మా ఇంటి వెనక |
మా ఇంటి ముందు |
అమెరికాలో చలికాలం వచ్చేసింది. కాక పోతే ఈ సంవత్సరం కొంచెం ఆలాస్యంగా తన ప్రతాపం చూబెడుతోంది. ఇవాళ పొద్దున్న టెంపరేచర్ -14F (-25.5C) చూపెడుతోంది. ఫొటోలో తెల్లగా కనపడేదంతా స్నో. పొద్దున్న లేచినప్పుడు చెట్ల కొమ్మల మీద కూడా స్నో ఉంది కానీ ఈదురుగాలి మూలాన కిందకి రాలిపోయింది. పై ఫోటోలు తీసేటప్పుడు ఎండ బాగా ఉన్నది కానీ, బయటికి అడుగు పెట్టలేనంత చలి. తలుపు తీసి ఫోటో తీయటం కుదరలేదు.
దేశంలో చాలామందికి కరెంట్ పోయింది. ఈ చలిలో కూడా కరెంట్ వాళ్ళు వచ్చి బాగు చేస్తారు. అది కుదరక పోతే జనాన్ని వేడి ప్రదేశాలకి తరలిస్తారు.
మేము చికాగో దగ్గరలో ఉంటున్నాము కాబట్టి ప్రతీ సంవత్సరమూ మాకు ఇది అలవాటే. మా ఆవిడ ఇవాళ లైబ్రరీ లో ఉద్యోగానికి కూడా వెళ్ళింది. వీలయినంత వరకూ ఇక్కడ లైబ్రరీలు తెరిచి ఉంటాయి కారణం అవి చలికి మారుగా వేడిగా ఉండే షెల్టర్లు కూడా. మా ఆవిడ పనిచేసే లైబ్రరీలో ఇవ్వాళ పుట్టలమంది జనం వచ్చారుట (అందులో కొందరు T షర్టులు చేసుకోటానికి, అయోధ్య టెంపుల్ పాంఫ్లెట్స్ ప్రింట్ చేసుకోటానికీ కూడా). ఫ్రీగా కంప్యూటర్ లు వాడుకోటానికి, పుస్తకాలూ పేపర్లూ చదవటానికి జనం వస్తూ ఉంటారు కానీ ఇవ్వాళ చలి కాచుకోటానికి కూడా జనం వచ్చి ఉండచ్చు.
అమెరికాలో చలికాలంలో ముఖ్యంగా వచ్చే పండగలు మూడు , థాంక్స్ గివింగ్ , క్రిస్మస్, న్యూ ఇయర్. అవి నవంబర్ డిసెంబర్ లో వస్తాయి.
మేము క్రిస్మస్ కి "డల్లాస్" వెళ్ళాము. టెక్సాస్ రాష్ట్రానికి వెళ్ళటం ఇదే మొదటి సారి. మామూలుగా రోజూవారీ ఉష్ణోగ్రత చికాగో కన్నా ఎక్కువగా ఉంటుంది.మేమున్న దరిదాపుల్లో ఎక్కడ విన్నా తెలుగు మాటలే. ఇక్కడ కొత్తగా పిల్లలకోసం ఒక పాఠశాల తెరిచారుట. దానిలో 50% పైన తెలుగు పిల్లలే. మా దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ పేరు FOODISTHAN. నాకు మొదట అర్ధం కాలేదు గానీ తర్వాత తెలిసింది దానిపేరు , ఫుడ్ ఇస్తాను, అని. అల్లాగే ఒక కారు లైసెన్స్ ప్లేట్ "andebey " (ఏంది బే ). ఇక్కడ చాలా గుళ్ళు కూడా ఉన్నాయిట. వాటిల్లో దగ్గరలో ఉన్న , "వెంకటేశ్వర స్వామి", "హనుమాన్" గుళ్ళకి వెళ్ళాము.
"డల్లాస్" నుండి కారులో "ఆస్టిన్ " వెళ్ళాము. మధ్యలో "వాకో " అనే ఊరిలో ఆగాము. ఒకప్పుడు , "పాత ఇంటిని కొత్త ఇంటిగా మార్చటం", అనే TV ప్రోగ్రాం ఇక్కడ నుంచి ప్రసార మయ్యేదట. ఇక్కడ కాఫీ మాత్రం చాలా బాగుంది.
టెక్సాస్ కేపిటల్ భవనం |
"ఆస్టిన్" టెక్సాస్ రాష్ట్ర రాజధాని. విశాలమైన ఆవరణ ఉన్న తోటలో చక్కటి రాజ భవనం ఉంది. కొద్ది దూరంలో అయిదారు అంతస్థుల లైబ్రరీ ఉంది. ఇక్కడ పై అంతస్థులో మేడ మీద గార్డెన్ ఉంది. ఇక్కడ ప్రతీ లైబ్రరీ లో మేకర్ స్టూడియో అని ఉంటుంది. సూయింగ్ మెషిన్ లూ , 3D ప్రింటర్ వగైరా వగైరా , కళల కి ప్రాధాన్య మిచ్చేవి వీటిల్లో ఉంటాయి. వాటిని వాడటానికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. అక్కడ మా ఆవిడ ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళు నువ్విక్కడ పనిచేయ కూడదా అని అడిగారు. (రహస్యం మా ఊళ్ళో మా ఆవిడ లైబ్రరీ మేకర్ స్టూడియోలో పనిచేస్తుంది). ఇక్కడ నాకు ఆశ్చర్యమేసింది లైబ్రరీ వరండాలో ఫోన్ లేని వాళ్ళ కోసం పెట్టిన "ఫ్రీ ఫోన్". అమెరికా లో కూడా నిరుపేదలు ఉన్నారు.
"ఆస్టిన్" నుండి "హ్యూస్టన్" కి వెళ్లి NASA వాళ్ళ మ్యూజియం చూశాము. అక్కడ నాకు బాగా నచ్చినవి, అంతరిక్షం నుండి తిరిగివచ్చిన షటిల్ ని మోసుకు వెళ్లిన ప్లేన్ , అంతరిక్షం లోకి వెళ్లి వచ్చిన రాకెట్, దాని విడి భాగాలూ. రాత్రికి మళ్ళా "ఆస్టిన్" కి తిరిగి వచ్చాము.
"ఆస్టిన్" నుండి మర్నాడు "సాన్ ఆంటోనియో" వెళ్ళాము. మధ్య దారిలో "ఒయాసిస్" అనే రెస్టారెంట్ కి వెళ్ళాము. అది ఎందుకు వెళ్ళామంటే "ఫిదా" మూవీ లో హీరో హీరోయిన్ అక్కడ బాల్కనీ లో "వ్యూ " చూస్తూ మాట్లాడుకుంటారుట. ఆ "వ్యూ " చూద్దామని. ఆ రోజు చలి ఈదురు గాలి దానికి తోడు రెస్టారెంట్ సర్వర్లు పెద్దగ సహకరించలేదు. నేను బాల్కనీ లో ఈదురు చలిగాలి లో కూర్చోలేక లోపల ముసలాళ్ళ బెంచీమీద కూర్చుని తినటానికి వెయిట్ చెయ్యాల్సి వచ్చింది.
ముసలాళ్ళ బెంచి |
"సాన్ ఆంటోనియో" అనే ఊరు అమెరికన్ సివిల్ వార్ లో ఒక ప్రముఖ పాత్ర వహించింది. ఇక్కడ యుద్ధంలో "మెక్సికో " ని ఓడించి టెక్సాస్ ను వశం చేసుకున్నారట. మేము వెళ్లేసరికి సాయంత్రం అయ్యింది, చీకటి, చలి, ఆ రోజే ఒక ముఖ్యమయిన "ఫుట్బాల్ " ఆటట అక్కడ వీధుల నిండా పిల్లా పెద్దా జనం. పార్కింగ్ సమస్య అయ్యింది. ఒక చోటుకు పోతే $40 చెప్పాడు. నాయనా తక్కువలో ఏమన్నా ఉందా అంటే, పక్క వీధిలో అయిదు డాలర్లే అక్కడికి వెళ్ళమని చెప్పాడు. ఎప్పుడైనా తెలిసిన వాళ్ళని అడగటం మంచిది.
ఈ వూళ్ళో చూడవలసింది ఎక్కవలసింది, బోటు షికారు. ఒక గంట Q లో నుంచున్న తరువాత విహారయాత్రకు బోటు లో ఎక్కాము. ఆ ఊరిలో కాలువలో బోటు మీద అరగంట విహార యాత్ర. చుట్టూతా ఉన్న షాప్స్ చూస్తూ తిప్పుతారు. ఎప్పుడైనా బోటు ఎక్కినప్పుడు ఆ బోటు కెప్టెన్ చెప్పిన మాట వినాలి. మా బోటు కాప్టెన్ , అమ్మాయి, మొదట చెప్పింది "బోటు" కదిలిన తరువాత లేచి నుంచో వద్దు అని. ఒకాయన లేచి నుంచిని ఫోటోలు తీసుకుంటున్నాడు. మూడు సార్లు వార్ణింగ్ ఇచ్చింది. మధ్యలో దించేస్తానంటే గానీ ఆయన వినలేదు. ఆయన మన దేశస్థుడే. ఇంట్లో బయటా ఎక్కడయినా కెప్టెన్ చెబితే తప్పకుండా వినాలి.
ఈ చలికాలం "డల్లాస్" ట్రిప్ లో నాకు బాగా నచ్చినవి మూడు.
మొదటిది "ఆస్టిన్" లో మేమున్న చోట ఉన్న "Domain " షాపింగ్ సెంటర్ లో పొద్దున పూట, లేత ఎండలో సన్నని చలిలో రాళ్లు పరిచిన వీధిలో నెమ్మదిగా నడుచుకుంటూ షాపులు చూసిన మార్నింగ్ వాక్. థాంక్స్ అపూర్వా .
క్రిస్మస్ పార్టీ |
మూడవది "కొండా" గారింట్లో న్యూ ఇయర్ పార్టీ. పిల్లలు పెద్దలూ ఆట పాటలూ, కొత్తసంవత్సరం డాన్స్. నేను మా ఆవిడా కాసేపు గెంతులు వేశాం. థాంక్స్ కొండా గారూ.
న్యూ ఇయర్ పార్టీ |
ఈ రెండు పార్టీలలోనూ పిల్లలు చాలా చక్కగా యాక్టీవ్ గా పాల్గొన్నారు. థాంక్స్ ఫర్ దెమ్ . అసలు చాలా ముఖ్యమయిన వాళ్ళు "ఇంటి దేవతలు" వాళ్ళు లేకపోతే ఇంత చక్కగా ఏర్పాట్లు జరిగేవి కాదు. మిలియన్ థాంక్స్ ఉమా, పద్మా , సరీతా , సురేఖా , భార్గవీ, కామేశ్వరీ.
క్రిస్మస్ పార్టీలో మేము |