జీవత్వం ఉన్న ప్రతి జీవి లోనూ జీవ కణాలు చస్తూ, పుడుతూ ఉంటాయి. ఈ పునరుత్పత్తి మనకు తెలియకుండానే జరుగుతుంది. కానీ ఆ పునరుత్పత్తి కి కావలసిన ముడిపదార్ధములు లేకపోతే అది ఆగిపోతుంది. మనకి కలిగే శరీర బాధలకి అనారోగ్యాలకీ కొంత కారణం ఈ పునరుత్పత్తి తగినంత లేకపోవటమే.
మన శరీరంలో ఎముకల బలహీనత వలన వచ్చే వ్యాధిని Osteoporosis అంటారు. శరీరంలో కాల్షియం తగ్గితే ఈ వ్యాధి రావటానికి అవకాశం ఉంది. గట్టిగా ఉండాల్సిన ఎముకలు మెత్తగా అయి వంగి పోతాయి. దురదృష్ట వశాత్తూ ఈ వ్యాధి ముదిరిపోయిన తరువాత కానీ దాని చెడ్డ లక్షణాలు బయటికి కనపడవు. ఉదా: ఎత్తు తగ్గటం, వంగి నడవటం, కాళ్ళ నెప్పులు, ఎముకలు విరగటం, విరిగినవి సరి అవటానికి చాలా కాలం పట్టటం మొదలయినవి.
మన శరీరం మనం తినే ఆహారముల నుండి కాల్షియం, ఫాస్ఫేటులను తీసుకుని ఎముకలని నిర్మిస్తుంది. మన అందరిలో దాదాపు 25 ఏళ్ళప్పుడు మన శరీరంలో కాల్షియం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. మన జీవిత కాలంలో అంతకన్నా పెరగదు. ఆ తరువాత అంతా ఇచ్చి పుచ్చుకోటాలే. అందుకనే ఆ వయసులోపల కాల్షియం ఉన్న పౌష్టికాహారం తీసుకొనుట చాలా ముఖ్యం.
అమెరికాలో ఏభై ఏళ్ళ తరువాత, స్త్రీలలో అయిదుగుర్లో ఒకరికి , మగవాళ్ళల్లో ఎనిమిదిలో ఒకరికి ఈ వ్యాధి వస్తోంది. ఇది రావటానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్య కారణం శరీరంలో తగినంత కాల్షియం తయారు అవక పోవటం, తయారయిన కాల్షియం మూత్రము ద్వారా బయటికి వెళ్ళిపోవటం. వయస్సు పెరిగిన కొద్దీ సెక్సు హార్మోనులు తగ్గటం కూడా ఒక కారణం. పొగ త్రాగుట, మద్యము సేవించుట, పని చేయకుండా సోమరిగా ఒక చోట కూర్చుండుట కూడా కారణాలే. ఉప్పు ఎక్కువ తినుట కూడా ఒక కారణం. ఎంత ఎక్కువ ఉప్పు తింటే అంత కాల్షియం మూత్రము ద్వారా పోతుంది.
మనము రెండు విధములుగా కాల్షియం ను శరీరమునకు అందించ వచ్చును. మొదటిది మాత్రల ద్వారా. మాత్రల ద్వారా శరీరమునకు కాల్షియం అందిన, అది జీర్ణించి పనిచేయుటకు విటమిన్ D3 కావలయును. రోజుకి 1,200 mg కాల్షియం, 2000 IU(50 mcg ) D3 వేసుకొనుట మంచిది (సూర్యరశ్మిలో పది నిమిషములు కూర్చున్ననూ ఈ విటమిన్ ను పొందవచ్చును). ముందుగా మీ వైద్యుని సంప్రదించుట మంచిది.
ఆహార పదార్దముల ద్వారా కూడా శరీరమునకు కాల్షియం ఇవ్వ వచ్చును. పచ్చటి ఆకులున్న కూరలన్నిటి లోనూ కాల్షియం ఉంటుంది. Low-fat dairy products (పాలు పెరుగు మజ్జిగ) , Dark green leafy vegetables పచ్చటి ఆకు కూరలు, Broccoli, Canned salmon or sardines with bones, Soy products such as tofu, సోయా బీన్స్ , Calcium-fortified cereals and orange juice.ఈ విధముగా అందిన కాల్షియం శరీరములో జీర్ణించుటకు విటమిన్ K అవసరము. దీనికి మనము తిన వలసిన ఆహారములు: Chard, Brussels sprouts, kale, cauliflower and spinach (బచ్చలి), the herb parsley.
చివరి మాట: నా ఉద్దేశంలో మన భోజన సాంప్రదాయం " కూర, పచ్చడి, పప్పు, పులుసు, మజ్జిగ" సమీకృత పౌష్టిక ఆహారానికి గీటు రాయి. మనం ఆరోగ్యముగా ఉండటానికి మన శరీరానికి కావలసిన మూల పదార్ధాలను పంచి ఇస్తుంది. వీలయినంత వరకూ ఆహారములో మన సాంప్రదాయాలు పాటించండి. మీ ఆరోగ్య విషయములలో చర్యలు తీసుకునేముందు తప్పకుండా మీ సొంత వైద్యుని సంప్రదించండి.
మాతృక:
http://www.emedicinehealth.com/osteoporosis/article_em.htm
http://saveourbones.com/natural-bone-building-handbook/