Tuesday, August 13, 2019

153 ఓ బుల్లి కథ ---- పిల్లలూ - పాపలూ

వసుదే వసుతం దేవం 
కంస చారూణ మర్దనం
దేవం పరమా నందం 
కృష్ణం వన్డే జగద్గురుం 

మీకు దేవుడిచ్చిన మంచి కంఠం ఉంది. దానిని చక్కగా ఉపయోగించుకోటానికి సంప్రదాయ మయిన సంగీత శాస్త్రముంది. వాటిని గ్రహించిన తలి తండ్రులు ఉన్నారు. శాస్త్రాన్ని ఓపికగా నేర్పించే నిపుణులైన మాస్టర్లు ఉన్నారు. ఎక్కడో ఇంకో దేశంలో ఉన్నా, పా శ్చాత్య వాతావరణంలో మునిగి తేలుతున్నా, ఇష్టంతో కష్టపడి సాధన చేసే శక్తి మీకుంది. ఇక విని ఆనందించే శక్తి మాకు లేకుండా పోతుందా. మీరు పెద్దయిన తర్వాత తప్పకుండా మీ పిల్లలకు నేర్పుతారు. ఇంక మన ప్రాచీన కర్ణాటక సంగీత ప్రవాహానికి అడ్డం ఏముంటుంది ? మీరంటే మాకు చాలా గర్వంగా ఉంది.

క్రింది వీడియో  Indian Raga Labs (USA ) నుండి వచ్చినది.


The vocal artists are Sahana Prasanna and the Sai sisters (Kiran and Nivi). The accompanying artists include Priyanka Chary on veena, Sumhith Aradhyula on flute, Sashank Sridhar on piano, and Santhosh Ravi on mridangam.

This piece is a thillana, a Carnatic medley between vocal and percussion elements, usually performed with a quick tempo and with gusto.

The title of this thillana is "Tom ta taara" in ragam Sindhubhairavi, set to thalam Deshaadi, and composed by T.K. Govinda Rao. The charanam is in Tamil, and is a tribute to Lord Krishna's dance.


Wednesday, August 7, 2019

152 ఓ బుల్లి కథ -- ఆరోగ్యంగా ఉండాలంటే - Part 2

మన శరీరమూ, కారు రెండూ ఒక విధంగానే పనిచేస్తాయి. ఇచ్చిన ఆహారం తీసుకుని పీల్చిన గాలితో దగ్ధం చేసి వచ్చిన శక్తి తో ముందరికి కదులుతాయి. కారు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు మధ్యలో ఆగిపోతుందేమోనని ముందర జాగర్త పడతాము.

కారుకి, ఎల్లప్పుడూ మంచి గాలి అందటానికి Air Filter పెడతాము. దానికి మలినాలు లేకుండా పెట్రోల్ అందటానికి Fuel Filter పెడతాము. కదిలే భాగాలు సులభంగా  కదలటానికి Oil పోస్తాము.ఆ నూనెలో మలినాలు తీసేయ్యటానికి  Oil ఫిల్టర్ పెడతాము. Engine వేడెక్కుతుందని వేడిని తగ్గించటానికి నీళ్ళు పోస్తాము. జాగర్తగా దానికి కావలసిన ఆహారం unleaded, leaded, diesel ఏది కావాలంటే అది ఇస్తాము. వీటి నన్నింటినీ జాగర్తగా చూసుకుంటూ అవసరమైనప్పుడు అరిగిపోయిన పాత వాటిని తీసి వేసి కొత్తవి పెట్టుకుంటూ ఉంటాము.

మన శరీరానికి ఏమి చేస్తున్నాము? ఏది బడితే అది తిని తాగి, కదలలేకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్తున్నాము.

ఆలోచిస్తే కారుకీ మనకీ ఒకటే తేడా. ఒకటి physical system ఇంకొకటి biological system. కారు మనం తయారు చేశాం కాబట్టి అది ఎల్లా పనిచేస్తుందో దానికి కావాల్సినవి ఏమిటో తెలుసు. మన శరీరం ఎవరు ఎల్లా చేశారో తెలియదు; మన శరీరం ఎల్లా పనిచేస్తుందో ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాము (మన శరీరంలో glymphatic system ఉన్నదని ఈ మధ్యనే కనుగొన్నారు) .

కారు తయారు చేసినవాళ్లు maintenance schedule ఇస్తారు. దాని ప్రకారం దానికి పనులు చేసి కారు కుంటకుండా చూస్తాము. కానీ మన శరీరం ఏ maintenance schedule తో రాలేదు. జీవితం సుఖంగా నడవాలంటే ఒకటే మార్గం; మన శరీరం ఎల్లా పనిచేస్తుందో వీలయినంత వరకూ తెలుసుకుని మనమే ఒక maintenance schedule తయారు చేసుకోవాలి.

ఈ పోస్టుల్లో మన శరీరం ఎల్లా పని చేస్తుందో విపులంగా చూద్దాము. కానీ ముందర ఒకటి గుర్తుంచు కోవాలి. మన శరీరానికి కారుకి కావలసినవి ఒకటే ; పరిశుభ్రమయిన గాలి. పరిశుభ్రమయిన నీళ్ళు. పరిశుభ్రమయిన ఆహారం. ఇవి సరీగ్గా లేకపోతే రెండూ పని చేయవు. కుంటుకుంటూ నడుస్తాయి.ఇది గమనించి సర్దుబాటు చేసుకుంటే  జీవితం బాగుంటుంది లేకపోతే జీవితం మంచానికి అంటుకు పోతుంది.

మొదటగా మనకి పరిశుభ్రమయిన గాలి కావాలి శరీరం గాలిలో oxygen తీసుకుని మలినాలని బయటికి పంపుతుంది. ఇది మనం జీవించటానికి 24 గంటలూ చేస్తున్న పనే. శ్వాస దీర్ఘంగా  ఊపిరితిత్తుల నిండా  పీల్చండి. చిన్న చిన్న సందుల్లోకి కూడా గాలి వెళ్తుంది. కాసేపు ఉంచి వదలండి. ఇది రోజుకు కనీసం పది సార్లు చెయ్యండి.

దీనిని పరిశోధించిన ఒక డాక్టర్ గారు 4,7,8,10 గ చేస్తే బాగుంటుందని అన్నారు. దాని అర్ధం అంకెలు లెక్క పెడుతూ 4 శ్వాస పీల్చటం, 7 అంకెలు బిగపెట్టటం , 8 అంకెలు దానిని వదలటం. ఈ ప్రక్రియని 10 సార్లు చేస్తే శరీరానికి చాలా మంచిది అని Sarah Ballantyne PhD గారు  auto immunity seminar లో చెప్పారు. దీనినే మనవాళ్ళు మెడిటేషన్ అంటారు.  (అంకెలు లెక్కపెట్టటం మనస్సులో చెయ్య వచ్ఛు.)

రెండవది పరిశుభ్రమయిన నీళ్ళు కావాలి. మొదట లేవంగానే రెండు గ్లాసుల నీళ్ళు తాగండి. తరువాత వీలయినప్పుడల్లా తాగుతూ ఉండండి. మన శరీరం 98.6°F (37°C) దగ్గర పనిచేస్తుంది (operating  temperature ). అందుకని కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగితే కొంచెం మన శరీరానికి సహాయం చేసినట్లు అవుతుంది.

మనం పాల సీసా శుభ్రం చేసేటప్పుడు  ఒక చిన్న బ్రష్ తీసుకుని రుద్ది తరువాత నీళ్ళతో కడుగుతాము. అదే పని మన శరీరానికి చెయ్యొచ్చు. మనము ఆహారంలో పీచు (fiber ) ఎక్కువగా ఉండే పదార్ధాలు  తీసుకుంటే, ఆ పీచు కూడా బ్రష్ లాగా పనిచేసి లోపల శుభ్రం చేస్తుంది. మనము చెయ్యాల్సిన పని అల్లా  పీచు ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోవటం. తాగిన నీళ్ళతో మలినాలని బయటకు పంపడం.

పీచులో మళ్ళా రెండు రకాలు ఉన్నాయి. కరిగేది (soluble ) కరగనిది (insoluble ).  "కరగని" పీచు మనం తిన్న ఆహారం ప్రయాణించే మార్గాన్ని శుభ్రంచేసి చెత్తని బయటికి పంపటానికి దోహదం చేస్తుంది. "కరిగే" పీచు రక్తనాళాల లోకి వెళ్ళి వాటిని శుభ్రం చేస్తుంది.

మనలో చాలా మందికి తెలిసిన పీచు పదార్ధాలు ఉన్న ఆహారం , "ఓట్స్" , "సిరి ధాన్యాలు". ఓట్స్ లో పీచు పదార్ధం కరిగేది కరగనిది దాదాపు సమానంగా ఉన్నాయి. సిరిధాన్యాలలో కరిగే పీచు పదార్ధం ఎంత ఉన్నదో నాకు తెలియదు. కనీసం రోజుకి రెండు మూడు స్పూనులు ఓట్స్ , సిరి ధాన్యాలు తినటం వెంటనే ప్రారంభించండి.

రాబోయే పోస్టుల్లో మన శరీరంలో ఉన్న systems అవి పనిచేసే విధానం గురించి విపులంగా చర్చించి మన శరీరానికి maintenance schedule తయారు చేసుకుందాము.