Monday, February 25, 2013

90 ఓ బుల్లి కథ 78 --- అమెరికాలో మా వీధి

నిన్న ఆదివారం మద్యాహ్నం  ఎండ బ్రహ్మాండంగా ఉంది. బయట చూడటానికి చాలా ముచ్చటగా ఉంది.  అమెరికాలో ఇది మిడ్ వింటర్.  ఉష్ణోగ్రత 33F అవటం తోటి చూసి ఆనందించటమే ( నీళ్ళు 32F దగ్గర ఐస్ గ మారుతాయి). మా ఆవిడ వింటర్ కోటు బూటు టోపీ మఫ్లర్ వేసుకుని ఉద్యోగానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. కొంచెం ఫోటోలు తియ్యమని బతిమాలితే ఫోటోలు తీసింది. వాటి ద్వారా నా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను.

మేము చికాగోకి ముఫై మైళ్ళ దూరంలో ఉంటాము. మా వీధి  cul-de-sac. జన సంచారం ఎక్కువగా ఉండదు. అందులో ఆదివారం మధ్యాహ్నం ఫ్రీజింగ్ ఉష్ణోగ్రత.  అప్పుడు అసలే ఉండరు. మధ్య ఫొటో మాయిల్లు (గరాజ్ మాత్రమే కనపడుతుంది). ఇంటికి రెండు పక్కలా ఫొటోలు పెట్టాను. పొటోలో మొన్నటి స్నోస్టాం లో పడ్డ స్నో తెల్లగా కనపడుతుంది. చెట్లు ఆకులు లేకుండా మోళ్ళుగ కనపడుతాయి. మళ్ళా అవన్నీ మే నెల వచ్చేసరికి ఆకులతో కళ కళ లాడుతూ ఉంటాయి, అప్పుడు నేల మీద పచ్చ గడ్డి కూడా కనపడుతుంది. ప్రతీ ఇంటి ముందరా ఒక పోస్ట్ బాక్సు ఉంటుంది. అది ఎంత ఎత్తు ఉండాలో ఎలా ఉండాలో ఎక్కడ పెట్టాలో వాటికి రెగ్యులెషన్లు ఉంటాయి. పోస్ట్ మాన్ ప్రతీ రోజూ కారులో వచ్చి కారు దిగకుండా పోస్ట్, బాక్సు లో వేసి వెళ్ళిపోతాడు. మా వీధిలో ఉన్న 17 ఇళ్ళలో నాలుగు ఇళ్ళల్లో వాళ్ళం మాత్రం, ఇల్లు కట్టించుకున్న దగ్గర నుండీ ఉంటున్నాము (25 ఏళ్లు). సామాన్యంగా అమెరికాలో ఏడు ఏళ్ళ కొకసారి ఇల్లు మారుస్తారు.

రేపు మళ్ళా స్నో వార్నింగ్. స్నో పడుతూ ఉంటే మా వీధి చూడటానికి ఇల్లా ఉండదు. అంతా తెల్లగా స్నో మయం తో ఉంటుంది. స్నో తీసే వాళ్ళతోటి హడావిడిగా ఉంటుంది. ఏదో నాకు నచ్చినవి మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం.








మళ్ళా ఈ వారం స్నో తుఫాను వచ్చింది. మంగళవారం ఉదయం 9 గంటల నుండీ రాత్రి 12 గంటల దాకా మూగ వాన లాగా మూగ స్నో పడుతూనే ఉంది. ఎవరో ఆకాశం లో కూర్చుని ముగ్గు చల్లుతున్నట్లు ఉంటుంది. రోడ్లు సరీగ్గా కనపడవు. కొద్దిగా కనపడినా డ్రైవ్ చెయ్యటం చాలా కష్టం. ఇసకలో డ్రైవ్ చేస్తున్నట్లు ఉంటుంది. ముందరే తెలుసు కాబట్టి స్కూళ్ళు ఆఫీసులు త్వరగా మూసేసి అందర్నీ ఇంటికి పంపించేశారు. రాత్రికి రాత్రే రోడ్ల మీద స్నో తీసేసి మర్నాడు ఆఫీసులకు వెళ్ళేటట్లు సరిచెసారు. రోడ్ అంచులలో స్నో కుప్పలు తయారు అవుతాయి. రోజూ  స్నో పడితే అవే కొంత కాలానికి స్నో కొండలుగా తయారు అవుతాయి. కొన్ని వింటర్ల లో నెలల తరబడి వాటిని చూడవలసి వస్తుంది. మళ్ళా మా ఆవిడ చేత ఫొటోలు తీయించాను.  వాటిని కింద చూడచ్చు.

