Wednesday, February 17, 2010

13. ఓ బుల్లి కథ 1 ---- నిమ్మకాయ ముద్ద

వేడి వేడి అన్నం తో నిమ్మకాయ ముద్ద ---

మూడు వారాల నుండి ఓపికపట్టి ఆగి ఉన్నాను. ఆ శుభ సమయం సరీగ్గా పదకొండు గంటల ముప్పయి నిమిషాలకు వస్తుంది. నిమ్మకాయ ఊరటానికి మూడు వారాలు పడుతుందిట.

వాళ్ళింట్లో నిమ్మకాయ తిన్న దగ్గర నుంచీ, నాకు అది కావాలని కోరిక. అదే రంగు అదే రుచి.
వెండి పళ్ళెం లో వేడి అన్నం తో బెజావాడ వచ్చినప్పుడల్లా అమ్మక్కయ్య కలిపి పెట్టేది.

నాకు అది కావలి. సిగ్గు లేకుండా అడిగేశాను నాకు కొంచం ఇవ్వండని. లేదు మీకు కావాలంటే ఎల్లా చెయ్యాలో చెప్తాను అన్నారు.

వెంటనే హిస్పానిక్ షాపు కు వెళ్లి పది నిమ్మకాయలు కొని రసం తీసాను. ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు మెంతిపొడి, తొమ్మిది టీస్పూన్ కారం, దానికి డబల్ ఉప్పు వేసాను. ఐదు నిమ్మకాయలు ముక్కలు చేసి వేసాను. అన్నిటిని బాల్ జార్ లో ఊరటానికి వేసి పెట్టాను.

టైం అయ్యింది బాటిల్ ఓపెన్ చేశాను. వెండి కంచం లో ముద్ద కలిపాను. నోట్లో పెట్టుకున్నాను. అబ్బా ఉప్పు. కొలత లెక్క పెట్టేటప్పుడు తప్పో లేక రౌండేడ్ స్పూన్స్ గ వేశానేమో. బాధగా ఉంది. కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి.

ర్రిఫ్రిజిరేటర్ లో తొంగి చూసాను ఎమన్నా ఉన్నయ్యేమో తిందామని. సవర్ క్రీం(మీగడ పెరుగు) కనపడింది. నిమ్మకాయి ముద్దలో కలిపాను. ముద్ద నోట్లో పెట్టాను. అబ్బా అది స్వర్గం.