Monday, October 25, 2010

32 ఓ బుల్లి కథ 20 -- కీళ్ళు నొప్పులకు మందు మంచి ఆహారం --

ముందుమాట: Bottom Line వారు Dr. Harris McIIwain, MD, Certified specialist in rheumatology and geriatric medicine who practices with the Tampa Medical Group in Florida గారితో చేసిన సంభాషణను తెలుగు లో నాలుగు  పోస్టులలో మీకు అందిస్తున్నాను.
దీనికి కారణం మన ఇళ్ళల్లో జాయింట్ పైన్స్ తో బాధ పడేవారు ఎక్కువగా ఉండటం. వారు వయసులో పెద్దవారు అవటం. పెద్దవయసులో ఇవి మామూలే అని నిరాశగా బాధ పడుతూ ఉండటం చూడలేక.

(నా మాట క్లుప్తంగా : ఇది రెండవ పోస్ట్, Foods that Heal . దీనిలో చాలాచోట్ల inflammation అని వస్తుంది   కనుక మీకు తెలియటానికి,  నాకు తెలిసినంతవరకూ inflammation అంటే క్లుప్తంగా  చెబుతాను. inflammation మూలంగా వాపు రావచ్చు. వాయటం మూలంగా నరాలకి వత్తుడు(Compression)  తగిలి నొప్పి పుడుతుంది. ఆ వాపును తగ్గిస్తే వత్తుడు తగ్గి నొప్పి పోతుంది. సూక్ష్మంగా ఇదీ కధ.  మీకు ఇంకా తెలుసుకోవాలంటే గూగులమ్మని అడగటానికి వీలుగా, వ్రాసేటప్పుడు ఇంగ్లిష్ పదాలు వాడుతున్నాను.) 

నొప్పిని తగ్గిచ్చే ఆహార పదార్ధాలు: మనము తినే ఆహారములలో antioxidants  ఉండి, inflammation  ను హతమార్చే పోషక పదార్ధాలు ఉన్నవాటిని, తినుట వలన మన కీళ్ళ బాధలను తగ్గించవచ్చును. ఈ క్రింద చెప్పబడిన ఆహార పదార్దములు మనకు  ఉపశాంతిని ఇవ్వగలవు.

(నా మాట క్లుప్తంగా : మన దేహములోని cells లో Glucose , Oxygen రసాయనిక కలయికవలన మనకి కావాల్సిన energy ఉత్పన్న అవుతుంది. ఈ రసాయనిక కలయికలో మనకు పనికి వచ్చే శక్తే కాకుండా పనికిరానివి కూడా తయారు అవుతాయి. అవే oxidants(free radicals) .  ఇవి ఇంకొక పదార్ధానికి త్వరగా అంటుకోవాలని ప్రయత్నిస్తాయి. అవి అంటుకుంటే ఆ పదార్ధపు పనితీరు మారవచ్చు. మన శరీర శక్తే వాటిని నిర్వీర్యము చేస్తుంది కానీ ఒక్కొక్కప్పుడు చెయ్యలేక పోతే మనము బాధలకు గురి కావలసి వస్తుంది. అందుకని మనము antioxidants ఉన్న పదార్ధాలను తీసుకుంటే మన శరీరములో ఉత్పన్నమయిన చెడ్డ వస్తువులను నిర్వీర్యము చేయుట జరుగుతుంది.)

High-antioxidant ఫలములు, కాయగూరలు: Antioxidants, inflammation ను తగ్గిస్తాయి. కొన్ని సంవత్సరాల క్రిందట, US Department of Agriculture కొన్ని పదార్దముల antioxidant activity వరుసగా ఎక్కువ నుండి తక్కువ క్రమం లో పొందుపరిచింది. వాటిలో మొదటి పది:  blueberries, kale, strawberries, spinach, Brussels sprouts, plums, broccoli, beets, oranges, and red grapes. వీటిల్లో మీకిష్టమయినవి తినుట ప్రారంభించండి (వండిన వయినా  సరే). వీటి తరువాత ఇవి గూడా మంచివే: Asparagus, cabbage, cauliflower, tomatoes, sweet potatoes, avocados, grapefruit, peaches and watermelon.

