ముందు మాట: మనము మామూలుగా కొన్ని సంగతులు మరిచి పోతూ ఉంటాము. తాళం చెవులు కోసం వెతకటం, టీవీ రిమోట్ల కోసం వెతకటం, బర్తు డేలు మర్చెపోవటం మొదలయినవన్నీ మామూలే కానీ భార్యా, భర్త, పిల్లల పేర్లు మర్చెపోవటం, తన పేరే తాను మర్చెపోవటం జరిగితే కొంచెం గాభరా పడవలసిన అవసరం ఉంది. వృద్ధాప్యంలో ఇవి మామూలే అని అంటూ ఉంటారు కానీ అది నిజమా? Brain Longevity అని ఒక డాక్టరు గారు వ్రాసిన పుస్తకం నుండి సంక్షిప్తంగా కొన్ని నిజాలు వాటిని ఎదుర్కోటానికి కొన్ని పద్ధతులూ చూద్దాము. Since 1993, he has been the President and Medical Director of the Alzheimer’s Research and Prevention Foundation in Tucson, Arizona, USA.
క్లుప్తంగా బ్రెయిన్ మీద: మన శరీరం లో ఉన్న కణాలు, ఎర్ర కణాలు, తెల్ల కణాలు మొదలయినవి, లాగ మన బ్రెయిన్ లో కణాలు ఉంటాయి. వీటిని న్యురాన్స్ అంటారు. మనం పుట్టేటప్పుడే మనకు కావాల్సిన న్యురాన్స్ అన్నీ
తయారు చేయబడి మనకి పనిచేసి పెట్టడానికి రెడీ గా ఉంటాయి. వీటి ముఖ్యమైన పనల్లా మన పంచేంద్రియాలనుండి వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి దాచి పెట్టటం, కావాల్సి వచ్చినప్పుడు తిరిగి ఇవ్వటం. ఈ పనిచెయ్యటానికి neurotransmitters ద్వారా వాటితో అవి కూడ బలుక్కుని మాట్లాడుకుంటూ ఉంటాయి. శరీరం లో అన్ని కణాలు లాగానే ఇవి కూడా రక్త ప్రవాహం లోని గ్లూకోస్ తీసుకుని, దహనం చేసి, శక్తి (ATP) సంపాదించి బ్రతుకుతాయి. కాకపోతే వీటికీ మిగతా కణాలకి తేడా ఏమిటంటే మనకు 30 ఏళ్ళు వచ్చిన దగ్గరనుండీ ఇవి చనిపోతూ ఉంటాయి. వచ్చిన గొడవ ఏమిటంటే ఇవి చనిపోతే మళ్ళా సామాన్యంగా అన్నీ రిప్లేస్ చెయ్యబడవు. అందుకని బతికున్న కణాలే వాటిల్లో అవి మాట్లాడుకుని కొత్త స్నేహితులని కలుపుకుని చనిపోయిన వాటి పనులు చేస్తాయి. దీనినే Brain Plasticity అంటారు. అవయవాలు స్వాధీనము తప్పినవారు ఫిజికల్ థీరపీ ద్వారా అవయవాలు స్వాధీనం లోకి తెచ్చుకుంటారు దీనిమూలాన అన్నమాట.