ప్రపంచ వాతావరణ పరిస్థుతులు అందరికీ తెలుసు గానీ వాటిని మదించి ముందర ఏమి జరగబోతోంది చెప్పటం, కంప్యుటర్ మోడల్లింగ్, ఒక కళ. మొన్న వాషింగ్టన్ లో స్నో పడుతుందని అందరికీ శలవ ఇస్తే, పడలేదు. కానీ యూరప్ కంప్యుటర్ మోడల్స్ వాషింగ్టన్ లో పడదని ఖచ్చితంగా చెప్పింది. ఎందుకు అమెరికా మోడల్స్ సరీగ్గా చెప్పలేక పోతున్నాయనే దానిమీద చర్చ జరుగుతోంది. నేను చదువుకునే టప్పుడు (50 ఏళ్ళ క్రిందట) ఆంధ్రా యూనివర్సిటీ లో సాయంత్రం వాతావరణ బెల్లూన్ పంపించేవారు. అది పంపిన సమాచారం బట్టి వాతావరణం గురించి రేడియోలో చెప్పేవారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.      










28 comments:

  1. photos are not availed (not visible)

    ReplyDelete
  2. @వోలేటి గారు మళ్ళా ట్రై చెయ్యండి. ఇంకెవ్వరూ కంప్లిన్ చెయ్య లేదు. నా కంప్యుటర్ మీద కనపడుతూనే ఉన్నాయి. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  3. Photos are not visible...

    ReplyDelete
  4. నాకూ కనిపించడంలేదండి.

    ReplyDelete
  5. ఫోటోస్ కనపడట్లేదండీ. బహుశా చూడగలిగే పర్మిషన్ వల్ల కావచ్చు. మీరు ఆల్రెడీ google లో sign-in అయ్యివుండటం వల్ల మీకు కనిపిస్తూ వుండవచ్చు.

    ReplyDelete
  6. @శ్రీనివాస్, జ్యోతిర్మయి గారు వెంటనే సరి చెయ్యటానికి ప్రయతిన్స్తాను. థాంక్స్.

    ReplyDelete
  7. ఫోటోలు ఎల్లా పోస్ట్ లో పెట్టాలో మర్చేపోయి సరీగ్గా పెట్టలేదు. ఇప్పుడు సరి చేసాను. మీ వ్యాఖ్యలకు ధన్యవాదములు.

    ReplyDelete
  8. @పండు గారు నేను పోస్ట్ లో ఫొటోలు పేస్టు చేశాను. అలా చేయటం తప్పు. ఇప్పుడు పోస్ట్ లోకి డౌన్లోడ్ చేసి ఎటాచ్ చేశాను. ఇప్పుడు సరి అయినది అనుకుంటా. ఇంకా కనపడకపోతే చెప్పండి. థాంక్స్.

    ReplyDelete
  9. Chaduvutunte.... Konchem kastamenemo ani anipistondi americaa lo winter life.... Emantaaru?

    ReplyDelete
  10. @VIJAYABHASKAR గారు
    మొదట కష్టం గానే ఉంటుంది తరువాత అలవాటయి పోతుంది. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  11. @తృష్ణ గారు మా ఆవిడకి చెప్తాను. మురిసిపోతుంది. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  12. మేడం ఫోటోస్ బాగా తీశారు.
    మీ ఇల్లు , పరిసర దృశ్యాలు బాగున్నాయండి .
    వేసవి కాలంలో చక్కటి పువ్వులు పూస్తే మరింత బాగుంటుంది.

    ReplyDelete
  13. @anrd గారు వేసవి కాలంలో తప్పకుండా ఫోటోలు ఆవిడ చేత తీయించి పోస్ట్ వేస్తాను. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete
  14. very nice... I wonder you are residing there since 25 yrs..

    ReplyDelete
  15. @voleti గారు
    I am an old timer. Came to US in 1966.

    ReplyDelete
  16. బాగుంది మీ అమెరికా వీధి .స్నో పడినప్పుడు మరింత అందంగా ఉంటుంది.ఏదైనా అందంగా సరదాగా ఉన్నది ఆత్మీయు లతో పంచు కోవాలని పిస్తుంది. మాకందించి ఆహ్లాదాన్ని కలిగించారు ధన్య వాదములు

    ReplyDelete
  17. 1966 batch to the US? Would you share your experiences first year in the US.

    ReplyDelete
  18. @రాజేశ్వరి గారూ ఇంకా స్నో అల్లాగే ఉంది. దాదాపు రోజూ ఎండ కూడా అల్లాగే ఉంది. ఇంకో నాలుగు రోజుల్లో 40F డిగ్రీలు అవుతుందంటున్నారు. స్నో అంతా కరిగి పోతుంది. స్ప్రింగ్ వచ్చేస్తోంది కదా స్నోకి బహుశ ఇంతే సంగతులు నవంబర్ దాకా. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. .

    ReplyDelete
  19. @Anonymous గారూ తప్పకుండా వ్రాస్తాను. కానీ అంత ప్రేట్టీగా ఉండదు. గవర్నమెంటు ఇచ్చిన పది డాలర్లు తీసుకుని టాక్సీ కి డబ్బులు లేకుండా ఏర్పోర్ట్ లో దిగాను. వస్తామన్న వాళ్ళు రాలేదు. ఇంకొకళ్ళ సహాయంతో యునివర్సిటి కి చేరుకున్నాను. పాలు తప్ప మనకు తెలిసిన కూరగాయలు కనపడలేదు.నెల స్తైఫేండ్ ముందుగా ఇచ్చారు. రైస్ దొరికేది. తెచ్చుకున్న చింతకాయ పచ్చడితో కొన్ని రోజులు గడిపాను. అయ్యా ఎందుకు పాత సంగతులు గుర్తు చేస్తారు. They are not Pretty. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  20. ప్రెటీగా వుండనిదే ఇంఫర్మేటివ్‌గా, అందంగా వుంటుంది సార్. వినడానికి అదో తుత్తి.:) వాహ్! పాత చింతకాయ పచ్చడి ఇంత తాజా రుచిగా వుందేమిటబ్బా!

    ప్రెటీగా వుండేది కొత్త తెలుగు సినిమాలా అభూతకల్పనలతో వుంటుంది. అలాంటి సీరియల్ నవల్లు రాసే రచయిత్రులు బోలెడు.

    ReplyDelete
  21. ఫొటోస్ మన బ్లాగర్లతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.

    ఎక్కడా మనుషులు కనబట్టం లేదు. బాబోయ్! మీకు బోర్ కొట్టెయ్యదూ!

    ReplyDelete
  22. I second above Anon :-)
    మీరు రాయండి రావు గారు pretty గా ఉండటం కన్నా informative గా ఉండే రియాలిటీ ముఖ్యం కదా !
    మీరు వేమూరి వెంకటేశ్వరరావు గారు రాసిన అమెరికా అనుభవాలు చదివే ఉంటారు కదా నాకు చాలా నచ్చిన వాటిల్లో అ సంకలనం ఒకటి !

    ReplyDelete
  23. దయచేసి మీ అనుభవాలు రాయండి.
    అవి ప్రెట్టి గా లేకపోవచ్చు, కాని అప్పటి పరిస్తితులు ఎలా ఉండేవో మాకు తెలుస్తుంది.ఇప్పటి పరిస్థితులతో పోల్చి చూసుకుంటే మాకు అదో సంతృప్తి. అలా అని మీ బాధలు మాకు ఆనందం కాదు.
    1966 అంటే చాలా ముందు వెళ్ళారు మీరు. వైన్ ఎంత పాతది అయితే అంత విలువ కదా

    ReplyDelete
  24. @Anonymous గారూ తప్పకుండా వ్రాస్తాను. కానీ నాకు ఒకటే బాధ. కష్టాలు పడవలసి వస్తుందేమోనని ముందుకి వెంచర్ చెయ్యటం మానుకుంటారేమో నని భయం. మాకు ఒక విధంగా సెటిల్ అవ్వటానికి పది ఏళ్ళు పట్టింది. మనకి రొటీనుగా జీవితంలో వయస్సుతో వచ్చేవాటిని వదులుకోవటమో/ మిస్ అవటమో చెయ్యాల్సి వస్తుంది. దేశం కాని దేశంలో వాటిని తట్టుకుని నిల బడాలి కదా!

