Showing posts with label లక్కరాజు. Show all posts
Showing posts with label లక్కరాజు. Show all posts

Monday, July 14, 2025

214 ఓ బుల్లి కధ --- ఉదయాద్రిపై దివ్వె

 

ఫొటో గూగుల్ నుండి 

ఉదయాద్రిపై దివ్వె పాట  : 

రచన : రాచకొండ విశ్వనాధ శాస్త్రి 

స్వర కర్త  : మల్లాది సూరిబాబు 

రాగం :  మధువంతి 

పాడిన వారు :  మల్లాది వారు 


ఏ మహా శక్తి ఉదయాన్నే వేయి వెలుగుల సొగసుతో విశ్వ వీధుల్లో (సూర్య  కిరణాలు) చల్లుతోంది ?

భూమి ఆకాశము కలిసినట్టు కుండపోతగా వర్షం కురిసిన తర్వాత 

కోటి రంగులతో దేదీప్యమానంగా వెలుగు (ఇంద్రధనుస్సు ) నిచ్చే ఆ మహా శక్తి  ఎవరు ? 

ఆ మహాశక్తికి నా శతకోటి వందనాలు .   


ఈ పాట మాతృక : 

ఉదయాద్రి పై దివ్వె
పదిలపరచే దెవరో

వేయి వెలుగుల సొగసు
విశ్వ వీధుల విరియ          :ఉదయాద్రి :

ఆకసము పొగబారి
చీకట్లు కొడిగట్ట

ఆకసము పొగబారి
చీకట్లు కొడిగట్ట              

కొడిరాల్చి క్రొందివ్వె
కుదుటపరచే దెవరో        :ఉదయాద్రి :

మన్నుమిన్నై పుడమి
విన్నబోయిన జూచి

మన్నుమిన్నై పుడమి
విన్నబోయిన జూచి

తరుల తీగలపూలు
మురిసి రంగుల విరియ     :ఉదయాద్రి :


యే మహాశక్తి కృప
ఈ విశ్వమును బ్రోచు
ఆమె పూజాపీఠ
మలరింప జ్యోతిగా          :ఉదయాద్రి :



మనం జీవితంలో కొన్నిటికి పూర్తిగా అలవాటు పడ్డాము, వెలుగు ,  చీకటి ,  గాలి ,  వర్షం, భూమి . మనం వాటిని సృష్టించే ప్రశ్నయే  లేదు . ఎవరో సృష్టించిన వాటిని రోజూ  సులభంగా వాడు కోవటం మనకి అలవాటు అయింది . వాటిని సృష్టించిన వారికి ఒకసారైనా కృతజ్ఞత చెప్పలేమా ?     .  

మీకోసం ఈ పాట మల్లాది వారి  స్వరంతో : 

ఉదయాద్రి పై దివ్వె 

ఫొటో గూగుల్ నుండి 


Thursday, July 25, 2024

207 ఓ బుల్లి కధ --- జీవితం సుఖంగా గడపాలంటే

మనందరం జీవితం సుఖంగా గడపాలని అనుకుంటాం. దానికి మార్గాలు వెతుకుతూ ఉంటాము. మొదటగా మనము ఆలోచించేది డబ్బు. డబ్బు ఉంటే మనం అన్నీ కొనుక్కోవచ్చు అని అనుకుంటాము. డబ్బు సంపాయించాలంటే  రెండే రెండు మార్గాలు. మొదటిది ఉద్యోగం దానికి కావాల్సిన చదువు . రెండొవది వ్యాపారం. వ్యాపారం చెయ్యటానికి కూడా దానికి తగిన నేర్పరి తనం చదివి నేర్చుకోవాలి. 

ఇలా కాకుండా అదృష్టం ఉంటే డబ్బు మన చేతిలోకి వారసత్వం ద్వారానో లాటరీ ద్వారానో రావచ్చు. అయినప్పటికీ ఆ డబ్బుని సరీగ్గా ఉపయోగించటం తెలియక బికారీ అయినవాళ్లు కోకొల్లలు. డబ్బును సక్రమంగా ఉపయోగించటానికి కూడా చదువు చాకచక్యం కావాలి.

డబ్బున్నా కూడా మనకు కావాల్సిన వాటిని చాలా సార్లు కొనుక్కోలేము. దీనికి ఉదాహరణగా నాకు తెలిసిన ఒక కధ చెబుతాను. అది రెండొవ ప్రపంచ యుద్ధ కాలం. ఫ్రాన్స్ లో ఆహారపదార్ధాలు అమ్మే ఒక వ్యాపారస్తుడి కధ. యుద్ధం తీవ్రంగా నడుస్తోంది. ఆహార పదార్ధాలు దొరకటం కష్టంగా ఉంది. తన దగ్గరున్న వన్నీ ధరలు పెంచేసి అమ్మేసి డబ్బు బాగా గడించాడు ఓ వ్యాపారి. ఇంకా తన దగ్గర అమ్మటానికి ఏమీ లేవు. యుద్ధం ఇంకా సాగుతూ ఉంది. తన దగ్గర ఆహార పదార్ధాలు కొన్న వాళ్ళే  ఏంత డబ్బుఇస్తానన్నా వాళ్ళు దాచిపెట్టుకున్న ఆహారం ఇవ్వటానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎంత డబ్బు ఉన్నా తింటానికి తిండి దొరకక  ఆ వ్యాపారి ఆకలితో మరణించాల్సి వచ్చింది. ఎక్కువగా  డబ్బు సంపాయించాలి అనే కక్కూర్తితో మోసంచేసి జైలు పాలయిన వాళ్ళు కూడా చాలామంది.

అందుకని జీవితం సుఖంగా గడపటానికి డబ్బే ప్రాధాన్యం కాదు . డబ్బుతో అన్నీ కొనుక్కోలేము. అదే అయితే  బాగా డబ్బున్న దేశాలు డబ్బులేని దేశాల్ని కబళించ వచ్చు. పోనీ డబ్బున్న దేశాల్లో ప్రజలు సుఖంగా ఉన్నారంటే అదీలేదు. ప్రపంచ దేశాల్లో, ప్రజలు సుఖంగా ఉన్నామని చెప్పే మొదటి ఐదు దేశాలు Finland, Denmark, Iceland, Sweden, and Norway ( 2024 World Happiness Report,) . ఇవి చలి దేశాలు. సంవత్సరంలో చాలా రోజులు బయట తెల్లగా ఐస్ కనపడుతుంది సూర్యు డుండడు . ఎందుకు వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుందో వాళ్ళని అడిగి తెలుసుకుంటే తెలిసిన ముఖ్యాంశాలు.

1. సఖ్యత తో చక్కగా ఉండే సమాజం. ఒకరినొకరు చూసుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సఖ్యతగా ఉండే సమాజం. నీకు అవసరమైతే సహాయం చేసేవాళ్ళు ఉన్నారా అని ఆ దేశ ప్రజలని అడిగితే, ఉన్నారు  అన్న వాళ్ళు ఈ దేశాల లో చాలా మంది.

2. ఈ దేశాల వాళ్ళు మంచి జీవన విధానం అవలంభిస్తారు. ప్రకృతిని ప్రేమిస్తారు ఆరాధిస్తారు. ప్రకృతితో మమేకమై జీవిస్తారు. అందుకనే వారి సగటు ఆయుర్దాయం 80 ఏళ్ళ పైనే.

3.ప్రజలకోసం మంచి ప్రభుత్వ నిర్ణయాలు. These countries also provide a social safety net for their citizens, including child benefits, parental leave, health services, hospitals, and care for the sick, unemployed, and senior citizens — all paid for by the government. 

4. ప్రజలందరికీ మంచి ఉద్యోగాలూ, అందరికీ చక్కగా జీవించటానికి కావలసిన సదుపాయాలు  కలిగించే ప్రభుత్వం.

5. చాలా మందికి వారి ఉద్యోగ వసతులతో సంతృప్తిగ ఉంది. దానికి తోడు వీలున్నంత వరకూ వారు దాన ధర్మాలు చేస్తారు.

ప్రజలు జీవించటానికి చక్కని సదుపాయాలూ చేసే ప్రభుత్వం ఉంటేనూ, సఖ్యతతో ఒకరి కొకరు  బాగోగులు గమనించే సమాజం ఉంటేనూ జీవితం సుఖంగా గడుస్తుంది.

https://dailypassport.com/the-worlds-happiest-countries-all-share-this-in-common/

Sunday, January 14, 2024

205 ఓ బుల్లి కధ --- అమెరికాలో చలికాలం వచ్చింది


 
మా ఇంటి వెనక 

మా ఇంటి ముందు 

అమెరికాలో చలికాలం వచ్చేసింది. కాక పోతే ఈ సంవత్సరం కొంచెం ఆలాస్యంగా తన ప్రతాపం చూబెడుతోంది. ఇవాళ పొద్దున్న టెంపరేచర్ -14F (-25.5C) చూపెడుతోంది. ఫొటోలో తెల్లగా కనపడేదంతా స్నో. పొద్దున్న లేచినప్పుడు చెట్ల కొమ్మల మీద కూడా స్నో ఉంది కానీ ఈదురుగాలి మూలాన కిందకి రాలిపోయింది. పై ఫోటోలు తీసేటప్పుడు ఎండ బాగా ఉన్నది కానీ, బయటికి అడుగు పెట్టలేనంత చలి. తలుపు తీసి ఫోటో తీయటం కుదరలేదు.

దేశంలో చాలామందికి కరెంట్ పోయింది. ఈ చలిలో కూడా కరెంట్ వాళ్ళు వచ్చి బాగు చేస్తారు. అది కుదరక పోతే జనాన్ని వేడి ప్రదేశాలకి తరలిస్తారు. 

మేము చికాగో దగ్గరలో ఉంటున్నాము కాబట్టి ప్రతీ సంవత్సరమూ మాకు ఇది అలవాటే. మా ఆవిడ ఇవాళ లైబ్రరీ లో ఉద్యోగానికి కూడా వెళ్ళింది. వీలయినంత వరకూ ఇక్కడ లైబ్రరీలు తెరిచి ఉంటాయి కారణం అవి చలికి మారుగా వేడిగా ఉండే షెల్టర్లు కూడా. మా ఆవిడ పనిచేసే లైబ్రరీలో ఇవ్వాళ పుట్టలమంది జనం వచ్చారుట (అందులో కొందరు T షర్టులు చేసుకోటానికి, అయోధ్య టెంపుల్ పాంఫ్లెట్స్ ప్రింట్ చేసుకోటానికీ కూడా). ఫ్రీగా కంప్యూటర్ లు వాడుకోటానికి, పుస్తకాలూ పేపర్లూ చదవటానికి జనం వస్తూ ఉంటారు కానీ ఇవ్వాళ చలి కాచుకోటానికి కూడా జనం వచ్చి ఉండచ్చు. 

అమెరికాలో చలికాలంలో ముఖ్యంగా వచ్చే పండగలు మూడు  , థాంక్స్ గివింగ్ , క్రిస్మస్, న్యూ ఇయర్. అవి నవంబర్ డిసెంబర్ లో వస్తాయి. 

మేము క్రిస్మస్ కి "డల్లాస్" వెళ్ళాము. టెక్సాస్ రాష్ట్రానికి వెళ్ళటం ఇదే మొదటి సారి. మామూలుగా రోజూవారీ ఉష్ణోగ్రత చికాగో కన్నా ఎక్కువగా ఉంటుంది.మేమున్న దరిదాపుల్లో ఎక్కడ విన్నా తెలుగు మాటలే. ఇక్కడ కొత్తగా పిల్లలకోసం ఒక పాఠశాల తెరిచారుట. దానిలో 50% పైన తెలుగు పిల్లలే. మా దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ పేరు FOODISTHAN. నాకు మొదట అర్ధం కాలేదు గానీ తర్వాత  తెలిసింది దానిపేరు , ఫుడ్ ఇస్తాను, అని. అల్లాగే ఒక కారు లైసెన్స్ ప్లేట్ "andebey " (ఏంది బే ). ఇక్కడ చాలా గుళ్ళు కూడా ఉన్నాయిట. వాటిల్లో దగ్గరలో ఉన్న , "వెంకటేశ్వర స్వామి", "హనుమాన్"  గుళ్ళకి వెళ్ళాము. 

"డల్లాస్" నుండి కారులో "ఆస్టిన్ " వెళ్ళాము. మధ్యలో  "వాకో " అనే ఊరిలో ఆగాము. ఒకప్పుడు , "పాత ఇంటిని కొత్త ఇంటిగా మార్చటం", అనే TV ప్రోగ్రాం ఇక్కడ నుంచి ప్రసార మయ్యేదట. ఇక్కడ కాఫీ మాత్రం చాలా బాగుంది. 

టెక్సాస్ కేపిటల్ భవనం 

"ఆస్టిన్" టెక్సాస్ రాష్ట్ర రాజధాని. విశాలమైన ఆవరణ ఉన్న తోటలో చక్కటి రాజ  భవనం ఉంది. కొద్ది  దూరంలో  అయిదారు అంతస్థుల లైబ్రరీ ఉంది. ఇక్కడ పై అంతస్థులో మేడ మీద గార్డెన్ ఉంది. ఇక్కడ ప్రతీ లైబ్రరీ లో మేకర్ స్టూడియో అని ఉంటుంది. సూయింగ్ మెషిన్ లూ , 3D ప్రింటర్ వగైరా వగైరా , కళల కి ప్రాధాన్య మిచ్చేవి వీటిల్లో ఉంటాయి. వాటిని వాడటానికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. అక్కడ మా ఆవిడ ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళు నువ్విక్కడ పనిచేయ కూడదా అని అడిగారు. (రహస్యం మా ఊళ్ళో మా ఆవిడ లైబ్రరీ మేకర్ స్టూడియోలో పనిచేస్తుంది). ఇక్కడ నాకు ఆశ్చర్యమేసింది  లైబ్రరీ వరండాలో ఫోన్ లేని వాళ్ళ కోసం పెట్టిన "ఫ్రీ ఫోన్". అమెరికా లో కూడా నిరుపేదలు ఉన్నారు.  

"ఆస్టిన్" నుండి "హ్యూస్టన్" కి వెళ్లి NASA వాళ్ళ మ్యూజియం చూశాము. అక్కడ నాకు బాగా నచ్చినవి, అంతరిక్షం నుండి తిరిగివచ్చిన షటిల్ ని మోసుకు వెళ్లిన ప్లేన్ , అంతరిక్షం లోకి వెళ్లి వచ్చిన  రాకెట్, దాని విడి భాగాలూ. రాత్రికి మళ్ళా "ఆస్టిన్" కి తిరిగి వచ్చాము.

"ఆస్టిన్" నుండి మర్నాడు "సాన్ ఆంటోనియో" వెళ్ళాము. మధ్య దారిలో "ఒయాసిస్" అనే రెస్టారెంట్ కి వెళ్ళాము. అది ఎందుకు వెళ్ళామంటే "ఫిదా" మూవీ లో హీరో హీరోయిన్ అక్కడ బాల్కనీ లో "వ్యూ " చూస్తూ మాట్లాడుకుంటారుట. ఆ "వ్యూ " చూద్దామని. ఆ రోజు చలి ఈదురు గాలి దానికి తోడు రెస్టారెంట్ సర్వర్లు పెద్దగ సహకరించలేదు. నేను  బాల్కనీ లో ఈదురు చలిగాలి లో  కూర్చోలేక లోపల ముసలాళ్ళ బెంచీమీద కూర్చుని తినటానికి వెయిట్ చెయ్యాల్సి వచ్చింది.

ముసలాళ్ళ బెంచి 

"సాన్ ఆంటోనియో" అనే ఊరు అమెరికన్ సివిల్ వార్ లో ఒక ప్రముఖ పాత్ర వహించింది. ఇక్కడ యుద్ధంలో "మెక్సికో " ని ఓడించి టెక్సాస్ ను వశం చేసుకున్నారట. మేము వెళ్లేసరికి సాయంత్రం అయ్యింది, చీకటి, చలి, ఆ రోజే ఒక ముఖ్యమయిన "ఫుట్బాల్ " ఆటట  అక్కడ వీధుల నిండా పిల్లా పెద్దా జనం. పార్కింగ్ సమస్య అయ్యింది. ఒక చోటుకు పోతే $40 చెప్పాడు. నాయనా తక్కువలో ఏమన్నా ఉందా అంటే, పక్క వీధిలో అయిదు డాలర్లే అక్కడికి వెళ్ళమని చెప్పాడు. ఎప్పుడైనా తెలిసిన వాళ్ళని అడగటం మంచిది.

