మీకు వెంటనే మెక్సికన్ తినాలని అనిపిస్తోందా! చాలా తేలిక. అరగంటలో మీ కోరిక నెరవెరుతుంది.
కావలసినవి:
1. ఒక మీడియం టొమాటో
2. ఒక మీడియం ఉల్లిపాయ
3. 1/2 పచ్చి మెరపకాయ
4. 1/2 నిమ్మకాయ
5. ఒక గుప్పెడు కొతిమేర
6. 1/8 టీ స్పూన్ ఉప్పు
టొమాటో ని ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చెయ్యండి. మెరపకాయని కొతిమేరని సన్నగా తరగండి(chop చెయ్యండి). ఒక చిన్న గిన్నె (bowl) తీసుకుని తరిగిన ముక్కల నన్నింటినీ వేసి ఉప్పు వేసి నిమ్మకాయ రసం పిండండి. అన్నీ ఒక చెంచా తో గట్టిగా కలపండి. మీ ఇష్టాలని బట్టి ఉప్పు కారం పులుపు సరిచేసుకోండి. వీలయితే ఒక అరగంట రిఫ్రిజిరేటర్ లో ఉంచి తియ్యండి. "పీకో డి గాయో" రెడీ.
మీరు దీనిని, ఆరోగ్యానికి ఇంకా ముస్తాబు చెయ్యాలంటే, ఒక చిటికెడు పసుపు, రెండు చిటికెలు పెప్పర్, మూడు చుక్కలు ఆలివ్ ఆయిల్ వేసి కలపండి.
దీనిని మీరు కార్న్ చిప్స్ తో నంచుకుని తినవచ్చు(Dip లాగా). టాకోస్ లో వేసుకుని తినవచ్చు. మన పుల్కాలో చుట్టుకుని తినవచ్చు. ఇడ్లీ ఉప్మా పెసరట్, వేటితోనైనా తినవచ్చు. కావాలంటే పచ్చడిలా అన్నంలో కలిపేసుకోవచ్చు.
ఇంకా మీరు దీనికి రెండు మూడు టేబుల్ స్పూన్స్ అవకాడో (Avocado ) గుజ్జుని కలిపి బ్లెండ్ చేస్తే ఇంకో మెక్సికన్ డిష్, గోకమోలి (Guacamole ), తయారు అవుతుంది.
మీకు ఇంకా దీన్ని గురించి తెలుసుకోవాలంటే, Pico De Gallo అని, గూగుల్ చెయ్యండి.