    ReplyDelete
  25. @రమణ గారూ బయట ఉష్ణోగ్రత నీళ్ళు పోస్తే గడ్డకట్టుకునే పరిస్థితి లో ఉంటే నడుచుకుంటూ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళే వాళ్ళు వింటర్ కోట్లు వేసుకుని -- పొద్దున్న స్కూల్ బస్ కి వెళ్ళే పిల్లలు, కుక్కల్ని వాక్ కి తీసుకు వెళ్ళే పెద్దలు.
    బోర్ కొట్టదు. అలవాటు అవుతుంది. ఇంకా జనముంటే చికాకుగా ఉంటుంది. ఈ మధ్య అయిదు ఆరు ఏళ్ళ బట్టీ ఏటా ఇండియా వస్తున్నాను. దేశాలన్నీ వంటరిగా తిరిగిన వాణ్ణి పక్కన ఎవరన్నా తోడు ఉంటే గానీ ఇండియాలో బయటికి వెళ్ళలేను.
    మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  26. @Sravyaa Vattikuti గారూ --- దాదాపు ఆ కాలంలో వచ్చిన వాళ్ళ అనుభవాలు ఒకే విధంగా ఉంటాయి. మాకు వెనక సప్పోర్ట్ ఎవరూ లేరు ముందర ఎల్లా ఉంటుందో తెలియదు. వచ్చిన వంద మందిలో బారిస్టర్ పార్వతీశంలా వచ్చిన వాళ్ళు కొందరయితే రామనుజంలా వచ్చిన వారు కొందరు. కానీ అందరూ వెంచర్ సమ్. వీలుచూసుకుని వ్రాస్తాను. ఏదో ఆదర్శంగా ఉంటుందనుకోను గానీ ఇంటరెస్టింగ్ గ ఉండచ్చు.
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete
  27. మళ్ళా ఈ వారం స్నో తుఫాను వచ్చింది. మంగళవారం ఉదయం 9 గంటల నుండీ రాత్రి 12 గంటల దాకా మూగ వాన లాగా మూగ స్నో పడుతూనే ఉంది. ఎవరో ఆకాశం లో కూర్చుని ముగ్గు చల్లుతున్నట్లు ఉంటుంది. రోడ్లు సరీగ్గా కనపడవు. కొద్దిగా కనపడినా డ్రైవ్ చెయ్యటం చాలా కష్టం. ఇసకలో డ్రైవ్ చేస్తున్నట్లు ఉంటుంది. ముందరే తెలుసు కాబట్టి స్కూళ్ళు ఆఫీసులు త్వరగా మూసేసి అందర్నీ ఇంటికి పంపించేశారు. రాత్రికి రాత్రే రోడ్ల మీద స్నో తీసేసి మర్నాడు ఆఫీసులకు వెళ్ళేటట్లు సరిచెసారు. రోడ్ అంచులలో స్నో దిబ్బలు తయారు అవుతాయి. కొన్ని వింటర్ల లో నెలల తరబడి వాటిని చూడవలసి వస్తుంది.మళ్ళా మా ఆవిడ చేత తీయించిన ఫోటోలు క్రింద పెడుతున్నాను.

    ప్రపంచ వాతావరణ పరిస్థుతులు అందరికీ తెలుసు గానీ వాటిని మదించి ముందర ఏమి జరగబోతోంది చెప్పటం, కంప్యుటర్ మోడల్లింగ్, ఒక కళ. మొన్న వాషింగ్టన్ లో స్నో పడుతుందని అందరికీ శలవ ఇస్తే, పడలేదు. కానీ యూరప్ కంప్యుటర్ మోడల్స్ వాషింగ్టన్ లో పడదని ఖచ్చితంగా చెప్పింది. ఎందుకు అమెరికా మోడల్స్ సరీగ్గా చెప్పలేక పోతున్నాయనే దానిమీద చర్చ జరుగుతోంది. నేను చదువుకునే టప్పుడు ఆంధ్రా యూనివర్సిటీ లో సాయంత్రం వాతావరణ బెల్లూన్ పంపించేవారు. అది పంపిన సమాచారం బట్టి వాతావరణం గురించి రేడియోలో చెప్పేవారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.

    ReplyDelete