ముందుమాట: 'శ్రీ సూర్య నారాయణా మేలుకో హరి సూర్య నారాయణ' అంటూ నేను పాడుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. మా అమ్మమ్మ సూర్యుని పొడ చూడంది భోజనం చేసేది కాదు. మా అమ్మ రోజూ మధ్యాహ్నం తులసికోట దగ్గర పూజ చేసేది. బొంబాయి లో మా అన్నయ్య ఉదయ సూర్యుని కిరణాలలో సంధ్యావందనం చేసి కానీ ఆఫీసు కి వెళ్ళేవాడు కాదు. పక్కనున్న శాస్త్రిగారు రోజూ భావి దగ్గర స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసేవారు. ఎందుకు వీళ్ళందరూ అలా చేస్తారు?. ఇవన్నీ మన పెద్దవాళ్ళు మనకి ఆచారాలుగ చెప్పారు. మన ఆచారాలు అన్నీ పండితులకీ పామరులకీ అర్ధమయ్యేలా ఉంటాయి.
ఎందుకు వచ్చిందో ఈ ఆచారం తెలుసా? మన శరీరం సరీగ్గా పనిచెయ్యటానికి విటమిన్ డి కావాలి. రోజుకి పది నిమిషాలు చాలు ఎండలో ఉండండి. మీకు కావాల్సిన విటమిన్ డి వస్తుంది. గుళికలు మింగినా వస్తుంది కానీ మన శరీరం చేసుకునే దానికి దీటు లేదు. ఎందుకంటే తనకి కావలసినంతే చేసుకుంటుంది, ఒకవేళ ఎక్కువయితే బయటికి పంపించేస్తుంది.
అసలు విటమిన్ డి కి ఎందుకింత ప్రాముఖ్య మొచ్చింది ?. దీనిని "pre-hormone" అంటారు. మన శరీరం దీనిని ఇంకొక హార్మోనుగ మార్చి దానితో దాదాపు ఒక వెయ్యి జీనులను క్రమ బద్ధం చేస్తుంది. ఇది ఎన్ని వ్యాధులు రాకుండా కాపాడుతుందో చూడండి. precancerous cells ని తీసి పారేస్తుంది. stroke and diabetes రాకుండా చేస్తుంది. జలుబులు దగ్గులు ఫ్లూ రాకుండా maintain the immune system . arthritis రాకుండా కీళ్ళను కాపాడుతుంది. ఎముకలు పళ్ళు గట్టిగా ఉండటానికి promote absorption of calcium and phosphate .
ఈ విటమిన్ శరీరంలో తక్కువయితే జరిగే దుష్ఫలితాలు కొన్ని: కండరముల బలహీనత, నిలబడలేక క్రింద పడటం. low back pain and osteoporosis also can make fibromyalgia worse .
మనకు రోజుకి ఎంత కావాలి? Dr. Gaby said that most people would do well to take 800 IU to 1,200 IU of D-3 each day, especially during the winter months and most especially for people who are seldom in midday sun and older adults, whose skin loses some of its ability to manufacture D from sunlight.
చివరిమాట: రోజుకి పది నిమిషాలు ఎండలో ఉంటె చాలు మీకు కావలసిన విటమిన్ డి వచ్చేస్తుంది. మన కన్నీ అర్ధమవ వలసిన అవుసరం లేదు. మన ఆచారం అనుకుని ఎండలో పది నిమిషాలు ఏదో పనిచెయ్యండి. ఆరోగ్యంగా ఉండండి.
దీని మాతృక:
New Research Warns Against Overzealous Use of Vitamin D
నమస్కారములు. రావు గారూ ! చక్కని విషయాలు చెప్పారు .నిజమే " సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది అంటారు ." సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం కదా ? అందుకే అటు భగవంతుడిని కొలిచి నట్టు ఉంటుంది ఇటు ఆరోగ్య రీత్యా కుడా మంచిది. మన బామ్మలు ,అమ్మమ్మలు ,ఊరికే చెప్పలేదు. ఇటు ఆరోగ్య పరంగా ,అటు కంప్యూటర్ గురించి ,ఇంకా విహార యాత్రలు , మనసుని కదిలించే అంద మైన కవితలు , ఇలా అన్నిటి గురించి ఇంకా ఎన్నెన్నో , మంచి మంచి విషయాలను మాకందిస్తున్నందుకు ధన్య వాదములు " బహుమఖ ప్రాజ్ఞులు మీరు. "
ReplyDeleteశ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.
ReplyDeleteమీ వ్యాసం చాలా ఉపయోగకరంగా వుంది. అయితే, ఒక సందేహం:``For those reasons, it’s good to get vitamin D the old-fashioned way -- spend 10 to 15 minutes in the sun most days during the hours from 10 am to 2 pm. Expose as much skin as possible and, do not wear any sunscreen during this time.
'' అని మాతృక లో వ్రాయబడింది. ఈ సలహా మన దేశస్టులకు పనికివస్తుందా? ఎండ ఎక్కువగా వుండే మన దేశంలో, ఉదయం 10 నుంచి 2 గంటల వరకూ ఎండలో ultraviolet rays వుంటాయని అంటారు. అదీకాకుండా, సూర్యనామస్కారాములు ఎండ ఝాము పొద్దు ఎక్కకుండానే, అంటే 6 am to 8 am లోపలే చేయాలని చెబుతారు. కాబట్టి, దీనిపై, మరికొంత వివరణ ఇవ్వగలరు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
@రాజేశ్వరి గారూ ధన్యవాదములు. రోజుకి 15 నిమిషాలు సూర్యరశ్మిలో తిరగండి చాలు. ఫలితం కనిపిస్తుంది.
ReplyDelete@మాధవరావు గారూ ఈ పోస్ట్ ని త్వరలో ఇంకొంచం వివరంగా వ్రాద్దామని చూస్తున్నాను. సూర్యరశ్మి తో వచ్చే UV కాంతి మన దేహం లోని కొలెస్టరాల్ తో స్కిన్ దగ్గర కలిసి విటమిన్ D లో ఉండే D3 పార్ట్ తయారవుతుంది. అది మన ఆరోగ్య కారిణి. sunscreen అవ్వీ వేసుకుంటే UV కాంతిని అడ్డు కోవటం జరుగుతుంది. ఒకటే కొండ గుర్తు చర్మాన్ని బుర్న్ చెయ్య కూడదు.అమెరికా లో మేముండే చోట వేసవి లో ఉష్ణోగ్రత 90F కన్నా ఎక్కువొచ్చే రోజులు వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు.
అమెరికా లో చాలాచోట్ల పది గంటలయితే కానీ ఎండలో వెచ్చదనం రాదు.
సూటిగా ఎండలో రోజూ మీరు ఎంతసేపు ఉంటారో మీంతట మీరే లేక్కవేసుకుని చూడండి.
మీకింకా వివరాలు కావాలంటే వ్రాయండి. తప్పకుండా వివరంగా వ్రాస్తాను. వ్యాఖ్యకు ధన్యవాదాలు.