Oil-rich fish: పరిశోధనల వల్ల తేలిందేమిటంటే omega-3 fatty acids ఉన్న పదార్ధాలు inflammation ను తగ్గిస్తాయని. అవి: anchovies, mackerel, salmon, sardines, shad, tuna, whitefish, and herring. ఇవి ముఖ్యంగా చాలా రకాల arthritis లకి కారణంగ  కనపడే leukotriene B4 ను తగ్గిస్తాయి. పరిశోధనల వలన తేలిందేమిటంటే, ఆడవాళ్ళల్లో వారానికి మూడు సార్లు baked or boiled fish తిన్న వాళ్లకి rheumatoid arthritis రావటం ఒకసారి తినే ఆడవాళ్ళ కన్న సగం తక్కువ.

Soy : పరిశోధనల్లో తేలిందేమిటంటే తీసుకునే ఆహారంలో ఎక్కువ soy ఉంటే inflammation మూలాన వచ్చే నొప్పి, వాపు తగ్గుతాయని. మీరు వీటిని ఉపయోగించటానికి ప్రయత్నించండి: tofu, soy milk, soy yogurt, soy beans or miso, a traditional Japanese food consisting of fermented soy beans and made into a thick paste.

Green and black Tea: Green Tea లో polyphenol అనబడే ECCG ఉంటుంది. సామాన్యంగా చెట్లలో ఉండే ఈ polyphenol , antioxidant గ పనిచేస్తుంది. ఈ ECCG అను పదార్ధం, arthritis inflammation response లో కనపడే ఒక కీలకమయిన gene ని  inhibit చేస్తుంది. పరిశోధనల్లో తేలిందేమిటంటే మీరు Green టీ ని ఎంత తాగితే అంత ఫలితం కలుగు తుందని. Black Tea, మన శరీరంలో Green Tea లాగా పనిచేయక పోయినా తగిన ఫలితములు ఇస్తుంది. దీనిలో theaflavins అనే anti -inflammatory రసాయన పదార్దములు ఉన్నాయి. The Iowa Women's Health Study లో కనుగొన్నది ఏమిటంటే, రోజుకి మూడు కప్పుల టీ(herbal టీ కాదు) తాగే ఆడవాళ్ళకి, తాగని వాళ్ళకన్నా,  rheumatoid arthritis రావటం 60% తక్కువ.

Pineapple: రుచికరమయిన ఈ ఫలములో bromelain ఉండును. ఈ enzyme arthritis తో వచ్చే inflammation ని తగ్గిస్తుంది. Fresh pineapple అయితే చాలా ఉత్తమం  కానీ canned pineapple కూడా పనిచేస్తుంది.

Onions and Apples: ఈ రెండింటిలోనూ flavonoids అనే పదార్దములు ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా inflammation ని తగ్గిస్తాయి. వీటిని మామూలుగానూ, వండించి గానూ తినవచ్చు.

చివరి మాట: మీరు పైన చెప్పిన ఆహారపదార్ధాలు అన్నీ తినవలసిన అవుసరం లేదు. మీరు పైన చెప్పిన వాటిని, ఎప్పుడూ తినక పోతే, ముందు కొద్ది కొద్దిగా తినటం ప్రారంభించండి. మీకు సరిపోక పోతే వాటిని మార్చి ఇంకొకటి తినండి. తరువాతి  పోస్ట్  foods to avoid.

Tuesday, October 19, 2010

31 ఓ బుల్లి కథ 19 -- కీళ్ళు,మోకాళ్లను జాగర్తగా ఉంచుకోండి 1 --

ముందుమాట: Bottom Line వారు Dr. Harris McIIwain, MD, Certified specialist in rheumatology and geriatric medicine who practices with the Tampa Medical Group in Florida గారితో చేసిన సంభాషణను తెలుగు లో నాలుగు  పోస్టులలో మీకు అందిస్తున్నాను.
దీనికి కారణం మన ఇళ్ళల్లో జాయింట్ పైన్స్ తో బాధ పడేవారు ఎక్కువగా ఉండటం. వారు వయసులో పెద్దవారు అవటం. పెద్దవయసులో ఇవి మామూలే అని నిరాశగా బాధ పడుతూ ఉండటం చూడలేక.

