Monday, December 26, 2011

78 ఓ బుల్లి కథ 66 --- మనకు కావాల్సిన ముఖ్యమయిన విటమిన్స్, సప్లిమెన్ట్స్

ముందుమాట: మనకి ఏ విటమిన్స్ సప్లిమెన్ట్స్ ముఖ్యంగా కావాలి, మనము ఏ ఆహారం తీసుకుంటే అవి వస్తయ్యో చెప్పటానికే ఈ పోస్ట్.

ఈ క్రింది సమాచారం Nissa Simon గారు AARP Bulletin  (Oct 2010) కి వ్రాసిన వ్యాసం నుండి సేకరించినది. వారు వ్రాసిన దానికి మూలం USDA Human Nutrition Research Center on Aging at Tufts University Boston (USA).


1. Vitamin B6
ఏ ఆహారాల్లో ఉంటుంది:  బీన్స్, నట్సు, కోడి గుడ్లు, ముడి పదార్దములు (whole Grains).


2. Vitamin B12
ఏ ఆహారాల్లో ఉంటుంది:  Fish, Shell fish, meat, dairy products.


3. Vitamin C
ఏ ఆహారాల్లో ఉంటుంది:  Citrus Fruits, Tomatoes, Kiwi, Strawberries


4. Vitamin D
ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ D ( D 3) ముఖ్యంగా కావాలి. 

ఏ ఆహారాల్లో ఉంటుంది:  Fatty Fish. రోజుకి 15 నిమిషములు ఎండలో ఉన్నా వస్తుంది.


5. Vitamin E  
దీనిని రోజుకు 2000 IU తీసుకుంటూ ఉంటే "Alzheimer's" ఉదృత 19% వరకు తగ్గించ వచ్చని  పరిశోధకులు తేల్చారు.
ఏ ఆహారాల్లో ఉంటుంది:  Vegetable oils, nuts, vegetables.


6. Folic acid
ఏ ఆహారాల్లో ఉంటుంది:  dark leafy vegetables,  ముడి పదార్దములు (whole Grains) తో చేసిన రొట్టెలు.


7. Vitamin K    
ఏ ఆహారాల్లో ఉంటుంది: Plant oils, green Vegetables, Cabbage, Cauliflower.

8. Calcium       
ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ D ( D 3) ముఖ్యంగా కావాలి. 

ఏ ఆహారాల్లో ఉంటుంది: Dairy products, green leafy vegetables, bok choy.

9. Magnesium   
ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ D ( D 3) ముఖ్యంగా కావాలి. 

ఏ ఆహారాల్లో ఉంటుంది: Whole grains, nuts, green vegetables.

10. Omega-3 fatty acids
ఏ ఆహారాల్లో ఉంటుంది: Fatty fish such as salmon, tuna, herring and sardines; walnuts, flax seed, tofu and canola oil.

11. Potassium 
ఏ ఆహారాల్లో ఉంటుంది: Cantaloupe, bananas, yogurt, sweet potatoes and leafy green vegetables.

12. Selenium   
ఏ ఆహారాల్లో ఉంటుంది: Red meat, fish, chicken, vegetables.

పైన సమాచారాన్ని క్రోడీకరిస్తే:
మన ఆరోగ్యానికీ, రోగ నివారణ శక్తీ పెంపొందటానికి క్రింద వాటిని తరచుగా తినటం మంచిది. :
ముడి ధాన్యాలు, వృక్షముల నుండి (Plant based) కూరగాయలు, నూనెలు వాడటం చాలా మంచిది .

1. రోజుకి పదిహేను నిమిషాలు ఎండలో పనిచేయటం (నడవటం కూడా పనే).
2. వాడవలసిన ధాన్యాలు: హోల్ గ్రైన్స్, ముడి ధాన్యాలు (దంపుడు బియ్యము, రాగులు, సజ్జలు మొద..)
3. తినవలసిన కూరలు: బీన్సు, కాబేజీ, కాలీఫ్లవరు, చిలకడ దుంప, టొమాటోలు.
4.  తినవలసిన ఆకు కూరలు: తోటకూర, బచ్చలి కూరా, కొతిమెర, గోంగూర.
5.  తినవలసిన పళ్ళు:  అరటి, కరబూజ, కీవీ, స్ట్రా  బెర్రీస్, మామిడి, నారింజ, నిమ్మ.
6. తిన వలసిన నట్స్: ఫ్లాక్స్  సీడ్, వాల్ నట్సు, బాదం పప్పు (Almonds ). 
7. తాగవలసినవి: పాలు, పెరుగు, మజ్జిగ, టోఫు.
8. వాడవలసిన నూనెలు: కనోల ఆయిల్, ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్.

