ముందుమాట: మన ఊళ్ళల్లో చూడండి పొలాల్లో పనిచేసేవారు, ఎండలో పనిచేసేవారూ ఎంత ఆరోగ్యంగా ఉంటారో. దీనికి కారణము గ్రహించారా, అది సూర్యరశ్మి.
అందరికీ సులువుగా దొరికే సూర్యరశ్మి నుంచి మాత్రమే వచ్చే Vitamin D మీద వందలకొలది పరిశోధనలు జరిగాయి. సూర్యరశ్మి తో వచ్చే UV కాంతి మన దేహం లోని కొలెస్టరాల్ తో స్కిన్ దగ్గర కలిసి విటమిన్ D లో ఉండే D3 పార్ట్ తయారవుతుంది. అది మన ఆరోగ్య కారిణి. sunscreen అవ్వీ వేసుకోకుండా చర్మాన్ని బర్న్ చెయ్యకుండా రోజుకి ఎండలో కనీసం 15 నిమిషాలు నుంచుంటే మీకు కావలసిన Vitamin D వస్తుంది. నల్ల స్కిన్ వాళ్ళు అయితే కొంచం ఎక్కువ సేపు ఎండలో ఉండాల్సి ఉంటుంది. గుళికలు మింగినా వస్తుంది కానీ మన శరీరం చేసుకునే దానికి దీటు లేదు. ఎందుకంటే శరీరం తనకి కావలసినంతే చేసుకుని ఎక్కువ మిగిలితే బయటికి పంపించేస్తుంది.
అసలు విటమిన్ డి కి ఎందుకింత ప్రాముఖ్య మొచ్చింది ?. దీనిని "pre-hormone" అంటారు. మన శరీరం దీనిని ఇంకొక హార్మోనుగ మార్చి దానితో దాదాపు ఒక వెయ్యి జీనులను క్రమ బద్ధం చేస్తుంది. ఇది ఎన్ని వ్యాధులు రాకుండా కాపాడుతుందో చూడండి. precancerous cells ని తీసి పారేస్తుంది. stroke and diabetes రాకుండా చేస్తుంది. జలుబులు దగ్గులు ఫ్లూ రాకుండా maintain the immune system . arthritis రాకుండా కీళ్ళను కాపాడుతుంది. ఎముకలు పళ్ళు గట్టిగా ఉండటానికి promotes absorption of calcium and phosphate .
ఈ విటమిన్ శరీరంలో తక్కువయితే జరిగే దుష్ఫలితాలు కొన్ని: కండరముల బలహీనత, నిలబడలేక క్రింద పడటం. low back pain and osteoporosis also can make fibromyalgia worse .
మనకు రోజుకి ఎంత కావాలి? ఇక్కడే చాలామంది అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. Dr. Gaby said that most people would do well to take 800 IU to 1,200 IU of D-3 each day, especially during the winter months and most especially for people who are seldom in midday sun and older adults, whose skin loses some of its ability to manufacture D from sunlight.
చివరిమాట: రోజుకి పది, పదిహేను నిమిషాలు స్కిన్ బర్న్ అవకుండా ఎండలో ఉంటే చాలు మీకు కావలసిన విటమిన్ డి వచ్చేస్తుంది. మన కన్నీ అర్ధమవ వలసిన అవుసరం లేదు. మన ఆచారం అనుకుని ఎండలో కాసేపు ఏదో పనిచెయ్యండి. ఆరోగ్యంగా ఉండండి. అందుకనే చాలా మంది సూర్యుడిని సూర్యభగవానుడిగా ఆరాధిస్తారు.
దీని మాతృకలు :
New Research Warns Against Overzealous Use of Vitamin D
No comments:
Post a Comment