From: Keep Joints Feeling Young! by Dr. Harris McIIwain, MD coauthor of Pain-Free Arthritis - A 7-step program for feeling Better Again (Owl)

నా rheumatology practice లో నొప్పులతో బాధపడుతూ డాక్టర్ల చుట్టూతా తిరిగినా ఉపశమనము కలుగక నా దగ్గరకి వచ్చిన వారికి నేను ఎక్కువగా చెప్పేది వారి ఆహారము తిను పద్ధతిని మార్చమని. నా నొప్పులు తగ్గే ఆహారపు క్రమమును పాటిస్తే కొన్ని వారాలలోనే ఫలితం కనిపిస్తుంది. దీని మూలంగా నొప్పికి వేసుకునే మందులను తగ్గించవచ్చు.  కీళ్ళ నొప్పులు అన్నిటిలోనూ (rheumatoid arthritis మరియు Osteoarthritis తో సహా) inflammation తగ్గి నొప్పి మరియు stiffness తగ్గుట గమనించ గలరు. 

పని చేసే విధానము: ఈ నొప్పుల బాధ నుండి బయట పడేట్టు చేసే ఆహార పద్ధతి లో మీరు నొప్పులను తగ్గించి మన immune system ను పెంచే ఆహారముల గురించి తెలుసుకుంటారు. అలాగే మీకు inflammation పెంచి నొప్పులను తెప్పించే ఆహారముల గురించి కూడా తెలుసుకుంటారు. ఈ diet program మూలముగ  మీ బరువు ఆరోగ్య కరముగా ఉండి కీళ్ళ మీద భారము తగ్గి జీర్ణ శక్తి పెరిగి మీ నెప్పుల బాధలు తగ్గు ముఖము పట్టును. మీకు కొన్ని మంచి nutritional suppliments గురించి కూడా చెబుతాను.

మీరు ఆరోగ్య కరమయిన సరియిన బరువు కలిగి ఉండాలంటే మీరు తరచుగా చిన్న చిన్న meals తీసుకొనుట మంచిది. రోజుకు మూడు పెద్ద meals కన్న రోజుకి ఆరు చిన్న meals తీసుకోండి.  మూడు 300 కాలోరీస్ ముఖ్య meals తో పాటు, మూడు 150 లేక  200 కాలోరీస్ తో చిన్న చిన్న స్నాక్స్ మధ్యలో తీసుకోండి.

చివరిమాట:  తరువాత పోస్ట్ foods that heal.

Sunday, October 10, 2010

30 ఓ బుల్లి కథ 18-- అబ్బా, నా మోకాళ్ళ నెప్పులు! --

ముందు మాట: ప్రతీ ఇంట్లోనూ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారు. వారి కోసం మరియు  అవి త్వరగా రాకుండా ఉండటానికి జాగర్తల కోసం ఈ పోస్ట్. దీని మాతృక Sept, 12, 2010 PARADE StayHealthy Column లో Oh, My Aching Knees! by Elizabeth Goodman. దీనికి నా తెలుగు లో స్వేచ్చ అనువాదం.

ప్రతీ సంవత్సరం అమెరికాలో దాదాపు 19 మిలియన్ మంది కాళ్ళ నొప్పుల బాధ తో orthopedic surgeons దగ్గరకు వెళ్తారు. మన బరువుని మోసే ఆ మోకాళ్ళు మనలని పెద్ద వయసుతో చాలా బాధలకు గురి చేస్తుంది. దీనిలో ముఖ్యమయినది  osteoarthritis - మనకి చాలా బాధ కలిగించే ఈ సమస్య మొకాలిలో రెండు ఎముకల మధ్య ఉండే cartilage పోవటం మూలాన ఎముకలు ఒకదాని కొకటి రాచు కొని వచ్చే బాధ.  ఈ బాధ పడేవారు అమెరికాలో 10 మిలియన్ మంది కన్న ఎక్కువ ఉన్నారు. జీవితం లో తప్పకుండా ఇద్దరు మనుషుల్లో ఒక మనిషికి ఈ వ్యాధి వస్తుంది అని చేప్పచ్చు. శుభవార్త : ప్రపంచములో చాలామంది శాస్త్ర వేత్తలు ఈ వ్యాధి మీద పని చేయటము మూలముగా కొత్త సంగతులు రోజు రోజు కీ తెలుస్తున్నాయి, ఏ విధం గా మన బాధని తగ్గించు కొవచ్చో, రాకుండా చూసుకోవచ్చో, రాకుండా కొన్ని రోజులు ఆపవచ్చో, వస్తే చిన్నగా వచ్చేటట్లు చూడటం ఎల్లాగో ఇవన్నీ పరిశీలన లో ఉన్నాయి. మీరు తప్పకుండా ఈ క్రింది జాగర్తలు తీసు కోండి.