జ్ఞాపక శక్తి (మెమరీ): పుట్టంగానే బేబీ కి దాదాపు 100 బిల్లియన్ న్యురాన్సు ఉంటాయి. పుట్టిన రోజునుంచీ బ్రతకటానికి తనకి కావలసిన స్కిల్ల్స్ నేర్చుకోవటం మొదలుపెడుతుంది. మెదడు లోని న్యురాన్సు చిన్న చిన్న గ్రూపులుగా మారి కొత్తగా తెలుసుకున్న సంగతులని గుర్తుపెట్టుకుంటాయి. రోజూ వాడే మోటార్ స్కిల్స్ ని (తినటం, నడవటం, సైకిల్ తొక్కటం వగైరా) ఒక చోట జాగర్తగా దాచి పెడుతుంది. అందుకనే మనము వాటిని మర్చిపోము. అల్లాగే చిన్నప్పుడు బట్టీ పట్టిన ఎక్కాలు. రోజూ బట్టీయము చేశాము కాబట్టి మనస్సుకి అవి చాలా ముఖ్యమయినవి అని గుర్తించి జాగ్రత్తగా దాచి పెడుతుంది. పదమూడు ఏళ్ళ దాకా కొత్తసంగతులు త్వరగా గ్రాస్ప్ చేస్తుంది. ఇంకొక గుణమేమిటంటే మనకి బాధకలిగించేవి మనస్తాపము కలిగించేవి జీవితాంతం గట్టిగా గుర్తు పెట్టుకుంటుంది. బహుశ అటువంటివి మనము మళ్ళా చెయ్యకుండా నేమో. మనము వేటిని గుర్తుపెట్టుకోవాలో వేటిని మర్చెపోవాలో మనస్సుకి చెప్పి చేయించలేము. బహుశ హిందూ మతం లో చెప్పే ఆత్మ అంటే ఇదే నేమో.
మనమెందుకు మర్చెపోతాము: మెమరీ పనిచేయటంలో కొన్ని పద్దతులు ఉన్నాయి. మనకి పనికొస్తుందన్న సమాచారమే అది దాచిపెట్టుకుంటుంది. ఒకవేళ పనికొస్తుందని దాచినా మనము చాలాకాలం వాడకపోతే దానిని మాయం చేస్తుంది. మనము వాడుకోకుండా ఉన్నన్యురాన్సు ప్రూనింగ్ లో చంపబడతాయి. దాదాపు 20 ఏళ్ళ వయసు నుండీ రోజుకి షుమారు 25,000 న్యురాన్సు చచ్చిపోతూ ఉంటాయి. పర్మేనెంటు గ దాచిపెట్టాల్సిన విశేషం లేదనుకుంటే వాడుకుని వదిలేస్తుంది.
ఉదా: మనం డ్రైవ్ చేస్తూ ఉంటాము. ట్రాఫ్ఫిక్ లైట్లు దాటుతూ ఉంటాము. ఇంటికొచ్చిన తరువాత మనము వచ్చేటప్పుడు ఎక్కడ ఏ లైటు గ్రీన్, రెడ్, ఎల్లో గ ఉందొ చెప్పమంటే చెప్పలేము. మనసుకు అది గుర్తుంచు కోవటానికి అవసరం లేదని తీసి పారేసింది.
Brain Longevity (1997)
Dharma Singh Khalsa, MD
with Cameron Stauth
Warner Books Inc. 1271 Avenue of the Americas, New York, NY 10020, USA
మనం ఏ విధంగా మర్చెపోతాం: మొదటిది వయస్సు పెరిగిన కొద్దీ మామూలుగా న్యురాన్సు చని పోవటం మూలాన వచ్చేది. ఇది 25 ఏళ్ళ(late 20s) వయసు నుండీ మొదలెడుతుంది. దీని ప్రభావం మొదట ప్రోమినేంట్ గ కనపడదు కానీ 60 ఏళ్ళ తరువాత బాగా కనపడ వచ్చు. మీరు ఏవయినా గట్టిగా గుర్తు పెట్టుకోవాలంటే నాలుగు విధాల గుర్తు పెట్టుకునేట్లు ట్రై చెయ్యండి. ఒక వేపు నుండి మరచిపోయినా ఇంకొక వైపు నుండి ట్రై చెయ్యచ్చు. ఎవరి ఇంటికైనా వెళ్ళటానికి రెండు దోవలుంటే, ఒక దోవ బ్లాక్ అయితే ఇంకొక దోవలో వెళ్ళచ్చు అలాగ అన్నమాట. ఉదా: మీకు బాగా గుర్తున్న బర్త్ డే ల తోటి మీరు గుర్తు పెట్టు కోవాల్సిన బర్త్ డే లను ముడి పెట్టండి.
