స్ ఆ పనిని చెయ్యటానికి ప్రయత్నిస్తాయి. దీన్ని Brain Plasticity అంటారు. ఉదా: Stroke వచ్చిన వాళ్ళకి కొన్ని అవయవాలు పని చెయ్యకపోతే, Physical Therapy తో కొంతవరకు సరిచేస్తారు. అంటే Physical Therapy తో చెడిపోయిన న్యురోన్స్ పనిని వేరే న్యురోన్స్ కి నేర్పి పనిచేయిస్తున్నారన్న మాట.

చివరి మాట: "బ్రెయిన్ ఎల్లా పనిచేస్తుంది" తెలుసుకోటానికి చాలా మంది పరిశోధకులు ఇంకా పనిచేస్తున్నారు. కొత్త కొత్తవి కనుక్కుంటే ముందు ముందు వాటిని కూడా ఇక్కడ ఉంచటానికి ప్రయత్నిస్తాను.


Monday, June 27, 2011

59 ఓ బుల్లి కథ 47---- మా మాజీ గవర్నరు జైలు కి వెళ్ళు చున్నా డొచ్

అమెరికాలో ఇల్లినొఇస్ అనే రాష్ట్రముంది. దానికి ఎన్నుకోబడిన గవర్నరు(మన చీఫ్ మినిస్టర్ లాగా), బ్లాగోవిచ్ ని ఇవ్వాళ కోర్టులో జ్యూరీ తప్పు చేశాడని నిర్ధారించింది. ఈ తప్పిదానికి వంద ఏళ్ళు దాకా జైల్లో వెయ్యవచ్చు.

అభియోగం: US సెనేట్ సీటుని అమ్ముకున్దామని ప్రయత్నించటం. 

ఇల్లినొఇస్ రాష్ట్రం లో ఎన్నికయినవారు మధ్యంతరంగా తమ సీట్ వదిలేస్తే మళ్ళా ఎలక్షనుల వరకు రాష్ట్ర గవర్నరు , తానైనా ఆ సీట్ లోకి అప్పాయింట్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకొకళ్ళని అప్పాయింట్ చెయ్యవచ్చు. 

ఒబామా ప్రెసిడెంట్ అయినతరువాత సెనేటర్ గ మానేస్తే  ఖాళీ అయిన US సెనేట్ సీట్ అది. బ్లోగోవిచ్ గారిని రాష్ట్ర సెనేటర్లు  అందరూ కలిసి గవర్నర్ పదవిలోనుండి ఇదివరకే తీసేశారు.


http://beta.news.yahoo.com/jury-convicts-ex-ill-gov-blagojevich-retrial-191413841.html

Wednesday, May 11, 2011

58 ఓ బుల్లి కథ 46---- మేమే నాట్యానికి భాష్యం వ్రాశాం వెయ్యేళ్ళ క్రిందట !



భరతముని నాట్య శాస్త్రము అనే నాట్య వేదం
                                ___________

మాలో ఇంకా ఆ జీన్స్ ఉన్నాయి 
మేము ఇంకా కొత్తవి కనిపెట్టగలం
ఇంకా కొత్త పుంతలు తోక్కగలం
మళ్ళా మాకా ఇన్స్పిరేషన్ రావాలి
మళ్ళా మాలో ఆ జ్యోతి వెలగాలి 
ఇదుగో కావాలంటే చూడండి 
వెయ్యేళ్ళ నాటి మా ప్రతిభ
నాట్య రీతుల్లో మా చాతుర్యం
చేసి చూపెట్టే మా నాట్య వేదం.  

చూడండి ఈ వీడియో: 
    



మా నృత్య పాదాల అందాలు చూడాలంటే సాపాటు సమగతుల                                                                                          పాదాలకి వందనాలు చూడండి 
     

Tuesday, May 3, 2011

57 ఓ బుల్లి కథ 45 ---- మనకు ఎందుకు మతిమరుపు వస్తుంది ?

ముందు మాట: మనము మామూలుగా కొన్ని సంగతులు మరిచి పోతూ ఉంటాము. తాళం చెవులు కోసం వెతకటం,  టీవీ రిమోట్ల  కోసం వెతకటం, బర్తు డేలు మర్చెపోవటం మొదలయినవన్నీ మామూలే కానీ భార్యా, భర్త,  పిల్లల పేర్లు మర్చెపోవటం,  తన పేరే తాను మర్చెపోవటం జరిగితే  కొంచెం గాభరా పడవలసిన అవసరం ఉంది. వృద్ధాప్యంలో ఇవి మామూలే అని అంటూ ఉంటారు కానీ అది నిజమా? Brain Longevity అని ఒక డాక్టరు గారు వ్రాసిన పుస్తకం నుండి సంక్షిప్తంగా కొన్ని నిజాలు వాటిని ఎదుర్కోటానికి కొన్ని పద్ధతులూ చూద్దాము. Since 1993, he has been the President and Medical Director of the Alzheimer’s Research and Prevention Foundation in Tucson, Arizona, USA. 

క్లుప్తంగా బ్రెయిన్ మీద: మన శరీరం లో ఉన్న కణాలు, ఎర్ర కణాలు, తెల్ల కణాలు మొదలయినవి, లాగ మన బ్రెయిన్ లో కణాలు ఉంటాయి. వీటిని న్యురాన్స్ అంటారు. మనం పుట్టేటప్పుడే  మనకు కావాల్సిన న్యురాన్స్ అన్నీ
తయారు చేయబడి మనకి పనిచేసి పెట్టడానికి రెడీ గా ఉంటాయి. వీటి ముఖ్యమైన పనల్లా మన పంచేంద్రియాలనుండి వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి దాచి పెట్టటం, కావాల్సి వచ్చినప్పుడు తిరిగి ఇవ్వటం. ఈ పనిచెయ్యటానికి neurotransmitters ద్వారా వాటితో అవి కూడ బలుక్కుని మాట్లాడుకుంటూ ఉంటాయి.  శరీరం లో అన్ని కణాలు లాగానే ఇవి కూడా రక్త ప్రవాహం లోని గ్లూకోస్ తీసుకుని, దహనం చేసి, శక్తి (ATP) సంపాదించి బ్రతుకుతాయి. కాకపోతే వీటికీ మిగతా కణాలకి తేడా ఏమిటంటే మనకు 30 ఏళ్ళు వచ్చిన దగ్గరనుండీ ఇవి చనిపోతూ ఉంటాయి. వచ్చిన గొడవ ఏమిటంటే ఇవి చనిపోతే మళ్ళా సామాన్యంగా అన్నీ రిప్లేస్ చెయ్యబడవు.  అందుకని బతికున్న కణాలే వాటిల్లో అవి మాట్లాడుకుని కొత్త స్నేహితులని కలుపుకుని చనిపోయిన వాటి పనులు చేస్తాయి. దీనినే Brain Plasticity అంటారు. అవయవాలు స్వాధీనము తప్పినవారు ఫిజికల్ థీరపీ ద్వారా అవయవాలు స్వాధీనం లోకి తెచ్చుకుంటారు దీనిమూలాన అన్నమాట.

జ్ఞాపక శక్తి (మెమరీ): పుట్టంగానే బేబీ కి దాదాపు 100 బిల్లియన్ న్యురాన్సు ఉంటాయి. పుట్టిన రోజునుంచీ బ్రతకటానికి తనకి కావలసిన స్కిల్ల్స్ నేర్చుకోవటం మొదలుపెడుతుంది. మెదడు లోని న్యురాన్సు చిన్న చిన్న గ్రూపులుగా మారి కొత్తగా తెలుసుకున్న సంగతులని గుర్తుపెట్టుకుంటాయి. రోజూ వాడే మోటార్ స్కిల్స్ ని (తినటం, నడవటం, సైకిల్ తొక్కటం వగైరా) ఒక చోట జాగర్తగా దాచి పెడుతుంది. అందుకనే మనము వాటిని మర్చిపోము. అల్లాగే చిన్నప్పుడు బట్టీ పట్టిన ఎక్కాలు. రోజూ బట్టీయము చేశాము కాబట్టి మనస్సుకి అవి చాలా ముఖ్యమయినవి అని గుర్తించి జాగ్రత్తగా దాచి పెడుతుంది. పదమూడు ఏళ్ళ దాకా కొత్తసంగతులు త్వరగా గ్రాస్ప్ చేస్తుంది. ఇంకొక గుణమేమిటంటే మనకి బాధకలిగించేవి మనస్తాపము కలిగించేవి జీవితాంతం గట్టిగా గుర్తు పెట్టుకుంటుంది. బహుశ అటువంటివి మనము మళ్ళా చెయ్యకుండా నేమో. మనము వేటిని గుర్తుపెట్టుకోవాలో వేటిని మర్చెపోవాలో మనస్సుకి చెప్పి చేయించలేము. బహుశ హిందూ మతం లో చెప్పే ఆత్మ అంటే ఇదే నేమో.
సామాన్యంగా ఇది మూడు పౌన్ల బరువు ఉంటుంది. ఎప్పుడూ ఇది కష్టపడి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి,  మెదడు శరీరంలో 2% భాగమయినప్పటికీ 20% ఎనర్జీ ని తాగేస్తుంది.

మనమెందుకు మర్చెపోతాము: మెమరీ పనిచేయటంలో కొన్ని పద్దతులు ఉన్నాయి. మనకి పనికొస్తుందన్న సమాచారమే  అది దాచిపెట్టుకుంటుంది. ఒకవేళ పనికొస్తుందని దాచినా మనము చాలాకాలం వాడకపోతే దానిని మాయం చేస్తుంది. మనము వాడుకోకుండా ఉన్నన్యురాన్సు ప్రూనింగ్ లో చంపబడతాయి. దాదాపు 20 ఏళ్ళ వయసు నుండీ రోజుకి షుమారు 25,000 న్యురాన్సు చచ్చిపోతూ ఉంటాయి. పర్మేనెంటు గ దాచిపెట్టాల్సిన విశేషం  లేదనుకుంటే వాడుకుని వదిలేస్తుంది. 
ఉదా: మనం డ్రైవ్ చేస్తూ ఉంటాము. ట్రాఫ్ఫిక్ లైట్లు దాటుతూ ఉంటాము. ఇంటికొచ్చిన తరువాత మనము వచ్చేటప్పుడు ఎక్కడ ఏ లైటు గ్రీన్, రెడ్, ఎల్లో గ ఉందొ చెప్పమంటే చెప్పలేము. మనసుకు అది గుర్తుంచు కోవటానికి అవసరం లేదని తీసి పారేసింది.

మనం ఏ విధంగా మర్చెపోతాం: మొదటిది వయస్సు పెరిగిన కొద్దీ మామూలుగా న్యురాన్సు చని పోవటం మూలాన వచ్చేది. ఇది 25 ఏళ్ళ(late 20s)  వయసు నుండీ మొదలెడుతుంది. దీని ప్రభావం మొదట ప్రోమినేంట్ గ కనపడదు కానీ 60 ఏళ్ళ తరువాత బాగా కనపడ వచ్చు. మీరు ఏవయినా గట్టిగా గుర్తు పెట్టుకోవాలంటే నాలుగు విధాల గుర్తు పెట్టుకునేట్లు ట్రై చెయ్యండి. ఒక వేపు నుండి మరచిపోయినా ఇంకొక వైపు నుండి ట్రై చెయ్యచ్చు.  ఎవరి ఇంటికైనా వెళ్ళటానికి రెండు దోవలుంటే, ఒక దోవ బ్లాక్ అయితే ఇంకొక దోవలో వెళ్ళచ్చు అలాగ అన్నమాట. ఉదా:  మీకు బాగా గుర్తున్న బర్త్ డే ల తోటి మీరు గుర్తు పెట్టు కోవాల్సిన బర్త్ డే లను ముడి పెట్టండి.

రెండవది మనస్సుకి సరిఅయిన పోషక పదార్ధాలు అందక పోతేను. ఆహారం సరీగ్గా అందకపోతే అన్ని కణాలు లాగానే న్యురాన్సు చనిపోతాయి. మీరు తినే ఆహారంలో ఇవి ఉండేటట్లు చూసుకోండి: Anti oxidant battery of  Vitamins A, C, E, Co Q 10; B-Complex vitamins; Choline rich lecithin; and a trace mineral combination that includes magnesium. Herbs Ginkgo biloba, ginseng also help. There is a saying "What is good for the heart is good for the brain too".

