Thursday, April 4, 2013

92 ఓ బుల్లి కథ 80 --- "సూర్యుని కోసం" తపన

కొలను

 "కొలను" మీద "నీలహంస" బ్లాగ్ లో సత్య గారు ప్రకటించిన గేయ పోటీకి నా ప్రతి స్పందన. 

చూడండి గేయం వ్రాయటం ఎంత తేలికో.  నేనే వ్రాయ కలిగితే, మీరు కూడా వ్రాయ గలరు.


"సూర్యుని కోసం"   
రచన: లక్కరాజు శివరామక్రిష్ణ రావు. 
                      
ఉరుకు పరుగుల తోటి 
   ఉప్పొంగి పోయాను 

సన్న జల్లుల తోటి 
    స్నాన మాడాను 

వర్ష కాలపు నడుమ
    నలిగి పోయాను

శీత కాలము వచ్చె 
     చల్లగా ఉండె   

నీలి మబ్బుల నడుమ 
    నింగిలో నువ్వు 

ఆడుతూ పాడుతూ 
   గంతులిడు తున్నావు 

నా దరికి రావా 
    నన్నేలు కోవా 

కలువ పూవులు పెట్టి 
    పచ్చగా చెండేసి 

తామరాకుల తోటి 
    పైట కప్పాను 

నాకు కవితలు రావు 
    కవనాలు నే చేయ 

నీ అరుణ కిరణాలు
   నా మీద వాలాలి 

వెచ్చనీ నీ స్పర్శ 
   నాకు కావాలి 

అర్పణలు చేస్తాను 
   అన్ని నీ కిస్తాను 

నా కోర్కె తీర్చవా  
  ఆరాధ్య  దైవమా.