చివరి మాట: మనము రోజూ తీసుకునే శాఖాహారంలో vegetables, green leafy vegetables, whole grains, dairy products, vegetable oils, nuts, citrus fruits వుండటం చాలా మంచిది.


మీకు వీటిగురించి ఇంకా తెలుసుకోవాలంటే గూగుల్ చెయ్యండి లేక క్రింద రిపోర్ట్ చదవండి :
Essential Vitamins and Nutrients

1. Vitamin E and Alzheimer's

Monday, December 19, 2011

77 ఓ బుల్లి కథ 65 --- మళ్ళా న్యూఇయర్ వస్తోంది


"What we have done for ourselves alone dies with us; what we have done for 
others and the world remains and is immortal." ~ Albert Pike

ముందు మాట: మెర్రీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.

ఇక్కడ అమెరికా లో మామూలుగా ప్రతీ సంవత్సరం ఈ సమయములో జరిగేది; వచ్చిన డొనేషన్ రిక్వెస్ట్ లను ముందర వేసుకుని కూర్చుని చెక్స్ వ్రాయటం. నేను చాలా లేటు, కానీ ఆపని ఈవేళ పూర్తి చేశాను. ఎంతో తృప్తిగా ఉంది.

మనం సంఘ జీవులం. కొట్టుకున్నా తిట్టుకున్నా మనము మన సంఘాన్ని వదలలేము. దీనికి కారణం వంటరి బ్రతుకు దుర్భరం అని మనందరికీ తెలుసు. అందుకనే మనం మన చుట్టూతా మన కిష్టమయిన వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో సుఖంగా ఉందామని చూస్తాం. ఈ ఇష్టా ఇష్టాలు కాల క్రమేణా మారుతూ ఉంటాయి కాబట్టి మన చుట్టూతా ఉన్న వాళ్ళని కూడా మారుస్తూ ఉంటాము. ఇది రోజూ మనము అనుకోకుండా చేసే ప్రక్రియే. కానీ మనకు ఇష్టమయినా లేకున్నా మన అసలు ప్రకృతి మారదు. మనం ఒంటరిగా ఉండలేము వాళ్ళ తో తప్ప.

మనం అందరి జీవితాలనీ తీర్చి దిద్దలేము. సుఖవంతమూ చెయ్యలేము. కానీ ఏతా వాతా సహాయం చెయ్యాలనే చూస్తాం. ఎందుకంటే ఎవరయినా బాధ పడుతుంటే మనం చూడలేము. సంవత్సరానికి ఒక రోజు మనం, కూర్చుకున్న ఆ "మనం" లో మనకన్నా బాధపడుతున్న వాళ్ళని మన వాళ్ళుగా జేర్చుకుందాం. మన ఆనందాన్ని పంచుకుందాం. హైతీ లో భూకంపాలయినా, జపాన్లో  సునామీ లయినా  అవి వాళ్ళు కోరుకుని తెచ్చుకున్న బాధలు కావు. అటువంటి దురదృష్టాలు ప్రపంచం లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం సంఘజీవులం. మనం మనం సహాయం చేసుకోవాలి. అందుకనే కనీసం సంవత్సరానికి ఒకరోజు మనం కూర్చుకున్న ఆ "మనం" లో వీళ్ళని చేర్చుకుందాం. మీకు డొనేషన్ రిక్వెస్ట్ లు వస్తే తోచినంత వెంటనే పంపండి.

స్టాంపులు అతికిచ్చి డొనేషన్ కవర్లు అన్నీ పోస్ట్ చేశాను. ఈ సంవత్సరానికి స్టాంప్ లన్నీ అయిపోయాయి. కొత్త బుక్ కొనుక్కోవాలి.

చివరిమాట: క్రిస్మస్ కి ఇంకా నాలుగు రోజులుంది. మనమిచ్చే  ఈ చిన్న సహాయాలతో  వచ్చే సంవత్సరాంతం వరకూ వాళ్ళు ఎవర్నో ఎప్పుడో ఎక్కడో ఈ ప్రపంచంలో ఆదుకుంటారు. మన చుట్టూతా లేని మన వాళ్ళందరికీ మనం సహాయం చేయకలుగుతాము. అది ఎనలేని త్రుప్తి.

Monday, December 12, 2011

76 ఓ బుల్లి కథ 64 --- బ్రెయిన్ - జీవాత్మలో పరమాత్మ

ముందుమాట: పరిణామ క్రమం (Evolution) గురించి చదివిన తరువాత నాకు రెండు ప్రశ్నలు మనస్సుని కెలుకుతున్నాయి. వీటి గురించి వ్రాయక పోతే ముందుకి సాగలేక పోతున్నాను. వాటిని ఇక్కడ వ్రాశాను. ఇక చదవండి. నా సందేహాలు తీర్చండి.


1. మిలియన్ల సంవత్సరాలు పట్టినా, ఓపికగా ఏక కణ జీవి నుండి కణ రూపంతరములు చెంది కొత్త కణములు సృష్టించుకొని, మానవుడి సృష్టి జరిగింది. మానవుని సృష్టించే పనిలో మధ్య మధ్య  ఎన్నో అవతారాలు (చెట్లు, జలచరాలు, జంతువులూ,పక్షులు) సృష్టించ బడ్డాయి.  శాస్త్రజ్ఞులకు తెలిసినంత వరకూ ఇది ఒక ఎడతెగకుండా ముందుకు పోయే పరిణామ క్రమం. రాబోయే కాలంలో ఇంకా ఎన్ని అవతారాలు సృష్టిలోకి వస్తాయో మనము ఊహించలేము.

కణాలకి జీవించ గల శక్తి ఉంది. ఆ జీవ శక్తికి ఒక మొదలు ఉంది ఒక చివర ఉంది. ఆ మధ్య కాలంలో దాని జాతిని పెంపొందించుకునే జీవ శక్తి ఉంది (duplication).  దీనినే జీవాత్మ అంటామా?. ఆ జీవాత్మను మనము సృష్టించ గలమా? కణాలకి ఆ జీవశక్తి ఇచ్చిన దెవరు? దానిని ఇచ్చిన వారిని పరమాత్మ అంటామా?. ఈ రెండు శక్తులనీ సృష్టించటం నాకు తెలిసినంత వరకూ మన చేతులో లేదు . ఈ  అపురూప శక్తి కారకుడిని మనము దేముడు అంటామా?

2. ఈ అనంతమయిన సృష్టిలో ఏ ఒక్కటి ఇంకొక దానితో పోలి ఉండదు. కారణం వాటిల్లో జన్యువు (DNA) ఒక్కటిగా ఉండదు. ( DNA టెస్టింగ్ చేసే కారణము ఇదే. కొద్దో గొప్పో మనలో కలిసి ఉండేది అమ్మ నాన్నల DNA .)

మానవుల తత్వాలని నిర్ధారించేది DNA  అయినప్పుడు, మన అందరిలో  DNA  ఒకటి కానప్పుడు, ఏపని కలిసి చేసినా మన అందరిలో సమానత్వం ఎక్కడనుండి వస్తుంది? మనలో సామరస్యం ఎక్కడ ఉంటుంది?

చివరిమాట: అసమత్వాల మనుషులతో సమానత్వాలని చూసికుని జీవించా లంటే కష్టమే. ఏ అడ్డంకులు లేకుండా ఏదీ ప్రశాంతంగా జరగదు. గుంపు ఎక్కువయిన కొద్దీ గుద్దులాట తధ్యం.

ఈ పోస్ట్ పాత పోస్ట్ కి ఉప భాగము (Continuation) :
75 ఓ బుల్లి కథ 63 --- బ్రెయిన్ - సృష్టిలో న్యురాన్ పుట్టుక