మూడవది  Stressful  జీవితం అయితేను. మీరు చాలా కోపంగా ఉన్నారనుకోండి ఏమి మాట్లాడాలో మర్చి పోతారు. అంతా బాగా చదువుకుని ఎల్లా అవుతుందిరా భగవంతుడా అనుకుంటూ పరీక్ష వ్రాయటానికి వెళ్తారు, అక్కడకి వెళ్లేసరికి చదివినదంతా ఒక్కటీ గుర్తుండదు. ఇటువంటివి అన్నీ మనం రోజూ చూస్తూనే ఉంటాము. వీటికి కారణం Stress. 

Cortisol అనే హార్మోను మన శరీరంలో adrenal glands లో తయారు అవుతుంది.  Stress ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తయారవుతుంది. ఎక్కువైతే ఇది చేసే చెడ్డపని ఏమిటంటే glucose ని న్యురాన్సికి అందకుండా చేస్తుంది. అంటే వాటికి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వక అవి చావటానికి కారణం అవుతుంది. ఈ Cortisol న్యురాన్సు మాట్లాడుకోవటానికి ఉపయోగపడే neurotransmitters పని చేసే విధానాన్ని కూడా మారుస్తుంది. అంటే న్యురానుల గొంతు పిసికినట్లే. అవి త్వరగా చనిపోతాయి. చివరికి ఇది  Alzheimer's disease కి దారి తీస్తుంది.

 అమెరికాలో ప్రతీ 70 సెకండులకు కొత్తగా ఒకళ్ళకి Alzheimer's ఉందని కనుక్కుంటున్నారు. దీనికి మందు లేదు కానీ ముందరగా గుర్తిస్తే త్వరగా రాకుండా చూడవచ్చు. Alzheimer's is a mental condition characterized by extensive death of brain cells. ఇదంతా ఒక్క రోజులో జరగదు కాకపోతే అయిదు ఆరు ఏళ్ళు పట్టచ్చు. కానీ లక్షణాలు ముందర తెలుస్తూ ఉంటాయి. చాలా నైపుణ్యమున్న డాక్టర్లు కానీ చెప్పలేరు. మీరు చెయ్యాల్సింది జీవితం లో Stress తగ్గించు కోవటం. Yoga, Meditation చేసి కూడా stress తగ్గించు కోవచ్చు. 


మంచి మనస్సుకు కావలసినవి ముఖ్యంగా మంచి ఆహారం, Stress  తక్కువ జీవితం. ఈ క్రింద ఇంకో పుస్తకమునుండి గ్రహించినవి ఇస్తున్నాను. ఇంకో పోస్ట్ వచ్చేలోపల ఇవి పనికొస్తాయని అనుకుంటాను:

Brain friendly diet ---
what to eat:
Fresh fruits, Fresh Vegetables and spices. Berries, spinach and dark green leafy vegetables, coffee, avocados, eggs, nuts, seeds and red wine.
Spices: turmeric, cinnamon, ginger.
Herbs: sage and rosemary.
Nuts and seeds: Flax seeds, sunflower seeds, sesame seeds, pumpkin seeds.

Brain-Friendly Diet: What not to eat:
Trans-fats, Concentrated sweets: large quantities of sugar, corn syrup and high-fructose corn syrup. Flavour enhancers and artificial sweeteners. Pesticides, Hormones and antibiotics.

మీకు న్యురాన్సు గురుంచి ఇంకా తెలుసు కోవాలంటే గూగులమ్మని అడగండి లేక పోతే నేను కొన్ని మంచి పుస్తకాలు చదివి సమ్మరీ వ్రాసాను చూడండి.
Brain బుక్స్


ఈ క్రింద పుస్తకం వ్రాసిన డాక్టర్ గారు మెంటల్ ప్రొబ్లెంస్ రాకుండా ఉండటానికి ఒక థీరపీ డేవలప్ చేశారు. దానిలో భాగాలుగా Meditation, Yoga కూడా ఉన్నాయి.


Brain Longevity (1997)
Dharma Singh Khalsa, MD
with Cameron Stauth
Warner Books Inc. 1271 Avenue of the Americas, New York, NY 10020, USA

Tuesday, April 26, 2011

56 ఓ బుల్లి కథ 44 ---- ఎందుకు ప్రపంచంలో మేధావులకి మన వేదాలు గొప్పవి ?

ఈ వీడియో చూడండి :




మన పూర్వికులను మెచ్చుకోండి,  మనకీ నాగరికత ఇచ్చినందుకు. 
మనని మనం నిందించు కుందాము,  వాటిని ఉపయోగించుకోలేనందుకు.
మన నాగరికత  కూడా మనకి తెలియనందుకు బాధపడదాం. 
మనకే నాగరికతా లేదు అని చెప్పే వాళ్ళని చూసి చింతిద్దాము. 
సంవత్సరాల బానిసత్వం మన తెలివి తేటల్ని మొద్దు చేసింది.
ఏమిచేస్తే అది మళ్ళా ప్రజ్వరిల్లుతుందో ఆలోచించండి. 
మళ్ళా ఆ జ్యోతిని అందరం కలసి వెలిగిద్దాము.

Tuesday, April 12, 2011

55 ఓ బుల్లి కథ 43 ---- పరంధామయ్య తో బ్రేక్ ఫస్ట్

                                         రచన:  లక్కరాజు శివరామకృష్ణ రావు.

మాలా కుమార్ గారి పప్పుచారు కాగుతోంది ఒక మూల, ఇంకొకవైపు "పాక వైద్యం" కౌటిల్య గారి మిరియాల చారు మరుగుతోంది,  రైసు కుకర్లో అన్నం పడేసాను. ఇంక కూర చేస్తే సరిపోతుంది. సింపుల్, పోపు వేయటం దానిలో ఫ్రోజెన్ ఫ్రెంచ్ కట్ బీన్స్ వేసి వేయించటం తరువాత కారం ఉప్పు చల్లటం. కూర అయిపోతుంది.

మనము అయిపొయింది అనుకున్నప్పుడే అన్నీఎదురు తిరుగుతాయి. ఇప్పటికి పోపు రెండుసార్లు మాడింది. ఈ మాడిన పోపు తో కూర ఎవరన్నా చూస్తే నా అహం దెబ్బతింటుంది. నాకు వెంటనే రెస్క్యుప్లాన్  కావాలి. "పాక వైద్యం" కౌటిల్య గారి పర్ఫెక్ట్ పోపు పెట్టే విధానం గురించి ఒకప్పుడు చదివినట్టు గుర్తు. వెంటనే లాప్ టాప్ తీసి "పాక వైద్యం" లోకి వెళ్లాను. ఈయనతో ప్రాబ్లం ఏమిటంటే అసలు విషయం పోస్ట్ మధ్యలో ఎక్కడో వ్రాస్తారు. అవసరంగా అప్పటికప్పుడు వెతికే నాలాంటి వాళ్లకి ఎంత కష్టమవుతుంది? కనీసం పోపు చెయ్యు విధానము ఇక్కడ అని పోస్ట్ మధ్యలో బ్లాక్ లెటర్సుతో వేస్తే బాగుంటుంది కదా. ఎల్లాగాయితేనేమి పట్టాను. భగుణ లో నూనె వెయ్యి, దానిలో అవి వెయ్యి ఇవి వెయ్యి, తిరగమాత మాడకుండా "సిం" లో పెట్టి చెయ్యి. చేస్తున్నాను గంటలు పడుతోంది. అది వేగుతుంటే నా మనస్సు లో బాధ పెల్లుబికి వస్తోంది. నేనే తప్పు చేశానేమో. ఇవ్వాళ పర్ఫెక్ట్ స్ప్రింగ్ డే అని ఉత్సాహంగా ఉంటే ఇల్లా అయింది. ఇంక ఆగలేను వినండి. బాధ పంచుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుందట.

ఉదయాన్నే బంగారు ఉదయకిరణాలు కిటికీ లోనుండి వస్తున్నాయి. కాలకృత్యాలు తీర్చుకుని డ్రెస్ చేసుకుని క్రింద సోఫా లో కూర్చున్నాను. క్రూరమయిన మూడు నెలల చికాగో చలికాలం తరువాత ఎంతో ఫ్రెష్ గ ఉంది. ఇవ్వాళ IHOP (International House of Pancakes) లో బ్రేక్ ఫస్ట్. వారెవ్వా ఆ పాన్ కేకులు ఎక్కడా దొరకవు. బొద్దుగా మెత్తగా సుతారంగా ఉడికీ ఉడక నట్లు, కాలీ కాలనట్లు, బంగారం రంగుతో, వావ్ తలుచుకుంటేనే నోరూరుతుంది. "హాష్ బ్రౌన్స్"  ఇంక వాటిగురించి చెప్పక్కర్లేదు. పైన కొద్దిగా బ్రౌన్ మధ్య మల్లెపువ్వు లాంటి సుతి మెత్తని తరిగిన పొటాటో రెక్కలు. వాడి కాఫీ ఉంది చూడండి ఇక చెప్పలేము. ఒకప్పుడు కాఫీ అక్కడ తాగాలంటే భయమేసేది. ఇప్పుడు చాలా డిఫరెంట్. మైల్డ్ బోల్డ్ సున్నితమయిన ఫ్రాగ్రన్సు. ఒక ఫ్లాస్క్ నిండా కాఫీ టేబుల్ మీద పెడతారు. కావాల్సినన్ని సార్లు తాగచ్చు. నేనయితే రెండు కాకపోతే మూడు సార్లు తాగుతాను. కనీసం తినే ముందర తిన్న తరువాత.

నా సంతోషాన్ని నా దగ్గర వాళ్ళతో పంచుకోవటం నాకు చాలా ఇష్టం. అందుకనే పరంధామయ్య నీ ఆయన భార్యనీ రమ్మన్నాను. మా ఆవిడ ఎల్లాగూ వస్తుందనుకోండి. నిజం చెప్పొద్దూ అసలు పరంధామయ్య ని పిలవటానికి కారణం నాకూ మా ఆవిడకీ మధ్య బఫ్ఫర్ గ ఉంటాడని. ముఫై ఏళ్ళ కాపురం తరువాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడేవి ఏమి ఉంటాయి? 

అప్పుడే పది గంటలయింది. ఆవిడ గారు లేచారల్లె ఉంది పైన శబ్ద మవుతోంది. బ్రేక్ ఫస్ట్ టైము పదిన్నరకు అయిపోతుంది. మా రిటైర్మెంట్ అగ్రీమెంట్ ప్రకారము ఎవరూ ఎవరిని తొందర పెట్ట కూడదు. తొందరగా వస్తే వెళ్ళొచ్చు  అని కొంచెం చిగురాశ ఉంటే పరంధామయ్య కి ఫోను చేసాను. ఎవ్వరూ పలకటల్లేదు. నా ఆశలన్నీనీరు కారి పోతున్నాయి. పొద్దుటి నుండీ ఎదురుచూస్తున్న బ్రేక్ ఫస్ట్ కి ఇంతే సంగతులు.

పదకొండున్నరకి పరంధామయ్య దిగాడు వాళ్ళ ఆవిడతోటి. 

"బ్రేక్ ఫస్ట్ కి వస్తానన్నావు?"

"మాస్టారూ క్షమించండి లేటయింది"

"ఉదయం నుండీ ఎదురు చూస్తున్నాను పరం ధామా"

"పొద్దున్నే కూరలకు వెళ్ళాల్సొచ్చింది" "ఆ తరువాత ఆయిల్ ఛేంజి."

"ఇవ్వాళే వెళ్ళాలా నాయనా"

"లేదండి వెళ్ళక తప్పలేదు"

"కొంచెం లేవటం కూడా లేటుగా లేచాము"

"నిన్ననీకు రెండు సార్లు ఫోను చేసాను IHOP కి వెళ్దాము పొద్దున్నే రమ్మని"

" ఫరవాలేదండీ ఎప్పుడయినా  వెళ్ళచ్చుట, నిన్నమేము పిలిచి కనుక్కున్నాము" 
"ట్వంటీ ఫొర్ అవర్స్ బ్రేక్ ఫస్ట్ అక్కడ."

"బ్రేక్ ఫస్ట్ కుక్, లంచ్ కుక్, డిన్నర్ కుక్ వేరు వేరు" అన్నాను నేను.

"కుక్ లందరూ ఒకటే. అయినా మీరు తినే pancakes కి ఏ కుక్ అయితే నేం?" మా ఆవిడ అందుకుంది.

ఇంకా నేను ఆగ లేక పోయాను. "యాభై ఏళ్ళకు పెళ్లి చేసుకుని ఇరవై ఏళ్ళ బాలాకుమారి గ ఉండాలంటే కష్టం"

ఎవ్వరికీ అర్ధం కాలా. నేను మాట్లాడేదాన్ని co-relations అంటారు. అందరికీ అర్ధం కావు. విశదీకరించా.
 "పెళ్లి ఏ వయసులోనయినా చేసుకోవచ్చు (అంటే అది ట్వంటీ ఫొర్ అవర్స్ బ్రేక్ ఫస్ట్ లాంటిది). యాభై ఏళ్లకు (అంటే లంచ్ టైము లో) పెళ్లి చేసుకుని ఇరవ్వై ఏళ్ళ వాళ్ళు లాగా ( అంటే బ్రేక్ ఫస్ట్ లాగా) ఆనందించాలంటే కష్టం. బ్రేక్ ఫస్ట్ pancakes వేరు లంచ్ టైం pancakes వేరు." 

అంతా నిశ్శబ్దం. నేను అన్నదానికి రియాక్షన్ ఏమీ కనపడటల్లేదు.
ఇంకా ఏ విధంగా అర్ధమయ్యేటట్లు చెప్పాలో తెలియటల్లా. 

"ఒకపూట వంట తప్పుతుందని ఆమ్మ గారూ నేనూ లంచ్ టైముకి వెల్దామను కున్నాము. ఏ కుక్ అయితే ఏమి, తినేది Pancakes యే కదా అని ఆమ్మ గారు అన్నారు" తనతప్పేమి లేదని పందామయ్య భార్య అసలు విషయం బయట పెట్టింది.

"మీరేవన్నా చెప్పండి  కుక్కులు అందరూ ఒకటే" తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటే ఇదేనేమో.

తెల్లబోయాను. నాకు కోపము ఆగటల్లేదు. తను ఒకటి తలిస్తే దైవము ఒకటి తలుస్తుందిట. కాదు తను ఒకటి తలుస్తే పెళ్ళాలు ఇంకొకటి తలుస్తారుట. ఆడవాళ్ళ గూడుపుఠాణీ తెలిసి పోయింది. ఏదో అనాలని అనిపిస్తోంది.

నా మనస్సు గట్టిగా నోరుమూసుకోరా అని చెప్తూనే ఉంది. ఆగలేక నోరు విప్పాను.
"బార్బరులు అందరూ ఒకటే, రోజూ గుండు చేసే బార్బర్ దగ్గరకి క్రాఫ్ కోసం వెళ్తామా? "  అని నాలిక కరుచుకున్నాను.
"ఏ సమయానికి ఏమి జరుగునో ఎవరూ హించెదరూ" పాట మనస్సులో మెదుల్తోంది.

అంతే నిశ్శబ్దం. తలుపుతీసిన శబ్దం అయ్యింది. మొదట మా ఆవిడ. తరువాత పరంధామయ్య భార్య ఆ తరువాత ఆవిడ కొంగు పుచ్చుకుని పరంధామయ్య నిష్క్రమించారు. పరంధామయ్య వెళ్తూ నా వంక చూసి బేల మొహం పెట్టాడు. కారు స్టార్ట్ చేసిన చప్పుడయింది. తరువాత కారు వెళ్ళిపోయింది. కఠోరమయిన నిశ్శబ్దం.

ఆకలవుతోంది. మనస్సంతా కటిక చీకటిగా ఉంది. నాకు పెద్దగా అరిచి బల్ల గుద్దాలని ఉంది. కానీ ఫ్యూచర్ భయ పెట్టింది. ఇంక కూర్చుని లాభంలేదు. లేచాను. భయాలతోటి బాధలతోటీ ఫ్యూచర్ ని ఆపలేము. వారం రోజులకు సరిపడా వంట చెయ్యటం మొదలెట్టాలి.

*Pancakes ఒక రకమయిన అట్లు. సామాన్యంగా పోద్దునపూట తింటారు.
*Hash Browns బంగాళా దుంపల ని చాలా సన్నగా తరిగి (Shredding) చేసి ఉడకపెట్టి పెనం మీద వేయిస్తారు.

Tuesday, April 5, 2011

54 ఓ బుల్లి కథ 42 ---- సర్వ రోగ నివారిణి --- సూర్యరశ్మి


ముందుమాట: మన ఊళ్ళల్లో చూడండి పొలాల్లో పనిచేసేవారు, ఎండలో పనిచేసేవారూ ఎంత ఆరోగ్యంగా ఉంటారో. దీనికి కారణము గ్రహించారా,  అది సూర్యరశ్మి. 

అందరికీ సులువుగా దొరికే సూర్యరశ్మి నుంచి మాత్రమే వచ్చే Vitamin D మీద వందలకొలది పరిశోధనలు జరిగాయి. సూర్యరశ్మి తో వచ్చే UV కాంతి మన దేహం లోని కొలెస్టరాల్ తో స్కిన్ దగ్గర కలిసి విటమిన్ D లో ఉండే D3 పార్ట్ తయారవుతుంది. అది మన ఆరోగ్య కారిణి. sunscreen అవ్వీ వేసుకోకుండా చర్మాన్ని బర్న్ చెయ్యకుండా రోజుకి ఎండలో కనీసం 15 నిమిషాలు నుంచుంటే మీకు కావలసిన Vitamin D వస్తుంది. నల్ల స్కిన్ వాళ్ళు అయితే కొంచం ఎక్కువ సేపు ఎండలో ఉండాల్సి ఉంటుంది. గుళికలు మింగినా వస్తుంది కానీ మన శరీరం చేసుకునే దానికి దీటు లేదు. ఎందుకంటే శరీరం తనకి కావలసినంతే చేసుకుని ఎక్కువ మిగిలితే బయటికి పంపించేస్తుంది.

అసలు విటమిన్ డి కి ఎందుకింత  ప్రాముఖ్య మొచ్చింది ?. దీనిని "pre-hormone" అంటారు. మన శరీరం దీనిని ఇంకొక హార్మోనుగ మార్చి దానితో దాదాపు ఒక వెయ్యి జీనులను క్రమ బద్ధం చేస్తుంది. ఇది ఎన్ని వ్యాధులు రాకుండా కాపాడుతుందో చూడండి. precancerous cells ని తీసి పారేస్తుంది. stroke and diabetes రాకుండా చేస్తుంది. జలుబులు దగ్గులు ఫ్లూ రాకుండా maintain the immune system . arthritis రాకుండా కీళ్ళను కాపాడుతుంది. ఎముకలు పళ్ళు గట్టిగా ఉండటానికి promotes absorption of calcium and phosphate .

ఈ విటమిన్ శరీరంలో తక్కువయితే జరిగే దుష్ఫలితాలు కొన్ని: కండరముల బలహీనత, నిలబడలేక క్రింద పడటం. low back pain and osteoporosis also can make fibromyalgia worse . 

మనకు రోజుకి ఎంత కావాలి? ఇక్కడే చాలామంది అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. Dr. Gaby said that most people would do well to take 800 IU to 1,200 IU of D-3 each day, especially during the winter months and most especially for people who are seldom in midday sun and older adults, whose skin loses some of its ability to manufacture D from sunlight. 

చివరిమాట: రోజుకి పది, పదిహేను నిమిషాలు స్కిన్  బర్న్ అవకుండా ఎండలో ఉంటే చాలు మీకు కావలసిన విటమిన్ డి వచ్చేస్తుంది. మన కన్నీ అర్ధమవ వలసిన అవుసరం లేదు. మన ఆచారం అనుకుని ఎండలో కాసేపు ఏదో పనిచెయ్యండి. ఆరోగ్యంగా ఉండండి. అందుకనే చాలా మంది సూర్యుడిని సూర్యభగవానుడిగా ఆరాధిస్తారు.

దీని మాతృకలు : 

New Research Warns Against Overzealous Use of Vitamin D
Alan Gaby, MD
January 20, 2011