రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు.
మాలా కుమార్ గారి పప్పుచారు కాగుతోంది ఒక మూల, ఇంకొకవైపు "పాక వైద్యం" కౌటిల్య గారి మిరియాల చారు మరుగుతోంది, రైసు కుకర్లో అన్నం పడేసాను. ఇంక కూర చేస్తే సరిపోతుంది. సింపుల్, పోపు వేయటం దానిలో ఫ్రోజెన్ ఫ్రెంచ్ కట్ బీన్స్ వేసి వేయించటం తరువాత కారం ఉప్పు చల్లటం. కూర అయిపోతుంది.
మనము అయిపొయింది అనుకున్నప్పుడే అన్నీఎదురు తిరుగుతాయి. ఇప్పటికి పోపు రెండుసార్లు మాడింది. ఈ మాడిన పోపు తో కూర ఎవరన్నా చూస్తే నా అహం దెబ్బతింటుంది. నాకు వెంటనే రెస్క్యుప్లాన్ కావాలి. "పాక వైద్యం" కౌటిల్య గారి పర్ఫెక్ట్ పోపు పెట్టే విధానం గురించి ఒకప్పుడు చదివినట్టు గుర్తు. వెంటనే లాప్ టాప్ తీసి "పాక వైద్యం" లోకి వెళ్లాను. ఈయనతో ప్రాబ్లం ఏమిటంటే అసలు విషయం పోస్ట్ మధ్యలో ఎక్కడో వ్రాస్తారు. అవసరంగా అప్పటికప్పుడు వెతికే నాలాంటి వాళ్లకి ఎంత కష్టమవుతుంది? కనీసం పోపు చెయ్యు విధానము ఇక్కడ అని పోస్ట్ మధ్యలో బ్లాక్ లెటర్సుతో వేస్తే బాగుంటుంది కదా. ఎల్లాగాయితేనేమి పట్టాను. భగుణ లో నూనె వెయ్యి, దానిలో అవి వెయ్యి ఇవి వెయ్యి, తిరగమాత మాడకుండా "సిం" లో పెట్టి చెయ్యి. చేస్తున్నాను గంటలు పడుతోంది. అది వేగుతుంటే నా మనస్సు లో బాధ పెల్లుబికి వస్తోంది. నేనే తప్పు చేశానేమో. ఇవ్వాళ పర్ఫెక్ట్ స్ప్రింగ్ డే అని ఉత్సాహంగా ఉంటే ఇల్లా అయింది. ఇంక ఆగలేను వినండి. బాధ పంచుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుందట.
ఉదయాన్నే బంగారు ఉదయకిరణాలు కిటికీ లోనుండి వస్తున్నాయి. కాలకృత్యాలు తీర్చుకుని డ్రెస్ చేసుకుని క్రింద సోఫా లో కూర్చున్నాను. క్రూరమయిన మూడు నెలల చికాగో చలికాలం తరువాత ఎంతో ఫ్రెష్ గ ఉంది. ఇవ్వాళ IHOP (International House of Pancakes) లో బ్రేక్ ఫస్ట్. వారెవ్వా ఆ పాన్ కేకులు ఎక్కడా దొరకవు. బొద్దుగా మెత్తగా సుతారంగా ఉడికీ ఉడక నట్లు, కాలీ కాలనట్లు, బంగారం రంగుతో, వావ్ తలుచుకుంటేనే నోరూరుతుంది. "హాష్ బ్రౌన్స్" ఇంక వాటిగురించి చెప్పక్కర్లేదు. పైన కొద్దిగా బ్రౌన్ మధ్య మల్లెపువ్వు లాంటి సుతి మెత్తని తరిగిన పొటాటో రెక్కలు. వాడి కాఫీ ఉంది చూడండి ఇక చెప్పలేము. ఒకప్పుడు కాఫీ అక్కడ తాగాలంటే భయమేసేది. ఇప్పుడు చాలా డిఫరెంట్. మైల్డ్ బోల్డ్ సున్నితమయిన ఫ్రాగ్రన్సు. ఒక ఫ్లాస్క్ నిండా కాఫీ టేబుల్ మీద పెడతారు. కావాల్సినన్ని సార్లు తాగచ్చు. నేనయితే రెండు కాకపోతే మూడు సార్లు తాగుతాను. కనీసం తినే ముందర తిన్న తరువాత.