1) మీరు ఆరోగ్య కరమయిన బరువు ఉండేటట్లు చూసుకోండి.
జాతీయ సర్వే ప్రకారం సరియిన బరువులో ఉన్న అమ్మల కన్న, స్థ్తూలకాయులయిన అమ్మల మోకాళ్ళకి osteoarthritis రావటం నాలుగు రెట్లు ఎక్కువ. స్థ్తూలకాయులయిన అయ్యలకయితే  ఇది అయిదు రెట్లు ఎక్కువ. మీరు మీ మోకాళ్ళకి ఉపశమనం కలిపించాలంటే పది పౌన్లు తగ్గినా ఉపశమనం కనిపిస్తుంది, లేక ఈ వ్యాధి వచ్చే చాన్సు తగ్గుతుంది.
(నా మాట: మన బరువంతా మోకాళ్ళు భరిస్తున్నాయి కదా అందుకని బరువు తగ్గితే ఉపశమనం కనిపిస్తుంది)

2) మీ కండరాల్ని బలంగా ఉంచుకోండి.
ఈమధ్య university of Iowa Hospitals and Clinics చెసిన స్టడీ లో అమ్మలకి quadriceps( ముందరి తొడ కండరాలు) గట్టిగా ఆరోగ్యముగా ఉంటే ఈ వ్యాధి రావటం తక్కువ. మీరు ఈ quads ని build up చేసుకోవాలంటే low-impact exercises చెయ్యటం మొదలు పెట్టండి. అవి leg raises, wall sits, squats.

3) నడుస్తూ ఉండండి.
మోకాళ్ళ కదలిక(mobility) లేక కూడా ఈ బాధ రావచ్చు. మీరు నడిచే టప్పుడూ పరిగేత్తేటప్పుడూ వంగితే బాధగా ఉంటే, మీ మోకాలు kneecap మీద చిన్న స్థలం లో ఎక్కువ భారం వేస్తున్నారన్నమాట. మీరు రెగ్యులర్ గ యోగా చెయ్యటం లేక tai chi చెయ్యటం మొదలెడితే మీరు ఎక్కువ దూరం నడవ కలుగుతారు. ఇంకో మార్గానికి  డాక్టర్ David Teucher, orthopedic surgeon in Beamont, Tex ఏమన్నారంటే రోజుకి పది నిమిషాలు streaching మీ రోజూ వారీ exercises తో  చెయ్య మన్నారు.

4) మోకాళ్ళకి అనువయిన పాద రక్షలను వాడండి.  
Clogs మరియు  stiff -soled walking shoes సుఖముగా ఉన్నప్పటికీ అవి మీ మోకాళ్ళ మీద 15%  ఎక్కువ భారం మోపుతాయి flip -flops, sneakers with flexible soles కంటే. ఇది Rush Medical center, చికాగో వాళ్ళు కనిపెట్టిన విశేషం. అల్లాగే హై హీల్స్ కూడా మోకాళ్ళ మీద ఎక్కువ భారం మోపుతాయి.

చివరి మాట: మన దేహము లోని ఏ అవయవాలయినా మనము సరీగ్గా ఉపయోగించక పోతే అవి మన చేతుల్లోనుండి జారి పోతయ్యి. వాటికి "if you do not use it you loose it" వర్తిస్తుంది.

