Showing posts with label Telugu rachana Lakkaraju computer. Show all posts
Showing posts with label Telugu rachana Lakkaraju computer. Show all posts

Tuesday, May 11, 2010

21. ఓ బుల్లి కథ 9 -- కంప్యూటర్ లో ఏముంటాయి ---

ఈ కథ రోజూ కంప్యూటర్ సముద్రంలో కొట్టుకుంటూ మునిగి తేలే వారి కోసం మాత్రం కాదు. దానిలో మునిగి తేల లేక ఏదో విధంగా సరిపెట్టు కుందాము అనుకునే వారి కోసం.

నా డెస్క్ టాప్ పాడయితే మా ఆవిడ లాప్ టాప్ వాడటానికి ఒక ఒప్పందానికి వచ్చాము. నేను లాప్ టాప్ మీద పని చేసిన సమయము నిమిషాల తో సహా ఆవిడ చెప్పిన పనులు చెయ్యాలి. దానికి తోడు కంప్యూటర్ బాగు చెయ్యటం ఆవిడకి నేర్పాలి. ఇది బలాత్కార బానిసత్వం క్రిందకి వస్తుంది. నాకు ఒకటే శరణ్యం. ఆవిడకి కంప్యూటర్ బాగు చెయ్యటం నేర్పాలి. సరే ప్రణాళిక నిర్ణయించు కున్నాను.
మొదట కంప్యూటర్ గురించి చెప్పాలి. ఆవిడ్ ఈ-మెయిల్స్ చూస్తుంది తప్ప పరిజ్ఞానం ఎంత ఉందొ తెలియదు. టూకీగా చెప్పాలని నిర్ణయించు కున్నాను. తరువాత అది ఎల్లా పాడవు తుందో చెప్పాలి(ఇది నన్ను సేవ్ చేసు కోవటం కోసం. ఎందుకంటే పొద్దున్న బాగున్న కంప్యూటర్ సాయంత్రానికి ఎల్లా పాడయింది . ఏదో చేసారు కి సమాధానం చెప్పలేక) . ఆ తరువాత బాగు చేసే విధానం. తేలికగా మూడు మెట్ల వ్యవహారం. నోట్సు వ్రాసు కున్నాను. మొదట చదివించటం ఆ తరువాత ప్రశ్నలకి జవాబు లివ్వటం.
కంప్యూటర్ అంటే ఏమిటి --- దానిలో ఏమి ఉండును --- ఎలా పని చేయును.
కంప్యూటర్ పని చెయ్యాలంటే దానికి రెండు రకముల సాధనాలు ( కనపడేవి కనపడనివి) కావాలి. కనపడే వాటిని హార్డువేర్ అంటారు, కనపడని వాటిని సాఫ్ట్ వేర్ అంటారు. కంప్యూటర్ కి అర్ధమయ్యేది ఒకటే భాష. దానిని మెషీన్ లాంగ్వేజి అంటారు. మనం కంప్యూటర్ ఆన్ చెయ్య గానే వచేదాన్ని ఆపరేటింగ్ సిస్టం అంటారు( ఉదా: విండోస్). ఇది మన ఆజ్ఞ లని మనభాష లో తీసుకుని కంప్యూటర్ భాషలో కి మార్చి కంప్యూటర్ కి చెయ్యమని చెబుతుంది.

I
. Hard ware:

1.
ఎలక్రానిక్ చిప్ --- తనకు పంపిన ఆజ్ఞలను ఛేదించ టానికి.
2. RAM ------ Random Access Memory  -- చాలా త్వరగా పని చేస్తుంది. అందుకని కంప్యుటర్ ని పనిచేయించే         ఆపరేటింగ్ సిస్టంని (విండోస్) దీనిలో ఉంచుతారు. త్వరగా ఆజ్ఞలను పంపటానికి.
3. హార్డ్ డిస్క్ --- వ్రాసిన సంగతులు, ఫోటోలు దాచి పెట్టి కావాల్సి నప్పుడు ఇవ్వ టానికి.
4. వీడియో కార్డు --- కంప్యూటర్ లో జరిగేవి మనకు మోనిటర్ ద్వారా చూ పెట్ట టానికి.
5. సౌండ్ కార్డు --- speakers ద్వారా శబ్దాన్ని వినిపించటానికి.
6. CD/DVD రికార్డర్/ప్లేయర్. --- కంప్యూటర్ లోకి CD ల ద్వారా సందేశాలు పంప టానికి.
7. I/O బోర్డు --- కీ బోర్డ్ ద్వారా ( టైపు చెయ్యటం) ద్వారా కంప్యూటర్ కి చెప్పటానికి. ప్రింట్ చెయ్యటానికి.
8. నెట్వర్క్ కార్డు --- ఇంటర్నెట్ కనెక్షన్ కి.
9. Power supply --- ఫై వాటన్నిటికి విద్యుత్తు పంపటానికి.


మీకు లాప్ టాప్ ఉంటే దానిలో వైర్లెస్ కనెక్షన్ కి ఒక కార్డు ఉంటుంది. చాలావరకు ఇవన్నీ ప్లేట్లు లాగా ఉంటాయి. ఎందుకనో వీటిని కార్డులు అంటారు. 
కంప్యూటర్ లో ఇవన్నీ వాటంతట అవే పని చేస్తయ్యి కానీ కొన్నిటికి డ్రైవ్ చేసే వాళ్ళు(drivers) ఉంటె కానీ ఎక్కడికీ కదలవు(పని చెయ్యవు). సామాన్యంగా ఈ drivers సాఫ్ట్వేర్ (కనపడనిది) గ ఉంటాయి.


II. Software :  ఆపరేటింగ్ సిస్టం ( విండోస్ )

ఇది కంప్యుటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు RAM లోకి హార్డ్ డిస్క్ నుండి లోడ్ చెయ్య బడుతుంది.
మనము కంప్యూటర్ కి ఎమన్నా చెప్పాలంటే కీ బోర్డు మీద టైపు చేస్తాము లేకపోతే మౌస్ తో క్లిక్ చేస్తాము. మనసందేశాల కోసం ఎప్పుడూ కంప్యూటర్ లో ఒకళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దాన్నే ఆపరేటింగ్ సిస్టం అంటారు. అది చేసే పనల్లా మీ ఆజ్ఞలను తీసుకుని, కార్యాచరణకి ఆయా పనులు చేసేవాటికి పని అప్పగించి మీ కార్యము నేరవేరేటట్టు చేస్తుంది. ఉదా: మీరు ప్రింట్ చెయ్యమని చెప్పారనుకోండి, ప్రింట్ చేసే విభాగానికి మీ కోరిక తెలుపుతుంది. కంప్యూటర్ కి మన భాష తెలియదు. అది మాట్లాడే భాషని మెషిన్ లాంగ్వేజి అంటారు. ఆపరేటింగ్ సిస్టం మనము చెప్పిన వాటిని కంప్యూటర్ కు అర్ధమయ్యేలా చెబుతుంది. కంపూటర్లు మొదట వచ్చినప్పుడు దీనిని సూపర్వయిజరు అనే వాళ్ళు. దీనిని మామూలుగా కంప్యూటర్ భాషలో వ్రాస్తారు.
ఉదా:  విండోస్ , యునిక్స్. కొత్త వి వచ్చినప్పుడల్లా వీటికి ఒక తోక తగిలిస్తారు. ఉదా: విండోస్ xp, విండోస్ 7.


III. Application Programs.


మీరు Internet లోకి వెళ్ళవలె ననుకోండి బ్రౌజరు కావాలి(Mozilla, Chrome, Internet explorer).మీరు పుస్తకం వ్రాయాలను కొండి. మీకు word కావాలి.మీరు పద్దులు వ్రాయాలను కొండి. Spread sheet (Excel) కావాలి.వీటి నన్నిటినీ అప్లికేషను ప్రోగ్రామ్స్ అంటారు. మీ విండౌస్ వీటి పేర్లని అన్నిటిని ఒక రిజిస్టర్ లో వ్రాసుకుంటుంది. మీరు అడగంగానే వాటిని పిలవటానికి. మీరు control panel లోకి వెళ్తే add remove programs లో మీరు ఉపయోగించే ప్రోగ్రాముల పేర్లన్నీ కనపడుతాయి.

కంప్యూటర్ ఎల్లా పని చేస్తుంది: మనం కంప్యూటర్ కి మూడు విధాలుగా చెప్పొచ్చు. కీ బోర్డ్ తో టైపు చెయ్యటం ద్వారా, మౌస్ ద్వారా, CD ద్వారా. ఆపరేటింగ్ సిస్టం (విండోస్) మీ ఆజ్ఞ ల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. అవి తీసుకుని కంప్యూటర్ భాష లోకి మార్చుకుని. కంప్యూటర్ చిప్ దగ్గరకు పంపిస్తుంది. కంప్యూటర్ చిప్ ఆ ఆజ్ఞను మిగతా హార్డువేర్ డ్రైవర్స్ కి కావలసిన పని చెయ్య మని చెబుతుంది (ఉదా: దీనిని మోనిటర్ మీద చూపు). అందుకే మంచి స్పీడు గ పనిచేసే కంప్యూటర్ చిప్ కావాలి. ఒక్కొక్కప్పుడు ఈ ఆజ్ఞ లన్నిటిని వెంటనే పంపించటానికి కుదరదు. అందుకనే ఆజ్ఞలను దాచిపెట్టి వరుసగా పంపటానికి మెమరీ కావాలి. అల్లాగే ఈ మెమరీ లో మనం ఎక్కువగా చూసే వాటిని(కూడలి, హారం, న్యూస్) windows గ పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువ మెమరీ ఉంటె అంత మంచిది.
అలాగే మీకు హైస్పీడ్ కనెక్షన్ కావాలనుకుంటే దానిని గుర్తు పట్టే కార్డు, దాని డ్రైవర్ కంప్యూటర్ లో ఉండాలి.
ఇది సూక్ష్మంగా కంప్యూటర్ కథ. నా ఉద్దేశం లో ఇంత ఆవ గాహన ఉంటే గాబరా పడకుండా కంప్యూటర్ ప్రొబ్లెంస్ పరిష్కరించ వచ్చును.
మా ఆవిడ కిచ్చి చదివించి చూడాలి ఏమంటుందో.

సశేషం --- ఇంకా ఉంది