ఆఫీసు నుండి వచ్చిన కామేశ్వరమ్మకి మొగుడు ఇల్లా ఎందుకు మారిపోయాడో అర్ధం కావటల్లేదు. చెప్పినపని చెయ్యడు. ఒకటో రెండో చేస్తున్న పనులు కూడా సరీగ్గా చేయటల్లేదు. మొన్న రైస్ కుక్కర్లో బియ్యం నీళ్లు పోసి కుక్ స్వీచ్ నొక్కటం మర్చిపోయాడు. ఆకలితో ఆఫీస్ నుంచి వచ్చి అన్నం వండుకోవాల్సి వచ్చింది. నిజం చెప్పొద్దూ కూర మాత్రం చేశాడులే. పైకెళ్ళి బట్టలు మార్చుకొచ్చి గిన్నెలు కడుక్కుని కంచాలూ మంచినీళ్లు పెట్టేసరికి అన్నం ఉడికిపోయింది. ఇదివరకు ఇవన్నీ తాను చేసేవాడు. ఎందుకండీ కష్టపడతారు అంటే "ముఫై ఏళ్ళు నాకు ఆఫీసు నుండి రాంగానే భోజనం పెట్టావు రిటైర్ అయిన తరువాత నీకు ఈ మాత్రం చెయ్యలేనా" అనేవారు. మా బుజ్జి నాయన. ఇప్పుడేమో అంతా మారిపోయింది. తింటాడు పోతాడు కంప్యూటర్ ముందు కూర్చుంటాడు.
నిన్నటికి నిన్న తను ఆఫీస్ నుండి వచ్చిన సంగతే గమనించలేదు. ఇదివరకు గారేజ్ తలుపు శబ్దం అవగానే వచ్చి తలుపు తీసే వాడు. రెండు మూడు సార్లు కంప్యూటర్ గదిలోకి తొంగి చూసింది. అలా స్క్రీన్ వేపు చూస్తూ ఉంటాడు. మొదట ఏమన్నా దెయ్యం పట్టిందేమో అని భయపడింది కానీ ఒక నిర్ధారణకు రాలేక పోయింది. మూడు పూట్లా తింటాడు, ఏవో అవసరం వచ్చి నప్పుడు ప్రేమ మాటలు చెప్పి తన పని కానిచ్చు కుంటూ ఉంటాడు. మళ్ళా ఆ ప్రేమ మాటలు ఆ కుతి వచ్చినప్పుడే.
పోనీలే తన పని తాను చేసుకుంటున్నాడు, చిరుతిళ్ళు ఏమీ అడగడు. అప్పుడప్పుడూ "బర్గర్కింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ " తెచ్చిపడేస్తే సంతృప్తి పడతాడు. అని ఊరుకుంది. కానీ తాను చెప్పిన మాట వినటల్లేదనే పాయింట్ మనస్సుని తొలిచేస్తోంది.
తెగేసి అడిగింది "ఏమి చేస్తున్నారు కంప్యూటర్ మీద" అని. "పైథాన్ " నేర్చుకుంటున్నాను అన్నాడు. "పైథాన్ " అంటే ఏమిటని తాను అడగలేదు. అడిగితే కూర్చోబెట్టి ఒక లెసన్ పీకుతాడని తెలుసు. మొగుడినుండి లెసన్లు తీసుకునే అవసరం తనకు లేదు. ఆయన చెప్పిన డ్రైవింగ్ లెసన్స్ నలభై ఏళ్ళ తర్వాత గూడా గుర్తున్నాయి!. ఆ రోజులు పోయినాయి. తాను కంప్యూటర్ వాడుతుంది కానీ, కంప్యూటర్ ఎల్లా పనిచేస్తుందో ఎవరికి కావాలి. అసలు ఫోన్ కూడా కంప్యూటరేట. తనకి ఫోన్ చెయ్యటం కూడా చేత కాదు. నేను ఐఫోన్ వాడతాను. తనకి దాన్ని వాడటం చేతకాదు. మొన్నటికి మొన్న మేనార్డ్స్ కి వెళ్తా నంటే నా ఫోన్ ఇచ్చాను. కారులో తాళంచెవులు పడేసుకుని కార్ లాక్ చేసుకున్నారు. ఫోన్ లో ఎదో నంబర్ కనపడిందిట ఫోన్ చేశారు. మా అబ్బాయి వెయ్యి మైళ్ళ దూరం లో ఉన్న న్యూయార్క్ నుండి నాకు ఫోన్ చేసి నాన్న మేనార్డ్ పార్కింగ్ లాట్ లో ఉన్నారు, కారు తాళంచెవులు తీసుకు వెళ్ళు అని చెప్పాడు. అస్సలు నేనివ్వాలి లెసన్. వళ్ళు మండిపోతుంది. తను రోజూ కారు వాడుతుంది, లోపల ఇంజిన్ ఎల్లా పని చేస్తుందో లెసన్ పీకుతానంటే ఎవరు వింటారు. అదీ కూడా ట్రై చేశాడు ఆయన.