కీళ్ళ నొప్పుల మీద నా పోస్టులు:

1. 30 ఓ బుల్లి కథ 18-- అబ్బా, నా మోకాళ్ళ నెప్పులు!

2. 31 ఓ బుల్లి కథ 19 -- కీళ్ళు,మోకాళ్లను జాగర్తగా ఉంచుకోండి

3. 32 ఓ బుల్లి కథ 20 -- కీళ్ళు నొప్పులకు మందు మంచి ఆహారం

4. 33 ఓ బుల్లి కథ 21-- కీళ్ళ నొప్పులతో ఆహారం జాగ్రత్తలు

5. 34 ఓ బుల్లి కథ 22-- కీళ్ళ నొప్పులను తగ్గించే ఆహారం సప్ప్లిమెంట్లు

6. 89 ఓ బుల్లి కథ 77 --- ఆరోగ్యానికి మార్గం మెరపకాయ కారం

Monday, September 20, 2010

29 ఓ బుల్లి కథ 17-- మీరు గొప్పవాళ్ళు అవుతారా ? --

ముందు మాట: నేను చెప్పే రెండు ఉదాంతాలు ( కేసులు) పరిశీలించి మీలో/నాలో గొప్ప వాళ్ళ లక్షణాలు ఉన్నయ్యో లేదో తేల్చండి.


నా మొదటి తార్కాణం:
గుడ్ ఇయర్ "inventor  " అని పేరు పెట్టుకుని ఇంట్లో ఉంటాడు. ఇంట్లోపనులు అవీ చేస్తూ కొత్త వాటిని కని పెట్టటం కోసం పగళ్ళు రాత్రులు కష్టపడుతూ ఉంటాడు.  ఆయన చేద్దామనుకున్నది, రబ్బరు ని గట్టి పరచటం. దానికి ఒక బున్సెన్ బుర్నేర్ మీద రబ్బరు తో కనపడిన పదార్ధాలు అన్నీ కలిపి ఏమి జరుగు తుందో చూస్తూ ఉండేవాడు. కనపడిన వాటన్నిటి తోటీ ఎన్ని సార్లు  ప్రయత్నించినా ఫలితం కనిపించటల్లేదు. పాపం కొత్త సంగతులు కనుక్కోటం రోజూ జరిగే పని కాదుగదా, అందుకని కొత్త ideas కోసం అలా నిసీధం లోకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన గారి భార్య ఉద్యోగం చేసి సంసారం నడుపుతూ ఉంటుంది. భర్త గారు మాటా పలుకూ లేకుండా అలా చూస్తూ కూర్చోటం ఆవిడకి నచ్చ లేదు. కనీసం తనతోడి మాట్లాడటం కూడా లేదాయె. ఆవిడకి వళ్ళు మండింది. సంసారం గడిచేది తన మూలాన. ఆయన పరికరాలు అన్నీ ఒక డ్రాయర్ లో పడవేసి, ఇంక నుండీ నీ పరిశోధనలు లాభం లేదు ఎంతకీ తెగే టట్లు కనపడ లేదు, నేను ఈ సంసారం ఈదలేను, ఉద్యోగం చూసుకోమంది.

ఉద్యోగం రావాలంటే వెంటనే ఎక్కడ వస్తుంది, అందులో ఉద్యోగం చెయ్యటం ఇష్టములేని వాళ్లకి. ఆవిడ ఉద్యోగానికి వెళ్ళిన తరువాత  డ్రాయర్ తీసి తన పరిశోధనలు ప్రారంభించే వాడు. ఒక రోజున బయటకు వెళ్ళిన ఆవిడ హటాత్తుగా తిరిగి వచ్చింది. వచ్చిందని గ్రహించి తన పరిశోధన సామగ్రిని డ్రాయర్ లో తోసి మూసేసాడు. మర్నాడు ఆవిడ పనికి వెళ్ళిన తరువాత తీసి చూస్తే రబ్బరు గడ్డకట్టి ఉంది. ఇంక నేను చెప్పక్కరలేదు. ప్రయోగం ఫలించింది. చాలా గొప్ప వాడయ్యాడు. మీరు చూస్తున్నారు కదా గుడ్ ఇయర్ టైర్లు.

