ముందరే చెబుతున్నాను ఈ ముద్దుగుమ్మ కధ వింటే మీకు కళ్ళు చెమరుస్తాయి. చాలా జాలిపడిపోయి బాధ పడి పోతారు. పాపం ఈ భామ, తను జీవితంలో ఎంతో కోరుకున్న పెళ్ళి డబ్బులేక మానుకోవాల్సొచ్చింది.
వివరాల్లోకి వెళ్తే ఈ ముద్దుగుమ్మ తన 14 ఏళ్ళప్పుడే ప్రేమలో పడింది. యువ ప్రేమికులిద్దరూ పెళ్లి చేసుకుందామని 18 ఏళ్ళకే తాంబూలాలు పుచ్చు కుని సహజీవనం చేపట్టారు. వాళ్ళ 20 వ పడిలో పిల్లలని కన్నారు. కష్టపడి చదువుకుని డిగ్రీ తెచ్చుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ భామకి ఎంతో గ్రాండ్ గ పెళ్లి చేసుకోవాలని ఉంది. దానికి $60,000 డాలర్లు ఖర్చు అవుతుందని లెక్క కట్టారు. వాళ్ళు ఎంత కష్టపడ్డా $15,000 డాలర్ల కన్నా దాచి పెట్ట లేక పోయారు. అందుకని పెళ్ళి శుభలేఖలు వేసి పెళ్ళి కి వచ్చే వాళ్లందర్నీ, ఒక్కొక్కళ్ళనీ బహుమతుల బదులు, $1500 డబ్బు లిచ్చి,పెళ్ళికి సహాయం చెయ్యమన్నారు. ఆహ్వానితులలో చాలామందికి ఇది నచ్చక పెళ్ళికి రామన్నారు. దానితో పెళ్ళి మానుకోవాల్సొచ్చింది.
దీనికితోడు పెళ్ళి ఆగిన తర్వాత కాబోయే పెళ్ళికొడుకు తన బెస్ట్ ఫ్రెండ్ తో కులుకుతున్నాడని తెలుసుకుంది.
పెళ్ళి ఆగిపోయింది,పెళ్ళి కొడుకు చెయ్యి జారిపోయాడు, మనస్తాపంతో మనస్సు క్లియర్ చేసుకోటానికి, ఈ కలుషపూరిత పరిసరాలు వదలి కొంత కాలం సౌత్ అమెరికాలో కొండల్లో కూనల్లో ఒంటరిగా తిరగాలనుకుంటోంది. జీవితంలో అన్నీ మనమనుకున్నట్లు జరగవు అని తెలుసుకుంది.
ఈ ముద్దుగుమ్మ పూర్తి కధ ఇక్కడ చదవండి:
https://www.yahoo.com/lifestyle/bride-canceled-her-wedding-guests-133300785.html