రెండవది మనస్సుకి సరిఅయిన పోషక పదార్ధాలు అందక పోతేను. ఆహారం సరీగ్గా అందకపోతే అన్ని కణాలు లాగానే న్యురాన్సు చనిపోతాయి. మీరు తినే ఆహారంలో ఇవి ఉండేటట్లు చూసుకోండి: Anti oxidant battery of Vitamins A, C, E, Co Q 10; B-Complex vitamins; Choline rich lecithin; and a trace mineral combination that includes magnesium. Herbs Ginkgo biloba, ginseng also help. There is a saying "What is good for the heart is good for the brain too".
మూడవది Stressful జీవితం అయితేను. మీరు చాలా కోపంగా ఉన్నారనుకోండి ఏమి మాట్లాడాలో మర్చి పోతారు. అంతా బాగా చదువుకుని ఎల్లా అవుతుందిరా భగవంతుడా అనుకుంటూ పరీక్ష వ్రాయటానికి వెళ్తారు, అక్కడకి వెళ్లేసరికి చదివినదంతా ఒక్కటీ గుర్తుండదు. ఇటువంటివి అన్నీ మనం రోజూ చూస్తూనే ఉంటాము. వీటికి కారణం Stress.
Cortisol అనే హార్మోను మన శరీరంలో adrenal glands లో తయారు అవుతుంది. Stress ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తయారవుతుంది. ఎక్కువైతే ఇది చేసే చెడ్డపని ఏమిటంటే glucose ని న్యురాన్సికి అందకుండా చేస్తుంది. అంటే వాటికి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వక అవి చావటానికి కారణం అవుతుంది. ఈ Cortisol న్యురాన్సు మాట్లాడుకోవటానికి ఉపయోగపడే neurotransmitters పని చేసే విధానాన్ని కూడా మారుస్తుంది. అంటే న్యురానుల గొంతు పిసికినట్లే. అవి త్వరగా చనిపోతాయి. చివరికి ఇది Alzheimer's disease కి దారి తీస్తుంది.
అమెరికాలో ప్రతీ 70 సెకండులకు కొత్తగా ఒకళ్ళకి Alzheimer's ఉందని కనుక్కుంటున్నారు. దీనికి మందు లేదు కానీ ముందరగా గుర్తిస్తే త్వరగా రాకుండా చూడవచ్చు. Alzheimer's is a mental condition characterized by extensive death of brain cells. ఇదంతా ఒక్క రోజులో జరగదు కాకపోతే అయిదు ఆరు ఏళ్ళు పట్టచ్చు. కానీ లక్షణాలు ముందర తెలుస్తూ ఉంటాయి. చాలా నైపుణ్యమున్న డాక్టర్లు కానీ చెప్పలేరు. మీరు చెయ్యాల్సింది జీవితం లో Stress తగ్గించు కోవటం. Yoga, Meditation చేసి కూడా stress తగ్గించు కోవచ్చు.
Brain friendly diet --- what to eat:
Fresh fruits, Fresh Vegetables and spices. Berries, spinach and dark green leafy vegetables, coffee, avocados, eggs, nuts, seeds and red wine.
Spices: turmeric, cinnamon, ginger.
Herbs: sage and rosemary.
Nuts and seeds: Flax seeds, sunflower seeds, sesame seeds, pumpkin seeds.
Brain-Friendly Diet: What not to eat:
Trans-fats, Concentrated sweets: large quantities of sugar, corn syrup and high-fructose corn syrup. Flavour enhancers and artificial sweeteners. Pesticides, Hormones and antibiotics.
మంచి మనస్సుకు కావలసినవి ముఖ్యంగా మంచి ఆహారం, Stress తక్కువ జీవితం. ఈ క్రింద ఇంకో పుస్తకమునుండి గ్రహించినవి ఇస్తున్నాను. ఇంకో పోస్ట్ వచ్చేలోపల ఇవి పనికొస్తాయని అనుకుంటాను:
Brain friendly diet --- what to eat:
Fresh fruits, Fresh Vegetables and spices. Berries, spinach and dark green leafy vegetables, coffee, avocados, eggs, nuts, seeds and red wine.
Spices: turmeric, cinnamon, ginger.
Herbs: sage and rosemary.
Nuts and seeds: Flax seeds, sunflower seeds, sesame seeds, pumpkin seeds.
Brain-Friendly Diet: What not to eat:
Trans-fats, Concentrated sweets: large quantities of sugar, corn syrup and high-fructose corn syrup. Flavour enhancers and artificial sweeteners. Pesticides, Hormones and antibiotics.
మీకు న్యురాన్సు గురుంచి ఇంకా తెలుసు కోవాలంటే గూగులమ్మని అడగండి లేక పోతే నేను కొన్ని మంచి పుస్తకాలు చదివి సమ్మరీ వ్రాసాను చూడండి.
Brain బుక్స్
ఈ క్రింద పుస్తకం వ్రాసిన డాక్టర్ గారు మెంటల్ ప్రొబ్లెంస్ రాకుండా ఉండటానికి ఒక థీరపీ డేవలప్ చేశారు. దానిలో భాగాలుగా Meditation, Yoga కూడా ఉన్నాయి.
Brain Longevity (1997)
with Cameron Stauth
Warner Books Inc. 1271 Avenue of the Americas, New York, NY 10020, USA
చాలా బాగా చెప్పారండీ. వయసయ్యాక మతిమరుపు ఎందుకు వస్తుందో నాకు ఇపుడు స్పష్టంగా అర్ధమయింది.
ReplyDeleteమీ మిగతా కబుర్లు కూడా చదవాలని ఆసక్తి కలిగింది.
$Rao S Lakkaraju గారు
ReplyDeleteఅమ్మో.. బుర్ర అనబడే మెదడు దాని మతిమరుపు గురించి ఎంత చక్కగా శోధించారు..అద్బుతం!
నావరకు ఈ మ.మ మూడేళ్ళ నుంచి మొదలైంది అనుకుంటా!ముఖ్యంగా పాస్వర్డ్స్ మరిచిపోవటం.. అంటే కొద్దిగా కష్టమైనవే పెడతా అనుకోండి!. మొదట్లో ఒక్కోసారి అసలేం పెట్టానో గుర్తుకేరాదు..అదేదో గుర్తుతెచ్చుకుందామని తీవ్రంగా ఆలోచిస్తే మెదడులోంచి అదిక పూర్తిగా చెరిగిపోయినట్లే..తిప్పలు పడాల్సిందే కొత్త దానికోసం.ఆహ్.! అందుకని తెలివిగా తీవ్రంగా ఆలోచించటం మాని అదే గుర్తోస్తున్దిలే వచ్చేప్పుడు అని వదిలేయడం మొదలెట్టా..ఈ కిటుకు అప్పుడప్పుడూ ఫలిస్తుంది.
మీరు చెప్పినట్లు మంచి ఆహరం, మనసుని వత్తిడికి దూరంగా ఆహ్లాదంగా ఉంచడం మతిమరుపుని త్వరగా రాకుండా చేయడమో లేక వస్తే తగ్గించడమో
చేయగలదని నా నమ్మకం.
ఈ బుర్రని ఫై(మెమరీ ఇంప్రూవర్)చేసే సాధనాలు వాణిజ్యరంగంలో చాలా వచ్చాయి. వాటిలో విష్యం ఉందంటారా? :)
లేక జ్ఞాపకశక్తిని పెంచుకునే సహజపద్దతులు ఏవైనా ఉన్నాయంటారా?
మంచి సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
@శ్రీ గారూ
ReplyDeleteచాలా క్లిష్ట మైన సబ్జక్ట్ ని అందరికీ పనికోచ్చేటట్లు, అర్ధమయ్యేటట్లు చెప్పాలని ఒక చిన్న ప్రయత్నం. మీకు నచ్చినందుకు ధన్యవాదములు.
మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు.
ReplyDeleteశంకరయ్య గారూ మీ వ్యాఖ్య ఎడిట్ చేశాను.
కంది శంకరయ్య
క్లిష్టమయిన విషయాన్ని సులువుగా అర్ధమయేటట్లు చెప్పారండి. బాగా గుర్తుండాలి అనుకుని స్ట్రెస్ కు లోనయ్యి చదివిన విషయం కన్నా మామూలుగా చదివిన విషయమే బాగా గుర్తుంటుంది. మీరన్నట్లు స్ట్రెస్ ఉండకూడదు. కానీ ఈ రోజుల్లో పిల్లలను చదువు విషయంలో విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు పెద్దలు.. ..
ReplyDelete@రాజేష్:
ReplyDeleteఇంకొక పోస్ట్ వేద్దామనుకున్న కానీ కుదరలేదు. ఇంకో రెండునెలలు పట్టేటట్లు ఉంది. వాణిజ్య పరంగా అమ్మే మెమరీ ఇమ్ప్రోవేమేంట్ వి ఎంత వరకూ పనికోస్తాయో చెప్పటం కష్టం.మంచి ఆహారం, స్త్రెస్స్ తక్కువ జీవితం. అవి కావాల్సినవి.ఈ క్రింద ఇంకో పుస్తకమునుండి గ్రహించినవి ఇస్తున్నాను. ఇంకో పోస్ట్ వచ్చేలోపల ఇవి పనికొస్తాయని అనుకుంటాను:
Brain friendly diet --- what to eat:
Fresh fruits, Fresh Vegetables and spices. Berries, spinach and dark green leafy vegetables, coffee, avocados, eggs, nuts, seeds and red wine.
Spices: turmeric, cinnamon, ginger.
Herbs: sage and rosemary.
Nuts and seeds: Flax seeds, sunflower seeds, sesame seeds, pumpkin seeds.
Brain-Friendly Diet: What not to eat:
Trans-fats, Concentrated sweets: large quantities of sugar, corn syrup and high-fructose corn syrup. Flavour enhancers and artificial sweeteners. Pesticides, Hormones and antibiotics.
చాల చక్కగా క్లిష్టమైన విషయాన్ని తేలికైన మాటల్లో చెప్పారు .
ReplyDeleteవిపరీతమైన స్త్రెస్స్ కూడదేమో కాని , కొన్ని సార్లు స్త్రెస్స్ తో పాటు పని వేగం పెరుగుతుంది అనిపిస్తుంది నాకు :)
మరీ ముఖ్యం గా బ్రెయిన్ డైట్ వివరాలతో సహా ఇచ్చినందుకు Thank you !
@anrd గారూ
ReplyDeleteపిల్లల గురించి మీరన్నది కరెక్టే. ఇంకా నయం అమెరికాలో తల్లి గర్భంలో ఉండగానే చదువు చెప్పటం ప్రారంభిస్తారు. తల్లి తన పొట్టకి రోజూ కధలు సంగీతము వినిపిస్తుంది. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
@కంది శంకరయ్య గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
ReplyDeleteకొన్ని సార్లు స్త్రెస్స్ తో పాటు పని వేగం పెరుగుతుంది అనిపిస్తుంది నాకు
ReplyDelete--------
@శ్రావ్య గారూ మీరన్నది నా ఉద్దేశంలో కరెక్టే. మనస్సు అనుకుంటుంది "ఈ పీడా త్వరగా వదిలితే ప్రశాంతంగా ఉండచ్చు" అని త్వర త్వరగా ఆ stress తో కూడిన పనిని వదుల్చు కోవాలని చూస్తుంది. నేనెక్కడా పరిశోధన పత్రాలు దీనిమీద చూడలేదు కానీ మీ రన్నది నిజం అవ్వచ్చు. ఉదా: జ్వరం వచ్చేది అందుకే కదా శరీరం లోకి చేరిన చెడ్డ పదార్ధాన్ని తెల్ల కణాలతో చుట్టుముట్టి బయటికి పంపించటానికి. అల్లాగే మనస్సుకి కూడా మీరు చెప్పింది ఒక సెల్ఫ్ డిఫెన్స్ అవ్వచ్చు.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
Excellent!!You have a lot to learn from!