నా రెండోవ తార్కాణం:
చాలా గొప్ప వేదాంతి అనబడే సోక్రటీస్ ఒక రోజు తన శిష్యులతో కూడి ఇంట్లో భోజనం చేస్తున్నాడు. చెప్పకుండా జనాన్ని భోజనానికి తీసుకు వచ్చాడని ఆయన భార్య గారికి చాలా మంటగా ఉంది. కోపము దిగమింగుకుని వడ్డిస్తోంది. చారు వేడి సరీగ్గా లేదు అని అన్నాడు సోక్రటీస్ గారు. అంతే ఆవిడ లోపలున్న కోపాన్ని పట్టలేక, ఆ గిన్నెడు చారుని ఆయన నెత్తిన  పోసింది.

ఇంక నా కేసు:
రిటైరయ్యి ఇంట్లో ఉంటూ నేనూ Good Year గారి లాగా బ్లాగ్స్ వ్రాస్తూ ఉంటాను, మా ఆవిడ పనికి వెళ్తుంది. నిన్న వేడి వేడి కాఫీ నా మీద వలకటం జరిగింది సోక్రటీస్ గారికి జరిగినట్లు.

చివరి మాట: నే నెప్పుడు గొప్పవాణ్ణి అవుతానో  !

Thursday, September 16, 2010

28. ఓ బుల్లి కథ 16 -- వరండా లో బల్ల ఎత్తుకు పోయారు --

మామయ్య గారింట్లో వరండాలో బల్ల ఎత్తుకు పోయారు అని వినం గానే నాకు చాలా బాధ వేసింది. ఆ బల్ల మీద కూర్చొని ఎంతమందికో చదువులు చెప్పారు మా మామయ్య గారు, వాళ్ళ పిల్లలు, అప్పుడప్పుడూ నేను. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంతమందో ఆ వరండాలో కూర్చొని హోం వర్క్ లు చేశారు, తెలియనివి చెప్పించు కున్నారు. బాగా చదువుకునే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. పనికి  పంపిస్తే ఇంట్లోకి చేదోడు వాదోడుగా ఉంటాడు అనే మాటని అడ్డుకుని, భోజనం పెట్టి, పనిమనిషి కొడుక్కి చదువు చెప్పారు. ఇప్పుడు అతను సబ్ ఇనస్పెక్టరు అయ్యాడుట.


నాకు మా మామయ్య గారంటే ఎందుకు ఆత్మీయత పెరిగిందో అర్ధం కాదు. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. మా నాన్న గారు, సీనయ్య, అంటే ఆయనకి చాలా ఇష్టం అని నాకు బాగా తెలుసు. బహుశా వారిద్దరూ దాదాపు ఒకటే వయస్సు అయి ఉండవచ్చు. అందుకని నేనంటే ఆయనకీ ఇష్టమేమో. 


మొదట్లో తెనాలిలో వాళ్ళింటికి పిల్లలం వెళ్ళేవాళ్ళం కాదు. వెళ్ళినా బయట బల్ల మీద కూర్చునో, పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆడో, మా వూరు కట్టేవరం సాయంత్రానికి జేరుకునే వాళ్ళం. ఒకసారి అత్తయ్య "కృష్ణా నీ అత్తయ్య నే  కదా ఎందుకు ఇక్కడ ఉండవు?" అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది . మేము అక్కడ ఉండక పోటానికి అసలు కారణం,  వాళ్ళింట్లో బయట బట్టలు కలపరు. బయటనుంచి వచ్చిన వాళ్ళు ఎవరయినాసరే వాళ్ళిచ్చిన ఉతికిన బట్టలు కట్టుకుని ఇంట్లోకి రావాలిసిందే. అప్పటినుండీ శలవలకి రేపల్లె నుండి వచ్చినప్పుడల్లా అత్తయ్య గారింట్లో  రెండు రోజులుండే వాణ్ని. అత్తయ్య దోసకాయ పప్పు అంటే నాకు చాలా ఇష్టం.


మామయ్య గారు అప్పుడప్పుడూ గమ్మత్తు గా మాట్లాడు తారు. నా చిన్నప్పుడు తెనాలి నుండి రేపల్లె వెళ్ళే ట్రైన్ ఎక్కించటానికి స్టేషన్ కి వచ్చారు. ట్రైను కదల బోతోంది. "కృష్ణా నీ రెండు రూపాయలు నీకు ఇచ్చేశాను. అవునా " అన్నారు. నేను వెంటనే ఇచ్చేశారండీ అన్నాను. ఆయనదగ్గర చిల్లర లేక పోతే నేను రెండు రూపాయలు ఇచ్చాను. తరువాత తిరిగి ఇచ్చేశారు. నాకు ఎందుకు అలా అన్నారో అర్ధం గాక మా నాన్నగారిని అడిగాను.


టూకీగా మా నాన్నగారు చెప్పినది ఇది, ఒకప్పుడు మా మామయ్య గారి ఇంట్లో ఏ గూట్లో చెయ్యి పెట్టినా రూపాయ నాణాలు ఉండేవిట. కొద్దిగా మీరు  డెబ్బై ఏళ్ళ క్రిందట పరిస్థుతులు గమనించాలి. ---- పల్లెటూళ్ళు, పెంకుటిళ్ళు, మట్టి గోడలు, ఇనప పెట్టెలు, గూళ్ళు.---- అప్పటి ఉన్నవాళ్ళ ఇళ్ళు అలా ఉండేవి. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తరువాత, విడిపోయిన అన్నలు,  నాన్నగారికి అప్పిచ్చామని చాలా ఆస్తి తీసుకున్నారు. తరువాత  ఆయనకి వచ్చిన డబ్బుల్లో బంధువులకి వ్యవసాయానికి అప్పిచ్చారు. ఆ సంవత్సరం పంటలు పండక కరువుతో ఉంటే ప్రభుత్వము రైతుల అప్పును మాఫీ చేసింది. అంతే బంధువులయినా ఈయన డబ్బులు వారు తిరిగి ఇవ్వాలేదు. ప్రభుత్వం అప్పులని మాఫీ చేస్తే మునిగి పోయేవాళ్ళు అప్పిచ్చిన వాళ్ళు. ప్రభుత్వం ఎంతమందిని ఇలా దివాలా తీయించిన్దో. 


అప్పటి నుండీ ఆయనకి అప్పులు ఇవ్వటం తీసుకోవటం అంటే భయం. చివరికి ఉన్న చదువుతో  ట్రైనింగ్ తీసుకుని బ్రతక లేక బడి పంతులు అయ్యారు. పల్లెటూరు నుండి తెనాలి వచ్చారు. నాకు ఇంకో సంగతి కూడా చెప్పారు ఆయన్ని గురించి. చిన్నప్పుడు ఆయన స్లీప్ వాకింగ్  చేసేవారుట. ఇంట్లో వాళ్ళ ఉపాయం, ఆయన పిలకని నులకమంచానికి కట్టేవారుట. కొంత కాలానికి స్లీప్ వాకింగ్ పోయిందిట.


ఇప్పటికీ తలుచుకున్నప్పుడల్లా బాధ పడుతూ ఉంటాను. ఇంటి చుట్టూతా తడికల గోడ కన్నా, ప్రహరీ గోడ ఉంటే బల్లని ఎవరూ తీసుకు పోయే వారు కాదేమో అని. పిల్లలందరూ ఎవరికి వారు రెక్కలొచ్చి వెళ్లి పోయారు. బల్ల పోయింది. ఆ తరువాత మా అత్తయ్య పోయింది. చివరికి ఆయనా పోయారు. 


నా కెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, మన ప్రభుత్వం పంతుల గార్లని ప్రోత్సహించి,  ఒక్కొక్క పంతులు గారు కనీసం ఒక్కొక్క పనిమనిషి పిల్లలకి చదువు చెప్పి పైకి తీసుకు వచ్చేటట్లు చేస్తే, మనదేశం ఎల్లా ఉండేదో!. 

Sunday, September 12, 2010

27. ఓ బుల్లి కథ 15 -- అశోక, కౌటిల్య-- వీళ్ళు మనవాళ్ళే -- అనుబంధం --

ముందుమాట: నా క్రిందటి పోస్ట్ లో Bruce Rich గారి "To uphold the World" అనే పుస్తకము గురించి వ్రాశాను. పుస్తకము అశోక,  కౌటిల్యుల  రాజనీతి, ఆర్ధికశాస్త్ర సూత్రాలు, ఈ ఇరువది ఒక శతాబ్దము లో ఎంతచక్కగా పనికోస్తయ్యి అనే అంశము మీద.  పుస్తకము లోని విశేషాల గురించి వ్రాయలేదు. దానికి కారణము ఉన్నది.
నాకు రాజరికము అనే దాని మీద పెద్ద పరిచయము లేదు. నా పేరు లో రాజు ఉన్నాడని, భార్యా పిల్లల మీద రాజరికము చూపెడుదామంటే  ఎప్పుడూ ఫలించ లేదు.
అర్ధశాస్త్రములో నా పరిజ్ఞానము  అంతంత మాత్రమే. వచ్చే డబ్బులతో, అప్పులు చేయకుండా, సరిపెట్టుకుంటూ జీవించటము మాత్రమే తెలుసు. అది కూడా మా నాన్నగారి బోధన.

పెబ్బరాజు వారి కోరిక ప్రక్కరం ఈ క్రింద పుస్తక పరిచయం లింక్ ఇస్తున్నాను. ఏ కారణము వలన అయినా మీకు ఆ లింక్ రాకపోతే  దాని కింద లింక్ ను కాపీ చేసి ప్రయత్నించండి. రచయిత వివరాలు, పుస్తక వివరాలు గూగులమ్మ నడిగినా చెబుతుంది. amazon లో పుస్తకము దొరుకుతుంది. పుస్తక పరిచయం

http://www.indiatribune.com/index.php?option=com_content&view=article&id=3766:us-attorney-reiterates-relevance-of-ashoka-kautilya-to-21st-century&catid=25:community&Itemid=457

చివరిమాట: మూడు రోజుల పండగలు, వినాయక చవితి, రంజాన్, విశ్రాంతి తో చక్కగా గడిపారని తలుస్తూ విఘ్నాలు దాటి మీ జీవితం ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను.

Friday, September 10, 2010

27. ఓ బుల్లి కథ 15 -- అశోక, కౌటిల్య-- వీళ్ళు మనవాళ్ళే --

ముందు మాట: నా కెందుకో ఇవ్వాళ  చాలా గర్వంగా ఉంది. వందల సంవత్సరాల క్రిందట రాజరికం లో మనము వాడిన పద్ధతులు, ఆచారాలు, అర్ధశాస్త్రపు నీతులు,  ఈ కాలం లో గూడా పనికొస్తా యంటే, నా పూర్వీకుల తెలివితేటలకు నాకు చాలా గర్వంగా ఉంది.

US attorney reiterates relevance of Ashoka, Kautilya to 21st Century    by Ajay Ghosh(New York)
(పుస్తక పరిచయం --  సెప్టెంబర్ 11, 2010 India Tribune లో వ్యాసం)

నేను ఆ వ్యాసాన్ని తెలుగులో అనువదించే ప్రయత్నము చేయటల్లేదు కానీ ఆ పుస్తకము గురించి క్రింద ఇస్తున్నాను.



To Uphold The World  ( A call for a New Global Ethic from Ancient India)    
by  Bruce Rich   

Forward by:             Noble Laureate Economist Amartya Sen
Afterword by:          His Holiness the Dalai Lama
Published by:           Beacon Press, April, 2010

చివరి మాట: ఎవరేమనుకున్నా మన భారతావనికి ప్రపంచాన్ని తీర్చి దిద్దే సంస్కృతులు ఉన్నాయి. మనము ఏళ్ళ క్రిందే వాటిని కనుగొన్నాము.  కాకపోతే ఇంకొకళ్ళు వచ్చి వాటి గురించి మనకు గుర్తు చేస్తే తప్ప మనకు తెలియవు.