నా సంతోషాన్ని నా దగ్గర వాళ్ళతో పంచుకోవటం నాకు చాలా ఇష్టం. అందుకనే పరంధామయ్య నీ ఆయన భార్యనీ రమ్మన్నాను. మా ఆవిడ ఎల్లాగూ వస్తుందనుకోండి. నిజం చెప్పొద్దూ అసలు పరంధామయ్య ని పిలవటానికి కారణం నాకూ మా ఆవిడకీ మధ్య బఫ్ఫర్ గ ఉంటాడని. ముఫై ఏళ్ళ కాపురం తరువాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడేవి ఏమి ఉంటాయి?
నా సంతోషాన్ని నా దగ్గర వాళ్ళతో పంచుకోవటం నాకు చాలా ఇష్టం. అందుకనే పరంధామయ్య నీ ఆయన భార్యనీ రమ్మన్నాను. మా ఆవిడ ఎల్లాగూ వస్తుందనుకోండి. నిజం చెప్పొద్దూ అసలు పరంధామయ్య ని పిలవటానికి కారణం నాకూ మా ఆవిడకీ మధ్య బఫ్ఫర్ గ ఉంటాడని. ముఫై ఏళ్ళ కాపురం తరువాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడేవి ఏమి ఉంటాయి?
అప్పుడే పది గంటలయింది. ఆవిడ గారు లేచారల్లె ఉంది పైన శబ్ద మవుతోంది. బ్రేక్ ఫస్ట్ టైము పదిన్నరకు అయిపోతుంది. మా రిటైర్మెంట్ అగ్రీమెంట్ ప్రకారము ఎవరూ ఎవరిని తొందర పెట్ట కూడదు. తొందరగా వస్తే వెళ్ళొచ్చు అని కొంచెం చిగురాశ ఉంటే పరంధామయ్య కి ఫోను చేసాను. ఎవ్వరూ పలకటల్లేదు. నా ఆశలన్నీనీరు కారి పోతున్నాయి. పొద్దుటి నుండీ ఎదురుచూస్తున్న బ్రేక్ ఫస్ట్ కి ఇంతే సంగతులు.
పదకొండున్నరకి పరంధామయ్య దిగాడు వాళ్ళ ఆవిడతోటి.
"బ్రేక్ ఫస్ట్ కి వస్తానన్నావు?"
"మాస్టారూ క్షమించండి లేటయింది"
"ఉదయం నుండీ ఎదురు చూస్తున్నాను పరం ధామా"
"పొద్దున్నే కూరలకు వెళ్ళాల్సొచ్చింది" "ఆ తరువాత ఆయిల్ ఛేంజి."
"ఇవ్వాళే వెళ్ళాలా నాయనా"
"లేదండి వెళ్ళక తప్పలేదు"
"కొంచెం లేవటం కూడా లేటుగా లేచాము"
"నిన్ననీకు రెండు సార్లు ఫోను చేసాను IHOP కి వెళ్దాము పొద్దున్నే రమ్మని"
" ఫరవాలేదండీ ఎప్పుడయినా వెళ్ళచ్చుట, నిన్నమేము పిలిచి కనుక్కున్నాము"
"ట్వంటీ ఫొర్ అవర్స్ బ్రేక్ ఫస్ట్ అక్కడ."
"బ్రేక్ ఫస్ట్ కుక్, లంచ్ కుక్, డిన్నర్ కుక్ వేరు వేరు" అన్నాను నేను.
"కుక్ లందరూ ఒకటే. అయినా మీరు తినే pancakes కి ఏ కుక్ అయితే నేం?" మా ఆవిడ అందుకుంది.
ఇంకా నేను ఆగ లేక పోయాను. "యాభై ఏళ్ళకు పెళ్లి చేసుకుని ఇరవై ఏళ్ళ బాలాకుమారి గ ఉండాలంటే కష్టం"
ఎవ్వరికీ అర్ధం కాలా. నేను మాట్లాడేదాన్ని co-relations అంటారు. అందరికీ అర్ధం కావు. విశదీకరించా.
"పెళ్లి ఏ వయసులోనయినా చేసుకోవచ్చు (అంటే అది ట్వంటీ ఫొర్ అవర్స్ బ్రేక్ ఫస్ట్ లాంటిది). యాభై ఏళ్లకు (అంటే లంచ్ టైము లో) పెళ్లి చేసుకుని ఇరవ్వై ఏళ్ళ వాళ్ళు లాగా ( అంటే బ్రేక్ ఫస్ట్ లాగా) ఆనందించాలంటే కష్టం. బ్రేక్ ఫస్ట్ pancakes వేరు లంచ్ టైం pancakes వేరు."
అంతా నిశ్శబ్దం. నేను అన్నదానికి రియాక్షన్ ఏమీ కనపడటల్లేదు.
ఇంకా ఏ విధంగా అర్ధమయ్యేటట్లు చెప్పాలో తెలియటల్లా.
"ఒకపూట వంట తప్పుతుందని ఆమ్మ గారూ నేనూ లంచ్ టైముకి వెల్దామను కున్నాము. ఏ కుక్ అయితే ఏమి, తినేది Pancakes యే కదా అని ఆమ్మ గారు అన్నారు" తనతప్పేమి లేదని పందామయ్య భార్య అసలు విషయం బయట పెట్టింది.
"మీరేవన్నా చెప్పండి కుక్కులు అందరూ ఒకటే" తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటే ఇదేనేమో.
తెల్లబోయాను. నాకు కోపము ఆగటల్లేదు. తను ఒకటి తలిస్తే దైవము ఒకటి తలుస్తుందిట. కాదు తను ఒకటి తలుస్తే పెళ్ళాలు ఇంకొకటి తలుస్తారుట. ఆడవాళ్ళ గూడుపుఠాణీ తెలిసి పోయింది. ఏదో అనాలని అనిపిస్తోంది.
నా మనస్సు గట్టిగా నోరుమూసుకోరా అని చెప్తూనే ఉంది. ఆగలేక నోరు విప్పాను.
"బార్బరులు అందరూ ఒకటే, రోజూ గుండు చేసే బార్బర్ దగ్గరకి క్రాఫ్ కోసం వెళ్తామా? " అని నాలిక కరుచుకున్నాను.
"ఏ సమయానికి ఏమి జరుగునో ఎవరూ హించెదరూ" పాట మనస్సులో మెదుల్తోంది.
"బార్బరులు అందరూ ఒకటే, రోజూ గుండు చేసే బార్బర్ దగ్గరకి క్రాఫ్ కోసం వెళ్తామా? " అని నాలిక కరుచుకున్నాను.
"ఏ సమయానికి ఏమి జరుగునో ఎవరూ హించెదరూ" పాట మనస్సులో మెదుల్తోంది.
అంతే నిశ్శబ్దం. తలుపుతీసిన శబ్దం అయ్యింది. మొదట మా ఆవిడ. తరువాత పరంధామయ్య భార్య ఆ తరువాత ఆవిడ కొంగు పుచ్చుకుని పరంధామయ్య నిష్క్రమించారు. పరంధామయ్య వెళ్తూ నా వంక చూసి బేల మొహం పెట్టాడు. కారు స్టార్ట్ చేసిన చప్పుడయింది. తరువాత కారు వెళ్ళిపోయింది. కఠోరమయిన నిశ్శబ్దం.
ఆకలవుతోంది. మనస్సంతా కటిక చీకటిగా ఉంది. నాకు పెద్దగా అరిచి బల్ల గుద్దాలని ఉంది. కానీ ఫ్యూచర్ భయ పెట్టింది. ఇంక కూర్చుని లాభంలేదు. లేచాను. భయాలతోటి బాధలతోటీ ఫ్యూచర్ ని ఆపలేము. వారం రోజులకు సరిపడా వంట చెయ్యటం మొదలెట్టాలి.
*Pancakes ఒక రకమయిన అట్లు. సామాన్యంగా పోద్దునపూట తింటారు.
*Hash Browns బంగాళా దుంపల ని చాలా సన్నగా తరిగి (Shredding) చేసి ఉడకపెట్టి పెనం మీద వేయిస్తారు.
By e-mail
ReplyDeleteYou have expressed one stage of life !!! in your story.
Keep writing.
Regards suseela
$Rao S Lakkaraju గారు
ReplyDeleteటపా ఆద్యంతమూ భలే చమత్కారంగా రాసారు. మీ చికాగో అంతా చిరునవ్వులజల్లులే ఆయితే ;)
#మనము అయిపొయింది అనుకున్నప్పుడే అన్నీఎదురు తిరుగుతాయి.
అవునవును! :)
#చేస్తున్నాను గంటలు పడుతోంది. అది వేగుతుంటే నా మనస్సు లో బాధ పెల్లుబికి వస్తోంది. నేనే తప్పు చేశానేమో.
బాధ లేక భయమా పెల్లుబికేది ;)
#మా ఆవిడ ఎల్లాగూ వస్తుందనుకోండి.
:))
#కారణం నాకూ మా ఆవిడకీ మధ్య బఫ్ఫర్ గ ఉంటాడని. ముఫై ఏళ్ళ కాపురం తరువాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడేవి ఏమి ఉంటాయి?
మీరు బఫ్ఫర్ అని ఆగారు ;).. నాకు తెలిసి బఫ్ఫూనే(నేను ఒక్కడిగా) వేరే కుటుంబంతో వెళితే!... నా స్నేహితుడి కుటు౦బంతో నాకు బాగా అనుభవం :).. ఇద్దరూ చక్కగా అరుచుకునేవారు.. నేను మధ్యలో పేద్ద ఆరిందావాడి లాగా సర్ది చెప్పడానికి ప్రయత్నించేవాడిని.. చివరకు వారూ వారూ ఒకటి.. మధ్యలో నేను బఫూన్ ;)
# ఎదురు చూస్తున్నాను పరం ధామా
పేరు మధ్యలో జాగా కావాలని పెట్టారా? అంటే మన ధామం కాదని :))
#"బ్రేక్ ఫస్ట్ కుక్, లంచ్ కుక్, డిన్నర్ కుక్ వేరు వేరు" అన్నాను నేను..... అయినా మీరు తినే pancakes కి ఏ కుక్ అయితే నేం?..
#"యాభై ఏళ్ళకు పెళ్లి చేసుకుని ఇరవై ఏళ్ళ బాలాకుమారి గ ఉండాలంటే కష్టం"
#యాభై ఏళ్లకు (అంటే లంచ్ టైము లో) పెళ్లి చేసుకుని ఇరవ్వై ఏళ్ళ వాళ్ళు లాగా ( అంటే బ్రేక్ ఫస్ట్ లాగా) ఆనందించాలంటే కష్టం. బ్రేక్ ఫస్ట్ pancakes వేరు లంచ్ టైం pancakes వేరు."
;-) భలే చెప్పారు..మరి రాత్రి భోజనం వందేళ్ళా.. ఇక ఆనందించడానికి ఏమీ లేదు? :)
#తను ఒకటి తలుస్తే పెళ్ళాలు ఇంకొకటి తలుస్తారుట.
'పెళ్ళాలు' -- ఆహా.. ఎంతమంది {!మనలో మాట!}
#"బార్బరులు అందరూ ఒకటే, రోజూ గుండు చేసే బార్బర్ దగ్గరకి క్రాఫ్ కోసం వెళ్తామా? " (రోజూ=>అలా అని )
ఇది కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక..
#పరంధామయ్య వెళ్తూ నా వంక చూసి బేల మొహం పెట్టాడు
నే కూడా.. పాపం మీ పరిస్తితి
#భయాలతోటి బాధలతోటీ ఫ్యూచర్ ని ఆపలేము. వారం రోజులకు సరిపడా వంట చెయ్యటం మొదలెట్టాలి.
:)) ఇప్పుడు పరిస్తితి సరియే కదా :)
కుటుంబంలో జరిగే చిన్నచిన్న విషయాలని చాలా సరదాగా రాసి పంచుకున్నందుకు ధన్యవాదాలు .
Ha Ha Ha.
ReplyDeleteVery well written.
"ముఫై ఏళ్ళ కాపురం తరువాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడేవి ఏమి ఉంటాయి? " :-)))))
BTW, IHOP's omlettes are my favorites :-)
సున్నితమైన పదునైన హాస్యం! ఇలాటి టపాలు పాయసంలొ జీడిపప్పులా అప్పుడప్పుడూ తగులుతూ ఉండాలి.చక్కని అందమైన స్కెచ్! నాకెవరో రచయిత మెదుతులున్నారు మనసులో ఈ శైలి చదువుతుంటే......గుర్తొచ్చాక చెప్తాను.
ReplyDeleteహ్మ్.. దీని మీద వ్యాఖ్యానించడం మరిచా!
ReplyDelete#ముఫై ఏళ్ళ కాపురం తరువాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడేవి ఏమి ఉంటాయి?
మీరు మహా చిలిపి సుమీ! ;)
మీ పరంధామయ్యతో బ్రేక్ ఫస్ట్ ............. కధలో శైలి చాలా బాగుందండి. ఇంకా, సూర్యరశ్మి వల్ల ఉపయోగాలు వివరంగా రాశారండి. ధన్యవాదాలు.
ReplyDeleteమీరు కధా రచయితై ఉండీ నా పిచ్చి రాతలకు ప్రసంసలా?
ReplyDelete@విశేఖర్
ReplyDeleteఅయ్యో రామ. ఉబుసుపోకకి రాస్తూ ఉంటాను. నేను వ్రాసినవి నేనే చదువుకుని మురిసిపోటానికి.
ఇంకా ధన్యవాదాలు మొదలెడతా పండగకి వచ్చేవాళ్ళు అయిపోయారల్లె ఉంది.
ReplyDeleteసియాటిల్ ప్రసాద్ గారూ, శాండియాగో సుశీల గారూ, హైదరాబాద్ anrd గారూ, విశేఖర్ గారూ మీ వ్యాఖ్యలకి ధన్యవాదములు.
@సుజాత గారూ మీ వ్యాఖ్యకి ధన్యవాదములు. మీకు గుర్తుకు వచ్చినప్పుడు ఆ రచయిత పేరు చెప్పండి. నాకూ వారి రచనలు చదవాలనిఉంది. నరసరావుపేట తలుచుకుంటే కొంచెం ఇమ్మోషనల్ అయిపోతాను. జీవితంలో ప్రిన్సిపాల్ రంగనాయకులు,ప్రొఫెసర్ రంగధామరావు(ఆంధ్రా యునివేర్సిటి)గార్ల లాగా ఉండాలని అనుకున్నాను. Never came to close except. రంగనాయకుల గారి అల్లుడు కెనడా లో నా రూమ్మేట్. Power Systems Ph.D చేసే వాడనుకుంటాను.
ReplyDeleteSSN College PVR గారు (chemistry), సుబ్రహ్మణ్యం గారు(Physics)
ఇంకా గుర్తు ఉన్నారు. Best Wishes to you. Thanks again.
హహహ బావుందండీ....పాపం మీరు పాన్ కేక్ తినలేకపోయారు కదా, పర్లేదులెండి మళ్ళీవారం ప్రయత్నిచండి. ఇంతకీ వంటేమి చేసారు? మాకు ఈ కథ చెప్తూ మళ్ళీ పోపు మాడ్చేసారా లేక బాగానే వేగాయా? బీన్స్ కూర, పప్పుచారు, మిరియాల చారు ల రూపురేఖలు, రుచి వగైరాలు ఎలా ఉన్నాయి? :)))
ReplyDelete@ న్యూ యార్క్ KumarN గారూ నా పోస్ట్ చదివిన తరువాత if you feel good that is what I want. నేననుకున్నది ఫలించినట్లే.
ReplyDeleteమైఖేల్ డెల్ గారికి బోలెడన్ని IHOP shares ఉన్నాయి.We are in the company of Billionaires. We can expect good food always there.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
@ ఢిల్లీ ఆ.సౌమ్య గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. మనం చేసుకున్నవి మనకి నచ్చుతాయి (రహస్యం ఇతరులకు నచ్చక పోయినా).
ReplyDeleteకోపంతో కొట్టుకుంటాము గుద్దుకుంటాము విడివిడిగా వంటలు చేసుకుంటాము. రెండవ రోజు ఒకరికి తెలియకుండా ఒకరం మిగతా వారి వంటలు రుచి చూసు కుంటాము. మూడవరోజు ఒకరి ముద్దలు ఒకరు తింటాము. నాల్గవ రోజు నుండీ కలిసి వండుకుంటాము. ఈ సైకిల్ అల్లా రిపీట్ అవుతూ ఉంటుంది.
పీస్ ప్లాన్ లో pancakes ఇంట్లోచేసి పెడితే తిన్నా బాగున్నాయని అన్నా.(మనలోమాట IHOP లాగా లేవు.) థాంక్స్ ఎగైన్ ఆ.సౌమ్య గారూ.
"కోపంతో కొట్టుకుంటాము గుద్దుకుంటాము విడివిడిగా వంటలు చేసుకుంటాము. రెండవ రోజు ఒకరికి తెలియకుండా ఒకరం మిగతా వారి వంటలు రుచి చూసు కుంటాము. మూడవరోజు ఒకరి ముద్దలు ఒకరు తింటాము. నాల్గవ రోజు నుండీ కలిసి వండుకుంటాము. ఈ సైకిల్ అల్లా రిపీట్ అవుతూ ఉంటుంది."............
ReplyDeleteబలే చెప్పారండీ,అదే అన్యోన్య దాంపత్యం అవుతుంది కదా..నాకెందుకో శ్రీ రమణ గారు రాసిన మిధునం కథ గుర్తొచ్చింది మీ మాటలు వింటుంటే!
రావుగారూ! భలే ఉందండీ,మీ కథనం....ఎలా మిస్సయ్యానో ఇన్నాళ్ళూ...ః)
ReplyDeleteఇంతకీ పోపు కుదిరిందా బాగానే....ః)..
అయితే మీ సూచనల ప్రకారం కాస్త మార్చాలి నా రైటింగు స్టైలు....
హ హ చాలా బాగుందండీ.. నేను కూడా IHOP బ్రేక్ ఫాస్ట్ కి పెద్ద పంకాని :)
ReplyDelete$Rao S Lakkaraju గారు
ReplyDelete#..విడివిడిగా వంటలు..రెండవ రోజు ..మిగతా వారి వంటలు రుచి..ఒకరి ముద్దలు..కలిసి వండుకుంటాము..సైకిల్ అల్లా రిపీట్..
హబ్బ.. ఏం చెప్పారండీ...దాగుడుమూతల దాంపత్యం గురించి.
ఈ టపా ఎన్నిసార్లు చదివినా మొదటిసారీ చదివినట్లే ఉంది. అద్భుతం... మీరు పంచినా హాస్యపు చమక్కులు.సునిశిత౦..సున్నితం. చాలా బాగా రాసారు. ఇదే దిశలో మరిన్ని టపాలు మొలకెత్తాలని ఆశిస్తున్నా :)
కౌటిల్య గారి "పోపు" పెట్టే విధానము తో కూడా పోపు మాడితే నేను "పాక" అస్త్ర సన్యాసము చేద్దామను కుంటున్నాను. ఆ విధంగా జరగదు జరగబోదు. Welcome కౌటిల్య గారూ.
ReplyDeleteThanks for everything you are doing Dr. Koutilya. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
వేణూ శ్రీకాంత్ గారూ Welcome. నాకు ఇంకొక IHOP friend దొరికారోచ్.
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
ఆ.సౌమ్య గారూ నలభై ఏళ్ళ క్రిందట తెలిసిన వాళ్ళందర్నీ వదిలిపెట్టి, పదివేల మైళ్ళు ప్రయాణం చేసి, న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్ లో బిక్కు బిక్కు మంటూ ఒక చేత్తో పెట్టె రెండో చేత్తో పచ్చళ్ళ సంచీ తో నా కోసం ఎదురు చూస్తూ నుంచున్న వాళ్ళని, తిట్టుకున్నా కొట్టుకున్నా వాదుల్తామా?.
ReplyDeleteఅన్యోన్య దాంపత్యం అంటే మాకు తెలియదు కానీ "బ్రతక నేర్వటం" అంటే మాకు బాగా తెలుసు.
"నాకు ఇంకొక IHOP friend దొరికారోచ్"
ReplyDeleteరావు గారూ, మీ ఈ డిస్క్రిమినేషన్ ని సహి౦చనూ, సహి౦చలేనూ. నేను వేణు కన్నా ము౦దే ఐహాప్ లో ఆమ్లేట్ ల౦టే నాలిక ఎగిరిపడుతు౦దని నేను చెప్పినా కూడా, నన్ను ఫ్రె౦డుని చేసుకోకు౦డా తనని చేసుకు౦టారా...చూస్తున్నా, చూస్తున్నా మీ దురాగతాలని, దౌర్జన్యాన్నీ..ఇ౦కెన్నో రొజులు సాగవు మీ అన్యాయాలు..చికాగో కొస్తా, మీ వాడ కొస్తా, మీ ఇ౦టి ము౦దు కొస్తా, ఎర్ర టె౦ట్ వేస్తా. ఎర్ర తిలక౦ దిద్దుకొని, ఎర్ర జె౦డా పట్టుకొని, సమ సమాజ నిర్మాణ కార్యక్రమ౦లో భాగ౦గా మీ మీద డిస్క్రిమినేషన్ కేసేస్తా ;-)
@రాజేష్ జీ గారూ ఎల్లా సమాధానం వ్రాయాలో తేల్చుకోలేక నాలుగు రోజులు ఆగాను. నేను వ్రాసే ఒకటి రెండు కధలు నా ఆనందం కోసం వ్రాసుకుంటాను. సుతి మెత్తగా వాక్యాలు, పదాల placement సృష్టిస్తాను. వాటి మధ్య స్పేస్ లు కూడా. నేను సృష్టించినది చదువుకుని మురిసి పోటానికి. అవును నేను చాలా స్వార్ధపరుడుని.
ReplyDeleteఒక్కొక్క వాక్యం చదివి వాటిల్లో నేను గుప్తంగా నాకోసం నా ఆనందం కోసం దాచుకున్న భావాల్ని ఆస్వాదించి ఆనందిస్తూ వ్యాఖ్యానిస్తే నేనేమి చెప్పేది.
రాజేష్ జి గారూ థాంక్స్.
కుమార్ గారూ అయ్యో రామ. దానిలో "ఇంకొక" ఉన్నది గమనించండి. నే నన్నది ఇది:
ReplyDelete"నాకు ఇంకొక IHOP friend దొరికారోచ్"
మా ఇంటి పక్కే IHOP. You are welcome anytime. నా దగ్గర buy one get one కూపన్ కూడా ఉంది.
$Rao S Lakkaraju గారు
ReplyDeleteఅయ్యో!.. నా వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయా?..
మీరు స్వార్థమని మంచిమనసుతో చెప్పినా పర్లేదు.. నలుగుఉరికీ పనికొచ్చి, ఆనందాన్ని పంచే స్వార్థ౦ మంచిదే కదండీ. :)
మరొక విన్నప౦: మీరు నన్ను "రాజేష్" అని మాత్రమే సంభోదించగలరు, దయచేసి :)
ఈ IHOP గురించి ఇప్పుడే వారి సైట్లో చూస్తున్నా..హ్మ్.. చూస్తుంటే నోరూరుతున్నాయి.. శాకాహారం కూడా దొరుకుతాయా? మీ ఊరు వస్తే వెళ్ళడానికి ప్రయత్నిస్తా :)
ReplyDelete#..చికాగో కొస్తా, మీ వాడ కొస్తా, మీ ఇ౦టి ము౦దు కొస్తా, ఎర్ర టె౦ట్ వేస్తా. ఎర్ర తిలక౦ దిద్దుకొని, ఎర్ర జె౦డా పట్టుకొని, సమ సమాజ నిర్మాణ ..
హహహ.. కుమార్ గారు.. నేనూ మీ బాటలోనే..!
"నలభై ఏళ్ళ క్రిందట తెలిసిన వాళ్ళందర్నీ వదిలిపెట్టి, పదివేల మైళ్ళు ప్రయాణం చేసి, న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్ లో బిక్కు బిక్కు మంటూ ఒక చేత్తో పెట్టె రెండో చేత్తో పచ్చళ్ళ సంచీ తో నా కోసం ఎదురు చూస్తూ నుంచున్న వాళ్ళని, తిట్టుకున్నా కొట్టుకున్నా వాదుల్తామా?."....
ReplyDeletemy monitor has become a bit blurr while reading these sentences.....మనసులోతుల్ని స్పృశించే వాక్యాలు...
క్రిందటి నెల మార్చ్ లో సియాటిల్ లేక్ ఫ్రంట్ సీఫుడ్ రేస్తోరంట్ లో డిన్నర్ జాకెట్ వేసుకుని ఆకులు ఏరుకుని తిన్న అనుభవంతో చెబుతున్నాను రాజేష్ ఏమీ భయంలేదు ఇక్కడికిరా గోంగూర ముద్ద హాష్ బ్రౌన్స్ లో కలుపుకుని బ్రెడ్ అడ్డంపెట్టుకుని IHOP లో బ్రేక్ ఫాస్ట్ చేద్దాము.
ReplyDeleteరావు గారూ ! చక్కని సునిసిత మైన హాస్య కధని అందించారు. " మనమొకటి తలిస్తే భార్యలు ఇంకొకటి తలుస్తారు. " ఇది మాత్రం ఖచ్చితమైన నిజం. ఇక ముఫై ఏళ్ళ తర్వాత " కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడు కోవడం గాదు ఖచ్చితం గా పోట్లాట వస్తుంది. " అవునూ ! మరింతకీ ఇప్పుడు అన్ని దసలు దాటి ఒకరి కొకరు ముద్దలు తినిపిం చుకుంటూ , రాజీ పడిన దశలో ఉన్నారా ? " ఐతే ఇంకేం ? ఒక మంచి హనీమూన్ కధని మా కందించండి .
ReplyDelete@రాజేశ్వరి గారూ మీరు చదివి ఆనందించి నందుకు సంతోషం. మళ్ళా ఎప్పుడో ఒక కిక్ వస్తే ఇంకొక కధ వ్రాస్తాను. ఆ కిక్ ఎవరిస్తారో ఎల్లా ఇస్తారో చెప్పలేను. కానీ అకస్మాతుగా అనుకోకుండా వస్తుందని మాత్రం తెలుసు.
ReplyDeleteమీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
/ముఫై ఏళ్ళ కాపురం తరువాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడేవి ఏమి ఉంటాయి?/
ReplyDeleteఎందుకుండవు రావు గారు?! ఎందుకుండవు? అపుడేగా తీరిగ్గా 'కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు' అని పాడుకుంటూ కంటిపొరలు ఏమాత్రమొచ్చాయో చూసుకోవచ్చుగా! :P :))
ఇంతకూ నా అభిమాన వలలుడుగారి మిరియాల చారు అదిరిందా లేదా? చెప్పనే లేదు.
బాగా రాశారు సార్, ఇవాళ నా కంట పడింది. :)
@ snkr గారూ
ReplyDelete/"తీరిగ్గా 'కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు' అని పాడుకుంటూ "/
ప్రస్తుతం సోక్రటీస్ ని ఫిలాసఫర్ గా చేసిన వీక్షనాలలాంటి వి ఉన్నాయి. విప్రనారాయణకి తగిలిన వీక్షణాలు లాంటి వాటి కోసం ఎదురుచూస్తున్నా. అప్పుడు కళ్ళల్లో కళ్ళెట్టి చూసి కమ్మని పాటలు పాడతా.
మిరియాల చారుతో నా జలుబంతా ఆవిరయింది అంత బాగుంది. క్యుడోస్ టు కౌటిల్య.
వచ్చినందుకు చూచినందుకు ఆనందించినందుకూ వ్యాఖ్య పెట్టినందుకూ థాంక్స్.
మీకు నా పప్పు చారు నచ్చినందుకు , మీ పోస్ట్ ను దాని తో మొదలుపెట్టినందుకు చాలా థాంక్స్ అండి .
ReplyDelete/ముఫై ఏళ్ళ కాపురం తరువాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడేవి ఏమి ఉంటాయి?/
ReplyDeleteappudu kallallo kaadu, kallajollu kallajollato maatlaadaali. Chaala baagaa raasaaru. Simple gaane undi kaani effective and nijangaa nijaalu raasaaru. Chaalaa baagundi.
Taanokati taliste pellalokati talichaarani nenu koodaa appudappudoo anukuntoo untaanu sumandi, nijam. Ae dantlo ainaa chivari maata aadaallade sumandi, aa devudu kooda emi cheyyaledu.
@Salahuddin గారు
ReplyDeleteAe dantlo ainaa chivari maata aadaallade sumandi,
--------
మగవాళ్ళు చేసేదల్లా డబ్బు సంపాయించి ఇవ్వటమే కదా. సంసారం నడిపేది వాళ్ళే కదా. అందుకనే వారి మాట చెల్లుతుంది. మగవారికి కావాల్సినవి ఆడవారి నోటినుండి చెప్పించుకునే తెలివితేటలుంటే సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.