Saturday, August 16, 2014

101 ఓ బుల్లి కథ 89--- మీరు న్యూయార్క్ వెళ్తే - ఇవ్వాల్సిన ముడుపులు

క్రిందటి నెల జూలైలో మేము న్యూయార్క్ వెళ్ళటం జరిగింది. ఏ ఊరయినా వెళ్ళినప్పుడల్లా,  నలభై ఏళ్ళ క్రిందట యునివెర్సిటీ  చికాగోలో కలిసి తిరిగిన మా నలుగురు స్నేహితులం దగ్గరలో ఉంటే తప్పకుండా కలుసుకుంటాము. మేమందరం రిటైర్ అయ్యాము. మేమందరం చదువుకున్నదొకటి జీవితంలో భుక్తి కోసం చేసినది మరొక్కటి. మీరు కూడా ఇటువంటి పరిస్థుతులలో ఉంటే విచారించకండి. జీవితంలో అది మామూలే అని గ్రహించండి.

అసలు సంగతికి వస్తే మాలో ఒక స్నేహితుడు రామారావు "డిల్హై" నుండి మా ఇంటికి వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళాడు. అమెరికాలో "డిల్హై" ఏమిటా అంటారా! మీరు నమ్ముతారో నమ్మరో న్యూయార్క్ స్టేట్ లో DELHI అనే ఒక ఊరు ఉంది. ఎవరో ఎప్పుడో ఢిల్లీ వెళ్లి ముచ్చటపడి ఆ పేరు వాళ్ళ ఊరికి పెట్టుకున్నారుట. ఇంతెందుకు మనకి తెలిసిన పేర్లు "సేలం" "అశోకన్" "శోకన్" "గాంజెస్ సిటీ" లాంటివి ఎన్నో వున్నాయి.

ఇంకొక స్నేహితుడు మోహన రెడ్డి దగ్గరలో "లాంగ్ ఐలెండ్" లో ఉంటారు. మేము మెన్హాటన్ లో కలుసుకుందామని నిర్ణయించు కున్నాము. మేము జెర్సీ సిటీ నుంచి వచ్చే PATH ట్రైన్ స్టేషన్, ఆయన వచ్చే PEN  స్టేషన్ దగ్గరలో ఉంటాయి కనుక సులువుగా కలుసుకో గలిగాము. SUBWAY లో VEGGI MAAX తింటూ ఒక గంట సేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత బయటికి వచ్చాము. అది BROADWAY  స్ట్రీట్.

BROADWAY  చాలా పెద్ద వీధి. "Bloomberg" అనే న్యూయార్క్ మేయర్ ఈ వీధిని రెండు భాగాలు చేసి చిన్న భాగంలో వాహనాలు, సైకిళ్ళూ పోవటానికి ఉంచి, పెద్ద భాగంలో ప్రజలు కూర్చోటానికి వీలుగా కుర్చీలు టేబుల్స్ వేసి అలంకరించారు. జనం మధ్యాన్నం లంచ్ టైం లో బాగా ఉంటారు. నడుస్తూ పెద్దగా మాట్లాడుతూ దగ్గరలో నిద్రబోతున్న అమ్మాయిని లేపేసాము. కూర్చోటానికి మాకు మంచి టేబుల్ దొరికిందనుకోండి. BROADWAY, theatres కి ప్రసిద్ది. చిన్నా చితకా నాటకాల నుండి ప్రపంచములో ప్రశిద్దమయిన నాటకాలు ఈ వీధిలో పుట్టినవే. సంవత్సరం పొడుగునా ఇక్కడ నాటకాలు వేస్తూ ఉంటారు. క్రిందటి తడవ వచ్చి నప్పుడు "మామా మియా" అనే నాటకాన్ని చూశాము. ఇక్కడ అది ఎన్నో సంవత్సరాల బట్టీ ఆడుతున్నది. ప్రపంచ ప్రఖ్యాత TIME SQUARE ఇక్కడే దగ్గరలో ఉంది. EMPIRE STATE బిల్డింగ్ కూడా దగ్గరలోనే. ఒకప్పుడు ఈ వీధి నేత మగ్గాలకి ప్రశిద్దిట. MADE IN AMERICA వస్త్రాలన్నీ ఇక్కడ నుండే వచ్చేవి.

