మనం మెలుకువగా ఉండి కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడల్లా ఎదురుకుండా ఏవో కనపడుతూనే ఉంటాయి. కొన్నికనపడిన వెంటనే అవి మనలో ఆలోచనలు రేకిస్తాయి. కొన్నిటిని చూస్తూఉంటే అసలు ఆలోచనలు రావు. కొన్నిఆలోచనలను మనం ఆస్వాదిస్తాం ఆనందిస్తాం. కొన్నిటిని భయంతో ఉద్రేకిస్తాం కంపిస్తాం.
మనుషులని చూస్తుంటే వచ్చే ఆలోచనలలో కొన్నిటికి సంతోషంగా చలిస్తాం, అసూయతో తిట్టుకుంటాం, ద్వేషంతో కొట్టుకుంటాం, కొన్నిట్లో చలించకుండా వెళ్ళిపోతాం.
అసలు మనుషులని చూస్తుంటే వచ్చే ఆలోచనలు నాలుగు రకాలుగా ఉంటాయని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.
1. వాళ్ళు మన మిత్రులు. కలిసి మాట్లాడ వచ్చు (friend) 2. వాళ్ళు మన శత్రువులు. చూడంగానే ఆమడ దూరం వెళ్ళిపోతాం (enemy ) 3. వాళ్ళు మనకి సంబంధము లేదు. (indifferent) 4. వాళ్ళు మన జీవిత భాగస్వామిగా పనికొస్తారు. sexual partner potential to pass on genes.
ఉదాహరణకి మనం స్టేషన్ లో ఉన్నాము. ఎదురుకుండా మనుషులు వస్తున్నారు పోతున్నారు. వాళ్ళను చూస్తుంటే మన ఆలోచనలు :
1. హఠాత్తుగా చిరకాల స్నేహితుడు సుబ్బారావు కనపడ్డాడు. సంతోషం పట్టలేము. ఒరేయ్ సుబ్బారావ్ ఎన్నాళ్ళ యిందిరా చూసి. అందరూ కులాసా యేనా. ఎక్కడికి పోతున్నా? అంటాము. అది మిత్రుడుగా కనపడే అప్పారావ్ కూడా అవ్వచ్చు.
2. ఎదురుకుండా మనకి చాలా రోజుల క్రింద అప్పిచ్చిన వాడు వస్తున్నాడు. డబ్బు తిరిగివ్వటం పడలేదు. తప్పించుకోవాలని చూస్తాము.ఇది కూడా మనకి శత్రువుగా కనపడే వెంకట్రావ్ అవ్వచ్చు.
3. ఎదురుకుండా ఎంతమందో వస్తున్నారు పోతున్నారు. మనకేమీ పట్టదు. వాళ్ళ గురించి ఆలోచించ వలసిన పనే లేదు.
4. కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి వెళ్తోంది. ఆహా ఆ అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. అల్లాగే అమ్మాయిలకి ఆ అందాల రాజు నా భర్త అయితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది.
ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి అని తెలుసుకోటానికి వేల వేల సంవత్సరాల క్రిందటి పరిస్థుతులు ఎలా ఉండేవో ఊహించాలి. అప్పుడే సృష్టిలో మానవజన్మ ఉద్భవించింది. ప్రకృతిలో సృష్టించబడిన ప్రతి దానికీ జీవించటం ముఖ్యం. ఆ పరిస్థితులలో మానవునికి బ్రతకటం, జాతిని అభివృద్ది చేసుకోవటం ముఖ్యం. మహా అయితే 2000 మంది ఉన్నారేమో అప్పుడు. చుట్టూతా చెట్లు జంతువులు. కొన్ని జంతువులని పట్టించుకోనవసరము లెదు. కానీ వాటిల్లో క్రూర మృగాలని పట్టించుకోవాలి. బతికి బట్ట కట్టాలంటే వాటిని చంపాలి. లేకపోతే వాటికి ఆహారంగా అవ్వాలి. మన సంపాదనని ( ఆహారాన్ని) ఇంకొకళ్ళు ఎత్తుకు పోవాలని చూస్తుంటే వాళ్ళని అదుపులో పెట్టాలి. అప్పుడే ప్రకృతిలో ఈ శత్రువు, మిత్రుడు అనే వర్గాలు ఏర్పడ్డాయి. దానికి తోడు తన జాతిని పెంపొందించు కోవాలనే జిజ్ఞాసతో ఉండటం మూలాన తగిన వారిని ఎన్నుకోవాలనే ఆశ కూడా ఉద్భవించింది. అప్పుడే మనం ఎన్నుకున్న వారిని ఇంకొకళ్ళు సంగ్రహిస్తారనే భయం కూడా వచ్చింది. ఈ ఆలోచనలు అన్నీ ఆనాటినుండీ మనలో పేరుకుపొయాయి. వాటినుండి బయట పడలేము. ఇవే మనకున్న primitive brain, ఆదిమ ఆలొచనలు. జంతువులు కూడా ఇలాగే ఆలోచిస్తా యేమో !
