జుబీన్ మెహతా symphony conduct చేస్తున్నారంటే వెళ్ళి చూడాలని ఎంతమందికో కోరిక ఉంటుంది. చేతితో పట్టుకున్న కర్రని తిప్పుతూ orchestra తో స్వరాలని మేళవిస్తుంటే మనో రంజకంగా ఉండి తన్మయత్వంలో మునిగిపోతాము. కర్ర తిప్పుతూ అన్ని వాయిద్యాలనీ సమయ స్ఫూర్తి తో సంకలనం చేయించి మధుర స్వరాలను మిళితం చెయ్యటం symphony conductors కే సాధ్యం.
మన తలలో Prefrontal Cortex అనేది మెదడు పై భాగంలో ఉంటుంది. ఇది జుబిన్ మెహతా (Zubin Mehta ) కర్ర పెత్తనం లాగా బుర్ర పెత్తనం చేస్తుంది. మన పంచేంద్రియాల నుండీ
సేకరించిన సమాచారం అంతా దీని అందుబాటులో ఉంటుంది. అందుకని మన జీవన ప్రణాళిక లో వాయిద్యాలు వాయించేది ఇదే. మన చేత పనులు చేయించేది ఇదే. జుబిన్ మెహతా కర్ర తిప్పి symphony వాయిద్యాలనుండి చక్కటి సంగీతం రాబట్టి నట్లే, మన అవయవాలకి సరి అయిన సమయంలో సరి అయిన సౌజ్ఞలు పంపి పని చేయిస్తుంది. అందుకనే దీనిని Executive Brain అన్నారు.
కర్ర తిప్పటం చాలా తేలికగా కనపడుతున్నప్పటికీ, ఎంత ఇష్ట మున్నా ఆ పని మనం చేయలేము. ఇందుకు కారణం నేర్చుకోటానికి ఆయన పడ్డ శ్రమ మనం పడలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే మన మెదడులో ఆ సమాచారం లేదు. సమాచారం లేనప్పుడు ఎల్లా ప్రయత్నిస్తాము. మన మెదడులోకి సమాచారం చేరాలంటే ఒకే మార్గం, మన పంచేంద్రియాలు. మనలో సమాచారణ సేకరణ వాటి ద్వారానే. చదువులు ఆటలు పాటలు సాన్నిహిత్యం వీటన్నిటి నుండీ సమాచారణ సేకరణ జరుగుతుంది. పై బొమ్మలో చూడండి సేకరించిన సమాచారం మన మెదడులో ఎక్కడ దాచి పెట్ట బడుతుందో. సరి అయిన సమాచారం లేకుండా కర్ర తిప్పుతానంటే నవ్వుల పాలవుతాము.
సమాచారం ఉందిపో, వాటిని కాచి వడబోసి చిలకరించి నిర్ణయాలు తీసుకుని అవయవాలకు ఆజ్ఞలను పంపించాలి. Prefrontal Cortex చేసే పని ఇదే. మన అవయవాలకు ఆజ్ఞలు పంపించాలంటే ఒకటే మార్గం, ఆ అవయవాలకు సమాచారం చేరవేసే మార్గం ఉండాలి అదే neural network. సరి అయినా సమయంలో enzymes, neurotransmitters కలిసి పని చేయటం మూలంగా సంకేతాలు మన శరీరంలో ఒక చోటునుండి ఒక చోటికి వెళ్తాయి.
Neural Network పనిచేయాలంటే దానికి కావలసిన enzymes, neurotransmitters సరీగ్గా తయారు అయి ఉండాలి. ఇవన్నీ సరీగ్గా ఉంటే అవయవాలకు వెళ్ళే విద్యుత్ సంకేతం తయారు అయి న్యూరల్ తీగల్లో (నరాలు) ఆయా అవయవాలకు చేరి వాటి చేత పనులు చేయిస్తుంది(మాట్లాడటం,నడవటం మొదలయినవి).
మన ఇంట్లో విద్యుత్ తీగల మీద ఉండే ప్లాస్టిక్ లాగానే శరీరంలో neural తీగల మీద Myelin (ఒక విధమయిన fat ) పూత ఉంటుంది. ఇది సరీగ్గా లేకపోతే సిగ్నల్ వెళ్ళదు. మనం మాట్లాడాలన్నా, చేతులతో పనిచేయాలన్నా, నడవాలన్నా ఇంత తంతు జరుగుతుంది. మానసిక జబ్బులన్నిటికీ కారణం సంకేతాలు సరీగ్గా తయారు కాకపోవటం లేదా తయారు అయిన సంకేతాలు గమ్యానికి చేరకపోవడం. అందుకని మనం చెయ్యాల్సిన పని శరీరానికి అవసరమైన పదార్ధాలు తయారు చేసుకోటానికి కావలసిన మూల పదార్ధాలు అందించటమే.
శరీరంలో ఎంజైమ్స్ హార్మోన్స్ సరీగ్గా తయారు అవ్వాలంటే, 20 amino acids కావాలి. మన శరీరం 11 మాత్రమే తనంతట తాను తయారు చేసుకో గలదు. మిగతా 9 మనం తినే ఆహారం నుండి రావాలి. వీటిని essential amino acids అంటారు. మాంసాహారం తినేవాళ్ళకి అవన్నీఒక దాని లోనే లభ్యమవుతాయి కానీ శాకాహారులు మాత్రం అన్నీ ఒక చోట లేక, వివిధ పదార్ధాలు తినవలసి వస్తుంది. కొత్తగా కీన్వా ధాన్యం(Quinoa) లో essential amino acids అన్నీ ఉన్నాయని తెలుసుకున్నారు. అందుకని శాకాహారులు కొద్దిగానైనా కీన్వా తినటం మంచిది.
మన శరీరంలో విద్యుత్ తయారు సోడియం (Na), పొటాషియం (K), కాల్షియం (Ca), క్లో రీన్(Cl)
అయాన్లు(ions) neural membrane లో నుండి అటు ఇటూ కదలికల మూలంగా జరుగు తుంది. అందుకని ఇవి చాలా ముఖ్యం. అల్లాగే మెగ్నీషియం కూడా ముఖ్యమని గమనించారు. వాటికి తగిన ఆహార పదార్ధాలు తినటం చాలా మంచిది.
అల్లాగే myelan కరిగి పోవటం మూలంగా electrical signals చేరవలసిన చోటికి చేరవు. మరీ fat తగ్గాలని పూర్తిగా fat తినటం మానేయటం మంచిది కాదేమో.
పై చెప్పిన విషయాలు గమనిస్తూ పౌష్టిక సమీకృతాహారం తిన గలిగితే మనలోని ఎగ్జిక్యూటివ్ బ్రెయిన్ చేత సరిఅయిన పనులు చేయించు కోవచ్చు.
మాతృక:
The New Executive Brain (2009)
Frontal Lobes in a complex world
By Elkhonon Goldberg, Ph D
OXFORD Press.

dear sir very good blog and very good content
ReplyDeleteLatest Telugu News
Thank you Sam garu.
Deleteరామకృష్ణారావుగారూ, నేను ఇచ్చిన మెయిల్ కు మీరు స్పందించలేదు. I asked for your opinion on my recent article - http://telugu.asianetnews.com/editorial/new-concept-of-obesity-says-our-style-of-food-consumption-is-dangerous
ReplyDeleteశ్రవణ్ బాబు గారూ మీ వ్యాసం చదివాను. విశాఖ , విజయవాడ ప్రముఖుల్ని గురుంచి మీరు వ్రాసిన వ్యాసం బాగుంది. మీ రన్నట్లు ఫ్యాట్స్, కోలెస్టరాల్ ని పెంచదు గానీ ఇంకేమి సమస్యలు తెస్తుందో తెలియదు. ఇంకొకటి శరీరానికి ఫ్యాట్స్ ఎక్కువఅయితే బయటికి పంపే విధానము ఉంది. టాయిలెట్ లో మనము బహిష్కరించింది పైకి తేలుతుంది. దానితో ఫ్యాట్స్ తినటం ఎక్కువ అయినదని తెలుసుకుని తినటం తగ్గించ వచ్చు.
Deleteలో కార్బ్ పనిచేస్తుంది ఎందుకంటే అది శరీరం పనిచేసే విధానం తో మిళితమైంది కనుక. మనం తినే కార్బ్స్ శరీరంలో షుగర్ గ మార్చబడి, ఆక్సిజన్ తో దగ్ద పరిచి, శక్తి గా మార్చ బడుతుంది.
మనకు కావాల్సిన షుగర్ మాత్రమే వాడ బడుతుంది. మిగతాది ఎప్పటికయినా అవసరమొస్తుందని fat రూపంగా దాచి పెట్టుకుంటుంది. తిండి దొరకనప్పుడు వాడుకోటానికి. Low Carb diet లో మీరు carbs తగ్గిస్తున్నారు అందువలన శరీరం తనకి ఇంకా అవసరమైతే వెళ్లి ఎక్కడ నుండి తెచ్చు కోవాలో తెలుసు. అందుకని శరీరం లో fat తగ్గుతుంది. దీనికి తోడు fast కూడా చేస్తే శక్తి కోసం శరీరం లోని fats వాడాల్సి వస్తుంది. శరీరంలో fat తగ్గుతుంది. ఇక్కడ శరీరానికి తెలిసిన పనిని దాని చేత చేయిస్తున్నాము. అందుకని పద్ధతి పని చేస్తుంది. అందుకనే మన వాళ్ళు ఉపోషాలు ఉండమనేది.
Thank you sir!
Delete