ఈ వూళ్ళో చూడవలసింది ఎక్కవలసింది, బోటు షికారు. ఒక గంట Q లో నుంచున్న తరువాత విహారయాత్రకు బోటు లో ఎక్కాము. ఆ ఊరిలో కాలువలో బోటు మీద అరగంట విహార యాత్ర. చుట్టూతా  ఉన్న షాప్స్ చూస్తూ తిప్పుతారు. ఎప్పుడైనా బోటు ఎక్కినప్పుడు ఆ బోటు కెప్టెన్ చెప్పిన మాట వినాలి. మా బోటు కాప్టెన్ , అమ్మాయి, మొదట చెప్పింది  "బోటు" కదిలిన తరువాత లేచి నుంచో వద్దు అని. ఒకాయన లేచి నుంచిని ఫోటోలు తీసుకుంటున్నాడు. మూడు సార్లు వార్ణింగ్ ఇచ్చింది.  మధ్యలో దించేస్తానంటే గానీ ఆయన వినలేదు. ఆయన మన దేశస్థుడే.  ఇంట్లో బయటా ఎక్కడయినా కెప్టెన్ చెబితే తప్పకుండా వినాలి.

ఈ చలికాలం "డల్లాస్" ట్రిప్ లో నాకు బాగా నచ్చినవి మూడు.

మొదటిది "ఆస్టిన్" లో మేమున్న చోట ఉన్న "Domain " షాపింగ్ సెంటర్  లో పొద్దున పూట, లేత ఎండలో సన్నని చలిలో రాళ్లు పరిచిన వీధిలో నెమ్మదిగా నడుచుకుంటూ షాపులు చూసిన  మార్నింగ్ వాక్. థాంక్స్ అపూర్వా .

క్రిస్మస్ పార్టీ 

రెండవది హరి గారి ఇంట్లో "క్రిస్మస్ పార్టీ". చక్కటి వాతావరణం. ఇక్కడ చాలా మెచ్చుకోవలసింది పిల్లలు. ఎంతో చక్కగా ప్రేమతోపలుకరించారు. చివర పెట్టిన ఫోటోలు అక్కడ తీసినవే. థాంక్స్ హరి గారూ .

మూడవది "కొండా" గారింట్లో న్యూ ఇయర్ పార్టీ. పిల్లలు పెద్దలూ ఆట పాటలూ, కొత్తసంవత్సరం  డాన్స్. నేను మా ఆవిడా కాసేపు గెంతులు వేశాం. థాంక్స్ కొండా గారూ.

న్యూ ఇయర్ పార్టీ

ఈ రెండు పార్టీలలోనూ పిల్లలు చాలా చక్కగా యాక్టీవ్ గా పాల్గొన్నారు. థాంక్స్ ఫర్ దెమ్ . అసలు చాలా ముఖ్యమయిన వాళ్ళు "ఇంటి దేవతలు" వాళ్ళు లేకపోతే ఇంత చక్కగా ఏర్పాట్లు జరిగేవి కాదు. మిలియన్ థాంక్స్  ఉమా, పద్మా , సరీతా , సురేఖా , భార్గవీ, కామేశ్వరీ.

క్రిస్మస్ పార్టీలో మేము 



Sunday, February 12, 2023

202 ఓ బుల్లి కధ --- మామా మియా (Mamma Mia )

మొదట ఈ మూవీ 2008 లో వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చూడటానికి వెళ్తుంటే, ఆ సినీమా నాకు చూడటం ఇష్టం లేదు అని చెప్పి నేను వెళ్ళ లేదు. ఇది సంగీత ప్రధానమైన సినీమా. అన్నీ పాటలే. కానీ ఎందుకో కధ నాకు నచ్చలేదు. 

కడుపుతో ఉన్నదని దగ్గరవాళ్ళందరూ వెలివేస్తే, ఒక పెళ్ళి కాని అమ్మాయి గ్రీక్ దేశంలోని ఒక లంకకు వచ్చి హోటల్ పెట్టుకుని జీవిస్తూ తన కూతుర్ని పెద్దది చేస్తుంది. కూతురికి యుక్త వయస్సు వస్తే పెళ్ళి నిర్ణయించి పెళ్ళికి తన స్నేహితురాళ్ళని పిలుస్తుంది. 

పెళ్ళికూతురికి తన కిష్టమయిన వాడితో పెళ్ళి జరుగబోతోందని సంతోషంగా ఉన్నా, తనని కన్యాదానం చేసే తండ్రి ఎవరూ లేరే అని బాధగా ఉంది. తన తండ్రి ఎవరో తల్లి ఎప్పుడూ తనకి చెప్పలేదు. 

ఇక్కడ పెళ్ళిళ్ళల్లో తండ్రి అమ్మాయిని చేత్తో పట్టుకుని పెళ్ళి కొడుకు దగ్గరకు తీసుకు వస్తాడు. పెళ్ళిలో ఇది ఒక ముఖ్య ఘట్టం.ఆ తరువాత చర్చిలో పూజారి వధూవరుల చేత పెళ్ళి  ప్రమాణాలు చేయించి పెళ్ళి ముగిస్తాడు. 

పెళ్ళిలో తన తండ్రి తో నడవాలని కోరికతో, తన తల్లికి తెలియకుండా ఆవిడ డైరీ చదివి, తల్లితో  సన్నిహితంగా గడిపిన ముగ్గుర్ని గుర్తించి, వారిని తన పెళ్ళికి ఆహ్వానిస్తుంది. వాళ్ళల్లో తన తండ్రిని గుర్తు పట్టగలననే ధీమా. మిగతా సినీమా అంతా పెళ్ళికి వచ్చిన, ముగ్గురు అమ్మ స్నేహితురాళ్ళు, ముగ్గురు పెళ్లికూతురు స్నేహితురాళ్ళు , రహస్యంగా పిలవబడ్డ ముగ్గురు తండ్రులతో , వాళ్ళ ఆటపాటలతో గడుస్తుంది. ఎంత ప్రయత్నించినా పెళ్లి కూతురు తన తండ్రిని గుర్తుపట్టలేక పోతుంది.

మీకు నచ్చిందా ఈ కథ. నాకయితే నచ్చలేదు. ఇంట్లో వాళ్ళఅందరూ వెళ్ళి చూసి వచ్చి ఆహా  ఊహూ అంటూ మెచ్చుకుని దానిలో పాటలు కూడా పాడటం మొదలెట్టారు.

కొన్ని ఏళ్ళ తరువాత మా అబ్బాయి న్యూయార్క్ రావటం మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇంకోళ్ల  ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడయినా మీరు చేసే పనులు మీ స్వతంత్ర భావాలకి అనుగుణంగా ఉండవు. అందరితోపాటు వెళ్లి పోవాల్సిందే. ఆ ఫ్లో లో వెళ్ళవలసి వచ్చింది బ్రాడ్వే మ్యూజికల్  "మామా మియా " కి . ఒక గంట హల్లో స్టేజ్ నాటకం చూసిన తర్వాత నాకు బాగా నచ్చేసింది. మొదట నాకెందుకు నచ్చలేదో అర్ధం కాలేదు. బహుశ నా శంకుచ మనస్తత్వం అనుకుంటా.

ఇప్పుడు తెలిసొచ్చిందేమిటంటే మన మొదటి ఒపీనియన్ అంత సరియైనది కాదేమోనని. ఇదే దృష్టి నాకు మొదట్లో ఉంటే పెళ్ళికి అంతమందిని చూడవలసి ఉండేది కాదు. ఇప్పుడు హాయిగా  పదిమంది పిల్లలతో ఎక్కడో పాఠాలు చెప్పుకుంటూ ఉండేవాడిని. వయస్సు పెరుగుతున్న కొద్దీ భావాలు మారుతూ ఉంటాయి.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే దానికి ఒక కారణం ఉంది. మొన్న మా అమ్మాయి, మానవరాలూ ఒక వారం రోజులు ఉండటానికి మా ఇంటికి వచ్చారు. "మామా మియా " సీక్వల్ వచ్చింది చూద్దామన్నారు. ఇంట్లో "ఎమజాన్"  లో చూశాము. నాకు నచ్చలేదు. అంతటితో ఆగిపోతే బాగుండేది. నాలుగేళ్ళ మనమరాలు "మామా మియా ", "మామా మియా " అంటూ మర్నాడు గొడవచెయ్యటం మొదలెట్టింది. పిల్లలు కూడా గుర్తుంచుకుని అనే "క్యాచీ నేమ్"  అది.

"మామా మియా " మళ్ళీ చూశాము. మనుమరాలు "మామా మియా " అనటం మానేసి సినీమా చూస్తూ  పాటలు వాళ్ళ అమ్మతో పాడటం మొదలెట్టింది. ఆ పాటలు అంత ఎడిక్టివ్ . మీరుకూడా వీలుంటే చూడండి. చూడటానికి ఇష్టం లేని సీన్ లు వస్తే  ఒక క్షణం కళ్ళు మూసుకోండి సీన్ మారిపోతుంది.

Saturday, February 4, 2023

201 ఓ బుల్లికధ --- అమెరికాలో అమావాస్య

 "హమ్మయ్య! ఇంక  "ఓహైర్ " ఎయిర్పోర్ట్ జేరితే, ప్లేన్ ఎక్కి "సియాటిల్" వెళ్లిపోవచ్చు, అనుకుంటూ "లిమో" లో కూర్చున్నాము. బయట చల్లటి ఈదురు గాలి .  "సియాటిల్" అమెరికా పశ్చిమ తీరంలో ఉంది. అంటే ఉష్ణోగ్రత భరించలేని చలితో   "చికాగో" లాగా ఉండదు.  

"లిమో" అంటే టాక్సీయే కానీ కొద్దిగా డబ్బులు ఎక్కువ పెట్టాలి. మాకు  ఎయిర్పోర్ట్ దాదాపు ముఫై నలభై మైళ్ళు. ఈ  "లిమో"  వాళ్ళు రమ్మన్నప్పుడల్లా నమ్మకంగా ఇంటికి  వచ్చి  ఎయిర్పోర్ట్ కి తీసుకు వెళ్ళటమో లేక ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి  తీసుకు రావటమో చేస్తూ ఉంటారు .

పొద్దుటి నుండీ ప్లేన్ రాకపోకలు చూస్తూనే ఉన్నాము. చాలా ఫ్లయిట్స్  కాన్సిల్ చేశామని వింటున్నాము కానీ మా ఫ్లయిట్ ఆన్ టైం అని చెబుతోంది. ఒకవేళ డిలే అయితే ఎయిర్పోర్ట్ లో కూర్చుందాములే అని అనుకున్నాము. 

మేము దాదాపు ప్రతీ క్రిస్మస్, న్యూ ఇయర్ కి మా అబ్బాయి దగ్గరకు వెళ్తాము. మనవళ్ళు మనమరాళ్ళతో క్రిస్మస్ ట్రీ  కి అలంకరణలు చేయటం మా ఆవిడకు చాలా ఇష్టం. న్యూ ఇయర్ అయిన  తరువాత ఇంటికి తిరిగివస్తాము. ఈ సంవత్సరం కూడా అదే పని చెయ్యాలని ప్రయత్నం.

హైవే పైన  స్నో ఉంది కానీ కార్లు బాగానే పోతున్నాయి. చికాగోలో చలికాలం మామూలే కాబట్టి జనం అంతగా పట్టించుకోరు. కానీ మనసులో కొంచెం సంకోచం గానే ఉంది. ఇంత 'ఆర్కి టిక్ ' వాతావరణంలో వెళ్ళటం అవసరమా అని. కొన్ని వేల ఫ్లయిట్లు నిన్న, ఇవాళ కూడా కేన్సిల్ చేశారు . 

చిన్నప్పుడు స్కూల్లో  చదివిన విమానాల పాఠం గుర్తుకొస్తోంది. విమానాలకు రెక్కలుంటాయి. ఆ రెక్కలకింద గట్టిగా గాలి కొట్టితే విమానం పైకి లేస్తుంది. తరువాత ఇంజిన్ లో చక్రాలు తిరగటం మూలంగా అది ముందరికిపోతుంది. స్క్రూ డ్రైవర్ తో  స్క్రూ ని ముందరికి నెట్టినట్లు. కానీ అది అటువైపు ఇటువైపు తిరగాలన్నా, స్పీడ్ తగ్గించి ఎక్కడన్నా ఆగాలన్నా రెక్కల మీద "ఎయి రోలాన్లు "  ఉంటాయి. అవి పైకి కిందకీ లేస్తూ ఆపని చేస్తాయట. ఇది అరవై ఏళ్ళ  క్రిందట హైస్కూల్ సైన్స్ లో  నేర్చుకున్న పాఠం . ఈ వాతావరణంలో అవి తెరుచుకోకపోతే మన గతి ఏమిటి. అందుకే రెక్కల మీద "డి ఐసింగ్"  చేస్తారని తెలుసు. అయినా ఈ ఆర్కెటిక్ వాతావరణంలో పనిచేస్తుందా? ఈ వాతావరణంలో కార్లు పనిచేస్తున్నాయి కదా అని కొంచెం ధైర్యం. (ఇక్కడ రేడియేటర్ లో నీళ్ళు  గడ్డ కట్టకుండా ఉండటానికి "యాంటీ ఫ్రీజ్" పోస్తారు.)

మా ఆవిడ కి కూడా కొద్దిగా అనుమానంగానే ఉంది ప్రయాణం ఎలా ఉంటుందో అని. ఫోన్లో అన్నీ చూస్తోంది. అంతా  బాగానే ఉంది. ప్రశాంతంగా ఉందని అనుకుంటుంటే "మెసేజ్" రూపంలో ఫ్లయిట్ క్యాన్సిల్ అయినట్టు వచ్చింది. నాకు సంతోషించాలో విచారించాలో తెలియలేదు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళినా ప్రయోజనం లేదు. అంతా మనమంచికే అనుకుని "లిమో" డ్రైవర్ ని వెనక్కి తిప్పి ఇంటికి తీసుకు వెళ్ళమన్నాము.

"ఎయిర్పోర్ట్ " కి వెళ్లకుండా ఉన్నాము కాబట్టి ఆ డబ్బులు ఇవ్వాలి . ఇంటికి వెళ్తున్నాము కాబట్టి దానికి వేరే డబ్బులు ఇవ్వాలి. ఈ రెండు ట్రిప్ లకి రెండు టిప్ లు ఇవ్వాలి. మనము చేత్తో ఇచ్చినా  ఇవ్వకపోయినా వాళ్ళే తీసుకుంటారు. తడిసి మోపెడంత అయింది. గుడ్డిలో మెల్ల ఇంకానయం ఎయిర్పోర్ట్  కి వెళ్ళలేదు, వెళ్తే  అందరిలాగా నేలమీద పాడుకోవాల్సి వచ్చేది.

ఎలాగయితే నేం ఇంటికి చేరాము. ఇంక చేసేదేముంది లాప్టాప్ తెరిచి యూట్యూబ్ లోకి వెళ్ళాను . నా కుకింగ్ గుర్విణి "చిత్రా మురళి" అమావాస్య రోజు వంటకాలు విడియో పెట్టింది. అప్పుడు అర్ధమయ్యింది నాకు ఇవ్వాళ తిధి ఏమిటో ! . అమావాస్య రోజు ప్రయాణం పెట్టుకుంటే ప్రయాణం  అవుతుందా ?

Tuesday, November 8, 2022

199 ఓ బుల్లికధ --- ఓ పరుగులెత్తే గంగమ్మ కధ

16వ అంతస్తు నుండి --- బెంగుళూరు 

గంగమ్మ వయస్సు ఎంతో గంగమ్మకి తెలియదు. జీవితంలో తన వయస్సు తెలుసుకోవాలనే అవసరం గంగమ్మకి లేదు. వయస్సు అడిగే ఉద్యోగాలు ఎప్పుడూ చెయ్యలేదు. ముగ్గురు చెల్లెళ్ళు  ముగ్గురు తమ్ముళ్ళ తో జీవితం గడిపింది. ఇంట్లో పెద్దదవటంతో పాఠశాల వైపు పోకుండా చిన్నప్పటి నుండీ ఇంటిపనులతోనూ పొలం పనులతోనూ కాలం గడిపింది.  