ReplyDeleteరావు గారు ! నమస్కారములు. మీరందించే సైన్స్ అద్భుతం.. ఇక ఏ పుస్తకాలు చదవఖర్లేదు. .ఎందుకు మర్చి పోతామో ,ఎలా గుర్తు ఉంటాయో ,ఏ కణాలు ఎలా పనిచేస్తాయో చక్క గా విశదీక రించారు . నిజమే చిన్న నాటి జ్ఞాపకాలు కొన్ని ఎప్పడికీ గుర్తు ఉంటాయి.ఒకోసారి పరీక్ష హాల్లో అన్ని మర్చి పోతాం. ఇక తీసుకోవలసిన ఆహారం గురించి మరింత వివరం గా తెలియ జెప్పారు. తమరు " అటు కంప్యూటరు రిపేర్లు దగ్గర్నుంచి , ఇటు వైద్యం , మరింకా సైన్సు ఇవేవీ గాకుండా కధలూ ,మధురమైన కవితలు, ఇలా ఎన్ని ? ఎన్నని ? అన్నిటిలోనూ డాక్టరేట్ ఉందన్న మాట . మాకేది కావాలన్న ఏ ఫీజు అవుసరం లేకుండా మీ నుంచి సలహాలు పొంద వచ్చు నన్నమాట ? చాలా చాలా ధన్య వాదములు.. మాకు చక్కని గురువు దొరికి నందుకు.
ReplyDelete$Rao S Lakkaraju గారు
ReplyDeleteజ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండటానికి అవసరమైన పధ్యం గురించి మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు. మరింత వివరమైన టపాకోసం ఎదురుచూస్తూ ఉంటా.
#" అటు కంప్యూటరు రిపేర్లు దగ్గర్నుంచి , ఇటు వైద్యం , మరింకా సైన్సు ఇవేవీ గాకుండా కధలూ ,మధురమైన కవితలు, ఇలా ఎన్ని ? ఎన్నని ?
నిజమే రాజేశ్వరిగారు. గురువుగారు నిరంతరమూ తెలుసుకుంటూ ఉండటమే కాక మనకి అర్థమయ్యే రీతిలో సులువుగా అందించేందుకు చేస్తున్న కృషి శ్లాఘనీయం.
మీ వ్యాసం చాలా బావుందండీ... అయితే నాకు ఒక సందేహం.
ReplyDeleteఈ అల్జీమర్స్ వ్యాది ఎక్కువ అమెరికా లొనే ఉంటుంది కదా.. స్త్రెస్ లెవెల్ మాత్రమే కాకుండా జన్యుపరమయిన కారణాలు కూడా ఎమయినా ఉంటాయంటారా?
@మంచు గారూ
ReplyDeleteఅల్జీమర్స్ వ్యాది అమెరికా లోనే ఎక్కువ అని ఏమీ లేదండి. Low and middle income countries లో చాలా ఎక్కువ ఉన్నది. రిపోర్ట్ చూడండి.
http://www.alz.co.uk/research/files/WorldAlzheimerReport2010.pdf
జీన్స్ మూలాన వ్యాధి రావచ్చు అని అనుకున్నారు కానీ నిర్ధారించలేదు. ఇంకా పరిశోధనలు చెయ్యాలి. Mayo clinic వాళ్ళ రిపోర్ట్ నుండి కోట్ చేస్తున్నాను.
But not everyone who has an APOE e4 gene — or even two APOE e4 genes — develops Alzheimer's. And the disease occurs in many people who have no APOE e4 gene. This indicates that the APOE e4 gene affects risk, but it is not a causative gene. Other genetic and environmental factors are likely involved in the development of Alzheimer's.
http://www.mayoclinic.com/health/alzheimers-genes/AZ00047
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
@KumarN, రాజేష్, రాజేశ్వరి గార్లకు
ReplyDeleteతిన్న ప్రాణం కూర్చోలేక ఏవేవో పుస్తకాలు చదువుతూ ఉంటాను. బుర్రలో ఎక్కువ అయ్యేసరికి పోస్ట్ లో వ్రాసి వదిలించుకుని మళ్ళా ఇంకో నాలుగు పుస్తకాలు చదువుతాను. అంతేకానీ గొప్పతనం అంటూ ఏమీ లేదు. మా ఆవిడ లైబ్రరీ లో పనిచేస్తుంది కాబట్టి పుస్తకాలు తెచ్చుకునే పని తేలిక.
