కొలను |
చూడండి గేయం వ్రాయటం ఎంత తేలికో. నేనే వ్రాయ కలిగితే, మీరు కూడా వ్రాయ గలరు.
"సూర్యుని కోసం"
రచన: లక్కరాజు శివరామక్రిష్ణ రావు.
ఉరుకు పరుగుల తోటి
ఉప్పొంగి పోయాను
సన్న జల్లుల తోటి
స్నాన మాడాను
వర్ష కాలపు నడుమ
నలిగి పోయాను
శీత కాలము వచ్చె
చల్లగా ఉండె
నీలి మబ్బుల నడుమ
నింగిలో నువ్వు
ఆడుతూ పాడుతూ
గంతులిడు తున్నావు
నా దరికి రావా
నన్నేలు కోవా
కలువ పూవులు పెట్టి
పచ్చగా చెండేసి
తామరాకుల తోటి
పైట కప్పాను
నాకు కవితలు రావు
కవనాలు నే చేయ
నీ అరుణ కిరణాలు
నా మీద వాలాలి
వెచ్చనీ నీ స్పర్శ
నాకు కావాలి
అర్పణలు చేస్తాను
అన్ని నీ కిస్తాను
నా కోర్కె తీర్చవా
ఆరాధ్య దైవమా.
vasundhara pulkur
ReplyDelete9:49 AM (20 minutes ago)
to me
very nice anna its good poem i like it thanks .
సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ.
ReplyDeleteసూర్యుని కోసం మీరు వ్రాసిన గేయకవిత చాలా చాలా బాగుందండి.
@వసుంధర గారు మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
ReplyDelete@anrd గారూ సూర్య భగవానుడు ఎప్పుడూ మన జీవితాల్లో ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటా. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
నమస్కారములు. చక్కని దృశ్యం.
ReplyDeleteచల్లని వెన్నెలలో పులకించి పరవసించిన తెల్లని కలువ కన్నియలు , మత్తు వీడక బద్ధకంగా వళ్ళు విరుచు కుని వెచ్చని భానుని కిరణాల కోసం స్వాగతం పలుకుతున్నట్టుగా ఉన్న రస రమ్య మైన దృశ్యాన్ని మీ కవిత మరింత రసవత్తరంగా అలరించింది చక్కని కవిత .హేట్సాఫ్ !
@రాజేశ్వరి గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు .
ReplyDeleteశ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.
ReplyDeleteకవిత చక్కగా వున్నది.
మీ స్నేహశీలి,
మాధవరావు.
మాధవరావు గారూ
ReplyDeleteఇవ్వాళే ఊరు వెళ్ళి వచ్చాను. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.