ముందుమాట: మనకి ప్రకృతి పరంగా సహజంగా దొరికే ఆహారపదార్ధములతో మనకు కలిగే వ్యాధులను నివారించ వచ్చా, అనే అంశం మీద చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగా " బీట్రూట్ జ్యూస్ , బ్లడ్ ప్రెజరు మీద ఎటువంటి ప్రభావము చూపుతుంది" అనే అంశం మీద పరిశోధనా ఫలితాలు చెప్పటానికే ఈ పోస్ట్.
మన జీవితం వ్యాధులు రాకుండా సక్రమంగా గడవాలంటే శరీరంలోని అవయవాలు అన్నీ సక్రమంగా పని చేయాలి. అవి సక్రమంగా పనిచెయ్యాలంటే వాటికి కావలసిన ప్రాణ వాయువు, పోషక పదార్ధాలు సరియిన టైముకి సరీగ్గా అందాలి. అంటే శరీరంలో అన్ని అవయవాలకి కావలసిన పోషక పదార్ధాలు తీసుకు వెళ్ళే రక్తము సక్రమంగా సరియిన సమయములో వాటికి చేరాలి.
మన శరీరములో రక్త నాళముల ద్వారా అన్ని అవయవములకు రక్తము చేరుతుంది. ఈ రక్తప్రసరణ మన గుండె ద్వారా 24 గంటలూ జరుగుతుంది. గుండె సరీగ్గా రక్తమును పంప లేక పోయినా, రక్తనాళములలో అవరోధములు కలిగి రక్త ప్రసరణ సరీగ్గా జరగక పోయినా, ప్రాణ వాయువు, పోషక పదార్దములు అవయవములకి అందవు. అందువలన అవి సరీగ్గా పనిచెయ్యక పోవచ్చు. ఈ రక్త ప్రసరణ లోప వ్యాధులను Cardiovascular diseases అంటారు.
ఇటువంటి పరిస్థుతులలో మన శరీరం మామూలుగా nitric oxide అనే పదార్ధాన్నితయారు చెయ్య గలిగి ఉంటుంది. ఇది రక్త నాళాలని అవసరమయినప్పుడు పెద్దవి చేసి రక్తము అన్ని చోట్లకు అందే విధముగా సరిచేస్తుంది. కానీ వయసు పెరుగుతున్న కొలదీ, దీని ఉత్పత్తి తగ్గుట మూలముగా రక్త నాళములు సరిచేయు ప్రక్రియ సక్రమముగా జరుగక, రక్తము సరీగ్గా అందక వ్యాధులు వచ్చును. అటువంటి పరిస్థుతులలో సమస్యను పరిష్కరించుటకు తగిన మందులు వాడ వలసి వచ్చును. ఉదాహరణకి angina, or chest pain, కి వాడే మందు nitroglycerine రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ని పెంచి దాని ద్వారా రక్త నాళాలను వ్యాకోచింప చేసి, రక్తమును సక్రమముగా ప్రవహింప చేసి, కలిగిన బాధను పోగొట్టును. మన శరీరము nitroglycerin tablets లో ఉన్న Nitrates ను తీసుకుని Nitric Oxide తయారు చేయుట వలన సమస్య పరిష్కార మయినది.
మనము Nitrates ఉన్న ఆహారము తినిన యడల, వాటిని ఉపయోగించి మన శరీరము Nitric Oxide ను తయారుచేసి వ్యాధిని నివారించ గలదా? అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.
అందులో ఒక పరిశోధన "Barts and The London School of Medicine" లో జరిగింది. ఇక్కడ volunteers కి రోజుకి రెండు కప్పుల బీట్ రూట్ జ్యూస్ ఇచ్చి వారి బ్లడ్ ప్రజరు ని రికార్డ్ చేయగా ఒక గంటలో బ్లడ్ ప్రజరు తగ్గుట గమనించారు. దీని ప్రభావం 24 గంటల వరకూ ఉంటుందని కూడా గమనించారు. ఈ పరిశోధనా ఫలితాలు American Heart Association's medical journal, Hypertension, లో ప్రచురించారు.
బీట్రూట్ జ్యూస్ లో ఉన్న Nitrtes , Nitroxide గ రూపాంతరము చెందటము మూలంగా బ్లడ్ ప్రజరు తగ్గిందని నిర్ధారించారు. కానీ రోజుకు రెండు కప్పుల బీట్రూట్ జ్యూస్ తాగటము మూలంగా బరువు పెరిగే అవకాశము ఉన్నది అని కూడా గ్రహించారు. దీనికి కారణము రెండు కప్పుల బీట్రూట్ జ్యూస్ లో, 50 గ్రాముల కార్బో హైడ్రేటులు ఉండి 200 కేలరీల శక్తి కలిగి ఉండుటయే. అందుకని బీట్రూట్ జ్యూస్ వాడిన తరువాత, మన బరువు పెరగకుండా ఉండుటకు, మనము తినే ఆహారములో కొన్ని సర్దుబాట్లు చేయవలసి వచ్చును.మనము వాడే కూరలు spinach, cabbage, radishes లో కూడా Nitrates ఉన్నవి.
చివరి మాట: మీ మీ ఆరోగ్య విషయములలో ఎప్పుడూ మీ డాక్టరు గారిని సంప్రదించి మాత్రమే తగిన చర్యలు తీసుకొనుట మంచిది.
ఈ క్రింది వాక్యాలు మాతృకలో నుండి కాపీ చేశాను:
In the human body, nitrate is converted to nitric oxide, a substance that is known for its ability to dilate blood vessels and subsequently reduce blood pressure.
Nitrate occurs naturally in many vegetables, including spinach, cabbage, radishes and, of course, beets.
Among the study participants (drinking two cups of beetroot juice daily significantly reduced blood pressure in healthy volunteers), blood pressure fell within just one hour of drinking the beetroot juice, with the greatest drop occurring three to four hours following consumption. The blood pressure-lowering effects continued for up to 24 hours afterward.
Many experts blame the steady decline in nitric oxide production for many age-related diseases and disorders of the cardiovascular system, including high blood pressure, hardening of the arteries, heart disease, sexual dysfunction and peripheral vascular disease.
దీని మాతృక:
Your Health by Dr. Rallie McAllister
Daily Dose of Beetroot Juice Lowers Blood Pressure, Boosts Cardiovascular Health
http://www.creators.com/health/rallie-mcallister-your-health/daily-dose-of-beetroot-juice-lowers-blood-pressure-boosts-cardiovascular-health.html
Rallie McAllister is a board-certified family physician, speaker and the author of several books, including "Healthy Lunchbox: The Working Mom's Guide to Keeping You and Your Kids Trim." Her website is www.rallieonhealth.com. To find out more about Rallie McAllister, M.D., and read features by other Creators Syndicate writers and cartoonists, visit the Creators Syndicate Web page at www.creators.com
బ్లడ్ ప్రెజరు మీద నా పాత పోస్ట్:
49 ఓ బుల్లి కథ 37 ---- బ్లడ్ ప్రెజరు తగ్గించే పళ్ళు కూరలు
http://mytelugurachana.blogspot.com/2011/03/49-37.html