Tuesday, April 26, 2011

56 ఓ బుల్లి కథ 44 ---- ఎందుకు ప్రపంచంలో మేధావులకి మన వేదాలు గొప్పవి ?

ఈ వీడియో చూడండి :




మన పూర్వికులను మెచ్చుకోండి,  మనకీ నాగరికత ఇచ్చినందుకు. 
మనని మనం నిందించు కుందాము,  వాటిని ఉపయోగించుకోలేనందుకు.
మన నాగరికత  కూడా మనకి తెలియనందుకు బాధపడదాం. 
మనకే నాగరికతా లేదు అని చెప్పే వాళ్ళని చూసి చింతిద్దాము. 
సంవత్సరాల బానిసత్వం మన తెలివి తేటల్ని మొద్దు చేసింది.
ఏమిచేస్తే అది మళ్ళా ప్రజ్వరిల్లుతుందో ఆలోచించండి. 
మళ్ళా ఆ జ్యోతిని అందరం కలసి వెలిగిద్దాము.

9 comments:

  1. చక్కగా చెప్పారండి. చాలా మంచి ప్రయత్నం.

    ReplyDelete
  2. మొన్ననే ఈ టపా చూసా, వ్యాఖ్యానిద్దామనుకున్నానా.. లాప్టాప్ మారాం..!

    ఈ వీడియో నాలుగు భాగాలు చూసాను.. నాకు చాలా తెలీని విషయాలు ఆ విదేశీపండితుడు శోధించి మరీ చెప్పారు.

    #సంవత్సరాల బానిసత్వం మన తెలివి తేటల్ని మొద్దు చేసింది
    హ్మ్..అదే అదే..భావదాస్యం..దారిద్ర్యం అదే కదూ!

    #మనని మనం నిందించు కుందాము, వాటిని ఉపయోగించుకోలేనందుకు.
    నిజమే.. నా చేతకానితనానికి!

    ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. ఇంకా ఎక్కడన్నా దొరికితే మన సంస్కృతి మీద పోస్ట్ లు వెయ్యాలని వుంది. మీ స్పందనకి ధన్యవాదాలు anrd గారూ.

    ReplyDelete
  4. చక్కని విషయాలు చెప్పారు. అసలు మన పూర్వీకుల నుంచి మనం తెలుసు కొ వలసిందీ నేర్చు కోవలసిం దీ బోలెడు ఉంది . వ్యవ సాయం దగ్గర్నుంచీ విమానాల వరకు ,ఔషధాల నుంచీ ,అణువాయుదాల వరకు ,మన పురాణాల నుంచే కదా గ్రహించింది ? మీకు కావాలంటే " పురాణాల్లో సైన్స్ " అందులో చాలా దొరుకుతాయి పరిశీలించ గలరు .. " బుల్లి కధ " అంటూనే పెద్ద పెద్ద మంచి మంచి సందేశాలు ఇస్తున్నందుకు ధన్య వాదములు.

    ReplyDelete
  5. ఈ వీడియో నాలుగు భాగాలు చూసాను.. నాకు చాలా తెలీని విషయాలు ఆ విదేశీపండితుడు శోధించి మరీ చెప్పారు.
    ----------
    రాజేష్ క్లుప్తంగా వాటిల్లో విశేషాలు ఒక పోస్ట్ లో వ్రాయకూదదూ. మనం గొప్ప పనులు చేయలేక పోయినా మన పూర్వులు చేసిన పనులు విజ్ఞుల మన్ననలు పొందాయని గర్వం తో తలెత్తుకు తిరగవచ్చు. మన పూర్వికులందరూ వెధవలుషా అనుకుని తలవంచుకు తిరిగేవాళ్ళ కన్నా నయం కదా.
    మీ వ్యాఖ్యకు ధన్య వాదములు.

    ReplyDelete
  6. @రాజేశ్వరి గారూ
    ఏమయినా కొత్త సంగతులు పరిశోధించాలంటే మొదట దాన్ని గురించి థింక్ చెయ్యాలి. తరువాత దాన్ని చేసి చూపెట్టాలి. ఈ రెండు స్టేజిలూ కొత్త కొత్తవి కనుక్కునేటప్పుడు ఎప్పుడూ ఉంటాయి. మన పూర్వికులు కొన్నిటిని రెండు స్టేజి లూ దాటించారు కొన్ని మొదటి స్టేజి లోనే ఆగిపోయాయి. కానీ వాళ్ళు గ్రేట్ థింకర్స్ అనేది వాస్తవము. మన పూర్వులు వ్రాసిన పుస్తకాలు చదువుకుని ఎంతమంది థింకింగ్ స్టేజి లో ఉన్నవాటిని యాక్షన్ స్టేజి లోకి మార్చారో తెలియదు. మనవాళ్ళు ఉట్టి వేదవాయిలోయి ఊహాగానాలు చేసి పుస్తకాలు వ్రాసారు అనుకునే వాళ్ళు ఉన్నంతవరకూ మన పూర్వ వైభవం బయటికి రాదు.
    మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  7. $Rao S Lakkaraju గారు

    #రాజేష్ క్లుప్తంగా వాటిల్లో విశేషాలు ఒక పోస్ట్ లో వ్రాయకూదదూ.
    :)) ఖచ్చితంగా అనువదిస్తా!

    #మన పూర్వికులందరూ వెధవలుషా ..
    :) అలా అనడంతో ఆగలేదండి..తమ మేతావవితనాన్ని చూపించడం కోసం అ(పూర్వీకుల)రచనల దేహంమీద రంధ్రాన్వేషణ చేస్తూ ఎక్కడ ఏది దొరికినా పీక్కు తినడానికి సిద్దం అయ్యారు రాబందులెక్కన.

    #మన పూర్వికులు కొన్నిటిని రెండు స్టేజి లూ దాటించారు కొన్ని మొదటి స్టేజి లోనే ఆగిపోయాయి. కానీ వాళ్ళు గ్రేట్ థింకర్స్ అనేది వాస్తవము.
    #..ఎంతమంది థింకింగ్ స్టేజి లో ఉన్నవాటిని యాక్షన్ స్టేజి లోకి..

    బాగా చెప్పారు. అది వాస్తవం.

    ReplyDelete
  8. శ్రీ లక్కరాజు గారికి,నమస్కారములు.

    మన వేదాలు; మన నాట్య శాస్త్రం; మతిమరుపు - ఈ వ్యాసాల్లో ఎంతో విలువైన విషయాలను అందచేశారు. ధన్యవాదాలు. ఇప్పటికైనా, మన భారతీయులు మన వేద సంపద యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, ఉపయోగపెట్టుకుంటే, ఎంతో మేలు కలుగుతుంది. హైద్రాబాద్ లోని Doctor Avadhaanlu , retired డి.Director , NIMS, `వేద విజ్నానంపై పరిశోధనలు చేస్తున్నారు.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  9. @మాధవరావు గారికి
    మీ కాశీ ప్రయాణం చక్కగా అయిన్దనుకుంటాను. మీరు దాన్ని గురించి ఒక పోస్ట్ వ్రాయండి. అవధానులు గారిని వీలయితే కలుద్దాము.
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete