రాత్రి ఇంటికొచ్చేటప్పటికి పన్నెండున్నర అయ్యింది. ఇక్కడ అమెరికా లో అన్నట్లు "hit the sack " ఒంటిగంట అయ్యింది. అరగంట నుండీ దొర్లుతున్నాను నిద్దర పోటానికి. మనస్సు సరీగ్గా ఉండకపోతే నిద్రపట్టదని పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి ఈనాడు జరిగిన సంఘటలని సింహావలోకనం చేసుకుంటున్నాను. దానికి కారణం వల్లీ గారి ఆవడలు అవ్వచ్చు, రాజుగారి ఇంటి తోటలో కాసిన సొరకాయలవ్వచ్చు లేకపోతే నేను ఫోటో దిగుతుంటే అమాంతంగా దగ్గరకు లాక్కుని భుజం మీద చెయ్యి వేసి ఫోటో తీయించుకున్న లలనామణి అవ్వచ్చు.
శర్మగారింట్లో భోజనం చేసిన తర్వాత పిచ్చాపాటీ లో వోక్స్ వాగన్ నమ్మకద్రోహం నుండి తెలంగాణాలో కల్లు చావుల దాకా మాట్లాడుకుని, వెళ్దా మను కుంటుంటే కాఫీ తాగి వెళ్ళండి అన్నారు. వాళ్ళింట్లో కాఫీ బాగుంటుంది. వద్దనలేము తాగాను . అంతకు ముందే శనివారం ఫలహారం, నాలుగు ఇడ్లీలు రెండు ఆవడలు తిన్నాను. వాళ్ళింట్లో ఆవడలు చాలా బాగుంటాయి. తినటంలో ఇడ్లీ మోతాదు తగ్గించి ఆవడల మోతాదు ఎక్కువ చేస్తే బాగుండేది కానీ టూ లేట్. నాకింకా ఒక ఆవడని సాంబారులో వేసుకుని తింటే ఎల్లా ఉంటుందో చూడాలని ఉంది.
వల్లీ చేసే "ఆవడలు", రాణీ చేసే "బాదుషాలూ", బాబాయి ఇడ్లీల్లా రోజూ దొరకవు. దొరికినప్పుడు ఆస్వాదించటమే. ఆవిడ కాఫీ పౌడర్ అప్పటికప్పుడు తయ్యారు చేసి కాఫీ ఇస్తుంది కాబట్టి, ఇస్తానంటే తాగక పోవటం కూడా బాగుండదు. తాగటం కూడా మంచిదయింది. అప్పుడే బార్ లు మూసేస్తున్నారల్లే ఉంది రోడ్డు మీద కార్లు వంద మైళ్ళ స్పీడ్లో మమ్మల్ని దూసుకు పోతున్నాయి. నేను తూలి పోకుండా మెలుకువగా ఉండి మా ఆవిడని జాగర్తగా డ్రైవ్ చెయ్యమని చెప్తూ వచ్చాను.
చలి మొదలయింది పెరటి తోటలు మాడిపోటం మొదలెడుతున్నాయి. శర్మగారింటికి తోటలోనుండి నలుగురితో పంచుకోటానికి బోలెడన్ని చిక్కుడు కాయలు బీరకాయలు తీసుకు వచ్చాము. రాజుగారు వారి పెరటి తోటలో పండిన సొరకాయలు తీసుకు వచ్చారు. అందరూ సొరకాయల గురించి మాట్లాడు కోవటమే. ఒకరు గిన్నీస్ బుక్ లో పెట్టచ్చు అని, ఇంకొకరు farmer of the year అనీ ఏమిటేమిటో అంటున్నారు. అర సంచీ చిక్కుడు కాయలు గొప్పా రెండు సొరకాయలు గొప్పా? ఆయన తెచ్చిన రెండు సోరకాయలూ కోయటానికి ఒక నిమిషం కూడా పట్టదు. మేము గంటసేపు కష్టపడి కోసిన చిక్కుడు కాయలగురించి ఎవ్వరూ మాట్లాడరు. నాకు కనీసం farmer of the day బిరుదు ఇవ్వాలి. నిజం చెప్పాలంటే మా ఆవిడే ఆ చిక్కుడు కాయలు అన్నీ కోసింది. నాపని తోటకి నీళ్ళు పోయటం వరకే. కానీ ఆడవాళ్ళని farmer of the day అంటే బాగుండదు కదా ! రాజు గారికి ఈ సంవత్సరం తోటలో దోసకాయలు రాలేదుట. వచ్చే సంవత్సరం నేను దోస తీగలు వేసి పండించి farmer of the year పేరు సంపాయించాలి.