ఆమెకు పెళ్ళంటే తెలియని పన్నెండేళ్ళ వయసులో పెళ్ళి చేశారు. ఇంక అత్తారింట్లో కాపరం దానితో వచ్చే మంచి చెడ్డలితో కాలం గడిచిపోయింది. పిల్లలు పుట్టటం వాళ్ళ పెంపకం. భర్త ఇళ్ళ  నిర్మాణాల్లో మేస్త్రీ పని చేసేవారు. ఒక ప్రమాదంలో కాలు విరిగింది. జీవితంలో ఏవి ఎప్పుడు జరుగుతయ్యో చెప్పలేము. ధైర్యంగా ముందుకి సాగి పోవటమే. పనులు చెయ్యలేని భర్త, ఇద్దరి కొడుకులు ఒక కూతురితో తన సొంత ఊరు, తమిళనాడులో ధర్మపురి వదిలేసి దగ్గరున్న పట్టణం, కర్ణాటక లోని బెంగుళూరుకి  బస్ ఎక్కింది. 

బెంగుళూరులో అందరికీ అవసరమయ్యే ఇంటిపనిని తన వృత్తిగా మార్చుకుంది. కంప్యూటర్లతో సతమత మవుతూ ఆకాశ హర్మ్యాలలో నివసించే బెంగుళూరు వాసులకు ఒక పెన్నిధిగా మారింది. పొద్దున్నే ఏడింటికి బస్సు లో రావటం, అయిదు ఆరు ఇళ్ళల్లో పనిచేయటం, మళ్ళా సాయంత్రం ఏడింటికి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళటం మామూలు అయిపొయింది. పనిచేసే ఇంటి అవసరాల్ని బట్టి తన సమయాన్ని ఇంటింటికీ కేటాయించేది. ఒక ఇంటిలోనే అంత సమయమూ గడపకుండా ఇంటిపనులన్నీ విడివిడిగా చేసి అన్ని ఇళ్ళకీ సమయం కేటాయించేది. దానినే బిజినెస్ గురువులు కస్టమర్ సెగ్మెంటేషన్ అంటారు. సామాన్యంగా ఏదో ఇంట్లో కాఫీ ఇస్తారు ఎవరో మధ్యాన్నం భోజనం పెడతారు సాయంత్రం ఇంటికి తీసుకు వె ళ్ళటానికి ఏవేవో ఇస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ తినేవి ఎప్పుడూ మిగులుతూనే ఉంటాయి కదా!.

అల్లా 20 ఏళ్ళు గడిచింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అందరూ గవర్నమెంటు పాఠశాలల్లో హైస్కూ ల్ పూర్తి చేశారు. పిల్లలకి పెద్ద చదువులు చెప్పించే పరిస్థితి లేక వాళ్ళని చిన్న వ్యాపారులుగా మార్చింది. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది. వాళ్ళకి పిల్లలు. ఒక చిన్న స్థలం కొనుక్కుని ఇల్లు కట్టించుకుంది. అందరూ కలిసి ఆ ఇంట్లో ఉంటారు. అత్తగారినీ, భర్తనీ ఇంట్లో పెట్టి చివరి వరకూ వారిని చూసుకుంది.

కోవిడ్ తర్వాత ఇండియాకి వచ్చిన ట్రిప్ లో బెంగుళూరు లో ఎక్కువ రోజులు గడపటం జరిగింది. ఎందుకో రోజూ మా ఇంట్లో పనిచేసే గంగమ్మ కధ  చెప్పాలని అనిపించింది. నిశ్శబ్దంగా తమపని తాము చేసుకుపోతూ జీవితం గడిపే గంగమ్మ లాంటి వాళ్ళు ఈ దేశంలో చాలామంది  ఉన్నారు. వారి మూలానే ఈ దేశం నడుస్తోందనే మాటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Wednesday, September 28, 2022

198 ఓ బుల్లి కథ -- పెళ్ళికి ముందర ప్రేమించాలా ?

మన సమాజంలో "ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే క్రేజ్" మొదలయినదని తెలిసిన దగ్గరనుండీ నాకు నేను జీవితంలో ఏదో  మిస్ అయిపోయాననే శంక పీకుతూ ఉంటుంది. యాఫ్ట్రాల్ జీవితంలో ఒక్కసారే కదా పెళ్ళి  చేసుకునేది ! పెళ్ళికి ముందు ఆ అనుభవం అనుభవిస్తే ఎంతో బాగుండేదని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.

నలభై ఏళ్ళ క్రిందట ఒక నెల శలవబెట్టి అమెరికా నుండి వచ్చి పెళ్ళి చేసుకుని వెళ్ళాను . కాకపోతే అది నే ననుకున్నట్లు  జరగక మూడుముళ్ళూ వెయ్యటానికి  రెండు నెలలు పట్టింది. అప్పుడు అమెరికా వాళ్ళు అదొక రికార్డ్ అనుకున్నారు. ఇప్పుడు రోజూ  "ప్రేమ పెళ్ళి క్రేజ్"  వింటూ ఉంటే జీవితంలో నేను ఏదన్నా మిస్ అయిపోయుంటానా అనే అనుమానం నాకు రోజూ వస్తూ ఉంటుంది. 

ఎదో అమ్మాయితో అలా ప్రేమ యాత్రలకి బీచికి వెళ్ళటం, ఆ తర్వాత ఇద్దరం ఏదో రెస్టోరెంట్ కి వెళ్ళటం, మనసు మనసూ కలిసేలా మాట్లాడు కోవటం. ఇవన్నీ నేను ఒక్కణ్ణే మిస్ అయ్యానా ? అనేది నా మనసులో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. అందుకని నేనేనా, నాలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా అని ఒక చిన్న పరిశోధన చెయ్యాలనే కోరిక మొదలయింది. అందుకని నాకు తెలిసిన వాళ్ళతో ముందర ప్రారంభించాలని అనుకున్నాను.

మేము నాలుగైదు ఫ్యామిలీలు నెలకోసారి మెడిటేషన్ కి కలుస్తూ ఉంటాము. ఒక సారి ఈ ప్రశ్న వేశాను. మీ పెళ్ళి ఎల్లా జరిగింది ? అని. అంటే ఎంత వైభవంగా జరిగింది అనికాదు. ఎట్లా మీ ఇద్దరికీ ముడి పడిందని.

నేను ఆ ఫ్యామిలీల గురించి ఒక ముక్క చెబుతాను. నేను ఒక్కణ్ణే ఆ చిన్న గుంపులో రిటైర్ అయిన  వాడ్ని. మా ఆవిడ ఇంకా పనిచేస్తోంది. మిగతా వాటిల్లో రెండు ఫ్యామిలీల లో అయ్యగార్లు  పనిచేస్తారు కానీ అమ్మగార్లు పని చేయరు. మిగిలిన రెండు ఫ్యామిలీలలో అమ్మగారూ అయ్యగారూ ఇద్దరూ పనిచేస్తారు.మొన్ననే ఒకళ్ళింట్లో వాళ్ళ 25 ఏళ్ళ కాపురానికి పండగ జరుపుకున్నాము. ఆంటే ఈ శాంపిల్ పోల్ లో ఇప్పటి వరకూ 25 ఏళ్ళ నుండీ 40 ఏళ్ళ పాటు సంసారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారన్న మాట. ఇంకొకఆయనకి పెళ్ళి అయినది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఒకరోజు వాళ్ళ అత్తయ్యా వాళ్ళింటికి వెళ్ళాడు. నువ్వు యూనివర్సిటీ లో చదువుకున్నావు కదా నీ స్నేహితులు ఎవరన్నా పెళ్ళికున్నారా, చిట్టికి  పెళ్ళి సంబంధాలు చూస్తున్నాము అని అడిగిందిట. చిట్టి తన కూతురు. నేనున్నా కదా ఎందుకు చూట్టం అన్నాడుట. ఇష్టా ఇష్టాలు ఎంత చమత్కారంగా ఆవిడ అడిగిందో మేనల్లుడు అంతే చమత్కారంగా ఎల్లా సమాధానం  చెప్పాడో చూడండి. ఆయన  అత్తకూతురుతో ఆయనకి పెళ్ళయి పోయి శుభాంతంగా ముగిసి పిల్లా పాపాలతో కాపరం చేస్తున్నారు. 

వారి సమాధానాలు మీరు వింటే నమ్మరు కానీ నాది తప్ప అందరివీ పెద్దలు కుదిర్చిన సంబంధాలే. (నేనంతట నేనే నా పెళ్ళాన్ని ఎతుక్కోవాల్సి వచ్చింది.) పెళ్ళి చూపుల ముందు వాళ్ళకి  కూడా పరిచయాలు లేవు. ఒకళ్ళయితే ఆయనకి పెళ్ళి చూపులు కూడా లేవు. వాళ్ళ ఫ్యామిలీ లో అది ఆచారం కాదుట. 

పెళ్ళికి ముందర పరిచయం లేకపోయినా ఏళ్ళ తరబడి సంసారాలు సాగి పోతున్నాయి. సుఖంగా సంసారం చేసుకుంటున్న వాళ్ళని  మీ సంసారంలో ప్రాబ్లమ్స్ ఉన్నయ్యా  అని అడిగే ధైర్యం లేక అడగలేదు. వాళ్ళ జీవితంలో ఏదీ మిస్ అయినట్లు నాకేమీ కనపడటల్లేదు. పెళ్ళి ముందు ప్రేమ ఉండాలనేది చెప్పటం ఈ శాంపిల్ తో నిర్ధారించలేము. 

నేను ఇదే ప్రశ్నని నా క్లాసులో  పిల్లలకి వేశాను. నేను ఇక్కడ పది ఏళ్ళబట్టీ ఇమ్మిగ్రెంట్స్ కి  ఇంగ్లీషు మాట్లాడటం నేర్పు తున్నాను. రిటైర్ అయ్యిన తరువాత  కాలక్షేపం volunteer పని ఇది. ఈ ప్రశ్నకి సమాధానాలు వింటే మీరు ఆశ్చర్య పోతారు. పెళ్లిచేసుకోవటం ఎంత కష్టమో తెలిసిపోతుంది.

ఒక S. Korea అమ్మాయి చిన్ననాటి స్నేహితుడి తో కొంత కాలం తిరిగిందిట కానీ  యూనివర్సిటీ డిగ్రీ తెచ్చుకొన్న తరువాత ఇంకోళ్ళతో పరిచయమయ్యి రెండు సంవత్సరాలు తిరిగిన తరువాత పెళ్ళి చేసుకుందిట. అంటే ఇంకొకళ్ళు దొరికిన తరువాత మొదటివాడిని వదిలేసింది.

ఒక ఇటాలియన్ అమ్మాయి పన్నెండేళ్ళు కలిసి ఉండి పెళ్లి చేసుకోకుండా కాపురం చేస్తూ ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత పెళ్ళి  చేసుకుందిట.

ఒక పోలిష్ అమ్మాయికి అబ్బాయి పరిచయ మయిన తరువాత పెళ్ళి  చేసుకోటానికి రెండేళ్లు పట్టిందిట. ఆ రెండేళ్లూ చేసుకుంటాడో లేదో అనే సందిగ్దావస్థ.

వెనుజువెలా అమ్మాయికి అయితే మాత్రం చెట్టా పట్టా లేసుకు తిరగ కుండా వెంటనే పెళ్లి అయి పోయింది. పెళ్లి ఇద్దరికీ అవసరం. వాళ్ళాయన కంప్యూటర్ ఇంజినీర్ దేశాలు తిరుగుతూ ఉంటాడు.

అదే రష్యా అమ్మాయికి పెళ్ళికోసం దేశం విడిచి పెట్టాల్సి వచ్చింది. అమెరికాకి మూడు నెలలకని వచ్చి అవసర రీత్యా  ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంది. ఇంకో సంగతి కూడా చెప్పింది. రష్యాలో పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు  సామాన్యంగా అయిదు ఏళ్ళు సహజీవనం చేస్తారుట. ఆ తరువాత పెళ్ళి అయితే అవుతుంది లేక పోతే లేదు. 

ఈ పోల్ లో తేలింది,పెళ్లి చేసుకోటానికి తంటాలు పడటం తప్ప పెళ్ళికి ముందు చల్ మోహన రంగా అంటూ తిరిగిన సూచనలు లేవు.

నా unscientific పోల్ రిజల్ట్స్ inconclusive. పెళ్ళికి ముందు ప్రేమ ఉండాలా ? తెలియదు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ కధలు పేపర్లో చూస్తూ ఉంటే, తిట్టుకోటాలు కొట్టుకోటాలు, కత్తితో పొడుచుకోటాలు సూసైడ్ లూ, ఈ  ప్రేమా గీమా లో పస ఏమీ లేదని తెలుస్తోంది. ప్రేమించి పెళ్ళి  చేసుకోక పోవటం మూలంగా  జీవితంలో నేనేమీ మిస్  అవలేదు అని ప్రస్తుతం నేను గట్టిగా చెప్పగలను. 

Sunday, July 17, 2022

197 ఓ బుల్లి కథ -- సియాటిల్ లో ఒక వారం

House with ADU

 ADU లో పడుకుని ఆలోచిస్తున్నాను.  " ఇవ్వాళ ఎండగా  ఉంది  బయటికి వచ్చి కూర్చోండి" అన్న మా అబ్బాయి మాటలు వినటానికి బాగున్నా నేను మాత్రం బయటికి వెళ్ళ లేదు. నా లాంటి వాళ్ళకి ఇంకా బయట చలిగానే ఉంది. కొన్ని కొన్ని ఊళ్ళల్లో రోజూ ఎండ  రావటం ఒక వరం. సియాటిల్ ఆ ఊళ్ళల్లో ఒకటి. చికాగో నుండి ఈ ఊరు వచ్చి నాలుగు రోజులయింది. ప్లేన్లో  నాలుగు గంటల ప్రయాణం. అంటే దాదాపు 2,000 మైళ్ళు దూరం. వచ్చిన  రోజు కొంచెం ఎండ పొడ ఉన్నా తర్వాత రోజులన్నిట్లో ఎప్పుడో ఒకప్పుడు వర్షం కురుస్తూనే ఉంది. 

ప్రతీ దానికీ మంచీ చెడూ, బొమ్మా బొరుసూ ఉంటాయి. వాటిని గ్రహించి  జీవితం గడుపుతుంటే  జీవితం ఆనందంగా హాయిగా ఉంటుంది. లేకపోతే జీవితంలో తరచు ఉరుములూ మెరుపులతో వర్షాలు కురుస్తూనే ఉంటాయి. 

రోజూ వర్షం మూలంగా ఇక్కడ ఎటు చూసినా పచ్చదనం. చుట్టూతా ఎప్పుడో ఎవరో వేసిన చెట్లు నిటారుగా ఆకాశంలోకి చూస్తూ ఉంటాయి. పెరట్లోనూ ఇంటిముందూ ఎక్కడ చూసినా పూల చెట్లు. దాదాపు ఈ ఊరంతా  కొండల మీద మలిచిందే. పచ్చటి నేల మీద ఎటువైపు చూసినా రకరకాల పూల చెట్లతో , ఎత్తు పల్లాలలో సన్నగా పొడుగ్గా ఉన్న పెద్ద పెద్ద వృక్షా లతో, నేల మీద ఒక పెద్ద పెయింటింగ్ పరిచినట్లుగా ఉంటుంది. 