నేను వ్రాసేవి మీకు నచ్చినందుకు థాంక్స్. ఊరు వెళ్తున్నాను మళ్ళా ఒక నెల తరువాత కనపడుతా.
Wow.. A Full Month!!Not Acceptable Sir!. Who gave you such a long vacation, can I work for them please ? :-) Just Kidding. Have good time.
ReplyDeletePretty soon, I am go too.
$Rao S Lakkaraju గారు
ReplyDelete#పోస్ట్ లో వ్రాసి వదిలించుకుని మళ్ళా ఇంకో నాలుగు పుస్తకాలు
నిజంగా ఎంత ఓపికండి. కుదోస్!
#అంతేకానీ గొప్పతనం అంటూ ఏమీ లేదు
ఉహు..నేనొప్పనంటే ఒప్ప :)
అయితే కాసేపు విశ్రాంతి కోసం అలా విహారానికి వెళుతున్నారన్నమాట. మంచిది ..జాగర్తగా వెళ్ళిరండి. వెళ్ళేలోపల ఏదో ఒక టపా వేసివెళ్ళండి.. మేం వ్యాఖ్యానించుకుంటూ ఉంటాం :)
రావు గారూ ఇది మీకు న్యాయం కాదు. నెలరోజులు ,అంటే ఒకటి కాదు రెండు కాదు నె....ల,,,,,రోజులు . మేమందరం ఏమై పోవాలి ? మీ బుల్లి కధలూ, పెద్ద వ్యాసాలూ, అలరించే కవితలూ ,,! అఘ్రాణించే ఘుమ ఘుమలు, కలతలు మరచి కిల కిల మనిపించే వ్యాసాలూ ఇంకా వైద్యాలు విజ్ఞానాలు ఇవన్నీ మాకెవరు కురిపిస్తారు ? త్వరగా వచ్చేయండి. సరేనా ? happy jurney
ReplyDeleteవెళ్ళేలోపల ఏదో ఒక టపా వేసివెళ్ళండి..
ReplyDelete-----------------
వెల్ రాజేష్ యు ట్యూబ్ అంతా చిలికించి ఒక పోస్ట్ చేశా. దానిలో పాదాల వందనాలు కూడా కలిపా.
http://mytelugurachana.blogspot.com/
$Rao S Lakkaraju గారు
ReplyDeleteనా కోరికను మన్నించినందులకు బహుధా ధన్యవాదాలు.
@రాజేష్
ReplyDeleteYou welcome.
శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.
ReplyDeleteచక్కటి వ్యాసం. ఆలస్యంగా చదువుతున్నాను. `తన కోపమే తన శత్రువు' అని నానుడి. కోపం పెరిగినప్పుడు మనలో ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి కి మూల కారణం ఏమిటో మనం తెలుసుకుంటే, సమస్య తగ్గుతుంది. మనం చేయాల్సిన పనిని మనం చేయలేకపోయినప్పుడు; ఇతరులు ఆ పనిని చేయగలిగినప్పుడు మనమీద మనకు కోపం వస్తుంది. అప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఆ పనిని చేయలేకపోవటానికి లేదా చేయగలగటానికి కారణాలు/మార్గాలు తెలుసుకుంటే, కోపాన్ని జయించగలమ్. ఈ కోపం/ఒత్తిడే దీర్ఘకాలంలో మన మతిమరుపుకు కారణమవుతాయి.
మీ స్నేహశీలి,
మాధవరావు.
@మాధవరావు గారూ పోస్టు ని క్లుప్తంగా చెప్పేశారు. మనకొచ్చే కోపం మనమీదే కాకుండా ఇంకొకళ్ళ మీద కూడా వస్తుంది. కారణాలు అనేకం కావచ్చు. మనం సన్యాసులము కాదు కాబట్టి అది తప్పదనుకుంటాను. దాన్ని కంట్రోల్ చెయ్యగలిగితే జీవితం సుఖంగా ఉంటుంది లేకపోతే ఇబ్బంది కరమౌతుంది (మనకీ ఇతరులకీ) అనుకుంటాను.
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదములు.