పక్కింటి పరమేశం మాట్లాడకుండా ఇంట్లోకి వచ్చి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. సామాన్యంగా ఇట్లా ఉండడు. ఏదో మాట్లాడుతూ నవ్వు మొహం తో ఇంట్లోకి వస్తాడు. నాకు అనిపించింది ఇక్కడ ఎదో తిరకాసు ఉందని.
మొహం చూస్తే ఎదో బాధపడుతున్నట్లు ఉంది -- ఏమిటి సంగతి ? అన్నాను. సమాధానం లేదు. సామాన్యంగా బాధపడుతున్న వాళ్ళని "ఏమిటి బాధ" అని అడిగితే చెప్పలేరు. ఇంకో రూటులో పోవాలి.
ఇంట్లోకి పోయి బ్రూ కాఫీ చేసి తీసుకు వచ్చాను. ఇంటావిడ చేసిన కాఫీ రోజుకో విధంగా ఉంటే నేనే కాఫీ చెయ్యటం నేర్చుకున్నాను. బ్రూ కాఫీ పౌడర్ ఒక చెంచా (తలగొట్టి), రెండు చెంచాల (రౌండెడ్ ) coffeemate కప్పులో వేసి, ఒక అర చెంచా బ్రౌన్ షుగర్ కలిపేసి, కప్పులో ముప్పాతిక వరకూ వేడినీళ్లు పోస్తే కాఫీ బ్రహ్మాండం. కప్పులో వేడినీళ్లు ఎక్కువ తక్కువలయి రుచి కొంచెం అప్పుడప్పుడూ తేడా వస్తుంది కానీ దీనితో భార్య వేసిన కాఫీ సంకెళ్ళ నుండి బయటపడ్డాను. రోజూ ఆవిడ లేచి కాఫీ ఎప్పుడు పెడుతుందా అని చూసే వాడిని. ఇప్పుడు నేనే చేసుకుంటాను కాఫీ. నా కాఫీ బ్రహ్మాండం. ఇదో పాటగా వ్రాయచ్చల్లే వుంది. ఒకటి వ్రాసి పారెయ్యాలి త్వరలో.
పరమేశం కాఫీ ఎల్లా ఉందో చెప్పు అన్నాను. బాగుంది అన్నాడు. తరువాత నిశ్శబ్దం.
నా చిన్నప్పుడు కాఫీ ఇవ్వలేదని గొడవపెడితే మా అమ్మ ఓవల్టీన్ మీద కొద్దిగా కాఫీ కాషాయం పోసిచ్ఛేదని చెప్పాను. వింటున్నాడు. ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక పొద్దున్నేఅమ్మ కాఫీ కాస్తుంటే కుంపటి చుట్టూ ఎల్లా చేరేవాళ్ళమో చెప్పాను. రోజూ అమ్మ చేతి కాఫీ ఒకే విధంగా ఉంటుందని కూడా చెప్పాను. వెంటనే మా ఆవిడ కాఫీ రుచి రోజుకో విధంగా ఉంటుందని కూడా అంటించాను. ఇప్పుడు నీకిచ్చిన కాఫీ నేనే చేశానని గర్వంగా చెప్పేశాను. పరమేశం లో చలనం లేదు. ఎదో ఆలోచిస్తున్నాడు.
నిశ్శబ్దంగా మొహాలు చూస్తూ కూర్చోటం నాకు ఇష్టం ఉండదు. ఇంక నేను కాఫీ చేయటం ఎల్లా నేర్చుకున్నానో చెప్పటం మొదలెట్టాను. మొదట నాదంతా self taught అని చెప్పాను. మొదట్లో బ్రూ కాఫీ సీసా మీద ఉన్న రెసిపీ తో ప్రారంభించానని చెప్పాను. దాని మీద ఒక చెంచా కాఫీ పొడి వెయ్యాలని చెప్పారు గానీ అది తలగొట్టి వెయ్యాలనేది నేను కనుగొన్నానని చెప్పాను. గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి సున్నితంగా medium heat లో వేడిచేయాలని చెప్పాను. ఎందుకో ఉదహరించాను. నీళ్ళు మరిగే టప్పుడు ఆవిరి గా కొన్నినీళ్ళు పోతాయి అందుకని నీళ్లు కావలసిన దానికన్నా కొంచెం ఎక్కు వగా పోయాలని చెప్పాను. నీళ్ళు మరిగేటప్పుడు వచ్ఛే మ్యూజిక్ తప్పకుండా వినాలని చెప్పాను. సరిఅయిన సమయానికి, నేను రెడీ, కాఫీ కలుపుకో అని సిగ్నల్ వస్తుంది అని చెప్పాను. నేను కప్పులో cofeemate (పాలపొడి) ఎంత వెయ్యాలో చెప్పబోతుంటే;
పరమేశం పెద్దగా అరిచాడు. "శ్రీదేవి" అని. పరమేశానికి నా సొళ్ళు కబుర్లు వినే ఓపిక పోయింది. నేను చెప్పేవి వినలేక కొందరు లేచిపోతారు కొందరు అలా అరుస్తూ ఉంటారు. నాకు కావాల్సింది అదే. నా కోరిక ఫలించింది. పరమేశం ప్రాబ్లమ్ తెలిసిపోయింది. "శ్రీదేవి" అని.
శ్రీదేవి ప్రాబ్లమ్ ఎల్లా అయింది? నాకు అర్ధం కాలా. "శ్రీదేవి" చని పోయి చాలా కాలం అయింది కదా. నాకు బాగా గుర్తు నెలల క్రితం న్యూజెర్సీ "BJs " లో షాపింగ్ చేస్తుంటే మా అబ్బాయి ఫోన్లో చూసి వార్త చెప్పాడు . నేను పెద్ద పట్టించు కోలేదు. అప్పుడు నా ద్రుష్టి అంతా "free samples " మీద ఉంది.
శ్రీదేవి ఇంకా పరమేశం మనసులో మెదులుతోందా! నాకు ఆశ్చర్య మేసింది.
"శ్రీదేవి" అంటే నా కిష్టం అన్నాడు. నాకు తెలుసు ఆనకట్టకు గండి పడింది. ఇంక దానిని కొద్దిగా కెలికితే చాలు అన్నీమనస్సులోనుండి బయటికి వస్తాయి.
రామగోపాల్ వర్మకి కూడా శ్రీ దేవి అంటే ఇష్టం అన్నాను.
నాది అటువంటి ఇష్టం కాదు. అన్నాడు. ఏమిటో ఇష్టాలలో రకాలు ఉంటా యల్లె ఉంది.
పరమేశం నువ్వు బాధపడటం నా కిష్టం లేదు. పోయిన వాళ్ళు తిరిగి రారు కదా! ఇదంతా విధి చేసే నాటకంట అన్నాను. బాధపడి లాభంలేదు. మరిచిపోవటం మంచిది. చూడు జిలేబీ గారు శ్రీదేవి మీద ఒక చక్కటి పద్యం వ్రాసి ఎలా మర్చి పోయారో !
"అందాలమ్మికి దేవుడు తొందర గా జోల పాడి తోడ్కొని పోయెన్", "డెందము దుఃఖంబాయె న్నందరికి జిలేబియ విధి నాటక మిదియే !"
తన బాధలని ఇంకోళ్ళతో పంచుకోవాలని చాలా మందికి ఉంటుంది. పోనీ జిలేబీ గారి లాగా ఒక పద్యం ఆటవెలదో తేటగీతో వ్రాయి నా బ్లాగ్ లో వేస్తాను అన్నాను. నాకు అవి వ్రాయటం చేత కాదు అన్నాడు.
వేణు శ్రీకాంత్ అనే ఆయన, ఆయన బ్లాగ్ "పాటతో నేను" లో "మార్చి" నెల అంతా శ్రీదేవి పాడిన పాటలు వేశారు అన్నాను.
ఆ నెలరోజులూ శ్రీదేవి కోసం ఆయన బాధపడి నన్ను బాధ పెట్టారు అన్నాడు. పోనీ ఏమి చేయమంటావో చెప్పు నీ బాధ నేను చూడలేను అన్నాను. అంతా నిశ్శబ్దం.
"లక్కీ వెంకీ" అని అరిచాడు. కొందరికి మనసులోవి బయట పెడితే ఎవరేమి అనుకుంటారేమో నని భయం. చివరిదాకా లా గి, మనస్సు అతలా కుతల మైతే, మాటలు అరుపులుగా బయటికి కక్కు తారు. ఎవ్వరీ వెంకీ అన్నాను. మళ్ళా నిశ్శబ్దం.
"అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవార నీయనంతే ". నాకు వెంకీకి ఉన్న ధైర్యం ఉంటే ఎంత బాగుండేదో అన్నాడు. నోట్లో నుండి మాటలొస్తున్నాయి.వాటిని ఆపటం నాకిష్టం లేదు. ఇదేదో పాట లో చరణం లాగా ఉంది అన్నాను.
"అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మో అన్నీ గొడవలే". చూడు శ్రీదేవి ఎంత చక్కగా సమాధానం చెప్పిందో అన్నాడు. ఆ గ్రేస్, ఆ వాయిస్.
ఇదేదో డ్యూయట్ అని తెలిసిపోయింది. ఆపాట నీకు ఇష్టమా అన్నాను. అది ప్రాణం అన్నాడు. ఎవరికి ఏది ప్రాణమో ఈరోజుల్లో చెప్పటం చాలా కష్టం. శ్రీదేవిని మిస్ అవుతున్నావా అని అడిగాను. సిగ్గుతో తలవూపాడు.
ఏమి చేయమంటావు. నీ బాధ ఎలా తీరుతుంది , ఆపాట నా బ్లాగ్ లో వేయమంటావా? అన్నాను. అందుకే వచ్చాను అన్నాడు. నీ మీద ఎంత ఇష్టమున్నా, వేణూ శ్రీకాంత్ లాగా నెలరోజులు పోస్ట్ వెయ్యలేను, మాలిక వాళ్ళు వప్పుకోరు. ఒక సారే వేస్తాను అని చెప్పాను. సరే అన్నాడు.
OK folks . Hear it Goes.
అమ్మా శ్రీదేవీ పరమేశం అనే నీ ఫ్యాన్ తనకిష్టమైన పాటతో నీకు తెలిపే సందేశం:
"నువ్వెక్కడున్నా నా మనసులో ఎప్పుడూ ఉంటావు".