ఆకాశానికి తాకుతున్న చెట్లు 

కనులకు విందయిన  పచ్చదనాన్ని ఆస్వాదించటానికి ఇక్కడ ఇళ్ళు  కూడా అల్లాగే కడతారు.ఇల్లంతా కిటికీల మయం.  పడుకుని ఏ కిటికీ లో నుండి చూసినా చూడటానికి బ్రహ్మాండ మయిన పైంటింగ్స్ . ఊరంతా  కొండలని మలచి కట్టింది కాబట్టి  ఎత్తూ పల్లాల తో ఉంటుంది.  చుట్టూతా పెరట్లో చెట్లు. చెట్లు అనే కంటే వృక్షాలంటే బాగుంటుందేమో. అంత పెద్దవి ఎన్నేళ్ల క్రిందట  ఎవరు నాటారో ! చల్లటి వాతావరణం కనక  ఇక్కడ పెరట్లో పళ్ళ చెట్లు బాగా పెరుగుతాయి. పళ్ళన్నీ వాళ్ళే తినలేరు కదా, అందరికీ పంచిపెడతారు. మాకు "ప్లమ్స్ " అల్లాగే పక్కింటి వాళ్ళు ఇచ్చారు. సామాన్యంగా ప్రతి  ఇంటి ముందరా,పెరట్లో, పచ్చగడ్డి, పూల చెట్లు.

మీకు  ADU అంటే ఏమిటో చెప్పలేదు కదూ. దాని అర్ధం  Accessory ( Additional) Dwelling Unit. ఇంటి ఆవరణలో ఇంకొక చిన్న ఇల్లు ఉంటుంది. తల్లి తండ్రులో, అత్తామామలో వస్తే ఉండటానికి పనికొస్తుంది.  వాళ్ళని స్వతంత్రంగా ఉంటుందని   చెప్పి, బేస్మెంట్ లో పడేయకుండా, పక్కనే ఉంచుకోటానికి బాగుంటుంది. పైన  ఫొటోలో వన్  కార్ గ్యారేజ్ తో ఉన్న చిన్న ఇల్లు ADU. పెళ్ళైన వాళ్ళు ఏకాంతం కోరుకున్నప్పుడు దానిలోకి వెళ్ళి దాక్కోవచ్చు. ఇక్కడి మునిసిపాలిటీ వాటిని ప్రోత్సహించు తుందిట. మాకు తెలిసిన ఒకళ్ళు వాళ్ళ అమ్మకోసం పెరట్లో ఒక ADU కట్టించారు. కావలసిన పర్మిషన్స్ అన్నీ చెక  చెకా వస్తాయి. TSLA మస్క్ గారు కూడా  SpaceX ఆఫీసుకి కి అరిజోనా వెళ్ళినప్పుడు ఇటువంటి దానిలోనే ఉంటారుట. దాని ఖరీదు చిన్నది దాదాపు $80,000 ఉంటుంది.

మా ఇంటి ADU లో మేడమీద గదిలో పడుకుని చూస్తున్నాను. ఈ గదికి మూడు కిటికీలు ఉన్నాయి. రెండు చిన్నవి సన్నవి. మూడోది దాదాపు ఆ రెండూ కలిపిన దానికి సమానంగా ఉంటుంది. కిటికీల ఎత్తు దాదాపు గోడలో సగం ఉంటుంది. పెద్ద కిటికీ లోంచి చూస్తే, సర్వి చెట్లు. దాని ఆకులు పచ్చగా సూదుల్లా ఉంటాయి. పొద్దున్నే సూర్యకిరణాలు వాటిల్లోనుండి దూసుకు వస్తుంటే చూడటానికి సూర్య భగవానుడు మనని ఆశీర్వదిస్తున్నట్లు ఉంటుంది. అది తెల్లటి ఆకాశం మీద ప్రకృతి  సృష్టించిన ఓ వర్ణ చిత్రం. మిగతా రెండు కిటికీల్లో దృశ్యాలు రెండు వైవిధ్య వర్ణ చిత్రాలు. ఒక కిటికీలో దృశ్యం మెలికలు తిరిగిన చెట్ల కొమ్మలపై అల్లుకు పోయిన ఆకులు. రెండవ కిటికీలో కనపడేది, కొండ మీద పచ్చటి మైదానం దాని మీద రెండు పెద్ద పెద్ద చెట్ల బోదెలు వాటి మధ్య  పచ్చటి గడ్డి మీద విరచిన పూల మొక్కలు. అది ఒక 3D పిక్చర్. వాటిని చిత్రాలుగా వర్ణించి మీ కళ్ళలో కనిపించేటట్లు చేసే శక్తి నాకు లేదు.

గోడల మీద పెయింటింగ్స్ పెట్టవలసిన అవసరం లేదు. కిటికీలే పెయింటింగ్స్. రోజంతా కిటికీల వేపు చూస్తూ గడిపేయ వచ్చు. అలా చూస్తూ ఉంటే ఏమిటేమిటో ఆలోచినలు మనసులో మెదులుతూ ఉంటాయి. ఎదో ఒక కొత్త పని క్రియేటివ్ గా చెయ్యాలనిపిస్తుంది.

అందుకనే కొత్త కొత్త  వాటికి ఈ ఊరు పుట్టినిల్లు. "అమెజాన్" "మైక్రోసాఫ్ట్" "బోయింగ్" "స్టా ర్బ క్స్" ,"కాస్టుకో(Costco )". ఎదో చెయ్యాలనే కోరిక ఉంటే, ఎప్పుడో ఒకప్పుడు చెయ్యటానికి వీలుగా అనుకూలమయిన సమయం వస్తుంది. చెయ్యొచ్చు. ఆ చేద్దామనే కోరిక మాత్రం నిరంతరం ఉండాలి.

ఇక్కడ ఒకటే ఒక పెద్ద ప్రాబ్లమ్. ఎప్పుడో ఒకప్పుడు చలికాలంలో ఒక రోజు ఒక అంగుళం స్నో పడుతుంది. అంతే దాదాపు జీవితం స్థంభించి పోతుంది. స్నో తీసే పరికరాలు లేక రోడ్లన్నీ స్నోతో  నిండి పోయి ఉంటాయి. సందులు గొందుల్లో గార్బేజ్ తీసుకు వెళ్లే బళ్ళు కదలటానికి వీల్లేక అవి రావు. కార్లు స్నోలో నడపటం చాలామందికి చేతకాదు. అందుకని ప్రమాదాలు. రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రత పెరిగి స్నో అంతా కరిగిపోతుంది. అప్పటిదాకా జీవితం కొంచెం మందగిస్తుంది. చికాగోలో సంవత్సరాలు గడిపిన నాలాంటి వాళ్ళకి ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది.

ఇంకో విచిత్రం ఇక్కడ మీరు ఇంట్లో కూరగాయలు తరుగు తున్నప్పుడు పారవేసే వ్యర్ధ పదార్ధాలని మునిసిపాలిటీ వాళ్ళు తీసుకుని "కంపోస్ట్" క్రింద మారుస్తారు. ప్రతి వారం గార్బేజ్, రీసైకిల్ తో పాటు మునిసిపాలిటీ వాళ్ళు దీనిని వేరే డబ్బాలో వేస్తే తీసుకుంటారు.

చికాగో తిరిగి వెళ్ళటానికి పెట్టెలు సర్దుకుంటున్నాము.  జీవితంలో మనం అనుకోని సంఘటనలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఒకరినుండి ఒకరికి సోకి ఇంటావిడ నలత పడింది. దానితో క్వారంటైన్ . ADU లో నా వంట. చిన్నప్పుడు ఇంట్లో నేర్చుకున్న మాటలు, స్కిల్స్ (అన్నం వండటం వగైరా ) బాగా ఉపయోగపడ్డాయి. "మంచి నీళ్లు పోస్తా గ్లాస్ బయట పెట్టు", "కాఫీ, టిఫిన్ తలుపు దగ్గర పెట్టాను. తీసుకో", "భోజనం గుమ్మం దగ్గర పెట్టాను. తీసుకు తిను". "ఇవ్వాళ కూర లేదు పచ్చడి  ముద్దే". "స్నానం చేసి బట్టలు ఉతికి ఆరేసుకో, వాటిని అన్నిటితో కలపవోకు ", ఈ మాటలన్నీ చిన్నప్పుడు ఇంట్లో నాన్న అంటూ ఉంటే నేర్చుకున్నవే. అన్నీ వాడుకున్నాను.

తిరుగు ప్రయాణానికి కొన్న టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని , ఇంకో ప్లేన్ లో టికెట్స్ కొనుక్కొని, వారం అనుకున్నది పది రోజుల తర్వాత, ప్లేన్ లో మాస్కులు పెట్టుకుని, జాగర్తగా ఇంటికి  జేరాము.

Friday, June 10, 2022

196 ఓ బుల్లి కథ -- ఓ కన్నీటి బొట్టు

ఈ రోజు ఓ కన్నీటి బొట్టు తో, నా అశృ నయనాలతో మీకు కృతజ్ఞలతలు చెప్పుకుంటున్నాను. మీ మీ ఇళ్లకు వచ్చినప్పుడల్లా, విడిచి పెట్టకుండా దానిని గురించి అడిగే వాడిని . మీరు విసుక్కోకుండా  దానిని గురించి చెప్పేవారు. అంతేకాదు దానిని చూపించి ఎల్లా పని చేస్తుందో కూడా చెప్పేవారు. ఆ చెప్పే సమయంలో మీ మీ కన్నులలో మెరిసే స్పార్క్స్ నన్ను ఉత్తేజ పరిచేవి. 

నేనూ ఎన్నో అనుకున్నాను. దానితో ఏవేవో కొత్త కొత్తవి చేద్దామని కొత్త పుంతలు తొక్కుదామనీ. యాఫ్ఫ్ట్రాల్ ఒక కొత్త మెషిన్ కొనుక్కుంటే దానితో కొత్త పనులు చెయ్యకపోతే ఎలా ! ఇంటర్నెట్ అంతా వెదికాను కొత్త మోడల్ వచ్చిందేమో చూద్దామని. మీ వన్నీ పాత మోడల్స్ కదా (మీరేమీ అనుకోవోకండి).  కొన్ని నచ్చాయి కానీ ఖరీదు ఎక్కువ. కొన్ని చూడటానికి బాగుండలేదు. మన ఇంటి డెకోర్  కి సరిపోవాలి కదా. ఇటువంటి సందిగ్ద పరిస్థుతులలో మా ఆవిడకి  నా కొత్త ప్రాజెక్ట్ గురించి నా సందిగ్దావస్థ గురించి చెప్పాను. ఇంట్లో వంటింటి కౌంటర్ ఆధీనురాలు ఆవిడే కదా !

తను నాకు 100% సపోర్ట్ ఇస్తానని చెప్పింది. అది నాలో నూతన ఉత్సాహము కలిగించింది. కానీ మనసులో తనకి నేను చెప్పినది అర్ధం కాలేదనే శంక ఉండిపోయింది. ఏ భార్య అయినా భర్త చెప్పిన దానికి 100% సపోర్టు ఇస్తుందా!  నేను సరీగ్గా చెప్పి ఉండకపోవచ్చు అని నాకు ఓ చిన్న సందేహం ఉంది. దీనిలో తన తప్పు ఏమీలేదు. ఉత్సాహంతో ఎగ్జైట్మెంట్ తో ఉన్నప్పుడు నాకు  మాటలు సరీగ్గా రావు. 

వాటిని ఎంచుకోవటం చాలా కష్టంగా ఉందని చెప్పాను. తాను ముందర దానితో ఏమి చెయ్యాలనుందో ఆలోచించుకోమంది. ఆ తరువాత వాటికోసం వెతకటం మొదలు పెట్టమని  చెప్పింది. ఆ సెలెక్ట్ చేసిన వాటిల్లో ఇంటి డెకోర్ కి సరిపోయేది  సెలెక్ట్  చేయటం సులభం అంది. అది మంచి సలహా. అందుకనే వారిని భర్తల తలలో నాలికలంటారు.

నా ఉత్సాహం రెండింతలయింది. దీర్ఘంగా ఆలోచించటం ప్రారంభించి వాటిని  క్రోడీకరించటం మొదలు పెట్టాను. ఇక్కడ చాలా  జాగర్తగా ఉండాలి. మీ కొత్త కొత్త ఐడియాస్ అన్నీ చెప్పేస్తే, గిట్టని వాళ్ళు అవి చెత్త అని తోసిపారేస్తారు. గిట్టిన  వాళ్ళు  అవి కష్టమేమో అని ఉత్సాహం మీద నీళ్లు చల్లచ్చుఁ . అందుకని నేను చాలా ఆలోచించి, అసలు చేద్దా మనుకున్నవి రహస్యంగా పెట్టుకుని,  అందరికీ అర్ధమయ్యే చిన్న చిన్న పనులు చెయ్యటాన్ని గురించి చెప్పాను. మీ మీ కొత్త ఐడియాస్ ఎవ్వరికీ, చివరికి భార్యకు కూడా, చెప్పవలసిన అవుసరం లేదు. పెళ్లి కాంట్రాక్టులో ఇది లేదు. ఒకవేళ నా  ప్రాజెక్ట్  ఫెయిల్  అయితే రిటర్న్ చేసి డబ్బులు తెచ్చుకోవచ్చు అని చెప్పంగానే, నాకు కొనటానికి ఓకే వచ్చింది.

వెంటనే walmart లో ఆర్డర్ చేశాను . వారంరోజుల్లో అది ఇంటికి వచ్చింది. ఉత్సాహంగా అన్నీ ఊడదీసి సెటప్ చేశాను. మా స్నేహితులని మా ఇంటికి వచ్చి మా కొత్త మెషిన్ ని ప్రారంభోత్సవం చెయ్యమని అడిగాము. వారు (AVL ,శోభ దంపతులు ).  మా కోరికను మన్నించి మా ఇంటికి వచ్చి బొట్టుపెట్టి దాన్ని ప్రారంభోత్సవం చేశారు. వారికి మా కృతజ్ఞతలు. 

ఒక నెల రోజులు ప్రయత్నించాను. పాత వంటలే దానిమీద చేయలేక పోయాను, ఇంక కొత్త  వంటలు సృష్టించటం ఎక్కడ ? చెప్పద్దూ  ఫ్రెంచ్ ఫ్రైస్ బాగానే వచ్చాయి. సగ్గుబియ్యం వడియాలు కూడా బాగా వచ్చాయి. కానీ ఆ రెండూ రోజూ తినము. గంట కష్టపడి చేసిన సగ్గు బియ్యం వడియాలు అయిదు నిమిషాల్లో అయిపోయినాయి. పెట్టిన కష్టానికి సరిఅయిన ఫలితం రాలేదని బాధ. చివరికి ఓటమిని అంగీకరించక తప్పలేదు. అనుకున్న ప్రకారం  తిరిగి ఇచ్చేయవలసి వచ్చింది. 

రిటర్న్ చేద్దా మనుకున్న కున్న రోజు రానే వచ్చింది. దాన్ని  శుభ్రం చేసి జాగర్తగా ప్యాకేజ్ లో  పెట్టాము. వాతావరణం చక్కటి సూర్యరశ్మి తో ప్రకాశిస్తోంది. కానీ ఎక్కడలేని నిశ్శబ్దం. మనస్సు  ఏదో శంకిస్తూనే ఉంది. walmart రిటర్న్ కౌంటర్ దగ్గరకి వెళ్ళాము. మేము రెండో వాళ్ళము. సంతోషించాము. ఎంతసేపటికీ కౌంటర్ దగ్గరున్న మా ముందర ఉన్న అమ్మాయి పని తెమలట ల్లేదు. చివరికి రిటర్న్ లో కంప్యూటర్లు పని చెయ్యటల్లేదని చెప్పారు. ప్యాకేజీ ని ఇంటికి తీసుకు వచ్చాము. 

