Tuesday, September 26, 2017

137 ఓ బుల్లి కథ 125 ---- మన మెదడు (Brain ) ఎల్లా పనిచేస్తుంది ? - Part 6--మనలో ఓ కంప్యూటర్ ఉంది

మన అందరి దేహాల్లో ఓ కంప్యూటర్ ఉంది. మన చేత పనిచేయించే దదే. మనకి అది ఎల్లా పనిచేస్తుందో  చూచాయగా తెలుసు. కానీ అది సరీగ్గా పని చెయ్యకపోతే బాగు చేసే సామర్థ్యం మనకు లేదు.ఇంతెందుకు దాని భాగాలు తెలుసుకానీ, భాగాలనన్నిటినీ కలిపి పనిచేయించే ఆపరేటింగ్ సిస్టం (OS ) మనకి తెలియదు.

మన శరీరంలో  ఉన్న కంప్యూటర్ లో ముఖ్యభాగం మన మెదడు. మూడు పౌన్లు ఉన్న మన మెదడు ప్రపంచెంలో మన ఉనికిని కంట్రోల్ చేస్తుంది. ఇది మనలో ముఖ్యమయిన సమాచార కేంద్రం. మనము చూసిన(sight ), విన్న(hear ), తాకిన(touch ),రుచి చూసిన (taste ), వాసనలు (smell ) అన్నిటినీ క్రోడీకరించి దాచి పెట్టుకుంటుంది. అవసరమయినప్పుడు ఈ సమాచారాన్ని బయటికి లాగి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. రోజూ మనము చేస్తున్న పనులకన్నిటికీ ఇదే కారణం. మెదడు మనకి ఎంతో ముఖ్యం కనక శరీరం దాన్ని ఒక ఇనప్పెట్టె (skull ) లో దాచి పెట్టింది.

మనం చేసే నిర్ణయాలన్నీ మన మనస్సులో దాచ పెట్ట బడిన సమాచారం వలన జరుగుతుంది. మన మనస్సులో సమాచారం చేరవేసిది మనమే. మనం జీవితంలో చదివిన చదువులూ , మనం తిరిగిన సహచరులూ (తల్లి తండ్రులతో సహా) ఈ సమాచారానికి కారణం.అందుకనే  ఎంత ఎక్కువ చదువులు, అనుభూతులు చవి చూస్తే అంత మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు.

మెదడులో మూడు భాగాలు ఉన్నాయి. fore brain , mid brain , hind brain . ఇందులో fore brain చాలా పెద్దది. దీనిలో ఉన్న ముఖ్య భాగం cerebrum. ఇది రెండు భాగాలుగా విభజించ బడింది. దీనిలో కుడి భాగం మన శరీరంలో ఎడమ వైపు ఉన్న అవయవాలనీ , ఎడమ భాగం కుడివైపు అవయవాలనీ నియంత్రిస్తుంది (control ). ఈ రెండు భాగాలూ ఎప్పుడూ మాట్లాడు కుంటూ ఉంటాయి.  ఒక కాలు ముందరికి వేస్తే ఇంకొక కాలు వెనక్కి వేస్తే ప్రమాదం కదా.అవి మాట్లాడుకునే మార్గాన్ని corpus  callosium అంటారు. దీని మూలాన ఇంకొక వెసులుబాటు ఉంది. జబ్బు చేసి ఒక వేపు అవయవాలు పని చేయక పోతే రెండో వేపు దానిని సరి దిద్దటానికి ప్రయత్నిస్తుంది. దీన్నే brain plasticity అంటారు.

ఈ cerebrum నాలుగు భాగాలుగా విభా జించ బడింది. వీటిని frontal , parietal , temporal , occipatal lobes అంటారు. మన జీవితంలో చవి చూసిన అనుభవాలన్నీ ఈ నాలుగు lobes లో దాచి పెట్టబడి ఉంటాయి. ముఖ్యంగా cerebrum మీదఉండే cortex అనే పొర సమాచారం స్వీకరించి వెళ్లాల్సిన చోటుకి దానిని పంపుతుంది. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే మీకు ఒక సమస్య వచ్చిన  దనుకోండి, దానిగురించి ఇదివరకు మీకు తెలిసిన సమాచారం సేకరించి pre frontal cortex కు పంపిస్తుంది. అక్కడ తగిన నిర్ణయం తీసుకో బడుతుంది. అదే మీ నిర్ణయం. మీ నిర్ణయానికి మీ దగ్గరున్న సమాచారం ఎంత ముఖ్యమో తెలిసిందిగా! మీ మెదడులో ఉన్న సమాచారం మీ చదువులూ, మీ సాంగత్య అనుభవాలూ. జీవితంలో చదువులూ సాంగత్యాలూ ఎంత ముఖ్యమో ఇంకా చెప్పక్కరలేదు.

మెదడులో ఉన్న న్యూరాన్ అనే కణం(cell ) ఈ సమాచార సేకరణ, పంపిణీ కి మూలకారణం. ఇవి దాదాపు 100 బిలియన్ల నుండీ 200 బిలియన్ల దాకా మన మెదడులో ఉంటాయి. ఇరువది రెండు వయసునుండీ ఇవి రోజుకి షుమారు 200,000 చొప్పున చనిపోతూ ఉంటాయి. అందుకని వయసు పెరిగిన కొద్దీ మతిమరుపు రావటం వింతేమీ కాదు. న్యూరాన్ లో ఒక భాగం పేరు Axon. ఈ Axon కట్టలని నరాలు (nerves) అంటారు, కేబుల్ లాంటిది. వీటిపని మన దేహంలో సమాచారాన్ని ఒక చోటినుండి ఇంకొక చోటుకి చేరవెయ్యటం.

మనలో ఉన్న కంప్యూటర్ భాగాలు ముఖ్యంగా మూడు. మెదడు (brain ), వెన్నెముక (spinal cord ), నరాలు (nerves ). మెదడు, వెన్నెముక ని కలిపి central nervous system అంటారు. మెదడు నుండి వచ్చిన  నరాలన్నీ వెన్నెముక దగ్గరికి వచ్చి వాటి వాటి భాగాలకు చీలి పోతాయి. ఈ చీలిపోయిన నరాలని peripheral nervous system అంటారు. దీని పనల్లా మెదడు నుండి వచ్చిన  సమా చారాన్ని ఆయా అవయవాలకు చేర వెయ్యటం. ఆయా అవయవాల నుండి వచ్చిన సమాచారాన్ని మెదడుకి చేరవెయ్యటం.

Peripheral Nervous System లో ఉన్న వన్నీ నరాలు అయినప్పటికీ కొన్నిభాగాలు  చాలా ముఖ్య మైన పనులు చేస్తాయి. వేసవిలో మండుటెండలో బయట కాలు పెట్టామనుకోండి, వెంటనే చెప్పుల కోసం ఇంట్లోకి పరుగెడుతాం (sympathetic nerves మూలంగా). మన గుండె కొట్టుకోవటం, ఊపిరి పీల్చటం ఇవన్నీ మన ప్రమేయం లేకుండా autonimous nervous system మూలాన్న జరుగుతాయి(medulla oblongata). మనం నిద్రపోతుంటే మన శరీరాన్ని జాగర్తగా చూసేది parasympathetic nervous system . కొన్ని నరాలు వెన్నెముక నుండి బయల్దేరి అవయవాలను మెదడుకి కలుపుతాయి. వీటిలో కొన్ని మెదడు పంపిన సమాచారాన్ని కండరాలకు చేరుస్తాయి (Motor fibers ), కొన్ని మన చర్మం నుండీ, కండరాలనుండీ, కీళ్ల  నుండీ సమాచారం సేకరించి వెన్నెముకకు చేరుస్తాయి (sensory fibers).

మన శరీరంలోని కంప్యూటర్ సరీగ్గా పని చెయ్యాలంటే పోషక ఆహారం ముఖ్యం . అల్లాగే మన జీవితం సుఖంగా సాగాలంటే మన బుద్దులు వక్రమమార్గంలో ఉండకూడదు. మంచి బుద్దులు రావాలంటే  మంచి చదువులు మంచి స్నేహితులూ ఉండాలి. వాటినుండి మంచి సమాచారం  తీసుకుని మన మనస్సులో దాచి పెట్టుకుంటాం.

మాతృక:

1. దీనిలో బొమ్మలు google నుండి సేకరించినవి.

2. The Nervous System by Heather Moore Niver (2012)
     Gareth Stevens Publishing New York, NY 10003