రిటైర్ అయిన తర్వాత సంవత్సరాలు గడిచిన కొద్దీ చిన్ననాటి సంగతులన్నీ రోజూ ఒకొటొకటిగా గుర్తుకు వస్తూ ఉన్నాయి . చిన్నప్పటి నుండీ యూనివర్సిటీ దాకా నాకు చదువు చెప్పిన వాళ్ళు తరుచూ గుర్తుకు వస్తూ ఉంటారు .
చిన్నప్పుడు ఎప్పుడో విష్వక్సేనుడు రాక్షస రాజు అని విని నట్టు గుర్తు . అది బహుశా నేను అయిదవ క్లాసు చదువుతున్నప్పుడు అయ్యుంటుంది . ఎందుకంటే "విష్వక్సేనుడు" అనే పదం తెలుగులో వ్రాసి, నోటితో సరీగ్గా పలక గలిగితే 5వ క్లాసు పాస్ అయినట్లే . అప్పుడు మాకు పుస్తకాలు అంటూ ఏవీ ఉండేవి కావు . ఉన్నది పలకా బలపమే . అప్పుడు మాకు పుస్తకాలు కొనుక్కునే రూల్ యూనిఫార్మ్ వేసుకుని స్కూల్ కి రావాలనే రూల్ ఉండేవి కాదు . మీకు ఇప్పటికే అర్ధమై ఉంటుంది నా చదువు పాతకాలం పల్లెటూరు లో ప్రారంభించానని . మా పెదనాన్న గారు స్కూల్ హెడ్మాస్టర్ కావటంతో రోజూ మేమే పొద్దున్న స్కూల్ బెల్ కొట్టేవాళ్ళం . ఆయన్ని మేము బావయ్యారు అని పిలిచే వాళ్ళం . ఆయన మాకు అయిదవ క్లాస్ పాఠాలు కూడా చెప్పేవారు . అందుకని మాకు ఆయనంటే భయం గౌరవం కూడా .
రోజూ స్కూల్ చివరి పిరియడ్ లో అన్ని తరగతుల వాళ్ళమూ , ఒక రెండు రెండు , రెండు మూ ళ్లారు అంటూ , పదవ ఎక్కం దాకా అరుస్తూ వంత పాడే వాళ్ళం . మేము అయిదవ క్లాసు పూర్తయ్యే సరికి తెలుగు వ్రాయటం చదవటం 10 దాకా ఎక్కాలూ కంఠతా వచ్చేవి. అయిదు సంవత్సరాలు రోజూ వల్లెవేయటం వల్ల ఎక్కాలు, పర్మనెంట్ మెమొరీ లో జేరిపోయాయి . అందుకే సూపర్ మార్కెట్లో, నూనె మూడు 12oz సీసాలు కొంటే చవకా లేక ఒక 32oz సీసా కొంటే చవకా అని మా ఆవిడ అడిగితే తడువుకోకుండా వెంటనే లెక్కకట్టి చెప్పేస్తాను .
ఎలిమెంటరీ స్కూల్ లో ఉన్నప్పుడే ఇంగ్లీషు ఇంట్లో మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను . అక్షరాల నుండీ, సి ఏ టీ , Cat వరకూ. మా అమ్మ కూడా పెద్దగా చదువుకోలేదు . ఇంకో పల్లెటూరులో కుటుంబరావు తాత గారి వీధి బడిలో చదువుకుందిట .
ఒక రోజు పది మంది అమ్మాయిలని చూసి ఒకర్ని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయినే ఎందుకు పెళ్లి చేసుకోవాలను కున్నాను అంటే సమాధానం లేదు. పెళ్లి చూపుల్లో నేను అడిగిన ఒకే వక ప్రశ్న వంటచేయ గలవా అని . బహుశ గుంటూరు వంట రోజూ తినాలనే కోరిక అవ్వచ్చు . తాను ఏమి చెప్పిందో నాకు గుర్తు లేదు . సంవత్సరాల తరబడి హాస్టళ్లల్లో హోటళ్లలో తినటం మూలాన విసిగిపోయి ఉంటాను . అందుకనే యాభై ఏళ్ళ నుండీ అమెరికా జీవితం కంది పచ్చడి గోంగూర లతో పెద్ద ఒడిదుడుకులు లేకుండా సుఖంగా సాగిపోతూ ఉంది .
మళ్ళా మరొక జ్ఞాపకంతో మీ ముందు ఉంటాను . అంతవరకూ శలవు .
లక్కరాజు గారికి నమస్కారములు.
ReplyDeleteచిన్ననాటి జ్ఞాపకాలను తలచుకొంటూ విశేషాలను మాకు కూడా పంచుతుంటే ఆనందంగా, ఆహ్లాదంగా వుంటుంది. తదుపరి రచనలలో ఉపాధ్యాయులతో మీ జ్ఞాపకాలు, సహచరులతో కలిపి, కలిసి చేసిన సంఘటనల్ని కూడా వ్రాయండి.
మీ స్నేహశీలి,
పబ్బరాజు మాధవరావు.
మాధవరావు గారూ : ఎన్నాళ్ళకి మీ నుండి వింటున్నాను . పాత జ్ఞాపకాలు జీవితంలో మరచి పోలేని పంటలు . తప్పకుండా వాటిని గురించి వ్రాస్తాను . థాంక్స్
ReplyDeleteIn my childhood, a few ppl who come to our house used to ask me if I can write, విష్వక్సేనుడు. It is considered to be a tough word to write.
ReplyDeleteఅవునండీ అది చాలా కష్టంగా ఉండేది . మీ వ్యాఖ్యకు ధన్యవాదములు .
DeleteVery nice!
ReplyDeleteUser 123: థాంక్స్ .
ReplyDeleteచదివితే సరదాగా వుంటుంది
ReplyDelete