ఈ సంవత్సరంలో ఎన్నో జరిగాయి. భూకంపాలు, సునామీలు, వరదలూ, యుద్ధాలూ, చంపుకోటాలు, కొట్టుకోటాలూ, కరువులూ, కాటకాలూ. వీటన్నిటిలోనూ అనుకోకుండా బాధల్లో పడి రోదించే వా రెందరో. తుఫానులో ఇళ్ళు కొట్టుకుపోయి, ఉన్న ఆస్తి అంతా నీళ్ళ పాలై బజార్లో పడ్డ వాళ్ళు మన ఎదురుకుండా ఉన్నారు. వారు ఏదో విధంగా వాటిని తట్టుకుని బతికి బయటపడాలి. మనమందరం పుట్టిన తరువాత ఏదోవిధంగా జీవించాలి కదా.
వారి తాత్కాలిక జీవిత కష్టకాలంలో మనమేమన్నా సహాయం చెయ్యగలమా? ప్రపంచం లో అందరికీ మనం సహాయం చేద్దామన్నా చెయ్యలేము. చేసే స్థోమతా మనకి ఉండదు. కానీ మనందరం కలిసి చేస్తే, నార పోగులు కలిస్తే బలమైన చాంతాడుగ మారినట్లు మన శక్తి బలోపేతం అవుతుంది. అలా మన శక్తులని కలిపి ప్రజల నాదుకునే సంస్థలు, ప్రపంచములో ఎక్కడ ఆపద వచ్చినా ఆదుకోటానికి ముందుకి వచ్చే సంస్థలు చాలా ఉన్నాయి, సాల్వేషన్ ఆర్మీ, రెడ్ క్రాస్, డాక్టర్స్ వితౌ ట్ బోర్దేర్స్ మొదలయినవి.
అమెరికాలో ప్రతీ సంవత్సరం నవంబర్ డిశెంబరు లు చాలా హడావుడిగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు నెలలూ పండగరోజులు. ఇళ్ళ బయట అలంకరిస్తారు, షాపులన్నీ అలంకరిస్తారు. క్రిస్మస్ పాటలు మార్మోగుతూ ఉంటాయి. అందరూ హడావిడిగా తిరుగుతూ ఉంటారు. సంవత్సరంలో చాలా వ్యాపారం ఈ రెండు నెలలలోనే జరుగుతుంది. సంవత్సరానికి కావలసిన వస్తువులూ, దగ్గర వాళ్లకి ఇచ్చే బహుమతులూ, ఈ సమయంలోనే కొనుక్కుంటారు. ముఖ్యంగా అన్నదానాలూ ఆదుకోటాలు ఇప్పుడే జరిగేవి. సహాయ సంస్థలు వచ్చే సంవత్సరంలో జరగబోయే అవాంతరాలని ఆదుకోటానికి కావలసిన ధన సామర్ధ్యం ఈ కాలంలోనే సంపాదించుకుంటాయి. మీ కిష్ట మైన సంస్థలకి మీకు చేతనయినంత సహాయము చెయ్యండి.
నాకు ఇష్టమయిన సంస్థ Kiva. వాళ్ళ వెబ్సైట్ kiva.org. వీళ్ళు ప్రపంచములో ఏ దేశం వారికయినా "మీరు కొంచెం పెట్టుబడి పెట్టండి, పాలో పెరుగో, కూరగాయలో కొనుక్కుని అమ్ముకుని మీ పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తాము" అనే వాళ్ళకి, మనందరి నుండీ చిన్న చిన్న డొనేషన్లు తీసుకుని వాటిని కలిపి వారికి సహాయం చేస్తారు. "నేను కష్టపడి పనిచేస్తాను. నన్ను కొంచెము ముందుకు వెళ్ళేలా సహాయం చెయ్యండి. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను" అంటూంటే మనము ఇవ్వకుండా ఎలా ఉంటాము?
ఇంతకీ చెప్పోచే దేమంటే మీకు ఇష్టమయిన వాటికి మీకు తోచిన సహాయం చెయ్యండి. మీరు అమెరికాలో ఉంటే ఈ పాటికి చాలా రిక్వెస్ట్ లు వచ్చి ఉంటాయి. ఉడతా భక్తిగా ఎవరో ఒకరికి ఎంతో కొంత సహాయం చేసి తోటి మానవుడుగా వాటిని ఆదుకోండి.