Monday, July 14, 2025

214 ఓ బుల్లి కధ --- ఉదయాద్రిపై దివ్వె

 

ఫొటో గూగుల్ నుండి 

ఉదయాద్రిపై దివ్వె పాట  : 

రచన : రాచకొండ విశ్వనాధ శాస్త్రి 

స్వర కర్త  : మల్లాది సూరిబాబు 

రాగం :  మధువంతి 

పాడిన వారు :  మల్లాది వారు 


ఏ మహా శక్తి ఉదయాన్నే వేయి వెలుగుల సొగసుతో విశ్వ వీధుల్లో (సూర్య  కిరణాలు) చల్లుతోంది ?

భూమి ఆకాశము కలిసినట్టు కుండపోతగా వర్షం కురిసిన తర్వాత 

కోటి రంగులతో దేదీప్యమానంగా వెలుగు (ఇంద్రధనుస్సు ) నిచ్చే ఆ మహా శక్తి  ఎవరు ? 

ఆ మహాశక్తికి నా శతకోటి వందనాలు .   


ఈ పాట మాతృక : 

ఉదయాద్రి పై దివ్వె
పదిలపరచే దెవరో

వేయి వెలుగుల సొగసు
విశ్వ వీధుల విరియ          :ఉదయాద్రి :

ఆకసము పొగబారి
చీకట్లు కొడిగట్ట

ఆకసము పొగబారి
చీకట్లు కొడిగట్ట              

కొడిరాల్చి క్రొందివ్వె
కుదుటపరచే దెవరో        :ఉదయాద్రి :

మన్నుమిన్నై పుడమి
విన్నబోయిన జూచి

మన్నుమిన్నై పుడమి
విన్నబోయిన జూచి

తరుల తీగలపూలు
మురిసి రంగుల విరియ     :ఉదయాద్రి :


యే మహాశక్తి కృప
ఈ విశ్వమును బ్రోచు
ఆమె పూజాపీఠ
మలరింప జ్యోతిగా          :ఉదయాద్రి :



మనం జీవితంలో కొన్నిటికి పూర్తిగా అలవాటు పడ్డాము, వెలుగు ,  చీకటి ,  గాలి ,  వర్షం, భూమి . మనం వాటిని సృష్టించే ప్రశ్నయే  లేదు . ఎవరో సృష్టించిన వాటిని రోజూ  సులభంగా వాడు కోవటం మనకి అలవాటు అయింది . వాటిని సృష్టించిన వారికి ఒకసారైనా కృతజ్ఞత చెప్పలేమా ?     .  

మీకోసం ఈ పాట మల్లాది వారి  స్వరంతో  పాట లింక్ : : 

ఉదయాద్రి పై దివ్వె 

ఫొటో గూగుల్ నుండి 


8 comments:

  1. ఈ పాట ఎపుడూ వినలేదు యూ ట్యూబ్ లో వున్నదా

    ReplyDelete
  2. ఉన్నదండీ . పేరు పెట్టి సెర్చ్ చెయ్యండి . మూర్తీదేవి గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు .

    ReplyDelete
    Replies
    1. Pata link iste baguntundi

      Delete
    2. లింక్ పోస్ట్ చివరలో ఉంది . లింక్ అని కూడా వ్రాశాను మీకోసం ఇప్పుడు . థాంక్స్ ఫర్ ది కామెంట్ .

      Delete
    3. Thank you sir. Very good song indeed. I think Dharmavathi, kapi and kalyana vasantam ragas are used in the composition.

      Delete
    4. True. It is a beautiful thought provoking maningful composition.

      Delete
  3. Interesting one. Thanks for sharing.

    ReplyDelete
    Replies
    1. You welcome. There are so many things we enjoy free everyday without acknowledging the people who provided to us for our use. Thanks for the comment.

      Delete