ఇవాళ మధ్యాహ్నం ఇంకో సంఘటన కూడా జరిగింది. నేను Literacy Dupage లో వాలంటీర్ గ పని చేస్తాను. వాళ్ళు ప్రతి సంవత్సరమూ అందర్నీ పిలిచి ఒక ప్రోగ్రాం పెట్టి సంవత్సరంలో బాగా చదువుకున్న వాళ్ళనీ, వాళ్ళకి చదువు చెప్పిన వాళ్ళనీ గౌరవిస్తారు. ఈ సంవత్సరం దానికి మా గ్రూప్ లో నలుగురిని ఎంచుకున్నారు. నేను స్టేజి మీదికి ఎక్కి నా బహుమానం తీసుకున్నతర్వాత ఫోటో తీస్తాము ఒకచోట ఆగమన్నారు. సరే ఆగాను. నలుగురూ వచ్చిన తరువాత ఫోటో తియ్యటానికి రెడీ అవమాన్నారు. నేను వెంటనే నా కళ్ళజోడు తీసి పెట్టుకున్నాను. ఫోటో తీయబోతూ ఉంటే నా పక్కావిడ నన్నుగట్టిగా దగ్గరకు లాక్కుని నా భుజం మీద చేయ్యివేసింది. వెంటనే ఫ్లాష్ వచ్చింది ఫోటో తీసేశారు. ఆ హాల్లో ఉన్న రెండువందల మంది కూడా దీన్ని చూసే ఉంటారు. హడావుడిగా వెంటనే మా టేబుల్ దగ్గరకి వచ్చి ఎందుకైనా మంచిదని జరిగిన సంగతి మా ఆవిడకి చెప్పేశాను. చెయ్యి వేయటం మా ఆవిడ చూసిందట, కానీ మా టేబుల్ లో కూర్చున్న చిన్నది అనుకుందిట. ఆ అమ్మాయి నాకు రెండో పక్కన ఉంది.
అసలు నా ప్రశ్న ఎందుకు ఆవిడ హఠాత్తుగా నా భుజం మీద చెయ్యేసి ఫోటో తీయించుకున్నది అని. నాకు ఆవిడ ఎవరో కూడా తెలియదు. తెలుసుకోకుండా ఏదో మునిగిపోతున్నట్లు పరిగెత్తుకు వచ్చేశాను. కళ్ళజోడు పెట్టుకోంగానే నేను అంత బాగున్నానా లేక నేను అసలు క్యుట్ గ ఉంటానా ? ఎప్పటినుండీ ఆవిడ నాతో ఫోటో తీయించుకోవాలని చూస్తోందో ! ఆ కళ్ళజోడు డాలర్ షాప్ లో కొన్న రీడింగ్ గ్లాస్ లని తెలిస్తే నాతో ఫోటో తీయించుకునేదా ? అంతులేని ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. ఈ మధ్య పోప్ గారు అమెరికా యాత్రలో (sept 25-26,2015) immigrants ని hug చెయ్యమని అన్నారుట. ఎందుకు ఆలోచిస్తారు నిద్రపోండి బహుశా పోప్ గారు చెప్పినట్లు హగ్ చేసుకుందేమో అని మా ఆవిడ అంది కానీ నాకు నమ్మకం కుదరటల్లేదు.
ఎప్పుడు నిద్ర పట్టిందో గుర్తులేదు. మా ఆవిడ ఆఫీస్ కి వెళ్తున్నాను కాఫీ అక్కడ పెట్టాను తాగమని చెప్తూంటే మెలుకువ వచ్చింది. ఇంటర్నెట్ లో ఎక్కడయినా ఆ ఫోటో అదే ఆ ఫోటో బయటికి వచ్చి మీరు చూస్తే దానిలో నా ప్రమేయం ఏమీ లేదని మీరు తెలుసుకోండి అందరికీ చెప్పండి.