ప్రకృతిలో మన మెదడు రూపకల్పన ఉదాహరణకి చేపతో (fish ) తో అంకురార్పణ జరిగిందనుకుంటే, క్రమంగా అది నూతన జంతువుల సృష్టితో మెరుగులు దిద్దుకుంటూ, జన్యుపరంగా కలుపుకుంటూ, అభివృద్ది చెందుతూ, కొన్ని వేల వేల సంవత్సరాలకి మానవ మెదడుగా రూపొందిందని అంటారు. ఇప్పటికీ జన్యుపరంగా తల్లి తండ్రులనుండి సమాచారం సేకరిస్తూ అభివృద్ది చెందుతూనే ఉంది. అందుకనే ఈ సృష్టిలో ఎప్పుడో మానవుల తర్వాత వాళ్ళు, ఇంకొక జాతి రావచ్చు.
మన మెదడు లో ముఖ్యంగా మూడు భాగాలు (పొరలు leyers ) ఉన్నాయి.
మొదటి భాగంలో జీవించటానికి కావలసిన ముఖ్యమయిన వన్నీ ఉన్నాయి. దీని పని శరీరానికి జీవత్వం ఉండేటట్లు చూడటం. గుండె సరీగ్గా పనిచేస్తోందా, మన దేహంలో అన్ని అవయవాలూ సరి అయిన ఉష్ణోగ్రతలో పనిచేస్తున్నయ్యా, మనల్ని చంపటానికి ఎవరన్నా వస్తున్నారా, మనల్ని పొగిడి సంతోష పెట్టటానికి ఎవరన్నా వస్తున్నారా, మనజాతిని అభివృద్ది చేసుకోవటానికి లైంగిక ఏర్పాటు ఎక్కడ దొరుకుతుంది, ఇటువంటివన్నీ మెదడులో మొదటి పొర ఆలోచించేవే . ఇంతెందుకు మనము జీవించటానికి పరిస్థుతులు సరీగ్గా వున్నయ్యో లేదో చూసేది ఇదే. దీనికి ఆలోచనా శక్తి లెదు అందుకని ఇది పనిచెయ్యటానికి తీసుకునే శక్తి చాలా తక్కువ (2%). మన జీవిత సంరక్షణను ప్రతి క్షణమూ చూసే కవచం కూడా ఇదే. ఉదా : చెయ్యి వేడి స్టవ్ మీద పెట్టటం జరిగింది. వెంటనే చేతిని అక్కడనుండి తీసేయించాలి. ఆ ఆజ్ఞ వచ్చేది ఇక్కడినుండే. మొదటి పొర ని primitive brain అని ( reptilian brain అని కూడా) అంటారు. జంతువులకు మనకూ ఉమ్మడిగా (common) ఉండే మెదడులో భాగం ఇదే. మన ఆలోచనలన్నీ ఇక్కడే ప్రారంభ మౌతాయి. '(It is made up of the brain stem, which sits right at the top of the spinal column, along with some other simple units involved only in instinctive responses and reflexes, some of which are almost half a billion years old.)'
తర్వాత భాగాన్ని limbic system అంటారు. దాదాపు పాలు త్రాగే ప్రాణుల (mammals ) కన్నిటికీ ఇది ఉంటుంది. మన ఉద్రేకాలు ఉద్వేగాలు ఇష్టా ఇష్టాలు నిర్ణయించ బడేది ఇక్కడే. మనకు స్నేహితులుగా ఎవరు ఉండాలి వారితో ఆనందంగా ఎలా గడపాలో నిర్ణయించే దిక్కడే. '(It is made up of the structures of the limbic cortex and some other pieces that together are involved in regulating emotions and memory and telling us who and who not to connect with, care for, and empathize with.)'
మెదడులో చివరి భాగం neocortex మానవుల కోసం ప్రత్యేకంగా సృష్టించటం జరిగింది. దాదాపు 200,000 సంవత్సరాల వయస్సుంటుందని నిర్ధారించారు. తనలో దాచుకున్న పరిజ్ఞానంతో సమస్యలను పరిష్కరించే సమర్ధత దీనికుంది. కొత్త భాషలు నేర్చుకోవటం వాడటం దీని సొంతం. మనిషి స్మృతిలో ఉన్నాడంటే ఇదే కారణం. mammals కొన్నిటికి ఈ పొర ఉన్నప్పటికీ దానికి మనకున్నంత నూతనత్వం లేదు. '(It is the baby of the bunch nearly 2000,000 years old. It is conscious of itself, and able to plan for the future and learn and use language.)'
ఈ మూడు భాగాలూ పరిస్థుతులని బట్టి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ మూడింటినీ కలిపి మనము మెదడు అంటాము. మన మెదడు శరీర బరువులో 2% ఉన్నప్పటికీ, శరీరంలో తయ్యారు అయ్యే శక్తిలో ముందర 20% తను పని చెయ్యటానికి వాడుకుంటుంది.
మనకి మొట్టమొదట కలిగే స్పందనలన్నీ మొదటి భాగాన్నించే, primitive brain, వస్థాయి. మనం పరిస్థుతుల వత్తిడితో (stress తో ) చేసే నిర్ణయాలు కూడా ఇక్కడ నుండే వస్తాయి. కారణం ఇది తక్కువ శక్తిని (2%) తీసుకుని త్వరగా స్పందిస్తుంది కనుక. మొదట జీవించటం ముఖ్యం. దానికి కావాల్సిన కంట్రోల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. తర్వాత జాతిని అభివృద్ది చేసుకోవటం. దానికి కావలసిన కామ వాంఛలు పురిగొల్పేది కూడా ఇక్కడే. ఈ రెండిటికీ అవరోధాలు ఏర్పడితే వాటిని సందర్భానుసారంగా మసలమని చెప్పే ఆజ్ఞలు కూడా ఇక్కడినుండే వస్తాయి (fight or flight). ఈ primitive brain స్పందనలని మనస్సులోని మిగతా రెండు పొరల పరిజ్ఞానంతో సమ్మిళితం చేస్తే, మన ఆలోచనలను మార్చుకునే పరిస్థితి రావచ్చు.
కోప తాపాలకు కారణ మయ్యే అర్దంలేని వాదప్రతివాదాలు, మాటకి మాట చెప్పే ప్రతి స్పందనలూ, వత్తిడితో (stress ) తీసుకునే నిర్ణయాలూ, primitive brain నుండి వచ్చేవే. అందుకనే పెద్దలు, మాట పట్టింపులూ, కోపతాపాలు వచ్చినప్పుడు మాటకి మాట విసరకుండా కొద్ది సేపు జాప్యం చెయ్యమన్నారు. కారణం ఈ కొద్ది సమయంలో వివేకముతో ఆలోచించగల మెదడులోని మిగతా రెండు భాగముల సలహాలు తీసుకోవచ్చని. మొదట వచ్చే మన స్పందనలు, మన ఆలోచించలేని primitive brain నుండి వచ్చే స్పందనలని గ్రహించి, ఆలోచించి సమాధానం చెప్పగల మెదడు లోని మిగతా రెండు భాగాలతో సంప్రదిస్తే చాలా సంసారాలు చక్కబడతాయి.
నా మాట: మనలో మానవ జాత్యహంకారములు, నైజమూ వేల వేల సంవత్సరాల బట్టీ వస్తున్నాయి. నేను, నాది, నావారు, నా రక్షణ. అది లేక పోతే మానవ జాతి ఈ భూమి మీద మిగిలేది కాదు. ఇది ఇంకా వేల వేల సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. కానీ మధ్యలో మనలో మనం ఏర్పరుచుకున్న కట్టుబాట్లు (కులాలు వగైరా ) మాత్రం మార్చు కోగలం. కాకపోతే పాత ఆలోచనలను పూర్తిగా తిరగ వ్రాసిన తరం జన్మించటానికి 200 సంవత్సరాలు దాకా పట్టవచ్చు (రెండు తరాలు ).
*********************************
ఈ పోస్టు వ్రాయటానికి ఈ క్రింది పుస్తకము మూలము. ఆ పుస్తకమునకు మూలము దాదాపు 100 శాస్త్రజ్ఞుల ప్రచురణలు. ఈ పుస్తకము, రోజూ వారీ ఆఫీసు వాతావరణములో, ఈ primitive brain నుండి వచ్చే స్పందనలకు, యుక్తిగా ప్రతి స్పందనలు చేసి సక్రమంగా ఆఫీసు నడపటానికి మార్గాలేమిటో చెబుతుంది. ఆచర్ణాత్మక సలహాలతో నిండి ఉంది. మంచి పుస్తకం. వీలయితే చదవండి.
Tame The Primitive Brain (2012)
28 ways in 28 days to mange the most impulsive behaviors at work
By Mark Bowden
John Wiley & Sons

శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.
ReplyDeleteచక్కటి శాస్త్రపరమైన విషయాలను తెలియచేశారు. ముగింపులో మీ మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
మీ స్నేహశీలి,
మాధవరావు.
మాధవరావు గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. మన ఆలోచించలేని primitive brain నుండి వచ్చే స్పందనలని గమనించి నెమ్మదిగా ఆలోచించి సవరణలు చేసి, ఆచరణలో పెడితే జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు.
ReplyDelete