మీకు వెంటనే మెక్సికన్ తినాలని అనిపిస్తోందా! చాలా తేలిక. అరగంటలో మీ కోరిక నెరవెరుతుంది.
కావలసినవి:
1. ఒక మీడియం టొమాటో
2. ఒక మీడియం ఉల్లిపాయ
3. 1/2 పచ్చి మెరపకాయ
4. 1/2 నిమ్మకాయ
5. ఒక గుప్పెడు కొతిమేర
6. 1/8 టీ స్పూన్ ఉప్పు
టొమాటో ని ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చెయ్యండి. మెరపకాయని కొతిమేరని సన్నగా తరగండి(chop చెయ్యండి). ఒక చిన్న గిన్నె (bowl) తీసుకుని తరిగిన ముక్కల నన్నింటినీ వేసి ఉప్పు వేసి నిమ్మకాయ రసం పిండండి. అన్నీ ఒక చెంచా తో గట్టిగా కలపండి. మీ ఇష్టాలని బట్టి ఉప్పు కారం పులుపు సరిచేసుకోండి. వీలయితే ఒక అరగంట రిఫ్రిజిరేటర్ లో ఉంచి తియ్యండి. "పీకో డి గాయో" రెడీ.
మీరు దీనిని, ఆరోగ్యానికి ఇంకా ముస్తాబు చెయ్యాలంటే, ఒక చిటికెడు పసుపు, రెండు చిటికెలు పెప్పర్, మూడు చుక్కలు ఆలివ్ ఆయిల్ వేసి కలపండి.
దీనిని మీరు కార్న్ చిప్స్ తో నంచుకుని తినవచ్చు(Dip లాగా). టాకోస్ లో వేసుకుని తినవచ్చు. మన పుల్కాలో చుట్టుకుని తినవచ్చు. ఇడ్లీ ఉప్మా పెసరట్, వేటితోనైనా తినవచ్చు. కావాలంటే పచ్చడిలా అన్నంలో కలిపేసుకోవచ్చు.
ఇంకా మీరు దీనికి రెండు మూడు టేబుల్ స్పూన్స్ అవకాడో (Avocado ) గుజ్జుని కలిపి బ్లెండ్ చేస్తే ఇంకో మెక్సికన్ డిష్, గోకమోలి (Guacamole ), తయారు అవుతుంది.
మీకు ఇంకా దీన్ని గురించి తెలుసుకోవాలంటే, Pico De Gallo అని, గూగుల్ చెయ్యండి.

నమస్కారములు
ReplyDeleteతక్కువ కర్చుతో తక్కువ టైంలో ఎక్కువ రుచి కర మైన మీ వంటకం చాలా బాగుంది ధన్య వాదములు
నమస్కారములండి. మీరు వ్రాసిన వంటకం చాలా బాగుంది.
ReplyDeleteవేయించిన పెద్దసైజ్ లేక చిన్న సైజ్ అప్పడాల పైన ఇవన్నీ వేసుకుని తిన్నా బాగుంటుంది.
కొందరు బియ్యప్పిండితో చేసిన కారపుచెక్కల పైన కూడా ఇవన్నీ వేసుకుని తింటారు.
* ఇక్కడ ఎగ్జిబిషన్లో పెద్ద సైజు అప్పడాలను అమ్ముతారు.
Delete* మేము ఆ అప్పడాల పేకెట్స్ కొని ఇంటివద్ద వేయించుకుంటాము ,
* అప్పుడప్పుడు ఆ అప్పడాల ముక్కల పైన టమేటో, ఉల్లిపాయ, నిమ్మకాయ, కొతిమేర, ఉప్పు.. మొదలగు వాటిని వేసుకుంటాము.
* అందుకే అప్పడం పైన వేసుకుని తింటే బాగుంటుందని వ్రాసానండి.
.
Srirama Dronamraju
ReplyDelete3:32 PM (1 hour ago)
to me
చాలా బాగుంది, చిప్పులతో! ధన్యవాదములు!
ద్రోణంరాజు శ్రీరామకృష్ణుడు
@రాజేశ్వరి గారూ -- నాకైతే కార్న్ చిప్స్ లోకి చాలా బాగుంటుంది. తేలికగా చెయ్యొచ్చు. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
ReplyDelete@anrd గారూ దానిలో ఉన్న టొమాటో, ఉల్లిపాయ, నిమ్మ కాయ, పచ్చి మిరప, కొతిమెర
ReplyDeleteఆరోగ్యానికి చాలా మంచివి. Dark Green Leafy vegetables వంటికి చాలా మంచివి. మేము కొతిమెర పప్పు కూడా చేసుకుంటాము. తరువాత ఎప్పుడో ఒక పోస్ట్ వ్రాస్తాను. అప్పడాలతో దీనిని ట్రయి చెయ్యాలి. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
@ద్రోణంరాజు గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
ReplyDeleteశ్రీ లక్కరాజుగారికి,నమస్కారములు.
ReplyDeleteఆరోగ్యానికి రక్షా లైఫ్-బాయ్ అనే ప్రకటనలాగా, ఆరోగ్యానికి రక్షా రాజుగారి-టపా అని మేము చెపుకొనేటట్లుగా వున్నాయి మీ ఈ ఆరోగ్య చిట్కాలూ, టపాలూ!
మీ స్నేహశీలి,
మాధవరావు.
@మాధవరావు గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. మన ఆరోగ్యానికి మన జీవిత విధానాలు ఎంతో ముఖ్యమని నేను నమ్ముతాను. దానిలో మనము తినే ఆహారం చాలా ముఖ్యం. మనం ఆరోగ్యంగా జీవించటానికి మనము తినే ఆహారం ఎల్లా తోడ్పడుతుందో చెప్పటమే నా ఉద్దేశం.
ReplyDeleteఇంకా వ్రాయాల్సినవి ఉన్నాయి.ఈ మధ్య బద్దకించి వ్రాయటల్లేదు. త్వరలో మొదలెడుతాను.
నిజంగా వ్రాయటం మానేస్తే మళ్ళా మొదలెట్టటం చాలా కష్టం.