చక్కటి వసంతకాల వాతావరణం. ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంతలో నాకు ఎదురుకుండా DUNKIN DONUTS బోర్డ్ కనపడింది. ఆటే చూస్తున్నాను. మా ఆవిడకి అర్ధమయ్యింది "కావాలా" అని అడిగింది. నాకు వాళ్ళు చేసే FRENCH CURLERS అంటే భలే ఇష్టం. వీళ్ళు ఒకప్పుడు world's best coffee బోర్డు పెట్టుకునే వాళ్ళని కూడా అన్నాను. మా స్నేహితుడూ మా ఆవిడా వెళ్ళి DONUT , COFFEE పట్టుకు వచ్చారు. ఇదివరకంటి రుచిలేదు గానీ బాగానే ఉన్నాయి. ఏమిటో అదో త్రుప్తి. మా ఆవిడకు నేను చేస్తున్న పనులు ఏమీ నచ్చలేదు. న్యూయార్క్ వెళ్ళి మెన్హాటన్ లో SUBWAY SANDWICH , DONUT , COFFEE తిన్నారనే భావన రావటం ఆవిడకి ఎంతమాత్రం ఇష్టంలేదు. ఏమిటో ఎవరి త్రుప్తి వారికి ఆనందంగా ఉంటుంది. Honalulu (Hawaii ) లో హోటల్లో అన్నం వండించుకుని గోంగూర ముద్ద sour cream (మీగడ) తో తిన్న వాళ్ళు, పల్లెటూరిలో పుట్టి పెరిగి పొద్దున్నే చద్ది అన్నము తిన్న వాళ్ళ దగ్గరనుండి ఇంకేమి కోరుకుంటారు అనుకుని ఆవిడ త్రుప్తి పడుంటుంది.

ఇంక rush hour దగ్గర పడుతోంది అని ట్రైన్ స్టేషన్ కి బయల్దేరాము. వీధిలో చాలా గందరగోళం గా ఉంది. పాడుతున్నారు ఆడుతున్నారు తింటున్నారు తిరుగుతున్నారు. అసలు  న్యూయార్క్ ఒక టూరిస్ట్ ప్లేస్. రోజుకి లక్షలమంది వచ్చి పోతూ ఉంటారు. వీధిలో ఒకచోట టూరిస్ట్ phamplets పెట్టారు. గబగబా వెళ్లి ఒక పుస్తకం తెచ్చు కున్నాను. అది నెల నెలకి వచ్చే టూరిస్ట్ పత్రిక. ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఉపోద్ఘాతం కూడా వ్రాశారు. అమెరికాలో ఆనవాయితీ ఒకటుంది. మనకి వాళ్ళు చెయ్యాల్సిన పని చేసిన తరువాత మనం సంతోషపడిపోయి వారి చేతిలో డబ్బులు పెట్టటం. నిజంగా సంతోషపడినా పడకపోయినా డబ్బులు చేతిలో పెట్టాలి. వీటిని tips అంటారు. కొందరు ఇస్తారు కొందరు ఇవ్వరు కొందరు చాలా తక్కువ ఇస్తారు. అందుకని ముడుపులు (tips ) ఇవ్వటం ఈ ఊళ్ళో ఆనుమాయితీ అనిన్నూ, తరువాత మీరు ఏపనికి ఎంత tip ఇవ్వాలో అనుమానాలు లేకుండా ఈ పుస్తకంలో వేశారు. అంతేకాదు tips డబ్బు రూపంగా ఇవ్వాలి గానీ credit card తో కాదు అని కూడా విన్నవించారు. ఆ ముడుపులు ముందరే  తెలుసుకోవటం ఎందుకయినా మంచిదని క్రింద పొందు పరుస్తున్నాను.

Waitstaff, 20%.    Bartender, $1 drink.    Coatroom attendent, $1-2 a coat. Valet, $2-5 for each trip.
Washroom attendent, 50 cents to $1.    Hotel doorman, $1 per bag and $1/ per person for hailing a cab.
Hotel housekeeper, $2 - $5 per night.    Hotel concierge, $5+ for getting you tickets or reservations.
Tour Guides, $5 - 10 for giving helpful information and entertainment during tour.
ప్రస్తుతం రేటు $1 = 60 రూపాయలు.

Taken From: NewYorkCity Monthly, July 2014, page #74 Quick Tips for tackling.

5 comments:


  1. చాలాకాలానికి వ్రాశారండి.

    ఇప్పుడే పోస్ట్ చదివాను.
    న్యూయార్క్ విశేషాలను చక్కగా వివరించారండి.

    ReplyDelete
  2. @anrd గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. తప్పకుండా తరచుగా వ్రాద్దా మనుకుంటున్నాను. కంప్యూటర్ సహకరిస్తే తెలుసుకోవాల్సినవి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి.

    ReplyDelete
  3. శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

    బ్రాడ్ వే వివరాలు బాగున్నాయి. దీనిని గురించి మరిన్ని విశేషాలూ, ఫోటోస్ తో మరొక టపా వస్తే బాగుంటుందని నా భావన.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  4. @ మాధవరావు గారూ ఆ రోజు ఫోటో ఎందుకు తీయలేదో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. మళ్ళా వెళ్ళి నప్పుడు తప్పకుండా బ్రాడ్వే మీద ఫోటోలతో పోస్టు వేస్తాను. మీరు లండన్ విశేషాలతో ఇంకా పోస్ట్ వెయ్యలేదు. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  5. శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

    ` లండన్ విశేషాలతో ఇంకా పోస్ట్ వెయ్యలేదు. ' - ఈ విషయం మీకు ఇంకా బాగానే గుర్తు వున్నది. ఫోటోస్ తీశాను. అక్కడి జనం చాలా reserved గా వుండటంతో నేను వాళ్ళతో మాట్లాడలేకపోయాను. అందువల్లనే ఎటువంటి టపా వ్రాయలేదు.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete