ఫొటో గూగుల్ నుండి |
ఉదయాద్రిపై దివ్య పాట :
రచన : రాచకొండ విశ్వనాధ శాస్త్రి
స్వర కర్త : మల్లాది సూరిబాబు
రాగం : మధువంతి
పాడిన వారు : మల్లాది వారు
ఏ మహా శక్తి ఉదయాన్నే వేయి వెలుగుల సొగసుతో విశ్వ వీధుల్లో (సూర్య కిరణాలు) చల్లుతోంది ?
భూమి ఆకాశము కలిసినట్టు కుండపోతగా వర్షం కురిసిన తర్వాత
కోటి రంగులతో దేదీప్యమానంగా వెలుగు (ఇంద్రధనుస్సు ) నిచ్చే ఆ మహా శక్తి ఎవరు ?
ఆ మహాశక్తికి నా శతకోటి వందనాలు .
ఈ పాట మాతృక :
ఉదయాద్రి పై దివ్వెపదిలపరచే దెవరో
వేయి వెలుగుల సొగసు
విశ్వ వీధుల విరియ :ఉదయాద్రి :
ఆకసము పొగబారి
చీకట్లు కొడిగట్ట
ఆకసము పొగబారి
చీకట్లు కొడిగట్ట
కొడిరాల్చి క్రొందివ్వె
కుదుటపరచే దెవరో :ఉదయాద్రి :
ఈ విశ్వమును బ్రోచు
ఆమె పూజాపీఠ
మలరింప జ్యోతిగా :ఉదయాద్రి :
చీకట్లు కొడిగట్ట
ఆకసము పొగబారి
చీకట్లు కొడిగట్ట
కొడిరాల్చి క్రొందివ్వె
కుదుటపరచే దెవరో :ఉదయాద్రి :
మన్నుమిన్నై పుడమి
విన్నబోయిన జూచి
మన్నుమిన్నై పుడమి
విన్నబోయిన జూచి
తరుల తీగలపూలు
మురిసి రంగుల విరియ :ఉదయాద్రి :
ఈ విశ్వమును బ్రోచు
ఆమె పూజాపీఠ
మలరింప జ్యోతిగా :ఉదయాద్రి :
No comments:
Post a Comment