![]() |
పిల్లలు |
![]() |
కుందేలు కోపం |
![]() |
స్క్వీకీ |
సామాన్యంగా అమెరికాలో చిన్న పిల్లలని నిద్రపుచ్చే ముందు వాళ్ళని పడుకోబెట్టి పుస్తకాలు చదువుతారు . ఇంట్లో చిన్న పిల్లలుంటే పెద్దవాళ్ళకి ఆనవాయితీ గా పుస్తకాలు చదవటం అలవాటు అవుతుంది. ఈ పిల్లల పుస్తకాలు సామాన్యంగా బయట కొనుక్కోవచ్చు. కానీ చాలామంది దగ్గరలో ఉన్న లైబ్రరీ నుండి తెచ్చు కుంటారు . మా ఇంట్లో అయితే శని ఆదివారాలలో ఒకప్పుడు ఇది మామూలు గ చేసేదే. ఇప్పుడయితే మనవళ్ళు మానవరాళ్ళకోసం, వాళ్ళు ఇంటికొచ్చే ముందర అమ్మమ్మ లైబ్రరీకి వెళ్లి ఒక ఇరవై పుస్తకాలు చదవటానికి పట్టుకొస్తుంది . మా చిన్నప్పుడు మాకు పుస్తకాలు చదివే వెసులుబాటు లేదుకానీ మా నాన్నగారు పడుకునే ముందు కధలు చెప్పేవారు . చెప్పిన కధలే మళ్ళా ఇష్టంగా చెప్పించుకునే వాళ్ళం.
ఈ పుస్తకాలు చదివే అలవాటు చిన్నప్పుడే అలవాటైతే తీరిక ఉన్నప్పుడల్లా పుస్తకం పట్టుకోవాలని మనసులో పీకుతుంది. అందుకే ఇప్పుడు పిల్లలు తీరిక ఉన్నప్పుడల్లా ఐపాడ్ పట్టుకుని అమ్మమ్మనో బామ్మనో పుస్తకాలు చదవమని పిలుస్తూ ఉంటారు. ఒక్కక్కప్పుడు వాళ్ళే వాళ్లకి ఇష్టమయిన పుస్తకాలు తీసుకు వచ్చి చదవమంటారు.
ఇప్పుడు ఇంకో టెక్నాలజీ వచ్చింది . AI (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ) తోటి మనమే మనకి ఇష్టమయిన కధల తోటి పుస్తకాలు తయారు చేసుకోవచ్చు . అటువంటిది ఒకటి గూగుల్ వారి జెమినీ (gemini ) సాఫ్ట్వేర్ . దీనిని ఉపయోగించి ఒక కధని "స్టోరీ బుక్" గా తాయారు చెయ్యవచ్చు. దీనిని వాడుకోటానికి ప్రస్తుతం డబ్బేమీ కట్టక్కరలేదు.
దాదాపు AI (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ) తో పనిచేసేవాన్నిటికీ ముందర మనకి ఏది కావాలో చాట్ బాక్స్ ద్వారా చెప్పితే అది చేయగలదో లేదో చెబుతుంది . దాని చేతే ఒక పంచతంత్ర కధని పుస్తకంగా వ్రాయించాను . మా మనవడు ఒక కధ చెప్పి పుస్తకంగా వ్రాయమంటే పుస్తకం చేసింది కానీ కధ తన ఇష్టమొచ్చినట్లు మార్చేసింది . దానిని తప్పులు సరిచేయమంటే సరిచేస్తుంది కానీ ఒక్కక్కప్పుడు మోరా ఇస్తుంది . నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను నన్ను గొడవ చెయ్యద్దంటుంది.
ఉదాహరణకి నేను దాన్ని ఒక తెలుగు స్టోరీ వ్రాయమన్నాను . దానికి అది చెప్పిన సమాధానం కింద ఇస్తున్నాను:.
నమస్కారం! మీరు ఒక స్టోరీబుక్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. మీ కోసం మరింత వ్యక్తిగతీకరించిన కథను రూపొందించడానికి కొన్ని వివరాలు అవసరం. ఇవి కేవలం సూచనలు మాత్రమే.
పాఠకుల వయస్సు ఎంత?
కథాంశం ఏమిటి?
ఇలస్ట్రేషన్ శైలి ఎలా ఉండాలి? (ఉదాహరణకు, వాటర్ కలర్ లేదా కార్టూన్)
నేను తయారు చేసిన స్టోరీబుక్ లు వాటి లింకులూ క్రింద ఇస్తున్నాను . మీ పిల్లలకి చదివి వినిపించండి మీరుకూడా మీ పిల్లల చేత స్టోరీలు తాయారు చేయించి వాళ్ళ క్రియేటివిటీ ని పెంచండి . స్టోరీ బుక్ పైన "cover" అని వస్తుంది . దాని పక్కన గుర్తులు "< >" నొక్కితే పుస్తకంలో పేజీ లు మారుతాయి .
1. Go to School Everyday: https://g.co/gemini/share/6d7503fbcb7c
2. తెలివైన కాకి నీలా : https://g.co/gemini/share/37838c6e2c24
3. వన్రాజ్ మరియు చతుర నక్క: https://g.co/gemini/share/e8659ddcc711
4. Kira Bunny and the Snowy Trick: https://g.co/gemini/share/ed7006aee98b
Kira Bunny and the Snowy Trick
5. కుందేలు కోపం : https://g.co/gemini/share/45f9142732af
No comments:
Post a Comment