పది రోజులయ్యింది ఇరవై రోజులయ్యింది. ఉలుకూ పలుకూ లేకుండా కంప్యూటర్ గదిలో కూర్చుని హాయిగా తెచ్చినవన్నీ ఆరగిస్తూ అనుభవిస్తున్నాడు. అతగాడు "పైథాన్" పేరుతో తనని వాడుకుంటున్నాడనే అనుమానం వచ్చింది. నిలదీసి మొహమాటం లేకుండా అడిగింది. ఏమిటి సంగితి ఇంట్లో పనులు చెయ్యటం ఎప్పుడు మొదలెడతావు అని. "పైథాన్" నేర్చుకున్నాను. కానీ అది బాగా పని చెయ్యాలంటే "పాండాస్" నేర్చు కోవాలి అది నేర్చుకుంటున్నాను అన్నాడు. సరే ఊరుకుంది. తర్వాత "నంపై" అన్నాడు. ఆ తర్వాత "జూపిటర్ నోట్బుక్ " అన్నాడు. పని ఎగకొట్టటానికి ప్లాన్ ఏమో అనే అనుమానం వచ్చింది.
వాళ్ళబ్బాయికి ఫోన్ చేసింది. మొన్నేదో అయ్యా కొడుకూ మాట్లడుకుంటుంటే వింది. "పండాస్" లో "గ్రూప్బై" బాగా పనిచేస్తుందని. ఏమిట్రా అబ్బాయి మీ నాన్న నామాట వినటం మానేశారు. కంప్యూటర్ స్క్రీన్ వేపు అల్లా చూస్తూ కూచుంటారు. కాసేపు "పైథాన్" అంటారు, తర్వాత "నంపై" అంటారు, "పండాస్ " అంటారు. ఏమిటిదంతా. అవి నిజమా అబద్దమా ఏమిటి సంగతి అని.
మదర్ నీవు చెప్పిన వన్నీ కంప్యూటర్ భాషలు. కంప్యూటర్ భాషలతో అంతే అమ్మా. మనము ఒకటని దానికి చెబుతాం. అది ఒకటి చేస్తుంది. ఎందుకు అలా చేసిందని స్క్రీన్ వేపు చూస్తూ కూర్చుంటాము. అందరూ చేసేపని అదే. నువ్వేమీ గాభరా పడవోకు అని చెప్పాడు. కంప్యూటర్ భాష అంటే ఏమిటో చెప్పమని అడిగింది. ఏమన్నా అడిగితే కొడుకులూ కూతుళ్ళూ లెసన్ పీకరు. టూకీగా చెప్పేసి అయిందని పిస్తారు. వాళ్లకి టైం ఉండదు.
అమ్మా ఏ కంప్యూటర్ కైనా తెలిసినవి రెండే రెండు "సున్నా" "ఒకటి". ఆ రెండు అంకెలతో దానికి మనకి కావాల్సిన పని చెప్పి చేయించటం కష్టం. అందుకని కంప్యూటర్ భాషలు సృష్టించారు. అవి మనం మాట్లాడుకునే భాషల్లాగానే ఉంటాయి. మనకేమి కావాలో ఆ భాషలతో చెబితే అవి వాటిని కంప్యూటర్ భాషలో కి మార్చి అర్థమయ్యేటట్లు కంప్యూటర్ కి చెబుతాయి. ఆ కంప్యూటర్ భాషలు అందరికీ నేర్చుకోటం కష్టం కాబట్టి కంప్యూటర్ కి చెప్పటానికి మూగభాషలు, సైన్ భాషలు కూడా తయారు చేశారు. నువ్వు ఐఫోన్ వాడతావే అది అటువంటిదే. అని చెప్పి అమ్మా నాకింకో ఫోన్ వస్తోందని ఫోన్ పెట్టేశాడు.
కామేశ్వరమ్మకి ఏమి చేయాలో అర్ధం కావటల్లా. ఈ "పైథాన్" అనే "సైతాన్ " చేతుల్లోనుండి మొగుడు తన చేతుల్లోకి రావాలని రోజూ పూజలు, ఎక్కువ చెయ్యటం మొదలు పెట్టింది.
The technical names used are Python, Rodeo, Numpy, Pandas, Matplotlib, Jupyter notebook. All others except Rodio comes with Anaconda distribution. Rodeo which is an IDE could be downloaded from the internet.

ఏదోలే పోనీలే అని రెండురోజులు ఓపిక పట్టింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటోంది. భరించలేకుండా ఉంది. తిట్టుకున్నా కొట్టుకున్నాఆయన ఎదురుకుండా ఉంటే టైమ్ తొందరగా గడిచి పోతుంది. ఇంక పట్టలేక ఈ కంప్యూటర్ వ్యవహారం ఎప్పుడవుతుంది అని అడిగింది. ఒక పది రోజులలో అయిపోతుంది అని సమాధానం వచ్చింది. ఏదో పదిరోజులేగా సరిపెట్టుకుంటే మొగుడు తన కంట్రోల్ కి వస్తాడు కదా అని గొడవ చెయ్యకుండా ఊరుకుంది. అంతేకాదు కాఫీ ఫలహారాలు కూడా కంప్యూటర్ గదికి తెచ్చి ఇవ్వటం మొదలెట్టింది.
పది రోజులయ్యింది ఇరవై రోజులయ్యింది. ఉలుకూ పలుకూ లేకుండా కంప్యూటర్ గదిలో కూర్చుని హాయిగా తెచ్చినవన్నీ ఆరగిస్తూ అనుభవిస్తున్నాడు. అతగాడు "పైథాన్" పేరుతో తనని వాడుకుంటున్నాడనే అనుమానం వచ్చింది. నిలదీసి మొహమాటం లేకుండా అడిగింది. ఏమిటి సంగితి ఇంట్లో పనులు చెయ్యటం ఎప్పుడు మొదలెడతావు అని. "పైథాన్" నేర్చుకున్నాను. కానీ అది బాగా పని చెయ్యాలంటే "పాండాస్" నేర్చు కోవాలి అది నేర్చుకుంటున్నాను అన్నాడు. సరే ఊరుకుంది. తర్వాత "నంపై" అన్నాడు. ఆ తర్వాత "జూపిటర్ నోట్బుక్ " అన్నాడు. పని ఎగకొట్టటానికి ప్లాన్ ఏమో అనే అనుమానం వచ్చింది.
వాళ్ళబ్బాయికి ఫోన్ చేసింది. మొన్నేదో అయ్యా కొడుకూ మాట్లడుకుంటుంటే వింది. "పండాస్" లో "గ్రూప్బై" బాగా పనిచేస్తుందని. ఏమిట్రా అబ్బాయి మీ నాన్న నామాట వినటం మానేశారు. కంప్యూటర్ స్క్రీన్ వేపు అల్లా చూస్తూ కూచుంటారు. కాసేపు "పైథాన్" అంటారు, తర్వాత "నంపై" అంటారు, "పండాస్ " అంటారు. ఏమిటిదంతా. అవి నిజమా అబద్దమా ఏమిటి సంగతి అని.
మదర్ నీవు చెప్పిన వన్నీ కంప్యూటర్ భాషలు. కంప్యూటర్ భాషలతో అంతే అమ్మా. మనము ఒకటని దానికి చెబుతాం. అది ఒకటి చేస్తుంది. ఎందుకు అలా చేసిందని స్క్రీన్ వేపు చూస్తూ కూర్చుంటాము. అందరూ చేసేపని అదే. నువ్వేమీ గాభరా పడవోకు అని చెప్పాడు. కంప్యూటర్ భాష అంటే ఏమిటో చెప్పమని అడిగింది. ఏమన్నా అడిగితే కొడుకులూ కూతుళ్ళూ లెసన్ పీకరు. టూకీగా చెప్పేసి అయిందని పిస్తారు. వాళ్లకి టైం ఉండదు.
అమ్మా ఏ కంప్యూటర్ కైనా తెలిసినవి రెండే రెండు "సున్నా" "ఒకటి". ఆ రెండు అంకెలతో దానికి మనకి కావాల్సిన పని చెప్పి చేయించటం కష్టం. అందుకని కంప్యూటర్ భాషలు సృష్టించారు. అవి మనం మాట్లాడుకునే భాషల్లాగానే ఉంటాయి. మనకేమి కావాలో ఆ భాషలతో చెబితే అవి వాటిని కంప్యూటర్ భాషలో కి మార్చి అర్థమయ్యేటట్లు కంప్యూటర్ కి చెబుతాయి. ఆ కంప్యూటర్ భాషలు అందరికీ నేర్చుకోటం కష్టం కాబట్టి కంప్యూటర్ కి చెప్పటానికి మూగభాషలు, సైన్ భాషలు కూడా తయారు చేశారు. నువ్వు ఐఫోన్ వాడతావే అది అటువంటిదే. అని చెప్పి అమ్మా నాకింకో ఫోన్ వస్తోందని ఫోన్ పెట్టేశాడు.
కామేశ్వరమ్మకి ఏమి చేయాలో అర్ధం కావటల్లా. ఈ "పైథాన్" అనే "సైతాన్ " చేతుల్లోనుండి మొగుడు తన చేతుల్లోకి రావాలని రోజూ పూజలు, ఎక్కువ చెయ్యటం మొదలు పెట్టింది.
The technical names used are Python, Rodeo, Numpy, Pandas, Matplotlib, Jupyter notebook. All others except Rodio comes with Anaconda distribution. Rodeo which is an IDE could be downloaded from the internet.
బుల్లి కథైనా పైథాన్ సైతాను కథ చక్కగా ఉంది. నిజానికి కంప్యూటర్భాష నేర్చుకోవటంలో ఆ కష్టాలున్నాయి.
ReplyDeleteఅంతే కదండీ మరి. థాంక్స్.
Deleteశ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.
ReplyDeleteకథ, కథాగమనం బాగుంది.
మీ స్నేహశీలి,
మాధవరావు.
మాధవరావు గారూ ఈ మధ్య మీ పోస్టులు కనపడటల్లేదు? కులాసా ఏ కదా. మీ వ్యాఖ్యకు థాంక్స్.
Delete