మర్నాడు  మళ్ళా వెళ్ళాము. నాకు రిటర్న్ చెయ్యాలనంటే బాధగా ఉంది.  నేనే కాదు ప్రకృతి కూడా ఆరోజు శోకించింది. ఆకాశం అంతా మేఘాలతో నిండివుంది. పార్కింగ్  లాట్ లోనుండి కార్ట్ లో దాన్ని రిటర్న్ చెయ్యటానికి తీసుకు వస్తుంటే హఠాత్తుగా ఆకాశం నుండి ప్యాకేజ్ మీద చినుకులు పడటం మొదలయింది. సున్నితంగా దాని మీద నా గొడుగు వేసి తడవకుండా చేసి లోపలి వచ్చాము . నాకు దానిమీద ప్రేమ ఇంకా పోలేదు. నెల రోజుల అనుబంధం కదా ! 

walmart  లో రిటర్న్ కౌంటర్ పనిచేస్తోంది. క్యూలో ఎవ్వరూ లేరు. మా ఆవిడ నా ముఖంలో బాధ కనపడుతోంది అని చెప్పింది. బాధ పడద్దని ధైర్యం చెప్పింది. రిటర్న్స్ తీసుకునే కుర్రది నా బాధని పట్టించుకోలేదు. ఒక నిమిషంలో మీ ఎకౌంటు లో డబ్బు పంపిస్తున్నాము అని చెప్పి కార్ట్ ను అక్కడ పెట్టమంది. చివరిగా నేను ప్యాకేజ్ ఉన్న కార్టుని రిటర్న్ వస్తువులు పెట్టిన స్థలంలో పెట్టి, దాన్ని మృదువుగా స్పృశించి, బాధగా వీడ్కోలు చెప్పి దిగులు ముఖంతో బయటకు వచ్చాను. పక్కనున్న మా ఆవిడ కొంచెం నాకు ధైర్యం చెప్పి ఉపశమనానికి "సబ్  వే "  వెజ్జీ మాక్స్ విత్  ఇటాలియన్ బ్రెడ్"  ని కొనిపెడతానని చెప్పింది. దానితో నాకు జీవితం మీద కొంచెం ధైర్యం వచ్చింది.


గుడ్బై మై డియర్ ఎయిర్  ఫ్రయర్ .

**** "ఎయిర్  ఫ్రయర్" వేడి గాలులతో దానిలో పెట్టిన వస్తువులని ఉడక పెడుతుంది. వేసవి  కాలంలో గుంటూరు లాగా.

Sunday, December 26, 2021

187 ఓ బుల్లి కథ -- స్నో ఇన్ సియాటిల్

Snow in Seattle 




"స్నో ఇన్ సియాటిల్ " అంటే దాదాపు హైదరాబాద్ లో "స్నో"  పడినంత విచిత్రం. "సియాటిల్ 'Seattle ' " పట్టణం అమెరికాలో "వాషింగ్టన్ "అనే రాష్ట్రం లో పడమటి తీరంలో సముద్రం పక్కన ఉంటుంది. సామాన్యంగా చలికాలంలో కొద్దిగా చలిగా ఉంటుంది కానీ "స్నో" పడటం అనేది సామాన్యంగా ఉండదు. ఈ సంవత్సరం క్రిస్మస్ కాలంలో స్నో పడటం అనే "White Christmas "  ఇక్కడ చాలా అరుదు. ప్రకృతి వైపరీత్యం. 

ఒక నెల రోజులు పిల్లల దగ్గర గడపటానికి చికాగో నుండి రెండు రోజుల క్రిందట సియాటిల్  వచ్చాము. కొన్ని ఏళ్ళ క్రిందట ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా పుట్టింటికి వెళ్తున్నట్లు ఇక్కడికి వచ్చే వాళ్ళం. ఇప్పుడు చికాగో నుండి అదే నాలుగు గంటల విమాన ప్రయాణం ఒక యుగం లాగా తయారయింది. బహుశ దీనికి కారణం "సెక్యూరిటీ చెక్" లు కోవిడ్ లూ అయ్యుంటాయి. ఒకప్పుడు ఆనందించే విమాన ప్రయాణం, ఎప్పుడు అయిపోతుందా ఇంటికి ఎప్పుడు జేరుతామా అనే తీరుకు వచ్చింది. దానికితోడు పరిగెడుతున్న వయస్సు కూడా ఒక కారణం కావచ్చు.

మేము ఇంటికి రాంగానే "క్రిస్మస్ ట్రీ" పెట్టి "ఆర్నమెంట్స్" తో  అలంకరించి దీపాలు వెలిగించాము. "క్రిస్మస్ ట్రీ"  చిమ్నీకి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. చిమ్నీ లో నుంచి దూరి వచ్చి ప్రెజంట్సు ఇచ్చే "శాంతాక్లాస్ " ని ఇబ్బంది పెట్ట కూడదు కదా ! స్కూల్ పిల్లలు ఈ పండగ కోసం, దానితో వచ్చే ప్రెజంట్స్ కోసం నెలల బట్టీ ఎదురుచూస్తూఉంటారు. రాత్రి పిల్లలందరూ పడుకున్న తర్వాత పిల్లలకీ పెద్దలకీ ప్రెజంట్స్ ప్యాక్ చేశాము. "క్రిస్మస్" రోజు పొద్దున్నే లేచి ఎవరి ప్రజంట్స్ వాళ్ళం తీసుకున్నాము. పిల్లలు వాళ్ళ "లెగో " పజిల్స్ చెయ్యటం మొదలెట్టారు. 

కాఫీ, బ్రేక్ ఫాస్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యింది. సాయంత్రం పండగ భోజనానికి ప్రయత్నాలు మొదలు పెట్టాము. వంటలు చెయ్యటంలో అందరూ తలో చెయ్యి వేశారు. లేకపోతే, "లజానియా ",  వెజిటబుల్ పులావ్ దానిలోకి రైతా, డిజర్ట్ కి "panettone " ఒక్కళ్ళే చెయ్యటం చాలా కష్టం.   

అనుకోని వైట్ క్రిస్మస్ తో పండగ రోజు చల్లగా ముగిసింది. 

Monday, October 25, 2021

179 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 1 (Prasnopanishad )

ఈ ప్రశ్నోపనిషత్ , అధర్వణ వేదము  నుండి గ్రహించ బడినది. అధర్వణ వేదములో మూడు ముఖ్య ఉపనిషత్ లు ఉన్నాయి. అవి  ముండక, ప్రశ్న, మాండూక్య.  అందుకని అధర్వణవేద శాంతి మంత్రం ఈ మూడింటికీ వర్తిస్తుంది.

శాంతి మంత్రం:

ఓం భద్రం కర్ణేభిః  శృణుయామ దేవా:  :   మా చెవులతో మంచి మాటలు  వినుగాక 

భద్రం పశ్యే మాక్షభిర్యజత్రా:   :   బుద్ధితో అర్ధం చేసుకునేటట్లు చేయి 

స్థిరై రంగైస్తుష్టువాగంసస్తనూభిః  :  దేవతలని అనేక సూక్తుల ద్వారా ప్రార్ధించనీ 

వ్యశేమ దేవహితం యుదాయుః  : దేవుడిచ్చిన పూర్ణాయుష్షుని అనుభవించనీ 

స్వస్తి న  ఇంద్రో  వృద్ధశ్రవాః  :  ఇంద్రుడు మాకు మేలు చేయు గాక 

స్వస్తినః  పూషా  విశ్వవేదా :     :   ఈశ్వరుడిని అర్ధం చేసుకునేలా బుద్ధి ప్రకాశం చేయి 

స్వస్తి నస్తార్ క్ష్యో  అరిష్టవేమి: :  నా ఆధ్యాత్మిక ప్రయాణం ఆటంకం లేకుండా చేయి 

స్వస్తి నో బృహస్పతి ర్దధాతు  : నా బుద్ధిని పదును చేసి అన్నీ  అర్ద్మమయ్యేలా చెయ్యి 

ఓం శాంతి: శాంతి: శాంతి:  : ఆది దైవిక , ఆది భౌతిక , ఆధ్యాత్మిక  ఆటంకాలని తొలగించు 

ఓ దేవతలారా మా చెవులతో శుభప్రాయమైనవి విని, కళ్ళతో శుభప్రాయమైనవి చూస్తూ, వాటిని అర్ధం చేసుకునేలా బుద్దిని ప్రసాదించి, మమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యముతో ఉంచి, ఆపదలలో నుండి రక్షిస్తూ, మా ఈ ఆధ్యాత్మిక  జీవితాన్నీఆటంకాలు లేకుండా ముందుకు తీసుకు వెళ్ళండి.

జీవితంలో మనకు తెలియని సంగతులు తెలుసుకోవాలంటే మనకు వాటిని గురించి చెప్పేవాళ్ళు ఉండాలి తెలుసుకోవాలనే మన ప్రయత్నమూ కావాలి. వీటన్నింటికన్నా ముందర మనకి ఎవరన్నా చెబితే అర్ధం చేసుకునే శక్తి ఉండాలి. దీనితోపాటు ఆరోగ్యం సరీగ్గా ఉండాలి. మన ప్రయత్నాలకు అడ్డంకులు రాకుండా ఉండాలి. వీటిలో మనం చేసే ప్రయత్నం తప్ప మిగతావన్నీ ఇతరుల మీద ఆధారపడి నవే. ఈ ప్రపంచంలో మన మొకళ్ళమే చేయగలిగినవి చాలా తక్కువ. అది ఎప్పుడూ మనం గ్రహించి ఉండాలి.

ఈ ప్రశ్నోపనిషత్ లో  ఆరుగురు చదువుకున్న  శ్రోత్రియులు ఒక గురువుగారి దగ్గరకు వెళ్ళి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు. 

తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉందని తెలుస్తోంది గానీ, తాను చెబితే వాళ్ళకి  గ్రహించగల శక్తి  ఉన్నదో లేదో గురువుగారికి సందేహంగా ఉంది. నాకు ఇక్కడ "శుభోదయం" సినీమా, దానిలో హీరో గుర్తుకు వస్తున్నారు. 

IIT లలో చదవాలని చాలామందికి కోరిక ఉంటుంది. పెద్ద ఉద్యోగాలూ పెద్ద పదవులూ వాటితో వచ్చే సంపద అందరికీ ఇష్టం. కోరిక మాత్రమే IIT ప్రవేశానికి అర్హత కాదు గదా, IIT వాళ్ళకి వీళ్ళు పాఠాలు గ్రహించ కలిగే శక్తి  ఉన్నదో లేదో తెలియాలి కదా. అందుకే ప్రవేశ పరీక్షలు పెడతారు. 

అందుకనే గురువుగారు " అబ్బాయిలూ మీకు తెలుసుకోవాలనే కోరిక ఉన్నది సంతోషం. మీరు ఒక సంవత్సరం పాటు సుఖాలకి అతీతంగా ఆశ్రమ క్రమశిక్షణలో నా దగ్గర ఉండి శిష్యరికం చేయండి. అప్పుడు మీరడిగిన ప్రశ్నలకి నాకు సమాధానం తెలిస్తే నాకు చెప్పాలని అనిపిస్తే మీకు తప్పకుండా చెబుతాను " అంటాడు. 

గురువుగారి పేరు  పిప్పలాద మహర్షి ,  శిష్యుల ఆరుగురి పేర్లు , సుకేశ భరద్వాజ, శైబ్య సత్యకామ, సౌర్యాయణీ  గార్గ్య, కౌసల్య అశ్వలాయన, భార్గవ వైదర్భి , కబందీ  కాత్యాయన. 

అమెరికా లో పేరుపెట్టేవిధానం, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లు,  ఇక్కడి నుండే నేర్చుకున్నారే మో  !.

సంవత్సరం అయిపొయింది గురువుగారికి శిష్యుల మీద నమ్మకం కలిగి వారి ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి ఉపక్రమిస్తారు.

వచ్చే పోస్టుల్లో గురు శిష్యుల సంవాదం గురించి తెలుసుకుందాము.

తెలుగు చదవటం చేతకాని వాళ్ళకోసం (మా పిల్లలకోసం  ) క్రింద ఇంగ్లీష్ లో వ్రాస్తున్నాను.

Prasnopanishad is one of the three major Upanishads taken from Atharva Veda. The other two being
Mundka and Mandukya Upanishads.

Six students of Vedanta reached the ashram of Pippalada Maharshi and respectfully requested him to shed light on some of their doubts in Vedanta, the Hindu philosophy. The Maharshi was not able to assess the ability of the students to grasp the subject. So he wanted them to stay in his Ashram for a period of one year following all the rules and regulations of the Ashram. After that, he will try to answer their questions if he knows the answers. The students agreed to it and spent one year in the Maharshi Ashram under strict controls of the Ashram. 

Prasnopanishad is the documentation of the question answer session between teacher and students.

Monday, September 13, 2021

175 ఓ బుల్లి కథ -- అమెరికాలో మా తోట

   


అమెరికాలో సెప్టెంబర్ మొదటి సోమవారం "లేబర్డే" వస్తుంది. ఆ రోజు అందరికీ శలవ. అధికారికంగా వేసవి వెళ్లిపోయినట్లు లెక్క. వాతావరణం కూడా చల్లబడుతుంది. పెరట్లో వేసిన మొక్కలు కి కూడా ఇది చివరి నెల. అన్నీ వాడిపోయి విడిపోయి రాలిపోతాయి. ఈ సంవత్సరం గోంగూర, దోసకాయ, బీరకాయ, చిక్కుడు, టమాటో, ఎల్లో స్క్వాష్ వేశాము. దోసకాయలు బాగా వచ్చాయి. గోంగూర బాగా వచ్చింది. ఒక పది బీరకాయలు వచ్చాయి. మిగతావన్నీ నామకః పెరిగాయి గానీ ఉత్పత్తి చాలా తక్కువ. 
పెరట్లో తోట ఉంటే ఆ కిక్ వేరు. గోంగూర పచ్చడి ఎన్ని సార్లో చేసుకున్నాము. దోసకాయలతో చాలా చేశాము. దోసకాయ పచ్చడి ఎక్కువగా చేశాము , దోసకాయకూర, పప్పు వారానికి ఒకసారి. రెండేళ్ల క్రిందట మా మరదలు పద్మ రోజూ పెరట్లోకి వెళ్ళి ఏదో కోసుకువచ్చి కూరో పప్పో పచ్చడో చేసేది. పచ్చి  టమాటో తో పచ్చడి చాలా బాగుంటుంది. రెండు బీరకాయలు ఒకపూట కూరకి సరిపోతాయి. లేత బీరకాయ కూర లేత తాటి ముంజలు తిన్నట్లు ఉంటుంది. రాత్రి పూట లేత బీరకాయలతో చేసిన కూర తింటూ ఉంటే "కఠెవరం" లో చిన్నప్పటి రాత్రిళ్ళు బాసీపెట్టు వేసుకుని బయట కూర్చుని కంచాల్లో అన్నం తిన్న రోజులు గుర్తుకువచ్చాయి. మాఇంట్లో ఎందుకో బీరకాయ కూర రాత్రిళ్లే చేసేవాళ్ళు. ఎల్లోస్క్వాష్ పప్పు చాలాబాగుంటుంది. చిక్కుడే సరీగ్గారాలేదు. కాకరకాయ వేశాముగానీ మొక్కే రాలేదు. వేసవిలో grandkids వస్తే కుండీలో గుమ్మడి గింజలు నాటించి మొక్కలు వస్తే తోటలో వేయించాము. మొక్కలు మాత్రం బాగా పెరిగాయి గానీ పెద్ద గుమ్మడి కాయలు రాలేదు. పిందెలు మాత్రం ఉన్నాయి. 

ఇంకా రెండు నెలల్లో చెట్ల ఆకులు రాలిపోయి చెట్లన్నీ మోడులు అవుతాయి. ఆ తరువాత "స్నో" , చలి. మళ్ళా  అందరం ఏప్రిల్ కోసం ఎదురు చూడటం. విత్తనాలు ఇంట్లో వేసి మొక్కలని పెంచటం. "మే" లో వాటిని తోటలో నాటి రోజూ నీళ్ళుపోసి ఎంతవరకూ పెరిగాయో చూడటం. జీవితమే ఒక రంగుల రాట్నం అలా "ఆశా" "నిరాశ" లతో కదిలిపోతూ ఉంటుంది. 


Monday, July 12, 2021

170 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ -1 (Ishopanishad)

ఈ ఉపనిషత్ ని ఈశావాస్య ఉపనిషత్, ఈశో పనిషత్ అనికూడా అంటారు.  దీని పేరు మొదటి శ్లోకం మొదటి అక్షరాల నుండి వచ్చింది. ఇది శుక్ల యజుర్వేదము నుండి గ్రహించ బడినది. దీనిలో 18 మంత్రాలు (శ్లోకాలు) ఉన్నాయి. శంకరాచార్యునికి ,వివేకానందునికి, మహాత్మా గాంధీకి ఇష్టమయిన ఉపనిషత్  ఇది.

ఇది చాలా క్లిష్టమయిన ఉపనిషత్. భావాలు అర్ధమవటానికి కొంచెం కుస్తీ పట్టాలి. నాకర్ధమయినంతలో మీకు విశదీకరిస్తాను.

ఒక గింజ నుండి మొక్క వస్తుంది. మళ్ళా ఆ మొక్క పెరిగి పెద్దదయి గింజలు తయారు చేసి ఇస్తుంది. ఆ గింజ నుండి మళ్ళా ఇంకొక మొక్క వస్తుంది. గింజకి మొక్కగా మారే జ్ఞానం ఉంది అల్లాగే మొక్కకి గింజ తయారు చేసే జ్ఞానం ఉంది. That is  complete (గింజ) This is  complete (దాని నుండి వచ్చిన మొక్క).

అల్లాగే ఆడపిల్ల పెద్దదయి తల్లిగా పిల్లలని కంటుంది. పిల్లలు పెద్దయి వాళ్ళల్లో ఆడపిల్లలు తల్లులుగా మారుతారు. తల్లికి పిల్లల్ని కనే ఉపకరణములు ఉన్నాయి. అల్లాగే ఆడ పిల్లలకి తల్లులయే పరిస్థితి ఉంది. That is  complete (తల్లి ) This is  complete (తల్లి నుండి వచ్చిన పిల్ల ).

పై చెప్పిన రెండు వాస్తవాలని పరిశీలిస్తే మనమొకటి గమనించవచ్చు. రెంటిలోనూ తననుండి కొత్తవి సృష్టించబడుతున్నాయి. వాటన్నిటిలోనూ ఆ సృష్టికి కావలసిన సరంజామా అంతా ఉంది. అంటే ఆ సృష్టికి కారణమైన శక్తి (energy ) ఒకటి (రూపములు మారుతున్నా) వాటిల్లో ఉంది అని తెలుస్తోంది. ఇటువంటి శక్తి స్వరూపాలు "గాలాక్సిస్" నుండి "డార్క్ స్పేస్", "బ్లాక్ హోల్ " దాకా జగత్ లో కోకొల్లలు. అందుకనే స్వయం శక్తి తో కూడుకున్న ఈ జగత్ "పూర్ణం" (complete ) అని చెప్పొచ్చు. 

ఇటువంటి పూర్ణమైన జగత్ ని సృష్టించటానికి మూలకారణ మైన శక్తికూడా "పూర్ణం" అయి ఉంటుంది. ప్రతి జీవి లోని జీవాత్మ ఆ పరమాత్మ అంశమే.

దీనినే శుక్ల యజుర్వేదము లోని శాంతి మంత్రం చెబుతోంది.

ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే   : అది పూర్ణం(అనంతం) ఇది పూర్ణం ఆ అనంతము నుండి ఈ అనంతం (ప్రపంచం) ఉద్భవిస్తోంది  

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే  : అనంతం నుండి అనంతం తీసివేస్తే పూర్ణమేవ (అనంతమే)  అవశిష్యతే(మిగులుతుంది)

ఓం శాంతి: ఓం శాంతి: శాంతి: : ఓం శాంతి: శాంతి: శాంతి :

పూర్ణ మదః  పూర్ణమిదం :అది పూర్ణం(ఆ అనంతం complete ) దాని నుండి వచ్చిన ఇదిపూర్ణం (అనంతం complete  )

అందుకే ఆ  ("That ")  "పూర్ణం" నుంచి పుట్టింది కాబట్టే ఈ "పూర్ణం" (ఈ జగత్ ) రోజూ తనపని తాను చేసుకుపోతోంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, వర్షాలు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. జీవించటానికి ఆహారం లభ్యమవుతోంది. జీవులు పుడుతున్నారు. పోతున్నారు. కాల చక్రం మన ప్రమేయంలేకుండా ముందుకు సాగిపోతూ ఉంది. 

Summary written in English for people who do not know how to read Telugu.

The seed makes a plant. The plant makes a seed. It is automatic and complete. The cycle repeats.

The mother delivers a baby girl. The baby girl after some years becomes a mother. It is automatic and complete.

Those real world examples suggest that this world, which is full of those cycles, is complete (Poornam) as we know. Shanti mantra of the upanishad says This poornam came from That poornam.

We do not know what "That"  is but we know "This", what came out of "That" is complete, because we are living in it. Whatever necessary for our survival they are there. The Sun is there Moon is there, Water is there, Wind is there, Plants and Trees are there to feed us. Since because "This" is complete, we can make a conjecture  "That" which created the complete "This"  must also be complete.


క్రింది సమాచారం గూగుల్ నుండి (From Google ) సేకరించినది :

The Law of Conservation of Mass

The same amount of matter exists before and after the change—none is created or destroyed. This concept is called the Law of Conservation of Mass.Jan 13, 2020

Where does energy come from if it Cannot be created?
But at the birth of the Universe – that is, everything – the energy needed for the Big Bang must have come from somewhere. Many cosmologists think its origin lies in so-called quantum uncertainty, which is known to allow energy to emerge literally from nowhere.
దీనినే మనం అనవచ్చు : పూర్ణ మదం (That is Complete). 


నా మాట:
దీనిని అర్ధం చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. క్రింది లింకులు చాలా ఉపయోగపడతాయి.

1.Swami Aparajitananda

2.  The Upanishads

                   Translated and Commentated

                               by

                       Swami Paramananda


                From the Original Sanskrit Text

వేదములు 4000 BC 5000 BC అయి ఉండచ్చని అంటారు. వేదములు మొదట "పర్షియన్" లో 17 వ శతాబ్దములో అనువదించ బడినవి. మీరుతప్పకుండా దీనిలో introduction చదవండి. https://www.gutenberg.org/cache/epub/3283/pg3283.txt


Tuesday, October 30, 2018

146 ఓ బుల్లి కథ -- నైట్ అవుట్ ఇన్ మెన్హాటన్



న్యూయార్క్ దరిదాపుల్లోకి వెళ్ళినప్పుడల్లా మెన్హాటన్ కి వెళ్ళటం ఒక అలవాటై పోయింది. మెన్హాటన్ డౌన్ టౌన్ న్యూయార్క్. న్యూయార్క్ కి "Town never sleeps " అనే పేరుంది. మనకు అవసరాలకు కావలసిన కూరగాయాల నుంచీ హెయిర్ కట్ దాకా ఎప్పుడూ ఎక్కడో ఒక షాపు తెరిచే ఉంటుంది. ఇక్కడ బ్రాడ్వే వీధి నాటకాలకి ప్రసిద్ధి. మేము వచ్చినప్పుడల్లా ఎదో నాటకానికి వెళ్ళి రెస్టారెంట్ లో భోజనం చేసి ఇంటికి వెళ్తాము. కాకపోతే కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు. ఇంతదానికి ఇన్ని డబ్బులు పెట్టాల్సి వచ్చిందే అని బాధ పడాల్సి వస్తుంది. ఒకరోజు రాత్రి సినీమా అయిన తరువాత (ఆదో పెద్ద గాథ ) ఆకలయి రెస్టారంట్ కోసం చూస్తే ప్రతి చోటా జనం క్యూ లో నుంచున్నారు. చివరికి ఒక "వేగన్" రెస్టారెంట్ లో సీట్లు దొరికాయి. నిజంగా చెప్పాలంటే పచ్చ గడ్డి పెట్టి వంద డాలర్లు తీసుకున్నాడు. అందుకనే ఈ రోజు భోజనం చేసి బయలుదేరాము.

ఈ తడవ "LA LA Land " అనే సినిమాకి వెళ్ళాము. ఈ సినీమాకి oscars లో తప్పు చదవటం మూలంగా ఒక క్షణం "Best Picture " అయింది. అబ్బాయి మమ్మల్ని సినిమా హాల్ దగ్గర దింపి, మన పేరు మీద సీట్లు రిజర్వ్ చేశాను టిక్కెట్స్ తీసుకోండి అని కారు పార్క్ చెయ్యటానికి వెళ్ళాడు. నాకు ఎప్పటినుండో కోరిక, టిక్కెట్లు, రిజర్వ్ డ్  కౌంటర్ దగ్గర తీసుకోవాలని, పెద్ద వాళ్ళలాగా ఫీల్ అవ్వచ్చు. సామాన్యంగా ఎడ్వన్చెరస్ పనులకి మా ఆవిడని పంపిస్తూ ఉంటాను. ఆవిడ ఎడ్వన్చెరస్ అని నాకు ముందే తెలుసు. ఎందుకంటే మొగుడు తాళి కట్టి అమెరికాకి వెళ్తే, మూడునెలల తరువాత తను వీసా పుచ్చుకుని అమెరికా వంటరిగా వచ్చింది. ఇది నలభై ఏళ్ళ క్రిందటి మాట. అప్పుడు ప్లేన్లు అమెరికాకి అంచెలంచెలుగా వచ్చేవి. వస్తూంటే మధ్యలో పారిస్ లో ప్లేన్ ఆగిపోయింది "mechanical failure ". సరే అది బయల్దేరి మర్నాడు న్యూయార్క్ చేరేముందర న్యూయార్క్ airport (Kennedy ) లో బస్సు హైజాక్ చేసి రన్వే మీద పెడితే ప్లేన్లు లాండ్ అవటం గొడవయింది. ఇంకొకటి, ఒక ఇరవై ఏళ్ళ క్రిందట దేశం కాని దేశం హాంకాంగ్ లో subway టిక్కెట్లు కొనుక్కురమ్మని పంపించాను. విజయవంతంగా తీసుకు వచ్చింది. అందుకని ఈ మిషన్ కి ఆవిడే తగినదని నిర్ణయించుకున్నాను. వెళ్ళి అడిగింది ఇవ్వనన్నాడు. ఎందుకని అడిగింది. ఏ క్రెడిట్ కార్డు మీద రిజర్వ్ చేశారో చెప్పమన్నాడు. అబ్బాయి ఏకార్డు ఉపయోగించాడో తెలియదు. టిక్కెట్లు రాలేదు. అబ్బాయి కారు పార్క్ చేసి వచ్చి టిక్కెట్లు తీసుకున్నాడు. మా ఆవిడ గొప్పలు చెప్పటానికీ, నేను గొప్పగా ఫీల్ అవటానికీ ఇవాళ అవకాశం లేదు.

"LA LA Land" అంటే అది ఒక విధంగా కృత్రిమ ప్రదేశం అనే అర్ధమొస్తుంది. LA అంటే లాస్ ఏంజెలెస్, "హాలివుడ్" ఉన్న చోటు. ఈ సినీమా ఒక musical. అంటే పాటలు ఉంటాయన్న మాట.ఈ అర్ధంతో చూస్తే మన తెలుగు సినీమాలన్నీ musicals. ఇది "My fair lady ", "Fiddler on the Roof", "Sound of Music" లాంటి musical  కాదు కాకపోతే చాలా పాటలు ఉన్నాయి. మొదటి పాట "LA " హైవే మీద ట్రాఫిక్ జామ్ లో మొదలవు తుంది. అక్కడే అమ్మాయి అబ్బాయి  కలుసుకుంటారు కూడా. అమ్మాయి త్వరగా కారు ముందుకి నడపదు. వెనక కారులో ఉన్న అబ్బాయికి కోపమొచ్చి తన కారు పక్క లైన్ నుండి తెచ్చి అమ్మాయి కారు పక్కకి పెట్టి, డ్రైవర్లు పంచుకునే భీకర సౌజ్ఞలతో ఇద్దరూ పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జీవించటం. ఎవరి అభిరుచుల ప్రకారం వారు ఉద్యోగాలు చెయ్యాలని నిర్ణయించుకోవటం. ఈ నిర్ణయం తో చివరికి వారాల  తరబడి అమ్మాయి గారు  ఒక చోట, అబ్బాయి గారు దేశంలో ఇంకోచోటా, ఉండటంతో, అమ్మగారు అలిగి వెళ్ళిపోవటం జరుగుతుంది. అబ్బాయి గారు ఇంటికి వచ్చేసరికి అమ్మాయి గారు ఉండరు. కానీ అమ్మాయి గారిని ఒక సినీమా కోసం audition కు రమ్మనే మెసేజ్ ఉంటుంది. అమ్మాయిగారు ఎక్కడున్నారో వెతుక్కుంటూ పోయి ఆ మెసేజ్ ఇచ్చి ఆడిషన్ కి వెళ్ళమని ప్రోత్సహిస్తాడు. మిగతా కధంతా మామూలే. అమ్మాయిగారు పెద్ద నటి అయి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని పిల్లాజెల్లా తో హాయిగా ఉంటుంది. అబ్బాయి గారు రెస్టారంట్ లో పియానో వాయించే రోజూ వారీ పనివాడుగా మిగిలిపోతాడు.

సినీమా అవగానే వెతుక్కుంటూ కారు దగ్గరకి వెళ్ళి ఇంటికి జేరాము. రాత్రి పూట వెతికితే మెన్హాటన్ లో కూడా వీధి పార్కింగ్ దొరుకుతుంది. లేకపోతే సినీమా కన్నా పార్కింగ్ కి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది.

(ఇది సంవత్సరం కింద ఎప్పుడో వెయ్యాల్సిన పోస్ట్. ఇప్పటికి వెలుగు చూసింది)


Monday, May 15, 2017

136 ఓ బుల్లి కథ 124 ---- మన మెదడు (Brain ) ఎల్లా పనిచేస్తుంది ? - Part 5

మెదడు రక్షణ కవచాలు 
The Blood-Brain Barrier, The Meninges and Cerabrospinal Fluid. 

ప్రకృతి మనం జీవించేందుకు రెండే రెండు పనులు చెయ్యమని మన చేతుల్లో పెట్టింది. అవి తినటం, తాగటం. మనుషులు కష్టపడుతారేమోనని వాటికి కావాల్సిన వాటిని కూడా తనే సృష్టించింది. చెట్లద్వారా తినటానికి ఆహారం. నదులద్వారా తాగటానికి నీరు సృష్టించింది. అది చెప్పేది ఒకటే "నేను సృష్టించిన వాటిని ఆహారంగా తిను. నేను వాటిలోని పోషక పదార్ధాలను వేరుచేసి రక్తంలో కలుపుతాను. నీళ్ళు తాగు. ప్రవహించే నీళ్ళని రక్తంతో కలిపి, అవయవాలకి పోషక పదార్ధాలు అందేటట్లు చేస్తాను. ఈ రెండూ సరీగ్గా చేస్తే నీలో ఉన్న జీవుడిని జీవించేటట్టు చేస్తాను". మనమేమో కృత్రిమ పదార్ధాలు తింటూ, తాగుతూ చెయ్యాల్సిన ఆ రెండు పనులనూ screw up చేస్తాము.

మనం జీవించటానికి మెదడు చాలా ముఖ్యం కనక, మానవుడు ఏమి తింటాడో ఏమి తాగుతాడో నమ్మకంలేక, సృష్టి మన మెదడు లోకి ప్రమాదకరమైన పదార్ధాలు చేరకుండా అడ్డు కట్టలు కట్టుకుంది.

అవే, The Blood-Brain Barrier, The Meninges and Cerabrospinal Fluid. ఇవి రెండూ, అనవసరమైన పదార్ధాలు మెదడులోకి రాకుండా చూసుకుంటాయి.

మెదడులో ఉన్న న్యూరాన్లకి శరీరములో ఉన్న అన్ని కణాల లాగే శక్తి కోసం ఆక్సిజన్, షుగర్ (glucose) అవసరం. ఈ రెండూ మెదడులోకి తేలికగా వెళ్ళి పోతాయి.

అల్లాగే మద్యం (alcohol ) గూడా తేలికగా మెదడులోకి వెళ్ళి పోతుంది. ఎందుకు మద్యం అంత చొరవగా మెదడు లోకి వెళ్తుందో తెలియదు కానీ దాని వలన కలిగే పరిణామాలు తెలుసు. మొదట మద్యం చేసేపని మెదడులో inhibition area మీద. మనుషులు తాగిన తర్వాత ఏ సంకోచమూ లేకుండా అందరితో కలుపుగోలుగా తిరిగి మాట్లాడుతారు. అందుకనే ప్రతీ డిన్నర్ ముందర అమెరికాలో cocktail hour అని ఉంటుంది. మద్యం ఇంకొంచెం శృతిమించి రాగాన పడితే వచ్చేవి, slowed reaction time, చూపు సరీగ్గా లేకపోవటం, న్యూరాన్స్ సరీగ్గా పని చెయ్యక పోవటం మూలంగా సంగతులు గుర్తుండక పోవటం. ఇంకా తాగుడు ఎక్కువయితే Blood-Brain Barrier సరీగ్గా పనిచేయక మెదడు లో సమస్యలకి దారి తీయ వచ్చు (Stroke, Alzheimer's, dementia etc ).

మద్యం లాగానే caffeine కూడా తేలికగా barrier దాటి వేళ్ళ గలదు అని శాస్త్రజ్ఞులు గ్రహించారు. అంతేకాదు రోజుకో కప్పు కాఫీ తాగితే Alzheimer's ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని కూడా తేల్చారు. రోజుకి ఒక కప్పు కాఫీ తాగితేనే ఇది వర్తిస్తుందిట.

మన మెదడు చుట్టూతా meninges అనే మూడు పొరలు ఉంటాయి. ఈ పొరల మధ్యన Cerabrospinal Fluid ఉంటుంది. మెదడు ఈ ద్రవంలో తేలుతూ ఉంటుంది. ఈ పొరలు మెదడుకి కావలసిన పోషక పదార్ధాలు లోపలికి పంపుతూ దాని వ్యర్ధాలు తీసుకుని బయటకు పంపుతుంది. Meningitis అనే వ్యాధి ఈ meninges bacterial infection మూలాన వస్తుంది. lumber puncture ద్వారా ఈ Cerabrospinal Fluid ను తీసి మెదడుకి సంబంధించిన వ్యాధులని నిర్ధారించ వచ్చు. ఇక్కడ ఒక మాట తప్పకుండా చెప్పుకోవాలి. కొన్ని సంవత్సరాల కిందటి వరకూ ఈ Cerabrospinal Fluid లో రోగనిరోధక కణములు (immune cells ) కనపడితే అది ఒక జబ్బుకి సంబంధించినవని అనుకునే వారు కానీ ప్రస్తుత కాలంలో అవి మనస్సుకి సంబంధించిన రోగ నిరోధక చర్యలలో కీలక మైనవని గుర్తించారు. ఇంతెందుకు Neuroimmunity అనే కొత్త పంధాలో పరిశోధనలు చేస్తున్నారు. అంతే కాదు బ్రెయిన్ వ్యాధులు తగ్గాలంటే శరీర వ్యాధి నిరోధక శక్తి (immunity) ఎక్కువగా ఉండాలి అని తేల్చారు. త్వరలో టీకాలు(vaccination) ద్వారా మానసిక వ్యాధుల నివారణకు (Brain deceases) ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఈ క్రింది పదార్ధాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు . వీటిలో వీలయినవి మీరు రోజూ తినటానికి ప్రయత్నించండి.

Fish and Shellfish, Oils from plants (Olive, Canola etc.), Deep green and dark red/orange vegetables, Citrus fruits and berries, Yogurt, kefir, Oats and barley, Garlic, Black or green tea, Mushrooms(shiitake), Nuts, seeds and beans.

వీటిల్లో మీకు సరిపడే వాటిని ఎంచుకోండి :
ఆలివ్ ఆయిల్ లాంటి నూనెలు, తోట కూర మొదలయిన ఆకు కూరలు, నిమ్మకాయ, నారింజ మొదలయిన పళ్ళు, పాలు, పెరుగు, మజ్జిగా, మొలకెత్తే విత్తనాలు, వేరుశనగ మొదలయిన గింజలు, కంది, పెసర మొదలయిన పప్పులూ, ఓట్స్ , బార్లీ , చిన్న ఉల్లిపాయ, టీ.
మన భోజనంలో అన్నం, పప్పు, కూర, పచ్చడి, పులుసు, పెరుగు ఎందుకు పెట్టారో తెలిసిందా ఇప్పుడు, సమీకృత ఆహారం.

Since Brain is the most important part of the human body, Nature created barriers so that harmful substances can not enter the brain through the blood circulation. These two barriers are The Blood-Brain Barrier, The Meninges and Cerabrospinal Fluid. Because of these blood circulation never enters the brain and the essential nutrients are passed to the brain through these barriers. Doctors use Cerabrospinal Fluid obtained by lumbar puncture to ascertain the health of the brain. At one time immune cells in the fluid marked brain diseases , but now it is determined they play a key role in the regeneration of neurons and repair of brain diseases. This new branch of research called Neuroimmunity will have a huge impact on brain diseases. Latest work on Neuroimmunity points to the development of vaccines for brain deceases.

Following are immune boosting foods:

Fish and Shellfish, Oils from plants (Olive, Canola etc.), Deep green and dark red/orange vegetables, Citrus fruits and berries, Yogurt, kefir, Oats and barley, Garlic, Black or green tea, Mushrooms(shiitake), Nuts, seeds and beans.

మాతృక :
1. Neuroimmunity by Michal Schwartz (2015)
Yale University Press, New Haven, CT USA

Wednesday, February 8, 2017

130 ఓ బుల్లి కథ 118 ---- నిమ్మకాయ నీళ్ళు


మొన్నీ మధ్య "డెన్నీస్" రెస్టారంట్ కి వెళ్ళి కాఫీ తాగటం ఇష్టం లేక "నీళ్ళు " డ్రింక్ గ ఇమ్మన్నాము. సర్వర్ నుండి తర్వాత ప్రశ్నలు "టాప్ వాటర్ "  "లెమన్ వాటర్" "ఐస్" "వితౌట్ ఐస్".

అప్పటి దాకా రెస్టారెంటుల్లో  "లెమన్ వాటర్" సర్వ్ చేస్తారని తెలియదు. సరే  "లెమన్ వాటర్" తెప్పించామనుకోండి, ఒక జగ్ నీళ్ళ లో ఒక స్లైస్ యెల్లో లెమన్ వేశారు. మొన్నీ మధ్య వల్లీ వాళ్ళ ఇంట్లో కూడా  "లెమన్ వాటర్" ఇచ్చారు. (పై బొమ్మని Lemon అంటారు. కింద బొమ్మ Lime.) నిన్న "శ్రవణ్ " గారు  "లెమన్ వాటర్" తో తేనె కలిపి తినటం మంచిదేనా? అని email లో అడిగారు.  దాని ఫలితమే ఈ పోస్ట్.

జీర్ణ ప్రక్రియలో మనం తిన్న ఆహారం షుగర్ (glucose ) గ  మార్చబడి మన రక్త కణాల్లో mitochandria అనే చోట oxygen తో దగ్దమవటం మూలంగా శక్తి (ATP రూపంలో ) విడుదలవుతుంది. ఎప్పుడైనా రసాయనిక మార్పులు జరుగుతుంటే వ్యర్ధ పదార్ధాలు (byproducts ) బయటకి వస్తాయి. వాటిల్లో freeradicals ఒకటి. అవి వెళ్ళి వేటిమీదన్నా కూర్చుంటే  ఆ పదార్ధాల పని తీరు మారి పోతుంది. శరీరంలో జబ్బులు రావటానికి ఈ freeradicals కారణం కూడా ఒకటి. ఈ హడావిడిలో కొన్ని ఆక్సిజన్ atoms  ఉదృత రూపం దాలుస్తాయి. ఉదృత రూపం దాల్చినవి, ఇంకొకళ్ళు సక్రమంగా చేస్తున్న పనిని  చెడగొట్టట మేగా.

At the end of this electron transport chain, the final electron acceptor is oxygen, and this ultimately forms water (H20). At the same time, the electron transport chain produces ATP. (This is why the the process is called oxidative phosphorylation.)

ఇప్పుడు నిమ్మకాయ నీళ్ళకి వద్దాము. నిమ్మకాయ రసంలో antioxidents ఉన్నాయి. శరీరం లో ఆక్సిజన్ atoms ఉదృతం తగ్గించాలంటే antioxidents కావాలి. ఇవి నిమ్మకాయ రసంలో సమృద్ధిగా ఉన్నాయి.

ఒక గ్లాస్ నీళ్లలో ఒక అర నిమ్మకాయ రసం కలపండి. మీ ఇష్టాలని బట్టి తక్కువ ఎక్కువలు చూసుకోండి. మీకు తాగటం కొంచెం కష్టంగా ఉంటె తేనె కలుపుకోండి. తేనె మంచిది. కానీ మార్కెట్ లో కార్న్ సిరప్ కలిపిన తేనె ఎక్కువగా అమ్ముతున్నారు. కల్తీ తేనె (high fructose corn syrup ఉన్న తేనె ) కాకుండా చూసుకోండి. ఇందాక చెప్పినట్లు మీ ఇష్టాలను బట్టి పాళ్ళు నిర్ణ ఇంచు కోండి.

ఇదంతా కష్టంగా ఉంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్లు రోజూ నిమ్మకాయ ఊరగాయ వేసుకుని ఒక అన్నం ముద్ద తినండి. నేను అందుకనే నిమ్మకాయ ఊరగాయ పెట్టి అందరికీ ఇస్తూ ఉంటాను. నా ఇదోరకం దేశసేవ.

Health benefits of drinking lime juice and warm lime water

Every time you drink a glass of lime juice, you not only quench your thirst, you also give your body a lot of health benefits. In spite of the wealth of information about the health benefits of lime, I’m still faced with questions like, “Is lime juice good for you?” Well, take a look at just some of its many benefits and the answer will be clear:
0. Skin care
1. Digestive aid
2. Constipation
3. Supporting healthy blood sugar levels
4. Heart health
5. Respiration
6. Joint care
7. Treatment of scurvy
8. Temperature regulation
9. Weight loss

Thursday, January 28, 2016

121 ఓ బుల్లి కథ 109 --- రోజుకి తీపి ఎంత తినవచ్చు ?

ఈ మధ్య WHO (World Health Organization) వాళ్ళు ప్రపంచ జనాభా మీద పరిశోధనలు జరిపి, ప్రతి ముగ్గిరిలో ఒకరు స్థూలకాయులు (BMI  30 or more ) అని తేల్చారు. స్థూలకాయం అనారోగ్యానికి కారణం అవుతుంది. దీనికి ఒక కారణం మనం తీపి పదార్ధాలు ఎక్కువగా తినటం అవ్వచ్చు.

మనం తీపి పదార్ధాలని చాలా ఇష్టంగా తింటాం. మితంగా తింటే అన్నీ మంచివే కానీ మితానికీ ఇష్టానికీ సఖ్యత ఉండదు. ఎప్పుడూ కొట్లాడు కొంటూ ఉంటాయి. తినటం తగ్గించ లేము.

అసలు ఈ పోస్ట్ వ్రాయటానికి కారణం, స్థూల కాయానికి, డయాబెటీస్ , గుండె జబ్బులకి ఒక విధంగా షుగర్ కారణం కావచ్చని పరిశోధకులు నిర్ణఇంచటమే.

మామూలుగా మనం షుగర్ని రెండువిధాలుగా తీసుకుంటాము. మామూలు షుగర్ గా (కాఫీ లోగా ), పళ్ళు కూరగాయలు తినటం మూలంగా  లేక షుగర్ వేసి చేసిన పదార్ధాలు (కేక్ లు, జాంగ్రీలు వగైరా) తినటం మూలంగా. ఏవిధంగా తిన్నా అది షుగరే. షుగర్ ఒక కార్బో హైడ్రేట్, మనకి శక్తీ నిచ్చేది అదే. కానీ మన శరీరానికి తగ్గట్టు కొన్ని పరిమితుల లోనే తినాలి. ఎక్కువతింటే అనారోగ్యాలకి కారణం అవ్వచ్చు.

శక్తిని కాలరీ లలో కొలుస్తారు. మనము షుగర్ మాత్రమే కాకుండా మిగతావి కూడా తింటాము కాబట్టి, మనకి రోజుకి 2000 కాలరీలు (calories) కావాలను కుంటే వాటిలో 200 కాలరీలు మాత్రమే (10%) షుగర్ మూలంగా రావచ్చని నిర్ణయించారు.

The American Heart Association వాళ్ళు ఇంకా దీనిని తగ్గించారు. రోజుకి ఆడవాళ్ళకి 100 మగవాళ్ళకి 150 కాలరీలు మాత్రమే షుగర్ ద్వారా రావటం ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. అంటే ఒక టీ స్పూన్ షుగర్ లో 16 కాలరీలు ఉన్నాయనుకుంటే ఆడవాళ్ళు రోజుకి 6 టీ స్పూనులు మగవాళ్ళు రోజుకి 9 టీ స్పూనులు మాత్రమే తీసుకో వచ్చు అన్న మాట. 

ఇంకా తేలికగా అర్ధం అవ్వాలంటే మామూలు ఒక 12 ఔన్సుల సాఫ్ట్ డ్రింక్ తాగితే 160 కాలరీలు వస్తాయి. అంటే పది స్పూనుల షుగర్ అన్నమాట. ఒక సాఫ్ట్ డ్రింక్ తాగితే ఆ రోజు మీ షుగర్ కోటా అయిపొయింది అన్నమాట. మీరు బరువు తగ్గాలంటే నూ ఆరోగ్యంగా ఉండాలంటేనూ షుగర్ జాగర్తగా వాడటం మొదలెట్టండి. షుగర్ తో కూడిన సాఫ్ట్ డ్రింక్స్ చేసే చేటు గురించి క్రింద రెండోవ మాతృక చదవండి.  

 1. Healthy Eating
 http://www.mayoclinic.org/healthy-lifestyle/nutrition-and-healthy-eating/in-depth/added-sugar/art-20045328/?utm_source=newsletter&utm_medium=email&utm_campaign=housecall

2.The Drink That Kills 184,000 People Every Year

Tuesday, September 29, 2015

118 ఓ బుల్లి కథ 106 --- నాకు ఏదో ఏదో అయినది

రాత్రి ఇంటికొచ్చేటప్పటికి పన్నెండున్నర అయ్యింది. ఇక్కడ అమెరికా లో అన్నట్లు "hit the sack " ఒంటిగంట అయ్యింది. అరగంట నుండీ దొర్లుతున్నాను నిద్దర పోటానికి.   మనస్సు సరీగ్గా ఉండకపోతే నిద్రపట్టదని పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి ఈనాడు జరిగిన సంఘటలని సింహావలోకనం చేసుకుంటున్నాను. దానికి కారణం వల్లీ గారి ఆవడలు అవ్వచ్చు, రాజుగారి ఇంటి తోటలో కాసిన సొరకాయలవ్వచ్చు లేకపోతే నేను ఫోటో దిగుతుంటే అమాంతంగా దగ్గరకు లాక్కుని భుజం మీద చెయ్యి వేసి ఫోటో తీయించుకున్న లలనామణి అవ్వచ్చు.

శర్మగారింట్లో  భోజనం చేసిన తర్వాత పిచ్చాపాటీ లో వోక్స్ వాగన్ నమ్మకద్రోహం నుండి తెలంగాణాలో కల్లు చావుల దాకా మాట్లాడుకుని, వెళ్దా మను కుంటుంటే  కాఫీ తాగి వెళ్ళండి అన్నారు. వాళ్ళింట్లో కాఫీ బాగుంటుంది. వద్దనలేము తాగాను . అంతకు ముందే శనివారం ఫలహారం, నాలుగు ఇడ్లీలు రెండు ఆవడలు తిన్నాను. వాళ్ళింట్లో ఆవడలు చాలా బాగుంటాయి. తినటంలో ఇడ్లీ మోతాదు తగ్గించి  ఆవడల మోతాదు ఎక్కువ చేస్తే బాగుండేది కానీ టూ లేట్. నాకింకా ఒక ఆవడని సాంబారులో వేసుకుని తింటే ఎల్లా ఉంటుందో చూడాలని ఉంది.

వల్లీ చేసే "ఆవడలు", రాణీ చేసే "బాదుషాలూ", బాబాయి ఇడ్లీల్లా రోజూ దొరకవు. దొరికినప్పుడు ఆస్వాదించటమే. ఆవిడ కాఫీ పౌడర్ అప్పటికప్పుడు తయ్యారు చేసి కాఫీ ఇస్తుంది కాబట్టి, ఇస్తానంటే తాగక పోవటం కూడా బాగుండదు. తాగటం కూడా మంచిదయింది. అప్పుడే బార్ లు మూసేస్తున్నారల్లే ఉంది రోడ్డు మీద కార్లు వంద మైళ్ళ స్పీడ్లో మమ్మల్ని దూసుకు పోతున్నాయి. నేను తూలి పోకుండా మెలుకువగా ఉండి మా ఆవిడని జాగర్తగా డ్రైవ్ చెయ్యమని చెప్తూ వచ్చాను.

చలి మొదలయింది పెరటి తోటలు మాడిపోటం మొదలెడుతున్నాయి. శర్మగారింటికి తోటలోనుండి నలుగురితో పంచుకోటానికి బోలెడన్ని చిక్కుడు కాయలు బీరకాయలు తీసుకు వచ్చాము. రాజుగారు వారి పెరటి తోటలో పండిన సొరకాయలు తీసుకు వచ్చారు. అందరూ సొరకాయల గురించి మాట్లాడు కోవటమే. ఒకరు గిన్నీస్ బుక్ లో  పెట్టచ్చు అని, ఇంకొకరు farmer of  the year అనీ ఏమిటేమిటో అంటున్నారు. అర సంచీ చిక్కుడు కాయలు గొప్పా రెండు సొరకాయలు గొప్పా? ఆయన తెచ్చిన రెండు సోరకాయలూ కోయటానికి ఒక నిమిషం కూడా పట్టదు. మేము గంటసేపు కష్టపడి కోసిన చిక్కుడు కాయలగురించి ఎవ్వరూ మాట్లాడరు. నాకు కనీసం farmer of the day బిరుదు ఇవ్వాలి. నిజం చెప్పాలంటే మా ఆవిడే ఆ చిక్కుడు  కాయలు అన్నీ కోసింది. నాపని తోటకి నీళ్ళు పోయటం వరకే. కానీ ఆడవాళ్ళని farmer of the day అంటే బాగుండదు కదా ! రాజు గారికి ఈ సంవత్సరం తోటలో దోసకాయలు రాలేదుట. వచ్చే సంవత్సరం నేను దోస తీగలు వేసి పండించి farmer of  the year పేరు సంపాయించాలి.

ఇవాళ మధ్యాహ్నం ఇంకో సంఘటన కూడా జరిగింది. నేను Literacy Dupage లో వాలంటీర్ గ  పని చేస్తాను. వాళ్ళు ప్రతి సంవత్సరమూ అందర్నీ పిలిచి ఒక ప్రోగ్రాం పెట్టి సంవత్సరంలో బాగా చదువుకున్న వాళ్ళనీ,  వాళ్ళకి చదువు చెప్పిన వాళ్ళనీ గౌరవిస్తారు. ఈ సంవత్సరం దానికి మా గ్రూప్ లో నలుగురిని ఎంచుకున్నారు. నేను స్టేజి మీదికి ఎక్కి నా బహుమానం తీసుకున్నతర్వాత ఫోటో తీస్తాము ఒకచోట ఆగమన్నారు. సరే ఆగాను. నలుగురూ వచ్చిన తరువాత  ఫోటో తియ్యటానికి రెడీ అవమాన్నారు. నేను వెంటనే నా కళ్ళజోడు తీసి పెట్టుకున్నాను. ఫోటో తీయబోతూ ఉంటే నా పక్కావిడ నన్నుగట్టిగా దగ్గరకు లాక్కుని నా భుజం మీద చేయ్యివేసింది. వెంటనే ఫ్లాష్ వచ్చింది ఫోటో తీసేశారు. ఆ హాల్లో ఉన్న రెండువందల మంది కూడా దీన్ని చూసే ఉంటారు. హడావుడిగా వెంటనే మా టేబుల్ దగ్గరకి వచ్చి ఎందుకైనా మంచిదని జరిగిన సంగతి మా ఆవిడకి చెప్పేశాను. చెయ్యి వేయటం మా ఆవిడ చూసిందట, కానీ మా టేబుల్ లో కూర్చున్న చిన్నది అనుకుందిట. ఆ అమ్మాయి నాకు రెండో పక్కన ఉంది.

అసలు నా ప్రశ్న ఎందుకు ఆవిడ హఠాత్తుగా నా భుజం మీద చెయ్యేసి ఫోటో తీయించుకున్నది అని. నాకు ఆవిడ ఎవరో కూడా తెలియదు. తెలుసుకోకుండా ఏదో మునిగిపోతున్నట్లు పరిగెత్తుకు వచ్చేశాను. కళ్ళజోడు పెట్టుకోంగానే నేను అంత బాగున్నానా లేక నేను అసలు క్యుట్ గ ఉంటానా ? ఎప్పటినుండీ ఆవిడ నాతో ఫోటో తీయించుకోవాలని చూస్తోందో ! ఆ కళ్ళజోడు డాలర్ షాప్ లో కొన్న రీడింగ్ గ్లాస్ లని తెలిస్తే నాతో ఫోటో తీయించుకునేదా ? అంతులేని ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. ఈ మధ్య పోప్ గారు అమెరికా యాత్రలో (sept 25-26,2015) immigrants ని hug చెయ్యమని అన్నారుట. ఎందుకు ఆలోచిస్తారు నిద్రపోండి బహుశా పోప్ గారు చెప్పినట్లు హగ్ చేసుకుందేమో అని మా ఆవిడ అంది కానీ నాకు నమ్మకం కుదరటల్లేదు.

ఎప్పుడు నిద్ర పట్టిందో గుర్తులేదు. మా ఆవిడ  ఆఫీస్ కి వెళ్తున్నాను కాఫీ అక్కడ పెట్టాను తాగమని చెప్తూంటే మెలుకువ వచ్చింది. ఇంటర్నెట్ లో ఎక్కడయినా ఆ ఫోటో అదే ఆ ఫోటో బయటికి వచ్చి మీరు చూస్తే దానిలో నా ప్రమేయం ఏమీ లేదని మీరు తెలుసుకోండి అందరికీ చెప్పండి.   

Thursday, June 25, 2015

114 ఓ బుల్లి కథ 102 --- మా పెరటి తోటతో ఇక్కట్లు

అమెరికాలో మేముండే ప్రాంతంలో ఏప్రిల్ మొదటి వారంలో బయట చెట్లన్నీ ఆకులూ గట్రా లేకుండా భూతాల్లాగా ఉంటాయి. ఏప్రిల్ చివరి వారం వచ్చేసరికి అవే చెట్లు ఆకులతో పువ్వులతో పచ్చగా నవ నవ లాడుతూ వుంటాయి. మాకు పెరటితోట వేసుకుని ఆనందించే భాగ్యం సంవత్సరానికి సెప్టెంబర్ లో చలి వచ్చే దాకా, మహా అయితే నాలు గైదు నెలలు మాత్రమే. అందుకని ఇంట్లో పెరిగిన మొక్కల్ని గార్డెన్ లో వేస్తే త్వరగా పంటని అనుభవించ వచ్చు అని, విత్తనాలు కొని ఏప్రిల్ లో ఇంట్లో నారు మడిలాగా వేశాం. మేము ఇంట్లో పెట్టిన గింజలన్నీ, టమాటో బీన్స్ సొరకాయ వంకాయ బెల్ పెప్పర్ అన్నీ మొక్కలుగా వచ్చాయి. ఇంకేం ఆనందం పరమానందం. కానీ ఇంతలో మొక్కల్ని వదిలేసి రెండు వారాలు న్యూయార్క్ వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వచ్చి చూసే సరికి ఆలనా పాలనా లేకపోయినా  మొక్కలన్నీ పచ్చగా బాగున్నట్లే ఉండటంతో చాలా సంతోషం వేసింది.

ఇక్కడ మామూలుగా మే మొదటి వారం లో వచ్చే "మదర్స్ డే" తో మొక్కల్ని పెరటి తోటలో వెయ్యటం మొదలెడుతారు. మా పెరట్లో ఒక పెద్ద "maple tree" ఉండటంతో ప్రతి సంవత్సరం "మే" వచ్చేసరికి అది  బోలెడన్ని విత్తనాలు వెదజల్లు తుంది. తన జాతిని  అభివృద్ది చేసుకోవాలనే కోరికని మనము కాదన లేము కానీ మన మొక్కలు వేసే ప్రదేశంలో maple tree విత్తనాలుంటే ఇంతే సంగతులు. అందుకని పెరట్లో  మొక్కలు వేసేముందు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి తోడు వాతావరణం సహకరించటల్లేదు. పగలు కొద్దిగా వెచ్చగా ఉన్నా రాత్రి ఫ్రీజింగ్ వాతావరణం, లేకపోతే రోజంతా వర్షం. అటువంటి సమయంలో మొక్కలు పెడితే బతకటం చాలా కష్టం అందుకని చాలా రోజులు waiting mode లోకి వెళ్ళాల్సి వచ్చింది.

వాతావరణానికి తోడు, గార్డెన్ లో ఇద్దరం కలసి పని చెయ్యాలనే షరతు ఉండటం తోటి, త్వరగా గ్రౌండ్ ని ప్రిపేర్ చెయ్యటం కుదరలేదు. ఇంట్లో పెంచిన మొక్కలు పచ్చగా ఉన్నాయి గానీ చాలా బలహీనంగా ఉన్నాయి. మొత్తం మీద రెండు వారాలకి ఇంట్లో మొక్కలని తీసి గార్డెన్లో వేశాము. వేసేటప్పుడు కలుపు మొక్కలు రాకుండా "weed and feed " కూడా వేశాము. అంతే ఒక వారంరోజుల్లో వేసిన మొక్కలన్నీ కాలంలో కలసిపోయాయి.

ఇంక ఏమి చెయ్యటం? నీదంటే తప్పు, నీదంటే తప్పు అని వాదించుకున్నా సమస్య పరిష్కారం కాదు కాబట్టి వెంటనే వెళ్ళి కొత్త మొక్కలని కొనుక్కుని వచ్చి వేశాం. స్నేహితులు ఇచ్చిన  ఆనపకాయ, బీరకాయ  విత్తనాల గూడా గార్డెన్ లో పెట్టాము. ఈ తడవ  weed and feed వాడలేదు. మొక్కలు త్వరగా పెరగటానికి "Miracle Grow" కూడా వేశాం. వేసి రెండు వారాలయింది. ఇప్పుడిప్పుడే మొక్కలు బతికి బట్ట కడుతున్నాయి.

 పై ఫోటో ప్రస్తుతం మా పెరటి తోటది. మీకు ఒక సంగతి చెప్పటం మరిచి పోయాను. ఫోటోలో ఎక్కువగా కనపడుతున్న మొక్కలు క్రిందటి సంవత్సరం వేసిన తోటకూర సంతానం. ఈ సంవత్సరం వెయ్యకపోయినా బోలెడన్ని తోటకూర మొక్కలు వచ్చాయి. అడవిలా అంతటా పెరిగింది. ఇప్పటికి మూడు సార్లు ఆకులు కోసి స్నేహితులతో పంచుకున్నాము. చూద్దాం ఏమవుతుందో, ఈ సంవత్సరం పెరటి లో పండిన కాయ గూరలు తినే భాగ్యం ఉందో లేదో. 

ఈ సంవత్సరం అనుభవం మీద తెలుసుకున్నవి, ఏప్రిల్ నెలలో గార్డెన్ మీద ఒక పట్టా వేస్తే maple tree విత్తనాలు త్వరగా వేరెయ్య వచ్చు, రెండొవది weed and feed గార్డెన్ లో వాడకూడదు, మూడవది ఇంట్లో నారుమడి వెయ్యటం కుదరదు (రోజూ నారుకి నీరు పొయ్యాలి), నాల్గవది గార్డెనింగ్ చేసేటప్పుడు భార్యా భార్తల సహకారం చాలా ముఖ్యం (భర్త చెప్పిన మాట భార్య వింటే చాలా బాగుంటుంది ).  

Sunday, May 10, 2015

111 ఓ బుల్లి కథ 99 --- ఆడవాళ్ళ ఆరోగ్యానికి

ముఖ్యంగా ఆడవాళ్ళకి, అందునా వయస్సు 55 పైబడిన వారికి ఆరోగ్య విషయంలో ఈ క్రింది 6 న్యూట్రియంట్స్ చాలా ముఖ్యం. మనము తినే ఆహారంలో ఇవి మన శరీరానికి కావలసిన మోతాదులో అందకపోతే రోగగ్రస్తులు అవటానికి కారణం అవ్వచ్చు. దీనికి కారణం ఈ 6 న్యూట్రియంట్స్ కొన్ని అనారోగ్య (ఆల్జైమర్స్, డయ బెటీస్, కేన్సర్  లాంటి) పరిస్థుతుల నుండి మనలను రక్షించ కలవని పరిశోధనలలో కనుగొన్నారు.
1. Potassium
మనలని stroke నుండి రక్షణ కల్పిస్తుంది.  దాదాపు అన్ని తాజా పళ్ళు, శాఖా హారాల్లో 300mg - 400mg దాకా ఉంటుంది.
మనకి రోజుకి ఎంత కావాలి: 4,700 mg daily.
వేటిల్లో ఉంటుంది: Swiss chard, Lima beans, sweet potatoes, bananas and cantaloupe.

2. Vitamin E
ఒకవిధంగా చూస్తే దీనిని బ్రెయిన్ ఫుడ్ అనవచ్చు. ఆల్జైమర్స్ బారి నుండి రక్షించగలదు. ఇది సామాన్యంగా కొవ్వు(fat) ఎక్కువున్న పదార్ధాలలో ఉంటుంది. అందుకని కొవ్వు తగ్గించి తింటున్న వాళ్లకి ఇది తక్కువగా ఉండ వచ్చు.
మనకి రోజుకి ఎంత కావాలి:  15mg daily.
వేటిల్లో ఉంటుంది: Sunflower seeds, almond butter and hazelnuts.

3. Choline
లివర్ చేసే పనిలో (detoxification ) ముఖ్య పాత్ర వహిస్తుంది. Breast cancer రిస్క్ తగ్గిస్తుందని కూడా పరిశోధనలలో తేలింది.
మనకి రోజుకి ఎంత కావాలి: 425mg daily.
వేటిల్లో ఉంటుంది: Eggs (particularly the yolks), salmon and Brussels sprouts.

4. Vitamin B12
మన శరీరంలో Central nervous system సరీగ్గా పనిచెయ్యటానికి తోడ్పడుతుంది. అందుకనే ఇది తక్కువుంటే numbness, weakness and anemia కలగ వచ్చు. ఇది చాలా వరకు మాంసాహారం లలో ఉంటుంది. అందుకని శాఖాహారులలో ఇది తక్కువ ఉండటానికి ఆస్కారం ఉంది.
మనకి రోజుకి ఎంత కావాలి: 2.4mcg daily.
వేటిల్లో ఉంటుంది: Yogurt, shrimp, chicken, fortified breakfast cereals and nondairy milks.

5. Magnesium
ఇది మన శరీరంలో జరిగే దాదాపు 300 పైన రసాయనిక  చర్యలలో ముఖ్య పాత్ర వహిస్తుంది ముఖ్యంగా మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మనలో చాలా మందికి ఇది తక్కువగా ఉండవచ్చుఅని పరిశోధనలలో తేలింది.
మనకి రోజుకి ఎంత కావాలి: 320mg daily.
వేటిల్లో ఉంటుంది: Spinach, cashews, avocado, brown rice and black beans.

6. Vitamin D
ఇది calcium తో కలిసి పనిచేసి మన ఎముకలు గట్టిగా ఉండేటట్లు చూస్తుంది. సూర్యరస్మి ద్వారా మన శరీరంలో ఇది తయారు అవుతుంది.
మనకి రోజుకి ఎంత కావాలి: 600 IU daily.
వేటిల్లో ఉంటుంది: Salmon, eggs, fortified milk, fortified yogurt and fortified orange juice.

*******ఇది కూడా చదవండి
************మనకు కావాల్సిన ముఖ్యమయిన విటమిన్స్, సప్లిమెన్ట్స్

దీని మాతృక:
1. Parade article by Marygrace Taylor Sunday, May 10, 2015