డియర్ ఎమీ: ఈ మధ్య నేను temporary job లో పనిచెయ్యటం మొదలెట్టాను. నా కంటే బాగా పెద్ద ఆయన గూడా అక్కడ పనిచేస్తున్నారు. కాకపోతే ఆయనది పర్మేనేంట్ పొజిషను. ఆయన చాలా స్నేహముగా ఉంటారు కాని కొంచం తలతిక్క. ఆయన ఈమధ్య నన్ను ఒక షాప్ కు వెళ్ళి కొన్ని తినే పదార్దములు కొనుక్కు రమ్మన్నారు. దానికి ఆయన డబ్బులిస్తానని చెప్పినారు. అల్లాగే నా మధ్యాహ్నపు భోజనం పంచు కుందామని కూడా అన్నారు. నేను వీటన్నిటికీ వప్పుకుని చేశాను.
క్రిందటి వారము నాలాంటి temporary ఇంకొకళ్ళు ఈయనకి భోజనము తీసుకు వస్తుంటే చూశాను. నా ఉద్దేశం లో ఆయనకి శక్తి లేక షాపు దాకా నడచి వెళ్ళటము కష్టముగా ఉన్నటుల కనిపిస్తోంది. ఆయనకి ఆదుకునే దిక్కు కూడా లేనట్లు ఉన్నది.
ఈ పరిస్థితి నాకు కొంచెము బాధాకరముగా ఉన్నది, ప్రతీ వారం ఆయనకోసం బయటకు వెళ్ళి తీసుకు రావాలంటే నాకు కొంచెము కష్టమవుతుంది. దానికి తోడు ఈ విధముగా ఆయన నామీద ఆధార పడి ఉండటం ఆయన కష్టాలకు శాశ్వత పరిష్కారము కాదు.
ఆయన రొజూ పనిచెబితే నేను ఏమి చేసేది. మీరు నాకు ఏమి సలహా ఇస్తారు ?.
మన ఈ సంఘము లో వృద్ధులను సంరక్షించుటలో మన కర్తవ్యములేమిటి?
ఇట్లు, చిన్నపనుల రన్నర్
డియర్ రన్నర్: మీ బాధ నాకు అర్ధమవు తున్నది, ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి కానీ ఎంత కాలం. మీరు కొంతకాలం ఈ విధముగా కొనసాగించండి. వారానికి రెండు రోజులు మీరు తెస్తానని చెప్పండి. మీ లాగే మిగతా వాళ్ళు కూడా పని పంచు కునే ప్రయత్నం చేయండి. కానీ సహాయము చేయటం మాన కండి.
మీ పెద్దవాళ్ళను (grandparents ) గుర్తుకు తెచ్చుకోండి, వారికి కూడా ఈ విధముగానే చిన్నపనులు పెద్దపనులు, స్నేహితులో, పక్కిన్టివాళ్ళో , దారే పోయేవాళ్ళో ఎవరో అవసరము అయినప్పుడు సహాయము చేస్తూనే ఉంటారు.
చాలా మంది వృద్ధులు భోజనానికి ఇబ్బంది పడుతూ వుంటారు -- మీ ఆఫీసులో స్నేహితుని లాగా, బయటకు వెళ్ళటానికి వీలు లేక,
సత్తువ లేక.
మీ ఊళ్ళో ఉన్న "office on aging " ని కనుక్కుంటే వాళ్ళు మీ స్నేహితుని జీవితం కొంచెము సులువయ్యేట్లు చూడ గలుగుతారు.
సమస్యని పరిష్కరించటానికి ప్రయత్నించి నందుకు ధన్యవాదములు.
చివరిమాట: మీరేమంటారు ?
మీరు US లో ఉంటే సీనియర్స్ కి సహాయము చెయ్యటానికి State, County, Township and city లెవెల్ లో చాలా సంస్థలు ఉన్నాయి. మీకు నిస్సహాయతతో ఎవరన్నా కనపడితే దయచేసి ఆ సంస్థల తోటి కలపండి. సీనియర్ సర్వీసెస్ అని గూగుల్ చేస్తే నంబర్లు దొరుకుతాయి. ఉదా: Naperville Township కి 'Dial A Ride' ప్రోగ్రాం ఉంది. అల్లాగే 'Meals on Wheels' ప్రోగ్రాం. 'Food Pantry' ప్రోగ్రాం.